15-11-2008 అవ్యక్త మురళి

   15-11-2008         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

  “సత్యమైన, స్వచ్ఛమైన హృదయంతో పరమాత్మ స్నేహులుగా అయి ప్రతి ప్రాప్తిలో అనుభవంతో కూడిన అథారిటీలుగా కండి"

           ఈ రోజు బాప్ దాదా తమ నలువైపుల ఉన్న తమ సత్యమైన, స్వచ్ఛమైన హృదయపు స్నేహంతో భోలానాధుడైన బాప్ దాదాను తమవారిగా చేసుకునే పిల్లలను, స్నేహి పిల్లలను చూస్తున్నారు. ఇటువంటి హృదయపు స్నేహమును కలిగి ఉన్న పిల్లలను చూసి బాప్ దాదా కూడా ఓహో! నా స్నేహీ పిల్లలూ, ఓహో! అని గానం చేస్తున్నారు. ఈ పరమాత్మ స్నేహాన్ని కేవలం సంగమంలోనే అనుభవం చేసుకోగలరు. మరి ఇటువంటి స్నేహీ పిల్లలు ఎవరైతే హృదయపూర్వకంగా బాబాను సృతిచేస్తూ ఉంటారో, వారు సదా బాబా స్మృతిలో, బాబా హృదయ సింహాసనాధికారులుగా అవుతారు. ఇటువంటి స్నేహీ పిల్లలకు బాప్ దాదా విశేషంగా అమృతవేళ ఏదో ఒక వరదానాన్ని ఇస్తారు. ఎందుకంటే స్నేహాన్ని ఇచ్చే హృదయపూర్వక స్నేహీ పిల్లలు బాప్ దాదాను కూడా తమ వైపుకు ఆకర్షిస్తారు, ఎందుకంటే వారికి హృదయపూర్వకమైన సత్యమైన స్నేహము ఉంది. జీవితంలో ఒకవేళ స్నేహము లేకపోతే జీవితం ఆనందంగా ఉండదు. బాబాలోని నిస్వార్ధమైన అవినాశీ స్నేహము ఫిల్లలందరికీ ఎంత ప్రియమైనదో మీ అందరికీ అనుభవమే కదా! కావున పరమాత్మా స్నేహము ఈ బ్రాహ్మణ జీవితానికి పునాది. అందుకే మీరందరూ స్నేహానికి పాత్రులు మరియు స్నేహములో అనుభవం ఉన్న పిల్లలు. జ్ఞానము ఉంది కానీ జ్ఞానముతో పాటు పరమాత్మ స్నేహము కూడా అవసరము. ఎందుకంటే ఎక్కడ స్నేహము ఉంటుందో అక్కడ అన్నింటినీ అనుభవం చేసుకోవడం సహజమైపోతుంది. స్నేహపు శక్తి తండ్రి సమీపానికి ఎంతగానో తీసుకువస్తుంది. సదా బాబా వరదానీ హస్తము తమ శిరస్సుపై ఉన్నట్లుగా ఈ స్నేహపు శక్తి అనుభవం చేయిస్తుంది. తం స్నేహము సదా ఛత్ర ఛాయలా అవుతుంది. స్నేహులు సదా స్వయా తండ్రితో ఉన్నట్లుగా భావిస్తారు. స్నే ఆత్మ సదా రమణీకంగా ఉంటుంది. ఎండిపోయినట్లుగా కాక రమణీకంగా ఉంటారు. స్నేహీ ఆత్మను నిశ్చితంగా మరియు నిశ్చింతగా ఉంటుంది. స్నేహి తండ్రిని స్మృతి చెయ్యడంలో సదా స్వయాన్ని సహజయోగిగా అనుభవం చేస్తాడు. జ్ఞానము బీజము వంటిది, స్నేహము నీరు వంటిది. ఒకవేళ బీజానికి నీరు లభించకపోతే ఫల ప్రాప్తి అనుభవం కాజాలదు. జ్ఞానంతో పాటు ఈ పరమాత్మ స్నేహము సదా సర్వ ప్రాప్తులు అనే ఫలమును అనుభవం చేయిస్తుంది. స్నేహములో ప్రాప్తుల అనుభవం చాలా సహజంగా జరుగుతుంది. కేవలం జ్ఞానం ఉండి, స్నేహము లేకపోతే ఎందుకు ఏమిటి అన్న ప్రశ్నలు తలెత్తగలవు, కానీ స్నేహము ఉంటే సదా స్నేహ సాగరునిలో లవలీనులై ఉంటారు. స్నేహీ ఆత్మకు ఒక్క బాబాయే ప్రపంచం. సదా శ్రీమతము అనే హస్తాన్ని మస్తకంలో అనుభవం చేస్తారు. అవినాశీ స్నేహము పూర్తి కల్పము స్నేహీగా చేస్తుంది. మరి నేను సదా హృదయపూర్వక స్నేహములో అనుభవీగా ఉన్నానా, లేక మధ్యలో స్నేహములో ఎక్కడా లీకేజి లేదు కదా అని ప్రతి ఒక్కరూ పరిశీలించుకోండి. ఒకవేళ ఏ ఆత్మ పట్ల అయినా ప్రభావితమైతే, వారి విశేషతలపై లేక విశేష గుణాలపై ప్రభావితులై ఉన్నట్లయితే పరమాత్మ ప్రేమలో అవినాశీకి బదులుగా లీకేజీ జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకోండి. లీకేజీ ఉన్నవారు సదా స్నేహితులుగా, సదా తండ్రి సహవాసులుగా, సదా తండ్రి వరదానీ హస్తము శిరస్సుపై ఉన్నట్లుగా అనుభవం చెయ్యలేరు. కావున జ్ఞానీ ఆత్మలు ప్రియమైనవారే కానీ, జ్ఞానముతోపాటు సత్యమైన హృదయము, అవినాశీ తండ్రిపై స్నేహము అవసరము. ఒకవేళ జ్ఞానంతో పాటు తండ్రిపై స్నేహము కొద్దిగా తగ్గినా కానీ, సత్యమైన హృదయపు మరియు స్వచ్ఛమైన హదయపు స్నేహము కొద్దిగా అయినా తక్కువగా ఉంటే అక్కడక్కడ కష్టపడవలసి వస్తుంది. పురుషార్ధంలో యుద్ధం చేయవలసి వస్తుంది. కావున నిరంతర స్మృతి, నిరంతరం ప్రేమలో లీనమయ్యే ఆత్మ సదా పర్వతాన్ని కూడా దూదిపింజ సమానంగా తయారు చేస్తుంది. ఎందుకంటే స్నేహంలో ప్రాప్తులు స్పష్టంగా అనుభవమవుతాయి. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ కష్టము తక్కువగా ఉంటుంది. ఒకవేళ ప్రేమ లేక స్నేహము తక్కువగా ఉంటే కష్టమనిపిస్తుంది.

           ఈ రోజు బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలలో, సత్యమైన హృదయంతో తండ్రికి స్నేహితులుగా, కష్టం నుండి ముక్తులై సదా స్నేహ సాగరంలో ఎంత వరకు మునిగి ఉన్నారు అన్నదానిని పరిశీలించారు. జ్ఞానము బీజము, కానీ బీజానికి స్నేహము అనే నీరు అవసరము, లేకపోతే సహజ ఫలము, ప్రాప్తుల ఫలము, అనుభవాల ఫలము తక్కువగా అనుభవం అవుతాయి. ఈ రోజుల్లో బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ ప్రతి ప్రాప్తిలో అనుభవీ మూర్తులుగా చూడాలనుకుంటున్నారు. ప్రతి శక్తి, ప్రతి ప్రాప్తి, ప్రతి గుణంలో అనుభవం ఉందా అని స్వయాన్ని పరిశీలించుకోండి. ఒకవేళ అనుభవంతో కూడిన అథారిటీ ఉన్నట్లయితే ఎటువంటి పరిస్థితి అయినా అనుభవంతో కూడిన అథారిటీ ముందు ఎటువంటి ప్రభావము కలుగజేయలేదు. పిల్లలందరికీ తెలుసు, జ్ఞానపు అవగాహనతో నేను ఆత్మను అని తెలుసు, అలాగే మాట్లాడుతారు కూడా, కానీ నడుస్తూ తిరుగుతూ అన్నివేళలా ఆత్మ స్వరూపపు అనుభూతి ఉందా? జ్ఞానంలోని ప్రతి పాయింటును అనుభవం చేస్తున్నారా? అనుభవీ మూర్తులు ఎప్పుడూ, ఎటువంటి పరిస్థితిలోనూ అచలంగా, నిశ్చలంగా ఉంటారు, అలజడిలోకి రారు. ఎందుకంటే, అథారిటీలైతే చాలా ఉన్నాయి కానీ అన్నిటికన్నా పెద్ద అథారిటీ- అనుభవము. ఒకవేళ అనుభవంతో కూడిన అథారిటీ ఉన్నట్లయితే ప్రతి శక్తి, ప్రతి జ్ఞానపు పాయింటు, ప్రతి గుణము తమ ఆజ్ఞ అనుసారంగా నడుస్తాయి. ఏ సమయంలో ఏ శక్తి కావాలో ఆజ్ఞాపించండి, అవి ఒక్క క్షణంలో సహయోగిగా అవుతాయి. ఒకవేళ అనుభవంతో కూడిన అథారిటీ తక్కువగా ఉన్నట్లయితే కష్టపడవలసి వస్తుంది. అనుభవం కలవారు మాస్టర్ సర్వశక్తిమంతులు. మరి మాస్టర్ ఆజ్ఞాపిస్తే - శక్తి సమయానికి ఉపయోగపడకపోవడం, కష్టపడవలసి రావడం, సమయం పట్టడం జరిగితే మాస్టర్ సర్వశక్తిమంతులు ఎలా అవుతారు! మరి ప్రతి సబ్జెక్టులో, జ్ఞానంలోని ప్రతి పాయింటులో అనుభవజ్ఞునిగా ఉన్నానా? ఒక్క క్షణములో నా బాబా, మధురమైన బాబా అని స్మృతి చేయగానే అందులో ఇమిడిపోయే విధముగా స్మృతి శక్తిలో ఇటువంటి అనుభవం ఉందా? ఏ సమయంలో ఏ ధారణ అవసరమో ఆ సమయంలో ఆ ధారణను కార్యంలో ఉపయోగించగలుగుతున్నారా? లేక కార్యం సమాప్తమైపోయాక ఆలోచనలో పడుతున్నారా? అటువంటివారిని అనుభవజ్ఞులైన అథారిటీమూర్తులు అని అనడం జరుగదు. యజమాని శక్తివంతుడు మరి ప్రతి శక్తి, ప్రతి గుణం ఆర్డరులో ఉన్నాయా? కావున, అనుభవంతో కూడిన అథారిటీ అనే సింహాసనంపై లేక సీట్ పై సదా ఉంటున్నానా? అని ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకోండి. అనుభవం అనే సీట్ పై సెట్ అయి ఉన్నవారు అనగా సంకల్పం చెయ్యగానే జరిగిపోవాలి, కష్టపడవలసిన అవసరం ఉండదు, సమయం పట్టదు. ప్రతి శ్రీమతంతో జీవితం నేచురల్ గా, సహజంగా సంపన్నంగా ఉంటుంది. ఎందుకంటే సత్యమైన హృదయముపై, స్వచ్ఛమైన హృదయముపై, స్నేహీ ఆత్మపై, లవలీనమయ్యే ఆత్మపై బాప్ దాదా కూడా హాజరవుతారు అని ఇంతకు ముందు కూడా వినిపించడం జరిగింది. ఎవరైతే ప్రతి శ్రీమతంలో హజరవుతారో(శ్రీమతానుసారముగా నడుస్తారో) వారి ముందు నేను- హజూర్ హాజర్ అంటాను అని బాబా కూడా అంటారు. మీరు జీ హజూర్ అనీ అనండి, అప్పుడు హజూరు సదా హాజరై ఉంటారు. సహజ స్మృతి అన్నది బ్రాహ్మణ జీవితపు సహజ గుణము.

           మరి అందరూ, మొదటిసారి వచ్చినవారు కావచ్చు, ఎంతోకాలంగా బాబా పిల్లలుగా ఉన్నవారు కావచ్చు, ఎలా అయితే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్వభావము సహజంగా ఉంటుందో అలా ప్రతి శక్తి, ప్రతి గుణము నేచురల్ నేచర్ గా అయ్యాయా? అప్పుడప్పుడూ, కొంత మంది పిల్లలు, బ్రాహ్మణ జీవితానికి యోగ్యము కానిది ఏదైనా జరిగితే అప్పుడు ఏమని అంటారు? నా భావము అది కాదు, కానీ అది నా నేచర్ అని అంటారు. ఎలా అయితే ఆ బలహీన స్వభావము సహజమైపోయిందో, అలా ప్రతి శక్తి బ్రాహ్మణ ఆత్మకు నేచురల్ నేచర్(సహజ సంస్కారము). బలహీనమైన స్వభావమేదైతే తయారై ఉందో అది దేహ అభిమానానికి గుర్తు. మరి అర్థమయిందా, జ్ఞానీ ఆత్మతో పాటు, బాబా పట్ల ఉండే హృదయపూర్వక స్నేహము అన్నింటినీ సహజంగా చేసేస్తుంది. స్నేహము కూడా బ్రాహ్మణ జీవితంలో సహయోగాన్ని ఇస్తుంది, స్నేహము స్మృతిని కష్టంగా జరగనివ్వదు, మర్చిపోవడము కష్టమవుతుంది. స్నేహితుడిని మర్చిపోవడం కష్టం, గుర్తు చెయ్యడము నేచర్ గా ఉంటుంది.

           మరి బాప్ దాదా  వర్తమాన సమయంలో పిల్లలైన ప్రతి ఒక్కరినీ ఇప్పుడు ఏ రూపంలో చూడాలని ఆశిస్తున్నారు? ఎందుకంటే సమయపు వేగము ఇప్పుడు అకస్మాత్తు ఆటను చూపిస్తుంది. కావున బాప్ దాదా పిల్లలందరినీ తండ్రి సమానంగా చూడాలని ఆశిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి ముఖంలో తండ్రి మూర్తి ప్రత్యక్షం కావాలి, పిల్లలు ప్రతి ఒక్కరి నయనాలలో ఆత్మిక నషా ఉండాలి, ప్రతి ఒక్కరి ముఖంలో సర్వ ప్రాప్తుల చిరునవ్వు ఉండాలి, ప్రతి ఒక్కరి నడవడిలో నిశ్చయంతో కూడిన నషా ఉండాలి. వచ్చినవారందరూ నిశ్చయబుద్ధి కలిగినవారే కదా! నిశ్చయబుద్ధి కలిగి ఉన్నారు కదా,చేతులెత్తండి. అచ్ఛా! అభినందనలు. కానీ నిశ్చయబుద్ధికి గుర్తుగా ఏమని గాయనం చేస్తారు? నిశ్చయబుద్ధి గురించి ఏమంటారు? నిశ్చయబుద్ధి ఏమిటి? విజయి. నిశ్చయబుద్ధికి గుర్తు విజయము. మరి సదా నిశ్చయబుద్ధికి గుర్తు ఏమిటి? సదా విజయులా లేక అప్పుడప్పుడూ విజయులా? సదా విజయులుగా ఉంటారు కదా! మరి ఇప్పుడు సమయం అనుసారంగా నిశ్చయబుద్ధికి ప్రత్యక్ష ప్రమాణంగా- సదా విజయీ ఆత్మ, ప్రయత్నము అన్న మాట వద్దు, ఆశిస్తున్నాను కానీ, ప్రయత్నిస్తున్నాను కానీ, జరగాలి కానీ.... అని అనవద్దు. వారి నోటి నుండి సదా విజయానికి ప్రత్యక్ష ప్రమాణము కనిపిస్తుంది.

           పిల్లలందరూ పురుషార్థులుగా ఉన్నారు కానీ, మధ్య మధ్యలో నిర్లక్ష్యము పురుషార్థాన్ని తీవ్రంగా చేసేందుకు బదులు మధ్యమధ్యలో ఢీలా చేసేస్తోందని బాప్ దాదా గమనించారు. అప్పుడు బాప్ దాదాకు కూడా మధురాతి మధురమైన మాటలు వినిపిస్తారు. అప్పుడు ఏమంటారు? ఏమంటారో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి? అయిపోతుంది, అవ్వాల్సిందే, సమయానికి చేరుకుంటాము....... మరి ఇది నిర్లక్ష్యము. బాబా, మేము మీతో ఉన్నాము, మీతో నడుస్తాము, చేతిలో చెయ్యి వేసి నడుస్తాము అని ఏదైతే ప్రతిజ్ఞా చేసారో, మరి సమానంగా అవ్వకుండా సమయానికి కలిసి ఎలా వెళ్ళగలరు? ఒక్క విషయంలో బాప్ దాదా విశేషంగా సంతోషిస్తారు, ఏ విషయంలో? పిల్లలు నడుస్తున్నవారైనా కానీ, ఎగురుతున్నవారైనా కానీ, ఇద్దరూ బాబా ప్రేమలో మంచి మార్కులను తీసుకుంటున్నారు. సంపూర్ణంగా అవ్వడము. సంపన్నంగా అవ్వడము వేరే విషయము, కానీ తండ్రిపై ప్రేమ ఉంది, ప్రేమలో మార్కులు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు సమానంగా అవ్వడంలో మార్కులు తీసుకోవాలి. బాబా మాటలే పిల్లల మాటలు , బాబా కర్మలే పిల్లల కర్మలు కావాలి, సమానంగా కావడానికి ఒక్క విషయమును సహజంగా అభ్యాసంలోకి తీసుకురండి. చెప్పడానికి సహజంగానే ఉంటుంది, ఆ ఒక్క పదము- “చేయించేవారు బాప్ దాదా". చేయించేవారు అన్న పదము ఆత్మ అభిమానిగా అవ్వడమును కూడా సహజం చేస్తుంది. ఆత్మనైన నేనుకూడా ఈ కర్మేంద్రియాలతో చేయించేవాడను. ప్రతి అడుగులో, ప్రతి కార్యంలో చేయించేవారు తండ్రి, నేను నిమిత్తుడను అని భావించండి. ఎందుకంటే విఘ్నము రెండు పదాల కారణంగానే వస్తుంది, ఒకటి 'నేను', రెండు 'నాది' చేయించేవారు అన్న పదముతో నేను-నాది అనేవి సమాప్తమైపోతాయి. నేను నిమిత్తుడను, నిమిత్తంగా చేసినవారు చేయిస్తున్నారు, నేను కాదు. మరి బాప్ దాదా ఏమి ఆశిస్తున్నారో విన్నారా? ఒకటేమో సత్యమైన, స్వచ్ఛమైన హృదయపు స్నేహము. భోలానాథుడైన బాబా సత్యమైన హృదయముపై చాలా సహజంగా తృప్తి చెందుతారు. భోలానాథుడు తృప్తిగా ఉంటే ధర్మరాజు అనే వకీలు కన్నెత్తి కూడా చూడలేడు. ధర్మరాజుకు కూడా బై-బై(వీడ్కోలు) చెప్పి వెళ్ళిపోతాము. ధర్మరాజు కూడా తండ్రి సమానంగా ఉన్న పిల్లలైన మీకు నమస్కరిస్తాడు, తలవంచుతాడు. మీరు బాబాకు ఇంతటి ప్రియులు! కానీ స్నేహములో లీకేజి లేదు కదా అని పరిశీలించుకోండి. తమ దేహాభిమానము మరియు ఇతరుల విశేషత అనే లీకేజి సమాప్తము. అనుభవీ మూర్తులు. అచ్ఛా!
.
           ఈ రోజు మొదటిసారిగా వచ్చినవారు లేవండి. అచ్ఛా, సగం క్లాసు మొదటిసారి వచ్చినవారితో నిండి ఉంది, చాలా మంచిది, కూర్చోండి. బాప్ దాదా సంతోషిస్తున్నారు, లేట్ అన్న బోర్డు పెట్టబడింది కానీ టూ లేట్ బోర్డు ఇంకా పెట్టబడలేదు. కావున వెనుక వచ్చినా కానీ తీవ్ర పురుషార్థిగా అయి ముందుకు వెళ్ళండి. ఒకవేళ ఈ సంగమ సమయంలోని ఒక్కొక్క క్షణమును సఫలం చేసుకుంటే సఫలత మీ జన్మ సిద్ద అధికారము, కానీ అటెన్షన్ ప్లీజ్, క్షణకాలముకూడా వ్యర్థంగా పోకూడదు. అటెన్షన్ ను  కూడా అండంర్ లైన్ చేసి నడవాల్సి ఉంటుంది. మొదటిసారి వచ్చినవారికి ధైర్యము ఉంచి ముందుకు వెళ్తాము అనేంత ఉల్లాసము ఉందా? అటువంటి వారు చేతులెత్తండి. టి.వి.లో చూపించండి, లెక్కలు అడుగుతాము. వెనక వచ్చినా కానీ ముందుకు వెళ్ళి చూపిస్తారు అన్న శుభ సంకల్పాన్ని బాప్ దాదా మీ అందరిపై ఉంచుతున్నారు. చూపిస్తారు కదా! ఎంతమంది లేచారో అన్ని చప్పట్లు కొట్టండి. అచ్ఛా, ఉల్లాసం ఉంది, ఉల్లాసంతోనే నడుస్తూ ఉండండి.

           పిల్లలందరూ అమృతవేళ చేసే మంచి మంచి ఆత్మిక సంభాషణలను బాప్ దాదా వింటారు. రోజూ మెజారిటీ వారు ఏమంటారో చెప్పనా? ఈ రోజు నుండి ఈ బలహీనత ఏదైతే ఉందో అది ఇకముందు రాదు అని మెజారిటీ వారు ప్రతిజ్ఞ చేస్తారు. లక్ష్యమును ఉంచుతున్నారు కానీ లక్ష్యాన్ని లక్షణంలోకి తీసుకురావడంలో సమయం తీసుకుంటున్నారు, ఒక్క దెబ్బతో పరివర్తన చెందడంలేదు, ఆలోచించగానే చేసేయాలి - ఇప్పుడు ఇటువంటి తీవ్ర వేగాన్ని చెయ్యండి. ఆలోచించడము మరియు చెయ్యడము ఒక్కటిగా ఉండాలి. ఈ రోజు ఆలోచిస్తే దానిని చెయ్యడానికి రోజులు తీసుకుంటారు, మాసాలు తీసుకుంటారు! మరి ఆ మాసంలో అకస్మాత్తుగా ఏదైనా జరిగితే ఏ గతి, లభిస్తుంది? బాప్ దాదాకు పిల్లలైన ప్రతి ఒక్కరిపై విశేషమైన ప్రేమ ఉంది, కావున ఇప్పుడు అందరూ బాబా సమానంగా అయి తోడుగా ఉండాలి, తోడుగా వెళ్ళాలి, మన ఇంటికి కలిసి వెళ్ళాలి మరియు రాజ్యం చెయ్యడానికి మొదటి జన్మలో కలిసి రావాలి అని బాప్ దాదా ఆశిస్తున్నారు. నచ్చితే చేతులెత్తండి. మీ సీట్ బుక్ చేసెయ్యమంటారా? చెయ్యనా లేక ఆలోచిస్తారా? ఆలోచిస్తారా లేక బుక్ చెయ్యమంటారా? బుక్ కావలసిందే అని భావించేవారు చేతులెత్తండి. బుక్ కావలసిందే! వాహ్! వి.ఐ.పి.లు కూడా చేతులెత్తుతున్నారు, అద్భుతం! అభినందనలు.

           అచ్ఛా, టీచర్లెవరైతే వచ్చి ఉన్నారో వారు చేతులెత్తండి, టీచర్ల నుండి బాప్ దాదా ఏమి ఆశిస్తున్నారు? తెలుసా? తమ ఫీచర్లతో బాప్ దాదా మరియు భవిష్యత్తు కనిపించాలి అని బాప్ దాదా టీచర్ల నుండి ఆశిస్తున్నారు. సాధారణంగా కనిపించకూడదు. భవిష్యత్తు లేక బాప్ దాదా కనిపించాలి. వీలవుతుందా? వీలవుతుందా? అచ్ఛా, ఇక్కడకు ఎవరైతే వచ్చారో, వారు ఒక మాసం తర్వాత మధువనంలో బాప్ దాదా వద్ద తమ ఈ విశేషత యొక్క రిజల్టును వ్రాయండి ఎందుకంటే మీరు నిమిత్తంగా అయి ఉన్నారు, మరి నిమిత్తంగా అయి ఉన్న వారి మీద బాధ్యత కూడా ఉంటుంది. మీ ముఖం ఈ ఒక్క మాసంలో ఎప్పుడూ చింతతో లేక వ్యర్ధ చింతనతో ఉండకూడదు. ఒక్క మాసంలో బాప్ దాదా ఆశిస్తున్న ఫీచర్లు కలిగి ఉండాలి. నో ప్రాబ్లమ్! సరేనా? నో ప్రాబ్లమ్ అంటారా లేక కొంచెం కొంచెం వస్తుందా? రానివ్వకండి. ప్రాబ్లమ్ (సమస్య) అనే ద్వారమును మూసివేయండి. డబుల్ లాక్ వెయ్యండి. స్మృతి మరియు సేవయే డబుల్ లాక్. మనసా సేవ సదా సిద్ధముగా ఉంది, నాకు అవకాశమే లభించలేదు, పెద్దక్కయ్య నాకు అవకాశం ఇవ్వలేదు అని అనకండి, మనస్సును ఎవ్వరూ ఆపలేరు. రాత్రి కూడా మేల్కొని చెయ్యవచ్చు. మనసా సేవ యొక్క ప్రకాశాన్ని ఇవ్వండి, ఆత్మలను ఆహ్వానించండి, దుఃఖీ ఆత్మలకు సహాయాన్ని అందించండి. క్రొత్త, పాత టీచర్లు అందరూ, ఇక్కడకు రానివారు కూడా, అందరూ ఒక్క మాసపు రిజల్టును వ్రాయండి, నో ప్రాబ్లమ్ అని లేక ఎన్ని రోజులు ప్రాబ్లమ్ వచ్చిందో కారణం వ్రాయండి. విస్తారంగా ఇది జరిగింది, అది జరిగింది అని వ్రాయద్దు. సరేనా, చేస్తారా, చేస్తాము అనేవారు చేతులెత్తండి. అచ్ఛా, చాలా మంచిది. ఇక్కడ కూడా కూర్చున్నారు. అచ్చా, మధువనంవారు, జ్ఞాన సరోవరంవారు, పాండవ భవనంవారు, హాస్పిటల్ వారు అందరూ చేతులెత్తండి. అచ్ఛా, మరి అందరూ రిజల్టును వ్రాస్తారు. అందరూ వ్రాయాలి. మధువనంవారి అప్లికేషన్ అందింది. అచ్ఛా, ఈసారి సేవలో రెండు జోన్లవారు ఉన్నారు.

రాజస్థాన్ మరియు ఇండోర్ వారి సేవా టర్ను- రెండు జోన్లు సేవ అయితే బాగా చేస్తున్నారు, కానీ బాప్ దాదా చెప్పిన ఒక్క విషయం ఇంకా అలాగే ఉండిపోయింది. అదేమిటో తెలుసు కదా. రాజస్థాన్ లో ఎంత మంచి మంచి వారసులు వెలువడ్డారు. రాజస్థాన్ రాజుల స్థానము, అందుకే పేరు కూడా రాజస్థాన్ అని వచ్చింది. మరి భవిష్య రాజ్య అధికారులను ఎంత మందిని తయారు చేసారు? ప్రతి సెంటరు ఇప్పటి వరకు ఎంతమంది రాజ్య అధికారులను తయారు చేసింది? అది మీ వద్ద నోట్ అయి ఉందా? ప్రతి సేంటరువారు రాజ్య అధికారులుగా తయారయ్యే విశేష ఆత్మల సంఖ్యను వ్రాయండి. సేవ చేస్తున్నారు, సేవ ప్లాన్లను కూడా ఆలోచిస్తున్నారు, కానీ ఇప్పుడు సమయం అనుసారంగా ఒకటి- తమ ప్రాంతంలోని ఆత్మల ఫిర్యాదులను తీర్చండి. ఎక్కడ సెంటరు ఏరియా ఉంటుందో అక్కడ చుట్టుప్రక్కల కేవలం సందేశం ఇవ్వడమే కాక శ్రమ చేసి బాప్ దాదాతో కనీసం వారసత్వాన్ని ఇప్పించండి. బాబా వచ్చారు, కానీ మమ్మల్ని వారసత్వం తీసుకోవడంలో వంచితం చేసారు అన్న ఫిర్యాదు రాకూడదు. ఇప్పుడు నలువైపుల ఈ సేవ త్వరత్వరగా పూర్తి కావాలి. నిమిత్తంగా ఉన్నది ఒక జోను కానీ బాప్ దాదా అన్ని జోన్లకు చెప్తున్నారు. ఏ ఏరియా, ఏ గ్రామమూ, ఏ కాలనీ వంచితం కాకూడదు. ఓహో! మీరు మాకు తండ్రి పరిచయమునైతే ఇచ్చారు అని అందరూ అంతిమంలో మీ గుణగానం చెయ్యాలి. ఈ పుణ్య ఖాతాను ఇప్పుడు తీవ్రగతిలో జమ చేసుకోవాలి. మరి రాజస్థాన్ ఏమి చేస్తుంది? ఎంత సమయంలో ఈ ఫిర్యాదును పూర్తి చేస్తారు? ఎంత సమయం కావాలి? ఆలోచిస్తారా? ప్లాను తయారు చెయ్యండి, ప్రతి ఒక్కరికీ పంచి త్వర త్వరగా ఈ ప్లానును తయారు చెయ్యండి. కొన్ని జోన్లు చేస్తున్నాయి కూడా మరియు సఫలత కూడా లభిస్తోంది. బాగుంది, టీచర్లు నిమిత్తులు. బాప్ దాదా టీచర్లకు అమృతవేళ విశేష దృష్టిని ఇస్తారు. ఎందుకంటే టీచర్లు బాబా సింహాసనానికి అధికారులు. కానీ దృష్టిని ఎంత వరకు కార్యంలో వినియోగిస్తున్నారు అన్న విషయము ప్రతి ఒక్కరికీ స్వయం తెలుసు. ఎందుకంటే విశేష రూపంలో బాప్ దాదాకు నిమిత్తమైన టీచర్లపై ఎంతో ప్రేమ ఉంది. కావున దృష్టిని తీసుకోండి మరియు దృష్టిని ఇవ్వండి. అచ్ఛా, తోటివారు కూడా చాలామంది వచ్చారు, సేవా ఉత్సాహమును బాప్ దాదా చూసారు, ఉత్సాహం ఉంది కానీ ఇప్పుడు మీ సేవకు భుజాలుగా అయ్యే ఆత్మలను ఇప్పుడు తయారు చెయ్యండి. ఇక వృద్ధి కూడా జరుగుతోంది, లేచి ఉన్నవారందరూ ఈ జోన్ వారేనా, చేతులెత్తండి. తోడుగా వచ్చారు, అచ్ఛా!

          ఇండోర్ వారు లేవండి, చేతులు ఊపండి - ఇండోర్ సేవ అయితే చేస్తున్నారు. కానీ మీకు సహయోగులుగా అయి సదా మీతోపాటు సేవా పాత్రను వహించి సేవలో తోడుగా ఉండేవారిని తయారు చెయ్యండి. మధ్య మధ్యలో సహయోగిగా అవుతారు, సేవలో తోడుగా కూడా ఉంటారు, కానీ సదా తోడుగా ఉండేవారిని తయారు చెయ్యండి. దీని ద్వారా మీకు తోడుగా ఉండి త్వర త్వరగా అందరికీ సందేశాన్ని ఇవ్వగలగాలి. వృద్ధి చేస్తున్నారు, ఇందుకు బాప్ దాదా సంతోషంగా ఉన్నారు, కానీ విధిని మరి కొంత త్వరితంగా చెయ్యండి. క్రొత్త క్రొత్త ఆత్మలు పెరుగుతున్నారు, ఇది చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు, కానీ వేగాన్ని ఇప్పుడు ఇంకా పెంచండి. స్వ పురుషార్థము మరియు సేవా పురుషార్థమును తీవ్రగతిలోకి తీసుకురండి. రెండు జోన్ల పిల్లలందరూ ఒకరికంటే ఇంకొకరు బాప్ దాదాకు ఎంతో ప్రియమైనవారు. మీరు ఎలా అయితే తండ్రి ప్రేమను అనుభవం చేసారో అలాగే ఆత్మలకు తండ్రి ప్రేమను కొంచెమన్నా అనుభవం చేయించండి. వంచితులుగా ఉండిపోకూడదు. ఎందుకంటే మీరు విశ్వ కళ్యాణీ ఆత్మలు. మరి ఇప్పుడు ఇంకా ఎంత విశ్వము మిగిలి ఉంది! ప్రతి ఒక్కరూ తమ జోన్ కళ్యాణకారులుగా అయితే అవ్వండి, జోన్ లో ఎవ్వరూ వంచితులుగా ఉండిపోకూడదు. ఇటువంటి ప్లానును ప్రతి జోన్ కలసి చెయ్యండి. ఫాస్ట్ సర్వీస్. సేవా సీజన్ ను తయారు చెయ్యండి. వంచిత ఆత్మలకు బాబా ప్రేమను ఎంతోకొంత చేతుల నిండుగా అయినా ఇప్పించండి. మీరు దయా ఆత్మలు కదా! ఆత్మలపై దయ కలుగుతోందా? కలుగుతోందా దయ? మరి అనుభవం చేయించండి. ఇక్కడకు వచ్చిన సోదరీ సోదరులందరూ ఎలా అయితే మేము తృప్తి అయ్యామో అలా అందరినీ తృప్త ఆత్మలుగా చెయ్యాలి అని బాధ్యతగా భావించండి. ఇప్పుడు పుణ్యమును జమ చేసే మెషినరీని ప్రారంభించండి. అర్థమయిందా. ఎంతమంది వచ్చారు, ఒక్కొక్కరు 2 - 4మందినైనా తయారు చెయ్యండి, సందేశాన్ని ఇవ్వండి. ఫలానావారు మాకు తండ్రి ప్రేమకు దారిని చూపించారు అని వారు సమాచారాన్ని వ్రాయాలి. తమ సెంటరులోనే ఈ సేవా సమాచారాన్ని ఇవ్వండి. ఎటువంటి ఫిర్యాదులు ఉండకూడదు అనే బాప్ దాదా ఆశిస్తున్నారు. ఇకపోతే అందరూ ఒకరికన్నా ఒకరు మంచిగా ఉన్నారు, అలా ఉంటారు కూడా, బాప్ దాదా విశేషంగా ఈ జోను అభినందనలు తెలుపుతున్నారు. అభినందనలు, కానీ ఇప్పుడు గతిని కొంచెం తీవ్రం చెయ్యండి. బాప్ దాదా అయితే లోకుల దుఃఖపు ఆర్తనాదాలు వింటారు కదా. ఎప్పుడైతే ఆత్మల, పిల్లల దుఃఖపు ఆర్తనాదాలు తండ్రికి వినిపిస్తాయో అప్పుడు తండ్రికి ఎంత దయ కలుగుతుందో చెప్పండి! మీరు కూడా దయాహృదయ ఆత్మలు, కళ్యాణకారి ఆత్మలు, ఇప్పుడు దుఃఖితుల మొర వినండి. హే విశ్వ కళ్యాణకారులారా, ఆత్మల కళ్యాణం చేయండి. మంచిది, చాలా మంచిది.

డబుల్ విదేశీయులతో-అచ్ఛా, విదేశీయులు లేవండి. విదేశీయులు కూడా చాలా చతురులు. ప్రతి గ్రూపులో విదేశీయుల ఆబ్సెంట్ ఉండదు. ప్రతి గ్రూపులో తమ పాత్రను నిర్వహిస్తూ ఉంటారు. బాప్ దాదా మరియు బ్రాహ్మణ పరివారము మీ అందరి ధైర్యమును చూసి సంతోషిస్తున్నారు. ఇప్పుడైతే బాప్ దాదా డబుల్ విదేశీయులు అన్న పేరును మార్చి ఏ పేరు పెట్టారు? డబుల్ పురుషార్ధి. మరి అందరిదీ డబుల్ అనగా తీవ్ర పురుషార్థం ఉంది కదా! మాది తీవ్ర పురుషార్థం అని భావించేవారు చేతులెత్తండి. చేయి ఊపండి. అచ్ఛా, మెజారిటీ ఉన్నారు, అభినందనలు. తీవ్ర పురుషార్థానికి అభినందనలు. ఇప్పుడు తీవ్ర పురుషార్థిగా అయితే ఉన్నారు, కానీ ఇప్పుడు తీవ్ర సేవాధారి పాత్రను కూడా వహించండి ఎందుకంటే స్వ పురుషార్థంతో పాటు సేవా పురుషార్థాన్ని కూడా ఇప్పుడు తీవ్రం చెయ్యాలి. ఇప్పుడు సేవా అవకాశం ఉంది, ఇక ముందు ఒక్క మనసా సేవకు తప్ప మరే సేవ చేయాలనుకున్నా అవకాశం లభించదు. కావున సంబంధ-సంపర్కాల సేవ మరియు వాణి సేవకు ఇప్పుడే అవకాశం ఉంది. ఎంత చెయ్యాలనుకుంటే అంత, డబుల్, ట్రిపుల్ చెయ్యండి. విదేశాలతో పాటు బాబా భారతదేశానికి కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ స్వ మరియు సేవా రికార్డును ఇవ్వవలసిందే. ఎంత వీలయితే అంత స్వ పట్ల మరియు సేవ పట్ల అటెన్షన్ ఉందా అన్నదానిని మీకు మీరే పరిశీలించుకోండి. ఇప్పుడు విదేశము చాలావరకు తమ ఆది, అనాది సంస్కారాలలోకి వచ్చింది. ఇప్పుడు బ్రాహ్మణ కల్చర్ కు అలవాటు పడ్డారు. సంస్కారాలలోనూ మరియు స్థూల కల్చర్ లో కూడా అలవాటు పడ్డారు. అందుకు అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్ఛా.

           ఇప్పుడు ఒక్క క్షణంలో మీ మనసు మరియు బుద్ధికి యజమానిగా అయి, మనసు-బుద్ధిని పరంధామంలో ఏకాగ్రం చెయ్యగలరా? ఇప్పుడు ఒక్క నిమిషం అందరూ ఏకాగ్రులై పరంధామ నివాసులుగా అవ్వడాన్ని బాప్ దాదా చూడాలని ఆశిస్తున్నారు. (డ్రిల్).

           ఇటువంటి అభ్యాసము సమయానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాజూకు సమయము సమీపిస్తోంది, కావున ఈ ఏకాగ్రతా అభ్యాసము చాలా- చాలా- చాలా అవసరము. దీనిని తేలికగా తీసెయ్యకండి. ఒక్క క్షణంలో ఏమైనా జరగవచ్చు. అందుకే బాప్ దాదా ముందు నుండే సూచన ఇస్తున్నారు. అచ్ఛా!

           నలువైపుల ఉన్న తీవ్ర పురుషార్థి ఆత్మలకు, సదా సత్యమైన హృదయంతో తండ్రికి స్నేహులైన హృదయాభిరాముని పిల్లలకు, సదా స్వయం మరియు సేవలో ఎంతో ఉన్నతిలో ఎగురుతూ ఎగిరే కళలో ఉండే పిల్లలకు, సదా అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రతి శ్రీమతాన్ని జీవితంలోకి తీసుకువచ్చేతండ్రి సమానులైన పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు, హృదయపూర్వక వరదానాన్ని స్వీకరించండి, అలాగే బాప్ దాదా యొక్క దేశ విదేశాల పిల్లలందరినీ హృదయంలో ఇముడ్చుకుంటూ నమస్తే.

దాదీలతో- బాగుంది, ముగ్గురూ కలిసి సహచరులుగా చేసుకుంటూ నడుస్తూ ఉండండి. సహచరులైతే కావాలి కదా. ఇటువంటి సహవాసులు కావాలి (అంకుల్, ఆంటీల స్మతిని అందించారు) వారికి సత్యమైన హృదయపు స్మృతి ఉంది, సత్యమైన హృదయంతో బాప్ దాదా కూడా పదమారెట్ల ప్రియ స్మృతులు తెలుపుతున్నారు. మంచిగా నిమిత్తమయ్యారు, అంతిమం వరకు నిమిత్తమై ఉన్నారు, నిమిత్తమై ఉంటారు.

శాంతమణి దాదీతో- బాప్ దాదా మిమ్మల్ని పిల్లల ధైర్యం, తండ్రి సహాయానికి అధికారులుగా భావిస్తారు. మంచి ధైర్యాన్ని ఉంచుతోంది, మురళి వినిపిస్తోంది, బాప్ దాదా వింటుంటారు.

పర్ దాదీతో- వాహ్! తాను బాప్ దాదాల హృదయ సింహాసనంపై కూర్చుని ఉంటుంది. వింటోంది. వినడంలో మంచిగా ఉన్నావు. మిమ్మల్ని చూస్తే మీ ముఖంలో బాబా కనిపిస్తారు. బాబా శక్తులు, గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మీ జీవితం ద్వారా కనిపిస్తాయి. అర్థమయ్యిందా. చాలా బాగుంది. చూడండి, ఆది రత్నము, ఇద్దరూ ఆది రత్నాలే. మీ ముఖం కూడా సేవ చేస్తోంది, ఇద్దరిదీ. చాలా మంచిది.

Comments