20-10-2008 అవ్యక్త మురళి

 * 20-10-2008         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

   “సంతుష్టమణులుగా అయి విశ్వంలో సంతుష్టతా ప్రకాశాన్ని వ్యాపింపజేయండి, సంతుష్టంగా  ఉండండి మరియు అందరినీ సంతుష్టపరచండి.”

           ఈ రోజు బాప్ దాదా సదా సంతుష్టంగా ఉండే తమ సంతుష్టమణులను చూస్తున్నారు. ఒక్కొక్క సంతుష్ట మణి యొక్క ప్రకాశముతో నలు వైపుల ఎంతటి సుందరమైన ప్రకాశము ప్రకాశిస్తోంది! ప్రతి ఒక్క సంతుష్టమణి ఎంతగా తండ్రికి ప్రియంగా, ప్రతి ఒక్కరికీ ప్రియంగా మరియు స్వయానికి కూడా ప్రియంగా ఉంది! సంతుష్టత సర్వులకు ప్రియమైనది. సంతుష్టత సదా సర్వ ప్రాప్తి సంపన్నమైనది! ఎందుకంటే ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ అప్రాప్తి అనేదే ఉండదు. సంతుష్ట ఆత్మలో సంతుష్టత సహజ స్వభావముగా ఉంటుంది. సంతుష్టతా శక్తి స్వతహాగా మరియు సహజంగా నలువైపుల వాతావరణాన్ని వ్యాపింపజేస్తుంది. వారి ముఖము, వారి నయనాలు వాతావరణంలో కూడా సంతుష్టత యొక్క అలను వ్యాపింపజేస్తాయి. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ ఇతర విశేషతలన్నీ స్వతహాగానే వచ్చేస్తాయి. సంతుష్టత సంగమయుగంలో బాబా ఇచ్చిన విశేషమైన బహుమతి, సంతుష్టతా స్థితి పరిస్థితిపై సదా విజయిగా ఉంటుంది. పరిస్థితి మారుతూ ఉంటుంది కానీ సంతుష్టతా శక్తి సదా ప్రగతిని పొందుతూ ఉంటుంది. ఎంతటి పరిస్థితి ఎదురైనా కానీ సంతుష్టమణుల ముందు అన్ని వేళలా ప్రకృతి ఒక తోలుబొమ్మలాటలా కనిపిస్తూ ఉంటుంది, మాయ మరియు ప్రకృతుల తోలుబొమ్మలాట. కావున సంతుష్ట ఆత్మ ఎప్పుడూ కలవరపడరు. పరిస్థితి యొక్క షో ఒక మనోరంజనలా అనుభవమవుతుంది. తమ స్థితి రూపీ సీటును సదా సాక్షీద్రష్ట స్థితిలో స్థిరము చేసుకునే వారు ఈ మనోరంజనను అనుభవం చేసుకుంటారు. దృశ్యము ఎంతగా మారినా కానీ సాక్షీద్రష్ట సీట్ పై స్థితి అయి ఉన్న సంతుష్ట ఆత్మ సాక్షిగా అయి ప్రతి పరిస్థితిని స్వ స్థితితో మార్చివేస్తుంది. మరి నేను సదా సంతుష్టంగా ఉన్నానా అని ప్రతి ఒక్కరూ తమనుతాము ప్రశ్నించుకోండి. సదా ఉన్నారా లేక అప్పుడప్పుడూ ఉన్నారా?

           బాప్ దాదా ఎల్లప్పుడూ ప్రతి శక్తి కోసం, సంతోషం కోసం, డబుల్ లైట్ గా అయి ఎగరడం కోసం పిల్లలకు 'సదా' అన్న పదమును సదా గుర్తుంచుకోమని చెబుతూ ఉంటారు. అప్పుడప్పుడూ అన్న పదము బ్రాహ్మణుల డిక్షనరీలో లేనే లేదు ఎందుకంటే సంతుష్టత అనగా సర్వ ప్రాప్తులు అని అర్ధము. ఎక్కడ సర్వ ప్రాప్తులు ఉంటాయో అక్కడ అప్పుడప్పుడూ అన్న మాటయే ఉండదు. మరి సదా అనుభూతి చేసేవారా  లేక పురుషార్థం చేస్తున్నారా? ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకున్నారా, పరిశీలించుకున్నారా? ఎందుకంటే మీరందరూ విశేషంగా బాబాకు స్నేహీ, సహయోగి, ప్రియమైన, మధురాతి మధురమైన స్వ పరివర్తక పిల్లలు. అవును కదా? అంతేనా? బాబా ఎలా అయితే మిమ్మల్ని చూస్తున్నారో అలాగే మీరు స్వయాన్ని అనుభవం చేసుకుంటున్నారా? ఎవరైతే సదా, అప్పుడప్పుడూ కాదు, సదా సంతుష్టంగా ఉంటున్నారో వారు చేతులెత్తండి. సదా అన్న మాట గుర్తుంది కదా, నెమ్మది నెమ్మదిగా చేతులెత్తుతున్నారు. అచ్ఛా! చాలా మంచిది. కొద్ది మంది మాత్రమే చేతులెత్తున్నారు, ఆలోచించి ఎత్తుతున్నారు. కానీ ఇప్పుడు సమయాన్ని మరియు స్వయాన్ని రెండింటినీ చూసుకోండి అని బాప్ దాదా పదే పదే అటెన్షన్ ఇప్పిస్తూనే ఉన్నారు. సమయపు వేగాన్ని మరియు స్వ వేగాన్ని రెండింటినీ పరిశీలించుకోండి. పాస్ విత్ ఆనరగా అయితే కావలసిందే. నేను బాబాకు రాజ దులారీ మరియు రాజ్ దులారా(ముద్దుబిడ్డలు)గా అయి ఉన్నానా అని పరిశీలించుకోండి. స్వయాన్ని రాజ్ దులారాగా భావిస్తున్నారా? ప్రతి రోజూ బాప్ దాదా మీకు ఏమని ప్రియస్మృతులు తెలుపుతారు? గారాల పిల్లలు! అని అంటారు. ఎవరు ముద్దు బిడ్డలుగా అవుతారు? ఎవరైతే ఫాలో ఫాదర్ చేస్తారో వారే ముద్దు బిడ్డలుగా అవుతారు. ఫాలో చెయ్యడమైతే చాలా, చాలా, చాలా సహజము, ఎటువంటి కష్టము ఉండదు. ఒక్క విషయాన్ని ఫాలో చేస్తే సహజంగా సర్వ విషయాలలో ఫాలో చేసినట్లే అవుతుంది. ఒకే వాక్యాన్ని బాబా ప్రతి రోజూ గుర్తు తెప్పిస్తూ ఉంటారు. అది గుర్తుంది కదా- “స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి". ఒకటే వాక్యము కదా! స్మృతి చేసే ఆత్మకెవరికైతే తండ్రి ఖజానా లభించిందో, వారు సేవ లేనిదే ఉండలేరు! ఎందుకంటే అందులో అపారమైన ప్రాప్తి ఉంది, తరగని ఖజానాలు ఉన్నాయి. దాత పిల్లలు ఇవ్వకుండా ఉండలేరు. మెజారిటీ పిల్లలకు ఏమని టైటిల్ లభించింది? డబుల్ విదేశీయులు. మరి టైటిల్ లోనే డబుల్ అని ఉంది. బాప్ దాదాకు కూడా మీ అందరినీ చూసి సంతోషంగా ఉంటుంది. వాహ్ నా పిల్లలు వాహ్ అన్న పాటను సదా పాడుతూ ఉంటారు. బాగుంది, భిన్న భిన్న దేశాల నుండి ఏ విమానంలో వచ్చారు? స్థూలంగా ఏ విమానంలో వచ్చినా కానీ, బాప్ దాదా ఏ విమానాన్ని చూస్తున్నారు? అతి స్నేహము అనే విమానములో తమ అతి ప్రియమైన ఇంటికి చేరుకున్నారు. బాప్ దాదా తమ పిల్లలైన ప్రతి ఒక్కరికీ ఈ రోజు విశేషంగా - ఓ నా ప్రియమైన, గారాల పిల్లలూ! సదా సంతుష్టమణులుగా అయి విశ్వంలో సంతుష్టతా ప్రకాశాన్ని వ్యాపింపజేయండి, సంతుష్టంగా ఉండండి మరియు సంతుష్టపరచండి. అన్న వరదానాన్ని ఇస్తున్నారు. కొంత మంది పిల్లలు - సంతుష్టంగా ఉండటం సహజమే కానీ సంతుష్టపరచడం కొంచెము కష్టము అని అంటారు. ప్రతి ఒక్క ఆత్మను సంతుష్టపరచాలంటే అందకు చాలా సహజమైన సాధనము ఒకటి ఉంది. ఒకవేళ ఎవరైనా మీతో అసంతుష్టంగా ఉన్నట్లయితే, వారు అసంతుష్టంగా ఉండడమే కాదు వారి అసంతుష్టతా ప్రభావము కొంతైనా మీపై పడుతుంది కదా. వ్యర్థ సంకల్పాలైతే కలుగుతాయి కదా. బాప్ దాదా ఇచ్చిన శుభ భావన, శుభ కామనల మంత్రములో ఒకవేళ మీరు స్వయాన్ని ఈ మంత్రములో స్మృతి స్వరూపులుగా ఉంచుకున్నట్లయితే మీకు వ్యర్థ సంకల్పాలు రావు. వీరు ఇలాంటివారు, వారు అలాంటివారు అని తెలిసి కూడా స్వయాన్ని సదా అతీతంగా, వారి వైబ్రేషన్ల నుండి అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా అనుభవం చేసుకోండి. మీ అతీతమైన మరియు తండ్రికి ప్రియమైన శ్రేష్ఠ స్థితి యొక్క వైబ్రేషన్లు ఒకవేళ ఆ ఆత్మకు చేరుకోకపోయినా కానీ వాతావరణంలో అయితే తప్పకుండా వ్యాపిస్తాయి. ఒకవేళ ఎవరైనా పరివర్తన చెందక పోయినా, మీ పై కూడా ఆ ఆత్మ ప్రభావము పడుతూ ఉన్నట్లయితే, వ్యర్థ సంకల్పాల రూపంలో వాతావరణంలో అందరి సంకల్పాలు వ్యాపిస్తూ ఉంటాయి. కావున మీరు అతీతంగా అయి, తండ్రికి ప్రియంగా అయి, ఆ ఆత్మ కళ్యాణం కోసం శుభ భావన, శుభ కామనలను ఉంచండి. వారు తప్పు చేసారు కాబట్టి మేము కూడా గట్టిగా చెప్పవలసి వస్తుంది అని కొంతమంది పిల్లలు అంటారు. అప్పుడు పిల్లల ముఖము, స్వభావము కొంచెం ఫోర్సుగా ఉంటాయి. వారు తప్పు చేసారు, కానీ మీరు చూపించిన ఫోర్సు తప్పు కాదా? ఎదుటివారు తప్పు చేసారు, మీరు మీ నోటితో ఫోర్సుగా మాట్లాడారు, దీనినే క్రోధపు అంశము అని అంటారు, మరి ఇది సరైనదేనా? ఒక తప్పు మరో తప్పును సరి చేయగలదా? ఈనాటి సమయానుసారంగా మీ మాటలను ఫోర్సుగా మాట్లాడడం అనే విషయంపై విశేష అటెన్షన్ ను ఉంచండి. ఎందుకంటే గట్టిగా మాట్లాడటము, లేక విసుగుతో మాట్లాడటము, దీని ద్వారా ఎదుటివారైతే మారరు, కానీ ఇది కూడా రెండవ వికారానికి అంశ రూపము. నోటి నుండి వచ్చే మాటలు పూల జల్లులా అనిపించాలి అని అంటారు. మధురమైన మాటలు, చిరు మందహాసముతో ఉన్న ముఖము, మధురమైన వృత్తి, మధురమైన దృష్టి, మధురమైన సంబంధ-సంపర్కాలు - ఇవి కూడా సేవా సాధనాలే. కాబట్టి రిజల్టును చూడండి. ఒకవేళ ఎవరైనా తప్పు చేసారే అనుకోండి, అది తప్పు, మీరు వారికి అర్థం చేయించే లక్ష్యంతో, మరే లక్ష్యము లేదు, కేవలం వారికి అర్థం చేయించాలి, శిక్షణ ఇవ్వాలి అన్న మీ లక్ష్యము చాలా మంచిదే కానీ, రిజల్టులో ఏమి కనిపిస్తుంది? వారు మారుతున్నారా? ఇంకా మీ ముందుకు రావడానికి భయపడతారు. మీ లక్ష్యం పూర్తి కావడం లేదు, కావున మీ మనసా సంకల్పాలను, వాణి అనగా మాటలను మరియు సంబంధ- సంపర్కాలను సదా మధురంగా అనగా ఉన్నతోన్నతముగా ఉంచుకోండి. ఎందుకంటే వర్తమాన సమయంలో జనులు ప్రాక్టికల్ జీవితాన్ని చూడాలని ఆశిస్తున్నారు. వాణి ద్వారా సేవ చేసినట్లయితే వాచా సేవతో ప్రభావితమై సమీపంగా అయితే వస్తున్నారు, ఈ లాభమైతే కలుగుతుంది. కానీ.. ప్రాక్టికల్ గా మధురత, మహానత, శ్రేష్ఠ భావన, నడవడిక మరియు ముఖమును చూసి స్వయమూ పరివర్తన కోసం ప్రేరణను పొందుతారు. ఎలా ఎలా అయితే ముందు ముందు సమయపు పరిస్థితులు పరివర్తన చెందనున్నాయో ఆయా సమయాలలో మీరందరూ మీ ముఖము మరియు నడవడికతో చాలా సేవ చేయాల్సి ఉంటుంది. కావున - ఆత్మలపట్ల శుభ భావన, శుభ కామనల వృత్తి మరియు దృష్టి యొక్క సంస్కారము స్వభావముగా, సహజముగా ఉందా? అని స్వయాన్ని పరిశీలించుకోండి.

           బాప్ దాదా పిల్లలందరినీ మాలలోని పూసగా, విజయమాలలోని పూసగా చూడాలని ఆశిస్తున్నారు. మేము మాలలోని పూసగా అయ్యే తీరుతాము అని ప్రతి ఒక్కరూ స్వయం గురించి భావిస్తున్నారా? 108 మాలలో అయితే నిమిత్తంగా అయిన పిల్లలే వస్తారు అని కొంతమంది పిల్లలు భావిస్తారు. కానీ, ఈ 108 మాల గాయనము భక్తి మాలకు సంబంధించినది, ఒకవేళ మీరందరూ విజయమణిగా తయారైనట్లయితే బాప్ దాదా మీ కోసం మాలలో చాలా వరుసలను ఏర్పాటు చేస్తారు. బాబా హృదయ మాలలో విజయీ పిల్లలైన మీ అందరికీ స్థానము ఉంది, ఇది బాబా ఇస్తున్న గ్యారంటీ. కేవలం స్వయాన్ని మనసా-వాచ-కర్మణ మరియు నడవడిక, ముఖములో విజయులుగా తయారు చేసుకోండి. నచ్చిందా, తయారువుతారా? విజయమాలలోని పూసగా తయారు చేస్తాను అని బాప్ దాదా గ్యారంటీ ఇస్తున్నారు. ఎవరు తయారవుతారు? అచ్ఛా, మరైతే బాప్ దాదా మాలలో మరో మాలను తయారు చెయ్యడం ప్రారంభిస్తారు. డబుల్ విదేశీయులకు నచ్చింది కదా! విజయి మాలలోకి తీసుకురావడం బాబా పని, కానీ మీ పని విజయులుగా కావడము. సహజమే కదా! లేక కష్టమా? కష్టంగా అనిపిస్తుందా? ఎవరికైతే కష్టంగా అనిపిస్తుందో వారు చేతులెత్తండి. కష్టంగా అనిపిస్తోందా? కొద్ది మంది ఉన్నారు! బాప్ దాదా అని అన్నప్పుడు మరి తండ్రి వారసత్వము లభించదా!

           అందరూ వారసత్వానికి అధికారులయ్యారు, ఎంతో సహజంగా బాబా వారసత్వాన్ని ఇచ్చారు, ఇది ఒక్క క్షణపు విషయము. నా బాబా అని మీరు తెలుసుకున్నారు, ఒప్పుకున్నారు, అప్పుడు బాబా ఏమన్నారు? నా పిల్లలు. మరి పిల్లలైతే స్వతహాగానే వారసత్వానికి అధికారులు. బాబా అని అంటారు కదా, అందరూ ఒకే మాట అంటారు- నా బాబా. అంతే కదా? నా బాబా అని అంటారు కదా? ఇందులో చేతులెత్తండి. నా బాబా అయినప్పుడు, మరి నా వారసత్వము కాదా? నా బాబా అనీ అన్నప్పుడు నా వారసత్వము కూడా బంధింపబడి ఉంది. వారసత్వము ఏమిటి? తండ్రి సమానంగా కావడము, విజయులుగా కావడము. మెజారిటీ డబుల్ విదేశీయులు చేతిలో చేయి వేసి నడవడాన్ని బాప్ దాదా చూసారు. చేతిలో చేయి వేయడము, నడవడము ఇది ఫ్యాషన్. మరి శివబాబా చేయి అంటే ఏమిటి? ఈ చేతులైతే (స్థూలమైన చేతులు) కావు. శివబాబా చేయి పట్టుకున్నారు అంటే, ఏ చేయి? శ్రీమతమే తండ్రి చేయి. ఎలా అయితే స్థూలంగా చేతిలో చేయి వేసి నడవడాన్ని ఇష్టపడతారో అలాగే శ్రీమతము అనే చేతిలో చేయి వేసి నడవడము కష్టమా! బ్రహ్మాబాబాను చూసారు, ప్రత్యక్ష ఋజువును చూసారు. ప్రతి అడుగు శ్రీమతమనుసారంగా నడవడం ద్వారా సంపూర్ణ ఫరిస్తా స్థితి అనే గమ్యానికి చేరుకున్నారు కదా! ఫాలో ఫాదర్, ప్రతి ఒక్క శ్రీమతము, లేచినప్పటి నుండి రాత్రి వరకు ప్రతి అడుగులో బాప్ దాదా శ్రీమతాన్ని ఇచ్చి ఉన్నారు. ఎలా లేవాలి, ఎలా నడవాలి, ఎలా కర్మ చెయ్యాలి, మనసులో ఏ ఏ సంకల్పాలు చెయ్యాలి మరియు సమయాన్ని ఎలా శ్రేష్ఠంగా గడపాలి - ఇలా రాత్రి పడుకునే వరకు శ్రీమతము లభించి ఉంది. ఇది చెయ్యాలా వద్దా అని ఆలోచించాల్సిన అవసరము కూడా లేదు, ఫాలో బ్రహ్మా బాబా. బాప్ దాదాకు పిల్లలపై గాఢమైన ప్రేమ ఉంది. పిల్లలు ఒక్కరైనా విజయులుగా కాకపోవడం, రాజులుగా కాకపోవడం బాప్ దాదా చూడ లేరు. పిల్లలు ప్రతి ఒక్కరూ రాజా పిల్లలు, స్వరాజ్య అధికారులు. కావున మీ స్వరాజ్యాన్ని మర్చిపోకండి. అర్థమయిందా.

           సమయము అకస్మాత్తుగా మరియు నాజూకుగా రానుంది, కాబట్టి ఎవరెడీ, అశరీరి స్థితి అనుభవము చాలా అవసరము అని బాప్ దాదా అనేక సార్లు సూచన ఇచ్చి ఉన్నారు. ఎంత బిజీగా ఉన్నా కానీ ఒక్క క్షణము అశరీరిగా అయ్యే అభ్యాసమును ఇప్పటినుండే చేసి చూడండి, మేము చాలా బిజీగా ఉంటాము అని మీరు అంటారు. ఒకవేళ మీరు బిజీగా ఉన్నప్పుడు మీకు దప్పిక వేస్తే ఏమి చేస్తారు? నీళ్ళు త్రాగుతారు కదా! ఎందుకంటే దప్పిక వేసినప్పుడు నీళ్ళు త్రాగడం అవసరము అని అర్థం చేసుకున్నారు. అలాగే మధ్య మధ్యలో అశరీరి ఆత్మిక స్థితిలో స్థితి అయ్యే అభ్యాసము కూడా అవసరము, ఎందుకంటే రాబోయే సమయములో నలు వైపుల ఉన్న అలజడిలో అచల స్థితి చాలా అవసరము. ఇప్పటి నుండే బహుకాలపు అభ్యాసము చెయ్యకపోతే అతి అలజడి సమయములో అచలంగా ఎలా ఉండగలరు! రోజంతటిలో సమయ ప్రమాణంగా ఆత్మిక స్థితి ద్వారా అశరీరిగా కాగలుగుతున్నామా అని ఒకటి - రెండు క్షణాలు పరిశీలించుకోండి. చెక్ చేసుకోండి మరియు ఛేంజ్ చేసుకోండి. కేవలం చెక్ చేసుకోవడమే కాదు, ఛేంజ్ కూడా కావాలి. పదే పదే ఈ అభ్యాసాన్ని చెక్ చేసుకోవడం ద్వారా, రివైజ్ చేసుకోవడం ద్వారా నేచురల్ స్థితి తయారవుతుంది. బాప్ దాదాపై స్నేహము ఉంది, ఇందులో అయితే అందరూ చేతులెత్తుతారు. స్నేహము ఉంది కదా! పూర్తి స్నేహము ఉంది కదా, లేక సగమేనా? సగం స్నేహమైతే లేదు కదా? మరి స్నేహముంటే ప్రతిజ్ఞ ఏమి చేస్తారు? ప్రతిజ్ఞ ఏమి చేసారు? కలిసి నడుస్తాము? అశరీరి అయి కలిసి వస్తారా లేక వెనుక వెనుక వస్తారా? కలిసి వస్తారా? కొద్ది సమయము వతనంలో కలిసి ఉంటారు, కొద్ది సమయము మాత్రమే! ఆ తర్వాత బ్రహ్మా బాబాతో పాటు మొదటి జన్మలోకి వస్తారు. ఈ ప్రతిజ్ఞ ఉంది కదా? చేతులెత్తమని చెప్పము, తల ఊపండి. చేతులెత్తుతూ అలసిపోతారు కదా, కలిసి వెళ్ళవలసినప్పుడు, వెనుక ఉండేది లేనప్పుడు మరి బాబా కూడా ఎవరిని తమతోపాటు తీసుకువెళ్తారు? బాబా, సమానమైనవారిని తమతో తీసుకువెళ్తారు. బాబాకు కూడా ఒంటరిగా వెళ్ళడం ఇష్టం లేదు, పిల్లలతోపాటు వెళ్ళాలి. మరి కలిసి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారా? తల ఊపండి. అందరూ వస్తారా? అచ్ఛా, అందరూ కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? బాబా వెళ్ళినప్పుడు వెళ్తారు కదా? ఇప్పుడే వెళ్ళకండి, ఇప్పుడైతే విదేశాలకు తిరిగి వెళ్ళాలి కదా. బాబా ఆజ్ఞ ఇస్తారు, నష్టోమోహ స్మృతిర్లబ్ధ అనే గంట మ్రోగిస్తారు, అప్పుడు కలిసి వెళ్ళాలి. మరి ఏర్పాట్లు చేసుకున్నారు కదా! స్నేహానికి గుర్తు కలిసి వెళ్ళడము. అచ్ఛా!

           బాప్ దాదా పిల్లలందరినీ దూరంగా ఉన్నప్పటికీ సమీపంగా అనుభవం చేస్తున్నారు. సైన్సు సాధనాలు దూరాన్ని దగ్గరకు తీసుకురాగలిగినప్పుడు, చూడగలిగినప్పుడు, మాట్లాడగలిగినప్పుడు, బాప్ దాదా కూడా దూరంగా కూర్చుని ఉన్న పిల్లలను అతి సమీపంగా చూస్తున్నారు. దూరంగా లేరు, హృదయంలో ఇమిడి ఉన్నారు. బాప్ దాదా విశేషంగా టర్ను అనుసారంగా వచ్చి ఉన్న పిల్లలను తమ హృదయంలో, నయనాలలో ఇముడ్చుకుంటూ ఒక్కొక్కరినీ కలిసి నడిచేవారిగా, కలిసి ఉండేవారిగా, కలిసి రాజ్యం చేసేవారిగా చూస్తున్నారు. మరి ఈ రోజు నుండి రోజంతటిలో పదేపదే ఏ డ్రిల్ ను చేస్తారు? ఇప్పుడే ఒక్క క్షణంలో ఆత్మ అభిమాని, తమ శరీరాన్ని చూస్తూ కూడా అశరీరి స్థితిలో అతీతంగా, తండ్రికి ప్రియంగా అనుభవం చెయ్యగలరు కదా! అయితే ఇప్పుడు ఒక్క క్షణంలో అశరీరిభవ! అచ్ఛా, (బాబా డ్రిల్  చేయించారు) ఇలాగే మధ్య మధ్యలో రోజంతటిలో ఎలాగైనా ఒక క్షణాన్ని కేటాయించి ఈ అభ్యాసాన్ని  పక్కా చేసుకుంటూ ఉండండి.
       
           పిల్లలు, విదేశీయులు కావచ్చు, దేశంవారు కావచ్చు, ఇద్దరూ కలిసి ఏవైతే ప్లాన్లు, ప్రోగ్రాములు తయారు చేసారో వాటిని బాప్ దాదా చూసారు కూడా, విన్నారు కూడా. బాప్ దాదా మధ్య మధ్యలో మీ ప్రోగ్రాములో వచ్చి చూసారు కూడా. అందరూ కలిసి భవిష్య తీవ్ర పురుషార్థానికి, పరివర్తనకు తయార చేసిన ప్లాన్లు చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు, బాప్ దాదాకు నచ్చాయి. కానీ తయారు చేసిన ప్లానును ఎవరైతే వచ్చే సంవత్సరానికి ప్రాక్టికల్ లోకి తీసుకువస్తారో వారికి బాప్ దాదా విశేషంగా ఒక గుప్తమైన బహుమతిని ఇస్తారు. కావున ముందుకు సాగండి, ఈ సారి ఇద్దరి సంగఠనలో పరోపకారము, సహయోగిగా అయ్యే మంచి ఉత్సాహాన్ని చూసారు. డబుల్ విదేశీయులను ఇక నుండి డబుల్ విదేశీయులు అని కాక డబుల్ తీవ్ర పురుషార్ధీలు అని పిలవండి బాప్ దాదా ఇంతకు ముందు కూడా అన్నారు. పిల్లలైన మీ అందరినీ ఈ విశ్వము అనే స్టేజి మీద హీరో పాత్రను అభినయించే హీరోలుగా చూపించాలని బాప్ దాదా ఆశిస్తున్నారు. అందరూ ఉల్లాస ఉత్సాహాలతో వచ్చారు మరియు ఉత్తరాలు కూడా చాలా వచ్చాయి, ప్రతి ఒక్క గ్రూపు కూడా తమ స్మృతిని పంపాయి. ఎవరెవరైతే ప్రియస్మృతులను, ఉత్తరాలను, ఈ మెయిల్సును పంపారో వారందరికీ బాప్ దాదా పేరుపేరునా సమ్ముఖంగా చూస్తూ పదమారెట్ల ప్రియ స్మృతులను తెలియజేస్తున్నారు. దూరంగా ఉన్నా కానీ, హృదయంలో ఇమిడి ఉన్నారు. ఒకే సమయంలో 100 దేశాలవారు కలవడాన్ని చూసి బ్రాహ్మణ పరివారమంతటికీ సంతోషంగా ఉంది. ఈ సంగఠన ఎంత బాగుంది! తమ ఇంటిని, పరివారాన్ని మరియు బాప్ దాదాలను కూడా కలుసుకోవడానికి ఎక్కడెక్కడి నుండో వచ్చారు. ఇది విశేషంగా డబుల్ విదేశీయుల టర్ను, చూడండి, విశేషంగా డబుల్ విదేశీయులకు ఒక టర్ను తయారు చెయ్యడం జరిగింది. కాబట్టి విశేషంగా ఎగురవలసి ఉంటుంది. నడవడం కాదు, ఎగరాలి. డబుల్ తీవ్ర పురుషార్ధీలు, మీ పేరే డబుల్ తీవ్ర పురుషార్ధీ గ్రూపు. వెరైటీ వస్తువులు నచ్చుతాయి కదా, అలాగే వెరైటీ దేశాల సంగఠన ఒక స్థానంలో జరగడము - ఈ దృశ్యము కూడా చాలా బాగుంది. ఇప్పుడు మీరైతే చూడలేరు, బాబా చూడగలరు. అచ్ఛా, టి.వీలో చూస్తున్నారు. సైన్సు మీ సేవ కోసం, మీ పురుషార్థం కోసం వెలువడింది. మీరు సంపన్నమైతే సైన్సు సమాప్తమైపోతుంది. రిఫైన్ అయి తిరిగి మన రాజ్యంలోకి వస్తుంది. సైన్సు సాధనాలన్నీ మీ సేవ చేస్తాయి, కానీ నిర్విఘ్నంగా. ఎవరైతే నిమిత్తంగా అయి ప్లాను తయారు చేసారో, ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చారో, అందుకు నిమిత్తమైన టీచర్లందరూ లేచి నిల్చోండి. సేవలో విదేశీ టీచర్లు ఎవరైతే నిమిత్తమయ్యారో వారు లేవండి. బాప్ దాదా నిమిత్తమైన సేవాధారి గ్రూపుకు విశేషమైన ప్రియస్మృతులను ఇస్తున్నారు. జీ హాజిర్ అన్నందుకు చాలా చాలా అభినందనలు. అచ్ఛా!

           ఇప్పుడు వచ్చిన డబుల్ పురుషార్ధీ విదేశీ పాండవులు, పాండవ సైన్యం లేవండి. డబుల్ విదేశీ పాండవ సైన్యము. చూడండి, పాండవుల విశేషత ఏమని గాయనము చేయబడింది? తండ్రి తోడును తీసుకున్నప్పుడే విజయులుగా అయ్యారు అన్న గాయనము ఉంది. పాండవపతి తోడును తీసుకున్నప్పుడు విజయాన్ని పొందారు. మేము పాండవపతికి తోడుగా ఉన్నాము, తోడుగానూ ఉన్నాము మరియు మేము స్నేహితులము కూడా అని పాండవులు సదా గుర్తుంచుకోండి. మరి మీ టైటిల్ ఏమిటి? మీరు సాధారణ పాండవులు కారు, మీరు విజయీ పాండవులు, పాండవుల పేరు వచ్చినప్పుడల్లా విజయీ పాండవులు అన్న పేరు ప్రసిద్ధము. ఎన్ని సార్లు విజయాన్ని ప్రాప్తి చేసుకున్నారు? అనేక సార్లు విజయాన్ని పొందారు, అనేక సార్లు అవుతూనే ఉంటారు. సంగఠన బాగుంది.

           ఇప్పుడు దేశము మరియు విదేశాలలోని శక్తులందరూ లేవండి. చూడండి, శివ శక్తుల సంగఠన పెద్దదిగా ఉంది. మీ విశేషత ఏమిటి? శివశక్తుల విశేషత ఏమిటి? బాబాతో మీకు ఎంతటి సంబంధము ఉందంటే, స్మృతిచిహ్నంలో కూడా శివ శక్తి అని అంటారు. తండ్రితో సంబంధము పూర్తి అర్థకల్పము కూడా శివ శక్తి పేరుతో గాయనము చేయబడుతుంది మరియు ఇప్పుడు కూడా శివ బాబాతో ఉన్నారు, మీరు సహచరులుగా ఉన్నారు. బాప్ దాదా సేవాధారీ పిల్లలను చూసిన ప్రతి సారీ ఓహో! నా విశ్వ పరివర్తక సహచరులు ఓహో! అని గర్వంగా ఉంటారు. మరి అందరినీ కలిసారు కదా! ఇదైతే సమయానుసారంగా కొద్దిగా మార్పు జరగవలసిందే.

           బాప్ దాదా తనువును కూడా నడిపించాలి కదా, చూడాల్సి వస్తుంది కదా. బాప్ దాదాలనిరువురినీ ఇముడ్చుకునే పాత్రను ఈ బిడ్డ కూడా మంచిగా నిర్వర్తిస్తోంది. ఈ పాత్రను నిర్వహిస్తూ 40 సంవత్సరాలు కావస్తున్నాయి, ఇప్పుడు 39 సంవత్సరాలు అయ్యాయి. అవ్యక్త పాత్ర అద్భుతము ఇది! బాప్ దాదా వీరిద్దరినీ (నీలూ మరియు హంసా, రండి), ఇంకా తోటివారు కూడా ఉన్నారు, వీరిద్దరూ శరీరపు నాడిని(స్థితిని) చూసి శరీరాన్ని నడిపించడం బాగా నేర్చుకున్నారు. తోటివారు కూడా ఉన్నారు, వారు చేతులెత్తండి. శరీరపు నాడిని తెలుసుకుని, యోగయుక్తంగా అయి నడిపించే పాత్రను చాలా బాగా నిర్వర్తిస్తున్నారు, ఇంకా నిర్వర్తిస్తూ ఉండండి. అచ్ఛా! ఇప్పుడు భారతదేశం నుండి విశేష ఆహ్వానంపై వచ్చినవారు లేవండి, పాండవులు కూడా వచ్చారు, విశేష ఆహ్వానంపై వచ్చిన పాండవులు కూడా లేవండి. అచ్ఛా! ఈ భారతదేశపు ఆత్మలది కూడా విశేషమైన పాత్ర అని బాబాకు మరియు వారికి స్వయం కూడా తెలుసు. వీరు పాలనను తీసుకున్నారు మరియు ఇస్తున్నారు కూడా. ఎవరైతే పాలనకు నిమిత్తమయ్యారో వారికి ఎక్స్ ట్రా భాగ్యము కూడా లభిస్తుంది, పాండవులు కావచ్చు, శక్తులు కావచ్చు, కానీ విశేష పాత్రను వహించేవారి మస్తకంలో విశేషమైన భాగ్యరేఖ మెరుస్తూ ఉంటుంది. బాప్ దాదా ఇప్పుడు భారతదేశపు సీజనులో హోమ్ వర్కు గురించి అడుగుతారు. ఏ జోన్ నంబర్ వన్లో ఉంది? జోన్, సెంటరు కాదు. ఏ జోను? మధువనమైనా కావచ్చు, మధువనం కూడా ఈ రేసులో ఉంది. నంబర్ వన్ ఎవరు? మీకు ఇచ్చిన ఈ హోమ్ వర్కు రిజల్టు ను అడుగుతాము. ఇప్పుడు ఇక కొద్ది సమయమే ఉన్నా కానీ పరివర్తన తీసుకురావడానికి, రావడానికి పెద్ద సమయం పట్టదు. కేవలం దృఢ సంకల్పం చెయ్యండి, నంబరు తీసుకునేందుకు మధువనంవారికి కూడా అవకాశం ఉంది. బాప్ దాదా సంతోషంగా ఉన్నారు, డబుల్ లాటరీ లభించింది. ఇంతమంది ఎక్కడెక్కడి నుండో 100 దేశాల నుండి వచ్చారు, ఒకే సమయంలో ఇంతటి పరివారాన్ని కలవడము, బాబాతో కలవడము, ప్రోగ్రాములు తయారు చేయడము... అదృష్టవంతులు. అచ్ఛా, మరి అందరితో కలిసాము కదా! కలవలేదు అని అనరు కదా? అందరినీ కలిసాము కదా.

           మీ అందరి శుభ భావన మరియు శుభ ఆశీర్వాదాలతో ఈ రథం కూడా నడుస్తోంది. మీ అందరి స్నేహము అనే మందు పాత్రను నడిపిస్తోంది. దారిలో వెళ్తున్న బ్రాహ్మణుడు ఇరుక్కుపోయాడు అన్నట్లు ఈ బిడ్డ కూడా నడుస్తూ తిరుగుతూ- నేను ఇరుక్కుపోలేదు, నిమిత్తమయ్యాను అని అంటుంది! కానీ కొంచెం చూసుకోవలసి వస్తుంది. మీరైతే సంతుష్టంగా ఉన్నారు కదా! సంతుష్టంగా ఉన్నారా? కేవలం గ్రూపుల వారీగా కలుసుకోవడం వీలుకాదు. బాప్ దాదా కూడా ఈ పాత్రను చూసి చిరునవ్వు నవ్వుతూ ఉంటారు, దాదీ ధైర్యంతో నిమిత్తం చేసారు.

           అచ్ఛా, డ్రిల్ అయితే గుర్తుంది కదా! మర్చిపోలేదు కదా! ఎందుకంటే రానున్న సమయము అతి హాహాకారాల సమయము అని బాప్ దాదాకు తెలుసు. మీ అందరూ ప్రకాశాన్ని ఇవ్వవలసి ఉంటుంది. శక్తిని ఇవ్వడంలోనే మీ తీవ్ర పురుషార్థము జరిగిపోతుంది. కొద్ది సమయంలోనే ప్రకాశము ద్వారా సర్ప శక్తులనూ ఇవ్వవలసి ఉంటుంది. ఎవరైతే ఇటువంటి నాజూకు సమయంలో ప్రకాశాన్ని ఇస్తారో, ఎంతమందికి ఇస్తారో, చాలా మందికి కావచ్చు, కొద్ది మందికి కావచ్చు, దాని అనుసారముగానే అంతమంది భక్తులు ద్వాపర కలియుగాలలో తయారవుతారు. కావున సంగమంలో ప్రతి ఒక్కరు భక్తులను కూడా తయారు చేసుకుంటున్నారు, ఎందుకంటే మీరిచ్చిన సుఖము మరియు శాంతి వారి హృదయాలలో నిండిపోతాయి మరియు భక్తి రూపంలో వారు మీకు రిటర్ను ఇస్తారు. అచ్ఛా!

           నలువైపుల ఉన్న బాప్ దాదాల కనుపాపలకు, విశ్వానికి ఆధార మరియు ఉద్ధార ఆత్మలకు, మాస్టర్  దుఃఖహర్త సుఖకర్త ఆత్మలకు, విశ్వ పరివర్తక పిల్లలకు చాలా చాలా హృదయపూర్వక స్నేహము, హృదయపూర్వక ప్రియస్మృతులు మరియు కోటానురెట్ల వరదానాలను స్వీకరించండి. అచ్ఛా!

దాదీలతో - అందరూ సంతోషించారు కదా! అచ్ఛా. ఇప్పుడు ఏమి చెయ్యాలి? అచ్ఛా, సాక్షిగా అయి లేక్కాచారాలను సమాప్తం చేసుకుంటున్నారు.

పర్ దాదీతో- చూడండి, అందరికీ ప్రియమైన మరియు అతీతమైన ఆత్మ. మీరు మంచంపై ఉన్నా కానీ అందరికీ మీ పట్ల హృదయపూర్వక స్నేహము చాలా ఉంది. మంచంపై లేరు, అందరి హృదయాలలో ఉన్నారు. అచ్ఛా!

విదేశపు పెద్ద అక్కయ్యలతో - (ఒక పుస్తకాన్ని బాప్ దాదాకు ఇచ్చారు) బాగా కష్టపడ్డారు. అచ్ఛా, రాయల్ గా చేసారు, ఎవరికైనా ఇవ్వడానికి మంచి బహుమతిగా తయారైంది. బాగా కష్టపడ్డారు, ప్రేమను కూడా చూపించారు. డబుల్ విదేశీయులకు పాలన ఇస్తున్నారు, ఇందుకు ఎంతో మంచి ధైర్యాన్ని ఉంచి ముందుకు వెళ్తున్నారు, వెళ్తూ ఉంటారు. అచ్ఛా, పరస్పరంలో కూడా మంచి సంగఠనను తయారు చేసుకున్నారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఉల్లాస ఉత్సాహాలను నిండటానికి ఇది ఒక సాధనము, అందరికీ నవీనత కావాలి కదా. బాగుంది, వీరిని ప్రోత్సహిస్తూ ఉండండి. దీని ద్వారా మేము కూడా పాల్గొంటాము, మేము కూడా చేసి చూపిస్తాము అని అందరికీ ఉత్సాహము రావాలి. జరిగిపోతుంది.

(సుదేశ్ అక్కయ్య లండన్ సమాచారాన్ని వినిపించారు) బాప్ దాదాల అభినందనలు, అభినందనలు.

మన్మోహినీ కాంప్లెక్స్ విభాగ నిర్మాణానికి నిమిత్తమైన అన్నయ్యతో- బ్రాహ్మణులైన మీ కొరకు బాప్ దాదా తరపు నుండి, పిల్లల తరఫు నుండి పరివారము కోసం మన్‌మోహినీ వనంలో భవనాలు తయారవుతున్నాయి, సర్వుల సహయోగముతో బ్రాహ్మణ ఆత్మలు విశ్రాంతిగా ఉండటానికి, రిఫ్రెష్ కావడానికి అందరూ ఎంతో ప్రేమతో చేస్తున్నారు, సహయోగము కూడా ఇస్తున్నారు, కొంత తయారయింది, కొంత తయారవుతూ ఉంది. సర్వుల సహయోగముతో బ్రాహ్మణుల కొరకు ఎంత తయారు చేస్తారో అంత తక్కువ అవుతూనే ఉంటుంది ఎందుకంటే బ్రాహ్మణులు పెరుగుతూ ఉంటారు. కావున మీ అందరి బిందువు బిందువుతో ఇది పూర్తవుతోంది. సంతోషంగా ఉంటుంది కదా, మన సోదర సోదరీలు వస్తారు, విశ్రాంతిగా ఉంటారు, సఫలతను పొందుతారు. ఓహో, మా ఇల్లు పెరుగుతూ ఉంది అని మీ అందరికీ సంతోషంగా ఉంది కదా, మరి తమ ఇంటిని చూసుకుని ఎంత సంతోషంగా ఉంటుంది! ఇప్పుడిక హద్దు లోని వైరాగ్యము రానివ్వండి, అప్పుడు మీ వద్దకు ఆశీర్వాదాలు తీసుకోవడానికి, సుఖ శాంతులను తీసుకోవడానికి ఎంతమంది ఆత్మలు వస్తారో చూడండి. సుఖదాతలైన మీరు వారికి శారీరిక విశ్రాంతిని కూడా ఇస్తారు కదా. కావున ఇది వృద్ధి అవుతూ ఉంటుంది మరియు మీరు వృద్ధి చేస్తూ ఉంటారు. వర్తమాన సమయంలో ఇది ఉంది, ఇక ముందు ఇంకా వృద్ధికానుంది. తయారవుతుందా లేక చాలా అయిపోయిందా? మీరైతే ఆహ్వానిస్తున్నారు కదా, ఎవరు వచ్చినా కానీ వారు అంచలి తీసుకుని వెళ్ళాలి కదా. ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి! మా ఇల్లు తయారవుతోంది అని సంతోషం ఉందా లేక మధువనపు ఇల్లు తయారవుతోందా? మీది తయారవుతోంది కదా. చాలా బాగుంది. కష్టపడేవారు కూడా చాలా ప్రేమతో కష్టపడుతున్నారు. అచ్ఛా!

మనోహర్ దాదీగారి స్మృతిని అందించారు - మీ అందరికీ మీ ప్రియమైన దాదీ మనోహర్ ఇంద్ర గుర్తున్నారు కదా. సదా తమ పాత్రను ఎంతో మంచిగా నిర్వర్తించారు. ఇప్పుడు కూడా అందరి స్నేహము మరియు శుభ సంకల్పములతో తమ పాత్రను నిర్వహిస్తున్నారు మరియు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిదీ ఫిక్స్ పాత్ర ఉంది. వారైతే వతనంలో ఆనందంగా గడుపుతున్నారు. ఈ శరీరంలో లేరు కానీ వతనంలో ఆనందంగా ఉన్నారు. వారి ఆశ పూర్తవుతోంది. అచ్ఛా!

Comments