22-02-1986 అవ్యక్త మురళి

22-02-1986         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“ఆత్మిక సేవ - నిస్వార్థ సేవ”

ఈ రోజు సర్వాత్మలకు విశ్వకళ్యాణకారి అయిన తండ్రి తమ సేవాధారులను, తమ తోటి సేవాధారులైన పిల్లలను చూస్తున్నారు. ఆది నుండి బాప్ దాదాతో పాటుగా సేవాధారి పిల్లలు తోడుగా అయ్యారు. చివరి వరకు బాప్ దాదా గుప్త రూపంలో మరియు ప్రత్యక్ష రూపంలో పిల్లలను విశ్వ సేవకు నిమిత్తంగా చేశారు. ఆదిలో బ్రహ్మాబాబా మరియు బ్రాహ్మణ పిల్లలు గుప్త రూపంలో సేవకు నిమిత్తంగా అయ్యారు. ఇప్పుడు సేవాధారి పిల్లలైన శక్తి సైన్యము మరియు పాండవ సైన్యము విశ్వము ముందు ప్రత్యక్ష రూపంలో కార్యము చేస్తున్నారు. మెజారిటీ పిల్లల్లో సేవ చేయాలనే మంచి ఉల్లాస-ఉత్సాహాలు కనిపిస్తున్నాయి. సేవ చేయాలన్న ఆసక్తి ఆది నుండి ఉంది, అంతిమము వరకు ఉంటుంది. బ్రాహ్మణ జీవితమంటేనే సేవ చేసే జీవితము. బ్రాహ్మణాత్మలు సేవ లేకుండా జీవించలేరు. మాయ నుండి రక్షించుకుని జీవించి ఉండేందుకు శ్రేష్ఠమైన సాధనము సేవయే. సేవ యోగయుక్తంగా కూడా చేస్తుంది. కానీ ఎటువంటి సేవ? మొదటిది - కేవలం వాచా సేవ, విన్నదానిని వినిపించే సేవ. రెండవది, మనసుతో వాచా సేవ. విన్న మధురమైన మాటల స్వరూపంగా అయి, స్వరూపంతో చేసే సేవ, నిస్వార్థ సేవ. త్యాగము, తపస్యా స్వరూపంతో సేవ. హద్దు కోరికల నుండి అతీతమైన నిష్కామ సేవ. దీనిని ఈశ్వరీయ సేవ, ఆత్మిక సేవ అని అంటారు. కేవలం నోటితో చేసే సేవ ఏదైతే ఉందో, దానిని కేవలం స్వయాన్ని సంతోషపెట్టుకునే సేవ అని అంటారు. అందరినీ సంతోషపెట్టే సేవ, మనసు మరియు వాచ రెండిటితో జరుగుతుంది. మనసు ద్వారా అనగా మన్మనాభవ స్థితి ద్వారా వాచా సేవ.

