25-12-1985 అవ్యక్త మురళి

25-12-1985         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము 

 పండుగ రోజున అవ్యక్త బాప్ దాదా యొక్క మహావాక్యా లు.

సదా జ్ఞానరత్నాలతో బుద్ధి రూపి జోలెను నింపే రత్నాగరుడైన శివబాబా మాట్లాడుతున్నారు-  

ఈరోజు ఉన్నతోన్నతమైన తండ్రి, గ్రాండ్ ఫాదర్ తన ఉన్నతమైన, ప్రియమైన పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. గ్రేట్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని బ్రహ్మకే మహిమ ఉంది. నిరాకార బాబా సాకార సృష్టి యొక్క రచనకు బ్రహ్మను నిమిత్తంగా చేసారు. మనుష్య సృష్టికి రచయిత అయిన కారణంగా, మనుష్య సృష్టిని వృక్ష రూపంలో స్మృతిచిహ్నంగా చూపించారు. బీజం గుప్తంగా ఉంటుంది, మొదటి రెండు ఆకుల ద్వారానే కాండం వస్తుంది. వారే వృక్షం యొక్క ఆదిదేవ్ మరియు ఆదిదేవి తల్లి, తండ్రి రూపంలో వృక్షం యొక్క పునాదికి నిమిత్తంగా అవుతారు. వారి ద్వారా వృక్షం యొక్క కాండం వస్తుంది మరియు బ్రాహ్మణాత్మలైన మీ కాండం నుండి అనేక శాఖలు వస్తాయి. అందువలనే బ్రహ్మని గ్రేట్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. బ్రహ్మ యొక్క అవతరణ అంటే చెడు రోజులు సమాప్తి అయ్యి మంచి రోజులు ప్రారంభం అవ్వటం. రాత్రి సమాప్తి అయ్యి బ్రహ్మముహుర్తం ప్రారంభం అవుతుంది. వాస్తవానికి బ్రహ్మాముహుర్తం కానీ బ్రహ్మముహుర్తం అని అంటారు. అందువలనే బ్రహ్మని ముసలివానిగా చూపించారు. గ్రాండ్ ఫాదర్ నిరాకార తండ్రి, తన గ్రాండ్ పిల్లలకు ఎన్ని బహుమతులు ఇస్తున్నారంటే 21 జన్మలు తింటూ ఉంటారు. దాత కూడా, విధాత కూడా! జ్ఞానరత్నాల సంచులను నింపి ఇస్తున్నారు. శక్తుల స్వర్ణిమ బహుమతిని లెక్కలేనంతగా ఇస్తున్నారు. గుణాల నగలు అనే పెట్టెను నింపి ఇస్తున్నారు. మీ దగ్గర ఎన్ని రకాలైన శృంగారాల పెట్టెలు ఉన్నాయి! రోజూ క్రొత్తగా శృంగారించకున్నా ఇంకా లెక్కలేనన్ని ఉంటాయి. ఈ బహుమతి సదా వెంట తీసుకువెళ్ళచ్చు. స్థూల బహుమతి అయితే ఇక్కడే ఉండిపోతుంది. కానీ ఇది వెంటే ఉంటుంది. ఈ భగవంతుని బహుమతితో ఎంత సంపన్నంగా అవుతున్నారంటే సంపాదించకోవాల్సిన అవసరమే ఉండదు. బహుమతితోనే తింటూ ఉంటారు. శ్రమ నుండి విడిపించబడతారు.

అందరు విశేషంగా క్రిస్మస్ రోజు జరుపుకునేటందుకు వచ్చారు కదా! బాప్ దాదా కిస్ మిస్ రోజు అని అంటున్నారు. కిస్ మిస్ రోజు అంటే మధురత యొక్క రోజు. సదా మధురంగా అయ్యే రోజు. మదురంగా ఉండేవే సదా తింటూ, అందరికి తినిపిస్తారు కదా! నోరు అయితే కొద్ది సమయమే మధురంగా ఉంటుంది కానీ స్వయమే మధురంగా అయిపోతే సదా నోటి ద్వారా మధుర మాటలే వస్తాయి. ఎలా అయితే స్వీట్ తినటం వలన మరియు తినిపించటం వలన సంతోషం అయిపోతారు కదా! అలాగే మధురమైన మాట స్వయాన్ని కూడా సంతోషం చేస్తుంది మరియు ఇతరులను కూడా సంతోషం చేస్తుంది. కనుక దీని ద్వారా సదా సర్వుల నోటిని మధురంగా చేస్తూ ఉండండి. సదా మధుర దృష్టి, మధుర మాట, మధుర కర్మ ఉండాలి. ఇదే కిస్ మిస్ రోజు జరుపుకోవటం. జరుపుకోవటం అంటే తయారవ్వటం. ఎవరికైనా రెండు ఘడియలు మధురదృష్టి ఇవ్వండి, మధుర మాట మాట్లాడండి, వాటి ద్వారా ఆ ఆత్మను సదాకాలికంగా నిండుగా చేయాలి. ఆ రెండు ఘడియల మధురదృష్టి, మాట ఆ ఆత్మ యొక్క సృష్టిని మార్చేస్తుంది. రెండు మధుర మాటలు సదాకాలిక పరివర్తనకు నిమిత్తం అవుతాయి. మధురత అనేది ఎంత విశేష ధారణ అంటే కఠినమైన భూమిని కూడా మధురంగా చేస్తుంది. మీరందరు పరివర్తన అవ్వడానికి ఆధారం - బాబా యొక్క రెండు మధుర మాటలే కదా! మదురమైన పిల్లలూ! మీరు మధురమైన శుద్ద ఆత్మ! ఈ రెండు మధుర మాటలే మార్చేసాయి కదా! మధుర దృష్టి మార్చేసింది కదా! అలాగే మధురత ద్వారా ఇతరులను కూడా మధురంగా చేయండి. ఇలా నోటిని మధురంగా చేసుకోండి. క్రిస్మస్ జరుపుకున్నారు కదా? బహుమతులతో మీ జోలెను నింపుకున్నారా? సదా మధురత యొక్క బహుమతిని వెంట ఉంచుకోండి. దీని ద్వారా సదా మధురంగా ఉండాలి మరియు మధురంగా చేయాలి. మంచిది.

సదా జ్ఞానరత్నాలతో బుద్ది రూపి జోలెను నింపుకునేవారికి, సదా సర్వశక్తులతో శక్తిశాలి ఆత్మగా అయ్యి శక్తులతో సదా సంపన్నంగా అయ్యేవారికి, సర్వగుణాల నగలతో సదా శృంగారించబడేవారికి, శ్రేష్టాత్మలకు, సదా మధురత ద్వారా నోటిని మధురంగా చేసుకునే మధురమైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments