15-12-2008 అవ్యక్త మురళి

  15-12-2008         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 “ఒకే రాజ్యము, ఒకే ధర్మము, లా అండ్ ఆర్డరుల స్థాపనా సమయములో స్వయాన్ని పరివర్తన చేసుకొని విశ్వ పరివర్తకులుగా అవ్వండి”

           ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న తమ అల్లారు ముద్దు పిల్లలను చూస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ కోట్లలో కొద్దిమందికే ప్రాప్తిస్తుంది. పరమాత్ముని ప్రేమలో బాప్ దాదా పిల్లలైన ప్రతి ఒక్కరినీ మూడు సింహాసనాలకు అధికారులుగా చేసారు. ఒకటి- స్వరాజ్య అధికారపు భృకుటి సింహాసనము, రెండవది- బాప్ దాదా హృదయ సింహాసనము, మూడవది- విశ్వ రాజ్యాధికారపు సింహాసనము. ఈ మూడు సింహాసనాలను బాబా తమ స్నేహులైన మురిపాల పిల్లలకు ఇచ్చారు. కావున ఈ మూడు సింహాసనాలు సదా స్మృతిలో ఉన్నట్లయితే పిల్లలైన ప్రతి ఒక్కరికీ ఆత్మిక నషా ఉంటుంది. మరి పిల్లలందరూ బాబా ద్వారా ప్రాప్తించిన వారసత్వమును చూసి సంతోషంగా ఉంటున్నారు కదా! హృదయంలో స్వతహాగా ఓహో బాబా ఓహో! మరియు ఓహో నా భాగ్యము ఓహో! అనే గీతము సదా వినిపిస్తూ ఉంటుంది. స్వప్నములో కూడా లేనిది ప్రాక్టికల్ జీవితములో లభించింది. సింహాసనంతో పాటు బాప్ దాదా ఈ సంగమయుగంలో డబుల్ కిరీటం ద్వారా ఎగిరే కళలో అనుభవజ్ఞులుగా కూడా చేసారు.

           బాప్ దాదా నలువైపుల ఉన్న డబుల్ కిరీటము, పవిత్రతా రాయల్టీని కలిగిన డబుల్ కిరీటధారీ పిల్లలను చూస్తున్నారు. బాప్ దాదా ఈ రోజు నలువైపుల ఉన్న పిల్లల పురుషార్థపు వేగాన్ని పరిశీలించారు, ఎందుకంటే సమయపు వేగాన్నయితే మీరందరూ చూస్తున్నారు మరియు తెలుసుకుంటున్నారు. మరి బాప్ దాదా ఏమి చూసారంటే- ప్రతి ఒక్కరికీ బాబా ద్వారా లభించిన రాజ్య భాగ్యపు వారసత్వము, తమ రాజ్యము, భవిష్య ప్రాప్తి.... భవిష్యత్తులో ఎలా అయితే మీ అందరి సంస్కారాలు నేచురల్ గా (సహజంగా) మరియు నేచర్ (స్వాభావికంగా) ఉంటాయో అవి ఇప్పటి నుండి బహుకాలపు సంస్కారాలుగా అనుభవం కావాలి, ఎందుకంటే ఈ క్రొత్త ప్రపంచం మీ అందరి క్రొత్త సంస్కారాల ద్వారానే తయారవుతుంది. మరి క్రొత్త ప్రపంచపు విశేషతలను అనుభవం చేసుకుంటున్నారు కదా! మన రాజ్యంలో ఏమవుతుంది! నషా ఉంది కదా. మా రాజ్యము, మా క్రొత్త ప్రపంచము వచ్చేసింది అని మనస్సు చెప్తుంది కదా, మరి క్రొత్త ప్రపంచపు విశేషతలు పిల్లల పురుషార్టీ జీవితంలో ఎంతవరకు ఇమర్జ్ అయ్యాయి అని బాప్ దాదా చూస్తున్నారు. క్రొత్త సంస్కారాలు, క్రొత్త ప్రపంచంలోని విశేషతలు ఏమిటో మీకు తెలుసు కదా! అందరి బుద్ధిలో క్రొత్త ప్రపంచపు విశేషతలు ఇమర్జ్ అయి ఉన్నాయి కదా! తెలుసు కదా! గానం చేస్తారు కూడా, తెలుసు కూడా. ఒక్కొక్క విశేషత నాలో ఎంతవరకు ఇమర్జ్ అయి ఉంది? అని పరిశీలించుకోండి. మొదటి ముఖ్య విశేషత - ఒకే రాజ్యము, ఎలా అయితే అక్కడ ఒక్క రాజ్యము స్వతహాగా ఉంటుందో, మరో రాజ్యము ఉండదో అలాగే ఈ సంగమ జీవితంలో కూడా ఒక్క రాజ్యము ఉందా లేక అప్పుడప్పుడూ మరో రాజ్యం కూడా వచ్చేస్తోందా? అని పరిశీలించుకోండి. ఒకవేళ నడుస్తూ నడుస్తూ స్వరాజ్యంతో పాటు మాయా రాజ్యం కూడా నడుస్తుంటే మరి ఒక్క రాజ్యపు సంస్కారాలు ఉంటాయా? ఒక రాజ్యంతో మరో రాజ్యం కూడా నడవదు కదా? పరమాత్ముని శ్రీమతపు రాజ్యము ఉందా లేక అప్పుడప్పుడూ మాయ ఒత్తిడి కూడా ఉంటోందా? మనసులో మాయా రాజ్యం అయితే ఉండటం లేదు కదా? ఇది పరిశీలించుకోండి. ఈ విషయాలలో మీ చార్టును పరిశీలించుకోండి. ఇప్పుడు సంగమంలో ఒక్క పరమాత్మ రాజ్యమే ఉందా లేక మాయ ఒత్తిడి కూడా ఉంటోందా? పరిశీలించుకున్నారా? ఇప్పుడే పరిశీలించుకోండి. మీ చార్టునైతే చూసుకుంటూ ఉంటారు కదా. ఒకవేళ ఇప్పటి వరకూ రెండు రాజ్యాలు ఉన్నట్లయితే ఒక్క రాజ్యానికి అధికారులుగా ఎలా అవుతారు? శ్రీమతంతో పాటు మాయా మతం కూడా మిక్స్ అయిపోతుందా? అలాగే ఒకే ధర్మము - ఒకే రాజ్యము ఉన్నప్పుడు ధర్మముకూడా ఒక్కటే ఉంటుంది. ధర్మము అనగా ధారణ. మరి మీ విశేష ధారణ ఏమిటి? పవిత్రతా ధారణ. మరి పరిశీలించుకోండి. సదా మనసా, వాచ, కర్మణ, సంబంధ-సంపర్కములలో సంపూర్ణత మరియు సదా పవిత్రతా  స్వభావము సహజంగా ఉన్నాయా? ఎలా అయితే అక్కడ మన రాజ్యంలో పవిత్రతా స్వధర్మము స్వతహాగా ఉంటుందో అలాగే ఈ సమయంలో పవిత్రతా ధారణ నేచురల్ గా మరియు నేచర్ గా ఉందా? ఎందుకంటే మీ అనాది మరియు  ఆది స్వరూపము పవిత్రత అని మీకు తెలుసు. మరి, ఒకే ధర్మము అనగా పవిత్రత నేచురల్ గా ఉందా? అని పరిశీలించుకోండి. ఏదైతే నేచర్ గా ఉంటుందో అది వద్దనుకున్నా పని చేసేస్తుంది. కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణ  చేసేటప్పుడు ఏమనంటారు? చాలా మధురాతి మధురంగా మాట్లాడుతారు, అలా కోరుకోవడం లేదు కానీ, ఒక్కోసారి మనసులో, ఒక్కోసారి వాచలో ఏదో ఒక అపవిత్రతా అంశము ఇమర్జ్ అయిపోతూ ఉంటుంది. అనేక జన్మల సంస్కారము  కాబట్టి అలా అవుతుంది. మరి ఒకే ధర్మము అనగా పవిత్రతా ధారణ నేచర్ గా మరియు నేచురల్ గా ఉండాలి.  వాచలో ఆవేశం వచ్చినా కూడా, క్రోధం లేదు కానీ కొద్దిగా ఆవేశం వచ్చింది అని అంటారు. అయితే ఈ ఆవేశం ఏమిటి? క్రోధం  సంతానమే కదా. మరి ఒక్క ధర్మపు సంస్కారము ఎప్పుడు నేచురల్ గా అవుతుంది? కావున పరిశీలించుకోండి, కానీ పరిశీలించుకోవడంతో పాటు బాబా ద్వారా లభించిన శక్తుల ద్వారా పరివర్తన కండి. ఇప్పుడు బాప్ దాదా ముందునుండే  అటెన్షన్ ఇప్పిస్తున్నారు - ఇప్పటికైనా పరిశీలించుకుని పరివర్తన అవ్వడానికి తీవ్ర పురుషార్ధం చేసినట్లయితే ఇంకా మార్జిన్ ఉంది, కానీ కొద్ది సమయం తర్వాత అకస్మాత్తుగా టూ లేట్ (చాలా ఆలస్యము) అన్న బోర్డు పెట్టబడుతుంది.  బాబా అయితే చెప్పనే లేదు అని అప్పుడు అనకండి. ఇప్పుడు పురుషార్థం చేసే సమయము గడిచిపోయింది, కానీ తీవ్ర పురుషార్థం చేసేందుకు ఇప్పుడు కూడా కొంత సమయం ఉంది. కావున పరిశీలించుకోండి, కానీ కేవలం  పరిశీలించుకోవడమే కాకుండా దానితోపాటు పరివర్తనను కూడా తీసుకురండి. కొంతమంది పరిశీలించుకుంటారు, కానీ పరివర్తన అయ్యే  శక్తి ఉండదు. పరిశీలన మరియు పరివర్తన రెండూ తోడుతోడుగా ఉండాలి. మీ అందరి స్వమానము  మరియు మీ అందరి మహిమ ఏమిటి? టైటిల్ ఏమిటి? మాస్టర్ సర్వశక్తిమంతులు. మాస్టర్ సర్వశక్తివంతులేనా లేక శక్తివంతులా? మాస్టర్ సర్వశక్తివంతులు అని ఎవరైతే అంటారో వారు చేతులెత్తండి. అచ్ఛా! మరి మాస్టర్  సర్వశక్తివంతులకు అభినందనలు, కానీ మాస్టర్ సర్వశక్తివంతులయ్యుండి కూడా పరివర్తన చేసుకోలేకపోతే ఏమని అంటారు? తమ సంస్కారాన్ని, నేచర్‌ను పరివర్తన చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోలేకపోతే ఏమంటారు? మాస్టర్  శక్తివంతులమా లేక మాస్టర్ సర్వశక్తివంతులమా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. మాస్టర్ సర్వశక్తిమంతులు 'ఇది చెయ్యాలి' అని సంకల్పం చెయ్యగానే అది జరిగే తీరుతుంది. అవుతుందిలే, చూద్దాము లే...... ఇలా జరుగదు. మరి  ఇప్పుడు సమయ ప్రమాణంగా రిజల్టు ఎలా ఉండాలంటే- ఏదైతే ఆలోచిస్తారో, అది సంకల్పము మరియు స్వరూపంగా అవ్వడము రెండూ ఒకేసారి జరగాలి.

           ఇప్పుడు క్రొత్త సంవత్సరము, అవ్యక్త సంవత్సరము రానుంది. అవ్యక్త పాలన మొదలై 40 సంవత్సరాలు కావస్తోంది. అవ్యక్త పాలన మరియు వ్యక్త రూప పాలన మొదలై 72 సంవత్సరాలు అయిపోయాయి. మరి ఇద్దరు తండ్రుల  పాలనకు రిటర్న్ ను బాప్ దాదాకు ఇవ్వరా! పాలన ఏమిటి మరియు ప్రాక్టికల్ ఏమిటి? అన్నది ఆలోచించండి. బాప్ దాదా ఏమి చూసారంటే, నిర్లక్ష్యము మరియు రాయల్ సోమరితనము! రాయల్ సోమరితనము అంటే -  అవుతుందిలే, అవుతాములే, చేరుకుంటాము... మరియు నిర్లక్ష్యము అంటే చేస్తున్నాము....ము, ము... ఇదైతే అవ్వవలసిందే, ఇదైతే చెయ్యవలసిందే, చెప్పడంలో మరియు చెయ్యడంలో తేడా వచ్చేస్తుంది. బాప్ దాదా ఒక దృశ్యము  చూసి చాలా చిరునవ్వు నవ్వుతారు, ఏమంటారు? ఇది జరిగిపోతే, ఇది చేసేస్తే నేను చాలా మంచిగా ముందుకు వెళ్ళగలను అని అంటారు. ఇతరులను పరివర్తన చేసే వృత్తి ఉంటుంది కానీ స్వ పరివర్తనా వృత్తి అక్కడక్కడ  తక్కువైపోతుంది. ఇప్పుడు ఇతరులను చూసే వృత్తిని పరివర్తన చేసుకోండి. ఒకవేళ చూడాలనుకుంటే విశేషతను చూడండి. ఇలా అయితే జరుగుతూనే ఉంటుంది, ఇలా అయితే అవుతూనే ఉంటుంది, వీరు కూడా చేస్తున్నారు  కదా.... ఇటువంటి భావనను తగ్గించండి. స్వయాన్ని చూసుకోండి, బాబాను ఎదురుగా పెట్టుకోండి. ఇక ఎవరు ఉన్నా కానీ, మహారథి కావచ్చు, మధ్యవారు కావచ్చు, పురుషార్థంలోని ఏదో ఒక లోపాన్ని పరివర్తన చేసుకుంటూనే ఉన్నారు.  అందుకే సీ ఫాదర్, సీ డబుల్ ఫాదర్. బ్రహ్మాబాబాను చూడండి, శివ బాబాను చూడండి. బాబా మిమ్మల్ని తమ హృదయ సింహాసనంపై కూర్చోపెట్టుకున్నారు మరియు మీరు కూడా మీ హృదయ సింహాసనంపై బాబాను  కూర్చోపెట్టుకున్నారు. సీ ఫాదర్(తండ్రిని చూడండి) అని మీ స్లోగన్ ఉంది. సీ సిస్టర్, సీ బ్రదర్ అన్న స్లోగనే లేదు. ఏదో ఒక లోపము అందరిలో ఇప్పటికీ ఉంది, కానీ ఒకవేళ ఇతరులను చూడాలంటే విశేషతను చూడండి. వారిలో  ఉన్న ఏ లోపాన్ని వారు తీసేస్తున్నారో దానిని చూడకండి. రెండవ విషయము- మీ రాజ్యంలో, మీ రాజ్యం గుర్తుంది కదా. నిన్న ఉంది, రేపు రాబోతోంది. మీ బుద్ధిలో, నయనాలలో మీ రాజ్యం స్పష్టంగా వచ్చేసింది కదా! ఎన్ని సార్లు  రాజ్యం చేసారు? లెక్కపెట్టారా? అనేకసార్లు రాజ్యం చేసారు. అనడంతోటే ముందుకు వచ్చేస్తుంది. మీ రాజ్యాధికార రూపము మరియు శ్రేష్ఠ రాజ్యము, మీ రాజ్యంలో లా అండ్ ఆర్డర్ స్వతహాగా కొనసాగుతాయి. అందరూ జ్ఞానవంతమైన  సంస్కారాలు కలవారే. లా ఏమిటో, ఆర్డర్ ఏమిటో అందరికీ తెలుసు. దానిని ఇప్పుడు మీ జీవితంలో కూడా చూసుకోండి - బాబా ఆర్డర్ లో నడుస్తున్నారా లేక ఒక్కోసారి మాయా అర్డర్ కూడా నడుస్తోందా? శ్రీమతం కాకుండా ఒక్కోసారి  పరమతము, మన్మతములో అయితే నడవడం లేదు కదా? మరి లా ఏమిటి? నిశ్చింత చక్రవర్తి, ఏ చింతా లేదు, ఎందుకంటే సర్వ ప్రాప్తులు ఉన్నాయి. అలాగే పరిశీలించుకోండి - సంగమయుగపు శ్రేష్ఠ జన్మలో కూడా బాప్ దాదా  ఇచ్చిన సర్వ ప్రాప్తులు ఉన్నాయా, ఇవి భగవంతుని ప్రసాదము వంటివి కదా, ప్రసాదానికి ఎంతటి మహత్వము ఉంటుంది! మరి బాబా ఇచ్చిన ప్రాప్తులన్నీ ప్రభు ప్రసాదముగా ప్రాప్తించాయి. ప్రభు ప్రసాదానికి మహత్వము ఉంది! ఇది  వారసత్వము కూడా, అధికారము కూడా మరియు ప్రసాదము కూడా, మరి లా అండ్ ఆర్డర్, రెండింటిలో సంపన్నంగా ఉన్నారా? అని పరిశీలించుకోండి.

           బాప్ దాదా ఒక విషయము ఏమి చూసారంటే- మెజారిటీ పిల్లలు లభించిన పరివర్తనా శక్తిని సమయానికి కార్యంలో వినియోగించినట్లయితే ఎటువంటి కష్టమూ ఉండదు. చూడండి, ఈ విషయములో అందరికీ అనుభవము  ఉంది. ఒకవేళ ఎప్పుడైనా, ఏ విధంగానైనా మాయతో ఓటమి జరిగితే, దానికి కారణము రెండు పదాలు. భాషణ చేసేటప్పుడు, క్లాస్ చేసేటప్పుడు ఈ రెండు పదాలు పడవేసేవి మరియు పైకి తీసుకువెళ్ళేవి కూడా అని అంటారు  కదా, ఆ రెండు పదాలు ఏమిటో తెలుసు కదా, అందరి మనస్సులోకి వచ్చేసాయి. ఆ రెండు మాటలు- నేను, నాది. భాషణలో చెప్తారు కదా, క్లాసు కూడా చేయిస్తారు కదా, బాప్ దాదా క్లాసు కూడా వింటారు, ఏమంటారు?  ఇప్పుడు ఈ రెండు పదాలను పరివర్తన శక్తి ద్వారా, ఎప్పుడు 'నేను' అని అన్నా, నేను ఫలానాను, నేను బ్రాహ్మణుడను అనే కాకుండా, నేను ఎవరిని? బాప్ దాదా ఏ స్వమానాలైతే ఇచ్చారో, ఎప్పుడు నేను అని అన్నా దానితో  పాటు ఏదో ఒక స్వమానాన్ని కూడా అనండి, అంటే మీ బుద్ధిలోకి తీసుకురండి. నేను అనగానే స్వమానం గుర్తుకు వచ్చేయాలి. 'నాది' అని అనగానే బాబా గుర్తుకు రావాలి. 'నా బాబా'. ఇది సహజమైన స్మృతిగా అయిపోవాలి.  ఈ పరివర్తన తీసుకురండి, చాలు. రెండవ విషయము- చాలా వరకు సంబంధ సంపర్కాలలోకి వచ్చినప్పుడు రెండు మాటల ద్వారా మాయ వస్తుంది, ఒకటి భావము, రెండవది- భావన. ఎప్పుడు భావము అన్న పదమును  ఉపయోగించినా, ఆలోచించినా, ఆత్మిక భావము కలగాలి. భావము అన్న మాట అనగానే ఆత్మిక భావము ముందు గుర్తుకు రావాలి మరియు భావన అంటే శుభ భావన గుర్తుకు రావాలి. మాటల అర్థాన్ని పరివర్తన చెయ్యండి. మీ  టైటిల్ ఏమిటి? విశ్వ పరివర్తకులు. విశ్వ పరివర్తకులు ఈ పదమును పరివర్తన చెయ్యలేరా? కావున సమయానికి పరివర్తన శక్తిని ఉపయోగించి చూడండి. ఎప్పుడైతే గడిచిపోతుందో అప్పుడు తర్వాత వస్తుంది, మనసుకు  నచ్చదు, స్వయమే ఆలోచిస్తూ ఉంటారు కానీ సమయమైతే గడిచిపోయింది కదా. అందుకే ఇప్పుడు తీవ్ర గతి యొక్క అవసరం ఉంది, అప్పడప్పడూ కాదు. చాలా సమయమైతే మంచిగానే ఉంటాను కదా అని అనుకోకండి.  అంతిమ క్షణం పై ఎటువంటి నమ్మకమూ లేదని బాప్ దాదా ముందుగానే వినిపించి ఉన్నారు. అకస్మాత్తుగా వచ్చే పరిస్థితుల ఆటలు జరగనున్నాయి. కొంతమంది పిల్లలు బాప్ దాదాకు కూడా అతి మధురమైన మాటలు  వినిపిస్తూ ఉంటారు. సమయం ఇంకొంచెం అతిలోకి వెళ్తుంది కదా, అప్పుడు వైరాగ్యం వస్తుంది, వైరాగ్య సమయంలో స్వతహాగానే వేగం తీవ్రం అవుతుందిలెండి అని అంటుంటారు. కానీ బహుకాలపు పురుషార్థం అవసరము  అని బాప్ దాదా వినిపించి ఉన్నారు. ఒకవేళ కొద్ది సమయపు పురుషార్థం ఉన్నట్లయితే ప్రాలబ్ధము కూడా కొద్ది సమయానికే లభిస్తుంది, పూర్తిగా 21 జన్మల ప్రాలబ్ధము తయారవ్వదు. బాప్ దాదా చెప్పే మూడు పదాలను సదా  గుర్తుంచుకోండి - ఒకటి- అకస్మాత్తు, రెండు- ఎవరెడీ, మూడు- బహుకాలము. ఈ మూడు పదాలను సదా బుద్ధిలో పెట్టుకోండి. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవ్వరికైనా అంతిమ కాలము రావచ్చు. ఇప్పుడిప్పుడే ఎంతమంది  బ్రాహ్మణులు వెళ్ళిపోతున్నారో చూడండి! వారికేమైనా తెలుసా, అందుకే బహుకాలపు పురుషార్థంతో 21 జన్మల పూర్తి వారసత్వపు ఫలితాన్ని ప్రాప్తి చేసుకోవలసిందే, ఈ తీవ్ర పురుషార్థాన్ని గుర్తుంచుకోండి. మీ రాజ్యంలో ఫస్ట్  నంబరు, ఫస్ట్ జన్మ. ఏమి ఆలోచిస్తున్నారు? ఫస్ట్ జన్మలోకి రావాలి కదా. ఎందులో ఆనందము ఉంది? ఫస్ట్ జన్మలోఉందా లేక ఏ జన్మలో అయినా ఉందా? మన రాజ్యంలో ఫస్ట్ జన్మలో శ్రీకృష్ణుడితో పాటు మా పాత్ర కూడా  ఉండాలి అని భావించేవారు చేతులెత్తండి. అచ్ఛా, పాత్ర ఫస్ట్ లో ఉందా? చేతుల్ని చూసైతే సంతోషంగా ఉంది. చప్పట్లు కొట్టండి, ఫస్ట్ జన్మలోకి వస్తున్నందుకు అభినందనలు. కానీ చెప్పమంటారా... చెప్పొద్దా, ఫస్ట్ జన్మలోకే  వచ్చేదున్నప్పుడు ఇక మరో విషయము ఎందుకు? మంచిది, ఎంతమందైతే వచ్చారో అందరూ ఫస్ట్ జన్మలోకి రావలసిందే. చప్పట్లైతే కొట్టారు, ఫస్ట్ జన్మ మరియు ఫస్ట్ స్టేజి కూడా. ఫస్ట్ స్టేజిని తయారు చేసుకోవలసిందే, ఫాస్ట్  గా వెళ్ళవలసిందే, అని ఎవరికి దృఢ సంకల్పం ఉందో వారికి ఎటువంటి విఘ్నము వచ్చినా కూడా అది విఘ్నముగా ఉండకూడదు, విఘ్న వినాశకుల ఎదుట అది విజయ రూపంగా మారిపోవాలి ఎందుకంటే మీరందరూ  విఘ్న వినాశకులు. టైటిల్ ఏమిటి? విఘ్న వినాశకులు. కావున ఒకవేళ అవి వచ్చినా కూడా ఆట ఆడుకోవడానికి వస్తాయి. కానీ మీరు దూరంనుండే తెలుసుకోండి, రాయల్ రూపంలో వస్తుంది కానీ విఘ్న వినాశకులైన మీరు  ఈ ఆట ఏమిటి అని దూరం నుండే తెలుసుకుంటారు. అందుకే బాప్ దాదా కూడా  పిల్లలందరూ కలిసి వెళ్ళాలి, వెనుక ఉండిపోకూడదు అని ఆశిస్తారు. బాప్ దాదాకు పిల్లలు లేనిదే మజా రాదు. కావున దృఢత్వాన్ని  ఎప్పుడూ బలహీనంగా చేసుకోవద్దు. చెయ్యాల్సిందే. లే, లే అని అనకండి, చేద్దాములే,  చూద్దాములే, అవుతుందిలే.... చూడండి, అంటూ ఈ మాటలు రాకూడదు. దృఢత్వము సఫలతకు తాళం చెవి. ఈ తాళం చెవిని  ఎప్పుడూ పోగొట్టుకోవద్దు. మాయ కూడా తెలివైనది కదా, అది తాళం చెవి కోసం వెతుకుతుంది, కావున ఈ తాళం చెవిని జాగ్రత్తగా సంభాళించి పెట్టుకోండి.

           మరి ఇప్పుడు పరిశీలించుకోండి - మీ రాజ్య సంస్కారాలను ఇప్పటి నుండీ ధారణ చేసుకోవలసిందే. లే,లే, అని అనకండి. ఒకటి లే, లే, మరొకటి ము, ము... ఈ మాటలను బ్రాహ్మణుల డిక్షనరీ నుండి తీసెయ్యండి. సరే, ఒకవేళ  ఎవరిలోనైనా బలహీనతను చూసినా, అందరూ పురుషార్ధీలే కదా, లేకపోతే బ్రాహ్మణ జీవితం నుండి వెళ్ళిపోయి ఉండేవారు. పురుషార్థులు కనుకనే ఇంకా బ్రాహ్మణ జీవితంలో నడుస్తున్నారు. కొందరు ఏమంటారంటే- నేనైతే  మంచిగానే ఉన్నాను, కానీ ఇతరులు చేస్తారు కదా అది విఘ్న  రూపంగా అవుతుంది, ఇది చెయ్యకుండా ఉంటే, వీరు మారితే.... అని అంటుంటారు. కానీ- మేము మారి వారిని మార్చాలి అని బాప్ దాదా ముందునుండే స్లోగన్ ఇచ్చి  ఉన్నారు. నేను మారాలి. వారు మారితే నేను మారుతాను అని కాదు. భావము మరియు భావనను పరివర్తన చెయ్యండి అని వినిపించి ఉన్నాము కదా, భావము ఆత్మది, భావన శుభ భావన. మీరు చేసి చూడండి, అలసిపోకండి, శుభ  భావన ఎంతో పెట్టి చూసాము, కానీ మారడం లేదు, మారేదే లేదు.... బ్రాహ్మణులైన మీ నోటి నుండి వీరు మారరు అన్న ఇటువంటి మాటలు రావడం వరదానం అయిందా? బ్రాహ్మణులు ఏ వరదానాన్ని ఇస్తారు? ఆధారాన్ని  ఇవ్వగలగాలి, శుభ భావనల ఆధారాన్ని ఇవ్వండి, లేకపోతే ప్రక్కకు తప్పుకోండి. మనసులో పెట్టుకోకండి. శుభ భావనల ఆశీర్వాదాలను ఇవ్వండి, మిగతా మాటలను ఇవ్వకండి. ఒకటేమో ఇలా అంటారు, రెండవ మాట ఏమంటారో  చెప్పమంటారా? ఎందుకంటే ఈ రోజు బాప్ దాదా బాగా చెక్ చేసారు, ఇంకా ఏమంటారు? ఇదైతే జరుగుతూనే ఉంది, వీరు కూడా చేస్తున్నారు కదా, నేను చేస్తే ఏమవుతుంది? అని అంటారు! వారు బావిలో పడ్తున్నారు మరి మీరు  కూడా బావిలో పడి చూస్తారా, ఇది తెలివైన పనేనా? ఇప్పుడు ఒక విషయము- జనవరి, 18వ తారీకు వరకు బాప్ దాదా పురుషార్థం కోసం హోమ్ వర్కును ఇస్తున్నారు- చేస్తారా? చేస్తారా? చేతులెత్తండి. ఏమి జరిగినా కానీ,  మారవలసిందే, ఎదుర్కోవలసిందే, ప్రక్కకు తప్పుకోవలసిందే కానీ మారుతాము. చేతులెత్తారా? పక్కా? లేక నేను చాలా ప్రయత్నించాను, కానీ వీలు కాలేదు అని అయితే జవాబు చెప్పరు కదా ఎందుకంటే ఇప్పుడు అకస్మాత్తుగా  జరిగే ఆటలు చాలా రానున్నాయి. పిల్లలు ఒక్కరు కూడా వెనుక ఉండిపోకూడదు, కలిసి వెళ్ళాలి అని బాప్ దాదా కోరుకుంటున్నారు. ఒకవేళ ఎవ్వరూ మారకపోతే, శుభ భావన పెట్టినా పరివర్తన కాకపోతే మీరు మారండి. వీరు ఇది  చేసారు, వీరు ఇలా అన్నారు అందుకే నేనూ చెయ్యవలసి వచ్చింది అని అనకండి. చేసేది నేర్పించే భావనతోనే కానీ చూస్తున్నది లోపాన్ని! కావున భావము మరియు భావనలు ఆత్మిక భావము మరియు శుభ భావనలు కలిగినవిగా  ఉండాలి. ఇవైతే జరుగుతూనే ఉంటాయి, వీరైతే చేస్తున్నారు కదా, నడుస్తోంది కదా, నేను చేస్తే ఏమవుతుంది.... బాబా వెళ్ళినప్పుడు వీరు ఉండిపోతున్నారు కాబట్టి నేను కూడా ఉండిపోతాను అని అంటారా? కావున సీ ఫాదర్,  మరియు భావము మరియు భావన రెండింటిలో పరివర్తన, 5 తత్వాల పట్ల కూడా మీరు శుభ భావన పెడ్తారు, మరి బ్రాహ్మణ పరివారంపై పెట్టలేరా? ఇదైతే జరుగుతూనే ఉంటుంది, ఇదైతే నడుస్తూనే ఉంటుంది. ఈ మాటలను  సమాప్తం చెయ్యండి. నేను మారి చూపించాలి. నేనూ మారుతాను, ఇతరులు మారుతారు. తప్పక మారుతారు, ఈ నిశ్చయము మరియు శుభ భావనతో నడుచుకోండి, అప్పుడు చూడండి త్వరత్వరగా మీ రాజ్యం వచ్చేస్తుంది. మరి ఈ  18 జనవరి నాటికి రెండు విషయాలను సదా ధారణ చేసుకోండి. కేవలం వ్రాసి పంపండి అని బాప్ దాదా చెప్పడం లేదు, ప్రతిజ్ఞలు చేసే ఫైల్స్ బాప్ దాదా వద్ద వతనంలో చాలా ఉన్నాయి. ప్రతిజ్ఞ కాదు, దృఢత్వపు సంకల్పం  రూపంలో ఈ రెండు విషయాలను ధారణ చేసుకోండి. సరేనా టీచర్స్?  చెయ్యాలి కదా? అచ్ఛా! మాతలు చేతులెత్తండి, చేస్తారా? చేతిని బాగా పైకి ఎత్తండి. పాండవులు చేతులెత్తండి. పాండవులు. పాండవులు కూడా ఎత్తుతున్నారు,  బాగుంది. బాప్ దాదా అయితే రోజూ చూస్తూ, ఉంటారు. బాప్ దాదాకు చూడడంలో సమయం పట్టదు. సరేనా. అచ్ఛా!
    
           వచ్చిన టీచర్లందరూ, మురళి అయితే అందరి వద్దకు వెళ్తుంది. కేవలం వచ్చినవారికే కాదు, దేశ విదేశాలలోని పిల్లలందరి కోసం. ఇప్పుడు మీ పని పెరగనుంది. సేవ చేసాము, భాషణ చేసాము, వర్గాన్ని నడిపిస్తున్నాము అని కాదు.  సేవ ఇంకా చాలా మిగిలి ఉంది. ఇప్పుడైతే మనస్సు  ద్వారా శక్తిని ఇచ్చే సేవ చెయ్యాలి. ఎలా అయితే ప్రారంభంలో శివబాబా బ్రహ్మాబాబాలోకి ప్రవేశించినప్పుడు ఇంట్లో కూర్చునే ప్రకాశాన్ని ఇచ్చారు. కొందరికి సాక్షాత్కరం జరిగింది,  కొందరికి ఇక్కడకు వెళ్ళండి అన్న మాట వినిపించేది, అది విని నేను వెళ్ళవలసిందే అని ప్రేరణ వచ్చింది, పరుగెత్తుకొని వచ్చారు కదా, ఆదిలో వచ్చినవారు ఎంతగా పక్కాగా ఉన్నారు! దాదీని గుర్తు చేస్తారు కదా, ఇతర దాదీలను  కూడా గుర్తు చేస్తారు కదా, మరి ఆదిలో ఏదైతే జరిగిందో అది ఇప్పుడు మళ్ళీ అంతిమంలో కూడా రిపీట్ కానుంది. కావున మీ మనసా శక్తిని, మనసా సేవను పెంచండి. ఆ సమయంలో మీ భాషణను ఎవ్వరూ వినరు. ఎవ్వరూ కోర్సు  తీసుకోరు, పరిస్థితులు కూడా గంభీరంగా ఉంటాయి. మనసా ప్రకాశాన్ని ఇచ్చే సేవను చెయ్యవలసి ఉంటుంది. అందుకే ఇప్పుడు అభ్యాసం చెయ్యండి. కేవలం అమృతవేళ కాదు, కర్మ చేస్తూ కూడా మధ్య మధ్యలో మనస్సును  అన్ని వైపుల నుండి కంట్రోల్ చేసి, ఏకాగ్రులై ప్రకాశాన్ని ఇవ్వగలనా లేక ఇవ్వలేనా, దీనిని ట్రయల్ వేయండి. దీని అవసరం చాలా ఉంటుంది. దుఃఖహర్త, సుఖకర్తలుగా మీ చిత్రాలు కూడా తయారవుతాయి, మరి మీరు  చైతన్యంలో అలా అవ్వరా? అంతర్ముఖులుగా అయి మధ్య మధ్యలో 5 నిమిషాలు కేటాయించండి. కేవలం అమృతవేళే కాదు, రాత్రి పగలు ఈ అభ్యాసాన్ని చెయ్యండి. రాత్రి మెలకువ రాగానే ట్రయల్ వెయ్యండి. తర్వాత  కావాలంటే మళ్ళీ వెళ్ళి పడుకోండి, కానీ కొద్ది సమయము ట్రయల్ వెయ్యండి అలాగే వేరే పనుల కోసం కూడా లేవాల్సి ఉంటుంది కదా, అప్పుడు ఈ అభ్యాసము కూడా చెయ్యండి. అప్పుడే మీ పూజ జరుగుతుంది. లేకపోతే మీ  పూజ నామమాత్రంగానే జరుగుతుంది. పెద్ద పెద్ద మందిరాలు తయారు కావు, ఏదో పనినడిపే మందిరాలు తయారవుతాయి. విన్నారా. అచ్ఛా!

           ఇప్పుడు బాప్ దాదా ఇచ్చిన సమాచారమైతే విన్నారు. ఈ రోజు బాగా పరిశీలించారు. పరిశీలించడంలో బాప్ దాదాకు సమయం పట్టదు. అచ్ఛా! ఇప్పుడిప్పుడే మీ మనసును ఏకాగ్రం చెయ్యగలరా? చెయ్యగలరా లేక సమయం  అయిపోయింది, అలసిపోయాము, ఆకలి వేస్తుంది అన్న ఆలోచన చేస్తారా? లేదు. బాప్ దాదాపై పిల్లలకు చాలా స్నేహము ఉంది అని బాప్ దాదాకు తెలుసు, ఈ స్నేహపు సర్టిఫికేటును బాప్ దాదా కూడా ఇస్తున్నారు, ఇప్పుడు  ఇక్కడకు వచ్చినవారందరూ ఏవిమానంలో వచ్చారు? ట్రైనులో వచ్చి ఉండవచ్చు, లేక విమానంలో వచ్చి ఉండవచ్చు కానీ మీరు ఒక విచిత్రమైన విమానంలో వచ్చారు, అదేంటో తెలుసా, అది స్నేహపు విమానము. స్నేహమనే  విమానంలో వచ్చారు కదా. ట్రైను కావచ్చు మరేదైనా కావచ్చు, కానీ బాబాపై ప్రేమ ఉంది కనుకనే ఇక్కడకు వచ్చారు. కేవలం ఇప్పుడు ఏ సమయంలోనైనా ఏదైనా వచ్చినాగానీ, మాయ ఆట వచ్చినాగానీ ఆ సమయంలో బాబా  స్నేహంలో మునిగిపోండి, మాయకు కనిపించకండి. బాప్ దాదా ప్రారంభంలో ట్రాన్స్ ద్వారా ఎన్నో దృశ్యాలను చూపించారు. అంతిమ సమయంలో ఎప్పుడైనా ఏదైనా అలజడి జరిగినప్పుడు అన్ని వృత్తులు బయటకు వస్తాయి. చెడు వృత్తులు కూడా మరియు ఆధారాన్ని ఇచ్చే వృత్తులు కూడా వచ్చేస్తాయి. బాప్ దాదా ప్రారంభంలో పిల్లలకు ఏమి చూపించారంటే- చెడు దృష్టి కలిగినవారు కొంతమంది వెనుక వస్తారు కానీ వారికి ప్రకాశమే కనిపిస్తుంది,  కానీ మనుష్యులు కనిపించరు, ప్రకాశమే కనిపిస్తుంది, ఫరిస్తా రూపమే కనిపిస్తుంది. అలాగే మీ ఏకాగ్రత అభ్యాసంతో మీరు ఇలా ఎదురుగా కూర్చుని ఉన్నా కానీ వారికి కనిపించరు. ప్రకాశమే, ప్రకాశము కనిపిస్తుంది. అలా  జరుగనుంది, కానీ దాని అభ్యాసమును ఇప్పటినుండే చెయ్యండి. ఫరిస్తా. అచ్ఛా! ఇప్పుడు మూడు నిమిషాలు మనసు యొక్క ఏకాగ్రతను అభ్యాసం చెయ్యండి. ఈ డ్రిల్ చెయ్యండి. అచ్ఛా!
 
           *సేవా టర్ను భోపాల్ జోన్ వారిది-* అచ్ఛా, భోపాల్ వారు కూడా మంచి సంఖ్యలో చేరుకున్నారు. ఇప్పడు భోపాల్ వారు ఏ నవీనతను ఆలోచించారు? ఏదైతే చేసి ఉన్నారో అదైతే అందరూ చేస్తూనే ఉన్నారు, కానీ ఏ  నవీనతను చేస్తారు? బాప్ దాదా గత టర్నులో కూడా చెప్పి ఉన్నారు, ఇప్పుడు వి.ఐ.పీల సేవనైతే చేసారు, అన్ని జోన్లు చేసాయి, అన్ని వర్గాలు చేసాయి, కానీ ఇప్పుడు సంబంధంలోకి వచ్చే వి.ఐ.పీలు ఎవరైతే మైక్ లుగా  అయి ఇతరులను తమ మాటలతో పరివర్తన చెయ్యగలరో అటువంటి వారిని సమీపంలోకి తీసుకురండి. 6 నెలలలో, 12 నెలలలో ఒక్కసారి వచ్చినా లేక 4-5 సార్లు వచ్చినా, భాషణ కూడా చేసారు, సంబంధ సంపర్కంలోకి  కూడా వచ్చారు, కానీ ఎవరి మాటలతో అయితే అనేకుల కళ్యాణం జరుగుతుందో అటువంటి మైకులను వారసత్వపు క్వాలిటీలుగా చెయ్యండి. ప్రసిద్ధమైనవారిగా కూడా ఉండాలి. కానీ ఈ రోజుల్లో లోకులు బాహ్యముఖులుగా  ఉన్నారు కదా, కావున వారు బాహ్యపు ఆడంబరాన్ని కూడా చూడాలని ఆశిస్తారు. కావున ఎలాంటి ప్లాన్‌ను తయారు చెయ్యలంటే అది నిరంతరం జరుగుతూనే ఉండాలి మరియు ఇటువంటి వారసత్వపు క్వాలిటీని తయారు  చెయ్యండి. ఎందుకంటే వర్గీకరణ ప్రారంభమై కూడా ఎన్ని సంవత్సరాలు అయ్యాయి! అయ్యాయి కదా! ఇప్పుడు వారిని ఎంత సమీపంగా తీసుకురావాలంటే వారు వారస క్వాలిటీగా అయిపోవాలి. ఇప్పుడు వి.ఐ.పిల లైనులో  ఉన్నారు, సహయోగిగా ఉన్నారు, సేవ కూడా చేస్తున్నారు, కానీ వారస క్వాలిటీగా లేరు. మరి ఇప్పుడు ఎటువంటి సహయోగిగా అవ్వాలంటే, ఎప్పుడు ఏ సమయంలో ఏ కార్యం చెయ్యవలసిన అవసరం వస్తే, వారికున్న  క్వాలిఫికేషన్లో హా జీ, హా జీ అనాలి. కనెక్షన్ మంచిగా జోడించారు, బాప్ దాదా ఈ విషయంలో సంతోషిస్తున్నారు. కానీ ఇప్పుడు వారు కూడా ఎవరెడీ సేవాధారిగా కావాలి. ఇటువంటి క్వాలిటీ వారిని అన్ని వర్గాల వారు ప్రోగు  చెయ్యండి. బాప్ దాదా వద్దకు తీసుకురావాలి అని కాదు. ఏ స్థానంలో అయినా కానీ వారి సంగఠన ఏర్పాటు చెయ్యండి. ఎక్కడైనా చెయ్యండి, అందరికీ రాకపోకలకు వీలైన సహజ స్థానంలో చెయ్యండి, వారికి విశేషంగా ఏదో ఒక  ప్రోగ్రామును పెట్టండి. ప్రోగ్రాము ఉంటే వెళ్తారు, కలుస్తారు, సహయోగము కూడా ఇస్తారు, కానీ కొంచెం హోమ్లీగా(ఇంటివారిగా) అయి సమయానికి సహయోగిగా అవ్వగలగలగాలి. ప్రారంభంలో భోపాల్ వారు సేవ చేసారు,  వి.ఐ.పిల కనెక్షన్‌ను ఏర్పరచారు, ఇప్పుడు ఈ విధితో సేవను చేసి చూపించండి. బ్రాహ్మణులైతే అవుతున్నారు, ఇప్పుడు అన్ని క్లాసులలో బ్రాహ్మణుల సంఖ్య పెరుగుతోంది, ఇదైతే మంచిదే. క్లాసులు అన్నీ  మంచిగా  ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎటువంటి వ్యక్తి, సేవాధారి లభించాలంటే వారి మాట లేక పరిచయం వినగానే సేవ జరగాలి మరియు సమయానికి వారు రెడీ కావాలి. చెయ్యగలరు, ఇప్పుడు చేసి చూపించండి ఇంతమంది  వి.ఐ.పిలు ఉన్నారు అని లిస్టు అయితే ఇస్తారు కానీ వారి సంగఠనను చేసినప్పుడే జరుగుతుంది. ఆ సమూహము కూడా కనిపించాలి, ఒకరినొకరు చూసుకొని కూడా ఉల్లాసం కలుగుతుంది, వీరు కూడా వస్తున్నారు, వారు కూడా  వస్తున్నారు... అని ఉల్లాసం వస్తుంది. మరి ఇప్పుడు ఏ జోన్లు అయితే వస్తాయో, ఏ వర్గాలైతే వస్తాయో, ఇప్పుడు ముందు ముఖ్య ముఖ్య స్థానాలలో సంగఠనను ఏర్పాటు చేయండి. కేవలం మధువనంలోనే కాదు, ఏ స్థానంలో  అయినా సంగఠన చేసి వారిని స్నేహము మరియు సహయోగంలో మరింత ముందుకు నడపండి. టీచర్లు ఏమి చేస్తారు? టీచర్లు చేసి చూపిస్తారు కదా? మీరు ఏమి చెయ్యలేరు! ఒక్కొక్కరూ, చిన్నవారు కానీ, పెద్దవారు కానీ  ఒకవేళ దృఢసంకల్పం ఉన్నట్లయితే చిన్నవారైనా అద్భుతం చెయ్యగలరు. కేవలం చెయ్యవలసిందే అన్న దృఢ సంకల్పం ఉండాలి. అభిమానంతో ముందుకు వెళ్ళకండి, స్వమానంతో ముందుకు వెళ్ళండి. బాప్ దాదా ఏ  పిల్లలను చూసినా, ఏ జోన్‌ను చూసినా, వీరు కాబోయే దేవతలు అన్న దృష్టితోటే చూస్తారు. కొంతమంది క్రొత్త పిల్లలు లో-లోపలే సేవలో ఎంతో అద్భుతాన్ని చేసి చూపిస్తున్నారు. బాప్ దాదా వద్దకు సమాచారం రాకపోయినా  కానీ బాప్ దాదాకు తెలుసు. కావున అద్భుతం చేసి చూపించండి. ప్రారంభంలో చాలా మంచి సేవను చేసారు, ప్రారంభము చేసారు. బాప్ దాదాకు గుర్తుంది. ఇప్పుడు ఏదైనా అద్భుతమును చేసి చూపించండి. చేస్తారు కదా,  చేస్తారా? బాగుంది. సంఖ్య అయితే పెరుగుతూ ఉంది, కానీ ఇప్పుడు క్వాలిటీని పెంచండి. అచ్ఛా!

           సేవ యొక్క సువర్ణ అవకాశమైతే అన్ని జోన్లకు బాగా లభిస్తుంది. బాబా కూడా సంతోషిస్తున్నారు మరియు మీరందరూ కూడా సంతోషంతో అవకాశాన్ని తీసుకుంటున్నారు. బాగుంది, వృద్ధిని చూసి బాదాదా సంతోషిస్తున్నారు.

           *ఎడ్యుకేషన్ మరియు అడ్మినిస్ట్రేటర్స్ వింగ్ (శిక్షణ మరియు ప్రశాసక వర్గం)-* బాగుంది, జీవితాన్ని తయారు చెయ్యడానికి ఎడ్యుకేషన్ అవసరం అని ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఈ రోజుల్లో మెజారిటీ వారు ఎడ్యుకేషన్ లో  స్పిరిచువాలిటీ(ఆధ్యాత్మికత) అవసరము అని భావిస్తున్నారు. ఇప్పుడు వాతావరణం మారిపోయింది. ఆధ్యాత్మికంగా తయారవ్వడము పెద్దలకు, వృద్ధులకే అని ఒకప్పుడు అనుకునేవారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ లో ఆధ్యాత్మికత  లేకపోతే పరివర్తన జరుగజాలదు అని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచపు భావన మారుతోంది, కాబట్టి ఎంత వీలైతే అంత ప్రతి పట్టణంలో చిన్న పెద్ద స్కూళ్ళు, కాలేజీలు లేక భిన్న భిన్న ఎడ్యుకేషన్ ఎక్కడైతే జరుగుతోందో అక్కడ  ట్రయల్ చేసి అక్కడ తమ పాత్రను నిర్వహించండి. కొంతమంది  పిల్లలు తమ తల్లిదండ్రులను మార్చగలరు. ప్రతి స్థానంలోని స్కూళ్ళలో సేవ జరగాలి. స్కూళ్ళ కారణంగా టీచర్లు  మరియు తల్లిదండ్రులు మీ కనెక్షన్లోకి  వచ్చేస్తారు. ఈ రోజు పిల్లవాడు సమస్యగా ఉంటే ఆ పిల్లవాడి నడవడికలో టీచరు కానీ తల్లిదండ్రులు కానీ కొద్దిగా తేడా చూసినా కానీ, ఇది చాలా మంచిది అని  నమ్ముతారు. అయితే అక్కడక్కడా చేస్తున్నారు, కానీ అన్ని వైపులా  జరగాలి. ఎవరికైనా సహయోగము కావాలంటే, భాషణ చేసేవారు కానీ, ప్రోగ్రాము తయారు చేసేవారు కానీ, అవసరమనుకుంటే పరస్పరంలో సహాయాన్ని తీసుకోవచ్చు. మీరు డిపార్టుమెంటును చూడండి, ఎక్కడెక్కడ వీలవుతుంది,  ఎక్కడైన ఎవరైనా సహయోగము ఇవ్వగలరా, చేయించగలరా, కొంచెం వ్యాపింపజేయండి. అక్కడక్కడా వ్యాప్తి  చేస్తున్నారు కానీ నలువైపుల గ్రామాలలో కూడా వ్యాప్తి చెయ్యండి. కొన్ని కొన్ని గ్రామాలలో అయితే వ్యాప్తి చేస్తున్నారు.  ఎడ్యుకేషన్ డిపార్టుమెంటు ఎంతగానో చెయ్యవచ్చు. ప్రపంచ పరంగా కూడా పిల్లలు ఒకవేళ విద్యావంతులుగా అయినట్లయితే ప్రపంచానికి కూడా లాభము మరియు మీకు కూడా పుణ్యము జమ అవుతుంది. బాగుంది, చేస్తున్నారు,  బాప్ దాదా వింటారు కానీ బ్రహ్మాకుమారీల ఆధ్యాత్మిక జ్ఞానము అవసరము అన్న మాట నలువైపులా వ్యాపించాలి. సందేశమును వ్యాపింపజేసే గ్రూపును తయారు చెయ్యండి. ఏ వర్గాలైతే తయారై ఉన్నాయో అన్నీ వాటి వాటి రీతిలో  అవసరమే. సందేశాన్ని వ్యాప్తి చెయ్యగలవు. ఎక్కడకు వెళ్ళినా, ఎడ్యుకేషన్లో వెళ్ళినా, డాక్టరీలో వెళ్ళినా, మినిస్టరీలో వెళ్ళినా, ఎక్కడకు వెళ్ళినా, ఏ వర్గంలోకి వెళ్ళినా కూడా, ఈ వర్గంలో కూడా అవసరం ఉంది, ఈ వర్గంలో కూడా  అవసరం ఉంది అన్న మాటను వ్యాపింపచెయ్యాలి. బ్రహ్మాకుమారీలు ఏదైతే చెయ్యగలరో దానిని ఇతరులెవ్వరూ చెయ్యలేరు అన్న మాట కొంచెం, కొంచెం ఇప్పుడు ప్రారంభమయింది. మేనేజ్ మెంట్ గురించి కూడా  బ్రహ్మాకుమారీలు చేయించే మేనేజ్ మెంట్ ను ఎవ్వరూ చేయించలేరు అని భావిస్తున్నారు. ఇలా ప్రతి వర్గంవారు, ప్రతి స్థానంలో, ఎక్కడకు వెళ్ళినా కూడా బ్రహ్మాకుమారీల కార్యం మంచిగా ఉంది అన్న ఈ మాటను  వ్యాపింపజేయండి, అప్పుడే కదా మంచిగా అవుతారు. అచ్ఛా! ఏదైతే చేస్తున్నారో అది బాగా చేస్తున్నారు. ఇకమీదట మరింత బాగా చేస్తూ ఉండండి, వ్యాపింపజేస్తూ ఉండండి. అచ్ఛా!

          *డబుల్ విదేశీయులు-* డబుల్ విదేశీయులందరూ లేవండి. యూత్ (యువత) కూడా లేవండి. మీ అందరి తరఫున డబుల్ పురుషార్ధీ పిల్లలకు అభినందనలు తెలుపుతున్నారు. మీరందరూ మధువనానికి అలంకారము. కావున  మధువనపు అలంకారులకు అభినందనలు, అభినందనలు, అభినందనలు. ప్రతి టర్నులో ఎవరో ఒకరు హాజరు కావాలి అని అందరూ మంచి సంకల్పాన్ని చేసారు. బాప్ దాదా సంతోషిస్తున్నారు. ప్రారంభంలో ఏ దేశంలోనైనా  ఏదైనా పెద్ద ప్రోగ్రాము జరిగితే, మొదట స్టేజిపై వి.ఐ.పిగా విదేశస్తులు ఉండేవారు, ఇప్పుడు స్పీకర్ వి.ఐ.పి.లు రావడంలేదు, బ్రాహ్మణులు వస్తున్నారు, మన ఇంటి అలంకారం వస్తున్నారు, అది సంతోషించాల్సిన విషయము, కానీ  బాప్ దాదా ప్రోగ్రాము తయారు చేసారని విన్నారు, విదేశీయులు దేశంలోకి వచ్చి సేవ చెయ్యాలి, ప్రోగ్రాము తయారుచేసారు కదా. వీరు ఎదురుగా ఉన్నారు కదా, (నిజార్ అన్నయ్య) ప్లాన్ తయారుచేసారు కదా? మంచిగా చేసారు,  కానీ ఆరంభంలో బాప్ దాదా- విదేశీయులు భారతదేశంలోని కుంభకర్ణులను మేల్కొల్పుతారు అని అనేవారు. ఇప్పుడు ఏ పెద్ద ప్రోగ్రాములైతే అవుతాయో అందులో స్పీకర్లు కూడా వచ్చేలా ప్రయత్నించండి. వి.ఐ.పి.లు మంచి  ప్లానును చేసారు. మన బ్రాహ్మణులైతే వస్తారు, కానీ వి.ఐ.పి.లు వచ్చి వారికి ఏమి లభించింది అని తమ అనుభవాన్ని వినిపించాలి. ఇది కూడా జరిగిపోతుంది. ఇప్పుడు కనెక్షన్లో అయితే చాలామంది ఉన్నారు.
   
           మీరు డబుల్ పురుషార్థులు కదా! మేము డబుల్ పురుషార్థులము అని భావించేవారు చేతులెత్తండి. డబుల్ పురుషార్థులా. డబుల్! డబుల్ పురుషార్థులా? మెజారిటీ చేతులెత్తున్నారు. కొంతమంది ఎత్తడంలేదు. దీనిని ఢీలా  చెయ్యకండి. ఇప్పుడు డబుల్ పురుషార్థులు అన్న టైటిల్ లభించింది కదా. తర్వాత మీకు ఫరిస్తా  పురుషార్ధీ అన్న టైటిల్ లభిస్తుంది. ఎందుకంటే ఎలా అయితే ఎగురుకుంటూ ఇక్కడకు వస్తారో అలాగే స్థితిలో కూడా ఫరిస్తా  అనగా ఎగిరే కళ కలిగినవారు. ఎక్కే కళ, నడిచే కళ కాదు, ఎగిరే కళ. అటెన్షన్ ఉంది, సేవ కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఎటువంటి గ్రూపును తయారు చెయ్యలంటే సదా ఏకరసంగా, ఏకాగ్రంగా ఉండాలి. అప్పుడప్పుడూ అన్న  మాట రాకూడదు. సదా అన్న మాట ఉండాలి, అటువంటి గ్రూపును తయారు చేసుకోండి. అప్పుడప్పుడూ అన్న మాటే రాకూడదు. సదా అన్న మాట ఎంత పక్కాగా ఉండాలంటే- అప్పుడప్పుడు అన్న పురుషార్థం అంటే ఏమిటి అని  అనిపించాలి. నడుస్తూ తిరుగుతూ సదా అను మాట ప్రతి సబ్జెక్టులో ప్రాక్టికల్ గా జరగాలి. ఇటువంటి గ్రూపును విదేశంలోనూ, దేశంలోనూ తయారు చెయ్యగలరు. రేస్ చెయ్యండి, చిన్న గ్రూపు అయినా, పెద్ద గ్రూపు అయినా ఎక్కడైనా  ఇటువంటి గ్రూపును తయారుచేసి చూపించండి. చేస్తారు కదా! ఏదైతే ఆలోచిస్తారో అది చేసి చూపించటం డబుల్ పురుషార్థుల అలవాటు. మరి ఇది చేసి చూపించండి. ధైర్యముందా? ధైర్యముందా? టీచర్లు చెప్పండి.  జనక్(జానకిదాదీ) చెప్పండి. ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఆలోచించండి. ఆలోచించండి, ట్రయల్ వెయ్యండి. అందరి తరఫున బాప్ దాదా ఆ గ్రూపుకు బహుమతిని ఇస్తారు. దేశములోని వారైనా, విదేశములోని వారైనా ఎవరైనా  తయారుచేయండి, సదా నో ప్రాబ్లమ్ అని వినిపించాలి. అచ్ఛా!

          అచ్ఛా- నలువైపుల ఉన్న పిల్లలు భిన్న భిన్న విధాలుగా పంపుతూ ఉన్న ప్రియస్మృతులు బాప్ దాదా వద్దకు తప్పకుండా చేరుకుంటాయి మరియు బాప్ దాదా కూడా ఆ పిల్లలను హృదయంలో ఇముడ్చుకుంటూ సమీపంగా ఇమర్జ్  చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు తమ గత జన్మల లెక్కాచారాలను సమాప్తం చేసుకోవడంలో ఉన్నారు. వారి ప్రియస్మృతులు కూడా బాప్ దాదా వద్దకు చేరుకుంటాయి. ఎలా అయితే అంకుల్ (అంకుల్ స్టీవ్  నారాయణ్) మొదటి వి.ఐ.పిగా నిమిత్తమయ్యారు కదా. మరి బాప్ దాదా మరియు సర్వ పరివారము యొక్క ప్రకాశము తప్పకుండా పిల్లల వరకు చేరుకుంటుంది. అందరూ  హృదయపూర్వక స్మృతులను అందిస్తున్నారు. ఇలాగే  కొంతమంది పిల్లలు బాబా, బాబా అంటూ తమ లెక్కచారాలను సమాప్తం కూడా చేసుకుంటున్నారు మరియు ప్రకాశాన్ని తీసుకుంటూ నడుస్తున్నారు కూడా. దేశంలో కానీ విదేశంలో కానీ ఎవరైతే శరీరపు లెక్కాచారాలను సమాప్తం  చేసుకుంటున్నారో, ఆ విశేష పిల్లలందరికీ బాప్ దాదా ప్రియ ఆశీర్వాదాలు సదా లభిస్తున్నాయి మరియు లభిస్తూనే ఉంటాయి. దీనితోపాటు నలువైపుల  నుండి ఉత్తరాలు, ఈ రోజుల్లో ఉత్తరాలకన్నా వేగవంతమైన సాధనాలు  వచ్చాయి. ఎవరెవరైతే స్మృతిని పంపారో  ఆ పిల్లలందరికీ పేరు మరియు విశేషతల సహితంగా బాప్ దాదా ప్రియస్మృతులను తెలుపుతున్నారు.

           వీరితోపాటు బంధనంలో ఉన్న గోపికల హృదయం నుండి ఎంతో ధ్వని వినిపిస్తుంది. ఇది అద్భుతము బంధనంలో ఉంటూ మనసుతో బంధనముక్తులుగా ఉండే లవ్లీ పిల్లలకు బాప్ దాదా స్మృతిని ఇస్తున్నారు. కఠినమైన  బంధనంలో కూడా తమ సంపాదనను గుప్తంగా చేసుకుంటున్నారు. వారు నిదురిస్తూ  ఉంటారు, వీరు సంపాదించుకుంటూ ఉంటారు. ఈ బంధనం వారి చరిత్ర విచిత్రంగా ఉంటుంది. నలువైపుల  ఉన్న బంధనము కలిగిన  సత్యమైన గోపికలకు కూడా బాప్ దాదా ప్రియస్మృతులను ఇస్తున్నారు. వారికి విశేష సమయం ఉంటుంది మరియు బాప్ దాదా వీరికి ఆ సమయంలోనే కిరణాలను ఇస్తారు. అచ్ఛా!

           నలువైపుల ఉన్న లవ్లీ మరియు లక్కీ దృఢ సంకల్పం కలిగిన పిల్లలకు, ఆలోచించడము మరియు చేయడము చేస్తాము, చూస్తాము కాదు, ఆలోచించడము మరియు చేయడము, సదా స్వయంలో నష్టోమోహ స్థితిలో, కేవలం   సంబంధపు మోహము కాదు, తమ దేహ భానము మరియు దేహ అభిమానపు మోహము కూడా ఉండకూడదు. ఇటువంటి నష్టోమోహ ఎవరెడీ పిల్లలకు, సదా శ్రీమతం అనే చేతిలో చేయి వేసి, కలిసిఎగిరే మరియు బ్రహ్మాబాబాతో  పాటు  తమ రాజ్యంలోకి వచ్చే తీవ్ర పురుషార్థులకు, ఎగిరేకళలో ఉండే పిల్లలకు బాప్ దాదాల చాలా చాలా ఆశీర్వాదాలు  మరియు ప్రియస్మృతులు మరియు బాలకులనుండి యజమానులుగా అయ్యే పిల్లలకు నమస్తే.

          *దాదీలతో -* (దాదీ జానకి మరియు మోహిని అక్కయ్య బాప్ దాదాను కౌగలించుకున్నారు.) నిమిత్తంగా వీరిద్దరూ అయ్యారు, కానీ అందరూ సమీపంలోకి వచ్చేసారు.

           *శాంతమణి దాదీతో -* బాగుంది, మంచంపై ఉన్నాకానీ అందరి హృదయంలో స్మృతి ఉండాలి,  ఎందుకంటే ఆదిరత్నము కదా! ఆదిరత్నములు అమూల్య రత్నములు, లెక్కపెట్టుకునేంతగానే ఈ రత్నాలు ఉన్నారు. అందరికీ  దాదీలు చాలా గుర్తున్నారు కదా.

           గ్రామ వికాస ప్రభాగము ఆధ్వర్యములో గుజరాత్ లో 18 నుండి 29 డిసెంబరు వరకు “శాశ్వత  యోగిక పొలముల జాగృతి కార్యము" మొదలవుతుంది, దీని ఆరంభ కార్యక్రమము నిన్న నది వద్ద జరిగింది-

            గ్రామ సేవ చేసేవారు చాలా మంచి ప్రత్యక్ష స్వరూపాన్ని చూపిస్తున్నారని బాప్ దాదా సమాచారాన్ని  విన్నారు. పోలాలలో వేసే రకరకాల ఎరువులను వేయకుండా యోగబలంతో ఎరువులు లేకుండా ఫలాలు,  పూలు, ధాన్యాన్ని  పండిస్తున్నారు. ప్రాక్టికల్ గా ట్రయల్ చేసి చూపించారు. ప్రాక్టికల్ గా పరిశీలన కూడా  చేయించారు. యోగము ద్వారా ఫలాలు, పుషాలు లేక ధాన్యమేదైతే పండుతుందో అది రోగాలను ఉత్పన్నము  చేయవు. అనారోగ్యానికి  కారణమైన క్రిములు యోగబలంతో సమాప్తమైపోతాయి, మరి ఈ ప్రాక్టికల్ ప్రమాణమును  అనేక స్థానాలలో చూపించారు మరియు నిమిత్తమైన వి.ఐ.పిలు కూడా యోగబలంతో ప్రయత్నిస్తే ఇది వృద్ధి  జరుగగలదు అని  విశ్వసిస్తున్నారు. కావున ఇది చాలా మంచి ప్రత్యక్ష ప్రమాణము. ఈ ప్రత్యక్ష ప్రమాణమును  చూసి అందరూ తప్పక ఒప్పుకుంటారు. ఇది కూడా బ్రాహ్మణ పరివారపు మంచి ప్రమాణమును చూపించే సేవ.  కొన్ని స్థానాలలో  చేసారు కదా! వారు వచ్చి ఉన్నారు. గ్రామ సేవ వారు ఎక్కడున్నారు. గ్రామ వికాసంవారు లేవండి. 

           ఇక్కడ అబూలో కూడా ఇటువంటి పొలాన్ని చేస్తున్నారు. మరి పొలం నుండి ఏమి వచ్చింది? ఇప్పుడు  ఏమి తయారు చేసారు? (ఇప్పుడు బొప్పాయి వచ్చింది, సెనగలు మరియు బఠానీ తయారవుతున్నాయి.) మంచిది కదా, తమ  సంపాదన కూడా జరుగుతుంది, యోగము చేసారు. మరి ఇందులో మీ లాభము కూడా ఉంది మరియు అందరికీ కూడా లాభము ఉంది. మంచి విషయము. ప్రాక్టికల్ గా ఎప్పుడైనా క్లాసులో చూపించండి. ఏవైతే వచ్చాయో (బొప్పాయి  లేక సెనగలు) అవి అందరికీ చూపించండి. బాగుంది, ఒకవేళ  ఇదే విధంగా సందేశం వ్యాపిస్తూ ఉంటే పిలవకుండానే అందరూ వచ్చేస్తారు. ఆహ్వానాన్ని ముద్రించాల్సిన  అవసరం ఉండదు. అభినందనలు, చాలా మంచి సేవ.

Comments