బాప్ దాదా ఈ రోజు తమ కుడి భుజాల వంటి సేవాధారులను, ఎడమభుజాల వంటి సేవాధారులను ఇద్దరినీ చూస్తున్నారు. ఇరువురూ సేవాధారులే కానీ కుడి, ఎడమలకు తేడా అయితే ఉంది కదా. కుడిభుజాలు సదా నిష్కామ సేవాధారులు. ఎడమ భుజాలు ఏదో ఒక హద్దుకు చెందిన, ఈ జన్మ కొరకు సేవా ఫలాన్ని తినాలనే కోరికతో సేవకు నిమిత్తంగా అవుతారు. కుడిభుజాలు గుప్త సేవాధారులు, ఎడమభుజాలు నామధారి సేవాధారులు. ఇప్పుడిప్పుడే సేవ చేస్తారు, ఇప్పుడిప్పుడే చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు అనే పేరు వస్తుంది. అయితే ఇప్పుడే చేశారు, ఇప్పుడే తినేశారు. ఖాతాలో జమ అవ్వలేదు. గుప్త సేవాధారులనగా నిష్కామ సేవాధారులు. కనుక ఒకరు నిష్కామ సేవాధారులు, రెండవవారు నామధారి సేవాధారులు. గుప్త సేవాధారుల పేర్లు వర్తమానంలో గుప్తంగా ఉన్నా కానీ గుప్త సేవాధారులు సఫలతను పొందిన సంతోషంతో సదా నిండుగా ఉంటారు. మేము చేస్తున్నా కూడా పేరు ఉండదు, కానీ ఎవరైతే బయటకు నామధారులుగా అయ్యి సేవ యొక్క షో చేస్తారో, వారికి ఎక్కువ పేరు ఉంటుంది అని చాలామంది పిల్లలకు సంకల్పం వస్తుంది. కానీ అలా ఏం కాదు, నిష్కామ సేవాధారులుగా అయి అవినాశీ పేరును సంపాదించుకునేవారు ఎవరైతే ఉన్నారో, వారి హృదయము నుండి వెలువడే శబ్దము హృదయం వరకు చేరుతుంది, దాగి ఉండలేదు. వారి ముఖములో, మూర్తిలో సత్యమైన సేవధారి యొక్క మెరుపు తప్పకుండా కనిపిస్తుంది. ఒకవేళ ఎవరైనా నామధారులు ఇక్కడ పేరు సంపాదిస్తే, అప్పుడు భవిష్యత్తు కొరకు చేసారు మరియు తిన్నారు మరియు ఖాళీ చేసేసారు, వారి భవిష్యత్తు శ్రేష్ఠంగా ఉండదు, అవినాశీగా ఉండదు. అందువలన బాప్ దాదా వద్ద సేవాధారులందరి రికార్డు పూర్తిగా ఉంటుంది. సేవ చేస్తూ ఉండండి. పేరు రావాలనే సంకల్పము చేయకండి. జమ అవ్వాలని అలోచించండి. అవినాశీ ఫలానికి అధికారులుగా అవ్వండి. అవినాశీ వారసత్వము కొరకు వచ్చారు. సేవాఫలాన్ని వినాశీ సమయం కొరకు తిన్నారంటే అవినాశీ వారసత్వానికి అధికారము తగ్గిపోతుంది. అందువలన సదా వినాశీ కామనల నుండి ముక్తులుగా అయి నిష్కామ సేవాధారులుగా, కుడిభుజాలుగా అయి, సేవలో ముందుకు సాగుతూ వెళ్ళండి. గుప్త దానానికి, గుప్త సేవకు మహత్వము ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఆత్మలు సదా స్వయంలో నిండుగా ఉంటారు. నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. పేరు ప్రతిష్టల గురించిన చింత ఉండదు. ఇందులోనే నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు అనగా సదా స్వమానమనే సింహాసనానికి అధికారులుగా ఉంటారు. హద్దు గౌరవమనే సింహాసనాధికారులుగా ఉండరు. స్వమానమనే సింహాసనాధికారులు, అవినాశీ సింహాసనాధికారులు. స్థిరమైన, అఖండమైన ప్రాప్తికి సింహాసనాధికారులు. ఇటువంటి వారిని విశ్వకళ్యాణకారి సేవాధారులని అంటారు. ఎప్పుడూ కూడా సాధారణ సంకల్పాల కారణంగా విశ్వ సేవ కార్యములో, సఫలతను ప్రాప్తి చేసుకోవడంలో వెనక్కి తగ్గరాదు. త్యాగము మరియు తపస్సు ద్వారా సదా సఫలతను ప్రాప్తి చేసుకుని ముందుకు సాగుతూ ఉండండి. అర్థమయిందా!

సేవాధారులు అని ఎవరిని అంటారు? మరి అందరూ సేవాధారులేనా? స్థితిని కింద-మీద చేసే సేవ సేవయే కాదు. సేవలో పైకి-కిందకు అవ్వటం చాలా ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. విఘ్నాలు కూడా సేవలో వస్తాయి, నిర్విఘ్నము కూడా సేవయే చేస్తుంది. కానీ ఏ సేవ అయితే విఘ్నరూపంగా అవుతుందో అది సేవ కాదు. ఆ సేవను సత్యమైన సేవ అని అనము. పేరుకు మాత్రమే సేవ అని అంటారు. సత్యమైన సేవ సత్యమైన వజ్రము. ఎలాగైతే సత్యమైన వజ్రము మెరవకుండా ఎప్పుడూ దాగి ఉండలేదో, అలా సత్యమైన సేవాధారి అంటే సత్యమైన వజ్రము. నకిలీ వజ్రములోని మెరుపు ఎంత ఎక్కువగా ఉన్నాకానీ విలువైనది ఏది? విలువ సత్యమైన దానికే ఉంటుంది కదా. నకిలీకి విలువ ఉండదు. సత్యమైన సేవాధారులు అమూల్యమైన రత్నాలవంటివారు. సత్యమైన సేవాధారులు అనేక జన్మలకు విలువైనవారు. నామధారి సేవ అల్పకాలికమైన షో వంటిది, అందువలన సదా సేవాధారులుగా అయి సేవ ద్వారా విశ్వకళ్యాణము చేస్తూ ఉండండి. సేవ యొక్క మహత్వము ఏమిటో అర్థమయిందా! తక్కువేమీ కాదు. ప్రతి ఒక్క సేవాధారి తమ-తమ విశేషతల ఆధారంగా విశేష సేవాధారులే. స్వయాన్ని తక్కువగా భావించకండి, అలాగే చేసిన తర్వాత పేరు కావాలన్న కోరికను కూడా పెట్టుకోకండి. సేవను విశ్వ కళ్యాణం కోసం అర్పిస్తూ వెళ్ళండి. భక్తిలో కూడా గుప్త దాన-పుణ్యాలు చేసే ఆత్మలు అందరి మేలు జరగాలనే సంకల్పమే చేస్తారు. నా కొరకు అని గాని, నాకు ఫలము లభించాలని గాని అనుకోరు. అందరికీ ఫలము లభించాలని కోరుకుంటారు. అందరి సేవలో అర్పిస్తారు. ఎప్పుడూ స్వయానికి లభించాలనే కోరిక ఉంచుకోరు. అలాగే మీరు కూడా సర్వుల కొరకు సేవ చేయండి. సర్వుల కళ్యాణము చేసే బ్యాంకులో జమ చేస్తూ నడవండి. అప్పుడు అందరూ ఎటువంటి వారిగా అవుతారు? నిష్కామ సేవాధారులు. ఇప్పుడు ఎవ్వరూ మిమ్మల్ని అడగకపోతే, 2500 సంవత్సరాలు మిమ్మల్ని అడుగుతారు. ఒక్క జన్మలో అడగడమా లేక 2500 సంవత్సరాలు అడగడమా, ఏది ఎక్కువ? 2500 సంవత్సరాలు ఎక్కువ కదా. హద్దు సంల్పాలకు అతీతంగా ఉంటూ, అనంతమైన సేవాధారులుగా అయి, తండ్రి హృదయ సింహాసనాధికారులుగా, నిశ్చింత చక్రవర్తులుగా అయి, సంగమయుగ సంతోషాలను, ఆనందాలను జరుపుకుంటూ ఉండండి. ఎప్పుడైనా ఏదైనా సేవ ఉదాసీనంగా చేస్తే, అది సేవ కాదని భావించండి. కింద-మీద చేసినా, అలజడిలోకి తీసుకొచ్చినా, అది సేవ కాదు. సేవ అంటే ఎగిరింపజేసేది. చింతలేని రాజ్యానికి చక్రవర్తిగా చేసేది సేవ. ఇటువంటి సేవాధారులే కదా? నిశ్చింత చక్రవర్తులు, నిశ్చింతపురికి చక్రవర్తులు. వీరి వెనుక సఫలత దానంతట అదే వస్తుంది. సఫలత వెనుక వారు పరుగెత్తరు. సఫలత వారి వెనుక-వెనుకనే ఉంటుంది. అచ్ఛా - అనంతమైన సేవ కొరకు ప్లాన్ చేస్తారు కదా. అనంతమైన స్థితి ద్వారా అనంతమైన సేవ కొరకు వేసే ప్లాన్ సహజంగా సఫలమవుతుంది. (డబల్ విదేశీ సోదరీ-సోదరులు ఒక ప్లాన్ తయారుచేశారు, అందులో ఆత్మలందరి ద్వారా కొన్ని నిముషాలు శాంతిని దానంగా తీసుకోవాలి.)

విశ్వాన్ని మహాదానిగా తయారుచేసేందుకు మంచి ప్లాన్ తయారుచేశారు కదా! కొంత సమయమైనా కూడా, శాంతి సంస్కారాలను, స్నేహంతో అయినా సరే, విధిలేక అయినా సరే, ఇమర్జ్ అయితే చేసుకుంటారు కదా! ప్రోగ్రాం అనుసారంగా చేసినా కానీ ఆత్మలో శాంతి సంస్కారము ఇమర్జ్ అవుతుంది. ఆత్మ స్వధర్మము శాంతియే కదా. అందరూ శాంతిసాగరుని పిల్లలే. శాంతిధామ నివాసులు కూడా. కనుక ప్రోగ్రాం అనుసారముగా కూడా ఆత్మలో శాంతి ఇమర్జ్ చేసుకోవటం ద్వారా, ఆ శాంతి శక్తి వారిని ఆకర్షిస్తూ ఉంటుంది. అంటారు కదా - ఒకసారి ఎవరైనా తీపిని రుచి చూస్తే వారికి తీపి పదార్థం లభించినా లభించకపోయినా, ఆ రుచి వారిని పదే-పదే లాగుతూ ఉంటుంది అని. అలా ఇది కూడా శాంతి అనే తేనెను రుచి చూడడం వంటిది. కనుక ఈ శాంతి సంస్కారము స్వతహాగానే స్మృతిని ఇప్పిస్తూ ఉంటుంది. అందువలన నెమ్మది నెమ్మదిగా ఆత్మలలో శాంతి జాగృతి అవుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మీరందరూ శాంతిని దానంగా ఇచ్చి వారిని కూడా దానులుగా తయారుచేస్తారు. ఆత్మలు ఏదో ఒక విధంగా శాంతిని అనుభవం చేయాలని మీ అందరి శుభ సంకల్పము. విశ్వశాంతి కూడా ఆత్మిక శాంతి ఆధారంగానే జరుగుతుంది కదా. ప్రకృతి కూడా పురుషుని ఆధారముతోనే నడుస్తుంది. ఆత్మలలో శాంతి స్మృతి వచ్చినప్పుడే ఈ ప్రకృతి కూడా శాంతిస్తుంది. ఏ విధితో చేసినాగానీ, అశాంతి నుండైతే దూరమయ్యారు కదా. ఒక్క నిమిషం శాంతి కూడా వారిని అనేక సమయాలలో ఆకర్షిస్తూ ఉంటుంది. మంచి ప్లాన్ తయారుచేశారు. ఇది కూడా ఎవరికైనా కొంచెం ఆక్సిజన్ ఇచ్చి శాంతి అనే శ్వాసను నడిపించే సాధనం వంటిది. వాస్తవానికి శాంతి అనే శ్వాస ఆడక మూర్ఛితులై ఉన్నారు. కనుక ఈ సాధనము ఆక్సిజన్ వంటిది. దీని ద్వారా కొంచెం ఊపిరి ఆడడం మొదలవుతుంది. కొందరి శ్వాస ఆక్సిజన్ తో నడుస్తూ-నడుస్తూ అలాగే కొనసాగుతుంది. కనుక అందరూ ఉల్లాస-ఉత్సాహాలతో, మొదట స్వయం పూర్తి సమయం శాంతి హౌస్ గా అయి శాంతి కిరణాలు ఇవ్వండి. అప్పుడు మీ శాంతి కిరణాల సహాయంతో, మీరు చేసే శాంతి సంకల్పాలతో వారికి కూడా సంకల్పం కలుగుతుంది మరియు ఏదో ఒక విధంగా చేస్తారు, కానీ మీ నుండి ప్రసరించే శాంతి వైబ్రేషన్లు వారిని సత్యమైన విధి వరకు లాక్కొని తీసుకొస్తాయి. ఎవరైతే నిరాశావాదులుగా ఉన్నారో, వారికి ఆశ యొక్క మెరుపును చూపించేందుకు ఇది సాధనము. నిరాశగా ఉన్న వారిలో ఆశను ఉత్పన్నము చేసే సాధనము. ఎంతవరకు వీలైతే అంతవరకు ఎవరు సంపర్కములోకి వచ్చినా, ఎవరి సంపర్కములోకి వచ్చినా, వారికి రెండు మాటలలో ఆత్మిక శాంతి, మానసిక శాంతుల పరిచయం ఇచ్చేందుకు తప్పకుండా ప్రయత్నించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ తమ పేరును తప్పకుండా జోడిస్తారు. ఉత్తరాల ద్వారా చేసినాగానీ కనెక్షన్ లోకి అయితే వస్తారు కదా. లిస్టులోకైతే వస్తారు కదా. కనుక వీలైనంత వరకు శాంతి అంటే అర్థమేమిటో రెండు మాటలలో స్పష్టం చేసేందుకు ప్రయత్నించండి. ఒక్క నిముషములోనైనా కూడా ఆత్మలో జాగృతి రావచ్చు. అర్థమయిందా. ప్లాన్ అయితే మీ అందరికీ కూడా ఇష్టమే కదా. ఇతరులు పనిని వదిలించుకుంటారు, మీరు పనిని చేస్తారు. మీరు శాంతి దూతలు కనుక నలువైపులా శాంతి దూతల ఈ శబ్దము మారుమ్రోగుతుంది మరియు శాంతి ఫరిస్తాలు ప్రత్యక్షమవుతూ ఉంటారు. కేవలం పీస్ అనే పదానికి ముందు ఇంకేదైనా పదముండాలి, అది ప్రపంచంలోనివారు ఉపయోగించేదానికి కొద్దిగా భిన్నంగా ఉండాలి, దీని కోసం పరస్పరంలో చర్చించుకుని సలహాలు తీయండి. పీస్ మార్చ్ లేక పీస్ అనే పదాలనైతే ప్రపంచంలోని వారు కూడా ఉపయోగిస్తారు. కనుక పీస్ అనే పదంతో పాటు ఏదైనా ఒక విశేషమైన పదముండాలి. అది యూనివర్సల్ గానూ ఉండాలి మరియు వినగానే భిన్నంగా కూడా అనిపించాలి. కనుక అటువంటి పదాన్ని కనుగొనండి. మిగిలినదంతా బాగుంది. కనీసం ఈ ప్రోగ్రాం నడిచినంత సమయమూ కూడా, ఏం జరిగినా కానీ - స్వయం అశాంతిగా అవ్వకూడదు, ఇతరులను అశాంతిగా చేయకూడదు. శాంతిని వదలకూడదు. మొదటైతే బ్రాహ్మణులు ఈ కంకణం కట్టుకుంటారు కదా! మొదట బ్రాహ్మణులు స్వయంగా కంకణం కట్టుకున్నప్పుడే ఇతరులకు కూడా కట్టగలరు. గోల్డెన్ జూబ్లిలో అందరూ ఏ సంకల్పం చేశారు? మేము సమస్యా స్వరూపులుగా అవ్వము అనే కదా సంకల్పం చేశారు. దీనినే పదే పదే అండర్ లైన్ చేస్తూ ఉండండి. అంతేగానీ మీరు సమస్యగా అవుతూ, సమస్యా స్వరూపులుగా అవ్వము అని చెప్పకండి. మరి ఈ కంకణం కట్టుకోవడం ఇష్టమే కదా. మొదట స్వయం, తర్వాత విశ్వము. స్వ యొక్క ప్రభావము విశ్వముపై పడుతుంది. అచ్ఛా!

