23-01-1987 అవ్యక్త మురళి

23-01-1987          ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సఫలతాసితారల విశేషతలు.

జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు అయిన బాప్ దాదా తన యొక్క కొత్త పిల్లలు మరియు కల్పపూర్వక పాత పిల్లల ఎదుట పరమాత్ముని నక్షత్ర మండలం యొక్క పరిస్థితిని  వివరిస్తూ అన్నారు.... 
 
ఈ రోజు జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు తమ యొక్క మెరిసే నక్షత్రమండలాన్ని చూస్తున్నారు. అవి ఆకాశ సితారలు, ఇవి భూమి యొక్క సితారలు. అవి ప్రకాశ సితారలు, ఇవి పరమాత్ముని సితారలు, ఆత్మిక సితారలు కూడా రాత్రే ప్రత్యక్షమవుతాయి. అలాగే ఈ ఆత్మిక సితారలు, జ్ఞానసితారలు, మెరిసే సితారలు బ్రహ్మ రాత్రిలోనే ప్రత్యక్షమవుతాయి. ఆ సితారలు రాత్రిని పగలుగా చేయలేవు, రాత్రిని పగలుగా చేసేది సూర్యుడు. కానీ సితారలు అయిన మీరు జ్ఞాన సూర్యుడు మరియు చంద్రునితో పాటు మీరు కూడా సహయోగులై రాత్రిని పగలుగా తయారు చేస్తున్నారు. ప్రాకృతిక నక్షత్రమండలంలో అనేక రకాలైన సితారలు మెరుస్తూ కనిపిస్తాయి. అదేవిధంగా ఈ పరమాత్ముని నక్షత్ర మండలంలో కూడా భిన్న భిన్న రకాల సితారలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. కొందరు సఫలతా సితారలు, కొందరు ఆశా సితారలు. కొందరు ఒకే స్థితి కలిగినవారు, మరికొందరు స్థితిని మార్చుకునేవారు. అక్కడ ఆ సితారల స్థానం మారుతుంది, ఇక్కడ స్థితి మారుతుంది. ప్రకృతి యొక్క నక్షత్రమండంలో తోకచుక్కలను చూపించారు కదా! అదేవిధంగా పరమాత్మ సితారలలో కూడా కొన్ని తోకచుక్కలు ఉన్నాయి. తోకచుక్క అంటే ప్రతి విషయంలో, ప్రతి కార్యంలో ఇది ఎందుకు, ఇది ఏమిటి? అని అడిగే తోక కలిగినవారు, అంటే ప్రశ్నార్థకం పెట్టేవారే  తోకచుక్కలు. ప్రకృతి యొక్క తోకచుక్కల ప్రభావం పృద్వికి భారం అని భావిస్తారు. అదేవిధంగా మాటిమాటికి ప్రశ్నలు అడిగేవారు ఈ బ్రాహ్మణ పరివారంలో వాయుమండలాన్ని భారంగా చేస్తారు. అందరూ అనుభవీలే. స్వయం గురించి అయినా కానీ సంకల్పంలో ఏమిటి మరియు ఎందుకు అనే తోక వస్తే మనస్సు మరియు బుద్ది భారంగా అయిపోతాయి కదా! దానితో పాటు సంఘటన విషయంలో లేదా సేవాకార్యం గురించి ఎందుకు, ఏమిటి, ఇలా, అలా .... ఇలాంటి ప్రశ్నార్ధకాల వరుస యొక్క తోక వస్తే సంఘటన యొక్క వాతావరణం లేదా సేవా క్షేత్రం యొక్క వాతావరణం వెంటనే భారం అయిపోతుంది. ఇలా స్వయంపై లేదా సంఘటన లేదా సేవలో ప్రభావం పడుతుంది. అంతే కాకుండా ప్రకృతి యొక్క సితారలు కొన్ని క్రిందకి రాలిపోతుంటాయి కూడా! క్రిందకి పడిపోయినప్పుడు నక్షత్రం ఏవిధంగా అయిపోతుంది?  రాయి అయిపోతుంది. అదేవిధంగా పరమాత్ముని సితారలలో కూడా ఎప్పుడైతే నిశ్చయం,సంబంధం లేదా స్వధారణ యొక్క ఉన్నత స్థితి నుండి క్రిందకి వచ్చేస్తున్నారు, అప్పుడు రాతి బుద్దిగా అయిపోతున్నారు. రాతిబుద్ది అంటే ఏవిధంగా అవుతున్నారు? రాయిపై ఎన్ని నీళ్ళు పోసినా కానీ రాయి కరగదు, రూపం మారిపోతుంది కానీ కరగదు. రాతికి ఏ ధారణ ఉండదు. అదేవిధంగా ఇక్కడ రాతిబుద్దిగా ఎలా అయిపోతున్నారంటే ఆ సమయంలో ఎంతగా, ఏ మంచి విషయాన్ని అనుభవం చేయించినా కానీ అనుభవం చేసుకోరు. జ్ఞాన జలాన్ని ఎంతగా వేసినా కానీ వారు మారరు. విషయాలనే మార్చేస్తారు. కానీ స్వయం మారరు. దీనినే రాతి బుద్దిగా అయిపోవటం అని అంటారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి - పరమాత్ముని ఈ నక్షత్ర మండలం యొక్క సితారలలో నేను ఏ సితారను? 
 
అన్నింటికంటే శ్రేష్ఠ సితార - సఫలతా సితార. సఫలతా సితార అనగా సదా స్వయం యొక్క ప్రగతిలో సఫలతను అనుభవం చేసుకుంటారు, అంటే తమ పురుషార్ధం యొక్క విధిలో సదా సహజ సఫలతను అనుభవం చేసుకుంటారు. సఫలతా సితారల సంకల్పంలో కూడా స్వయం యొక్క పురుషార్ధం విషయంలో ఎప్పుడూ కూడా ఇది జరుగుతుందో లేదో తెలియదు, చేయగలనో లేదో తెలియదు అని అసఫలత అనేది అంత మాత్రంగా కూడా ఉండదు. సఫలత నా యొక్క జన్మసిద్ధ అధికారం అని సూక్తి కదా! అదేవిధంగా వారు స్వయం పట్ల సదా సఫలతను అధికార రూపంలో అనుభవం చేసుకుంటారు. అధికారం అంటే శ్రమ లేకుండా మరియు అడగకుండానే లభించేది. సహజంగా మరియు స్వతహాగా ప్రాప్తించేదానినే అధికారం అని అంటారు. అదేవిధంగా 1. స్వయం యొక్క సఫలత 2. సంబంధ సంపర్కాలలోకి వచ్చే బ్రాహ్మణాత్మల యొక్క మరియు లౌకిక పరివారం లేదా లౌకిక కార్యం యొక్క సంబంధంలో ఇలా సర్వుల సంబంధ సంపర్కాలలో వారి సంబంధంలోకి వస్తూ, సంపర్కంలోకి వస్తూ ఎంత కష్ట విషయాన్ని అయినా కానీ సఫలతా అధికారం యొక్క ఆధారంతో సహజంగా అనుభవం చేసుకుంటారు,  అంటే సఫలత యొక్క ప్రగతిలో ముందుకి వెళ్తూ ఉంటారు. సమయం పట్టవచ్చు కానీ సఫలత యొక్క అధికారాన్ని పొందే తీరుతారు. ఇలా స్థూలకార్యం లేదా అలౌకిక సేవాకార్యం అంటే రెండు క్షేత్రాల కర్మలో సఫలత గురించి నిశ్చయబుద్ధిగా ఉంటారు. అక్కడక్కడ పరిస్థితులను ఎదుర్కోవలసి కూడా ఉంటుంది, వ్యక్తుల ద్వారా కూడా సహించవలసి ఉంటుంది కానీ ఆ సహించడం అనేది ఉన్నతికి మార్గం అయిపోతుంది. పరిస్థితిని ఎదుర్కుంటూ కూడా పరిస్థితి స్వస్థితి యొక్క వృద్ధికళకు సాధనం అయిపోతుంది. అంటే ప్రతి విషయంలో సఫలత స్వతహాగా, సహజంగా మరియు తప్పక ప్రాప్తిస్తుంది. 

సఫలతా సితారల విశేష గుర్తు - ఎప్పుడూ కూడా స్వ సఫలత యొక్క అభిమానం ఉండదు. సఫలత గురించి వర్ణించరు, తమ పాటలు పాడరు, ఎంత సఫలతయో అంత నమ్రచిత్ గా, నిర్మానంగా, నిర్మల స్వభావంతో ఉంటారు. ఇతరులు వారి పాటలు పాడతారు. కానీ వారు మాత్రం సదా బాబా గుణాలను పాడుతూ ఉంటారు. సఫలతా సితారలు ఎప్పుడూ ప్రశ్నార్ధకం పెట్టరు. సదా బిందు రూపంలో స్థితులై ప్రతి కార్యంలో ఇతరులకు కూడా డ్రామా బిందువు యొక్క స్మృతిని ఇప్పిస్తూ విఘ్నవినాశకులుగా, సమర్ధంగా తయారు చేసి సఫలత అనే గమ్యానికి సమీపంగా తీసుకువస్తూ ఉంటారు. సఫలతా సితార ఎప్పుడూ కూడా హద్దులోని సఫలతను చూసుకుని ప్రాప్తి యొక్క స్థితిలో సంతోషంగా మరియు ఏదైనా పరిస్థితి వచ్చి ప్రాప్తి కొంచెం తక్కువ అయితే సంతోషం కూడా తక్కువ అయిపోవటం ఇలా స్థితిని పరివర్తన చేసుకునేవారిగా ఉండరు. సదా బేహద్ సఫలతామూర్తులుగా ఉంటారు. ఏకరసంగా ఒకే శ్రేష్ట స్థితిలో స్థితులై ఉంటారు. బాహ్య పరిస్థితి లేదా కార్యంలో బాహ్యరూపంలో ఇతరులకు అసఫలతగా అనుభవం అయినా కానీ సఫలతా సితారలు అసఫలతా స్థితి యొక్క ప్రభావంలోకి రారు. సఫలత యొక్క స్వస్థితి ద్వారా అసఫలతను పరివర్తన చేసుకుంటారు. ఇవీ సఫలతా సితారల విశేషతలు. ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి - నేనెవరు? కేవలం ఆశాసితారనా లేక సఫలతా స్వరూపాన్నా? ఆశా సితారలుగా అవ్వటం కూడా మంచిదే కానీ కేవలం ఆశాసితారలుగానే నడవడం, ప్రత్యక్ష సఫలతను అనుభవం చేసుకోకపోవటం దీనిలో ఒకొక్కసారి శక్తిశాలి, ఒకొక్కసారి మానసికంగా బలహీనంగా ఇలా పైకి క్రిందకి అయ్యే స్థితిని ఎక్కువగా అనుభవం చేసుకుంటారు. ఏ విషయంలోనైనా ఎక్కువగా పైకి కిందకి అయితే అలసట అనిపిస్తుంది కదా! అదేవిధంగా ఈ విషయంలో కూడా నడుస్తూ నడుస్తూ అలసట యొక్క అనుభవం మనస్సుని బలహీనంగా చేసేస్తుంది. నిరాశావాదులు కంటే ఆశావాదులు మంచివారే కానీ సఫలతా స్వరూపాన్ని అనుభవం చేసుకునేవారు సదా శ్రేష్టం. మంచిది. నక్షత్రమండలం యొక్క కథ విన్నారా? కేవలం మధువనం యొక్క హాలు మాత్రమే నక్షత్రమండలం కాదు, బేహద్ బ్రాహ్మణ ప్రపంచం అంతా నక్షత్రమండలమే. మంచిది. 

వచ్చినటువంటి క్రొత్త పిల్లలు, క్రొత్త వారు కూడా మరియు చాలా పాతవారు కూడా. ఎందుకంటే అనేక కల్పాలు వచ్చారు కనుక చాలా పాతవారు. క్రొత్త పిల్లలు బాబాని కలుసుకోవాలనే ఉత్సాహ ఉల్లాసాలతో ఉన్నారు, డ్రామా యొక్క నిర్ణయాన్ని అనుసరించి అది ఇప్పుడు పూర్తి అయ్యింది. చాలా ఉల్లాసం ఉండేది కదా! వెళ్ళాలి, వెళ్ళాలి అని ఎంత ఉల్లాసం అంటే మధువనం యొక్క డైరెక్షన్ కూడా వినలేదు. కలయిక యొక్క సంలగ్నతలో నిమగ్నం అయిపోయారు కదా! తక్కువమంది రండి, తక్కువమంది రండి అని ఎంతగా చెప్పినా కానీ ఎవరైనా విన్నారా? బాప్ దాదా డ్రామా యొక్క ప్రతి దృశ్యాన్ని చూసి హర్షిస్తారు. ఇంతమంది పిల్లలు రావలసి ఉంది కనుక వచ్చారు. అన్నీ సహజంగా దొరుకుతున్నాయి కదా! ఏ కష్టం లేదు కదా?  డ్రామానుసారం, సమయానుసారం ఇది కూడా రిహార్సల్. అందరూ సంతోషమే కదా? కష్టాన్ని సహజంగా చేసుకునేవారే కదా! ప్రతి కార్యంలో సహయోగాన్ని ఇవ్వాలి. లభించిన సలహా అనుసారంగా సహయోగిగా అవ్వాలి అంటే సహజంగా చేసుకోవాలి. ఒకరికొకరు సహయోగి అయితే 5000 మంది కూడా సరిపోతారు. సహయోగిగా కాకపోతే అంటే విధిపూర్వకంగా నడవకపోతే 500 మంది సరిపోవటం కూడా కష్టం. అందువలన మీ రికార్డుని ఈ విధంగా దాదీలకు చూపించి వెళ్ళాలి. 5000 మంది 500 మందిలా ఇమిడిపోయారు అని అందరి మనస్సుల నుండి రావాలి. దీనినే కష్టాన్ని సహజం చేసుకోవటం అని అంటారు. అయితే అందరూ తమ తమ రికార్డుని బాగా నింపుకున్నారు కదా! మంచి సర్టిఫికెట్ లభిస్తుంది కదా? ఈ విధంగానే సదా సంతోషంగా ఉండాలి మరియు సంతోషపరచాలి. అప్పుడు సదా చప్పట్లు మ్రోగుతూ ఉంటాయి. రికార్డు బావుంది అందువలనే డ్రామానుసారం రెండుసార్లు కలుసుకోవటం జరిగింది చూడండి. క్రొత్తవారికి డ్రామానుసారం ఈ మర్యాద లభించింది. మంచిది. 

 సదా ఆత్మిక శ్రేష్ట సఫలతా సితారలకు, సదా ఏకరస స్థితి ద్వారా విశ్వానికి వెలుగునిచ్చేవారికి, జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రునితో సదా కలిసి ఉండేవారికి, సదా అధికారం యొక్క నిశ్చయం ద్వారా నషా మరియు నమ్రచిత్ స్థితిలో ఉండేవారికి, పరమాత్ముని నక్షత్రమండంలో మెరిసే సితారలందరికీ జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు అయిన బాప్ దాదా యొక్క ఆత్మిక స్నేహ సంపన్న ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments