30-11-2009 అవ్యక్త మురళి

     30-11-2009        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

      “బాబాకు మరియు సర్వులకు ప్రియులుగా అవ్వాలంటే సంతుష్టమణిగా అయ్యి ప్రతి పరిస్థితి యొక్క ప్రభావం నుండి ముక్తులై ఉండండి. "

           ఈ రోజు నలువైపుల ఉన్న సంతుష్ట ఆత్మలను చూస్తున్నారు. సంతుష్టమణులు తమ మణిలోని ప్రకాశమును నలువైపుల వ్యాపింపజేస్తున్నారు. సంతుష్టతయే అన్నిటికన్నా పెద్ద స్థితి. సదా సంతుష్టులు సర్వులకు ప్రియంగా ఉంటారు. బాబాకూ ప్రియులే. ఎవరి వద్దనయితే సర్వ ప్రాప్తులు ఉంటాయో వారే సదా సంతుష్టంగా ఉండగలరు. ప్రాపులకు ఆధారము సంతుష్టత, అందుకే ఇటువంటి ఆత్మలు సర్వ బ్రాహ్మణాత్మలకు ప్రియమైనవారు. సర్వ ప్రాప్తులు అనగా సదా సంతుష్టత. సంతుష్ట ఆత్మ ప్రభావము వాయుమండలంలో కూడా పడుతుంది. సర్వ ప్రాప్తులు పరమాత్ముని ప్రసాదము. తండ్రి అయిన పరమాత్మ ద్వారా సర్వ శక్తులు, సర్వ గుణాలు, సర్వ ఖజానాలను పొంది ఉన్న ఆత్మ సదా సంతుష్టంగా ఉంటుంది. సంతుష్ట ఆత్మ యొక్క స్థితి సదా ప్రగతిశీలకంగా ఉంటుంది. సంతుష్ట ఆత్మపై పరిస్థితి ప్రభావం చూపలేదు, ఎందుకంటే ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడకు సర్వ శక్తులు, సర్వ గుణాలు స్వతహాగానే వస్తాయి. ఒక్క సంతుష్టత అనేక గుణాలను తన సొంతం చేసుకుంటుంది. కావున ప్రతి ఒక్కరూ - నేను సదా సంతుష్టంగా ఉంటున్నానా! అని స్వయాన్ని ప్రశ్నించుకోండి - సంతుష్ట ఆత్మ సదా సర్వులకు, తండ్రికి సమీపంగా మరియు సమాన స్థితిలో ఉంటుంది. కానీ ఈ స్థితిలో ఉండటానికి ఎంతో సాక్షి దృష్టి స్థితి కావాలి, త్రికాలదర్శి స్థితి కావాలి. ప్రతి కర్మను త్రికాలదర్శి అనగా ప్రతి విషయాన్ని మూడు కాలాలలో పరిశీలించిన తర్వాత కర్మను చేయాలి. ఇందుకోసం రెండు విషయాలు అవసరము. ఆ రెండు విషయాలు- సంబంధము మరియు సంపద, సంబంధము కూడా అవినాశి మరియు సంపద కూడా అవినాశి - ఇవి అవినాశి తండ్రి ద్వారా ప్రాప్తి అవుతాయి. .అవినాశి సంపద మరియు అవినాశి సంబంధము ప్రాప్తి అయినప్పుడు ఆత్మ సదా సంతుష్టంగా మరియు తండ్రికి, సర్వాత్మలకు అతి ప్రియంగా అవుతుంది. మాయ రూపంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ, గాబరా పడరు. అనంతమైన తెరపై మిక్కీ మౌస్ ఆట జరుగుతున్నట్లుగా అనుభవమవుతుంది. కలత చెందరు, మిక్కీ మౌస్ ఆటను చూసి మనోరంజనాన్ని పొందుతారు. మాయ యొక్క భిన్న భిన్న రూపాలు భిన్న భిన్న మిక్కీ మౌస్ రూపాలుగా అనిపిస్తాయి. ఇటువంటి స్థితి యొక్క అనుభూతిని బాబా ద్వారా అందరూ చేసుకోవలసిందే మరియు చేసుకున్నారు కూడా.

           నిర్భయులుగా, ఏకాగ్ర బుద్ధి కలవారిగా అయి ఎటువంటి పరిస్థితిలోనూ అలజడిలోకి రాకపోవడాన్ని బాప్ దాదా చూసారు. ఇటువంటి విజయి ఆత్మలు, ప్రతి ఒక్కరూ సదా విజయులుగా అయ్యి బాబాకు తమ విజయి స్వరూపాన్ని చూపించాలి అన్న శుభ ఆశ సదా బాబాకు పిల్లలందరి పట్ల ఉంటుంది. మరి నేను ఎవరిని? అని ప్రతి ఒక్కరూ తమనుతాము ప్రశ్నించుకోండి. అప్పుడప్పుడూ అన్న పదమును సమయానుసారంగా ఇప్పుడు బ్రాహ్మణ డిక్షనరీ నుండి సమాప్తం చేసెయ్యండి అని బాప్ దాదా ముందు కూడా వినిపించి ఉన్నారు. బాబా నుండి వారసత్వాన్ని సదా కోసం తీసుకోవాలన్నప్పుడు ప్రతి ప్రాప్తి సదా ప్రాప్తమై ఉండాలి ఎందుకంటే బాబా హృదయపు ఆశలను పూర్తి చేసే ఆశా దీపాలు మీరు. వారి సంకల్పంలో కూడా అప్పుడప్పుడూ అన్న పదము రాదు, ఎందుకని? సదా తండ్రి తోడుగా మరియు తండ్రి సహచరులుగా ఉన్నారు. తోడుగా ఉండేవారు కూడా మరియు సహచరులుగా అయి విశ్వ పరివర్తన కార్యాన్ని చేసేవారు కూడా.

           మరి చెప్పండి, సదా అన్న ఈ వరదానాన్ని బాప్ దాదా ద్వారా ప్రాప్తింపజేసుకున్నారు కదా! జన్మ తీసుకోగానే బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ సదా యోగీ భవ, పవిత్ర భవ అన్న వరదానాన్నే ఇస్తారు. ఆ వరదానాల ద్వారా ఏవైతే ప్రాప్తిస్తాయో అవి సదా ఉంటాయి, అప్పుడప్పుడూ కాదు. మరి పిల్లలందరూ సదా అధికారులు, ఎందుకంటే బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై, చివరిలో ఉన్న పిల్లలపై కూడా, ప్రతి ఒక్కరిపై బాబాకు హృదయపూర్వకమైన ప్రేమ ఉంది. ఎందుకంటే పెద్ద-పెద్ద వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తమను తాము తెలివైనవారిగా భావిస్తున్నారో వారు కూడా బాబాను గుర్తించలేకపోయారు, కానీ బాప్ దాదాల చివరి పిల్లలు కూడా బాబాను గుర్తించారు. మనస్ఫూర్తిగా నా బాబా అని అంటారు, అందుకే బాబాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై అవినాశి ప్రేమ ఉంది, అందుకే పిల్లలందరికీ బాబా వరదానమూ ఉంది. నంబరువారీగా ఉన్నా కానీ బాప్ దాదా రోజూ ఒకే సమయంలో, ఒకే వరదానాన్ని పిల్లలందరికీ కలిపి ఇస్తారు. ప్రతి రోజూ, బాప్ దాదా పిల్లలు నంబరువారీగా ఉన్నాకానీ, నా బాబా అన్నారంటే వరదానానికి అధికారులుగా అయిపోయినట్లే. పిల్లలు ఎక్కడ ఉన్నా కానీ, ఇండియాలో ఉన్నా లేక విదేశాలలో ఉన్నా కానీ వరదానమైతే బాప్ దాదా నుండి అందరికీ ఒక్కటే లభిస్తుంది. వరదానాన్ని పొంది సంతోషిస్తారు కూడా. కానీ రెండు రకాల పిల్లలు ఉన్నారు. ఒకరు - వరదానాన్ని చూసి తప్పకుండా సంతోషిస్తారు. కానీ, ఇది నా వరదానము అని వరదానాన్ని చూసి కేవలం సంతోషపడే, లేక వర్ణించేవారిగా కాక వరదానాన్ని ఫలవంతం చేసేవారు ముందు నంబరును తీసుకుంటారు. వరదానం నుండి లాభం తీసుకుని వరదానం నుండి ఫలాన్ని పొందుతారు. బీజము ఉంది, కానీ బీజాన్ని ఫలవంతం చేయకపోతే, ఫలాలను తీసుకురాకపోతే కేవలం సంతోషము మాత్రమే ఉంటుంది. వరదానము నుండి ఫలాన్ని తీసుకురావడానికి - ఏవిధముగా బీజము నుండి ఫలాన్ని తీసుకురావాలంటే దానికి నీరు మరియు ఎండ కావాలో, అప్పుడే ఫలాలు వస్తాయో, అలాగే ఇక్కడ కూడా పిల్లలు ప్రతి ఒక్కరూ వరదానము నుండి ఫలాన్ని తీసుకోవావాలంటే, ఆ ఫలం ద్వారా విస్తారం జరగాలంటే, తమ మనసులోనే వరదానం నుండి వచ్చిన ఫలం ద్వారా వృద్ధి జరగాలంటే, ఇక్కడ కూడా వరదానం నుండి ఫలాన్ని తీసుకోవడానికి పదే పదే వరదానాన్ని స్మృతిలోకి తీసుకురండి, స్మృతి స్వరూప స్థితిలో ఉండండి అని బాబా అంటారు. పదే పదే తీసుకురండి- స్మరణ కాదు, స్మృతి, ఇది నీరు ఇవ్వడము మరియు స్వరూపంలో స్థితులవ్వడము అంటే సూర్యరశ్మిని అందించడము. ఇలా ఇది ఫలవంతం అయినప్పుడు స్వయంలో కూడా ఎంతో శక్తి నిండుతుంది మరియు ఇతరులకు కూడా ఆ ఫలం ద్వారా శక్తి అనుభవమవుతుంది.

           మరి ఇప్పుడు బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు? ఎందుకంటే బాప్ దాదా కొద్దికాలంగా సమయము గురించి వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి చదువు యొక్క రిజల్టు అకస్మాత్తుగా రానుంది. ఇందుకోసం సదా ఎవరెడీ, దీనితోపాటు బాప్ దాదా ఈ సూచనను కూడా ఇస్తున్నారు- ఇప్పుడు ఇది ఎగిరే కళలో తీవ్ర పురుషార్థం చేసే సమయము. నడుస్తున్నాము కాదు, ఎగరాలి. సాధారణ రీతిగా మీ దినచర్యను గడపడము, ఇప్పుడు ఈ విధంగా సాధారణంగా పురుషార్థం చేసే సమయము గడిచిపోయింది. అందుకే బాప్ దాదా సూచన ఇస్తున్నారు- ప్రతి క్షణము, ప్రతి సంకల్పమును పరిశీలించుకోండి. ఉదాహరణకు- తీవ్ర పురుషార్థం చెయ్యకుండా ఒక గంట సాధారణ పురుషార్థంలో ఉన్నట్లయితే ఆ ఒక్క గంటలోనే అకస్మాత్తుగా ఒకవేళ ఫైనల్ పేపర్ సమయము వచ్చేస్తే అప్పుడు అంతిమ మతిని బట్టి గతి ఏర్పడుతుంది, ఆ ఒక్క గంట సాధారణ పురుషార్థం ఎంత నష్టపరుస్తుంది! అందుకే బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ, ప్రతి సంకల్పము, ప్రతి క్షణము సమయ మహత్వాన్ని గురించి సమయానుసారంగా పదే, పదే సూచనను ఇస్తూనే ఉన్నారు. అలజడి సమయంలో అచలంగా ఉండే పురుషార్థాన్ని తీవ్ర పురుషార్థులే చెయ్యగలరు. సాధారణ పురుషార్థులు ఎవరెడీగా అవ్వడంలో ఎక్కువ సమయం తీసుకుంటారు. మరి బాప్ దాదా అయితే ఒక్క క్షణంలో బిందువు అనగా ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పారు. ఒకవేళ తీవ్ర పురుషార్థిగా లేకపోతే ఏమవుతుంది? అనుభవజ్ఞులే కదా. ఫుల్ స్టాప్ కు బదులుగా ప్రశ్నార్థకం రావడం లేదు కదా! బిందువు ఎంత సహజమైనది, ప్రశ్నార్థకం ఎంత వంకరగా ఉంటుంది. ఫుల్ స్టాప్ అనగానే ఫుల్ స్టాప్ పడిపోవాలి. కామా చిహ్నం కూడా రాకూడదు, ఆశ్చర్యార్థకం కూడా రాకూడదు. ఏమి చెయ్యను అని ఆలోచించడానికి కూడా సమయం లభించదు. ఇంత ఫాస్ట్ గా పురుషార్థం చేస్తేనే పేపరులో పాస్ అవుతాము అని పిల్లలెవ్వరూ ఊహించి ఉండరు.

           ఇప్పటికీ కారణంగా అయినా, అకారణంగా అయినా ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా...... అన్నవి కొంతమంది పిల్లల చార్టులో రోజూ కనిపిస్తూ ఉంటాయి. ఎంతోమంది పిల్లల చార్టులో వ్యర్థ సంకల్పాల అల ఎక్కువ సమయాన్ని తీసుకోవడం బాప్ దాదా గమనించారు. వ్యర్థపు వేగం ఎంత తీవ్రంగా ఉందంటే, సాధారణ సంకల్పాల ఒక్క గంట ఫాస్ట్ సంకల్పాల ఒక్క నిమిషముతో సమానము. అందుకే ఈ రోజు సర్వులకు ప్రియులైన, బాప్ దాదాకూ ప్రియమైన సంతుష్ట ఆత్మలు ఎవరెవరు అని గమనిస్తున్నాము. సంతుష్ట ఆత్మల సంకల్పంలో కూడా ఇది ఎందుకు, ఏమిటి అన్న భాష స్వప్నంలో కూడా రాదు ఎందుకంటే ఆ ఆత్మలు మూడు విశేషమైన విషయాలను, మూడు బిందువులను, ఆత్మ, పరమాత్మ మరియు డ్రామా, మూడింటినీ సమయానికి కార్యములో వినియోగించగలరు ఎందుకంటే అటువంటి సమయంలో శక్తుల ఖజానా అవసరము. ఏ సమయంలో ఏ శక్తిని ఆజ్ఞాపిస్తే అది హాజరైతే వారిని మాస్టర్ సర్వశక్తిమంతులు అని అంటారు. సహన శక్తి అవసరమున్నప్పుడు ఎదుర్కొనే శక్తి వస్తే - ఇది కూడా శక్తియే కానీ ఆ సమయంలో పనికిరాదు. కావున సర్వ ఖజానాలకు తాళం చెవి మూడు బిందువులు - మీరు, బాబా మరియు డ్రామా.

