23-03-1988 అవ్యక్త మురళి

23-03-1988         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

‘‘హృదయాభిరాముడైన బాబా హృదయ సింహాసనాన్ని జయించిన దిల్ రూబా (ప్రియమైన) పిల్లల గుర్తులు’’

ఈ రోజు దిలారామ్ (హృదయాభిరాముడైన) బాబా తన దిల్ రూబా (ప్రియమైన, దిల్ రూబా అనగా ఒక సంగీత వాయిద్యం కూడా) పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. దిలారామ్ బాబాకు చెందిన ప్రతి దిల్ రూబా అనగా ఎవరి మనసులోనైతే సదా దిలారామ్ స్మృతి అనే మధుర రాగము స్వతహాగానే మోగుతూ ఉంటుందో, అలాంటి దిల్ రూబా పిల్లలు దిలారామ్ బాబా హృదయాన్ని తమ స్నేహమనే రాగము ద్వారా జయించేవారిగా ఉంటారు. దిలారామ్ బాబా కూడా ఇలాంటి పిల్లల గుణగానం చేస్తారు. బాబా హృదయాన్ని జయించినవారు స్వతహాగానే మాయాజీతులుగా, జగత్ జీతులుగా ఉండనే ఉంటారు. ఉదాహరణకు, ఎవరైనా హద్దులోని రాజ్య సింహాసనాన్ని గెలుస్తారు, అక్కడ గెలవడం అనగా సింహాసనాధికారిగా అవ్వడము. అలా ఎవరైతే బాబా హృదయ సింహాసనాన్ని గెలుస్తారో, వారు స్వతహాగానే సదా సింహాసనాధికారులుగా ఉంటారు. వారి హృదయంలో సదా బాబా ఉంటారు మరియు బాబా హృదయంలో సదా అలాంటి విజయీ పిల్లలు ఉంటారు. ఇలా బాబా హృదయాన్ని జయించిన పిల్లలు తమ శ్వాస-శ్వాసలోనూ అనగా ప్రతి సెకండు బాబా మరియు సేవ తప్ప ఇంకే పాటను పాడరు. సదా ‘నా బాబా మరియు నేను బాబా వాడిని’ అన్న ఒక్క పాటే మోగుతుంది. ఇలాంటి వారినే దిలారామ్ బాబా హృదయ సింహాసనాన్ని జయించిన దిల్ రూబా పిల్లలని అంటారు.

బాప్ దాదా దిల్ రూబా పిల్లలు ప్రతి ఒక్కరి మధురమైన రాగాన్ని సదా వింటూ ఉంటారు, అందరిదీ ఒకే రాగమా లేక భిన్న-భిన్న రాగాలా అని వింటూ ఉంటారు. అప్పుడప్పుడు కొంతమంది తమ బలహీనతల పాటలను కూడా పాడుతారు మరియు అప్పుడప్పుడు బాబా పాటకు బదులుగా తమ పాటను కూడా పాడుతారు. తండ్రి మహిమతో పాటు మీరు మీ మహిమను కూడా చేసుకుంటారు. బాబాలో మీరు ఉన్నారు అనగా బాబా మహిమలో మీ మహిమ ఉండనే ఉంది. బాబా పాటను పాడడమే యథార్థమైన రాగము, శ్రేష్ఠమైన రాగము. హృదయసింహాసనాన్ని జయించిన పిల్లల ప్రతి అడుగులో, దృష్టిలో, మాటలో, సంబంధ-సంపర్కంలో ప్రతి ఒక్కరికి బాబాయే కనిపిస్తారు. నోరు వారిది కావచ్చు కానీ వారి శక్తిశాలి, స్నేహభరితమైన మాటలు స్వతహాగానే బాబాను ప్రత్యక్షం చేస్తాయి. ఈ మాటలు ఈ ఆత్మ మాట్లాడే మాటలు కాదు, ఇవి శ్రేష్ఠ అథారిటీ అనగా సర్వశక్తివంతుని మాటలు అన్నట్లు అనిపిస్తుంది. వీరి దృష్టిలోని ఆత్మికత ఇతర ఆత్మలకు తండ్రిని అనుభూతి చేయిస్తుంది, వీరి అడుగులో పరమాత్మ శ్రేష్ఠ మతమనే అడుగు ఉంటుంది, వీరు సాధారణ వ్యక్తులు కాదు, అవ్యక్త ఫరిశ్తాలు అని అనుభూతి చేయించేవారినే హృదయాన్ని జయించి జగత్తును జయించినవారు అని అంటారు.

వాణి ద్వారా అనుభవం చేయించడమనేది సాధారణ పద్ధతి. వాణి ద్వారా ప్రభావం చూపేవారు ప్రపంచంలో కూడా అనేక మంది ఉన్నారు. కానీ మీ వాణిలోని విశేషత ఏమిటంటే, మీ మాటలు బాబా స్మృతిని కలిగిస్తాయి. బాబాను ప్రత్యక్షం చేసే సిద్ధి ఆత్మలకు సద్గతికి మార్గాన్ని చూపించాలి. ఇదే మీ వాణికి ఉన్న ప్రత్యేకత. వినేవారు మిమ్మల్ని ‘చాలా బాగుంది, మీలో మాట్లాడే కళ ఉంది లేక మీవి అథారిటీతో కూడిన మాటలు’ అని మహిమ చేయవచ్చు, ఇలాంటి మహిమ ఇతర ఆత్మలకు కూడా జరుగుతుంది. కానీ మీ మాటలు బాబా మహిమను అనుభవం చేయించాలి. ఈ విశేషతయే ప్రత్యక్షతా పరదాను తెరిచేందుకు సాధనము. కనుక ఎవరి హృదయంలోనైతే సదా దిలారామ్ ఉంటారో, వారి నోటి ద్వారా వచ్చే హృదయపూర్వకమైన మాటలు స్వతహాగానే దిలారామ్ ను ప్రత్యక్షం చేస్తాయి. కనుక చెక్ చేసుకోండి - ప్రతి అడుగులో మరియు ప్రతి మాటలో నా ద్వారా బాబా ప్రత్యక్షత జరుగుతుందా? నా మాటలు బాబాతో సంబంధాన్ని జోడించే మాటలుగా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు అంతిమ సేవలోని పాత్రయే ప్రత్యక్షతా జెండాను ఎగరేయడము. నా ప్రతి కర్మ, శ్రేష్ఠ కర్మల గతిని వినిపించే బాబాను ప్రత్యక్షం చేసేదిగా ఉందా? అని చూసుకోండి. ఎవరి హృదయంలోనైతే సదా బాబా ఉంటారో, వారు స్వతహాగానే ‘సన్ షోస్ ఫాదర్’ (కొడుకు తండ్రిని ప్రత్యక్షము) చేసే సమీపమైన అనగా సమానులైన పిల్లలుగా ఉంటారు.

ఇప్పుడు నలువైపులా ‘హమారా బాబా’ (మా బాబా) అనే శబ్దం మారుమోగాలి. బ్రహ్మాకుమారీల బాబా కాదు, మా బాబా. ఎప్పుడైతే ఈ శబ్దం మారుమోగుతుందో, అప్పుడే స్వీట్ హోమ్ (పరంధామం) గేటు తెరుచుకుంటుంది ఎందుకంటే ‘మా బాబా’ అని అన్నప్పుడే ముక్తి వారసత్వం లభిస్తుంది, అంతేకాక వారు మీతో మరియు బాబాతో పాటుగా ఊరేగింపులా అయినా సరే, అందరూ తిరిగి వెళ్ళాల్సిందే, అందరినీ తీసుకువెళ్ళాల్సిందే. ‘హమారా బాబా ఆ గయా’ (మా బాబా వచ్చేసారు) అనే శబ్దాన్ని కనీసం చెవుల ద్వారా విని, బుద్ధి ద్వారా తెలుసుకునే అధికారులుగా అయితే అవ్వాలి. ఎవ్వరూ వంచితులుగా ఉండిపోకూడదు. విశ్వానికి తండ్రి కనుక విశ్వాత్మలకు ఈ మాత్రం అంచలినైతే ఇవ్వాలి కదా. మీరు సాగరాన్ని మింగేసారు కానీ వారు ఒక్క బిందువు కోసం దాహంతో ఉన్నారు. వారికి బిందువునైనా ప్రాప్తి చేయిస్తారు కదా. దీని కోసం ఏం చేయాల్సి ఉంటుంది? ప్రతి అడుగు, ప్రతి మాట బాబాను ప్రత్యక్షం చేయించేదిగా ఉండాలి, అప్పుడే ఈ శబ్దం మారుమోగుతుంది. ఇలా బాబాను ప్రత్యక్షం చేసే పిల్లలనే దిలారామ్ యొక్క దిల్ రూబా పిల్లలని అంటారు. వారి హృదయంలో ఒక్క బాబా రాగమే మోగుతుంది. ఇలాంటి దిల్ రూబా పిల్లలుగా అయ్యారు కదా?

ఒక పాట పాడినట్లయితే మిగతా పాటలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. కేవలం రెండు మాటలలో మీ శుభ సమాచారాన్ని వినిపించండి - ఓ.కె. ఆత్మిక సంభాషణ చేయండి. వేరే పాటలు వినిపించేందుకు సమయాన్ని ఇవ్వకండి, సమయాన్ని తీసుకోకండి. శుభ సమాచారాన్ని వినిపించేందుకు సమయం పట్టదు కానీ రామ కథను వినిపించేందుకు సమయం పడుతుంది. బాప్ దాదా ఇలాంటి మాటలను రామ కథ అని అంటారు, కృష్ణ కథ అని అనరు. ఇది 14 కళల వారి కథ, 16 కళల వారి కథ కాదు. మీరు రామ కథను వినిపించేవారు కాదు కదా?

ఇప్పుడింకా చాలా సేవ మిగిలి ఉంది. ఇప్పుడింకా ఏం చేశారని? ఆలోచించండి, 550 కోట్ల మంది ఆత్మలున్నారు, కనీసం ఒక్క బిందువునైనా ఇవ్వండి కానీ ఇవ్వాల్సిందే. వారు మీ భక్తులుగా అయినా లేక మీ ప్రజలుగా అయినా ఇవ్వాల్సిందే. దేవతలుగా అయినా కానీ ఇవ్వాల్సిందే. భక్తిలో దేవతలుగా పూజించబడతారు కదా. ఇచ్చినప్పుడే కదా మిమ్మల్ని దేవతలుగా భావించి పూజిస్తారు. ఏదైనా ప్రాప్తి కలిగినప్పుడే ప్రజలు కూడా స్వీకరిస్తారు. మీరు తల్లి-తండ్రులని వారు అలా ఊరికే ఎలా ఒప్పుకుంటారు? రాజు కూడా తల్లి-తండ్రి. రెండు రకాలగానూ ‘దాత’ పిల్లలు దాతలుగా అయి ఇవ్వాలి. కానీ ఇస్తున్నప్పుడు దాత స్మృతిని ఇప్పించాలి. ఏం చేయాలో అర్థమయిందా? విదేశాలలో లేక దేశంలో చాలా సెంటర్లు తెరుచుకున్నాయి, చాలా చేసాము అని భావించకండి. మీరు దయాహృదయుడైన తండ్రి పిల్లలు కదా. దాహంతో భ్రమిస్తున్న మీ సోదరీ-సోదరులందరిపై దయ చూపించాలి, ఎవరి ఫిర్యాదు ఉండకూడదు. అచ్ఛా!

విదేశాల నుండి కూడా చాలామంది ప్రేయసులు వచ్చారు. చాలామంది వచ్చినపుడు పంచాల్సి ఉంటుంది కదా. సమయాన్ని కూడా పంచాల్సి ఉంటుంది. రాత్రిని పగలుగా అయితే ఎలాగూ చేస్తున్నారు, ఇంకేం చేస్తారు? ఇందులో కూడా మహాదానులుగా అవ్వండి. మనం నంబరువారుగా ఉన్నా కానీ బాబా స్నేహం అందరి పట్ల నంబరువన్ గా ఉంది. ఎప్పుడూ కూడా - బాబాకు నా పట్ల తక్కువ ప్రేమ ఉంది, ఇంకెవరి పట్లనో ఎక్కువ ప్రేమ ఉంది అని అనుకోకండి. అందరి పట్ల ఎక్కువ ప్రేమే ఉంది. నోటి ద్వారా అప్పుడప్పుడు కొందరితో ఎక్కువగా మాట్లాడుతారు, అప్పుడప్పుడు తక్కువగా మాట్లాడుతారు. కానీ హృదయంలోని ప్రేమ మాటల ద్వారా పంచబడదు. బాబా దృష్టిలో పిల్లలు ప్రతి ఒక్కరు నంబరువన్. ఇప్పుడింకా నంబరు ఎక్కడ ఔట్ అయ్యింది? ఔట్ అవ్వనంతవరకు ప్రతి ఒక్కరు నంబరువన్, ఎవరైనా నంబరువన్ అవ్వవచ్చు. ఇంతకుముందు కూడా వినిపించాము కదా - నంబరువన్ గా అయితే బ్రహ్మాబాబా సదా ఉండనే ఉన్నారు కానీ ఫస్ట్ డివిజన్ కూడా ఉంది. బాబాతో పాటు ఫస్ట్ నంబరులోకి రావడం అనగా ఫస్ట్ డివిజన్. వారిని కూడా నంబరువన్ అనే అంటారు. కనుక ఎప్పటివరకైతే ఫైనల్ రిజల్టు వెలువడదో, అప్పటి వరకు వర్తమాన సమయమనుసారంగా ఎవరైనా చివరి నంబర్లో ఉన్నారని బాప్ దాదాకు తెలిసినా, వారిని చివరి నంబరు వారిగా భావించరు. ఎప్పుడైనా లాస్ట్ సో ఫస్ట్ గా అవ్వవచ్చు. అవకాశముంది. అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైతే చాలా తీవ్ర వేగంతో నడుస్తారో వారు సమీపానికి చేరుకునే సరికి అలసిపోతారు, అప్పుడు ఆగిపోతారు. ఎవరైతే నెమ్మది-నెమ్మదిగా నడుస్తారో, ఎప్పుడూ ఆగిపోరో, ఒక పద్ధతిగా నడుస్తారో, వారు చేరుకుంటారు, అందుకే ఇప్పుడు బాబా దృష్టిలో అందరు నంబరువన్ గానే ఉన్నారు. ఎప్పుడైతే రిజల్టు ఔట్ అవుతుందో, అప్పుడు వీరు లాస్ట్, వీరు ఫస్ట్ అని అంటారు. ఇప్పుడైతే చెప్పలేరు, అందుకే కేవలం స్వయంపై నిశ్చయం ఉంచుకొని ఎగురుతూ వెళ్ళండి.

బాప్ దాదాకు అందరినీ ముందుకు ఎగిరేలా చేయాలనే హృదయపూర్వకమైన ప్రేమ ఉంది. ఎప్పుడైనా ఎవరితోనైనా రెండు మాటలు తక్కువ మాట్లాడితే, తక్కువ ప్రేమ ఉందని కాదు. బాబాకు హృదయంలో కూడా ప్రేమతో కూడిన శ్రేష్ఠ శుభ కామనలు సదా నిండి ఉంటాయి. ‘ఎగురుతూ వెళ్ళండి’ అనే రెండు మాటలు చెప్పినా, అందులో కూడా ప్రేమసాగరం ఇమిడి ఉంటుంది. బాబా నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు అని ఎవ్వరూ అనలేరు. ఒకవేళ ఎవరైనా అంటే ‘నన్ను మీకంటే ఎక్కువగా ప్రేమిస్తారు’ అని వారితో చెప్పండి. మరియు బాబా నిజంగానే అంత ప్రేమిస్తున్నారు, ఊరికే అలా చెప్పటం లేదు, కేవలం మీ మనసును సంతోషపరచేందుకు చెప్పటం లేదు. ఎంతగానో భ్రమించి, అలసిపోయి, చిక్కుకుపోయి ఉన్న మీరు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత కలిసారని బాబాకు తెలుసు. బాబా మిమ్మల్ని వెతికి-వెతికి కనుక్కున్నారు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అన్ని దిక్కుల నుండి వెతికి కనుక్కున్నారు. కనుక ఎవరినైతే వెతికి కనుక్కున్నారో, వారి పట్ల ఎంత ప్రేమ ఉంటుంది! ప్రేమ లేకుంటే వెతికేవారే కాదు. మరియు సాగరుని వద్ద ప్రేమకు లోటు ఉంటుందా? ప్రతి ఒక్కరికి ఎంత హృదయపూర్వకమైన ప్రేమ ఉంది అనేది దిలారామ్ కు తెలుసు! ఏది ఎలా ఉన్నా సరే, ప్రేమ విషయంలో అందరూ పాస్. బాబా పట్ల ప్రేమ విషయంలో సర్టిఫికెట్ అయితే బాబా ముందే ఇచ్చేసారు. అచ్ఛా!

నలువైపులా ఉన్న అత్యంత స్నేహభరిత హృదయపూర్వక రాగాలను వినిపించే దిలారామ్ యొక్క దిల్ రూబా పిల్లలకు, సదా ప్రతి కర్మలో ‘సన్ షోస్ ఫాదర్’ (తండ్రిని ప్రత్యక్షం) చేసేవారు, సదా ప్రతి మాట ద్వారా బాబాతో సంబంధాన్ని జోడింపజేసేవారు, సదా తమ ఆత్మిక దృష్టి ద్వారా ఆత్మలకు బాబాను అనుభవం చేయించేవారు, ఇలా బాబాను ప్రత్యక్షం చేసేవారు, బాబా హృదయసింహాసనాన్ని జయించిన మాయాజీతులు, జగత్ జీతులైన పిల్లలకు దిలారామ్ బాబా ప్రియస్మృతులు మరియు నమస్తే.

వ్యక్తిగత మిలనము -

1. స్మృతి శక్తి సదా ప్రతి కార్యంలో ముందుకు తీసుకువెళ్తుంది. స్మృతి శక్తి సదా కోసం శక్తిశాలిగా చేస్తుంది. స్మృతి శక్తి యొక్క అనుభూతి సర్వ శ్రేష్ఠమైన అనుభూతి. ఈ శక్తి ప్రతి కార్యంలో సఫలతను అనుభవం చేయిస్తుంది. ఈ శక్తిని అనుభవం చేస్తూ ముందుకు వెళ్ళే ఆత్మను - ఇది స్మృతిలో ఉంచుకుని ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. ఈ శక్తి ద్వారానే విశేషమైన సహయోగం ప్రాప్తిస్తూ ఉంటుంది.

2. సదా ప్రతి కార్యం చేస్తూ స్వయాన్ని సాక్షీ స్థితిలో స్థితి చేసుకుని ‘కార్యాన్ని చేయించే అతీతమైన ఆత్మను’ అనే అనుభవం చేస్తున్నారా? సాక్షీ స్థితి సదా ప్రతి కార్యాన్ని సహజంగా సఫలం చేస్తుంది. సాక్షీ స్థితి ఎంత ప్రియంగా అనిపిస్తుంది! సాక్షీగా ఉంటూ కర్మ చేసే ఆత్మ సదా అతీతంగా మరియు బాబాకు ప్రియంగా ఉంటుంది. ఈ అభ్యాసం ద్వారా కర్మ చేసే అలౌకిక ఆత్మను, అలౌకిక అనుభూతిని చేసేటువంటి, అలౌకిక జీవితం మరియు శ్రేష్ఠ జీవితాన్ని జీవించేటువంటి ఆత్మను అనే నషా ఉంటుంది కదా? కర్మలు చేస్తూ ఈ అభ్యాసాన్నే పెంచుకుంటూ ఉండండి. ఈ అభ్యాసమే కర్మాతీత స్థితిని ప్రాప్తి చేయిస్తుంది. ఈ అభ్యాసాన్ని సదా పెంచుకుంటూ, కర్మ చేస్తూ అతీతంగా మరియు బాబాకు ప్రియంగా ఉండండి. ఇలాంటి వారినే శ్రేష్ఠ ఆత్మలని అంటారు.

3. సదా శ్రేష్ఠ ఖజానాలతో నిండుగా ఉండే ఆత్మను - అని అనుభవం చేస్తున్నారా? ఎవరైతే తరగని ఖజానాలతో నిండుగా ఉంటారో, వారికి ఆత్మిక నషా ఎంతగా ఉంటుంది! సదా సర్వ ఖజానాలతో నిండుగా ఉన్నాను - ఈ ఆత్మిక సంతోషంతో ముందుకు వెళ్తూ ఉండండి. సర్వ ఖజానాల ద్వారా ఆత్మలను మేల్కొలిపి వారిని సహచరులుగా చేసినట్లయితే నిండుగా మరియు శక్తిశాలి ఆత్మగా అయి ముందుకు వెళ్తూ ఉంటారు.

4. సదా బుద్ధిలో ‘చేయించే తండ్రి చేయిస్తున్నారు, మేము నిమిత్తులము’ అనే స్మృతి ఉంటుంది కదా. నిమిత్తంగా ఉంటూ చేసేవారు సదా తేలికగా ఉంటారు ఎందుకంటే బాధ్యతంతా చేయించే తండ్రిది. ‘నేను చేస్తున్నాను’ అన్న స్మృతి ఉంటే భారంగా అయిపోతారు మరియు ‘తండ్రి చేయిస్తున్నారు’ అన్న స్మృతి ఉంటే తేలికగా ఉంటారు. నేను నిమిత్తుడను, చేయించేవారు చేయిస్తున్నారు, నడిపించేవారు నడిపిస్తున్నారు - ఇలా ఉండేవారినే నిశ్చింత చక్రవర్తులని అంటారు. కనుక చేయించేవారు చేయిస్తున్నారు. ఈ విధి ద్వారా సదా ముందుకు వెళ్తూ ఉండండి.

5. బాబా ఛత్రఛాయలో ఉండే శ్రేష్ఠ ఆత్మను అనే అనుభూతి అవుతుందా. ఎవరైతే ఇప్పుడు ఛత్రఛాయలో ఉంటారో, వారే ఛత్రధారులుగా అవుతారు. కనుక ఛత్రఛాయలో ఉండే భాగ్యశాలి ఆత్మను అనే సంతోషం ఉంటుంది కదా. ఛత్రఛాయనే సురక్షా సాధనము. ఈ ఛత్రఛాయ లోపలికి ఎవ్వరూ రాలేరు. నేను బాబా ఛత్రఛాయ లోపల ఉన్నాను - ఈ చిత్రాన్ని సదా ఎదురుగా పెట్టుకోండి.

6. సదా మీ ఆత్మిక ఫరిశ్తా స్వరూపం స్మృతిలో ఉంటుందా? బ్రాహ్మణుల నుండి ఫరిశ్తా, ఫరిశ్తా నుండి దేవత - ఈ పొడుపు కథను విప్పారు కదా! పొడుపు కథలను విప్పటం వచ్చా! సెకండులో బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. దేవతలే చక్రంలో తిరుగుతూ బ్రాహ్మణులుగా అవుతారు, మళ్ళీ దేవతలుగా అవుతారు. కనుక ‘హం సో, సో హం’ యొక్క పొడుపు కథ సదా బుద్ధిలో ఉంటుందా? పొడుపు కథలను విప్పేవారికే బహుమతి లభిస్తుంది. మరి బహుమతి లభించింది కదా! ఇప్పుడు ఏదైతే లభించిందో, అది భవిష్యత్తులో కూడా లభించదు. బహుమతిగా ఏం లభించింది? స్వయంగా తండ్రి లభించారు, తండ్రికి చెందినవారిగా అయ్యారు. భవిష్య రాజ్యంతో పోలిస్తే ఈ ప్రాప్తి ఎంత ఉన్నతమైనది! కనుక సదా బహుమతిని తీసుకునే శ్రేష్ఠ ఆత్మను అనే నషా మరియు ఖుషీ ద్వారా సదా ముందుకు వెళ్తూ ఉండండి. పొడుపు కథ మరియు బహుమతి, ఈ రెండూ సదా స్మృతిలో ఉన్నట్లయితే స్వతహాగానే ముందుకు వెళ్తూ ఉంటారు.

7. ‘దృఢత సఫలతకు తాళంచెవి’ అనే విధి ద్వారా వృద్ధిని ప్రాప్తి చేసుకునే శ్రేష్ఠ ఆత్మను - ఇలా అనుభవం అవుతుంది కదా. దృఢ సంకల్పం యొక్క విశేషత కార్యంలో సహజంగా సఫలురుగా చేసి విశేష ఆత్మగా చేస్తుంది, అంతేకాక, ఏ కార్యంలోనైనా విశేష ఆత్మగా అయినప్పుడు అందరి ఆశీర్వాదాలు స్వతహాగానే లభిస్తాయి. స్థూలమైన ఆశీర్వాదాలను ఇవ్వరు, ఇవి సూక్ష్మమైన ఆశీర్వాదాలు. వీటి ద్వారా ఆత్మలో శక్తి నిండుతుంది మరియు స్వఉన్నతిలో సహజంగా సఫలత ప్రాప్తిస్తుంది. కనుక సదా దృఢత అనే మహానతతో సఫలతను ప్రాప్తి చేసుకునే మరియు సర్వుల ఆశీర్వాదాలను తీసుకునే శ్రేష్ఠ ఆత్మను అనే స్మృతితో ముందుకు వెళ్తూ ఉండండి.

Comments