29-04-1984 అవ్యక్త మురళి

29-04-1984         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

జ్ఞానసూర్యుని ఆత్మికసితారల యొక్క రకరకాలైన విశేషతలు.

                          జ్ఞానసూర్యుడు, జ్ఞానచంద్రుడు బాప్ దాదా శక్తిననుసరించి మరియు శక్తిశాలి సితారలతో మాట్లాడుతున్నారు -
                         ఈరోజు జ్ఞానసూర్యుడు, చంద్రుడు తన యొక్క రకరకాలైన సితారలను చూస్తున్నారు. కొంతమంది స్నేహ సితారలు, కొంతమంది విశేష సహయోగి సితారలు, కొంతమంది సహజయోగి సితారలు, కొంతమంది శ్రేష్టజ్ఞాని సితారలు, కొంతమంది విశేష సేవ యొక్క ఉత్సాహంలో ఉండే సితారలు. కొంతమంది శ్రమ యొక్క ఫలం తినే సితారలు, కొంతమంది సహజ సఫలతా సితారలు. ఇలా అందరు రకరకాల విశేషత కలిగిన సితారలు. జ్ఞానసూర్యుని ద్వారా సితారలందరికీ ఆత్మిక వెలుగు లభిస్తున్న కారణంగా అందరు మెరిసే సితారలుగా అయితే అయ్యారు కానీ ప్రతి సితార యొక్క మెరుపు యొక్క విశేషత రకరకాలుగా ఉంది. ఎలా అయితే రకరకాలైన స్థూల సితారలు గ్రహాల రూపంలో రకరకాలైన ఫలాల యొక్క అల్పకాలిక ఫలాలను ఇస్తాయో అలాగే జ్ఞానసూర్యుని ఆత్మిక సితారలకు కూడా సర్వాత్మలతో అవినాశి ప్రాప్తి యొక్క సంబంధం ఉంది. ఎలా అయితే స్వయం ఏ విశేషతతో సంపన్న సితారగా ఉంటారో అలా ఇతరులకు కూడా ఆ విధంగానే ఫలం యొక్క ప్రాప్తిని ఇచ్చేటందుకు నిమిత్తం అవుతారు. ఎంతగా స్వయం జ్ఞాన చంద్రునికి లేదా సూర్యునికి సమీపంగా ఉంటారో అంతగా ఇతరులను కూడా సమీప సంబంధంలోకి తీసుకువస్తారు. అంటే జ్ఞానసూర్యుని ద్వారా లభించిన విశేషతల ఆధారంగా ఇతరులను కూడా డైరెక్ట్ విశేషతల యొక్క శక్తి ఆధారంగా సమీపంగా తీసుకువచ్చారు. కనుక వారికి డైరెక్ట్ జ్ఞానసూర్యుడు, జ్ఞాన చంద్రునితో సంబంధం ఏర్పడుతుంది. ఇంత శక్తిశాలి సితార కదా! ఒకవేళ స్వయం శక్తిశాలిగా, సమీపంగా లేకపోతే డైరెక్ట్ సంబంధాన్ని జోడింపచేయలేరు. దూరంగా ఉన్న కారణంగా ఆ సితారల విశేషతననుసరించి వారి ద్వారా ఎంత శక్తి, సంబంధ, సంపర్కాల ద్వారా ఏదైతే ప్రాప్తి లభిస్తుందో అంతగానే శక్తిననుసరించి పొందుతారు. డైరెక్ట్ గా తీసుకునే శక్తి ఉండదు. అందువలనే ఎలా అయితే జ్ఞానసూర్యడు ఉన్నతోన్నతమైనవారో అదేవిధంగా విశేష సితారలు కూడా ఉన్నతమైనవారు. అటువంటి ఉన్నత స్థితి యొక్క అనుభవం చేసుకోలేరు. శక్తిననుసరించి ప్రాప్తిని పొందుతారు. ఎటువంటి శక్తిశాలి స్థితి ఉండాలో దానిని అనుభవం చేసుకోలేరు.
