12-03-1972 అవ్యక్త మురళి

  * 12-03-1972         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"సఫలతకు ఆధారము - సంగ్రహము మరియు సంగ్రామము చేసే శక్తి."

మిమ్మల్ని మీరు సదా స్తనలతామూర్తులుగా భావిస్తున్నారా? లేక సహజముగానే ప్రాప్తి అవుతున్నట్లుగా అనుభవము చేస్తున్నారా? సదా ఇంకా ఎక్కున సహజంగా సఫలతామూర్తిగా అయ్యేందుకు ముఖ్యంగా రెండు శక్తుల ఆవశ్యకత ఉంది. ఈ రెండు శక్తుల ఆధారముతో సదా మరింత సహజంగా సఫలతామూర్తులుగా అవ్వగలరు. ఆ రెండు శక్తులు ఏవి? నిశ్చయబుద్ధి అయితే ఉండనే ఉంది కదా, ఇప్పుడు సఫలతా పురుషార్థములో ముఖ్యంగా ఏ శక్తులు కావాలి?  ఒకటి - సంగ్రామము చేసే శక్తి, రెండవది - సంగ్రహము చేసే శక్తి. సంగ్రహములో లోకసంగ్రహము కూడా వస్తుంది. అన్ని రకాల సంగ్రహము. కావున ఒకటి సంగ్రామము, రెండవది సంగ్రహము, ఈ రెండు శక్తులు ఉన్నట్లయితే అసఫలత ఉండజాలదు. ఏ కార్యములోనైనా లేక మీ పురుషార్థములోనైనా అసఫలతకు కారణము ఏముంటుంది? సంగ్రహము చెయ్యటమన్నా రాదు, లేక సంగ్రామము చెయ్యటమన్నా రాదు. ఒకవేళ ఈ రెండు శక్తులు వచ్చేసినట్లయితే సదా మరియు సహజముగానే సఫలత లభించేస్తుంది. కావున ఈ రెండు శక్తులను మీలో నింపుకొనే పురుషార్థము చెయ్యాలి. ఏ కార్యమైనా ఎదురుగా వచ్చినట్లయితే కార్యము చేసేందుకు ముందే ఈ రెండు శక్తులు స్మృతిలో ఉన్నాయా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. శక్తులు ఉంటాయి కూడా. కానీ కర్తవ్యము సమయములో శక్తులను ఉపయోగించరు, కావుననే సఫలత ఉండదు. ఇలా చేసి ఉంటే ఇలా జరిగి ఉండేదని చేసిన తరువాత ఆలోచిస్తారు. దీనికి కారణము ఏమిటి? అవసరమైన సమయములో శక్తులను ఉపయోగించటము రాదు. శస్త్రాలు(ఆయుధాలు) ఎంత మంచివిగా ఉన్నా, శక్తులు ఎన్ని ఉన్నాగానీ ఏ సమయములో ఏ ఆయుధము లేక ఏ శక్తిని కార్యములోకి తీసుకురావలసి ఉంటుందో దానిని కార్యములోకి తీసుకురానట్లయితే సఫలత ఉండదు. ఈ కారణము వలన ఏ కార్యమునైనా ప్రారంభించేందుకు ముందే మిమ్మల్ని పరిశీలించుకోండి. ఫోటో తీస్తారు కదా, ఫోటో తీసే ముందే తయారవటం ఉంటుంది కదా! ఫోటో తీసారు మరియు అది ఎలా ఉన్నా గానీ సదా కాలమునకు సృతి చిహ్నముగా తయారైంది. అదేవిధంగా ఇది కూడా బేహద్దు కెమెరా, ఇందులో ప్రతి క్షణము ఫోటో వస్తూ ఉంటుంది. ఫోటో వచ్చేసిన తరువాత మిమ్మల్ని మీరు సరిచేసుకుంటే అది వ్యర్ధమే కదా! ఇదేవిధంగా మొదట మిమ్మల్ని మీరు శక్తి స్వరూపపు స్టేజ్ పై స్థితులను చేసుకున్న తరువాత ఏ కార్యమునైనా ప్రారంభించాలి. స్టేజ్ నుండి క్రిందకు దిగి అభినయించినట్లయితే, అది ఎంత బాగా అభినయించినాగానీ చూసేవారు ఎలా చూస్తారు? ఇది కూడా అలాగే. మొదట స్టేజ్ పై స్థితులవ్వండి, పిదప ప్రతి ఏక్ట్ చెయ్యాలి, అప్పుడే ఎక్యురేట్ గా ఉంటుంది మరియు ఓహో, ఓహో అనేందుకు యోగ్యమైన ఏక్ట్ గా ఉండగలదు. స్టేజ్ నుండి దిగి సాధారణ రీతిలో కర్తవ్యమును చెయ్యటము మొదలు పెడ్తారు. తరువాత ఆలోచిస్తారు, కానీ ఆ స్టేజ్ అయితే లేదు కదా. సమయము గడచిపోయింది. ఫోటో అయితే వెలువడిపోయింది. కావున ఈ రెండు శక్తులూ ఎల్లప్పుడూ ప్రతి కార్యములో ఉండాలి. ఒక్కసారి సంగ్రామము చేసే ఉత్సాహము వచ్చేస్తుంది, సంగ్రహమును మర్చిపోతారు. సంగ్రహము చేసేందు గురించి ఆలోచించినప్పుడు మళ్ళీ సంగ్రామమును మర్చిపోతారు. రెండూ తోడు తోడుగా ఉండాలి. సర్వ శక్తుల ప్రయోగము ద్వారా రిజల్టు ఏముంటుంది? సఫలత. వారి సంకల్పములు, మాటలు, చేతలు అన్నీ ఒకే విధముగా ఉంటాయి. వీరినే మాస్టర్ సర్వ శక్తివంతులు అని అంటారు. సంకల్పములు చాలా ఉన్నతంగా ఉంటాయి, ప్లాన్స్ తయారు చేస్తూ ఉంటారు, నోటి నుండి వర్ణనను కూడా చేస్తూ వుంటారు కానీ చేసే సమయంలో చెయ్యలేకపోయినట్లయితే మాస్టర్ సర్వశక్తివంతులుగా అయినట్లా? మాస్టర్ సర్వ శక్తివంతుల ముఖ్య లక్షణమే వారి సంకల్పములు, మాటలు మరియు చెయ్యటము మూడూ ఒక్కటిగా ఉండటము. ఆలోచననైతే చేసాను కానీ చెయ్యలేకపోయాను అనే నూట ఇప్పుడు ప్రతి సమయము వస్తూ ఉంటుంది. ప్లాన్ మరియు ప్రాక్టికలో అంతరము కనిపిస్తుంది. కానీ మాస్టర్ సర్వశక్తివంతులు మరియు సదా సఫలతామూర్తులుగా ఎవరైతే ఉంటారో వారి ప్లాన్ ఏది ఉంటుందో అదే ప్రాక్టికల్‌గా అవుతుంది. సఫలతామూర్తిగా కావాలని అందరూ కోరుకుంటారు కదా! కోరిక మరియు లక్ష్యము శ్రేష్ఠముగా ఉన్నట్లయితే లక్ష్యమునకు తోడుగా వాణి మురియు కర్మలను కూడా శ్రేష్టంగా చేసుకొని ప్లాన్ ను ఉన్నతంగా తయారు చేస్తారు. కానీ ప్రాక్టికల్ లోకి వచ్చినప్పుడు ఏదైనా బలహీనత ఉన్న కారణంగా ప్లాన్ ఏదైతే ఉందో దాని అనుసారంగా రూపమును ఇవ్వలేకపోతారు. ఎందుకంటే సంగ్రామము చేసే, లేక ఆ విషయాలలో లోక సంగ్రహమును ఉంచే శక్తి తక్కువైపోతుంది. ఏవిధంగా మొదట్లో యుద్ధమైదానంలో ఎదురుగా శతృవు వచ్చినట్లయితే ఒక చేతిలో కత్తిని కూడా పట్టుకొనేవారు, తోడు-తోడుగా రెండవ చేతిలో ఢాలు కూడా ఉండేది. కావున కత్తి మరియు ఢాలు రెండూ తమతమ కార్యమును చేసే అభ్యాసము కావాలి. రెండింటినీ తోడుతోడుగా ఉపయోగించే అభ్యాసము అవసరము. మిమ్మల్ని మీరు మాస్టర్ గా భావించినట్లయితే అన్ని విషయాలలో మీరు మాస్టర్లు. తండ్రి పేరును త్రిమూర్తి శివుడు అని అంటారు కదా, అలాగే మీరందరూ కూడా మాస్టర్ త్రిమూర్తి శివులే కదా! మీకు కూడా మూడు కర్తవ్యాలు ఉన్నాయి కదా! వాటి ఆధారంతోనే మొత్తము కర్తవ్యమును మరియు సేవను చేస్తారు. మీ మూడు రూపాలు ఏవి? ఒకటి బ్రాహ్మణరూపము, దీని ద్వారా స్థాపన కార్యమును చేస్తారు. రెండనది శక్తి రూపము, దీని ద్వారా వినాశన కర్తవ్యమును చేస్తారు మరియు జగన్మాత, జ్ఞాన గంగ లేక స్వయమును మహాదాని, వరదానీ రూపముగా భావించటం ద్వారా పాలన చేస్తారు. వరదానీ రూపములో జగత్ పిత రూపము రానే వస్తుంది. కావున ఈ మూడురూపాలు ఎల్లప్పుడూ స్మృతిలో ఉన్నట్లయితే మీ కర్తవ్యములో కూడా అవే గుణాలు కనిపిస్తాయి. ఏవిధంగా తండ్రికి తన మూడురూపాల స్మృతి ఉంటుందో, అలా నడుస్తూ తిరుగుతూ మేము మాస్టర్ త్రిమూర్తులము అన్న మీ మూడురూపాల స్మృతి ఉండాలి. మూడు కర్తవ్యాలు తోడుతోడుగా కలసి ఉండాలి. స్థాపనా కర్తవ్యమును చేసే సమయము వేరు, వినాశన కర్తవ్యమును చేసే సమయము ఇంకా వచ్చేదుంది అని కాదు. నూతన రచనను రచిస్తూ వెళ్ళండి మరియు పాతదానిని వినాశనము చేస్తూ వెళ్ళండి. ఆసురీ సంస్కారాలు లేక ఏ బలహీనతలు ఉన్నా, వాటి వినాశనమును కూడా తోడుతోడుగా చేస్తూ వెళ్ళాలి. క్రొత్త సంస్కారమును తీసుకువస్తున్నారు, పాత సంస్కారమును సమాప్తము చేస్తూ ఉన్నారు. చాలామందిలో రచనను రచించే గుణము ఉంటుంది. కానీ శక్తి రూపము, వినాశన కార్యరూపము లేని కారణంగా సఫలత ఉండదు. కావున రెండు తోడుతోడుగా ఉండాలి. ఎప్పుడైతే ఒక్క క్షణములో దేహీ అభిమానిగా అయ్యే అభ్యాసము ఉంటుందో అప్పుడే ఈ ప్రాక్టీసు ఉండగలదు. స్వయమును మహాదాని లేక వరదాని, జగన్మాత లేక జగత్ పిత లేక పతిత పావని రూపములో స్థిరం చేసుకొని ఏ ఆత్మకైనా మీరు దృష్టిని ఇచ్చినట్లయితే దృష్టి ద్వారా కూడా వారికి వరదానపు ప్రాప్తి చేయించగలరు. వృత్తి (మానసిక ఆలోచనల)ద్వారా కూడా ప్రాప్తి చేయించగలరు, అనగా పాలన చేయించగలరు. కానీ ఈ రూపపు స్మృతి సదా ఉండాలి. బ్రాహ్మణులు కథ లేక జ్ఞానమును వినిపించి స్థాపననైతే చాలా త్వరగా చేసారు. కానీ వినాశనము మరియు పాలనల కర్తవ్యము ఏదైతే ఉందో అందులో ఇంకా ఎక్కువ అటెన్షన్ అవసరము. పాలన చేసే సమయములో కల్యాణకారి భావన మరియు వృత్తిని ఉంచుకొని ఏ ఆత్మ పాలననైనా చేసినట్లయితే ఎటువంటి అపకారీ ఆత్మనైనా మీ పాలన ద్వారా వారిని ఉపకారిగా చెయ్యగలరు. ఎటువంటి పతిత ఆత్మ అయినా పతిత పావని వృత్తి ద్వారా పావనంగా అవ్వగలదు. ఒకవేళ వారి పతితత్వమును చూసినట్లయితే అది జరగజాలదు. తల్లి తన పిల్లల లోపాలను లేక బలహీనతలను చూడదు, వారిని మంచిగా చేసే దృష్టే ఉంటుంది. కావున ఈ పాలన చేసే కర్తవ్యము ఈ రూపములో సదా స్థితులవ్వటం ద్వారా యథార్థముగా నడవగలరు. తల్లిలో సహనము చేసే శక్తి మరియు ఇముడ్చుకొనే విశేష శక్తులు ఏవిధంగా ఉంటాయో అలాగే ప్రతి ఆత్మ పాలన చేసే సమయములో కూడా ఈ రెండు శక్తులను ఉపయోగించినట్లయితే సఫలత తప్పక ఉంటుంది. కానీ మిమ్మల్ని జగన్మాత లేక జగత్ పిత రూపములో స్థిరము చేసుకొని చేసినట్లయితేనే సఫలత లభిస్తుంది. ఒకవేళ సోదరీ సోదరుల రూపములో చూసినట్లయితే అందులో సంకల్పాలు రాగలవు. కానీ తల్లి తండ్రి సమానంగా భావించండి. తల్లిదండ్రులు పిల్లలను ఎంతగా సహనము చేస్తారు! లోపల నింపుకుంటారు, అప్పుడే వారి పాలన చేసి వారిని యోగ్యులుగా తయారు చెయ్యగలరు. కావున ఎల్లప్పుడూ ప్రతి కర్తవ్యమును చేస్తున్న సమయములో మీ ఈ మూడు రూపాలను కూడా స్మృతిలో ఉంచుకోవాలి. ఎటువంటి స్మృతియో, అటువంటి స్వరూపము మరియు ఎటువంటి స్వరూపమో అటువంటి సఫలత. మూడురూపాల స్మృతి ద్వారా స్వతహాగానే సమర్థత్వము వచ్చేస్తుంది. ఇది కూడా పొజిషన్ కదా! కావున పొజిషన్లో ఉండటం ద్వారా శక్తి లేక సమర్థత్వము వచ్చేస్తాయి. తండ్రి పేరు గుర్తు వచ్చినట్లయితే స్వయమును తప్పకుండా మాస్టర్ గా భావిస్తారు. పేరునైతే అందరికీ గుర్తు చేస్తారు. ఎన్నిసార్లు తండ్రి పేరును మనసు ద్వారా మరియు నోటి ద్వారా ఉచ్ఛరిస్తూ ఉంటారు! కావున తండ్రి పేరులా నేను కూడా మాస్టర్ త్రిమూర్తి శివుడను - ఈ స్మృతిలో ఉన్నట్లయితే సఫలత ఉంటుంది. కావున సదా సఫలతామూర్తులుగా అవ్వండి. ఇప్పుడు అసఫలతను పొందే సమయము లేదు. ఒకవేళ 10 సార్లు సఫలత ఉండి, ఒక్కసారైనా అసఫలత ఉన్నట్లయితే దానినీ అసఫలత అనే అంటారు. కావున కర్తవ్యము మరియు స్వరూపము రెండూ తోడుతోడుగా స్మృతిలో ఉన్నట్లయితే ఇక అద్భుతము ఉంటుంది. అలా కానట్లయితే జరిగేది ఏంటి, శ్రమ ఎక్కువైపోతుంది, ప్రాప్తి చాలా తక్కువౌతుంది. ప్రాప్తి తక్కువైన కారణంగానే బలహీనత వస్తుంది. ఉత్సాహము తక్కువైపోతుంది. ధైర్యము, ఉల్లాసము తక్కువైపోతాయి. కారణాన్ని తెలుసుకోవాలి. మీ కాళ్ళపై మీరే వేటును వేసుకుంటారు, కావున మీకు మీరు బాధ్యులు కావున ఎల్లప్పుడూ అటెన్షన్ ఉండాలి. కావున ఇప్పటినుండి జరిగిపోయినదానికి బిందువును పెట్టి స్మృతి ద్వారా మీలో సమర్థతను తీసుకొని వచ్చి, సదా సఫలతా మూర్తులుగా అవ్వండి. అప్పుడిక ఈ అంతరమేదైతే ఉందో, ఈ రోజు చాలా ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయి రేపు మళ్ళీ తక్కువైపోతాయి, ఈ అంతరము కూడా అంతమైపోతుంది. సదా ఉల్లాస-ఉత్సాహాలు మరియు సదా స్వయములో ప్రాప్తి యొక్క అనుభవమును చేస్తారు. మాయను, ప్రకృతిని దాసిగా చెయ్యాలి. సత్యయుగములో ప్రకృతిని దాసిగా తయారుచేసుకుంటారు, కావున దుఃఖము రాదు. దుఃఖమునకు కారణము ప్రకృతికి, మాయకు దాసిగా అవ్వటము. ఒకవేళ వాటికి దాసిగా అవ్వనే అవ్వకపోతే దుఃఖము రాగలదా? కావున ఎప్పుడూ మాయకు దాసులుగా లేక దాసీలుగా అవ్వకూడదు. ఇక్కడ ఎక్కువగా మాయకు లేక ప్రకృతికి దాసులుగా అయినట్లయితే వారు అక్కడ కూడా దాసదాసీలుగా అవ్వవలసి వస్తుంది. ఎందుకంటే సంస్కారమే దాసదాసీలదిగా అయిపోయింది. ఇక్కడ దాసులుగా కూడా ఉన్నారు, ఉదాసులు(దుఃఖితులు)గా కూడా ఉన్నారు మరియు అక్కడ కూడా దాసులుగా అయితే ఇక లాభమేముంది? కావున పరిశీలించుకోండి - ఉదాసీనత వచ్చినట్లయితే తప్పకుండా ఎక్కడైనా మాయకు దాసునిగా అయ్యానా? దాసదాసీలుగా కాకుండా ఉదాసీలుగా అవ్వజాలరు. కావున మొదట కావలసినది పరిశీలన, పిదప పరివర్తనకు కూడా శక్తి అవసరము కావున ఎప్పుడూ అసఫలతామూర్తులుగా అవ్వకూడదు. మీ తరువాతి ప్రజలు మరియు భక్తులు అలా అవుతారు. విశ్వరాజ్యమును నడిపేవారు కూడా ఒకవేళ అసఫలతలో ఉన్నట్లయితే సఫలతామూర్తులుగా ఇక ఎవరు తయారవుతారు? అచ్ఛా!

రోజు రోజుకూ మీలో పరివర్తనను తీసుకురావాలి. ఎవరి స్వభావమునైనా, సంస్కారమునైనా చూస్తూ కూడా, తెలుసుకొని కూడా బుద్ధియోగము అటు... వెళ్ళకూడదు. ఇంకా ఎక్కువగా ఆ ఆత్మపట్ల శుభ భావన ఉండాలి. ఒకవైపు నుండి విన్నారు, రెండవవైపు నుండి తొలగించేసారు. వాటికి బుద్ధిలో స్థానమును ఇవ్వకూడదు, అప్పుడే ఒక వైపు బుద్ధి నిలవగలదు. బలహీన ఆత్మల బలహీనతను చూడకండి. వెరైటీ ఆత్మలు అని స్మృతిలో ఉండాలి, ఆత్మిక దృష్టి ఉండాలి. ఆత్మరూపములో వారిని స్మృతిలోకి తీసుకురావటం ద్వారా పవర్(శక్తి)ని ఇవ్వగలరు. ఆత్మ మాట్లాడుతూ ఉంది, ఇది ఆత్మ సంస్కారము. ఈ పాఠమును దృఢం చేసుకోవాలి. ఆత్మ అన్న మాట స్మృతిలోకి రావటంతోనే ఆత్మికత, శుభ భావన వచ్చేస్తాయి, దృష్టి పవిత్రమైనదిగా అయిపోతుంది. ఎవరు నిందిస్తూ ఉన్నాగానీ ఈ ఆత్మ తమోగుణీ పాత్రను పోషిస్తూ ఉంది అని స్మృతిలో ఉండాలి. మీకు మీరే స్వయం టీచరులుగా అయ్యి అటువంటి ప్రాక్టీసును చెయ్యాలి. ఈ పాఠమును దృఢం చేసుకొనేందుకు ఇతరుల నుండి సహాయము లభించజాలదు, మీ పురుషార్ధము యొక్క సహాయమే పని చేస్తుంది. అచ్ఛా!

Comments