31-03-1988 అవ్యక్త మురళి

 31-03-1988         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

వాచా మరియు కర్మణా - రెండు శక్తులను జమ చేసుకునే ఈశ్వరీయ పథకం.

తన మనస్సు యొక్క స్నేహి పిల్లలకు బాబా సమానంగా అయ్యే సైగ చేస్తూ ఆత్మికదీపం అయిన బాప్ దాదా మాట్లాడుతున్నారు -

ఈరోజు ఆత్మికదీపం తన యొక్క ఆత్మిక దీపపు పురుగులను చూస్తున్నారు. నలువైపుల ఉన్న దీపపు పురుగులు దీపానికి బలి అయిపోయారు అంటే అర్పణ అయిపోయారు. అర్పణ లేదా బలి అయ్యే దీపపు పురుగులు అనేకమంది కానీ అర్పణ అయిపోయిన తర్వాత దీపం యొక్క స్నేహంలో దీపం సమానంగా అవ్వటంలో, బలి అవ్వటంలో నెంబర్ వారీగా ఉన్నారు. వాస్తవానికి మనస్సు యొక్క స్నేహం కారణంగానే బలి అవుతున్నారు. మనస్పూర్వక స్నేహం మరియు స్నేహంలో తేడా ఉంటుంది. స్నేహమైతే అందరికీ ఉంది, స్నేహం కారణంగానే అర్పణ అయ్యారు. మనస్పూర్వక స్నేహి ఆత్మలు బాబా మనస్సులోని విషయాలను మరియు ఆశలను తెలుసుకుంటారు కూడా మరియు పూర్తి చేస్తారు కూడా. మనస్పూర్వక స్నేహిలు మనస్సు యొక్క ఆశలను పూర్తి చేసేవారు. మనస్ఫూర్వక స్నేహి అనగా బాబా మనస్సులోనిది చెప్పగానే వారి మనస్సులోకి వెళ్ళిపోతుంది. మనస్సులోకి వెళ్ళింది స్వతహాగానే కర్మలోకి వస్తుంది. స్నేహి ఆత్మలకు కొన్ని మనస్సులో నిండుతాయి; కొన్ని బుద్దిలో నిండుతాయి. మనస్సులో నిండినవి కర్మలోకి తీసుకువస్తారు, బుద్దిలో నిండిన వాటి గురించి చేయగలమా, లేదా, చేయాల్సిందే, సమయానికి అయిపోతుందిలే... ఇలాంటి ఆలోచనలు నడుస్తాయి. అందువలన అవి ఆలోచన వరకే ఉండిపోతాయి కానీ కర్మ వరకు రావు.

ఈరోజు బాప్ దాదా చూస్తున్నారు - అందరూ అర్పణ అయ్యేవారే. అర్పణ అవ్వకపోతే బ్రాహ్మణులుగా పిలవబడరు. బాబాపై స్నేహంతో బాబా చెప్పినది చేయటానికి అర్పణ చేయవలసి ఉంటుంది అంటే నాది అనే భావనను త్యాగం చేయాలి. నాది అనే భావనలో అభిమానాన్ని మరియు బలహీనతను రెండింటినీ త్యాగం చేయాల్సి ఉంటుంది. దీనినే బలిహారం అని అంటారు. అర్పణ అయ్యేవారు చాలామంది ఉన్నారు కానీ అర్పణ చేయటానికి ధైర్యం గల వారు నెంబర్ వారీగా ఉన్నారు.

ఈరోజు బాప్ దాదా విశేషంగా ఒక నెల యొక్క ఫలితం చూస్తున్నారు. ఈ సీజన్ లో విశేషంగా బాప్ దాదా బాబా సమానంగా అయ్యేటందుకు రకరకాల రూపాలతో ఎన్నిసార్లు సైగ చేసారు మరియు బాప్ దాదా మనస్సు యొక్క విశేష శ్రేష్ట ఆశ ఇదే. ఇన్ని ఖజానాలు, వరదానాలు లభించాయి! వరదానం కొరకు పరుగుపరుగున వచ్చారు. పిల్లలు స్నేహంతో కలుసుకోవడానికి వస్తున్నారు, వరదానం తీసుకుని సంతోషపడుతున్నారు అని బాబాకి కూడా సంతోషంగా ఉంది. కానీ బాబా మనస్సులోని ఆశను పూర్తి చేసేవారు ఎవరు? బాబా ఏదైతే చెప్పారో దానిని కర్మలోకి ఎంత వరకు తీసుకువచ్చారు? మనసా, వాచా, కర్మణా - మూడింటి ఫలితం ఎంత వరకు వచ్చినట్లు భావిస్తున్నారు? శక్తిశాలి మనస్సు, సంబంధ, సంపర్కాలలోకి ఎంత వరకు వచ్చారు? కూర్చుని మీకు మీరు మననం చేసుకోవటం అనేది స్వఉన్నతి కొరకు చాలా మంచిది మరియు చేయాల్సిందే. కానీ ఏ శ్రేష్టాత్మల యొక్క మనస్సు శ్రేష్టంగా ఆంటే సంకల్పం శక్తిశాలిగా, శుభభావన, శుభకామనతో ఉంటుందో ఆ మనసా శక్తికి దర్పణం ఏమిటి? దర్పణం - మాట మరియు కర్మ. అజ్ఞాని ఆత్మలకైనా, జ్ఞాని ఆత్మలకైనా ఇద్దరి సంబంధ, సంపర్కంలో మాట మరియు కర్మయే దర్పణం. ఒకవేళ మాట మరియు కర్మ శుభభావన, శుభకామన కలిగి లేకపోతే కనుక మనస్సు యొక్క శక్తి ప్రత్యక్షంగా ఎలా తెలుస్తుంది? ఎవరి మనస్సు అయితే శక్తిశాలిగా మరియు శుభంగా ఉంటుందో వారి మాట మరియు కర్మ స్వతహాగానే శక్తిశాలిగా, శుద్ధంగా ఉంటాయి మరియు శుభభావనతో ఉంటాయి. మనస్సు శక్తి శాలిగా అంటే స్మృతి శక్తి కూడా శ్రేష్టంగా ఉంటుంది, శక్తిశాలిగా ఉంటుంది, సహజయోగిగా ఉంటారు. కేవలం సహజయోగిగానే కాదు కానీ సహజ కర్మయోగిగా ఉంటారు.

బాప్ దాదా చూసారు - స్మృతిని శక్తిశాలిగా చేసుకోవటంలో ఎక్కువమంది పిల్లలకు ధ్యాస ఉంది మరియు స్మృతిని నిరంతరం మరియు సహజంగా చేసుకోవాలనే ఉత్సాహ, ఉల్లాసాలు కూడా ఉన్నాయి. ముందుకు వెళ్తున్నారు మరియు వెళ్తూనే ఉంటారు. ఎందుకంటే బాబాపై స్నేహం చాలా ఉంది, అందువలన స్మృతి యొక్క ధ్యాస బావుంది; స్మృతికి ఆధారమే స్నేహం. బాబాతో ఆత్మికసంభాషణ చేయటంలో కూడా అందరు బావున్నారు. అప్పుడప్పుడు కళ్ళు పెద్దవి చేసి పరస్పరంలో కొంచెం కోపగించుకుంటున్నారు. పైగా నీవు ఎందుకు సరి చేయటం లేదు? అని బాబాని నిందిస్తున్నారు. కళ్ళు పెద్దవి చేసినా కానీ అవి స్నేహపూరిత ప్రియ నయనాలు. సంఘటనలోకి వచ్చినప్పుడు, కర్మలోకి వచ్చినప్పుడు, కార్యవ్యవహారంలోకి వచ్చినప్పుడు, పరివారంలోకి వచ్చినప్పుడు సంఘటనలో మాట అనగా వాచా శక్తిలో వ్యర్థం ఎక్కువగా కనిపిస్తుంది.

వాణీ శక్తి వ్యర్ధంగా వెళ్తున్న కారణంగా వాణీలో బాబాని ప్రత్యక్షం చేసే మెరుపు లేదా శక్తి ఏదైతే అనుభవం అవ్వాలో అది తక్కువ అవుతుంది. విషయాలు చాలా మంచిగా అనిపిస్తున్నాయి అనటం అనేది వేరే విషయం. ఎందుకంటే బాబా చెప్పిన విషయాలు చెప్తున్నారు కనుక అవి తప్పక మంచిగా అనిపిస్తాయి. కానీ వాచాశక్తి వ్యర్ధంగా వెళ్తున్న కారణంగా శక్తి జమ అవ్వటంలేదు. అందువలనే బాబాని ప్రత్యక్షత యొక్క ధ్వని ప్రతిధ్వనించడంలో ఆలస్యమవుతుంది. సాధారణ మాటలు ఎక్కువగా ఉంటున్నాయి. అలౌకిక మాటలు, ఫరిస్తాల మాటలు ఉండాలి. ఈ సంవత్సరం దీనిపై ధ్యాస పెట్టుకోవాలి. బ్రహ్మాబాబాని చూసారు కదా - ఫరిస్తా వలె మాట్లాడేవారు, తక్కువగా మరియు మధురంగా మాట్లాడేవారు. ఏ మాటలకైతే ఫలం వస్తుందో అవే యదార్థ మాటలు మరియు ఏ మాటలకైతే ఫలం ఉండదో అవి వ్యర్ధమాటలు. కార్యవ్యవహారాల నిమిత్తం మాట్లాడవలసి వస్తుంది కానీ అప్పుడు కూడా ఎక్కువ మాట్లాడకండి. ఇప్పుడు శక్తిని జమ చేసుకోవాలి. ఎలా అయితే స్మృతి ద్వారా మనసాశక్తిని జమ చేసుకుంటున్నారో, శాంతిగా కూర్చోవటం ద్వారా సంకల్పశక్తిని జమ చేసుకుంటున్నారో అలాగే వాణీ శక్తిని కూడా జమ చేసుకోండి.

నవ్వు వచ్చే విషయం ఒకటి చెప్తున్నాను - బాప్ దాదా యొక్క వతనంలో అందరి జమా భండారీలు ఉన్నాయి. మీ సేవాకేంద్రంలో కూడా భండారిలు (డిబ్బీ) ఉంటాయి కదా! బాబా యొక్క వతనంలో పిల్లల భండారీ ఉంది. ప్రతి ఒక్కరు రోజంతటిలో మనసా, వాచా, కర్మణా మూడు శక్తులను పొదుపు చేసుకుని జమ చేసుకునే దాని యొక్క భండారీ ఉంది. మనసాశక్తిని ఎంత జమ చేసుకున్నారు, వాచాశక్తి మరియు కర్మణా శక్తిని ఎంత జమ చేసుకున్నారో మొత్తం లెక్కాచారం అంతా ఉంటుంది. మీరు కూడా ఖర్చు మరియు పొడుపు యొక్క లెక్కల ఖాతా పంపిస్తారు కదా! బాప్ దాదా జమ యొక్క ఈ భండారీలను చూసారు. ఫలితం ఏమి వచ్చి ఉంటుంది? జమాఖాతా ఎంత అయ్యి ఉంటుంది? ప్రతి ఒక్కరిదీ ఎవరి ఫలితం వారిది. భండారీలు అయితే చాలా బాగా నిండుగా ఉన్నాయి కానీ చిల్లర ఎక్కువగా ఉంది. చిన్న పిల్లలు భండారీలో చిల్లర జమ చేసుకుంటారు కదా, అప్పుడు ఆ బండారీ ఎంత బరువుగా ఉంటుంది! అలాగే వాచా ఫలితంలో కూడా విశేషంగా ఇదే చూసారు. ఎలా అయితే స్మృతిపై ధ్యాస ఉందో అలా వాచాపై అంత ధ్యాస లేదు. కనుక ఈ సంవత్సరం వాచా మరియు కర్మణా ఈ రెండు శక్తులను జమ చేసుకునే పథకాన్ని తయారుచేసుకోండి. ప్రభుత్వం వారు కూడా రకరకాల పద్దతిలో పొదుపు యొక్క పథకాలను తయారుచేస్తున్నారు కదా! అదేవిధంగా ముఖ్యమైనది మనస్సు. ఇదైతే అందరికీ తెలుసు. కానీ మనస్సుతో పాటు విశేషంగా వాచా మరియు కర్మణా ఇవి సంబంధ, సంపర్కాలలో స్పష్టంగా కనిపిస్తాయి. మనస్సు అనేది గుప్తం కానీ ఇవి ప్రత్యక్షంగా కనిపించేవి. మాటను జమ చేసుకునే సాధనం - తక్కువగా మాట్లాడండి మరియు మధురంగా మాట్లాడండి, స్వమానంతో మాట్లాడండి. ఎలా అయితే బ్రహ్మాబాబా చిన్నవారిని లేదా పెద్దవారిని కూడా స్వమానం యొక్క మాటలతో తనవారిగా చేసుకున్నారు. ఈ విధితో ఎంత ముందుకు వెళ్తారో అంత త్వరగా విజయీమాల తయారవుతుంది. ఈ సంవత్సరం ఏమి చేయాలి? సేవతో పాటు విశేషంగా ఈ శక్తులను జమ చేసుకుంటూ సేవ చేయాలి.

సేవాప్లాన్స్ అయితే అందరూ చాలా మంచిగా తయారుచేశారు. నలువైపుల అంటే భారతదేశంలో అయినా, విదేశాలలో అయినా ఇప్పటి వరకు ఏ ప్లాన్ ల ప్రకారంగా అయితే సేవ చేస్తున్నారో అది బాగా చేస్తున్నారు మరియు చేస్తారు కూడా. సేవలో ఒకరికంటే ఒకరు మంచి ఫలితాన్ని తీసుకురావటంలో శుభభావనతో ముందుకి వెళ్తున్నారో అదేవిధంగా సేవలో సంఘటిత రూపంలో సదా సంతుష్టంగా ఉండే మరియు సంతుష్టంగా చేసే విశేష సంకల్పం కూడా వెనువెంట ఉండాలి. ఎందుకంటే ఒకే సమయంలో మూడు రకాలైన సేవ వెనువెంట జరుగుతుంది. 1. మీ సంతుష్టత అంటే స్వ సేవ, 2. సంఘటనలో సంతుష్టత ఇది పరివారం యొక్క సేవ 3. ఉపన్యాసం ద్వారా లేదా ఏ విధి ద్వారానైనా విశ్వాత్మల సేవ. ఇలా ఒకే సమయంలో మూడు సేవలు జరుగుతాయి. ఏ కార్యక్రమం తయారుచేస్తున్నా కానీ ఈ మూడు సేవలు నిండి ఉండాలి. ఎలాగైతే విశ్వసేవ యొక్క ఫలితం మరియు విధి గురించి ధ్యాస ఉంచుకుంటున్నారో అదేవిధంగా రెండు సేవలు అనగా స్వయం మరియు సంఘటన కలిపి మొత్తం మూడూ నిర్విఘ్నంగా ఉండాలి. అప్పుడే సేవలో నెంబర్ వన్ సఫలత వచ్చినట్లు. మూడు సఫలతలు వెనువెంట పొందటమే నెంబరు పొందటం. ఈ సంవత్సరం మూడు సేవలలో సఫలత వెనువెంట ఉండాలి. ఈ ధ్యాస విశేషంగా ఉండాలి, అప్పుడే ప్రత్యక్షత యొక్క నగాఢా మ్రోగుతుంది. నలువైపుల ఒక్కసారిగా నగాఢా మ్రోగాలి. ఒక మూల నగాఢా మ్రోగితే కుంభకర్ణుల చెవుల వరకు వెళ్ళటం లేదు. నలువైపుల నగాఢా మ్రోగినప్పుడే కుంభకర్ణులు మేల్కొంటారు. ఇప్పుడు ఒకరు మేల్కొంటే మరొకరు నిద్రపోతున్నారు, వారు మేల్కొంటే ఇంకొకరు నిద్రపోతున్నారు. కొంచెం మేల్కొని మంచిది, బావుంది అంటూ మరలా నిద్రపోతున్నారు. కానీ పూర్తిగా మేల్కోవాలి మరియు నోటి ద్వారా, మనస్సు ద్వారా ఓహో ప్రభూ! అని అనాలి, ముక్తి వారసత్వం తీసుకోవాలి అప్పుడు సమాప్తి అవుతుంది. మేల్కొంటేనే ముక్తి వారసత్వం తీసుకుంటారు. ఏమి చేయాలో అర్ధమైందా! పొడుపు పథకాన్ని తయారుచేయండి. మూడు సేవలు వెనువెంట చేసి సర్టిఫికెట్ తీసుకోండి. దీనిలో ఒకరికొకరు సహయోగి అవ్వండి. ఇతరుల పొదుపులోనే మీ పొదుపు ఉంటుంది.

సేవా ప్లాన్ లో సంపర్కంలో ఎంత సమీపంగా తీసుకువస్తారో అంత ప్రత్యక్ష ఫలితం కనిపిస్తుంది. సందేశం ఇచ్చే సేవ అయితే చేస్తూ వచ్చారు మరియు చేస్తూ ఉండాలి కానీ విశేషంగా ఈ సంవత్సరం కేవలం సందేశం ఇవ్వటమే కాదు, సహయోగిగా తయారుచేయాలి. అంటే సమీప సంపర్కంలోకి తీసుకురావాలి. కేవలం ఫారం నింపటమే కాదు, ఈ సంవత్సరం ఇంకా ముందుకి వెళ్ళండి, ఫారాన్ని నింపించండి కానీ అంతటితో వదిలేయకండి, వారిని సంబంధంలోకి తీసుకురావాలి. ఎటువంటి వ్యక్తియో ఆవిధంగా వారిని సంపర్కంలోకి తీసుకువచ్చే ప్లాన్స్ తయారుచేయండి. చిన్న చిన్న కార్యక్రమాలు చేసినా కానీ ఈ లక్ష్యం పెట్టుకోండి. సహయోగి అంటే కేవలం ఒక గంటకి లేదా ఫారం నింపేటంత వరకు కాదు, సహయోగం ద్వారా వారిని సమీపంగా తీసుకురావాలి. సంబంధ సంపర్కాలలోకి తీసుకురండి. కనుక ఇక మున్ముందు సేవ యొక్క రూపం పరివర్తన అయిపోతుంది. మీ కోసం మీరే చేయటమే కాదు, సంబంధంలోకి వచ్చిన వారు మీ తరపున మాట్లాడతారు, మీరు కేవలం ఆశీర్వాదాలు లేదా దృష్టిని ఇవ్వవలసి ఉంటుంది. ఈరోజుల్లో శంకరాచార్యుల వారిని కుర్చీలో కూర్చోబెడుతున్నారు కదా! అదేవిధంగా మిమ్మల్ని వెండి కుర్చీలో కాదు, పూజ్య కుర్చీలో కూర్చోబెడతారు. భూమిని తయారుచేసేటందుకు వారు నిమిత్తమవుతారు మీరు కేవలం దృష్టి ద్వారా బీజం వేయవలసి ఉంటుంది. ఆశీర్వాదాల మాటలు రెండు మాట్లాడవలసి ఉంటుంది. అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. మీలో బాబా కనిపిస్తారు. బాబా నుండి దృష్టి, స్నేహం యొక్క అనుభూతిని పొంది ప్రత్యక్షత యొక్క ధ్వనిని వ్యాపింపచేయటం ప్రారంభిస్తారు.

ఇప్పుడు సేవ యొక్క స్వర్ణిమ మహోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు ఇక ఇతరులు సేవ చేస్తారు, అది చూసి మీరు హర్షిస్తారు. పోప్ (క్రైస్తవ మత పెద్ద) ఏమి చేస్తారు? పెద్ద సభలో దృష్టినిచ్చి ఆశీర్వాదాల మాటలు చెప్తారు. పెద్ద ఉపన్యాసం చెప్పడానికి వేరొకరు ఉంటారు. మాకు బాబా ఈ విధంగా చెప్పారు అని మీకు అంటారు కానీ దానికి బదులుగా వీరు ఏదైతే చెప్పారో అది బాబా చెప్పినది, ఇంకెవ్వరూ లేరు అని ఇతరులు మీ గురించి చెప్తారు. నెమ్మది నెమ్మదిగా ఇటువంటి సహయోగులు తయారవుతారు. సేవాకేంద్రాలను సంభాళించేటందుకు సహయోగులు తయారయ్యారు కదా! అదేవిధంగా వేదికపై ఇతరులు మీ తరపున మాట్లాడతారు, అంతే కాదు అనుభవం చేసుకుని చెప్తారు, కేవలం మహిమ చేసేవారిగా కాదు. జ్ఞానం యొక్క గుహ్య విషయాలను స్పష్టం చేసేవారిగా, పరమాత్మ జ్ఞానాన్ని రుజువు చేయడానికి నిమిత్తమవుతారు. కానీ వారి కోసం అటువంటి వారికి స్నేహి, సహయోగిగా చేసి సంపర్కంలోకి తీసుకువస్తూ సంబంధంలోకి తీసుకురండి. కార్యక్రమం అంతటి యొక్క లక్ష్యం ఏమిటంటే మీరు మైట్ అవ్వాలి మరియు వారు మైక్ అవ్వాలి అటువంటి సహయోగులను తయారుచేయటం. ఇలా సర్వుల సహయోగం యొక్క సేవాలక్ష్యం ఏమిటంటే మైక్ ని తయారుచేయాలి. వారు అనుభవం ఆధారంగా మీ బాబా యొక్క జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయగలగాలి. ఎవరి ప్రభావం అయితే స్వతహాగానే ఇతరులపై పడుతుందో అటువంటి మైక్ ను తయారుచేయండి. సేవా ఉద్దేశం ఏమిటో అర్థమైందా! ఇన్ని కార్యక్రమాలు తయారుచేశారు, వాటి నుండి ఏ వెన్న వస్తుంది? బాగా సేవ చేయండి కానీ ఈ సంవత్సరం సందేశం ఇవ్వటంతో పాటు దీనిని జతచేయండి. ఎవరెవరు ఇటువంటి పాత్రను దృష్టిలో పెట్టుకోండి. మరియు వారిని సమయానుసారం రకరకాల పద్ధతులతో సంపర్కంలోకి తీసుకురండి. ఒక కార్యక్రమం చేశారు, ఆ తర్వాత రెండవది ఆ తర్వాత మూడవది ఇలా చేసుకుంటూ మొదటి కార్యక్రమంలో వచ్చిన వారిని మూడవ కార్యక్రమం వారు రాగానే వదిలేస్తారు. దీనిలో కూడా జమ చేసుకునే శక్తిని ఉపయోగించవలసి ఉంటుంది. ప్రతి కార్యక్రమంలో జమ చేసుకుంటూ వెళ్ళండి. చివర్లో ఇలా సంబంధ సంపర్కాలల్లోకి వచ్చిన వారి మాల తయారవ్వాలి. అర్ధమైందా! ఇంకా ఏమి మిగిలింది.