                          అటువంటి ఆత్మలకు ఇదే మాట మనస్సు నుండి మరియు నోటి నుండి వస్తుంది, ఇది. కావాలి కానీ లేదు, ఇలా తయారవ్వాలి కానీ తయారవ్వలేదు, ఇది చేయాలి కానీ చేయలేదు అని ఇటువంటి వారినే శక్తిననుసరించి చేసే ఆత్మలు అని అంటారు. సర్వశక్తివాన్ ఆత్మలు కాదు. అటువంటి ఆత్మలు స్వయం మరియు ఇతరుల యొక్క విఘ్నవినాశకులుగా కాలేరు. కొద్దిగా ముందుకి వెళ్తూ ఉంటారు మరియు విఘ్నం వస్తూ ఉంటుంది. ఒక విఘ్నం తొలగించుకుని, ధైర్యంలోకి వస్తారు, సంతోషంలోకి వస్తారు మరలా మరొక విఘ్నం వస్తుంది. జీవితం అంటే పురుషార్థం యొక్క వరస స్పష్టంగా ఉండదు. ఆగిపోవటం, ముందుకి వెళ్ళటం ఈ విధితో ముందుకు వెళ్తూ, ఉంటారు. మరియు ఇతరులను కూడా తీసుకువెళ్తూ ఉంటారు. ఇలా ఆగిపోవటం మరియు ముందుకు వెళ్ళటం కారణంగానే తీవ్రగతి యొక్క అనుభవం అవ్వదు. అప్పుడప్పుడు నడిచేకళ, అప్పుడప్పుడు ఎక్కేకళ, అప్పుడప్పుడు ఎగిరేకళలో ఉంటారు. ఏకరస శక్తిశాలి అనుభూతి ఉండదు. అప్పుడప్పుడు సమస్యగా, అప్పుడప్పుడు సమాధాన స్వరూపంగా అవుతారు. ఎందుకంటే, శక్తిననుసరించి ఉంటారు. జ్ఞానసూర్యునితో సర్వశక్తులు గ్రహించే శక్తి ఉండదు. మద్యలో ఏదోక తోడు తప్పని సరిగా కావాలి. వీరినే శక్తిననుసరించి నడిచే ఆత్మ అని అంటారు.
                           ఎలా అయితే ఇక్కడ ఉన్నతమైన పర్వతానికి ఎక్కేటప్పుడు, ఏ వాహనంపై వస్తున్నా, బస్సులో వస్తున్నా, కారులో వస్తున్నా ఇంజన్ శక్తిశాలిగా ఉంటే తీవ్రవేగంతో మరియు గాలి మరియు నీరు అవసరం లేకుండానే సరిగ్గా వెళ్ళిపోతారు. ఇంజన్ బలహీనంగా ఉంటే ఆగి నీరు లేదా గాలి యొక్క తోడుని తీసుకుంటారు. నాన్‌స్టాప్ (మధ్యలో ఎక్కడ ఆగకుండా)గా వెళ్ళలేరు. ఆగాల్సి ఉంటుంది. అలాగే శక్తిననుసరించి నడిచే ఆత్మలు ఎవరోకరి ఆత్మల యొక్క వాతావరణం యొక్క సాధనాల యొక్క ఆధారం లేకుండా ఒకే తీవ్రవేగంతో ఎగిరేకళ యొక్క గమ్యానికి చేరుకోలేరు. అప్పుడప్పుడు ఈరోజు సంతోషం తగ్గిపోయింది, ఈరోజు యోగం అంత శక్తిశాలిగా లేదు, ఈరోజు ఈ ధారణలో తెలివిగా ఉన్నప్పటికీ బలహీనంగా ఉన్నాను, ఈరోజు సేవ యొక్క ఉల్లాసం రావటం లేదు అని అంటారు. అంటే ఇలా అప్పుడప్పుడు గాలి కావాల్సి ఉంటుంది, అప్పుడప్పుడు నీరు కావాల్సి ఉంటుంది మరియు అప్పుడప్పుడు తోయాల్సి ఉంటుంది. వీరిని శక్తిశాలి అని అంటారా? నేను అధికారిని, అని తీసుకోవటంలో అధికారిగా ఉంటున్నారు, ఎవరికంటే తక్కువ కాదు మరియు చేయటంలో ఏమంటున్నారు? మేము చిన్నవారము, ఇప్పుడు క్రొత్తవారము, పాత వారము కాదు. కొద్దిగానే సంపూర్ణంగా అయ్యాము, ఇప్పుడింకా సమయం ఉంది, అది పెద్దవారి దోషం, మాది కాదు మేమింకా నేర్చుకుంటున్నాము, నేర్చుకుంటాము అంటారు. అందరికీ అవకాశం ఇవ్వాలి అని కనుక మాకు కూడా ఈ అవకాశం లభించాలి, మాది కూడా వినాలి, ఇలా తీసుకోవటంలో మేము అంటున్నారు మరియు చేయటంలో పెద్దవారు ఎలా చేస్తే అలా అంటున్నారు. అధికారం తీసుకోవటంలో ఇప్పుడు అంటున్నారు మరియు చేయటంలో ఎప్పుడో అంటున్నారు. తీసుకోవటంలో పెద్దవారిగా అయిపోతున్నారు మరియు చేయటంలో చిన్నవారిగా అయిపోతున్నారు. ఇటువంటి వారినే శక్తిననుసరించి చేసే ఆత్మ అని అంటారు.
                           బాప్ దాదా ఇటువంటి రమణీయకమైన ఆటను చూసి నవ్వుకుంటున్నారు. బాబా చాలా చతురమైనవారు. పిల్లలు కూడా మాస్టర్ చతురులు కూడా తక్కువైన వారు కాదు. అందువలనే శక్తిననుసరించి ఉండే ఆత్మగా ఉండడానికి బదులు ఇప్పుడు మాస్టర్ సర్వశక్తివంతులుగా అవ్వండి. చేసేవారిగా అవ్వండి. స్వతహాగానే శక్తిశాలి కర్మకు, శుభభావన, శ్రేష్టకామనకు ఫలం లభిస్తుంది. సర్వప్రాప్తులు స్వయమే నీడలా మీ వెనుక వస్తాయి. కేవలం జ్ఞానసూర్యుని ద్వారా ప్రాప్తించిన శక్తుల యొక్క వెలుగులో నడిస్తే సర్వప్రాప్తుల రూపీ నీడ మీ వెనువెంటే వస్తుంది. అర్ధమైందా! ఈరోజు శక్తిననుసరించి ఉన్న సితారల యొక్క మరియు శక్తిశాలి సితారల యొక్క మెరుపుని చూస్తున్నారు. మంచిది.
                           అందరు తీవ్రమైన వేగంతో పరుగు,పరుగున చేరుకున్నారు. బాబా ఇంటికి చేరుకున్నారు. కనుక బాబా కూడా భలే వచ్చారు అని అంటున్నారు. ఎంత స్థానం ఉన్నా మీ ఇల్లే. ఇల్లు అనేది ఒక రోజులో పెరగదు కానీ సంఖ్య అయితే పెరిగింది కదా! కనుక సర్దుకోవల్సి ఉంటుంది. స్థానాన్ని మరియు సమయాన్ని సమయానుసారం నడిపించాల్సి వస్తుంది. అందరు సర్దుకున్నారు కదా! అన్ని విషయాలలో వరస అయితే వస్తుంది. అయినప్పటికీ ఇప్పుడు కూడా చాలా, చాలా అదృష్టవంతులు. ఎందుకంటే పాండవభవనంలో లేదా ఏవైతే స్థానాలు ఉన్నాయో వాటి లోపలే సర్దుకున్నారు. బయటి వరకు వరస అయితే లేదు కదా! వృద్ధి కూడా అవుతుంది, వరస కూడా పెట్టాల్సి వస్తుంది. సదా ప్రతి విషయంలో సంతోషం యొక్క మజాలో ఉండండి. అయినప్పటికీ బాబా ఇంటిలో లభించినంతగా మనస్సుకి విశ్రాంతి ఇంకెక్కడ లభిస్తుంది! అందువలన సదా ప్రతి పరిస్థితిలో సంతుష్టంగా ఉండాలి, సంగమయుగీ వరదాని భూమి యొక్క మూడు అడుగుల భూమి కూడా సత్యయుగీ మహల్స్ కంటే కూడా శ్రేష్టమైనది. కూర్చోవటానికైతే స్థలం లభించింది. ఇది కూడా చాలా శ్రేష్టమైనది. ఈరోజే మరలా జ్ఞాపకం వస్తుంది. అయినప్పటికీ ఇప్పుడు దృష్టి మరియు టోలీ అయితే దొరుకుతుంది. మరలా ఇక దృష్టి మరియు టోలీ ఇచ్చేవారిగా అవ్వాల్సి ఉంటుంది. వృద్ధి అయితే అవుతుంది, ఇది కూడా సంతోషకరమైన విషయం కదా! ఏది లభించినా, ఎలా లభించినా అన్నింటిలో రాజీగా ఉండాలి. వృద్ధి అంటే కళ్యాణం.
                           కర్ణాటక వారు విశేషంగా ప్రియంగా అయ్యారు. మహారాష్ట్ర కూడా సదా సంఖ్యలో మహాన్ గా ఉన్నారు. ఢిల్లీ వారు కూడా పరుగు పెట్టారు. భలే, వృద్ధిని పొందుతూ ఉండండి. యూ.పి వారు కూడా ఎవరి కంటే తక్కువ కాదు. ప్రతి స్థానానికి ఎవరి విశేషత వారికి ఉంది. అది మరలా చెప్తాను.
                         బాప్ దాదా కూడా సాకారశరీరాన్ని ఆధారంగా తీసుకున్న కారణంగా సమయం యొక్క లెక్క పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే అద్దెకు తీసుకున్న శరీరం కదా! తనది కాదు కదా! శరీరానికి కూడా బాధ్యుడు బాప్ దాదాయే అవుతారు. అందువలనే బేహద్ యజమాని కూడా హద్దులో బంధించబడుతున్నారు. అవ్యక్త వతనంలో బేహద్ గా ఉంటుంది. ఇక్కడైతే నియమం, సమయం మరియు శరీరం యొక్క శక్తి అన్నింటినీ చూడాల్సి వస్తుంది. బేహద్ లోకి రండి, కలయిక జరుపుకోండి. అక్కడ ఎవరు ఇప్పుడు రండి, ఇప్పుడు వెళ్ళిపోండి లేదా నెంబర్ వారీగా రండి అని ఎవరు అనరు. పూర్తి ఆహ్వానం అంటే పూర్తి అధికారం ఉంటుంది. రెండు గంటలకు కావాలంటే రెండు గంటలకు రండి, నాలుగు గంటలకు కావాలంటే నాలుగు గంటలకు రండి. మంచిది.
                           సదా సర్వ శక్తిశాలి శ్రేష్టాత్మలకు, సదా జ్ఞానసూర్యునికి సమీపంగా మరియు సమానంగా ఉన్నత స్థితిలో స్థితులై ఉండే విశేషాత్మలకు, సదా ప్రతి కర్మ చేయటంలో మొదట నేను అనే ఉత్సాహ, ఉల్లాసాలలో ఉండే ధైర్యవంతులైన ఆత్మలకు, సదా సర్వులను శక్తిశాలి ఆత్మగా తయారుచేసేవారికి, సదా సమీప పిల్లలకు జ్ఞానసూర్యుడు, జ్ఞాన చంద్రుని యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments