15-12-2009 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
“పరివారంతో ప్రీతిని నిర్వర్తించడానికి నాలెడ్జ్ ఫుల్ గా అయి తండ్రి సమానంగా సాక్షిస్థితిలో ఉండాలి. తండ్రి, స్వయము, డ్రామా మరియు పరివారము... నాలుగింటిలో నిశ్చయబుద్ధిగా అయి విజయులుగా అవ్వాలి.”
ఈ రోజు సమర్థుడైన బాబా సమర్థులైన తమ పిల్లలను చూస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా అయ్యే పురుషార్థాన్ని స్నేహంతో, ఎంతో లగనముతో చేస్తున్నారు. బాప్ దాదా పిల్లలను చూసి ఎంతో సంతోషిస్తారు మరియు ఓహో పిల్లలూ ఓహో! అని పిల్లల గుణగానము చేస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు తండ్రికి కిరీటం వంటి వారు. చూడండి, పిల్లల పూజ డబుల్ రూపంలో జరుగుతుంది, తండ్రి పూజ ఒక్క రూపంలోనే జరుగుతుంది. అంటే పిల్లలు తండ్రి ద్వారా తండ్రికన్నా ముందుకు వెళ్తారు, అందుకే బాబా పిల్లల పురుషార్థాన్ని చూసి సంతోషిస్తున్నారు. నంబరువారీగా అయితే ఉన్నారుగానీ పురుషార్థపు లక్ష్యము ముందుకు తీసుకువెళుతోంది. ఈ రోజు అమృతవేళ నలువైపుల ఉన్న పిల్లల్లో జ్ఞానానికి పునాది అయిన విషయాన్ని చూసాము. నిశ్చయమే పునాది. నిశ్చయబుద్ధి విజయంతి అని కూడా అంటారు. మరి మీ అందరి నిశ్చయాన్ని చూసాము, అందరికీ నంబరువారీగా బాబాపై నిశ్చయమైతే ఉంది, అందుకు గుర్తుగా అందరూ బాబాను గుర్తించి బాబాకు చెందినవారిగా అయ్యారు మరియు బాబాను కలుసుకోవడానికి ఇక్కడకు కూడా వచ్చారు. పిల్లలు ప్రతి ఒక్కరికీ తండ్రిపై ఎడతెగని నిశ్చయము ఉంది, కానీ బాబాతో పాటు మరి కొన్ని నిశ్చయాలు కూడా పక్కాగా ఉండాలి. అవి- స్వయంపై నిశ్చయము. దీనితోపాటు డ్రామాయందు నిశ్చయము మరియు పరివారంపై నిశ్చయము. ఈ నాలుగు రకాల నిశ్చయాలలో పక్కాగా ఉండటము అనగా నిశ్చయబుద్ధి విజయంతులుగా అవ్వడము అని అర్థము. మరి ఈ నాలుగింటిలో పక్కా నిశ్చయము ఉందా అని పరిశీలించుకోండి. బాబా విషయంలో అయితే అందరూ నా బాబా మరియు నేను బాబాకు చెందినవాడను అని అంటారు. తండ్రి నావాడు అంటూ పూర్తిగా తండ్రిపై అధికారాన్ని పొందేసారు. తండ్రి ద్వారా సదా అధికారులుగా అయి సర్వ ఖజానాలకు అధికారులుగా అయిపోయారు. దీనితోపాటు స్వయంపై కూడా నిశ్చయము తప్పనిసరి, ఎందుకని? ఒకవేళ స్వయంపై నిశ్చయం లేనట్లయితే మనసు కృంగిపోతుంది. స్వయంపై నిశ్చయము అనగా నేను తండ్రి ద్వారా స్వమానధారిని, స్వరాజ్య అధికారిని. స్వయంగా తండ్రి నాకు ఎన్ని స్వమానాలను ఇచ్చారు! ఒక్కొక్క స్వమానాన్ని గుర్తు తెచ్చుకుంటే ఎంత నషా ఉంటుంది! ఈ రోజుల్లో ఎవరికైనా ఏదైనా టైటిల్ లభిస్తే, అది వారి భాగ్యంగా భావిస్తారు. కానీ పిల్లలైన మీకు ఒక్కొక్క స్వమానాన్ని ఇచ్చినది ఎవరు! స్వయంగా బాప్ దాదా పిల్లలందరినీ స్వమానధారులుగా చేసారు. ఒక్కొక్క స్వమానాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషంతో ఎగురుతూ ఉంటారు. కావున స్వయంపై కూడా- నేను తండ్రి ద్వారా స్వరాజ్య అధికారిని, స్వమాన అధికారిని, కోట్లలో ఒకరిగా ఉన్న ఆత్మను.... అని ఇంతగా సదా నిశ్చయము, నషాను ఉంచాలి. బాబాపై నిశ్చయమున్నట్లుగా స్వయంపై నిశ్చయము ఉండటము అవసరము ఎందుకంటే ఒకవేళ స్వయంపై నిశ్చయమున్నట్లయితే ఎక్కడ నిశ్చయముంటుందో అక్కడ ప్రతి కర్మలో నిశ్చయబుద్ధి అనగా స్వమానధారులుగా, విజయులుగా ఉంటారు. నిశ్చయానికి అర్థము- సఫలత, మాకైతే బాబాపై నిశ్చయము ఉంది కదా అంటే సరిపోదు, బాబాపై ఉంది, అది చాలా మంచిది కానీ దానితోపాటు నేను ఎవరిని అన్న స్వ నషా ఉండాలి! ఒక్కొక్క స్వమానాన్ని గుర్తు తెచ్చుకున్నట్లయితే నిశ్చయము మరియు నషా మీ నడవడిక మరియు ముఖము ద్వారా కనిపిస్తుంది. కనిపిస్తూ ఉంది మరియు కనిపిస్తూ ఉంటుంది. మూడవ విషయము- డ్రామాపై కూడా నిశ్చయము చాలా అవసరము. ఎందుకంటే డ్రామాలో సమస్యలు కూడా వస్తాయి మరియు సఫలత కూడా లభిస్తుంది. ఒకవేళ డ్రామాపై పక్కా నిశ్చయమున్నట్లయితే డ్రామాపై నిశ్చయముతో ఎవరైతే నిశ్చయబుద్ధిగా ఉన్నారో వారు సమస్యను సమాధాన స్వరూపంలోకి మార్చివేస్తారు. ఎందుకంటే నిశ్చయము అనగా విజయము. ఎందులో విజయులుగా అవుతారు? పరివర్తన చెందడంలో, ఒక్క క్షణములో సమస్య పరివర్తన చెంది సమాధాన రూపంగా అయిపోతుంది. అలజడిలోకి రారు, అచలంగా ఉంటారు. ఎందుకంటే డ్రామా జ్ఞానంతో నిశ్చలంగా, అచలంగా అయిపోతారు. నేనే కల్ప క్రితం కూడా సమాధాన స్వరూపంగా అనగా సఫలమైన ఆత్మగా అయ్యాను, అవుతున్నాను మరియు కల్పం తర్వాత కూడా అవుతాను అన్న నిశ్చయము ఉంటుంది. మరి ఈ నషా డ్రామాపై నిశ్చయాన్ని పక్కా చేస్తుంది. నేను అలా ఉన్నాను, ఇప్పుడూ ఉన్నాను మరియు నేనే అలా అవుతాను అన్న శుద్ధమైన గర్వముంటుంది, నషా ఉంటుంది అందుకే ఈ పురుషార్ధీ జీవితంలో డ్రామాపై నిశ్చయము కూడా అవసరము. దీనితోపాటు నాల్గవది పరివారంపై నిశ్చయము ఎందుకంటే బాబా వచ్చిన వెంటనే పరివారానికి జన్మను ఇచ్చారు. ఎలా అయితే తండ్రిపై నిశ్చయము ఉందో, అలాగే పరివారంపై నిశ్చయము కూడా అవసరము. ఎందుకంటే పరివారము ఎవరిది? ఇంత పెద్ద పరివారము ఇంకెవరికైనా ఉంటుందా! కావున పరివారంపై నిశ్చయము కూడా ఎంతో అవసరము ఎందుకంటే ఇంత పెద్ద పరివారము విశ్వంలోనే ఇంకెవరికైనా ఉందా? మీ అంతటి పరివారం ఇంకెవరికైనా ఉందేమో చెక్ చేయండి. పరివారం రూపంలో ఏ డివైన్ ఫాదరుకు కూడా లేదు, అక్కడ ఫాలోవర్స్(శిష్యులు) ఉంటారు, ఇక్కడ పరివారము ఉంది. పరివారంతోపాటు సేవలో, సంబంధాలలో ఉంటారు. అంతేకానీ మాకైతే బాబాతోటే కనెక్షన్ ఉంది, పరివారంతో లేకపోతే ఏమవుతుంది అని అనుకోవద్దు. పరివారంపై ఉన్న నిశ్చయంతో మీరు 21 జన్మలు నడిచేదుంది. తెలుసు కదా! పరివారంతో పాటుగా సంబంధాలలోకి వచ్చినప్పుడు నేను ఎంత పెద్ద పరివారానికి చెందినవాడను, అందరితో నిశ్చయబుద్ధిగా అయి నడుచుకుంటున్నానా అని తెలుస్తుంది. పరివారంతో కలిసి నడవడానికి పరివారంలో ప్రతి ఒక్కరి సంస్కారాలు భిన్న భిన్నంగా ఉంటాయి అన్న విషయంపై శ్రద్ధ వహించాలి. మీకు స్మృతి చిహ్నమైన మాలలో చూడండి, ఎక్కడ మొదటి నంబరు ఎక్కడ 108వ నంబరు! ఎందుకంటే పరివారంలో భిన్న భిన్న సంస్కారాలు ఉంటాయి. మరి ఇంత పెద్ద పరివారంలో నడుస్తూ, సంస్కారాలను అర్థం చేసుకుంటూ పరస్పరంలో ఒకే పరివారము, ఒకే తండ్రి, ఒకే రాజ్యము, కావున ఒక్కటిగా అయ్యి నడవాలి. పరివారంలో కూడా పెద్ద పరివారము కదా, అలాగే ఇతరుల పట్ల పెద్ద మనస్సు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి పట్ల శుభ భావన, శుభ కామనల స్థితిని ఉంచుకుని నడుచుకోవాలి. ఎందుకంటే పరివారం మధ్యనే సంస్కార స్వభావాలు వస్తాయి. కానీ పరివారంతో మాకేమిటి, బాబాతో అయితే ఉంది కదా అని కొందరు అనుకుంటారు. కానీ, ఇక్కడ ధర్మము మరియు రాజ్యము... రెండింటి స్థాపన జరుగుతుంది, కేవలం ధర్మము కాదు. ఇతర ధర్మ పితలు వచ్చారు. కానీ, వారిది కేవలం ధర్మము మాత్రమే, రాజ్యము లేదు. ఇక్కడైతే మీరందరూ రాజ్యము కూడా చెయ్యాలి. మరి రాజ్యంలో పరివారం అవసరము ఉంటుంది మరియు 21 జన్మలు భిన్న భిన్న రూపాలతో పరివారంతోటే ఉండాలి, పరివారాన్ని విడిచి ఎక్కడికీ వెళ్ళలేరు. కావున పరిశీలించుకోండి. అంతేకానీ బాబాకు తెలుసు, నాకు తెలుసు, బాబాతోటే నా పని అని భావించకండి... కానీ ఈ నాలుగు నిశ్చయాలలో ఒక్క దానిలో అయినా నిశ్చయము తక్కువగా ఉన్నట్లయితే అలజడిలోకి వచ్చేస్తారు. సేవా సహచరులు, బాబా అయితే శక్తిని ఇస్తూ ఉంటారు, కానీ సహచరులు ఎవరు? సాకారములో తోడుగా అయితే పరివారమే ఉంటుంది కదా. బాబా ఏమి చూసారంటే- మూడు నిశ్చయాలలో మెజారిటీ మంచిగా ఉన్నారు, కానీ పరివారంతో సంబంధమును నిర్వర్తించడము, సంస్కారాలను కలుపుకుపోవడము, ప్రతి ఒక్కరినీ కళ్యాణ భావనతో చూడటము మరియు అదే విధంగా నడుచుకోవడము, ఇందులో పిల్లలు యథాశక్తిగా అయిపోతున్నారు. కానీ బాబా చూసిందేమిటంటే పరివారంపై నిశ్చయంలో నాలెడ్జ్ ఫుల్ గా అయి ఎవరైతే సదా బాబా సమానంగా సాక్షి స్థితిలో తోడుగా ఉంటారో వారు నంబరువన్ లేక నంబరువన్ డివిజన్ లోకి వస్తారు. మరి పరిశీలించుకోండి, భావ స్వభావాలు పరివారంలోనే వస్తాయి, చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగుతాయి, విఘ్నాలు వస్తాయి - ఇవన్నీ పరివారపు సంబంధాలలోనే వస్తాయి. కావున అన్నింటికన్నా అవసరమైనది ఈ పరివారపు సంబంధంలో పాస్ అవ్వడము. ఒకవేళ పరివారంలో నడవడము, తోడును నిర్వర్తించడంలో ఏదైనా లోపము ఉంటే, అది చిన్న విఘ్నమైనా పెద్ద విఘ్నమైనా విసిగిస్తూ ఉంటుంది. ఇది ఎందుకు, ఇది ఎలా? అన్నవి పరివారపు సంబంధంలోనే వస్తాయి. కావున ఎందుకు అనేందుకు బదులుగా, ఎందుకు చెయ్యకూడదు అనుకోవాలి. మేము కలిసి నడవాలి, పరివారంలో ప్రీతిని నిర్వర్తించాలి. ఎందుకంటే ఇది తండ్రి పరివారము, భగవంతుని పరివారము. సాధారణ పరివారము కాదు. ఓహో బాబా, ఓహో డ్రామా, ఓహో నేను మరియు ఓహో పరివారము అని నషా ఉండాలి. సరేనా? పరిశీలించుకుంటున్నారా? నాలుగింటిలో పాస్ అయ్యారా? నాలుగింటిలో? ఒక్క దానిలో కూడా తగ్గకూడదు. పరిశీలించుకోండి. ఇప్పుడే పరిశీలించుకోండి ఎందుకంటే విజయులుగా అవ్వడానికి ఇదే సాధనము. పరివారం మధ్యలోనే సంస్కారాలు తలెత్తుతాయి మరియు ఆ సంస్కారాలతో కలుపుకుపోవడము అంటే స్వయము పరివర్తన చెందడము మరియు పరివారాన్ని అంతటి ఉన్నత దృష్టితో చూడటము అని అర్థము. బాప్ దాదా తమ లాస్ట్ బిడ్డను కూడా అతి భాగ్యశాలిగా భావిస్తారు అని ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నారు, ఎందుకని? భగవంతుడ్ని గుర్తించడము, సాధారణ రూపంలో ఉన్న తండ్రిని గుర్తించడము, పెద్ద పెద్ద మహాత్ములు కూడా గుర్తించలేకపోయారు కానీ బాప్ దాదాల చివరి పిల్లలు కూడా నా బాబా అని అంటారు. మనస్ఫూర్తిగా నా బాబా అని అంటారు. బాప్ దాదా చివరిలోని పిల్లలలో కూడా విశేషతను చూస్తారు. ఎలా అయితే పిల్లలకు ప్రేమను, ప్రియస్మృతులను ఇస్తారో అలాగే చివరిలోని పిల్లలకు కూడా ఇస్తారు. మరి పరిశీలించుకోండి, మూడింటిలో మంచిగా ఉన్నారా లేక నాలుగింటిలో మంచిగా ఉన్నారా లేక ఒక్క దానిలో మంచిగా ఉన్నారా? అని పరిశీలించుకున్నారా? పరిశీలించుకున్నారా? నేను నాలుగింటిలో అనగా తండ్రి, స్వయము, డ్రామా మరియు పరివారము నాలుగింటి నిశ్చయాలలో మంచిగా ఉన్నాను అని ఎవరయితే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. మంచిగా ఉన్నారా? అచ్ఛా, మరి పరీక్ష తీసుకోమంటారా? చేతులెత్తండి. అచ్ఛా, పరివారంలో కూడా పాస్ అయ్యారా? పరివారంలోని సంబంధాలలోకి రావాలి, ఎందుకంటే పరివారాన్ని విడిచి ఎక్కడికీ వెళ్ళలేరు, ఇందులో ఉండాల్సిందే, నిర్వర్తించాల్సిందే. మరి ఇందులో పాస్ అయ్యారా? ఇలా జరగకపోతే బాగుండేది, వీరిలా ఎందుకు చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది... అని సంకల్పాలు ఎప్పుడైనా వస్తాయి, కానీ పూర్తిగా పరివారపు నషా ఉండాలి, నాలుగు నిశ్చయాలు ఉన్నవారు సంకల్పంలో కూడా అలాంటి, ఇలాంటి సంకల్పాలు చెయ్యరు. ఇలా ఎందుకు జరుగుతుంది అని సంకల్పంలో రావచ్చు, కానీ ఆ ఎందుకు, ఏమిటి అన్నది నన్ను కదిలించకూడదు, మూడ్ మార్చకూడదు. నాలుగింటిలో పాస్ అని దీనినే అంటారు. చేతులైతే ఎత్తారు, బాప్ దాదాను సంతోషపెట్టారు కానీ, పరివారం విషయంలో బాప్ దాదా కొన్నిటిని వినవలసి వస్తుంది, చూడవలసి వస్తుంది. పూర్తిగా పెద్ద మనసు చేసుకోవాలి, అందరినీ శుభ భావన, శుభ కామనలతో మంచిగా చెయ్యాలి. ఎందుకంటే పరివారం ఒక్కటే. ఏకమతంతో నడుచుకోవాలి, నడిపించాలి. కేవలం నడవడం కాదు, నడిపించాలి కూడా. అందుకే బాప్ దాదా ఏమంటున్నారంటే పరివారంలో ఎవరైతే అలజడులలో పాస్ అవుతారో, వ్యర్థం రాదో, వారు ఇతరులను ఇలా తయారు చెయ్యడంలో అటెన్షన్ పెట్టాలి. ఇప్పుడైతే మీరు మీ, మీ సెంటర్లలో ఎంతమంది ఉంటారు! ఎక్కువలో ఎక్కువ 25-50, ఇంతమంది ఉండరు కానీ పెద్ద స్థానమైతే అందులో కూడా 50-60 మంది, సరే ఎక్కువలో ఎక్కువ అంటే 100 మంది అనుకోండి. ఇంతమంది లేరు కానీ ఉన్నారనుకోండి. బాప్ దాదా సెంటర్లలోని పిల్లలందరినీ లాస్ట్ వారిని కూడా తమకు ప్రియమైనవారిగా భావిస్తూ నడిపించారు. ప్రేమకు గుర్తుగా బాబా రోజూ ప్రియ స్మృతులలో ఏమని చెప్తారు? మధురాతి మధురమైన అని అంటారు, పుల్లని పిల్లలు కూడా ఉన్నారని తెలుసు, కానీ మధురమైన, పుల్లని పిల్లలకు ప్రియస్మృతులు అని ఎప్పుడైనా చెప్పారా? వారిని కూడా గారాల పిల్లలు అనే అంటారు, నా పిల్లలు అని కేవలం అనడమే కాదు, నావారు అన్న భావంతో నడిపిస్తారు కూడా! ఎందుకంటే డ్రామాలో, మాలలో అందరూ ఒకే నంబరులో లేరు, ఇది రిజల్టు. సంస్కారాలు భిన్నంగా ఉంటాయి, ఉండాల్సిందే, లేకపోతే అందరూ రాజులైపోతే ప్రజలుగా ఎవరు అవుతారు! ఎవరిపై రాజ్యం చేస్తారు? మంచి ప్రజలు కూడా కావాలి కదా, రాయల్ ప్రజలు, రాజధాని కదా, ఇలా ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకోండి, పరివారంలో ఏ విషయంలో అయినా ఎవరి సంస్కారాలైనా చెడుగా ఉన్నాయనుకోండి, కానీ మరి నా సంస్కారము ఏమిటి? ఒకవేళ చెడును చూసి నా సంస్కారము కూడా పాడైతే, అప్పుడు నేను కూడా పాడైపోయినట్లే కదా! మంచిని కూడా చెడు పాడు చేస్తుంది.
స్థాపన సమయంలో బాబా 350-400 మందిని ఒకేసారి సంభాళించారు, ఇంతమంది కలిసి ఉండే పరివారమైతే ఇప్పుడు ఎక్కడా లేదు. సరే, డ్యూటీ వేరువేరుగా ఉండవచ్చు కానీ అది డ్యూటీ మరియు ఇక్కడిది పరివారంలోని డ్యూటీ. సాధారణ పరివారము, సాధారణ డ్యూటీ, సాధారణ పద్ధతిలో దినచర్యను గడపడము... ఇది కాదు. ఇది ప్రియమైన మరియు అతీతమైన పరివారము. ఇందులో డిస్టర్బ్ అవ్వడము, మళ్ళీ అందుకు సాకుగా వారు చేసారు కాబట్టి ఇలా జరిగింది అని, వీరు చేసారు కాబట్టి ఇది జరిగింది అంటారు! కానీ బాబా ముందు అపోజిషన్ జరుగలేదా! పారిపోయారు కూడా! ఇది అపోజిషన్ కాదా! అయినప్పటికీ బాబా, ఎవరు పారిపోయినా కానీ వారికి టోలీ పంపండి, వారిని పిలిచేందుకు ప్రయత్నించండి, సేవ చెయ్యండి, గుర్తు తెప్పించండి అని అన్నారు. ఇలా నాలుగింటిలో పాస్ అవ్వాలా లేక మూడు, రెండింటిలో మాత్రమేనా? నంబరువన్ గా కావాలి. ఇందుకోసం వినాశనము ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ వినాశనం ఆగి ఉంది. ప్రకృతి కూడా బాబా వద్దకు వస్తుంది. ఇప్పుడు చాలా భారంగా ఉంది అని ప్రకృతి కూడా అంటుంది. ఆ భారం నుండి ప్రకృతి దూరం కావాలనుకుంటుంది. మాయ కూడా ఇప్పుడిక నా పాత్ర అయిపోనుందని నాకు తెలుసు, కానీ బ్రాహ్మణ పరివారంలో ఎటువంటి పిల్లలు కూడా ఉన్నారంటే, చిన్న విషయంలో కూడా నాకు తోడుగా అయిపోతారు, నన్ను వారి వద్ద కూర్చోబెట్టుకుంటారు అని అంటుంది. మరి మన రాజ్యాన్ని తీసుకురావడంలో ఈ నాలుగు నిశ్చయాలు శాతంలో ఉన్నాయి, అందుకే సమయం కూడా ఆగి ఉంది. నిజానికి మాయ మరియు ప్రకృతి, రెండూ సిద్ధంగా ఉన్నాయి. మరి చెప్పండి, వాటిని ఆజ్ఞాపించమంటారా? పిల్లలు ఒకవేళ ఎవరెడీగా లేకపోతే మాయ మరియు ప్రకృతికి ఆర్డర్ చెయ్యమంటారా? చెయ్యమంటారా? చేతులెత్తండి, సిద్ధంగా ఉన్నారా? ఊరికే చేతులెత్తకండి. పరీక్ష వస్తుంది, మరి ఎవరెడీగా ఉన్నారా?
ఇప్పుడు బాప్ దాదాకు పిల్లలందరిపై ఉన్న ఆశ ఏమిటంటే- ఎలా అన్నదానిని అంతం చేసి 'ఇలా' అని మార్చేయండి. ఎలా చెయ్యను, ఎలా అవుతుంది అని అనవద్దు. ఇలా చెయ్యాలి. ఏమి చెయ్యను కాదు, ఇలా చెయ్యాలి అని అనాలి. ఈ ఆశను ఎప్పటిలోపు పూర్తి చేస్తారు? ఎంత సమయము కావాలి? ఎందుకంటే అందరూ తయారు కావాలి. ఒకవేళ మీరు తయారుగా ఉంటే, ఎవరైతే చేతులెత్తారో వారి పని ఏమిటి? ఇతరులను తమ సమానంగా చెయ్యడము. ఎవరైతే చేతులెత్తారో వారు తమ సమానంగా చెయ్యగలరా? పరివారాన్ని తయారుచేయగలరా? ఇందులో చేతులెత్తండి. తయారుచేయగలరా? అచ్చా! ఎంత సమయం కావాలి? ఒక సంవత్సరమా? ఎంతకావాలి? ఎంత సమయం కావాలి? టీచర్లు చెప్పండి, ఎంత సమయము కావాలి? పాండవులు చెప్పండి! చేతులైతే ఎత్తారు, ఎంత సమయము కావాలి? ఇది పరివారము, మరి పరివారంలో సహయోగమును ఇవ్వవలసి ఉంటుంది కదా! పరివారముతో సంబంధాన్ని తెంచుకోరు కదా! వదిలివెళ్ళేది కూడా లేదు, మరి పరివారాన్ని తయారు చేయాలి కదా! లౌకికంలో కూడా మంచి బుద్ధి ఉన్నప్పుడు, ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు తీసుకువెళ్ళేవారు, (ఈ రోజుల్లో కాదు, ఒకప్పుడు) గ్రామాన్ని కూడా తమ పరివారంగా భావించేవారు. ఇదైతే అలౌకిక పరివారము. గొడవలైతే జరుగుతాయి, మాయ వచ్చేది పరివారం విషయంలోనే, సంబంధాలలోనే వస్తుంది. సంబంధాల విషయంలోనే వ్యర్థ ఆలోచనలు వస్తాయి. మరి చేతులెత్తేవారు చెప్పండి? ఏమంటారు? ఎవరైనా చెప్పండి, మైక్ ఇవ్వండి. (ఈ సీజన్ లోనే పూర్తి చేస్తాము) వీరితోపాటు ఎవరున్నారో వారు చేతులెత్తండి. ఫోటో తియ్యండి. టీచర్లు, ఈ సీజన్ లో ఒకరికొకరు సహయోగాన్ని ఇచ్చుకుంటూ, ఒకరినొకరు ముందుకు తీసుకువెళ్తూ బాబా ఆశను పూర్తి చెయ్యండి, సరేనా? ఇందులో చేతులెత్తండి. చేతులెత్తి సంతోషపెట్టారు, బాగుంది. ఒకే బలము ఒకే నమ్మకము అని బాబా అంటారు . ఈ రెండూ ఉన్నట్లయితే ఏమి చెయ్యలేరు! బాబా ఎంత కొద్ది సమయంలో స్థాపనా పాత్రను పూర్తి చేసారు! ఇప్పుడైతే అందరూ నాలెడ్జ్ ఫుల్ గా అయ్యారు, డబుల్ లైట్ గా కూడా అయ్యారు. ఈ సబ్జెక్టు కొంచం అటెన్షన్ ను ఇవ్వవలసిన విషయము అని బాప్ దాదాకు తెలుసు. ముందు కూడా పని ఇచ్చాము, కనీసం ఒక్క సెంటరైనా నిర్విఘ్నంగా అవ్వాలి, సెంటరు తర్వాత జోన్ కావాలి, జోన్ కాకపోయినా ప్రతి ఒక్క నగరం అనుకోండి, ఏ నగరమైనా, ఢిల్లీ, అహ్మదాబాదు, కలకత్తా... ఒక్క కలకత్తా నిర్విఘ్నమైనా కానీ, కలకత్తావారు, ఢిల్లీ వారు కూడా కూర్చుని ఉన్నారు. ఇది కర్ణాటక వారి టర్న్, కర్ణాటక టీచర్లందరూ కూర్చుని ఉన్నారు. కర్ణాటకలోని ఒక్కొక్క సెంటరు మరియు సెంటరు కనెక్షన్లో ఉన్నవారంతా ఒక్కటైపోతే ఆ జోనుకు, నగరానికి కూడా బాప్ దాదా బహుమతిని ఇస్తారు. మంచి బహుమతిని ఇస్తారు. ఇందుకు ఎవరైనా నిమిత్తంగా అయ్యి చూపించండి. ముఖ్య సెంటరు మరియు దాని సెంటర్లు, పరివారమంతా అవ్వవలసిందే, కానీ ఇప్పటివరకూ రిజల్టు రాలేదు. మధువనంవారు చేతులెత్తారు, మంచిది. చెయ్యలేనిదేమిటి! కానీ చెయ్యవలసి ఉంటుంది. సరేనా? ఇష్టమేనా? అందరికీ ఇష్టమేనా? కానీ బాప్ దాదా ఈ సీజన్ కన్నా ముందు సీజన్లో మూడు నాలుగు సార్లు చెప్పారు, ఇప్పటివరకు ఎవ్వరి నుండి రిజల్టు రాలేదు. ఈ విషయం కూడా అకస్మాత్తుగా జరగాలనుకుంటున్నారా? సరే, అకస్మాత్తుగా జరిగినా కానీ, ఇందుకు బహుకాలపు అభ్యాసము అవసరము, అప్పుడే బహుకాలపు అధికారాన్ని పొందగలరు అని బాప్ దాదా అంటారు.
మరి ఇప్పుడు ఏమి చెయ్యాలి? తపన అనే అగ్నిని వెలిగించండి. చెయ్యాల్సిందే. ఇందుకోసం ఒక్క విషయంలో అందరూ పాస్ అయ్యారు, బాప్ దాదాపై మాకు మనస్ఫూర్తిగా 100 శాతం ప్రేమ ఉంది. అనుకునేవారు చేతులెత్తండి. 100 శాతం ఉందా? పెద్దగా చేతులెత్తండి. మరి ప్రేమకు రిటర్ను ఏమిటి? ప్రేమకు రిటర్ను సమానంగా అవ్వడము, సంపన్నంగా అవ్వడము, సంపూర్ణంగా అవ్వడము. ఇప్పుడు బాప్ దాదా ఒక డ్రిల్ చెప్తారు, బాబా మరియు దాదా ఇద్దరిపై ప్రేమ ఉంది అని అందరూ అంటారు కదా! చేతులెత్తారు, నంబరువారీగా ఉంటారు కానీ చేతులెత్తారంటే బాప్ దాదా నమ్ముతారు. ఇద్దరిపై ప్రేమ ఉంది కదా. బ్రహ్మాబాబా మరియు శివబాబా ఇద్దరిపై ప్రేమ ఉంది కదా! ఇద్దరిపై ఉంది కదా? చేతులెత్తండి. అచ్ఛా ఇద్దరిపై ఉంది. చాలా మంచిది, ధన్యవాదాలు. అచ్ఛా, ఇద్దరి సమానంగా అవ్వాలనుకుంటున్నారా? చేతులెత్తకండి, తల ఊపండి. అచ్ఛా, ఇద్దరిపై ప్రేమ ఉంటే శివబాబా నిరాకారుడు, సరేనా మరియు బ్రహ్మాబాబా ఫరిస్తా, ఫరిస్తా కదా! మరి రేపటి నుండి కాదు, ఈ రోజు నుండి, ఇప్పటి నుండి రోజంతటిలో ఇద్దరు తండ్రులపై ప్రేమ ఉన్నట్లయితే ఒకసారి స్వయాన్ని నిరాకార తండ్రి సమానంగా నిరాకార స్థితిలో అభ్యాసం చేసుకోండి, ఫాలో ఫాదర్. మరోసారి ఫరిస్తాగా అయి సాకార రూపంలో బ్రాహ్మణుడిగా కాదు, ఎలాగూ బ్రాహ్మణులే, కర్మలు చేయండి, కానీ కర్మలను చేస్తూ కూడా ఫరిస్తా స్థితిలో ఉండండి, అప్పుడు కర్మల భారము దాని ప్రభావాన్ని చూపదు. బ్రహ్మాబాబాపై ప్రేమ ఉన్నట్లయితే బ్రహ్మాబాబా అన్ని కర్మలను చేసారు, కానీ నిమిత్తమై చేసారు. బ్రహ్మాబాబాపై ఎంత భారము ఉండేది! మీలో ఎవ్వరిపైనా ఇంత భారము లేదు, ఉందా ఏమైనా, బ్రహ్మాబాబాకన్నా కూడా ఎక్కువ భారము, బాధ్యత ఎవరికైనా ఉన్నాయా? వారు చేతులెత్తండి. ఎవ్వరూ ఎత్తరు. మరి బ్రహ్మాబాబా ఇంతటి బాధ్యతలను నిర్వహిస్తూ కూడా కార్యంలో ఎలా ఉండేవారు! కర్మలలో ఫరిస్తాగా అయి ఉండేవారు కదా! మీకు కూడా బ్రహ్మాబాబాపై ప్రేమ ఉంది కదా, కావున కాసేపు ఫరిస్తా రూపంలో ఉండండి, కాసేపు నిరాకార స్థితిలో ఉండండి. ఈ అభ్యాసాన్ని చేస్తూ బ్రహ్మాబాబా సమానంగా ఫరిస్తాగా అయిపోండి మరియు నిరాకార శివబాబాను స్మృతి చేస్తూ నిరాకార స్థితిలో స్థితులవ్వండి, ఇది చెయ్యగలరా? ఇది చెయ్యగలరా లేక కష్టమా? దీనిని మధ్య మధ్యలో చేస్తూ ఉండండి, మధ్య మధ్యలో ఎలా చెయ్యాలంటే అది నిరంతరంగా అయిపోవాలి. మీ కర్మల అనుసారంగా, మీ దినచర్యను బట్టి దీనిని ఫిక్స్ చేసుకోండి. కనీసం రోజంతటిలో 12 సార్లు ఫరిస్తాగా, 12సార్లు నిరాకారి స్థితిలో స్థితులవ్వండి, ఇది చెయ్యగలరా? చేతులెత్తండి. చెయ్యగలరా? కష్టం కాదు కదా! సహజమే కదా! సహజమైతే చేతులెత్తండి. అచ్ఛా, చెయ్యాలి. దీనిని పక్కా చేసుకోండి. అప్పుడు మీరు ఏ లక్ష్యమునైతే తీసుకున్నారో, అలా ఈ సీజన్ అంతిమంలోవు పరివర్తన అవ్వగలరు. ఒకవేళ ఈ డ్రిల్ ను 24సార్లు చేస్తే అది నిరంతరం అయిపోతుంది. సరేనా, వీలవుతుందా! చేతులెత్తండి. అయితే బాప్ దాదా తరఫున పదమ, పదమ, పదమారెట్లు అభినందనలు, అభినందనలు. కానీ ఢీలాగా వదలకండి. నేను ఇందులో నంబరువన్ గా కావాలి అని అందరూ నిశ్చయం తీసుకోండి. నంబరువారీగా కావద్దు, నంబరువన్ గా అవ్వాలి. ఎందుకంటే బాప్ దాదా వద్దకు సమయము ఎన్నోసార్లు వస్తూ ఉంటుంది. ప్రకృతి అయితే, భారము సహించడం వీలవడం లేదు అని ఆర్తనాదాలు చేస్తూ ఉంటుంది. మాయ కూడా వీడ్కోలు తీసుకోవాలనుకుంటుంది, కానీ నేనేం చెయ్యను! బ్రాహ్మణులు తమ సంస్కారాలకు వశమై చేసే కర్మలతో నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు, అప్పుడు నేను తప్పక వెళ్ళవలసి వస్తుంది అని అంటుంది. అప్పుడు మరి బాప్ దాదా ఏమని జవాబివ్వాలి! అందుకే ఎలా అయితే సమయము ముందుకు వెళ్తూ ఉందో, ఇప్పుడు మీరు సేవలో కూడా తేడాను గమనిస్తున్నారు కదా! ఏదైనా జరగాలి, ఏదైనా జరగాలి అని సేవా రిటర్నును ఇప్పుడు అందరూ ఆశిస్తున్నారు. బ్రహ్మాకుమారీలు ఏదైతే చెప్పేవారో అది నిజమవుతోంది. ముందైతే వినాశనము, వినాశనము అని అనకండి అనేవారు. ఇప్పుడైతే వినాశనం ఎప్పుడు జరుగుతుంది, మీరే తారీఖును చెప్పండి అని అంటున్నారు. ఇప్పుడు వినాలనుకుంటున్నారు, ముందైతే సాకులు చెప్పేవారు, ఈ తేడా కూడా కనిపిస్తోంది కదా, ప్రాక్టికల్ గా చూస్తున్నారు కదా! అందుకే ఇప్పుడు బాప్ దాదాతో ఏ ప్రతిజ్ఞనైతే చేసారో దానిని నిర్వర్తిస్తూ ఉండండి. సరేనా! బాప్ దాదా అన్ని సమాచారాల రిజల్టును విన్నారు, ఏదైతే జరిగిందో బాగా జరిగింది. రిజల్టు కూడా మంచి ఉల్లాస ఉత్సాహాలతో కూడుకున్నదిగా ఉంది. అందుకే ఇప్పుడు లక్ష్యము పెట్టుకోండి - అవ్వాల్సిందే, చెయ్యాల్సిందే, సమాప్తిని సమీపంలోకి తీసుకురండి. మీరు కొంచం కదిలితే సమాప్తి కూడా దూరంగా పోతుంది. సమాప్తిని మీరే సమీపంలోకి తీసుకురావాలి. ఎందుకంటే రాజ్యం చేసేవారు సిద్ధంగా లేకపోతే సమయము ఏమి చెయ్యగలదు? అందుకే అన్ని సాకులు, కారణాలు...... కారణం అన్న పదాన్ని సమాప్తం చెయ్యండి. నివారణను ముందుకు తీసుకురండి. చేతులు కొద్దిమందే ఎత్తినాకానీ దుఃఖితులకు సందేశాన్ని ఇచ్చి ముక్తిని ఇవ్వాలి అన్నదే కదా మీ అందరి లక్ష్యము. వారికి ముక్తిని ఇవ్వనిదే మీరు ముక్తి లోకి వెళ్ళలేరు. కావున వీరిని ముక్తులుగా చెయ్యండి, ఎందుకంటే బాబా వచ్చారు కదా మరి విశ్వంలోని వారిందరికీ వారసత్వాన్ని ఇస్తారు కదా! మీకు జీవన్ముక్తి వారత్వాన్ని ఇస్తారు, కానీ అందరూ పిల్లలే కదా, వారికి కూడా వారసత్వమును ఇవ్వాలి కదా. మరి వారి వారసత్వము ముక్తి, మీ వారసత్వము జీవన్ముక్తి. ముక్తిని ఇవ్వనంతవరకు మీరు కూడా వెళ్ళలేరు. ఇందుకోసం ఈ డ్రిల్ ను చెయ్యండి. 24 సార్లు. రాత్రి పగలు కలిపి. 24 గంటలు ఉన్నాయి, 24 సార్లు చెయ్యండి. నిద్రించే సమయంలో నిద్రించండి. నిద్రించకండి అని బాప్ దాదా చెప్పడం లేదు. నిద్రించండి కానీ పగలు సమయంలో పెంచండి. ఎప్పుడైనా ఫంక్షన్ చేసినప్పుడు పగలంతా పని చేస్తారు కదా, మేలుకుంటారు కదా! అచ్ఛా.
సేవ టర్ను కర్ణాటక జోన్ వారిది:- అచ్చా, మూడు వంతుల క్లాసు కర్ణాటకవారే ఉన్నారు. మంచి అవకాశాన్ని తీసుకుంటారు. ఈ టర్నులో రావడానికి ఎక్కువమందికి అనుమతి దొరుకుతున్నందుకు బాప్ దాదాకు కూడా సంతోషంగా ఉంది. ఎంతమంది సేవాధారులు వస్తున్నారో వారు సేవను కూడా చేస్తున్నారు మరియు తమ భాగ్యాన్ని కూడా తయారు చేసుకుంటున్నారు. కర్ణాటక అనగా నాటకము. నాటకంలో పాత్రను అభినయించడంలో కర్ణాటక నంబరువన్ గా ఉంటుంది కదా. మీరు ఎన్నిసార్లు కర్ణాటక, కర్ణాటక అని అంటారు. నాటకం అన్న పదమును అన్నప్పుడు అనంతమైన నాటకం కూడా గుర్తుకు వస్తుంది కదా! మరి ఈ అనంతమైన నాటకంలో కూడా నంబరువగా రావలసిందే. ఇది పక్కాయే కదా! రావలసిందే, అవ్వవలసిందే, ఏమి చెయ్యవలసి వచ్చినా కానీ, ఎవరెడీ. ఎవరెడీగా ఉన్నారా? ఏమి చెయ్యాల్సి వచ్చినా కానీ అప్పుడే ఎవరెడీ. చేతులెత్తండి. చూడండి, మూడు వంతుల క్లాసు చేసేవారున్నారు. నంబర్ వన్ పాత్ర అనగా నిర్విఘ్నంగా అయి నిర్విఘ్నంగా తయారు చెయ్యడము. కేవలం స్వయాన్ని నిర్విఘ్నంగా చేసుకోవడము కాదు, మీ తోటివారిని కూడా చెయ్యాలి, ధైర్యముందా? కర్ణాటకకు ధైర్యముంటే చేతులెత్తండి. రెండు చేతులు ఎత్తండి, అచ్చా!. ఎంత సమయంలో అవుతారు? ఎంత సమయంలో బాప్ దాదాకు రిజల్టును చూపిస్తారు? ఎవ్వరైనా చెయ్యవచ్చు, ఎవరు ముందు చేస్తారో వారు అర్జునులు. రెండు మూడు టర్నుల తర్వాతనా లేక ఒక టర్ను తర్వాతనా? రెండు-నాలుగు టర్నుల లోపు చేస్తాము అనేవారు చెతులెత్తండి. అచ్చా. విశేషంగా నిమిత్తమైనవారైతే ఇక్కడ ముందున్నారు కదా. అచ్ఛా, సెంటర్ల ముఖ్య అక్కయ్యలు చేతులెత్తండి, సెంటర్ల ముఖ్య అక్కయ్యలు లేక అన్నయ్యలు చేతులెత్తండి. ఏమి ఆలోచిస్తున్నారు? మూడు-నాలుగు టర్నుల తర్వాత మేము ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాము అనే ముఖ్యులు చేతులెత్తండి. ముఖ్యులు ఉన్నారు కదా, అన్నయ్యలు కూడా చేతులెత్తండి. చూపిద్దాము. అచ్ఛా, ఈ రోజు కర్ణాటకవారి టర్ను కావున మీరు నిమిత్తమై చేసి చూపించండి, పక్కా. మీరు మరియు మీకు సంబంధించిన సెంటర్లు, పక్కా? పాండవులు పక్కానా? బాగుంది, అనుకుంటే చేయలేనిది ఏమిటి? కేవలం దృఢత్వం కావాలి. ఏమి చెయ్యను, అవుతుందా అవ్వదా.... ఇలా ఉండకూడదు, జరగవలసిందే, దృఢ నిశ్చయము. ఎక్కడ దృఢత్వం ఉంటుందో అక్కడ సఫలత ఉండనే ఉంటుంది, మీరు మొదటి నంబరుగా ఉదాహరణగా అవ్వడం కూడా భాగ్యమే, అందుకు కూడా ఫలితం ఉంటుంది, బలమూ ఉంటుంది. బాగుంది. మరి కర్ణాటక ఈ అద్భుతాన్ని చేసి చూపిస్తుంది కదా, పక్కా? కర్ణాటకకు విశేషత ఉంది, ఎవరైతే కర్ణాటకకు నిమిత్తమయ్యారో (దాదీ హృదయపుష్ప), వారి విశేషత ఏమిటి? సెంటరు తెరిచే వారి విధానము చాలా బాగుండేది. ఎన్ని సెంటర్లు తెరుచుకున్నాయి? నిమిత్తమైనవారు ఎంతో ఉల్లాస ఉత్సాహాలతో ఉండేవారు మరియు మీరందరూ కూడా నిమిత్తులు, వారి విశేషతను మీలోకి తీసుకురావాలి. కేవలం సెంటరును తయారు చెయ్యకండి, నిర్విఘ్న సెంటరు. సరేనా. ఇష్టమే కదా. కర్ణాటక అద్భుతం చేసి చూపిస్తుంది. మిగతావారు కూడా చెయ్యాలి, కేవలం కర్ణాటక మాత్రమే చేస్తుంది అని కాదు, వారు ధైర్యాన్ని ఉంచారు. ఈ ధైర్యానికి ఫలము మరియు బలము లభిస్తుంది. కర్ణాటకలో సేవా రిజల్టు మంచిగా కనిపిస్తోంది, వృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పుడింకా మైక్ లేక వారసులు ముందుకు రాలేదు. కానీ నిర్విఘ్నంగా అవ్వడము అన్నదానిని ప్రాక్టికల్ లో చూపించినట్లయితే వారు కూడా తయారవుతారు. అచ్ఛా. బాప్ దాదాకు కర్ణాటక వారందరి పట్ల ఉన్న ఆశ ఏమిటంటే- వీరందరూ చేసి చూపించేవారు. అచ్ఛా. ఏమి జరిగినా కానీ, సంకల్పాన్ని పూర్తి చేసి చూపించండి. బాదాకు ఈ ఆశ ఉంది... అచ్ఛా.
మీరు వినిపించిన డ్రిల్ ను ఎంత సమయము చెయ్యాలి?:- కనీసం 10 నిమిషాలు.
బిజినెస్ వింగ్ మరియు ఎడ్యుకేషన్ వింగ్ :- ఈ వర్గాలేవైతే తయారయ్యాయో అందులో సేవను పెంచే ఆసక్తి చాలా ఉంది. మేము ఏదైనా కొత్త విషయాన్ని చేసి చూపించాలి, నిమిత్తంగా చేసి చూపించాలి అన్న ఉత్సాహాన్ని బాప్ దాదా ప్రతి వింగ్ లోనూ చూస్తున్నారు. ఈ రెండు వింగ్స్ కూడా చాలా మంచి సేవను చేస్తున్నాయి. ఎడ్యుకేషన్ వారు కూడా తమ సేవను, తమ తమ విధానము అనుసారముగా చేస్తున్నారు. బిజినెస్ వారు కూడా తమ విధానము అనుసారముగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్క వింగ్ తమ గ్రూపును తయారు చేయండి. ఒక గ్రూపులో ప్రతి వర్గానికి సంబంధించిన వారు ఉండాలి అన్న గ్రూపు ఇంకా తయారుకాలేదు. ఉదాహరణకు బిజినెస్ వింగ్ ఉంది, వారి గ్రూప్ లో అన్ని వర్గాలవారు విడిగా ఒక గ్రూపుగా అవ్వాలి. ఏ ప్రోగ్రాము జరిగినా కానీ ప్రతి వర్గంవారు ఎంతగా ప్రసిద్ధమవ్వాలంటే... వారి సందేశాన్ని విని మేము కూడా చెయ్యగలము అన్న ఉత్సాహము రావాలి. ఒక గ్రూపువారు వి.ఐ.పి. గ్రూపును తయారు చేసారు అని బాప్ దాదా విన్నారు. బాగుంది. ప్రతి వర్గంవారు మొత్తం భారతదేశములో తమ తమ సెంటర్లకు ఈ సేవను ఇవ్వండి. ఎవరినైతే వారు వి.ఐ.పిగా భావిస్తున్నారో, అన్ని వర్గాలవారు ఒకే స్థానంలో తమ తమ ఎంచుకున్న వి.ఐ.పిలతో మీటింగ్ చెయ్యండి. ఈ ప్లానును బాప్ దాదా ఇచ్చారు, కావున అందరూ ఇలా చెయ్యండి మరియు వారిని నిమిత్తంగా చెయ్యండి. విశేషంగా వారి సేవను చెయ్యండి. వారు మైక్ గానే కాక స్నేహి మరియు సహయోగిగా కూడా అవ్వాలి. కేవలం మైక్ గా కాదు, స్నేహి సహయోగిగా కావాలి. ఎందుకంటే స్నేహము మరియు సహయోగంతో పురుషార్థంలో ముందుకు వెళ్ళేందుకు ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇతర వర్గాలు కూడా ఏవైతే వచ్చాయో వాటన్నింటికీ బాప్ దాదా చెప్తున్నారు, ఈ సీజన్లో బాప్ దాదా ప్రతి గ్రూప్ యొక్క రిజల్టును చూడాలని ఆశిస్తున్నారు. మధువనంలోకి రాకపోయినా కానీ తమ వర్గం యొక్క ముఖ్య స్థానం ఏదైతే ఉందో అక్కడ కలుసుకోండి, అప్పుడు బాప్ దాదా రిజల్టును చూసి సీజన్ లాస్ట్ లో ఇటువంటి సహయోగులను కలుసుకోవడం గురించి ఆలోచిస్తారు. మరి విన్నారా, ఇది చెయ్యాలి. ఆశ, ఇచ్చారా? (ఆశ అక్కయ్య ఓ.ఆర్.సి) మీరు ఇచ్చారు కదా! మంచిది, ఒకవేళ వర్గంవారు స్పష్టంగా మరింత తెలుసుకోవాలనుకుంటే వీరి ద్వారా తెలుసుకోండి. బాప్ దాదా ఇలా ఎందుకు చెప్తున్నారంటే, పక్కా బ్రాహ్మణులైన మీరు సమయానికి సాక్షిగా అయి చూడవలసి వస్తుంది, మనసా సేవ ఎంతగా పెరుగుతుందంటే, వారు మీకు తోడుగా అయి సేవను చేస్తారు. వారు సేవను చేస్తారు మీరు సాక్షిగా అయి మనసా సేవ చేయండి. ఎలా అయితే బ్రహ్మాబాబా సేవా యోగ్యులుగా చేసారో, స్వయం సాక్షిగా అయి చూసారు కదా! ఈ విధంగా ఎవరైతే నిమిత్తమైన పెద్ద ఆత్మలున్నారో, సేవను పెంచేవారున్నారో, వారు సమయానికి మరో సేవలో బిజీగా ఉంటారు, కానీ ఈ సేవను మీ అంత యోగ్యంగా తయారై ఉన్న వారు చెయ్యాలి, వారి మాటలో అనుభవాల ఆకర్షణ ఉండాలి, పొజిషన్ యొక్క ఆకర్షణ కాదు. ఆ ప్రభావం చాలా త్వరగా పడుతుంది ఎందుకంటే వారికి, అందుకు నిమిత్తమైనవారికి బాప్ దాదా నుండి ఎక్సాట్రా సహాయం లభిస్తుంది. ఎవ్వరైనా కానీ, ఎవరికైతే సమయాన్నిబట్టి బాప్ దాదా నుండి విశేష వరదానం లభిస్తుందో, దాని రిజల్టు గురించి వారికి కూడా తెలియదు. కానీ ఇది బాప్ దాదా అందించిన ఎక్సాట్రా సహాయము, వరదానము. వారు మాట్లాడరు, వరదానము మాట్లాడుతుంది అందుకే ఇటువంటి ఆత్మలను తయారు చెయ్యండి. మరి బాప్ దాదా సమయానుసారంగా వారికి వరదానాలను ఇచ్చి ముందుకు తీసుకు వెళ్తారు. అన్ని వర్గాలవారికి బాప్ దాదా చెప్తున్నారు. మంచిగా చేస్తున్నారు, ముందుకు కూడా వెళ్తున్నారు, బాప్ దాదా అన్ని వర్గాలవారికి అభినందనలు తెలుపుతున్నారు మరియు మిగతా 3-4 వర్గాలేవైతే వచ్చాయో వారు కూడా లేవండి.
యూథ్, పొలిటీషియన్, స్పోర్ట్స్, అడ్మినిస్ట్రేషన్:- ఈ ఒక్క విషయము అందరూ కలిసి చెయ్యాలి, అందుకే అందరినీ కలిపి లేపడం జరిగింది. వర్గాలు చేసే సేవను చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. కానీ మీరు సాక్షిగా అవుతూ ఉండండి. ఇప్పుడు మీ పని మరో గ్రూపును తయారు చెయ్యడము, ఎందుకంటే అకస్మాత్తుగా ఎటువంటి పరిస్థితులు తయారవుతాయంటే మీరు ఎంతో తపస్సు చెయ్యవలసి వస్తుంది, మనసా సేవను చెయ్యవలసి వస్తుంది. నాజూకు సమయము రానున్నది మరియు పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనసా సేవ అంత ఫోర్సుగా జరగడం లేదు. జరుగుతుంది, కొందరి మనసా సేవతో ప్రభావం కూడా పడుతోంది. కానీ చాలా తక్కువ. లాస్ట్ సమయంలో మనసా సేవ తప్ప వాచ జరుగదు. ఎవరినైతే నిమిత్తం చేస్తామో వారికి కూడా ఇప్పుడే అవకాశము లభిస్తుంది. నాజూకు సమయము వచ్చినప్పుడు వారికి కూడా అవకాశం లభించదు, అందుకే ఇప్పుడు వారికి అవకాశాన్ని ఇవ్వండి, సమీపంగా వస్తారు, వారసులుగా కూడా అవ్వగలరు ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు ప్రతి గ్రూపు చేసే కార్యాలకు సహకరిస్తుంది. ఏదో జరుగనుంది, జరగాలి అని అందరూ భావిస్తున్నారు. ఏమి జరగబోతోంది అని పాపం వారికి తెలియదు, కానీ పరివర్తన కావాలి అని ఆశిస్తున్నారు. మీకైతే తెలుసు కదా పరివర్తన జరుగనుంది మరియు ఏమి పరివర్తన జరుగనుంది అని మీకు తెలుసు. ఏమి జరుగుతుంది, ఏమి జరుగుతుంది అని వారు చింతలో ఉన్నారు! మా రాజ్యం రానుంది, సంతోషంగా ఉంది అని మీకు తెలుసు. అతిలోకి వెళుతోంది మరింత అతిలోకి వెళ్ళి ఆది రావలసిందే అందుకే సేవ చేసే మీరు ఇప్పుడు త్వరత్వరగా జల్లెడ పట్టండి మరియు వారిని ముందుకు తీసుకువెళ్ళండి. మంచిది మంచిది అని అంటున్నారు, కానీ ఇప్పుడు వారిని మంచిగా తయారు చేసే సేవను ఇవ్వండి. మీరు సాక్షిద్రష్టలుగా అయ్యి వారికి శక్తిని ఇవ్వండి. అచ్ఛా! స్పోర్ట్ వారు కూడా వచ్చారు. యూథ్ వింగ్ వారి రజతోత్సవాలు. పొలిటీషియన్లు ఈ ప్లానును తయారు చేసారు, బాగుంది. ఇవన్నీ ముఖ్యమైన వింగ్స్. అభినందనలనైతే బాబా అందరికీ ఇస్తున్నారు. గ్రూపును తయారు చేసినప్పుడు మరిన్ని అభినందనలను ఇస్తారు. అబూకే తీసుకురండి అని అనడం లేదు. ముందుగా మీ వద్ద తయారు చెయ్యండి, తర్వాత బాప్ దాదా సమాచారాన్ని వింటారు, రిజల్టును చూస్తారు, తర్వాత మధువనానికి పిలుస్తారు. మరి ఎవరైతే వచ్చారో వారందరూ భవిష్య ప్లాను గురించి ఆలోచించారా! చేతులెత్తండి. ఏమి చెయ్యాలో అర్థమయిందా? ఇప్పుడు త్వరత్వరగా చెయ్యండి. అకస్మాత్తుగా ఏమైనా జరగవచ్చు, సేవ చేసేందుకు మీకు సమయం కూడా లభించకపోవచ్చు. ఇటువంటి పరిస్థితులు కూడా మధ్య మధ్యలో రావచ్చు. అందుకే ఎలా అయితే తీవ్ర పురుషార్థి గ్రూపును తయారు చేసారో, అలాగే తీవ్ర సేవా గ్రూపును తయారు చెయ్యండి, అచ్చా! బాప్ దాదా చాలా చాలా అభినందనలను తెలుపుతున్నారు.
డబుల్ విదేశీయులు:- ఇప్పుడు డబుల్ విదేశీయులు అని అనవద్దు, డబుల్ పురుషార్థులు. సరేనా. డబుల్ పురుషార్థులే కదా. డబుల్ పురుషార్ధీ పిల్లలు మధువనంలో సేవకోసం భిన్న భిన్న రకాలుగా ఏ ఛాన్సులనైతే తీసుకుంటారో, అది బాప్ దాదాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే పరస్పర సంగఠన నుండి బలము లభిస్తుంది, ఒక చోట ఒక సమస్య ఉంటుంది, మరోచోట మరో సమస్య ఉంటుంది. ఇతరుల అనుభవాలతో, పెద్దల డైరెక్షతో, పాలనతో సహజమైపోతాయి. వాతావరణం నుండి కూడా బలము లభిస్తుంది, బాధ్యత తగ్గుతుంది. అక్కడ సమయము తక్కువ లభిస్తుంది. ఇక్కడ సమయము ఫ్రీగా లభిస్తుంది. ఒకే పని కోసం అక్కడ అనేక రకాల బాధ్యతలు ఉంటాయి మరియు సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఇక్కడ ఒకే పని ఉంటుంది - సేవ లేక స్వ కళ్యాణము, బాప్ దాదా ఏమి చూసారంటే రోజు రోజుకీ సేవా రూపురేఖలు మంచిగా పెరుగుతూ ఉన్నాయి. ఫారెన్ యూథ్ రిజల్టును కూడా విన్నాము. ప్రతి ఒక్కరూ ఎవరైతే సేవలో ముందుకు వెళ్తున్నారో, బాప్ దాదా రెండు విషయాలు దగ్గరకు రావడాన్ని గమనించారు- ఒకటి ప్రభుత్వం లేక విశేషమైన వ్యక్తులకు సమీపంగా వెళ్ళే అవకాశము బాగా లభిస్తోంది. నెమ్మది నెమ్మదిగా పరస్పరంలో ప్లాను తయారు చేసుకుని ప్రభుత్వంవరకు, తమ తమ దేశాల ప్రభుత్వాల వరకు చేరుకునేందుకు సాధనమవుతుంది. బాగుంది. విదేశాలలో కూడా పేరు ప్రసిద్ధమవ్వాలి, దేశంలో అయితే అవ్వాల్సిందే. యూథ్ గ్రూపు గురించి కూడా బాప్ దాదా సమాచారాన్ని విన్నారు, ఇండియా మరియు విదేశాల సమాచారము, ఇండియాలో కూడా ఇప్పుడు ప్లాను తయారు చేస్తున్నారు. కానీ ముందుగా ప్రభుత్వం వరకు సందేశం వెళ్ళే విధంగా ప్లాను తయారు చెయ్యండి. 'ప్రారంభంలో బాప్ దాదా ఏమి చూసారంటే యూథ్ గ్రూపును ప్రెజిడెంట్, ప్రైమ్ మినిస్టర్ వద్దకు తీసుకువెళ్ళారు. ముందు గ్రూపు వెళ్ళింది. ఇప్పుడైతే అన్ని సాధనాలు మీకు తోడుగా ఉన్నాయి. ఇప్పుడు మీ గురించి టి.విలో కూడా రాగలదు కేవలం కలిపించడం కాదు, వారికి వినిపించే ఛాన్సును తీసుకోండి. యూథ్ ను కలవాలి మరియు కొద్ది సమయంలోనే వీరు ఏమి చేస్తారు అన్నది వినాలి. మరి ప్రతి వర్గంవారు ఇటువంటి గ్రూపును తయారు చెయ్యండి, ఆ గ్రూపును మినిస్ట్రీ వరకు చేర్చాలి. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వరకు సందేశం వెళ్ళాలి. విదేశాలలో కూడా వృద్ధి జరుగుతుంది, జరుగుతూ ఉంటుంది. మిగిలి ఉన్న సెంటర్లు కూడా ప్లాన్లు తయారు చేస్తూ ఉన్నాయి. స్వ పురుషార్థపు అటెన్షన్ కూడా ఉంది మరియు అండర్ లైన్ చేసి స్వ పురుషార్థంలో కూడా నవీనతను తీసుకురండి. సరేనా. అచ్ఛా!
మీ అందరికీ కూడా మంచిగా అనిపిస్తుంది కదా, విదేశీయులు ప్రతి గ్రూపులో కావడం మీ అందరికీ నచ్చుతుంది కదా! ఎందుకంటే మన పరివారంలో ఇది కూడా నవీనతయే. ఫారెన్ లోని అన్ని వెరైటీవారు వస్తున్నారు. ఒకే స్థానంలో ఏ విశేషమైన దేశము మిగిలి ఉండకుండా ఉండే పరివారము ఎక్కడా ఉండదు. ఇప్పుడు చూడండి, ముస్లిం దేశాలు కూడా ముందుకు వస్తున్నాయి. అరేబియన్ కూడా వస్తోంది. మరి వెరైటీ పరివారము, ఒక్కరు కూడా వంచితమవ్వకూడదు. పిల్లలందరి వద్దకు చేరుకుని బాబా సందేశాన్ని ఇచ్చి వారసులుగా చెయ్యాలి అన్నదే లక్ష్యము. పరివారం నుండి తప్పిపోయిన వారిని పరివారంలోకి తీసుకురావాలి. ఇది చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు మరియు సంతోషాన్ని పెంచుతూ ఉండండి. ఇప్పుడైతే మీకు అనేక ఆహ్వానాలు లభించనున్నాయి, ఎందుకని? అంతిమంలో ఇక్కడే ఉండాలి, ఇదే, ఇదే, ఇదే. ఇప్పుడు అందరూ తమ తీరాలను విడిచి బాబా సంబంధంలో లేక సందేశం వినడంలో అవకాశం లభించవలసిందే. లేకపోతే మీకు అందరి ఫిరియాదులు లభిస్తాయి. మనస్సు ద్వారా కూడా ఆత్మలను ఆకర్షించి ముందుకు తీసుకువెళ్ళవచ్చు. సంబంధ సంపర్కాలలోకి తీసుకురావచ్చు. ఇప్పుడు మనసా సేవ తక్కువగా ఉంది, కానీ ఇప్పటి నుండి చేస్తే అంతిమంలో ఎవ్వరూ మిగలరు. ఎప్పుడైనా సమయం లభిస్తే ఫరిస్తా రూపంలో ఎలా అయితే బ్రహ్మా బాబా మీ అందరినీ మనసా సేవ ద్వారా ఆకర్షించారో, ఇంట్లో కూర్చునే ధైర్యాన్ని ఇచ్చారు, దానితో మీరు వచ్చేసారు, అలాగే మీరు కూడా ఫరిస్తా రూపంలో మనసా సేవను చెయ్యవచ్చు. ఫరిస్తాగా అయి ఈ అనుభవాన్ని కూడా పెంచుకుంటూ ఉండండి. ఎందుకంటే ఎలా అయితే సాగరంలో అకస్మాత్తుగా అలలు పెరుగుతాయో, వేగవంతమైన అలలు మధ్య మధ్యలో వస్తాయి కదా, అలాగే ఇప్పుడు ఎంతగా సమయము ముందుకు వెళ్తుందో అంతగా మధ్యమధ్యలో దుఃఖపు, అశాంతిమయ అలలు పెరుగుతూ ఉంటాయి. ఏదో ఒక కారణంతో దుఃఖపు అల పెరుగుతుంది, అందుకే వాచకోసం ఇతరులను తయారు చెయ్యండి. కానీ పునాది పక్కాగా ఉండాలి. తను ప్రభావాన్ని చూపేవారిగా ఉండకూడదు. వాస్తవిక జ్ఞానపు ప్రభావాన్ని చూపేవారు కావాలి. అప్పుడప్పుడు బ్రాహ్మణ పిల్లలు కూడా తమ ప్రభావాన్ని వేస్తూ ఉంటారు, ఏ సేవలో అయినా తండ్రి వైపుకు ఆకర్షితులను చెయ్యండి. వ్యక్తిగతంగా కాదు. ఒకవేళ వ్యక్తిగతంగా తమ వైపుకు ఆకర్షించుకుంటే దానికి పుణ్యం జమ అవ్వదు. అచ్ఛా!
నలువైపుల పురుషార్థంలో ముందుకు సాగేవారికి, 15 రోజుల పనిని బాప్ దాదా ఇచ్చారు, బాప్ దాదా ఎలా అయితే ఆ కార్యాన్ని ఇచ్చారో, దాని అనుసారముగా మనసా, వాచ, కర్మణ, సమయము, సంకల్పము యథార్థంగా ఉన్నాయి అనేవారు చేతులెత్తండి. అచ్ఛా! చాలా కొద్దిమంది ఎత్తుతున్నారు. ఎవరైతే 15 రోజుల కార్యాన్ని మంచి రిజల్టుతో చేసారో, వారు చేతులెత్తండి. కొద్దిమంది చేసారు, మిగతావారి రిజల్టు కూడా వచ్చింది. ఇక్కడ లేనివారి రిజల్టు కూడా వచ్చింది. చాలా వరకు వ్యర్థ ఆలోచనలపై మంచి అటెన్షన్ ను ఉంచారు. కానీ పూర్తి బ్రాహ్మణ పరివారమంతా ఒకే విధంగా పురుషార్థంలో నడుచుకోవాలి, ఆ సంగఠనా రిజల్టును ఇప్పుడు ఇంకా తీసుకురావాలి. రిజల్టులో మెజారిటీ అన్ని విషయాలలో ఒకే విధమైన మంచి రిజల్టు రావాలి, ఇది తక్కువగా కనిపిస్తోంది. కొందరిది కొన్నింటిలో, మరి కొందరిది మరి కొన్నింటిలో ఉంది. ఇప్పుడు ఈ డ్రిల్ లో అందరూ సదా కోసం తమ పురుషార్థపు గతిని తీవ్రం చేసుకోవాలి. ఎందుకంటే బహుకాలం కావాలి. తర్వాత చేసినా కానీ బహుకాలపు పురుషార్థానికి కూడా సంబంధం ఉంది, అందుకే అందరూ అటెన్షన్ ను ఇవ్వండి, నేను చెయ్యాలి, ఎవరు చేసినా చెయ్యకపోయినా కానీ నేను ఎవరెడీగా కావలసిందే. అచ్ఛా -
నలువైపుల ఉన్న బాబా స్నేహులకు, ఎవరైతే స్నేహులుగా ఉంటారో వారు తప్పకుండా సహయోగులుగా ఉంటారు. స్నేహానికి రిటర్నుగా వారు ప్రత్యక్షంగా ప్రతి కార్యంలో తనువు-మనసు-ధనము-జనములో ఇతరులకు సహయోగులుగా తప్పక అవుతారు. ఇటువంటి స్నేహి మరియు సహయోగి పిల్లలు, ఎవరైతే సదా తండ్రి ప్రేమలో లవ్ లీనమై ఉంటారో, లవ్ లో కాదు, లవ్ లీన్ అయ్యి ఉండేవారికి మరియు సదా తండ్రి యొక్క సర్వ కార్యాలలో సమయాన్ని, సంకల్పాన్ని పెట్టేవారికి... ఎందుకంటే సంగమయుగంలో సమయము మరియు సంకల్పానికి ఎంతో విలువ ఉంది. ఒక్క జన్మలో అనేక జన్మల పాలబ్ధాన్ని తయారు చేసుకునేవారికి, ఇటువంటి తీవ్ర పురుషార్థులకు, ప్రతి గుణము, ప్రతి శక్తిని, ప్రతి సమయానుసారంగా కార్యంలో వినియోగించే గుణ సంపన్నులకు, శక్తి సంపన్నులైన పిల్లలకు చాలా చాలా పదమా పదమారెట్లు ప్రియస్మృతులు మరియు నమస్తే.
నిర్మల దీదీతో:- అచ్ఛా, వెళ్ళి వచ్చారు. (ఆస్ట్రేలియా వెళ్ళారు) అచ్ఛా, రెండు వైపుల పాత్రను పోషిస్తున్నారు, చాలా బాగుంది. రిజల్టు కూడా మంచిగా ఉంది. (దాదీ జానకితో):- వీరు కూడా వెళ్ళి వచ్చారు. చాలా మంచి ఆటను ఆడారు. ఆటయే కదా. (మన వద్ద పెట్టబడిన సోలార్ సిస్టమ్ గురించి అన్ని పేపర్లలో వచ్చింది.) ఈ సోలార్ ఏదైతే చేస్తున్నారో అది ఒక సమయం ఎలా వస్తుందంటే- అన్ని వైపుల అంధకారం ఉంటుంది, కానీ మీ స్థానంలో మాత్రం వెలుగు ఉంటుంది. ఈ ఆటను కూడా అందరూ చూస్తారు. (యూథ్ ఇప్పుడు ప్రభుత్వం వరకు వెళ్తారు, ఇటువంటి ప్రోగ్రామును తయారు చెయ్యడం జరిగింది) వీరు మంచి యూథ్ అని ప్రభుత్వానికి అర్థం కావాలి. ఇది కూడా అయిపోతుంది.
బృజ్ మోహన్ అన్నయ్యతో - సేవ చేస్తున్నారు, సేవ చేస్తూ ఉంటారు. ఏ సూచనలైతే లభిస్తు ఉంటాయో వాటిని ప్రాక్టికల్ లోకి తీసుకు వస్తూ ఉన్నారు, ఇందుకు అభినందనలు. (రమేష్ అన్నయ్య, ఉష అక్కయ్యలతో) ఇద్దరూ మంచిగా ఉన్నారు కదా, ఎవరైతే నిమిత్తమైన వారుంటారో వారిని చూసి అందరికీ ఉత్సాహము వస్తుంది, వీరు చేస్తున్నట్లుగా మేము కూడా చేస్తాము అని అనిపిస్తుంది. ఇతరులకు ఉల్లాస ఉత్సాహాలను ఇవ్వడంలో మీరు నిమిత్తులు, చాలా బాగా చేసారు.
పర్ దాదీతో:- చాలా మంచి పాత్రను అభినయిస్తున్నారు. విష్ణు సమానంగా పడుకునే పాత్రను అభినయిస్తున్నారు. మిమ్మల్ని చూసి ఇలా కూడా పాత్రను వహించవచ్చు అని అందరికీ ఉత్సాహము వస్తుంది. చాలా మంచిది.
Comments
Post a Comment