15-11-2009 అవ్యక్త మురళి

    15-11-2009        ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

  “స్వరాజ్యపు రిజల్టును పరిశీలించుకొని స్వయాన్ని పరివర్తన చేసుకోండి మరియు అఖండ రాజ్యానికి అధికారులుగా అవ్వండి.”

           ఈ రోజు దిలారామ్ బాబా తమ ప్రియమైన పిల్లలను కలవడానికి వచ్చారు. ఎందుకు ప్రియమైనవారు? పిల్లలు ప్రతి ఒక్కరూ మూడు సింహాసనాలకు యజమానులు అని తెలుసా? ఒకటి, స్వరాజ్య సింహాసనము, రెండవది బాప్ దాదాల హృదయ సింహాసనము, మూడవది - భవిష్య సింహాసనము. మీరు మూడు సింహాసనాలకు అధికారులు. మీ భవిష్య సింహాసనం కోసం కూడా ఇక్కడే అభ్యాసం చేస్తున్నారు. భవిష్యత్తు కోసం ఏర్పాట్లు మరియు పురుషార్థాన్ని ఇక్కడే చేస్తున్నారు. ఇప్పటి పురుషార్థము అనేక జన్మలకు రాజ్య భాగ్యాన్ని ఇప్పిస్తుంది. ఈ సమయంలోనే మీ రాజ్య భాగ్యపు సంస్కారాన్ని ధారణ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటి పురుషార్థము భవిష్య రాజ్యానికి అధికారిగా చేస్తుంది. మరి ఈ సమయంలో ఉన్న మీ పురుషార్థము యథార్థంగా ఉందా అని పరిశీలించుకోండి. భవిష్యత్తులో ఒక్క రాజ్యమున్నట్లుగా ఇప్పుడు మా మనసులలో ఒకే రాజ్యం నడుస్తుందా అని పరిశీలించుకోండి. పురుషార్థంలో ఒక్క రాజ్యం ఉందా? లేక మీ రాజ్యంలో మాయ విఘ్నాలను కలిగిస్తోందా? ఒక్క రాజ్యానికి బదులుగా మాయ ప్రభావం పడటం లేదు కదా? రెండు రాజ్యాలైతే లేవు కదా? ఒకే రాజ్యము అన్నది భవిష్యత్తుకు ఉన్న విశేషత. ఇప్పటి అభ్యాసమే భవిష్యత్తులో జరుగుతుంది. మరి ఇప్పుడు స్వరాజ్యము ఉందా, స్వరాజ్యంలో మాయ తల దూర్చడం లేదు కదా? రెండు రాజ్యాలైతే లేవు కదా? అని పరిశీలించుకోండి. ఒకవేళ రెండు రాజ్యాలు ఉన్నట్లయితే ఒక్క రాజ్యపు సంస్కారాన్ని ఎప్పుడు నింపుకుంటారు? ఒకే రాజ్యము, ఒకే ధర్మము అన్నది భవిష్యత్తుకు ఉన్న విశేషత. అక్కడ ఏ ధర్మము ఉంటుంది? మీ విశేష ధారణ ఏమిటి? సంపూర్ణ పవిత్రత. ఒకే ధర్మము ఉందా అని పరిశీలించుకోండి. మధ్యలో అపవిత్రత అను రెండవ ధర్మము దూరడం లేదు కదా? దీనితో పాటు లా అండ్ ఆర్డర్ ఒక్కరిదే ఉందా లేక మాయ అందులో కూడా ప్రవేశిస్తుందా? ఒక్కరి రాజ్యము నిర్విఘ్నంగా జరుగుతోందా? అని కూడా పరిశీలించుకోండి. మరో విషయమేమిటంటే రాజ్యంలో సదా సుఖము మరియు శాంతి సహజంగా ఉంటాయి, మరి ఇప్పుడు చూసుకోండి మీ రాజ్యంలో సదా సుఖశాంతులు ఉన్నాయా? ఎవ్వరూ మధ్యలో ప్రవేశించడం లేదు కదా? స్వరాజ్యంలో మాయ కలుగజేసుకుని అశాంతిని వ్యాప్తి చెయ్యడం లేదు కదా? స్వరాజ్యంలో ఏదో ఒక సాల్వేషన్ లేక ప్రశంసల ప్రభావాన్ని మాయ తీసుకురావడం లేదు కదా? సదా సుఖము, శాంతి, ఆనందము, ప్రేమ, అతీంద్రియ సుఖము స్థిరంగా ఉంటున్నాయా? ఎందుకంటే భవిష్య రాజ్యంలో సర్వ ప్రాప్తులు, సంపన్నత ఉంటాయి అని మీకు తెలుసు. దీని కారణంగా సంతుష్టత కూడా ఉంటుంది. మరి ఇప్పుడు కూడా స్వరాజ్యము సంపన్నంగా ఉన్నదా లేక ఏదైనా లోటు ఉందా? ఎందుకంటే ఇప్పటి పురుషార్థంలో ఒకవేళ లోపం ఉండిపోయినట్లయితే భవిష్య అఖండ రాజ్యానికి అధికారులుగా ఎలా అవ్వగలరు! ఆధారమంతా ఇప్పటి పురుషార్థం పైననే ఉంది. ఇప్పుడు ఉన్న ఏదైనా లోపము భవిష్యత్తులో సంపూర్ణ రాజ్యానికి అధికారిగా కానివ్వదు. బహుకాలపు ఈ స్వరాజ్య అభ్యాసము భవిష్య రాజ్యానికి అధికారిగా చేస్తుంది. కావున మీ ఈ చెకింగ్ సదా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ బహుకాలపు పురుషార్థము లేనట్లయితే ప్రాలబ్ధము కూడా తక్కువగా లభిస్తుంది. అందుకే బాప్ దాదా సమయానుసారంగా ఈ అటెన్షన్ ను ఇప్పిస్తున్నారు - ఇందుకోసం ఇప్పుడు స్వయాన్ని సంపన్నంగా మరియు సంపూర్ణంగా తయారు చేసుకోండి. పురుషార్థం అయితే జరుగుతోంది అని అప్పుడప్పుడూ అంటూ ఉంటారు కానీ పురుషార్థం చేస్తూ మధ్యలో 'అయితే, అయితే' అని అనడం లేదు కదా! ఇది అయితే అయిపోతుందిలే, ఇది అయితే చేస్తాములే, ఈ సంస్కారము 21 జన్మల అవినాశి, అఖండ రాజ్యానికి అధికారిగా అవ్వనివ్వదు.