కలుసుకునే కార్యక్రమం మిగిలింది. ఈ సంవత్సరం బాప్ దాదా 6 నెలల సేవాఫలితాన్ని చూడాలనుకుంటున్నారు. సేవలో ఏ ప్లాన్స్ తయారుచేసినా కానీ నలువైపుల ఒకరికొకరు సహయోగియై బాగా చుట్టు తిరగండి. చిన్న - పెద్ద అందరినీ ఉత్సాహ ఉల్లాసాలలోకి తీసుకువచ్చి మూడు రకాల సేవలలో ముందుకి తీసుకువెళ్ళండి. అందువలన బాప్ దాదా ఈ సంవత్సరంలో రాత్రిని కూడా పగలుగా చేసేసి బాగా సేవ ఇచ్చారు. ఇప్పుడు మూడు రకాల యొక్క సేవాఫలాన్ని తినే సంవత్సరం ఇది. ఫలం వచ్చే సమయం కాదు, ఫలం తినే సమయం. ఈ సంవత్సరం ఫలం రావటం కాదు, ఫలం తినే సంవత్సరం. బాబా యొక్క అవ్యక్త శక్తి అయితే సదా తోడుగా ఉంటుంది. డ్రామా నిర్ణయాన్ని చెప్పాను. డ్రామా యొక్క నిర్ణయాన్ని అంగీకరించవలసి ఉంటుంది. బాగా సేవ చేయండి. 6 నెలలల్లోనే ఫలితం తెలిసిపోతుంది. బాబా ఆశలను పూర్తి చేసే ప్లాన్ తయారుచేయండి. ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా ప్రతి ఒక్కరి సంకల్పం, మాట మరియు కర్మ బాబా ఆశాదీపాన్ని వెలిగించేదిగా ఉండాలి. మొదట మధువనంలో ఈ ఉదాహరణ చూపించండి. పొదుపు పథకం యొక్క మోడల్ ని మొదట మధువనంలో తయారుచేయండి. మొదట బ్యాంక్ లో జమ చేస్కోండి. మధువనం వారికి వరదానం కూడా లభించింది. మిగిలిపోయిన వారికి కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేయాలి. ఎందుకంటే బాబా స్నేహం పిల్లలందరితో పాటు ఉంది. ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి అడుగులో బాబా యొక్క వరదానం ఉంటుంది. మనస్పూర్వక ఆత్మలు ప్రతి అడుగు వేసేది వరదానాలతోనే. బాబా వరదానం కేవలం నోటితో కాదు, మనస్సుతో ఇచ్చారు. మనస్సుతో ఇచ్చిన వరదానం మనస్సుకి సంతోషాన్ని, ఉత్సాహ ఉల్లాసాలను అనుభవం చేయిస్తుంది. మనస్ఫూర్వక వరదానానికి గుర్తు ఇది. మనస్పూర్వక వరదానాన్ని ఎవరైతే మనస్సుతో ధారణ చేస్తారో వారి గుర్తు ఏమిటంటే వారు సదా సంతోషం మరియు ఉల్లాసంతో ముందుకి వెళ్తారు. ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా అతుక్కోరు, ఆగరు, వరదానాలతో ఎగురుతూ ఉంటారు. మిగిలిన విషయాలన్నీ క్రింద ఉండిపోతాయి. ఎగిరేవారిని మార్గమధ్య దృశ్యాలు ఆపలేవు.

ఈరోజు బాప్ దాదా పిల్లలందరికీ ఎవరైతే మనస్పూర్వకంగా అలసిపోకుండా సేవ చేశారో అటువంటి సేవాధారులు అందరికీ ఈ సీజన్ లో చేసిన సేవకి శుభాకాంక్షలు ఇస్తున్నాను. మధువనానికి వచ్చి మధువనం యొక్క అలంకరణ అయ్యారు. ఇలా అలంకరణ అయిన పిల్లలకు కూడా బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. మరియు నిమిత్తమైన శ్రేష్టాత్మలకు కూడా సదా అలసిపోనివారిగా అయ్యి బాబా సమానంగా మీ సేవల ద్వారా సర్వులను తాజా చేస్తున్నందుకు శుభాకాంక్షలు ఇస్తున్నాను. మరియు ఈ రథానికి కూడా శుభాకాంక్షలు. నలువైపుల ఉన్న సేవాధారి పిల్లలకు శుభాకాంక్షలు. నిర్విఘ్నంగా అయ్యి ముందుకి వెళ్తున్నారు మరియు వెళ్తూ ఉండాలి. దేశ విదేశాల పిల్లలందరు వచ్చినందుకు మరియు తాజా అయినందుకు కూడా శుభాకాంక్షలు. కానీ సదా తాజాగా ఉండాలి, కేవలం 6 నెలల వరకే కాదు. తాజా అయ్యేటందుకు రండి, ఎందుకంటే బాబా ఖజానాపై పిల్లలకు సదా అధికారం ఉంటుంది. బాబా మరియు ఖజానాలు సదా మీ తోడుగా ఉన్నాయి మరియు ఉంటాయి కూడా. కానీ ధ్యాస పెట్టవలసిన విషయం ఏదైతే చెప్పానో దానిలో స్వయాన్ని ఉదాహరణగా తయారుచేసుకుని పరీక్షలో ఎక్కువ మార్కులు పొందాలి. ఇతరులను చూడకూడదు, స్వయాన్ని ఉదాహరణగా తయారుచేసుకోవాలి. దీనిలో ఎవరు చేస్తే వారే అర్జునులు అంటే నెంబర్ వన్. మరోసారి బాప్ దాదా వచ్చినప్పుడు ఫరిస్తాల కర్మ, ఫరిస్తాల మాట, ఫరిస్తాల కర్మను ధారణ చేసేవారిగా ప్రతి ఒక్కరు కనిపించాలి. సంఘటనలో ఇటువంటి పరివర్తన కనిపించాలి. ఈ ఫరిస్తాల మాటలు, కర్మ ఎంత అలౌకికంగా ఉన్నాయో! అని ప్రతి ఒక్కరు అనుభవం చేసుకోవాలి. ఈ పరివర్తనా సమారోహాన్ని బాప్ దాదా చూడాలనుకుంటున్నారు. రోజంతటిలో మాట్లాడే మాటలను ప్రతి ఒక్కరు రికార్డ్ చేసుకుంటే మీకు బాగా తెలుస్తుంది. పరిశీలించుకుంటే తెలుస్తుంది ఎంత వ్యర్థంగా వెళ్తున్నాయో! మనస్సులో రికార్డ్ చేసుకుని పరిశీలించుకోండి, స్థూలంగా కాదు. సాధారణ మాటలు కూడా వ్యర్ధంలో జమ అవుతాయి. 4 మాటలకు బదులు 24 మాటలు మాట్లాడితే 20 మాటలు దేనిలో జమ అవుతాయి? శక్తిని జమ చేసుకోండి. అప్పుడు మీ రెండు మాటలు ఆశీర్వాదాల వలె, ఒక గంట ఉపన్యాసం చెప్పినంత పని చేస్తాయి. మంచిది.

నలువైపుల ఉన్న బలిహారం అయిపోయే ఆత్మిక దీపపు పురుగులకు, బాబా సమానంగా అవ్వాలనే దృడ సంకల్పంతో ముందుకి వెళ్ళే విశేషాత్మలందరికీ, సదా ఎగిరేకళతో ఏ రకమైన మార్గమధ్య దృశ్యాన్ని అయినా దాటే డబల్ లైట్ అయిన పిల్లలకు, ఆత్మిక దీపం అయిన బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

దాదీల కోసం ఉచ్చరించబడిన అవ్యక్త మహావాక్యాలు:-

బాబా పిల్లలకు ధన్యవాదాలు తెలుపుతారు, పిల్లలు బాబాకు ధన్యవాదాలు తెలుపుతారు. ఒకరికొకరు ధన్యవాదాలు తెలుపుతూ-తెలుపుతూ ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళేందుకు విధానం ఇదే. ఈ విధి వల్లే మీ సంగఠన బాగుంది. ఒకరికొకరు ‘హాజీ’ చెప్పుకున్నారు, ‘ధన్యవాదాలు’ తెలిపారు, తద్వారా ముందుకు వెళ్ళారు. ఇదే విధిని అందరూ అనుసరిస్తే ఫరిశ్తాలుగా అవుతారు. బాప్ దాదా చిన్న మాలను చూసి సంతోషిస్తారు. ఇప్పుడింకా కంకణము తయారయింది, మెడలోని మాల తయారవుతూ ఉంది. మెడలోని మాలను తయారుచేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడు అటెన్షన్ కావాలి. ఎక్కువ సేవలోకి వెళ్ళినప్పుడు అక్కడక్కడ స్వయం పట్ల అటెన్షన్ తగ్గిపోతుంది. అప్పుడప్పుడు ‘విస్తారం’లో ‘సారం’ మర్జ్ (గుప్తంగా) అయిపోతుంది, ఇమర్జ్ (ప్రత్యక్ష) రూపంలో ఉండదు. ఇప్పుడిలా జరగాలి అని మీరే అంటారు. కానీ ‘ఏది జరగాలో అదే జరుగుతుంది’ అని చెప్పే రోజు కూడా తప్పకుండా వస్తుంది. దీపాల మాల ముందు ఇక్కడే తయారవుతుంది. బాప్ దాదా మిమ్మల్ని ‘ప్రతి ఒక్కరి ఉల్లాస-ఉత్సాహాలను పెంచే ఉదాహరణ’గా భావిస్తారు. మీ ఐకమత్యమే యజ్ఞానికి కోట వంటిది. 10 మంది ఉన్నా, 12 మంది ఉన్నా మీరంతా కోటకు గోడల వంటివారు. మరి బాప్ దాదా ఎంత సంతోషిస్తారు! బాప్ దాదా అయితే ఉండనే ఉన్నారు కానీ మీరు నిమిత్తంగా ఉన్నారు. ఇలాంటి సంగఠన వలె రెండవ గ్రూపు, మూడవ గ్రూపు తయారైతే అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి గ్రూపును తయారుచేయండి. మొదటి గ్రూపు వారికి పరస్పరంలో స్నేహముంది అని అందరు అంటారు కదా. స్వభావాలు వేర్వేరుగా ఉన్నాయి, అవి అలానే ఉంటాయి, కానీ ‘గౌరవం’ ఉంది, ‘ప్రేమ’ ఉంది, ‘హాజీ’ ఉంది, సమయానికి స్వయాన్ని మల్చుకుంటారు, అందుకే ఈ కోట గోడలు దృఢంగా ఉన్నాయి, అందుకే ముందుకు వెళ్తున్నారు. పునాదిని చూసి సంతోషమనిపిస్తుంది కదా. ఈ మొదటి గ్రూపు ఎలా కనిపిస్తుందో, అలాంటి శక్తిశాలి గ్రూపు తయారైతే సేవ వెనుక-వెనుకే వస్తుంది. డ్రామాలో విజయమాల నిశ్చయించబడి ఉంది కనుక తప్పకుండా ఒకరికొకరు సమీపంగా వచ్చినప్పుడే మాల తయారవుతుంది. ఒక పూస ఒక వైపు ఉండి, రెండవ పూస మొదటి పూసకు దూరంగా ఉంటే మాల తయారవ్వదు. పూసలు కలిసినప్పుడే, ఒకదానికి ఒకటి సమీపంగా వచ్చినప్పుడే మాల తయారవుతుంది. మీరు మంచి ఉదాహరణగా ఉన్నారు. అచ్ఛా!

ఇప్పుడు మిలనం జరుపుకునేవారి కోటాను పూర్తి చేయాలి. రథానికి ఎక్స్ ట్రా సకాష్ ఇచ్చి నడిపిస్తున్నామని వినిపించాను కదా. లేదంటే ఇది సాధారణ విషయం కాదు. అన్నీ చూడాల్సి ఉంటుంది కదా. అయినా అన్ని శక్తుల ఎనర్జీ జమ అయి ఉంది కనుక రథం కూడా ఇంత సహయోగం ఇస్తోంది. శక్తుల జమ అయి లేకుంటే ఇంత సేవ చేయడం కష్టమవుతుంది. డ్రామాలో ప్రతి ఆత్మకు పాత్ర ఉంది. ఏదైతే శ్రేష్ఠ కర్మల శక్తి జమ అవుతుందో, అది సమయానికి పనికొస్తుంది. ఎంతోమంది ఆత్మల ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి, అవి కూడా జమ అవుతాయి. ఏదో ఒక విశేషమైన పుణ్యం జమ అయిన కారణంగా విశేషమైన పాత్ర ఉంది. రథం నిర్విఘ్నంగా నడవాలి, ఈ పాత్ర కూడా డ్రామాలో ఉంది. 6 మాసాలు తక్కువ సమయమేమీ కాదు. అచ్ఛా! అందరిని సంతుష్ట పరుస్తాము.

Comments