           బాప్ దాదాకు ఒక సంకల్పం ఉంది, చెప్పమంటారా? చెయ్యాల్సి ఉంటుంది. ఎవరైతే చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారో వారు చేతులెత్తండి. చెయ్యాల్సి ఉంటుంది, చెయ్యాల్సి ఉంటుంది... చేతులెత్తుతున్నారు, మనసు యొక్క చేతిని ఎత్తుతున్నారా లేక శరీరపు చేతిని ఎత్తుతున్నారా? మనసుతో ఎత్తే చేయి పక్కాగా ఉంటుంది. బాప్ దాదా సమయానుసారంగా పిల్లలు ప్రతి ఒక్కరి నుండి ఈ శుభ ఆశను ఉంచుతున్నారు - 15 రోజుల తర్వాత తిరిగి బాబా మిలనం జరుగుతుంది, ఈ 15 రోజులలో విశేషంగా ఈ అభ్యాసం చెయ్యండి, ట్రయల్ చెయ్యండి, నిజానికి సదా ఉండాలి కానీ 15 రోజుల ట్రయల్ చెయ్యండి మరియు మీ, మీ కనెక్షన్లో ఉన్న సెంటర్లతో కూడా చేయించండి, అక్కడకు వెళ్ళి అయినా, ఫోన్ల ద్వారా అయినాగానీ హోమ్ వర్కు చేసారా అని వారికి గుర్తు చేయండి. హోమ్ వర్కు ఏమిటి? ఈజీయే, ప్రతి ఒక్కరూ భిన్న భిన్న పరిస్థితులు, విషయాలను ఎదుర్కుంటూనే ఉంటారు కానీ ఈ 15 రోజులు ప్రతి ఒక్కరూ సంకల్పం, వాణి మరియు కర్మలో కనీసం 80 శాతం మార్కులు తీసుకోవాలి. అయినా బాప్ దాదా 20 శాతం వదిలేస్తున్నారు. ఇష్టమేనా? ఇష్టమేనా? ఈ హోమ్ వర్కును ఇవ్వమంటారా? అచ్ఛా, 15 రోజులు, మాయ కూడా వింటోంది. పరిస్థితులు అయితే వస్తాయి, వాటిని చూడకండి, పాస్ కావాలి అని గుర్తుంచుకోండి, 15 రోజులు పెద్ద విషయమేమీ కాదు, కానీ బాప్ దాదా వద్దకు ప్రతి ఒక్కరూ సత్యమైన మనసు, స్వచ్ఛమైన హృదయము, స్వప్నంలో కూడా, సంకల్పము, వాణి మరియు కర్మలలో పాస్ అయి చూపించండి. వీలవుతుందా? వీలవుతుందా? టీచర్లు చెప్పండి, వీలవుతుందా? 15 రోజులు పెద్ద విషయము కాదు, కానీ బాప్ దాదా ట్రయల్ కోసం చెప్తున్నారు, సంకల్పం కూడా వ్యర్థంగా పోకూడదు, యుద్ధం జరుగకూడదు. 15 రోజుల పూర్తి విజయులు. కష్టమా, సహజమా? సహజమేనా, చేతులెత్తండి. సహజమేనా? మరి బాప్ దాదా ఈ 15 రోజుల రిజల్టును చూస్తారు. తర్వాత ఇంకా పెంచుతారు. 15 రోజులైతే ఎవ్వరైనా చెయ్యగలరు! చెయ్యగలరు కదా! మధువనంవారు, మధువనంవారు చేతులెత్తండి. మధువనంవారు ముందు కూర్చున్నారు. చాలా మంచిది. విదేశీయులు, ఇండియావారు అందరూ చెయ్యాలి. గ్రామంలోనివారు, పెద్ద పట్టణాలలోని వారు అందరూ 15 రోజుల రికార్డును పెట్టాలి. ఎందుకు, ఏమిటి, ఏమి చెయ్యను పరిస్థితి అటువంటిది అని చెప్పకండి. 80 శాతం తీసుకోవలసిందే. బాప్ దాదా అయితే ఇంకా సులువుగా చెయ్యడానికి 20 శాతాన్ని వదిలిపెట్టేసారు. ఎందుకంటే నడుస్తూ నడుస్తూ ఉండగా మాయ నిర్లక్ష్యము, సోమరితనము, రాయల్ సోమరితనము అనగా ఇది జరిగింది, అది జరిగింది.... ఈ రాయల్ సోమరితనము, నిర్లక్ష్యము తీవ్ర పురుషార్థంలో లోటును తెస్తుంది. ఎందుకంటే బాప్ దాదా విద్యార్థులందరితో, ప్రతి ఒక్కరితో ఇప్పుడు 15 రోజుల రిహార్సల్ చేయించి, ఇలాగే కొంత సమయము వరకు అభ్యాసం చేయించాలనుకుంటున్నారు. అప్పుడు ఎవరెడీగా ఉన్నాము అని అందరూ చేతులెత్తగలగాలి. అందరూ చేతులెత్తగలగాలి, కొంత సమయము అభ్యాసం కావాలి, అందుకే ముందుగా ఈ కొద్దిపాటి అభ్యాసాన్ని చేయిస్తున్నాము. అచ్ఛా, ఇప్పుడు ఏమి చెయ్యాలి?

సేవ టర్ను పంజాబ్ జోన్ వారిది:- బాగుంది, పంజాబ్ - అక్కడ 5 నదులు ప్రహిస్తాయి, నదుల ప్రభావం కూడా ప్రసిద్ధి చెందింది, బాగుంది. అలాగే జ్ఞాన గంగలు కూడా ప్రసిద్ధులే! పంజాబ్ చాలా మంచి కార్యమును చేస్తోంది. పంజాబ్ విశేషత ఏమిటంటే, పంజాబ్ కుమారీలు చాలా మంచిగా, సేవా యోగ్యులైన వారు ఒకేసారి తయారయ్యారు. చప్పట్లు కొట్టండి. పంజాబ్ లో మొదట్లో నిర్భయంగా సన్యాసుల సమ్మేళనంలో భాషణ ఇచ్చారు. సన్యాసులు కూడా వీరిది చాలా మంచి కార్యము అని స్టేజి మీదనే చెప్పారు. అప్పుడు అది ప్రారంభ సమయము. పంజాబ్ కనెక్షన్ నుండి మధ్య మధ్యలో పెద్ద పెద్ద సన్యాసులు, మఠాలకు చెందినవారు. ఆబూలో జరిగే సమ్మేళనంలో పాల్గొన్నారు మరియు ఎక్కువ సంఖ్యలోనే వచ్చారు. ఇతర దేశాల నుండి కూడా వచ్చారు. కానీ విశేషమైన సంగఠన హరిద్వారము నుండి వచ్చేది, కనెక్షన్ కూడా ఉంది. పంజాబ్ కు డ్రామానుసారంగా ఈ సన్యాసులు, మహాత్ముల సేవా అవకాశం మంచిగా లభించింది మరియు చేస్తూ ఉన్నారు కూడా. పంజాబ్ లో స్థాపన సమయంలో సేవ ఆరంభమయిన వెంటనే సహయోగులు మరియు వారస క్వాలిటీవారు నిమిత్తంగా అయ్యారు. ఎంత హంగామా చేసేవారో అంతే సింహం క్వాలిటీవారు తయారయ్యారు. ఇప్పుడు పంజాబ్ ఏమి చెయ్యాలి? ఈ విశేషత అయితే ఉంది, కానీ ఇప్పుడు పంజాబ్ వారు ఎటువంటి సింహాన్ని తయారు చెయ్యండంటే- వారు ప్రసిద్ధమైనవారు అయి ఉండాలి, సభలో మైక్ గా అయి తమ అనుభవాన్ని వినిపించాలి. మైక్ పెద్దగా ఉండాలి, చిన్నగా కాదు. ప్రభుత్వ వి.ఐ.పి.లు వేరుగా ఉంటారు, కానీ మహాత్ములలో కూడా వి.ఐ.పి.లు ఉంటారు, ఇటువంటి పెద్ద మైక్ ను ఎవరినైనా తయారు చెయ్యండి. వారు తమ అనుభవంతో ఇతరులను ఉల్లాసములోకి తీసుకురావాలి, ఇటువంటివారిని తయారు చెయ్యండి. అది సంభవమే, ఎందుకంటే ఈ రోజుల్లో సాధు సన్యాసుల సేవ ద్వాపరంలో ప్రారంభమయిందని అందరూ అనుకుంటారు, కానీ ఒక పెద్ద గురువు మరొకరిని, తమ శిష్యుడిని తమ సమానంగా తయారు చెయ్యడం, ఇటువంటి ఉదాహరణ జరగలేదు. బాప్ దాదా అయితే పిల్లలను తమకన్నా కూడా ఎక్కువ తెలివైనవారిగా చేసారు పిల్లలు పబ్లిక్ లోకి వస్తారు. కావున పంజాబ్ ఏదైనా నవీనతను చేసి చూపించండి. వి.ఐ.పిలు అయితే అన్ని వైపుల నుండి వస్తారు, కానీ మీరు ఎటువంటివారిని తీసుకురావాలంటే, అది విని అందరూ మేల్కోవాలి, సందేశం లభించాలి. వీలవుతుందా? చూద్దాము. కొద్ది సమయమైతే పడుతుంది, కానీ ఇటువంటి వారినెవరినైనా తయారు చేసి చూపించండి. ఇకపోతే వృద్ధి అయితే జరుగుతోంది. ఇప్పుడు చూడండి, సగం సభ పంజాబ్ వారే నిల్చున్నారు. సేవలో వృద్ధి జరుగుతోంది, ఇందుకు అభినందనలు (కుంభమేళాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి) ఈ అవకాశం బాగుంది. అయిపోతుంది. అచ్ఛా! సేవ ఛాన్సును తీసుకున్నారు మరియు ఇక్కడకు వచ్చే ఛాన్సును తీసుకున్నారు, ఎందుకంటే ఎవరి టర్ను ఉంటుందో వారి సంఖ్యకు మంచి ఛాన్సు లభిస్తుంది. ఇది కూడా మంచి సాధనముగా తయారై ఉంది. పంజాబ్ సోదరసోదరీలకు, మాతలకు, కుమారీలకు, కుమారులకు, వృద్ధులకు అందరికీ బాప్ దాద మరియు సభలో కూర్చున్నవారందరి నుండి చాలా చాలా అభినందనలు, అభినందనలు.

మీడియావింగ్:- బాగుంది, మీడియా అయితే సేవను బాగా చేసింది. బాబా సూచన అనుసారంగా అందరూ ఈసారి సందేశాన్ని వ్యాప్తి చెయ్యడానికి, సందేశాన్ని ఇవ్వడానికి ఎంతో కృషి చేసారు. బ్రాహ్మణులందరి నోటి నుండి కూడా - బాప్ దాదా చెప్పారు, బాప్ దాదా చెప్పారు, అని అంటూ దానిని పాక్టికల్ రూపంలోకి తీసుకురావడానికి అందరూ మంచి పురుషార్థాన్ని చేసారు. మీడియావారు కూడా నలువైపుల ఉన్న అన్ని చోట్ల ఏమేమి జరుగుతున్నాయి అన్నది చూపించడానికి చాలా మంచి కృషిని చేసారు చేసేవారు ఉత్సాహంతో చేసారు, చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు కానీ చిన్నవారు కూడ తక్కువేమీ చెయ్యలేదు. చిన్న సెంటరు కావచ్చు, పెద్ద సెంటరు కావచ్చు ఎవరైతే ప్రోగ్రామును చేసారో సందేశాన్ని ఇచ్చారో, ఎవరైతే ఈ ప్రోగ్రాములో సేవ చేసారో, నిమిత్తమయ్యారో, పెద్ద ప్రోగ్రాము అని అంటారు కదా, వారు లేవండి. సేవ చేసినవారు, సెంటరువారు కూడా లేవవచ్చు. ఏ ఏ సెంటర్లయితే ప్రోగ్రాము చేసాయో వారందరూ లేవండి. బాప్ దాదాకు మంచిగా అనిపించింది. టీచర్లు తక్కువగా లేచారు. బాప్ దాదా పదమారెట్లు అభినందనలు తెలుపుతున్నారు. ఇలాగే మధ్య మధ్యలో కొద్ది సమయం తర్వాత కూడా ఉల్లాస ఉత్సాహాలతో పలు చోట్ల సందేశమునిచ్చే ప్రోగ్రామును తయారు చేస్తూ ఉండండి. ఎందుకంటే సమయంపై ఎటువంటి నమ్మకము లేదు. కనీసం మా బాబా వచ్చారు అని అనాలి. మేము గుర్తించలేదు, బాబా వచ్చారు. కానీ నేను గుర్తించలేదు అని అన్నా అనాలి. అందరికీ సేవ ద్వారా సూచన ఇవ్వడము మీ కర్తవ్యము. మరి మీరందరూ తనువుతో, మనసుతో, ధనముతో సేవను చేసారు, ఇందుకోసం మీ అందరికీ పదమా పదమారెట్లు రిటర్ను జమ అయిపోయింది. మరియు సేవా ఫలం కూడా లభించింది. సెంటర్లకు వస్తున్నారు. ఇకముందు కూడా ఇది చెయ్యడానికి శక్తి కూడా లభించింది, ఫలము కూడా లభించింది, బలము కూడా లభించింది. బాగుంది. అందరూ ఎంతో అభిరుచితో చేసారు. బాప్ దాదా అందరి ఉల్లాస ఉత్సాహాలను చూసి, బాబాపై ఉన్న ప్రేమను చూసి, అభినందనలు తెలుపుతున్నారు. ఇలాగే ఏదో ఒక ప్రోగ్రామును తయారు చేస్తూ ఉండండి. చిన్న చిన్న సెంటర్లలో అన్ని సౌకర్యాలు వచ్చేసాయి కదా. లేకపోతే ప్రోగ్రాము చెయ్యమంటే ముందు సౌకర్యాలు ఉండాలి అని అనుకునేవారు. కానీ అకస్మాత్తుగా అన్ని చోట్ల తనువు, మనసు, ధనములు సంతోషంగా ఏర్షాటైపోయాయి. ఎలా చేయాలి అని ఎవ్వరూ అనలేదు, చెయ్యాలి. అలాగే పరస్పరంలో ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకరికొకరు ఉల్లాస ఉత్సాహాలను ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళండి, సరేనా. బాగుంది, అభినందనలు, అభినందనలు. ఇక్కడకు రాని వారికి కూడా అభినందనలు లభిస్తాయి. అచ్ఛా.

మీడియా వారు లేవండి:- బాగుంది, ఇప్పుడు అటెన్షన్ ఇచ్చారు, మీడియా ద్వారా సేవ బాగా జరుగుతోంది. రెగ్యులర్ స్టూడెంట్లు కూడా తయారయ్యారు. వీరికి కూడా అభినందనలు (రవి అన్నయ్య, శివాని అక్కయ్య మరియు కనుప్రియ అక్కయ్య) బాగుంది, ఎవరు ఎంతగా సేవ చేస్తారో అందుకు ఫలముగా సదా సంతోషము ఉంటుంది. సేవా ఫలము సంతోషము, నిర్విఘ్నము. అప్పుడప్పుడూ కాదు, సదా, మంచిగా చేస్తున్నారు. సలహా తీసుకుని దీనిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, దేశంలో కావచ్చు, విదేశంలో కావచ్చు, అందరూ పరస్పరంలో సలహా తీసుకుని అందరి సలహాతో ఏ కార్యమైతే జరుగుతుందో అందులో సఫలత సహజంగా ఉంటుంది. కనుక సలహాలను ఇస్తూ రాయ్ బహాదూర్ గా అయి ఒకరిదొకరు వినండి మరియు చెయ్యండి. అయిపోతుంది, ఇప్పుడు సమయము కూడా ఎంతుంది! కావున మీడియావారు ఇంతమంది ఉన్నారుకదా, తమ తమ ప్రాంతాలలో సందేశాన్ని ఇచ్చే ప్రోగ్రామును కూడా చెయ్యండి. ఇదైతే మధువనంవారు లేక నిమిత్తమైనవారు చేసారు కానీ ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతంలో, మీడియావారికి ఏదో ఒక విధంగా సందేశాన్ని చేర్చండి. బాగా చేస్తున్నారు, అభినందనలు.

ట్రాన్స్ పోర్టు వింగ్:- రెండు విభాగాల కార్యము ఈ రోజుల్లో అవసరము ఎందుకంటే రోజు రోజుకీ ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. ప్రమాదాలు తగ్గాలి, అకాల మృత్యువులు ఉండకూడదు, ఆర్తనాదాలు చేస్తూ- బాధ పడుతూ వెళ్ళిపోకూడదు అన్న భావంతో రెండు విభాగాల వారు ప్లాన్ ను తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా తయారు చేసారు. బాప్ దాదా స్థాపన చేసినప్పుడు, ఆరంభంలో పిల్లలు చదువుకోవడానికి వచ్చినప్పుడు ఇది మృత్యులోకము అని బాప్ దాదా చెప్పేవారు. అప్పుడు వారు పిల్లలు కదా, ఇది మృత్యులోకం ఎలా అవుతుంది అని అడిగేవారు! ఎందుకంటే మృత్యువును చూడలేదు కదా, పిల్లలు కదా. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ సమయంలో మృత్యువు అధికంగా ఉండటాన్ని చూస్తున్నారు. ఒకట్రెండు అకాల మృత్యువులు జరగని రోజు ఉండదు. మంచిది, ఇరు వర్గాలవారూ ఎంతో వేగంగా తమ కార్యాన్ని పెంచాలి. అందరూ మీకు అభినందనలు తెలుపుతారు ఎందుకంటే లోకులు కూడా అకాల మృత్యువులు ఉండకూడదనే కోరుకుంటున్నారు. చాలా మంచిది, పరస్పరంలో మీటింగు చేసుకుంటారు. ఎప్పటినుండైతే ఈ వర్గాల సేవ ప్రారంభమయ్యిందో అప్పటినుండి అనేక సెంటర్ల పిల్లలకు సేవా ఛాన్సు లభించింది. కానీ బాప్ దాదా యొక్క ఒక్క విషయము ఇప్పటి వరకు పూర్తి కాలేదు, గుర్తుందా? ప్రతి వర్గం నుండి ఒక ప్రసిద్ధి చెందిన స్వీకర్ ను తయారు చెయ్యండి, మైక్ ను తయారు చెయ్యండి మరియు ఒకే స్టేజి పైన మూడు నాలుగు వర్గాలలోని విశేష వ్యక్తులు తమ అనుభవాన్ని వినిపించాలి. పరస్పరంలో ఒక గ్రూపును తయారు చెయ్యండి, అందులో ప్రతి వర్గంనుండి ఒకరు విశేషమైనవారు ఉండాలి ఏలా అయితే బ్రాహ్మణ పరివారానికి భాషణ కోసం నిమంత్రణ ఇచ్చి పిలుస్తారో, అలాగే ఆ పార్టీకి కూడా అక్కడక్కడ నిమంత్రణ ఇచ్చి భాషణకు ఛాన్సు ఇవ్వాలి. మరి ప్రతి వర్గంవారు కమల పుష్ప సమానంగా ఉంటూ ఎలా ముందుకు వెళ్తారో చూద్దాము. అచ్చా!

సమాజ సేవ వర్గము:- సమాజ సేవ, వీరు ఏమి సేవ చేస్తున్నారు అని సమాజంలో వ్యాపించిపోవాలి. సమాజ సేవను అయితే వాస్తవానికి అన్ని వర్గాలవారికి చెయ్యవచ్చు. బాప్ దాదా ఏమి చూసారంటే పరస్పరంలో ప్రతి వర్గము ఉల్లాస ఉత్సాహాలతో సంగఠనలోకి వస్తున్నారు మరియు సేవను కూడా చేస్తున్నారు. ఒకరికొకరు సహయోగాన్ని కూడా అందించుకుంటున్నారు. ఇప్పుడు సమాజంలో సందేశం వ్యాపించాలి. ఒకవేళ సమాజాన్ని సరి చెయ్యాలంటే బ్రాహ్మాకుమారీల వద్దకు వెళ్ళి, ఎలా సమాజ సేవ చేయవచ్చో చూడండి, అని వారు అనాలి. ప్రతి ఒక్కరూ మంచిగా చేస్తున్నారు, ఛాన్సును కూడా తీసుకుంటున్నారు. ముందుకు సాగండి మరియు ఇతరులను తీసుకెళ్ళండి. వీరు ఏమి చేస్తున్నారు అన్న సందేశాన్ని సమాజంలో వ్యాపింపజేయండి. అచ్ఛా!

డబుల్ విదేశీయులు:- డబుల్ విదేశీయులు చాలా మంచి ఛాన్సును తీసుకున్నారు. ప్రతి గ్రూపులో డబుల్ విదేశీయులు వస్తూ ఉంటారు. తెలివైనవారు. మీరు విడిగా కూడా ఛాన్సును తీసుకుంటారు మరియు ప్రతి గ్రూపులో కూడా వస్తారు. పేరు డబుల్ అని ఉంది కదా, కావున డబుల్ లాభాన్ని పొందుతున్నారు. భారతవాసులు కూడా మీరందరూ ఛాన్సును తీసుకోవడం చూసి సంతోషిస్తున్నారు. ఈ పెద్ద ప్రోగ్రామును ఫారెన్ లో కూడా బాగా చేసారు. కేవలం ఒక్క పేరులో తేడా ఉంది కావచ్చు, కానీ సేవ మంచిగా చేసారు. బాప్ దాదా అయితే ఫారెన్ సేవా రిజల్టును విన్నారు మరియు చూసారు కూడా. దేశము లేక విదేశములోని పిల్లలు అందరూ ఇప్పుడు సదా ఎవరెడీగా ఉండాలన్నది బాప్ దాదా కోరుకుంటున్నారు. ఒక మంచి విద్యార్థి చదువులో ఎప్పుడూ పరీక్షల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, తొందరగా పరీక్షలు అయిపోవాలి అని అనుకుంటాడు. అలాగే పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంతగా ఎవరెడీగా ఉండాలంటే, రేపే ఏమైనా జరిగినా కానీ ఎవరెడీ. అన్ని సబ్జెక్టులలో, నాలుగు సబ్జెక్టులలో ఎవరెడీ. సమయము రాగానే పాస్ విత్ హానర్ గా అయిపోవాలి. పిల్లలందరి పట్ల బాప్ దాదాకు ఉన్న శుభఆశ ఇదే. డబుల్ విదేశీయులకైతే బాప్ దాదా డబుల్ పురుషార్ధీలు అన్న టైటిల్ ను ఇచ్చారు. డబుల్ ఛాన్సును తీసుకున్నారు, చాలా బాగుంది. అచ్ఛా.

వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్సు ఆస్ట్రేలియాలో జరగనుంది, అందుకు దాదీ జానకి వెళ్ళనున్నారు:- బాగుంది, వారికి కూడా సమయపు పరిచయము మరియు బాబా గురించిన పరిచయము ఇవ్వండి. సమయము మరియు బాబా పరిచయము. మా బాబా వచ్చారు, కానీ మాకు తెలియలేదు అన్న ఫిర్యాదైతే రాకూడదు. సందేశమివ్వడంలో అయితే మీరు చురుకైనవారే. అవును, చేయించేది బాబాయే, కానీ చేసేవారు యోగ్యులైతేనే బాబా కూడా చేయిస్తారు కదా. బాగుంది. మీరు చేరుకుంటున్నారంటే చాలా మంచిది, బాప్ దాదా అయితే తోడుగా ఉన్నారు. తోడుగా కూడా ఉన్నారు, సహచరుడిగా కూడా ఉన్నారు. అచ్ఛా!

మొదటిసారి ఎంతమంది వచ్చారు, వారు లేవండి:- బాగుంది, ఈ రోజు మీరు బాప్ దాదా ముందుకు వచ్చినందుకు అభినందనలు, అభినందనలు. బాబా దృష్టి పిల్లలపై పడింది మరియు పిల్లల దృష్టి బాబాపై పడింది. చాలా చాలా అభినందనలు. అచ్ఛా! కేక్ అయితే లేదు కానీ సంతోషమనే కేక్ ను తినండి. బాగుంది, ఇప్పుడు ఆలస్యంగా వచ్చారు, కానీ ఫాస్ట్ గా వెళ్ళి ముందు నంబరును తీసుకోవచ్చు. అందుకే బాప్ దాదా తరఫున మరియు మీతోటి సోదరీసోదరులందరి తరఫున అందరికీ అభినందనలు, అభినందనలు. ఎటువంటి ఉదాహరణ జరుగుతుందంటే, లాస్ట్ లో వచ్చేవారు కూడా ఫాస్ట్ గా వెళ్ళి ఫస్ట్ లైన్లోకి రాగలరు. అచ్ఛా!

           నలువైపుల బాప్ దాదాల ఆశలను పూర్తిచేసే ఆశాదీపాలకు, ఎందుకు, ఏమిటి అన్న భాషనుండి అతీతంగా సదా ఏకరసంగా, సదా ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేకుండా, బాబాలోనే జీవితం యొక్క విశేషమైన మూడు సంబంధాలు... తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువులను అనుభవం చేసుకునేవారికి, బాబా నుండి వారసత్వము, టీచరు నుండి చదువు మరియు సద్గురువు నుండి వరదానాల వారసత్వాన్ని పొందే పదమారెట్ల భాగ్యశాలి పిల్లలందరికీ బాప్ వాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీలతో:- అందరూ అందరికీ సహయోగాన్ని ఇచ్చారు. ఎలా చెయ్యాలి అన్న ఆలోచన ఎవ్వరూ చెయ్యాల్సిన అవసరం రాలేదు, చెయ్యాల్సిందే. ఒకరికొకరి సహయోగంతో అన్ని ప్రోగ్రాములు మంచిగా అయ్యాయి. సందేశమైతే వ్యాపించింది, సందేశమైతే లభించింది, ఇప్పుడు ముందుకు సాగండి. ఎందుకంటే వరదానాలు తీసుకోవడము అన్నదే కదా టాపిక్. యోగపు ప్రోగ్రాముతో అనుభవం చేసుకున్నారు.

సంతోష్ అక్కయ్య(సాయన్) స్మృతిని పంపారు:- వారికి స్మృతిని ఇవ్వండి. చాలా చాలా ప్రియస్మృతులను స్వీకరించండి.

దాదీ నిర్మలశాంతతో:- ధైర్యముంచితే తండ్రి సహాయమైతే తప్పక ఉంటుంది. బాగుంది, కర్మభోగాన్ని కూడా కర్మయోగంలోకి మార్చేసారు, చాలా మంచిది.

రమేష్ అన్నయ్య, ఉష అక్కయ్య, అనీల అక్కయ్యలతో:- ఇప్పుడు ముగ్గురి ఆరోగ్యం బాగుంది. ఇక్కడ అందరి శక్తి లభిస్తుంది, వాయుమండలపు సహకారం కూడా లభిస్తుంది. బాగుంది, ఇక్కడ బాగుంటే బాగున్నట్లే. ఎప్పటి వరకు ఉండగలరో అప్పటి వరకు ఉండండి. (రమేష్ అన్నయ్యతో) మీరు మీ పని చేసుకోండి, వీరు తమ పని చేసుకుంటారు. (ఉష అక్కయ్యతో) మీరు ఇక్కడ కూర్చునే సెంటర్లకు ఫోన్లు చేసి క్షేమ సమాచారాలను ఇస్తూ ఉండండి. వీరి పని వీరిది, మీ పని మీది. (వీరి 50 సంవత్సరాలను జరుపుకున్నాము) 50 సంవత్సరాలు నిర్విఘ్నంగా గడిచాయి, ముందుకు సాగుతూ ఉండండి, వెనుక ఉండకండి, ఇందుకు అభినందనలు. ఒకరికొకరు సహయోగులయ్యారు మరియు సేవలో కూడా సహయోగులుగా ఉన్నారు. వీరు కూడా సంతోషిస్తున్నారు. బాప్ దాదాకు శాంతమాత చాలా గుర్తుకు వస్తారు. తాను పునాది కదా. తాను గుప్తమైన రత్నము.

బృజ్ మోహన్ అన్నయ్యతో:- ప్రోగ్రాము తయారు చేస్తూ ఉండండి, ఇది పూర్తయిపోయింది కదా అని అనుకోకండి. టాపిక్ మరో విధంగా మార్చి కొద్ది మార్పుతో చెయ్యండి.

(వి.ఐ.పి. లు బాప్ దాదాతో కలుస్తున్నారు):- ఎవరైతే ధైర్యాన్ని ఉంచుతారో వారికి 100 రెట్ల సహాయం లభిస్తుంది. లభిస్తూ ఉంటుంది. ఆ డ్యూటీని కూడా చెయ్యండి. ఉన్నంతవరకు డ్యూటీని చెయ్యండి, కానీ డబుల్ పని చేయండి, సింగల్ కాదు.

2. శక్తిని నింపుకుని కనెక్షన్‌ను పూర్తిగా పెట్టుకోండి. ఎవరి కనెక్షన్‌ అయితే ఉంటుందో వారి రిలేషన్ పక్కా అవుతూ ఉంటుంది. ఒకవేళ సమయం లభించకపోయినా కానీ రోజూ ఫోన్ ద్వారా అయినా మీ హాజరును వేసుకోండి అప్పుడు పక్కాగా స్టూడెంటగ్ గా నంబరువన్ గా అవుతారు.

            ఏ ఆత్మ అయితే వెళ్ళిందో, తాను కూడా కనెక్షన్ లో వెళ్ళింది. కొడుకులను ఏదో ఒక కారణంతో సంబంధంలోకి తీసుకురండి. రెగ్యులర్ గా కాకపోయినా ఏదో ఒక ఫంక్షన్‌కు తీసుకురండి, వారి సేవను చెయ్యండి, అలా కూడా బాగుంటుంది. ఈ సంపర్కం ద్వారా తోడు కూడా లభిస్తుంది, భవిష్యత్తు కూడా తయారవుతుంది. కనెక్షన్‌ను తెంచవద్దు. పక్కా! బాప్ దాదా ఇప్పుడు కూడా శక్తిని ఇస్తున్నారు, ముందుకు కూడా తీసుకువెళ్తారు, ఏమీ చింత చెయ్యవద్దు. నిశ్చింతగా అయి సేవ చెయ్యండి, బాప్ దాదా తోడుగా ఉన్నారు.

Comments