07-04-2009 అవ్యక్త మురళి

  07-04-2009         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

 “కారణము అన్న పదము నుండి ముక్తులై ముఖము మరియు నడవడిక ద్వారా ముక్తిని ఇచ్చే ముక్తిదాతలుగా అవ్వండి, సేవ పట్ల     ఉల్లాస-ఉత్సాహాలతో పాటు సదా అనంతమైన వైరాగ్య వృత్తిలో ఉండండి"

          ఈ రోజు బాప్ దాదా నలువైపుల ఉన్న డబుల్ యజమానులగు పిల్లలనందరినీ చూస్తున్నారు. ఒకటి- బాబా ఖజానాలన్నిటికీ యజమానులు మరియు రెండు- స్వరాజ్యానికి కూడా యజమానులు. రెండు యాజమాన స్వరూపాలు పిల్లలు ప్రతి ఒక్కరికీ బాబా ద్వారా లభించాయి. పిల్లలు బాలకులు కూడా మరియు యజమానులు కూడా, నా బాబా అని అనగానే బాబా కూడా నా పిల్లలు అని అన్నారు. కావున పిల్లలు మరియు యజమానులు, రెండింటి అనుభవం ఉంది.

           ఈ రోజు చాలా చాలా మంది పిల్లలు వచ్చారు. ఈ సంవత్సరంలో ఇది చివరి టర్ను, ఈ రోజు బాప్ దాదా ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని పరిశీలించారు. మరి ఏమి చూసి ఉంటారో చెప్పండి? నా పురుషార్థము ఏమిటి అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. బాప్ దాదా పిల్లలందరినీ చూసి సంతోషపడ్డారు, కానీ బాబాకు ఒక్క ఆశ ఉంది, అది ఏమిటో చెప్పమంటారా! బాబా ఆశను పూర్తి చేస్తారు కదా! ఒక్కటే ఆశ ఉంది, చెప్పమంటారా! ఆశను పూర్తి చేస్తాము అనేవారు చేతులెత్తండి. చాలా మంచిది. చిన్నని ఆశ, అదేమిటంటే- ఈ రోజు నుండి ఒక్క పదమును మార్చండి, ఏ పదము? మాటిమాటికీ క్రిందకు తీసుకువచ్చే పదము- “కారణము". ఈ కారణము అన్న పదమును పరివర్తన చేసి నివారణ అన్న పదమును సదా ధారణ చెయ్యండి. ఎందుకంటే ఇప్పుడు మీ సేవ కూడా ఏమిటి? విశ్వంలోని ఆత్మలందరి సమస్యల కారణాన్ని నివారణ చేసి, నివారణ చేయగానే నిర్వాణధామంలోకి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మీరందరూ ముక్తిదాతలు. మరి ఇతరులకు కూడా ముక్తిని ఇచ్చేవారైనప్పుడు మరి స్వయం కూడా కారణాన్ని నివారణ చేస్తారు కదా! అప్పుడే ఇతరులకు కూడా ముక్తిని ఇవ్వగలరు, నిర్వాణంలోకి పంపగలరు. మరి ఈ ఒక్క పదములో మార్పును తీసుకురావడము కష్టమా లేక సహజమా? ఆలోచించండి.

           ఈ రోజు బాప్ దాదా ఇక్కడకు వచ్చినవారికి, తమ తమ స్థానాలలో చూస్తున్నవారికి, వింటున్నవారికి, వారందరి నుండి ఒక్క పదములో పరివర్తనను కోరుకుంటున్నారు. ఎందుకంటే కారణము క్రిందకు తీసుకు వస్తుంది. కారణంలోనే అర్థకల్పం ఉన్నారు, ఇప్పుడు ఇది నివారణ చేసే సమయము. నివారణ మరియు నిర్వాణము, ముక్తి. మరి ఈ రోజు బాబాకు ఇవ్వడానికి ధైర్యము ఉందా? చివరి టర్ను కదా, అందరూ ఉల్లాస-ఉత్సాహాలతో వచ్చారు, బాప్ దాదా ఒక్కొక్కరికీ అభినందనలు తెలుపుతున్నారు. పడుకోవడానికి, భోజనానికి కష్టంగా ఉంది, కానీ అందరూ స్నేహంతో ఉన్నారు, స్నేహము అనే విమానము మీ అందరినీ మధువనానికి చేర్చింది. బాప్ దాదా ప్రతి ఒక్కరి స్నేహాన్ని చూసి, ప్రతి ఒక్కరికీ కోటానురెట్లు హృదయపూర్వక స్నేహాన్ని ఇస్తున్నారు. కానీ స్నేహంలో మీరు ఏమి చేస్తారు? ఎవరితో అయితే స్నేహము ఉంటుందో, వారికి స్నేహంతో బహుమతిని కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రోజు బాప్ దాదా బహుమతి రూపంలో ఈ కారణము అన్న పదమును తీసుకోవాలని ఆశిస్తున్నారు. బాప్ దాదాకు ఉన్న ఈ ఆశను పూర్తి చెయ్యాలి కదా! అయితే చేతులెత్తండి, ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. ఇక్కడ గేట్ నుండి బయటకు వెళ్తే కారణము అన్న పదము సమాప్తమై పోవాలి. పొరపాటున మీ వద్దకు మళ్ళీ వచ్చేసినా, బాబాకు ఇచ్చిన వస్తువు ఇక బాబా ఆస్తి. మరి బాబా ఆస్తిని ఏమి చేస్తారు? తిరిగి తీసుకుంటారా? మరి అందరూ దృఢ సంకల్పం చేసారా? చేసారా? చేసారా? మళ్ళీ చేతులెత్తండి. వెనుకవారు చేతులు ఊపండి. అచ్ఛా. చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు సమయానుసారంగా మీ ముందు క్యూ ఏర్పడనున్నది. ఎందుకని క్యూ ఏర్పడనుంది? హే ముక్తిదాతా, ముక్తిని ఇవ్వండి అని. మరి ఇచ్చేవారైన ముక్తిదాతలగు మీరు ముందుగా ఈ ఒక్క విషయము నుండి ముక్తులుగా అవ్వండి, అప్పుడే ముక్తిని ఇవ్వగలరు.

           ఇప్పుడు నేను ముక్తునిగా అయి ముక్తిని ఇప్పించాలి అన్నదే ఈ సంవత్సరపు హోమ్ వర్కుగా ఉండాలి అని బాప్ దాదా కోరుకుంటున్నారు. ఎందుకంటే సమస్యలు రోజు రోజుకూ పెరగనున్నాయి, కావున సమస్య సమాధాన రూపంలోకి మారిపోవాలి, సమస్యను తొలగించడంలో కష్టము, సమయము పట్టకూడదు. మీకు మీ భక్తులు మరియు సమయపు పిలుపు వినిపించడం లేదా! ఇప్పుడు సమయానుసారంగా దేనిని పరివర్తన చేయడం అవసరము? ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ అనుభవీమూర్తులుగా అయి ఏదో ఒక అనుభూతిని చేయించాల్సిన అవసరము ఉంది. కావున ఇప్పుడు బాబా ఏమి కోరుకుంటున్నారంటే- వీరు ముక్తిదాత పిల్లలు, ముక్తిని ఇచ్చేవారు అని మీ అందరి ముఖము, నడవడికలో స్పష్టంగా కనిపించాలి. మీ మస్తకంపై మెరుస్తున్న నక్షత్రం అనుభవమవ్వాలి. కేవలం వినిపించడం ద్వారా కాదు, ముఖము ద్వారానే అనుభవం కావాలి ఎందుకంటే అనుభవం దగ్గరకు తీసుకువస్తుంది. ఈ అనుభవాన్ని ముఖము మరియు నడవడిక ద్వారా చూపించండి. చూడండి, సైన్సు సాధనాలు అనుభవం చేయిస్తాయి కదా, ఇప్పుడు ఎండా కాలమైనా, వేడి మరియు చల్లదనాన్ని అనుభవం చేయిస్తున్నాయి కదా. సైన్స్ సాధనాలు  అనుభవజ్ఞులుగా చేస్తున్నప్పుడు సైలెన్సు పవర్ శక్తిని అనుభవం చేయించలేదా! కావున ఇప్పుడు బాప్ దాదా పిల్లల నుండి ఏమి కోరుకుంటున్నారంటే, అనుభవం అనే స్థితిలో స్థితులై నయనాల ద్వారా, మస్తకం ద్వారా ఏదో ఒక శక్తిని అనుభవం చేయించండి. విన్న విషయము, విన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది, కానీ సమస్య వచ్చినప్పుడు మర్చిపోతారు. కానీ అనుభవాన్ని జీవితాంతం మర్చిపోలేరు.

           ఒకటి, బాప్ దాదా కారణాన్ని చూసారు, రిజల్టును కూడా చూసారు, ఒక రిజల్టును చూసి చాలా చాలా అభినందనలు తెలిపారు. ఆ రిజల్టు ఏమిటి? ఈరోజు వరకు సేవలో ఉల్లాసము-ఉత్సాహము బాగుంది. కావున బాప్ దాదా అభినందనలు కూడా తెలుపుతున్నారు, సేవను పెంచుతున్నారు కూడా, ప్లాన్లు కూడా మంచిగా చేస్తున్నారు, రిజల్టు కూడా యథా శక్తి లభిస్తుంది, కానీ అనుభవం చేయించడానికి ఒక్క విషయంలో స్వయంపై అటెన్షన్ ను ఇవ్వవలసి ఉంటుంది. మీ సేవ ఇప్పుడు ప్రసిద్ధి అవుతూ ఉంటుంది, సంతోషంగా కూడా ఉంటారు. ఈ రోజుల్లో ఆసక్తి కూడా పెరుగుతూ ఉంది. ఇప్పుడిక అనుభవం చేయించడానికి విధి ఏమిటి? అది, ఉల్లాస-ఉత్సాహాలతో పాటు, ఎంత ఉల్లాసమో అంతగా సమయానుసారంగా ఇప్పుడు అనంతమైన వైరాగ్య వృత్తి కూడా కావాలి. పురుషార్థంలో ఏదైనా సమస్యా రూపంగా అవుతుందంటే అందుకు కారణము- అనంతమైన వైరాగ్య వృత్తిలో లోపము. ఇప్పుడు అనంతమైన వైరాగ్యము కావాలి. అనంతమైన వైరాగ్యము సదాకాలం ఉంటుంది. ఒకవేళ సమయానికి ఉంటే అప్పుడు సమయము నంబర్ వన్ అయిపోతుంది, మీరు నంబర్ టూగా అవుతారు. సమయము మీకు వైరాగ్యాన్ని ఇప్పించింది. కాని అనంతమైన వైరాగ్యము సదాకాలం ఉంటుంది. ఒకవైపు ఉల్లాసము-ఉత్సాహము, సంతోషము మరియు మరో వైపు అనంతమైన వైరాగ్యము. అనంతమైన వైరాగ్యము సదా ఉండకపోవడానికి కారణము ఏమిటి? అందుకు కారణము- దేహ అభిమానము అని బాప్ దాదా గమనించారు. దేహము అన్న మాట అన్నింటిలోనూ వస్తుంది - దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, దేహ సంస్కారాలు - దేహము అన్న పదము అన్నింటిలోనూ వస్తుంది. దేహ అభిమానము విశేషంగా ఎందులో వస్తుంది? దేహీ అభిమానము నుండి దేహ అభిమానములోకి తీసుకు వచ్చే ఆ ముఖ్య కారణము- పాత సంస్కారములు! అవి ఇప్పటి వరకు క్రిందకు తీసుకు రావడమును బాప్ దాదా గమనించారు. సంస్కారాలను తొలగించుకున్నారు కానీ ఏదో ఒక సంస్కారము నేచర్ గా ఇప్పటికీ పని చేస్తుంది. ఎలా అయితే దేహ అభిమానము అన్న నేచర్(స్వభావము) నేచురల్(సహజం)గా అయిపోయిందో అలా దేహీ అభిమానము అన్న నేచర్ నేచురల్ గా కాలేదు. మేము సమాప్తం చేసాము అని అంటారు కానీ, పూర్తిగా బీజాన్ని భస్మం చెయ్యలేదు. అందుకే సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఆ దేహ అభిమానపు సంస్కారాలు ఇమర్జ్ అవుతాయి. కావున ఇప్పుడు దేహ భానపు నేచర్ ను పవర్ ఫుల్ దేహీ అభిమానపు శక్తితో, వంశంతో సహా నాశనం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేము అనుకోలేదు కానీ అప్పుడప్పుడూ వచ్చేస్తుంది అని పిల్లలు అంటారు. ఎందుకు వస్తుంది? అంశము ఉంటేనే వంశమై బయటకు వస్తుంది. కావున ఇప్పుడు శక్తి స్వరూపులుగా కావలసిన అవసరము ఉంది. ఇందుకు ఆధారము-ఏస్వరూపంలోనైనా అంశమాత్రంగానైనా పాత దేహ భానపు సంస్కారము ఉండిపోలేదు కదా అని పరిశీలించుకోవడము. అది అనంతమైన వైరాగ్య వృత్తితోటే సమాప్తం అవుతుంది. సేవను చూసి, విని బాప్ దాదా సంతోషిస్తున్నారు, కానీ ఎలాగైతే సేవా దృశ్యము, స్థితి ఇప్పుడు అందరికీ కనిపిస్తుందో, సేవ అనుభవమవుతుందో, అలాగే అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క ప్రభావం ఉండాలి అని బాప్ దాదా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో సేవ ద్వారా మీ ప్రశంస పెరుగుతుంది, ప్రకృతి మీకు దాసి అవుతుంది, అనుభవం చేసుకుంటారు, సాధనాలు పెరుగుతాయి కానీ అనంతమైన వైరాగ్య వృత్తితో సాధనాలు మరియు సాధన మధ్య బ్యాలెన్సు ఉంటుంది. మీరు ప్రవృత్తిలో ఉండేవారికి, అన్నీ చేస్తూ కూడా కర్మయోగిలా, కమల పుష్ప సమానంగా ఉండండి అని ఉదాహరణ ఇస్తారు కదా, అలాగే మీరందరూ కూడా సేవ చేస్తూ, సాధనాలు లభిస్తున్నప్పటికీ, సాధనాలు మరియు సాధనలో బ్యాలెన్సును ఉంచాలి. కావున ఇప్పుడు సేవతో పాటు అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క ఆవశ్యకతను ఎడిషన్ చెయ్యండి, నడుస్తూ తిరుగుతూ కూడా వీరు విశేష ఆత్మలు అని అనుభవం చేసుకోవాలి. కేవలం యోగంలో కూర్చున్నప్పుడే కాదు, భాషణ చేసే సమయంలోనే కాదు, నడుస్తూ తిరుగుతూ కూడా మీ మస్తకంలో శాంతి, శక్తి, సంతోషాల అనుభూతి జరగాలి. ఎందుకంటే సమయానుసారంగా ఇప్పుడు సమయం మారుతూ ఉంటుంది.

           మరి బాప్ దాదా అయితే సమయానుసారంగా సూచనను అయితే ఇచ్చారు, కానీ ఈ రోజు విశేషంగా బాప్ దాదా ఒకటి, అనంతమైన వైరాగ్య వృత్తి వైపు సూచనను ఇస్తున్నారు, ఇందుకోసం దేహీ అభిమానానికి విఘ్నంగా ఉన్న దేహ అభిమానమును పరిశీలించుకోండి. అనేక రకాల దేహ అభిమానాల అనుభవం ఉంది, వీటిని పరివర్తన చెయ్యండి. రెండవ విషయము- బహుకాలం కోసం స్వయం గురించి ఆలోచించండి. బహుకాలపు అభ్యాసము కావాలి. బహుకాలపు పురుషార్థము, బహుకాలపు ప్రాలబ్ధము. ఒకవేళ ఇప్పుడు బహుకాలపు అటెన్షన్ ను తక్కువగా ఇస్తే, అంతిమ కాలంలో బహుకాలము జమ చేసుకోలేము. టూలేట్ బోర్డు వచ్చేస్తుంది. కావున బాప్ దాదా ఈ రోజు రాబోయే సంవత్సరానికి హోమ్ వర్కును ఇస్తున్నారు. ఈ దేహ అభిమానము అన్ని సమస్యలకు కారణం అవుతుంది. పిల్లలు రమణీకమైనవారు కదా, సమయానికి తయారైపోతాము బాబా అని పిల్లలు బాబాకే ధైర్యం చెప్తారు. కానీ సమయము మీ టీచరా? అని బాప్ దాదా అడుగుతున్నారు. సమయానికి సిద్ధమైపోతాము అంటే, మరి అప్పుడు మీ టీచరు ఎవరైనట్లు? మీ క్రియేషన్ అయిన సమయము మీకు టీచరు అయితే బాగుంటుందా? కావున సమయాన్ని మీరు సమీపంలోకి తీసుకురావాలి. మీరు సమయాన్ని సమీపంలోకి తీసుకువచ్చేవారేకానీ సమయానికి సిద్ధమయ్యే వారు కాదు. సమయాన్ని టీచరుగా చేసుకోవద్దు.

           మరి బాప్ దాదా ఈ రోజు పదే పదే ఈ సూచననే ఇస్తున్నారు- స్వయాన్ని పరిశీలించుకోండి, పదే పదే పరిశీలించుకుంటూ ఉండండి మరియు పరివర్తన తీసుకురండి. బహుకాలపు పరివర్తన, బహుకాలపు ప్రాలబ్ధానికి అధికారిగా చేస్తుంది. ఇప్పటివరకు ఢీలా ఢీలా పురుషార్థులే అయినా కానీ లాస్ట్ నంబర్ పిల్లలపై కూడా బాబాకు స్నేహము ఉంది. స్నేహము ఉంది కనుకనే బాబా పిల్లలుగా అయ్యారు, బాబాను గుర్తించారు, నా బాబా అని అయితే అంటారు అందుకే సమయంపై విడిచిపెట్టకండి. సమయము రాదు, సంపూర్ణతా సమయాన్ని మనము తీసుకురావాలి. బాప్ దాదాల విశ్వ పరివర్తనా కార్యంలో మీరందరూ సహచరులు. ఒంటరిగా బాబా ఈ కార్యాన్ని చెయ్యలేరు. పిల్లల తోడు కావాలి. ముందుగా పిల్లలు, ముందు పిల్లలు అని బాబా అంటారు. మరి వచ్చే సంవత్సరంలో రావాలనుకుంటే ఈ హోమ్ వర్కు చేసి పెట్టండి! చేస్తారా? చేతులెత్తండి. అచ్ఛా! వెనుకవారు కూడా చేతులెత్తుతున్నారు.

            చూడండి, ఈ రోజు సంఖ్య పెరిగిపోయింది, కావున ఎక్కడెక్కడ పడుకున్నారు, ఎలా లైనులో తింటున్నారు అని వెళ్ళి చూసి రండి అని బాప్ దాదా పిల్లలకు(దాదీకి) సూచన ఇచ్చారు. పెద్ద లైను ఉంది, కానీ అందరి ముఖాలలో సంతోషము ఉంది. మధువనంలో అయితే ఉన్నారు కదా. కానీ ఈ సంతోషాన్ని మధువనంలోనే వదిలి వెళ్ళకండి, మీతో పాటు తీసుకువెళ్ళండి. బాప్ దాదా వతనంలో కూర్చుని మీ అందరూ పడకోవడం, భోజనం దగ్గర క్యూ అన్నీ చూసారు. ఇప్పుడే రజాయిలు, పరుపుల వర్షం కురవాలి అన్న సంకల్పం బాప్ దాదాకు కలిగింది. కానీ, ఇది కూడా ఆనందాల మేళా. ఎక్కడ లభించినా, ఎలా లభించినా అందరూ మెజారిటీ బాగా పాస్ అవ్వడం బాప్ దాదా చూసారు. చప్పట్లు కొట్టండి. కానీ ఈ హోమ్ వర్కును మర్చిపోకండి. ఇందులో చప్పట్లు కొట్టడం లేదు. బాప్ దాదా, విశేషంగా బ్రహ్మాబాబా ఎల్లప్పుడూ పిల్లలు మధువనానికి అలంకారము అని అంటారు. మీరందరూ మధువనానికి వచ్చారు, బాప్ దాదా కూడా సాకార రూపంలో ఇంతటి పరివారాన్ని చూసి సంతోషిస్తున్నారు. సహించవలసి వచ్చింది, కానీ ఈ సహనము సదాకాలం కోసం సహన శక్తిని పెంచుతుంది. అందరూ సంతోషంగా ఉన్నారు కదా! కష్టం కాలేదు కదా! ఇంకా చూడండి, ఇంతటి పరివారంలో కూడా నీరు లభిస్తూ ఉంది. అందరూ నీటిని ఉపయోగించారు కదా! కొంచెం తక్కువగా ఉంటే శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది, కానీ ఈ రోజుల్లో గ్రామాల్లో త్రాగడానికి కూడా నీళ్ళు లభించడము లేదు, ఇక్కడైతే మీకు బట్టలు ఉతుక్కోవడానికి కూడా లభించాయి! ఇంత పరివారాన్ని చూసి సంతోషంగా కూడా ఉంటుంది. పూర్తి కల్పంలో ఇంతటి పరివారం ఇంకెవరికీ ఉండదు అని బాప్ దాదాకు గర్వంగా ఉంటుంది. అచ్చా!

           ఎవరైతే మొదటి సారి వచ్చారో, మొదటిసారి బాప్ దాదాను కలుసుకోవడానికి వచ్చినవారు లేవండి, చూడండి, సగం క్లాసు మొదటిసారి వచ్చినవారే ఉన్నారు. వెనుక ఉన్నవారు చేతులెత్తండి, నిల్చోని చూడండి. మొదటిసారి వచ్చిన వారందరికీ బాప్ దాదా క్రొత్త జన్మకు, జన్మ దిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. లక్ష రెట్లు అభినందనలు అని లోకులు అంటారు, కానీ బాబా కోటాను కోట్ల రెట్ల అభినందనలు తెలుపుతున్నారు ఇప్పుడు వచ్చేవారికి బాప్ దాదా ఒక అవకాశాన్ని ఇస్తున్నారు- ఆ అవకాశము ఏమిటంటే ఇప్పుడు వచ్చేవారు కూడా ఒకవేళ తీవ్ర పురుషార్థం చేస్తే బాప్ దాదా మరియు డ్రామా వారికి లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ ఇస్తారు. వీరు కూడా ముందు నంబరును తీసుకోవచ్చు. అవకాశం ఉంది. ఛాన్సలర్‌గా అవ్వండి. కేవలం అటెన్షన్ ను ఇవ్వవలసి ఉంటుంది. బాగుంది, మీ అందరికీ కూడా పరివారపు వృద్ధి మంచిగా అనిపిస్తుంది కదా! ప్రతి జోను వారు టర్ను అనుసారంగా వస్తారు, మధువనపు సేవాధారులు కూడా సహయోగులు. కానీ మధువన నివాసులు అందరూ మధువనానికి భుజాలు, వీరందరూ మధువనానికి భుజాలు అని దాదీ అనేవారు. క్రిందవారు కానీ, పైన ఉండేవారు కానీ, తోటలోని వారుకానీ, హాస్పిటల్ వారు కానీ, క్రింద ఉండే మధువన నివాసులు కావచ్చు, పైన ఉండే మధువన నివాసులు కావచ్చు, అందరూ మధువనానికి భుజాలు. ఈ రోజు మధువనంవారు త్యాగం చెయ్యడం బాప్ దాదా చూసారు. ఇక్కడకు రావడానికి బదులుగా అందరూ తమ తమ స్థానాలలో కూర్చొని ఉన్నారు, కానీ వారిని బాప్ దాదా దూరంగా చూడటం లేదు, హృదయంలో ఇమిడి ఉన్నట్లుగా చూస్తున్నారు. నిర్విరామ సేవాధారులుగా అయి సేవలో సహయోగులుగా అయితే అవుతున్నారు కదా! ఈ రోజు విశేషంగా మధువనం, దాని సర్వ భుజాలు, అందరికీ బాప్ దాదా విశేషంగా మధువన నివాసులకు అభినందనలు తెలియజేస్తున్నారు, అభినందనలు, అభినందనలు. చివరి టర్ను, చివరి టర్ను అని అందరూ ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నారు, చూడండి 40 సంవత్సరాలు కూడ పూర్తి కావస్తున్నాయి. 40 సంవత్సరాలలో సేవ ఛాన్సును తీసుకున్నవారు ఎంతటి అదృష్టవంతులు! సేవ అనగా మేవ(ప్రాప్తి). సేవ చెయ్యడం కాదు, ప్రాప్తిని పొందడము. బాబా దృష్టిలో, హృదయంలో పిల్లలు ప్రతి ఒక్కరూ హృదయ సింహాసనాధికారులుగా ఉన్నారు. బాబా నన్ను చూసారో లేదో అని ఎవ్వరూ అనుకోకండి. బాప్ దాదా పిల్లలు ఒక్కొక్కరిని దూరదేశంలో ఉన్నా కానీ, హృదయ సింహాసనాధికారిగానే చూస్తున్నారు వెనుక ఉన్నవారు కూడా వెనుక లేరు, బాప్ దాదా హృదయంలో ఉన్నారు. అనేకులు ఉన్నప్పటికీ కూడా సైలెన్స్ ఎంత బాగుందో చూడండి! ఎందుకని? అందరూ స్నేహంలో మునిగి ఉన్నారు. బాప్ దాదా మరియ పరివారపు స్నేహ శక్తి అందర్నీ ఆకర్షిస్తుంది. ఇంతటి పరివారము శాంతి శక్తిలో సంతోషాలను జరుపుకోవడము, ఇదే ఈ సైలెన్సు పరివారపు విశేషత. సీటు ఎటువంటిది లభించినా కానీ, మీరు ఏ సీటుపై కూర్చుని ఉన్నారు? వెనుక ఉన్నారు, ప్రక్కన ఉన్నారు, ఎదురుగా లేరు, కానీ ఒక్కొక్కరూ స్నేహము అనే సీటుపై కూర్చుని ఉన్నారు. మధువన నివాసులు (భుజాలతో సహా) ఒక్కొక్కరికీ బాప్ దాదా పదమారెట్ల స్నేహాన్ని ఇస్తున్నారు. ఈ రోజు దాదీలకు కూడా మరియు తోడుగా ఉండేందుకు నిమిత్తంగా ఉన్నవారికి కూడా బాప్ దాదా నిర్విరామంగా అయి సేవ చేసినందుకు అభినందనలు తెలుపుతున్నారు. అంతేకాక ఈ బిడ్డకు, రధానికి కూడా బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. మీ ఆలింగనము చేరుకుంది. చూడండి, ఇది వీరికి చిన్నప్పటి నుండి వరదానము. ఈ బిడ్డకు ట్రాన్సు వరదానము చిన్నప్పటి నుండి ఉంది. వీరిలో ఉన్న సరళత మరియు సహనశీలత అనే విశేషతల కారణముగా ఈ నిమిత్త పాత్ర లభించింది. ప్రతి ఒక్కరిదీ తమ తమ మంచి పాత్ర. దాదీలను సంభాళించే, మున్ని-మోహినిలకు కూడా విశేషంగా పెద్దదాదీకి తోడుగా ఉన్నందుకు బాప్ దాదా అభినందనలు తెలుపుతున్నారు. ఇంకా ఎవరైతే నిమిత్తంగా అయ్యారో వారందరికీ అభినందనలు. మరియు సేవ స్థానాలలో టీచర్లు ఉన్నారు. ఆ టీచర్లకు కూడా ఎక్కడి నుండి వచ్చినా, ఇప్పుడు ఎవరి టర్ను ఉందో వారైతే వస్తారు. కానీ ఎక్కడి నుండి వచ్చినా, టిచర్లందరికీ బాప్ దాదా ఒక విశేష సేవను గుర్తు చేయిస్తున్నారు. ఆ హోమ్ వర్కును చేయాలి. టీచర్లకు హోమ్ వర్కు ఏమిటంటే- సదా టీచర్లు స్వయాన్ని బాప్ దాదాకు సత్యమైన సహచరులుగా, సమీప సహచరులుగా, తమ ద్వారా బాబాను ప్రత్యక్షం చేసేవారిగా మిమ్మల్ని ఎవరు చూసినా వీరిని తయారు చేసేవారు ఎవరు! వీరి తండ్రి, శిక్షకుడు సద్గురువు ఎవరు! అని భావించాలి. మిమ్మల్ని చూడకూడదు, బాబాను చూడాలి. ఈ స్వనూనంలోనే, ఈ 6-7 మాసాలు ఏవైతే లభించనున్నాయో అందులో బాప్ దాదా ఈ హోమ్ వర్కును అడుగుతారు. ప్రతి ఒక్కరూ ఎంత శాతంలో చేసారు? ఎక్కువ సమాచారాన్ని అడగము, ఎంత శాతంలో ఈ హోమ్ వర్కును చేసారు? మీరు కనిపించకూడదు, బాబా కనిపించాలి. ఇందులో అన్ని ధారణలు వచ్చేస్తాయి. మధువనంవారికి కూడా బాప్ దాదా ప్రియస్మృతులను ఇస్తూ ఉన్నారు. కానీ నలువైపుల ఉన్న మధువనంవారు కూడా మధువనంలో ఉన్న ఒక్కొక్క రత్నము విశేషంగా బాబాను ప్రత్యక్షం చేసేందుకు నిమిత్తము అని భావించండి. అన్ని వేళలా మధువనంవారు ఇటువంటి మనసా సేవ, కర్మణ సేవ మరియు అందరినీ తండ్రి సమానంగా తయారుచేసే ఉదాహరణగా తయారై చూపించండి. తండ్రి సమానంగా అయ్యే పటాన్ని(మ్యాపును) స్వయంలో చూపించారా అన్న రిజల్టును మధువనం వారు ఇవ్వవలసి ఉంటుంది. ఓహో బాబా పిల్లలు, ఓహో! అని ప్రతి ఒక్కరి నోటి నుండి రావాలి. మీరందరూ ఏమి చేస్తారు? మీరందరూ స్వయాన్ని నంబరువారీగా కాదు, నంబర్ వన్ గా అయ్యే ఉదాహరణగా అయి చూపించాలి. నంబరువారీగా అవ్వడంలో మజా లేదు, అయితే నంబర్ వన్ గా అవ్వాలి. నంబర్ వారీగా అవ్వడము ఏమంత పెద్ద విషయము! మరి అందరూ విన్ మరియు వన్ అన్న రిజల్టును వినిపించండి. అచ్ఛా!

            అన్ని వైపుల ఉన్న బాప్ దాదాల హృదయ సింహాసనాధికారులు, భృకుటి సింహాసనాధికారులు మరియు భవిష్యత్తులో రాజ్య సింహాసనాధికారులు, బాప్ దాదాకు ఇటువంటి అతి గారాల, పదమా పదమరెట్ల భాగ్యశాలీ పిల్లలకు, సదా తమ నయనాల ద్వారా ఆత్మికతను అనుభవం చేయించేవారికి, ముఖము ద్వారా సదా అదృష్టవంతులుగా ఉండాలి, మనసు సదా సంతోషంతో నాట్యం చేస్తూ ఉండాలి. ఎవరు ఎదురుగా వచ్చినా కానీ, వీరికున్న సంతోషం ఇంకెక్కడా ఉండదు అని అందరూ అనుభవం చెయ్యాలి మరియు అందరూ నేర్చుకుని వెళ్ళాలి. ఇలా బాబా ప్రతి సంతానము తమ ద్వారా బాబాను, నోటి ద్వారా తండ్రి పరిచయాన్ని ఇస్తారు కానీ నయనాలు మరియు ముఖము ద్వారా తండ్రిని సాక్షాత్కారం చేయించేవారిగా ఉన్న ఇటువంటి నలువైపుల ఉన్న పిల్లలకు, ఎవరైతే ఉత్తరాలు పంపారో, ఈ-మెయిల్ చేసారో, అందరివీ బాప్ దాదా వద్దకు చేరుకున్నాయి. మీరు చేసిన వెంటనే, ఆ సమయమే అవి బాబా వద్దకు చేరుకున్నాయి. ఎదురుగా కూర్చున్నవారందరితో మీరెవరైతే పంపారో, ఆ సమయంలోనే చేరుకున్నాయి, అందుకే చాలా చాలా అభినందనలు. దేశ విదేశాలలోని పిల్లలందరికీ బాబా హృదయ స్నేహానికి రెస్పాండ్ అవుతున్నారు. నలు వైపుల ఉన్న పిల్లలకు బాప్ దాదా కోటానురెట్లు హృదయపూర్వక అనురాగమును, హృదయపూర్వక ప్రేమను ఇస్తున్నారు, మరియు అందరికీ నమస్తే చేస్తున్నారు. అచ్ఛా - ఈసారి టర్ను ఎవరిది?

*ఈస్టర్న్ జోను, నేపాల్, తమిళనాడు (బెంగాల్, బీహారు, ఒరిస్సా, అస్సాం) :-* (టీచర్లు కిరీటం ధరించి ఉన్నారు) అచ్ఛా - ఈ జోనులో ఇతర జోన్లు కూడా కలిసి ఉన్నాయి. అయితే నేపాల్ వారు చేతులెత్తండి. చెన్నైవారు, తమిళనాడు వారు, అచ్ఛా! అన్నిటినీ కలిపి ఈస్టర్న్ జోను అని అంటారు. జ్ఞాన సూర్యుడు ఉదయించిన వైపు. అంటే జ్ఞాన సూర్యుని ప్రభావంతో ఉన్న శక్తిశాలి ధరిణి. భారతదేశంలోనే బాబా ఎందుకు వచ్చారు అని ఫారెన్ వారు అడుగుతారు కదా! అంటే భారతదేశంలో ప్రభావం ఉంది కదా. ఇటువంటి భారతదేశంలో కూడా ఈస్టర్న్ లో జ్ఞాన సూర్యుడు ఉదయించారు. కావున ధరణిలో ప్రభావం ఉంది, అందుకే ఈ జోనులో ఇతర జోన్లు కూడా ఉన్నాయి. మంచి, భిన్న భిన్న విధాలుగా సేవను చేస్తున్నారు. ఇప్పుడు బాప్ దాదా ఏదైనా అద్భుతాన్ని చూడాలనుకుంటున్నారు. ప్రతి జోనువారు విశేషంగా తమ వి.ఐ.పి.లను తయారు చెయ్యండి అని బాప్ దాదా ముందుకూడా చెప్పి ఉన్నారు. కానీ కేవలం స్నేహి, సహయోగిగా కాదు, సేవలోని ప్రతి కార్యంలో తోడుగా ఉండాలి, కేవలం సహయోగిగా కాదు. తోడుగా కూడా ఉండాలి, సహయోగిగా కూడా ఉండాలి, మైకుగా కూడా ఉండాలి. ఇటువంటి లిస్టును ఇప్పటి వరకు కొన్ని కొన్ని జోన్లు ఇచ్చాయి, కానీ మిక్స్ వి.ఐ.పిలు ఉన్నారు. వారస క్వాలిటీకి దగ్గరగా ఉండే వి.ఐ.పి.లుగా ఉండాలి. ప్రాక్టికల్ గా వారసులుగా కాకపోయినా కానీ, సరెండర్ కాకపోయినా కానీ క్వాలిటీ వారసులుగా ఉండాలి. ఇటువంటి గ్రూపు బాప్ దాదా వద్దకు రాలేదు. రెండు, నాలుగు పేర్లు విడిగా పంపారు, కానీ పేర్లు వచ్చి, ఆ పేర్లను విశేష కమిటి పాస్ చేస్తే అప్పుడు ఆ గ్రూపును బాప్ దాదా విశేష కార్యంలో వినియోగిస్తారు. అయినప్పటికీ వృద్ధి-విస్తారము మంచిగా ఉంది. వీరికి బెంగాల్, బీహార్ అని పేరు పెట్టాము, ఇది కూడా టైటిల్ ఇవ్వడము. బీహార్ లో బహార్(ఆనందం) వచ్చింది అన్న ఫోటో వచ్చింది. ఎప్పటి నుండైతే బీహార్ లో అలజడి జరిగిందో ఆ ఏరియాలో సెంటర్లు తెరుచుకున్నాయి అని మంచి సమాచారాన్ని వినిపించారు. ఇందుకు అభినందనలు. బెంగాల్ వారు కూడా చుట్టుప్రక్కల పెరుగుతున్నారు. కానీ ఇప్పుడు ఏ హోమ్ వర్కు అయితే ఇచ్చామో అందులో నంబర్ వన్ గా అవుతారు కదా! ఇకపోతే సేవా క్షేత్రంలో నలువైపుల ఉన్న శ్రమను, ప్లానును చూస్తూ ఉంటారు మరియు బాప్ దాదా సంతోషిస్తూ ఉంటారు. ఢిల్లీలో కూడా ఇప్పుడు అయింది కదా, ఇలా ఏదో ఒక నవీనతను తీసుకురండి. విఘ్నాలు వచ్చినా కానీ యోగ శక్తితో కవర్ చేస్తారు. ఇలా చిన్న పెద్ద, చిన్న చిన్న ప్రోగ్రాములను చేస్తూ ఉండండి. ఒకే సమయంలో ఒకే టాపిక్ పై ప్రతి జోనులో, భారతదేశంలో, విదేశంలో జరగాలి అని బాప్ దాదా ఈ సంవత్సరానికి ఇచ్చిన ప్లాను యొక్క రిజల్టు కూడా బాప్ దాదా వద్దకు వచ్చింది. ఎంతోమందికి ఉల్లాసము, ఉత్సాహము కూడా ఉంది, మీటింగ్ లో దీనికి ప్లాన్ తయారుచేయనున్నారు. ఇది కూడా బాగుంది. ఎలా అయితే ఢిల్లీలో మీడియాలో ప్రోగ్రాము మొదలుపెట్టినప్పటి నుండి రిజల్టు ఉంది కదా. ఎన్నో చోట్ల విద్యార్థులు తయారయ్యారు. ఇది రిజల్టు. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ పట్టణంలో లేక జోనులో చెయ్యవచ్చు. ఏదో ఒక ప్రోగ్రాము సమయంలో మీడియా ద్వారా నలు వైపుల చూపించండి, ఎవరైనా ఇటువంటి ఏర్పాటును చెయ్యండి. ఎందుకంటే ఇంట్లో కూర్చునే చూడటానికి లభిస్తే మీ ఫిర్యాదు కూడా పూర్తవుతుంది. అందుకే ఎప్పుడైనా ఏదైనా ప్రోగ్రాము చేస్తే మిగతా ఖర్చుల్లా ఈ కొంచెం ఖర్చు కూడా పెట్టండి, మీడియా ద్వారా కూడా నలువైపుల చూడాలి, ఈ ఏర్పాటును కూడా చెయ్యండి. నలువైపుల ఉన్న మీడియావారు మీ ఫంక్షన్ చూసి, శుభ భావన చూసి, మీకు తోడుగా కూడా నిలువవచ్చు. తోడుగా కాకపోయినా, సహయోగిగా అయితే అవుతారు. కావున సేవ చెయ్యండి కానీ, సేవతో పాటు ఈ అనంతమైన వైరాగ్యమును పరిశీలించుకోవడము కూడా తప్పకుండా ఉండాలి, బ్యాలెన్సు ఉండాలి. అచ్ఛా, జోనుకు అభినందనలు. అందరినీ చూడండి, ఎంతమందికి యజ్ఞ సేవకు ఛాన్సును ఇచ్చారు! మంచిగా ఉంది కదా, మంచిగా ఉందా? యజ్ఞసేవ వేయి రెట్లు ఎక్కువగా పుణ్యం తయారవుతుంది. ఎవరైతే సత్యమైన హృదయము, పెద్ద మనసుతో సేవ చేసేవారిగా ఉన్నారో వారికి వేయి రెట్లు ఎక్కువగా పుణ్య ఖాతా జమా అయింది. బాగుంది, సంఖ్య కూడా బాగుంది. ఇకపోతే ఏదైనా క్రొత్త పనిని చేసి చూపించండి. అచ్ఛా! అందరికీ జోనులో వచ్చిన ఒక్కొక్క భాగ్యశాలీ ఆత్మకు బాప్ దాదా పదమారెట్లు అభినందనలు తెలుపుతున్నారు. అచ్ఛా!  

*డబుల్ విదేశీయులు:-*(40 దేశాల నుండి 300మంది సోదరసోదరీలు వచ్చారు) మీరు విదేశీయులా? కానీ అందరికంటే పెద్ద విదేశీయుడు ఎవరు? బాప్ దాదా అయితే మీకన్నా పెద్ద విదేశీయుడు. ఎంత దూరం నుండి వస్తారు! మీ ఏరియానైతే కొలవవచ్చు కానీ బాబా ఏరియాను లెక్కగట్టగలమా? మీకు విదేశాల నుండి దేశంలోకి రావడానికి ఎంత సమయం పడుతుంది? కానీ బాప్ దాదా రావడానికి ఎంత సమయం పడుతుంది? విదేశాలలో కూడా సేవ మరియు స్వపరివర్తనల అల కొనసాగుతోంది. ఏదో ఒక కారణం చేత ఎవరైతే మధువనానికి రాలేదో, వారికి కూడా తమ తమ స్థానాలలో ట్రైనింగ్ లేక భట్టి కార్యక్రమాలు పెడ్తున్నారు అని బాప్ దాదా సమాచారాన్ని విన్నారు. ఇది కూడా మంచి విషయము. వారు కూడా మనసు ద్వారా మధువనానికి చేరుకున్నట్లుగా అనుభవం చేస్తారు. మీరు తనువు మరియు మనసుతో చేరుకున్నారు, వారు మనసుతో చేరుకుంటారు. అచ్ఛా, గాయత్రి చేరుకున్నారు. బాగుంది. మంచి అనుభవం జరుగుతోంది. అంకుల్ మరియు ఆంటీల ప్రియస్మతులు చేరుకున్నాయి. మొట్టమొదట విదేశాలలో వి.ఐ.పి.లుగా నిమిత్తమైనది అంకుల్ ఆంటీలే అని బాప్ దాదా అయితే ఎప్పుడూ అంటారు, ప్రేమ మరియు స్మృతి కూడా బాగున్నాయి. బాప్ దాదా కూడా ఇటువంటి సేవాధారి పిల్లలకు విశేషమైన కిరణాలను ఇస్తారు. బ్రహ్మాబాబా సాకారంలో కూడా ఇటువంటి అమూల్యమైన పిల్లలకు రాత్రి మేల్కొని కరెంట్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా  బాప్ దాదా వతనం నుండి పిల్లలకు, స్నేహి పిల్లలకు, సేవాధారి పిల్లలకు కరెంట్ ను ఇస్తారు, శక్తిని ఇస్తారు మరియు ఆ శక్తి చేరుకుంటుంది.

           కావున డబుల్ విదేశీయులు డబుల్ తీవ్రపురుషార్థులు. అంతే కదా! డబుల్ తీవ్ర పురుషార్థులు, అలా ఉన్నారు కదా? చేతులెత్తండి. అచ్ఛా! బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ తీవ్ర పురుషార్థులుగా చూడాలని ఆశిస్తున్నారు. పురుషార్థులుగా కాదు, తీవ్ర పురుషార్థులు. (మురళి అన్నయ్య కూడా చాలా గుర్తు చేస్తున్నారు) బాప్ దాదా వద్దకు స్మృతీ చేరుకుంటుంది. వారు కూడా నిమిత్తమయ్యారు కదా. రజని బిడ్డ కూడా గుప్త రూపంలో లండన్ సెంటర్ ను తెరిపించడంలో నిమిత్తంగా అయ్యారు. ఇన్ డైరెక్టుగా మురళి బిడ్డ భాగ్యము తయారయ్యింది. ఇప్పుడైతే పిల్లలుగా అయ్యారు. వారు కూడా గుర్తు చేస్తారు. నలువైపుల ఉన్న దేశంవారు లేక విదేశంవారు ఎవరైతే గుర్తు చేస్తున్నారో, బాప్ దాదా వద్ద ఆ లిస్టు పెద్దగా ఉంది. మనస్ఫూర్తిగా నా బాబా అని వెలువడుతుంది మరియు బాప్ దాదా హాజరవుతారు. మంచిది. అచ్చా, వీరు (కువైట్ నుండి వజిహా అక్కయ్య) వచ్చారు, మీ గ్రూపు ఎక్కడ ఉంది? చూడండి, తోటివారిని కూడా తయారు చేసారు. గారాల పిల్లలను తీసుకువచ్చారు. అచ్ఛా! బాబాకు ఒక్కొక్క బిడ్డపై ఒకరిని మించి మరొకరిపై ప్రేమ ఉంది. పేరు తీసుకోవాలంటే ఎంతమంది పేర్లు తీసుకోవాలి! మా పేరు బాబా హృదయంలో ఉంది అని అందరూ భావించండి. మంచి సేవను చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మిడిల్ ఈస్ట్ ఎక్కువగా కనిపిస్తోంది, అన్ని ధర్మాలకు సందేశమైతే అందాలి కదా!

           ఇప్పుడు ప్రతి జోను ఒక పురుషార్థాన్ని చెయ్యండి, ఏమి చేస్తారు? ఎవరైనా ఒక నాస్తికుడిని, కఠినమైన నాస్తికుడిని ఆస్తికుడిగా చేసి తీసుకురండి. అప్పుడు వారు నాస్తికుడి నుండి ఆస్తికుడిగా ఎలా అయ్యాను అని అందరి ముందు వారి అనుభవం వినిపించాలి. పెద్ద సభలో వినిపించాలి. చిన్నవారు కాదు, జనంపై వారి ప్రభావం పడేవారిగా ఉండాలి. ఎలా అయితే ప్రతి వర్గంలో సేవ చేస్తారు కదా, ఇలా కూడా ఎవరినైనా తయారు చెయ్యండి. అలాగే ఎవరైనా అథారిటీ ఉన్న ధర్మంవారిని తయారు చెయ్యండి, సరైన పరమాత్మ పరిచయాన్ని బ్రహ్మాకుమారీలు ఇస్తున్నారు, బ్రహ్మాకుమారులు ఇస్తున్నారు అని వారు తమ అనుభవంలో వినిపించాలి. బ్రహ్మాకుమారీలు చెప్పేది ఎలా రైట్ అవుతుంది? అని వారి నోటి ద్వారానే అథారిటితో కూడిన మాటలు రావాలి. చివరిగా ఒక పాయింటు మిగిలిపోయింది, గీతా భగవంతుడు ఎవరు? అది కూడా నిరూపణ అవుతుంది కదా! ఇది నిరూపణ అయినప్పుడు భగవంతుడు వచ్చాడు అని అప్పుడు అంటారు. చాలా బాగుంది. మధువనానికి అలంకారంగా వస్తారు, ఇది చూసి బాప్ దాదా సతోషిస్తున్నారు. అచ్ఛా!

*దాదీలతో:-* మీరు దూరంగా కూర్చుని ఉన్నా కానీ బాప్ దాదా మీ అందరినీ కౌగిలించుకుంటున్నారు. వెనుక ఉన్నవారిని ముందుగా కౌగిలించుకుంటున్నారు. స్నేహము ఏమి అనుభవం చేయించలేదు! అచ్ఛా, (డా.నిర్మలతో) మంచి పాత్రను వహిస్తున్నారు, బాప్ దాదా సంతోషిస్తున్నారు.

*పర్ దాదీతో:-* (ఈస్టర్న్ జోన్ ఇన్ ఛార్జ్) నిమిత్తంగా అయితే అయ్యారు. నిమిత్తంగా అయ్యారు, మీ కారణంగా అందరూ బాబా, బాబా అని గుర్తు చేస్తారు. క్రొత్తగా వచ్చినవారు మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూడరు, బాబాను చూస్తారు. ఇది విశేషమైన వరదానము. అచ్ఛా!

*శాంతమణి దాదీతో:-* తమ తమ పాత్రను సమయానికి మంచిగా వహిస్తున్నారు. కానీ పాతవారిని అందరూ ఏ దృష్టితో చూస్తారు? ఆది సమయం వారు. ఆది సమయానికి మహత్వం ఉంది. కొద్దిమందే మిగిలి ఉన్నారు, కానీ ఆది రత్నాలు కదా. అచ్ఛా!

*బృజ్ మోహన్ అన్నయ్యతో:-* ఢిల్లీ ప్రోగ్రాము బాగా జరిగింది. ఒకసారి సిస్టమ్ తయారైతే రాబోవు కాలం కోసం కూడా తయారవుతుంది. ఏ కార్యాలు చేస్తున్నారు అని ఇప్పుడు అందరి దృష్టిలోకి వస్తుంది.

           ఢిల్లీ టీచర్లు లేవండి, లేచి నిల్చోండి. అచ్ఛా! సేవ చేస్తే మంచిగా అనిపించింది కదా, అందరి సంకల్పము ఒకలా ఉండటము అంటే ఇదే. ఇప్పుడు ఇంక ముందుకు వెళ్తూ ఉంటుంది. అనుభవం వచ్చినప్పుడు ముందుకు వెళ్తూ ఉంటారు, కానీ ఏ కార్యంలో అయినా సఫలత కావాలనుకుంటే అందుకు మొదటి పునాది- అందరి ఏకమతము. అందరి మనసులలో ఉల్లాసము ఉత్సాహము ఉండాలి. పరీక్ష కూడా అనుభవజ్ఞులుగా చేస్తుంది. ఇదే విధంగా సంగఠన శక్తి అన్నిటినీ సహజం చేసేస్తుంది. బాప్ దాదా మీ ధైర్యాన్ని చూసి సంతోషిస్తున్నారు. ఎక్కడ ధైర్యము ఉంటుందో అక్కడ ప్రకృతి అనుచరులందరి సహకారం కూడా లభిస్తుంది. అభినందనలు.

           (ఇప్పుడు దీనికన్నా పెద్ద సభను ఏర్పాటు చేస్తాము, అందులో బాప్ దాదా కూడా రావాలి) బాప్ దాదా అయితే ఇప్పుడు కూడా చూసారు, కానీ మీరు చూడలేదు. (అజ్మీర్ లో కూడా మంచి ప్రోగ్రాము జరిగింది) మంచి ధైర్యాన్ని ఉంచారు. ధైర్యమును ఉంచారు కనుక సఫలత లభించింది.

           చెన్నై సమాచారమును కూడా విన్నాము. ఏ ప్రోగ్రాము అయితే చేస్తున్నారో, చిన్న ప్రోగ్రాము అయినా కానీ రిజల్టు మంచిగా ఉంది. (చెన్నై టీచర్లు లేవండి) బాగుంది. బాప్ దాదా రిజల్టు విన్నారు. తక్కువ ఖర్చుతో మంచి రిజల్టు వచ్చింది. ఎందుకంటే శివుని పూజ అటువైపు మనస్ఫూర్తిగా చేస్తారు. చిన్నని మేళా(జ్యోతిర్లింగ మేళా) కానీ రిజల్టు మంచిగా ఉంది. ప్రతి జోను ఏదో ఒకటి చేస్తూ ఉంది. ఒకసారి ఒకరు చేస్తారు, మరోసారి ఇంకొకరు చేస్తారు కానీ అన్ని జోన్లకు, ఎవరైతే చెయ్యలేదో వారికి కూడా చేసేందుకు ముందే అభినందనలు తెలుపుతున్నారు. అచ్ఛా.

Comments