           కావున బాప్ దాదా సదా కోసం అటెన్షన్ ను ఇప్పిస్తున్నారు, పరిశీలించుకోండి. ఒకవేళ ఏదైనా విఘ్నము వచ్చినా కానీ, తుఫాను వచ్చినా తుఫాను తోఫా(బహుమతి)గా మారిపోవాలి. తుఫాను తుఫానుగా కాక తోఫాగా మారిపోవాలి. ఏ విధమైన మాయా దాడి జరిగినా, మాయ అలా అనుభవం చేయిస్తుంది, ఆ అనుభవం కూడా మనకు అనుభవం అనే మెట్లు మనల్ని ముందుకు తీసుకు వెళుతున్నాయి అన్నట్లుగా అనుభవం అవ్వాలి. దీని కోసం బాప్ దాదా సదా మీ చార్టును మీరే పరిశీలించుకోండి అని అంటారు. ఎంతగా మీ చార్టును పరిశీలించుకుంటారో అంతగా చెక్ చేసుకుని ఛేంజ్ చేసుకుంటారు. మరి ప్రతి ఒక్కరూ తమ చార్టును పరిశీలించుకుంటున్నారా? చేసుకుంటున్నారా? రోజూ పరిశీలించుకునేవారు చేతులెత్తండి. రోజూ చేసేవారు, అప్పుడప్పుడూ చేసేవారు కాదు. రోజు చార్టును చెక్ చేసుకోండి మరియు ఛేంజ్ అవ్వండి ఎందుకంటే సమయపు సూచనను బాప్ దాదా చాలా కాలం నుండి ఇస్తున్నారు. సమయాన్ని కూడా చూస్తున్నారు. మనుష్యుల మనసులలో చింత కూడా పెరిగిపోతోంది కానీ మీ మనసులో చింత కాదు, ప్రభు చింతన ఉంది. ప్రభు చింతన ఉన్న కారణంగా మేము నిమిత్తులము, నిర్మాణులము.. అని మీకు తెలుసు. ఎందుకంటే చేయించేవారు బాబా అని మీకు తెలుసు. దీని కారణంగా మీ మనసులో చింత లేదు, చేయించేవారు చేయిస్తున్నారు అన్న స్మృతి సదా ముందుకు తీసుకువెళుతోంది.

           ఈ సంగమయుగంలో ఒక్కొక్క క్షణము, సమయము మరియు సంకల్పము శుభంగా జరుగుతున్నాయా అని ఇప్పుడు విశేషంగా పరిశీలించుకోవాలి. ఈ సమయానికి ఉన్న మహత్వాన్ని తెలుసుకోండి. ఒక్క క్షణమునకు కూడా విలువ ఉంది, మహత్వము ఉంది. అప్పుడుప్పుడు పిల్లలు, సంకల్పాలు అయితే వచ్చాయి కానీ రెండు నాలుగు క్షణాలు మాత్రమే అని అంటారు. కానీ సంగమ సమయానికి విలువ ఉంది, ఇప్పటి ఒక్క క్షణము ఒక్క గంటతో సమానము. ఈ సమయానికి ఇంతటి మహత్వము ఉంది. అకస్మాత్తుగా ఏ సమయంలో అయినా మీ ఫైనల్ పేపర్ రావచ్చు అని బాప్ దాదా చెప్పి ఉన్నారు. బాప్ దాదా కూడా తెలియజేయరు. కావున ఈ సమయపు అటెన్షన్ - సంపూర్ణంగా మరియు సంపన్నంగా అవ్వాలి. బాప్ దాదా ఏ సర్వ ఖజానాలనైతే ఇచ్చారో ఆ ఒక్కొక్క ఖజానాను సమయానికి కార్యంలో వినియోగంచండి. ఖజానాలకు యజమానులు మీరు, యజమాని విశేషత ఏమిటంటే ఏ సమయంలో ఏ ఖజానా అవసరముంటుందో ఆ సమయంలో ఆ ఖజానాను కార్యంలో పెడతారు. మీరు ఇముడ్చుకునే శక్తిని ఆజ్ఞాపిస్తే ఇముడ్చుకునే శక్తి కార్యంలోకి వస్తోందా? ఎందుకంటే ఎవరైతే సమయానికి తమ ఖజానాలను కార్యంలో వినియోగిస్తారో వారినే యజమాని అని అంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్వయంపై ఇంతటి అటెన్షన్ ను ఇవ్వాలి. అందరిలో ఉన్న సంతోషపు ఖజానా సదా ముఖంలో మరియు నడవడికలో కనిపించాలి. అవినాశి తండ్రి ప్రసాదము ఈ సంతోషము. మరి అవినాశి తండ్రి ఇచ్చినదానిని అవినాశిగా నిలుపుకోండి. సంతోషం గురించి ఇలా అంటారు - సంతోషమువంటి ఔషధం లేదు, సంతోషము వంటి ఖజానా మరొకటి లేదు. ఎవరిలో అయితే సంతోషము ఉంటుందో వారి నయనాలలో, ముఖంలో, నడవడికలో ఆటోమేటిక్ గా అది కనిపిస్తుంది. సదా సంతోషంగా ఉండండి మరియు సదా సంతోషాన్ని పంచండి అన్నది బాప్ దాదా ఇచ్చిన వరదానము. ఎందుకంటే సంతోషాన్ని పంచడం ద్వారా సంతోషం పెరుగుతుంది. మిగతా ఖజానాలైతే పంచడం వలన తరిగిపోతాయి. కానీ సంతోషపు ఖజానాను ఎంతగా పంచుతారో అంతగా అది పెరుగుతుంది. సంతోషపు ఖజానా స్థిరంగా ఉందా అని పరిశీలించుకోండి.

           ఇప్పుడు పిల్లలందరికీ దేశం వారు కావచ్చు, విదేశం వారు కావచ్చు, పిల్లలందరికీ బాప్ దాదా ఒక విషయంలో విశేష అభినందనను తెలియజేస్తున్నారు. ఏ విషయము? దేశంలో కానీ, విదేశంలో కానీ , తమ ఉల్లాస-ఉత్సాహాలతో ఆత్మలకు బాబా సందేశాన్ని ఇచ్చారు. అందరూ సంతోషంతో ఏ కార్యాన్నయితే చేసారో ఆ కార్యంలో ప్రోగ్రాము ఒకటి చేసారు, ప్రతి చోట ఒకే కార్యక్రమాన్ని చేసారు కానీ అందుకు ఫలితం వేయి రెట్లను పొందారు. ఇప్పటి సమయ ప్రమాణంగా ఏవైతే పరిస్థితులున్నాయో అవి ముందు ముందు మరింత నాజూకుగా అవ్వనున్నాయి. అందుకే గ్రామంలో కానీ, ఏ మూలన ఉన్నాకానీ మా తండ్రి వచ్చారు, కానీ మాకు మీరు సందేశం ఇవ్వలేదు అన్న ఫిర్యాదు రాకూడదు అన్నది బాప్ దాదా సంకల్పము. అందుకే అందరూ ఉల్లాస ఉత్సాహాలతో ఈ సేవను చేసారు, బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఇలాగే పరస్పరంలో కలుసుకుని ఇటువంటి ప్రోగ్రాములను తయారు చెయ్యండి. తమ ఉల్లాస ఉత్సాహాలను, ధైర్యమును ప్రతి ఒక్కరూ తమ తమ విధి అనుసారంగా కార్యంలో వినియోగించారు కానీ ఇప్పుడైతే అందరూ చాలా బాగా చేసారు. సమయ ప్రమాణంగా ఎక్కడా, ఏ మూలన సందేశం మిగిలిపోకూడదు అని గుర్తుంచుకోండి అన్న లక్ష్యమును ఉంచండి. ఇందులో తమ స్వ పురుషార్థం కూడా మంచిగా అవుతుంది మరియు ఆత్మల కళ్యాణం కూడా జరుగుతుంది. అందరికీ ఈ ప్రోగ్రాములు మంచిగా అనిపించాయి కదా! మంచిగా అనిపించాయా! బాప్ దాదా పిల్లలందరికీ పదే పదే ఇదే చెప్తున్నారు - ఆత్మల పట్ల దయాహృదయులుగా అవ్వండి. ఈ రోజుల్లో దుఃఖం, అశాంతి కారణంగా అందరూ దయ చూపండి, కృప చూపండి అని మనసుతో అంటున్నారు. మరి బాబాకు సహచరులు పిల్లలైన మీరే కదా. ఇప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరి దయా హృదయ పాత్రను చూడాలని బాబా ఆశిస్తున్నారు. ఈ దుఃఖమయ ప్రపంచం మారి సుఖమయ ప్రపంచం రావాలన్నది మీ అందరి ఉత్సాహము. మరి సుఖమయ ప్రపంచం రావడానికి ఈ దుఃఖ అశాంతులు వినాశనం కావడానికి పరిస్థితులు మారుతున్నాయి. కావున ఈ రోజు బాబా ఇచ్చే ఈ సందేశాన్ని సదా గుర్తుంచుకోండి - ఇప్పుడు మనసా కావచ్చు, వాచ కావచ్చు, ముఖం మరియు నడవడికతో సేవా గతిని పెంచుతూ వెళ్ళండి. మీ రాజ్యాన్ని సమీపంలోకి తీసుకువస్తూ ఉండండి. అచ్ఛా.

           ఈసారి మొదటి సారిగా బాప్ దాదాను కలవడానికి వచ్చినవారు చేతులెత్తండి. అచ్ఛా, చాలా మంచిది. కొంచం లేవండి. అభినందనలు. అయినా సమాప్తికి ముందే చేరుకున్నారు. క్రొత్త జన్మను తీసుకున్నారు. ఇందుకు అందరి తరఫున ఇప్పుడు రాబోయే పిల్లలకు బాప్ దాదా మరియు నలువైపుల ఉన్న పిల్లల ద్వారా అభినందనలు, అభినందనలు. బ్రాహ్మణ పరివారాన్ని చూసి సంతోషంగా ఉంటుంది కదా! కానీ ఎవరైతే ఇప్పుడు వచ్చారో వారికి బాబా ఇదే చెప్తారు ఇప్పుడు చాలా సమయం గడిచిపోయింది, చాలా కొద్ది సమయమే మిగిలి ఉంది, అందుకే పురుషార్థాన్ని తీవ్రం చేయండి. తీవ్ర పురుషార్ధీలు ముందుకు వెళ్తారు, నడవడం కాదు ఎగరాలి. ఎగిరే కళ యొక్క పురుషార్థాన్ని చేయాలి. కావున ఆలస్యంగా వచ్చినా కానీ బాబా వారసత్వంపై తమ పూర్తి హక్కును తీసుకోవచ్చు. ప్రతి క్షణము సంతోషంగా ఉండాలి మరియు అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. అచ్ఛా!

సేవ టర్ను యు.పి, బనారస్ మరియు పశ్చిమ నేపాల్ వారిది:- సేవ కోసమై వచ్చినవారు లేవండి. మంచి అవకాశాన్ని తీసుకున్నారు. యు.పి.లో మీ సేవకు స్మృతి చిహ్నాలు చాలా ఉన్నాయి. భక్తి మార్గపు మందిరాలు కూడా చాలా ఉన్నాయి, నదులు కూడా చాలా ఉన్నాయి. మరి యు.పి. వారు నలు వైపుల సేవను పెంచుతూ కూడా ఉన్నారు, ఇకపై కూడా పెంచుతూ ఉంటారు. ఇప్పుడు బాప్ దాదా అన్ని జోన్లకు ఈ విధంగా చెప్తున్నారు - ప్రతి ఒక్కరూ తమ జోనులో ఎటువంటి గ్రూపును తయారు చెయ్యండంటే ఆ గ్రూపులో అన్ని వర్గాలవారు ఉండాలి. మీకు వర్గాలు ఉన్నాయి కదా, సేవ కోసం ప్రతి జోను వారు తమ ప్రదేశాలలో ప్రతి వర్గపు సేవను చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు కానీ ప్రతి జోన్ లో ఎటువంటి సేవా గ్రూపు ఉండాలంటే, అందులో ప్రతి వర్గానికి చెందినవారు ఒకరు ఉండాలి. మరియు ఎక్కడ ప్రోగ్రాము చేసినా కానీ అక్కడ ఆ గ్రూపు వారు తమ వర్గానికి విశేష నిమంత్రణను ఇవ్వండి. ఏ వర్గం వారు కూడా మాకు సందేశం అందలేదు అన్న ఫిర్యాదును చెయ్యకూడదు. అంతే కాక వెరైటీ గ్రూపులుగా ఏదైతే అయ్యారో దాని నుండి కూడా సేవను పెంచండి. తమ వర్గము మరియు దానితో పాటు ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానంతో మాకు ఏమి లభించింది మరియు ఏమి అనుభూతి జరిగింది అని తమ తమ అనుభవాన్ని వినిపించండి. ప్రతి జోన్ లో ఇటువంటి సేవా గ్రూపును తయారు చెయ్యండి. భాషణ చెయ్యడానికి అంతగా సమయము లభించకపోయినా కానీ వారిని ఫంక్షన్ సమయంలో వెనుక కూర్చోపెట్టి వారి పరిచయాన్ని స్టేజ్ సెక్రటరీ ఇవ్వాలి. ఒకరిద్దరి అనుభవాన్ని కూడా పెట్టవచ్చు. పరివారంలో ఉంటూ తమ పనులను చేసుకుంటూ మీ జీవితం ఎలా గడిచింది, ఎలా మారింది అన్న అనుభవాన్ని అవకాశం తీసుకుని సమయం ఉంటే వినిపించండి.

           గ్రూపుగా సేవను చేసే విశేష మైకులు కూడా కావాలి అని బాప్ దాదా ఇంతకు ముందు కూడా వినిపించి ఉన్నారు. బాగుంది, యు.పి. విశేషంగా బ్రహ్మాబాబా పాలనను తీసుకోవడములో అధికారాన్ని పొందింది. యు.పి.లో బ్రహ్మా పేరుతో స్మృతి చిహ్నం కూడా ఉంది. మమ్మా మరియు బ్రహ్మా బాబాల పాలనను తీసుకున్న యు.పి.కి ఎంతో భాగ్యము. పాలన లభించిన ధరణి. భాగ్య సితార అయిన బ్రహ్మా బాబా మరియు జగదాంబ యు.పి.ని వరదానంగా ఇచ్చారు. బాగుంది. ఇప్పుడు రోజు రోజుకూ సేవా కేంద్రాలు, ఉప సేవా కేంద్రాలు మరియు గీతా పాఠశాలలు ముందుకన్నా బాగా పెరుగుతున్నాయి. ఇందుకు బాప్ దాదా విశేషంగా అభినందలు తెలుపుతున్నారు. ముందుకు వెళ్తూ ఉండండి మరియు వృద్ధి చెయ్యడంలో మరియు సందేశం ఇవ్వడంలో నంబరు వన్ ను తీసుకోండి. బాగుంది, బాప్ దాదా సంతోషిస్తున్నారు, ఇంకా పెంచుతూ వెళ్ళండి. టీచర్లకు అభినందనలు. వృద్ధి చేస్తున్నారు. ఇంతకన్నా కూడా ఎక్కువగా వృద్ధి చేస్తూ ఉండండి. అచ్ఛా.

మహిళ వర్గంవారి మీటింగ్ జరుగుతోంది:- మంచిది, ఎప్పటి నుండైతే బాప్ దాదా కార్యానికి నిమిత్తమయ్యారో అప్పటి నుండి మాతల కళ్యాణము జరుగుతోంది. బాబా ముందుగానే మాతలపై కలశాన్ని పెట్టారు. పాండవులు తోడుగా ఉన్నా కానీ విశేషంగా మాతలు సేవకోసమై ముందు ఉండే విశేషత ప్రారంభమయ్యింది. ఎప్పటి నుండైతే బాప్ దాదా మాతలకు హోదను ఇచ్చారో అప్పటి నుండి ప్రభుత్వంలో కూడా ఈ మధ్య మాతలు అన్నిటిలో, ప్రతి కార్యంలో సహయోగాన్ని అందించి అద్భుతం చేస్తున్నారు. సంగమయుగపు లేక బాప్ దాదాల కార్యానికి విశేషత మరియు నవీనత మాతలు. ఎలా అయితే మాతల విశేషత ఇప్పుడు బాప్ దాదా ఎదుట పెరుగుతూ ఉందో అలాగే ప్రభుత్వంలో లేక ఈనాటి ప్రపంచంలో కూడా మాతల వైపు అందరి దృష్టి ఉంది. కావున ఈ ప్రోగ్రామును వైభవంగా చెయ్యండి. మాతల శక్తి, మాతల పాలన ఎంత ఉన్నతమైనది అన్నది అందరూ చూడాలి. ఇప్పుడు మాతలు పరివారంలో ఉంటూ తమ పిల్లలను ఎటువంటి ఉదాహరణగా తయారు చెయ్యండంటే ఇంటిని ఆశ్రమంగా ఎలా తయారు చేసుకోవాలి, పిల్లలు ఎలా తమ మర్యాదలలో ఉంటున్నారు అని బాప్ దాదా చెప్పడానికి మీ ఇల్లు సాంపుల్ గా కావాలి. పిల్లలు మారాలి అన్న అభిప్రాయం ప్రభుత్వ సమస్య. దానిని మాతలు ప్రాక్టికల్ గా ఎలా చూపించాలంటే, ఈ మాతలు పిల్లల కళ్యాణం కూడా చేస్తున్నారు అని ప్రభుత్వం భావించాలి. ఎవరైతే స్వయం తయారయ్యారో వారు పిల్లలను ఎలా తయారు చెయ్యాలంటే- వీరు ఎంతటి అద్భుతాన్ని చేస్తున్నారు. అని ప్రభుత్వానికి కనిపించాలి. బాగుంది. మాతల ప్రోగ్రాము పెట్టడం వలన మాతలకు ఉల్లాస ఉత్సాహాలు వస్తాయి, అప్పుడు వారు ఇతరుల సేవనూ చెయ్యగలరు. బాగుంది, సఫలత ఉండనే ఉంది. అచ్ఛా.

ఇండోర్ హాస్టల్ కుమారీలతో:- బాగుంది, కుమారీలు స్వయాన్ని శక్తి రూపాలుగా భావించండి. మేము కుమారీలము కాదు, శివ శక్తులము. ఈ పరివర్తనతో ఎంతటి అద్భుతాన్ని చేసి చూపించండంటే, మీలోని పరివర్తన యొక్క ప్రత్యక్ష రూపమును మీ ముఖము మరియు నడవడికతో సేవలో సాక్షాత్కారం చేయించండి. మీరు పెద్దక్కయ్యలను, దాదీలను చూస్తారు కదా, వారిని చూడగానే వారి ప్రభావము ప్రజలపై పడుతుంది, వైబ్రేషన్ ఉంటుంది. అలాగే ఒక్కొక్క కుమారి మీలో ఎంతగా శక్తిని నింపుకోవాలంటే, మీరు ఎక్కడకు వెళ్ళినా, ఎవరి సేవను చేసినా, వీరు సాధారణ కుమారీలు కాదు. శక్తులు, దేవతలు అని అనుభవం కావాలి. మీ ముఖంలో తండ్రి ముఖము, బ్రహ్మా బాబా పాలనా ప్రభావము కనిపించాలి. చివరలో ఇటువంటి సేవా పాత్రయే జరుగనుంది. కావున ప్రతి ఒక్క కుమారి ఇంతటి శక్తిని స్వయంలో నింపుకోవాలి. బాగుంది, మంచిగా నడుస్తున్నారు, ముందుకు కూడా వెళ్తున్నారు కానీ ఇప్పుడు మీ ముఖము, నడవడిక అతీతంగా మరియు ప్రియంగా కనిపించాలి. ఇకపోతే అంతా మంచిగా ఉంది, బాప్ దాదా సమాచారాన్ని వింటూ ఉంటారు. ఒక్కొక్కరు సెంటరును సంభాళించే యోగ్యమైన హ్యాండ్ గా అయినట్లయితే ఎన్ని సెంటర్లు తెరుచుకుంటాయి! ప్రతి కుమారి ఒక సెంటరును సంభాళించే యోగ్యతను నింపుకోండి. ఇంతటి యోగ్యులుగా అవ్వండి. ఈ రోజుల్లో టీచర్లు సేవకు చాలా అవసరము. కానీ నిర్విఘ్న టీచరుగా కావాలి. నిర్విఘ్న టీచరుగా అయి ఉల్లాస ఉత్సాహాలతో ఎంత ఎగురుతున్నారు అని వ్రాసి పంపండి. మీ జీవితాన్ని తయారు చేసుకుంటున్నారు, మంచిది. వీరు భవిష్యత్తులో నిర్విఘ్న నంబరువన్ టీచరుగా అవ్వాలని కుమారీలకు అందరూ ఆశీర్వాదాలు ఇవ్వండి, సహయోగాన్ని ఇవ్వండి. హ్యాండ్స్ అవసరము ఉంది కదా. విదేశాలలో కూడా కావాలి. నిర్విఘ్న టీచరు, దీనిని ముఖ్యంగా అండర్ లైన్ చేసుకోండి. ఇప్పుడు బాప్ దాదా వద్దకు రిజల్టు వస్తుంది, సరేనా. ఇటువంటి లక్ష్యమే ఉంది కదా! అచ్ఛా.

ఈ గ్రూపులో క్యాడ్ వారు(దిల్ వాలే) కూడా వచ్చారు:- బాగుంది, ప్రతి ఒక్కరూ పరస్పరంలో సలహా తీసుకుని మీ సేవను ముందుకు తీసుకు వెళ్తున్నారు, ఉల్లాస-ఉత్సాహాలను ఇచ్చుకుంటూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. స్వయాన్ని ఈ కార్యంలోనే బిజీగా ఉంచుకుంటున్నారు కనుక అందుకు రిజల్టుగా పురుషార్థపు బలము కూడా లభిస్తుంది మరియు ఫలము కూడా లభిస్తుంది. ఎన్ని ప్లాన్లు అయితే చేస్తున్నారో, ఎన్నిటిని ప్రాక్టికల్ లోకి తీసుకు వస్తున్నారో వాటన్నిటికీ బాప్ దాదా తరఫున ప్రతి గ్రూపుకు విశేషమైన శక్తి ద్వారా కూడా బాప్ దాదా సహయోగాన్ని ఇస్తారు. బాగుంది. ముందుకు వెళ్తూ ఉండండి, ముందుకు నడిపిస్తూ ఉండండి. అచ్ఛా!

కాల్ ఆఫ్ టైమ్ అతిథులతో:- మీరు అదృష్టవంతులు, మీ భాగ్యమే మీ అందరినీ ఇక్కడకు తీసుకు వచ్చింది. ఇప్పుడు ఈ భాగ్యాన్ని పెంచుతూ ఉండండి. పెంచడానికి సాధనము ఏమిటి? ఒకటి. కనెక్షన్ తప్పకుండా పెట్టుకోవాలి. కనెక్షన్ కన్నా ముందు ఈ బ్రాహ్మణ పరివారంతో, బాప్ దాదాతో రిలేషన్‌ను ముందుకు తీసుకు వెళ్తూ ఉండండి. ఎంతగా కనెక్షన్, రిలేషన్ పెట్టుకుంటారో అంతగా తరగని ఖజానాలు జమ అవుతూ ఉంటాయి. ఖజానాలకు యజమానిగా అయిపోతారు. ఏ సమయంలో ఏ శక్తి కావాలో, ఏ గుణం కావాలో దానిని అనుభవం చేస్తూ ఉంటారు. బాగుంది. ఈ ప్రోగ్రాము ఏదైతే చేసారో, చేస్తూనే ఉంటారో, అది బాప్ దాదాకు మంచిగా అనిపిస్తుంది. మధువనంలోకి, ఇండియాకు రావడం ఇష్టమే కదా! నచ్చుతుందా? చూడండి, మిమ్మల్ని చూసి ఇండియాలోని మీ సోదరీసోదరులు కూడా సంతోషిస్తారు. అందరి మనసులలో మా సోదరీసోదరులు వచ్చేసారు, వచ్చేసారు అని ఉంది. సంతోషమేస్తుంది. చూడండి, మీరు కూడా సంతోషిస్తారు. ఇంత పెద్ద పరివారాన్ని ఎక్కడైనా విన్నారా, చూసారా! ఇప్పుడు చూడండి, మీ పరివారము ఎంత పెద్దదో! కావున పిల్లలు ప్రతి ఒక్కరూ బాప్ దాదాల పదమారెట్ల ప్రియస్మృతులను స్వీకరించండి. అచ్ఛా.

40 దేశాల నుండి 300 మంది డబుల్ విదేశీ సోదరసోదరీలు వచ్చారు:- బాప్ దాదా సంతోషిస్తున్నారు. ప్రతి సంవత్సరం జరిగే ఈ సంగఠన ఇక్కడి భారతదేశపు సోదరసోదరీలకు కూడా నచ్చుతుంది. బాప్ దాదాకైతే ఎలాగూ నచ్చుతుంది. ప్రతి సంవత్సరము రాబోవు సేవల గురించి మరియు స్వ చార్టు రెండింటి గురించి పరస్పరంలో ఇచ్చిపుచ్చుకోవడం చేసి ఇతరుల ఉల్లాస ఉత్సాహాలను పెంచుతారు, ఇది చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. మీ అందరినీ కూడా ఇంతమంది సోదరసోదరీలు కలుస్తారు, చూస్తారు, సంతోషిస్తారు. అది చూసి మీరు కూడా సంతోషిస్తారు కదా! బాగుంది, బాప్ దాదా డైరెక్షన్లను ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చే ఉల్లాస ఉత్సాహంతో ఒకరికొకరు అటెన్షన్‌ను ఇప్పించుకుంటారు. పురుషార్థాన్ని చల్లబర్చే సమస్యను ఇతరులకు వినిపించడం వలన పురుషార్థంలో తీవ్రగతి వస్తుంది. ఇతర సోదరసోదరీలను కలిసి ఒక్కొక్కరి పురుషార్థాన్ని చూసి ముందుకు కూడా వెళ్తూ ఉంటారు. ఈ ప్రోగ్రాము బాప్ దాదాకు నచ్చింది. మీకు కూడా ఇష్టమే కదా! ఇష్టమేనా? పాండవులకు ఇష్టమేనా? ఇప్పుడైతే బాప్ దాదా డబుల్ పురుషార్ధీ పిల్లలకు నంబరువన్ గా అయ్యే సూచనను ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క సెంటరు మరియు దాని కనెక్షన్ లోకి వచ్చే సెంటరు నిర్విఘ్నంగా మరియు తీవ్ర పురుషార్థి గతితో నంబరువన్ గా కావాలి. ఎవరైతే నంబరువన్ గా అవుతారో వారికి బాప్ దాదా బహుమతిని ఇస్తారు. స్వయమైతే అయ్యారు, కానీ అందరినీ కూడా తోడుగా తీసుకువెళ్ళాలి కదా. సంగఠనను కూడా దృడముగా చెయ్యాలి. మరి నంబర్ వన్ ను ఎవరు తీసుకుంటారో చూస్తాము! ఎవరు తీసుకున్నా, ఎంత తీసుకున్నా బాప్ దాదాకు సంతోషమే. సరేనా! మేము ఎగరాలి మరియు ఎగిరించాలి అన్న లక్ష్యాన్ని ఇప్పటి నుండి పెట్టుకోండి. నడిచేవారు కాదు, ఎగిరేవారు, ఎగిరే కళ యొక్క సర్టిఫికేట్ ను తీసుకోవాలి అప్పుడప్పుడూ కాదు, సదా ఎగిరే కళ. తీసుకుంటారు కదా! సర్టిఫికేట్ తీసుకుంటారా? ఇప్పుడు ప్రతి రోజు ఏదో ఒక విషయంలో ఉన్నతిని తీసుకురండి. నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి, నాలుగు సబ్జెక్టులలో ఏదో ఒక సబ్జెక్టును లక్ష్యంగా పెట్టుకుని, దానిని ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చి మీ చార్టును ముందుకు తీసుకు వెళ్ళండి. అచ్ఛా. బాబా ఏదైతే ఆశిస్తున్నారో దానిని ప్రాక్టికల్ లోకి తీసుకువస్తూ తమ చార్టును రోజూ బాప్ దాదాకు ఇచ్చే పిల్లలను విదేశాలలో కూడా బాప్ దాదా చూసారు. పురుషార్థం మంచిగా ఉంది, కావున ఇటువంటి గుప్త పురుషార్ధీలకు అమృతవేళ రోజూ విశేషమైన అభినందనలను తెలుపుతున్నారు. కావున ముందుకు వెళ్తూ ఉండండి, తీవ్ర పురుషార్థులై ఎగురుతూ ఉండండి. అచ్ఛా.

సర్వే ఇండియా ప్రోగ్రామ్ ప్రారంభ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది:- వీరు కూడా కార్యం చేస్తున్నారు, సేవా ప్లానును చూసి, ఉల్లాస ఉత్సాహాలను చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు. సఫలత పిల్లల ప్రతి ఒక్కరి జన్మ సిద్ధ అధికారము అని బాప్ దాదా వరదానము ఉంది. కావున సఫలత ఉంటుంది, అందర్నీ తోడుగా చేసుకుని సహయోగిగా చేసుకుని నడుస్తున్నారు మరియు నడుస్తూ ఉంటారు. అభినందనలు. శ్రమించారు, ఎంతో మంచి కృషిని చేసారు. ఉత్సాహము మంచిగా ఉంది. ఎక్కడ ఉల్లాస ఉత్సాహాలు ఉంటాయో అక్కడ సఫలత ఉండనే ఉంటుంది. హైదరాబాదు వారు లేవండి, టీచర్లు ఎక్కడ ఉన్నారు? చూడండి, మొదటి నంబరుగా హైదరాబాదుకు అవకాశం లభించింది. ప్రతి ఒక్కరూ తమ యథాశక్తి సహయోగాన్ని ఇచ్చారు మరియు సేవా పాత్రను ఎంతో మనస్ఫూర్తిగా పోషించారు. ఏదైతే చేసారో అది చాలా బాగా చేసారు, మంచి ధైర్యాన్ని ఉంచారు. ధైర్యమున్న వారికి బాబా సహాయము ఉండనే ఉంటుంది. అచ్ఛా!

           స్వరాజ్య అధికారిగా అయి స్వరాజ్యపు రిజల్టును పరిశీలించుకోండి అని ఈ రోజు బాప్ దాదా ఏదైతే చెప్పారో, దానిని చెక్ చేసుకోవడం వలన ఎటువంటి లోపమునైనా చాలా కాలం ఛేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎంతోకాలము అఖండ రాజ్యము ఉండాలి. బహుకాలపు పురుషార్థముతో బహుకాలపు ప్రాలబ్ధమునకు స్వతహాగానే అధికారులుగా అవుతారు అందుకే బహుకాలపు పురుషార్థము అన్న పదమును అండర్‌లైన్ చెయ్యండి. చెకింగ్ చేస్తున్నారా, ఛేంజ్ చేసుకుంటున్నారా?

           నలు వైపుల ఉన్న బాప్ దాదా హృదయ సింహానాధికారులైన ప్రతి ఒక్కరికీ బాప్ దాదా రోజూ అమృతవేళ విశేషంగా శక్తిని పంచుతారు. అమృతవేళ విశేషంగా వరదానాలు, శక్తులను పంచుతారు. ఎవరైతే అమృతవేళలోని శక్తిని, విశేష వరదానాన్ని స్వీకరిస్తారో వారు విశేషంగా తీవ్ర పురుషార్థులవుతారు. అమృతవేళకు మహత్వాన్ని ఇవ్వడము అంటే బాప్ దాదా హృదయసింహాసనాధికారులుగా సదా ఉండటము. చాలా మంది పిల్లలకు అటెన్షన్ ఉంది, బాప్ దాదా వారికి రోజూ సర్టిఫికేట్ ను ఇస్తారు మరియు ఓహో పిల్లలు ఓహో అని అంటారు.

           నలువైపుల ఉన్న తీవ్ర పురుషార్థులకు, అన్ని వేళాల బాప్ దాదాను తమ సహచరునిగా చేసుకుని కంబైన్డుగా ఉండే అలవాటున్న పిల్లలకు బాప్ దాదా విశేషంగా వరదానాన్ని ఇస్తున్నారు - సదా ఎగురుతూ ఉండండి మరియు ఇతరులకు కూడా ఎగిరే సహకారాన్ని అందించి ఎగిరిస్తూ ఉండండి. అందరూ విజయులే మరియు విజయానికి ఫలితంగా బాప్ దాదా దీవెనలు ప్రతి క్షణము లభిస్తూ ఉంటాయి. అమరులుగా అయి అందరికీ అమృతాన్ని త్రాగించండి. నలువైపుల ఉన్న పిల్లలు బాప్ దాదా ఎదుట కూర్చుని ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిపై బాప్ దాదాకు హృదయపూర్వకమైన ప్రేమ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత ఉంది. ఇప్పుడు సర్వ విశేషతలతో స్వయాన్ని విశేష ఆత్మగా చేసుకుని ముందుకు సాగుతూ వెళ్ళండి. బాప్ దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా ఇచ్చే పదమారెట్లు ప్రియస్మృతులను స్వీకరించండి. అచ్ఛా - ఇప్పుడైతే ఇక కలుస్తూనే ఉంటాము. నమస్తే.

Comments