ఈ రోజు టర్ను యూరోప్ వారిది. యూరోప్ కూడా చాలా పెద్దది కదా. యూరోప్ ఎంత పెద్దదో, యూరోప్ వారు అంత పెద్ద మనసు కలవారు కదా. యూరోప్ విస్తారం ఎంతగా ఉందో, ఎంత విస్తారమో, అంతగానే సేవలో సారము ఉంది. వినాశనమనే నిప్పురవ్వలు ఎక్కడ నుండి వెలువడ్డాయి? యూరోప్ నుండే కదా! మరి ఏవిధంగానైతే వినాశనానికి సాధనం యూరోప్ నుండి వెలువడిందో, అలాగే స్థాపనా కార్యములో విశేషంగా యూరోప్ నుండి ఆత్మలు ప్రఖ్యాతమవ్వాల్సిందే. ఏ విధంగానైతే బాంబులు మొదట అండర్ గ్రౌండ్లో తయారుచేసారో, ఆ తర్వాత కార్యంలోకి తీసుకువచ్చారో, అలా ఇటువంటి ఆత్మలు కూడా తయారవుతూ ఉన్నారు. ఇప్పుడింకా గుప్తంగా ఉన్నారు. అండర్ గ్రౌండ్లో ఉన్నారు. కానీ ప్రఖ్యాతం అవుతూ కూడా ఉన్నారు, ఇంకా అవుతూ కూడా ఉంటారు. ఎలాగైతే ప్రతి దేశానికి తమ తమ విశేషత ఉంటుందో, అలా ఇక్కడ కూడా ప్రతి స్థానానికి దాని విశేషత ఉంది. పేరు ప్రఖ్యాతము చేసేందుకు యూరోప్ లో తయారైన యంత్రాలు ఉపయోగపడుతాయి. ఎలాగైతే సైన్సు యంత్రాలు ఉపయోగపడ్డాయో, అలా పెద్ద శబ్దమును చేసేందుకు యూరోప్ నుండి యంత్రాలు నిమిత్తంగా అవుతాయి. నూతన విశ్వము తయారుచేసేందుకు యూరోప్ యే మీకు సహాయకారిగా అవుతుంది. యూరోప్ వస్తువులు సదా దృఢంగా ఉంటాయి. జర్మనీ వస్తువులకు అందరూ ప్రాముఖ్యతనిస్తారు. అలాగే సేవకు నిమిత్తంగా ఉన్న మహత్వము గల ఆత్మలు ప్రత్యక్షమవుతూ ఉంటారు. అర్థమయిందా. యూరోప్ కూడా తక్కువేమీ కాదు. ఇప్పుడు ప్రత్యక్షత అనే తెర తెరుచుకోవడం ప్రారంభమవుతూ ఉంది. సమయానికి బయటకు వచ్చేస్తుంది. బాగుంది, కొద్ది సమయంలోనే నలువైపులా బాగా విస్తరింపజేశారు. రచనను బాగా రచించారు. ఇప్పుడు ఈ రచనకు పాలన అనే నీరు ఇచ్చి దృఢంగా చేస్తున్నారు. ఎలాగైతే యూరోప్ వస్తువులు దృఢంగా ఉంటాయో, అలా ఆత్మలు కూడా విశేషంగా అచంచలంగా-నిశ్చలంగా దృఢంగా ఉంటారు. ప్రేమతో శ్రమ చేస్తున్నారు. అందువలన మీ శ్రమ, శ్రమ కాదు. కానీ సేవ చేయాలనే పట్టుదల బాగుంది. ఎక్కడైతే తపన ఉంటుందో, అక్కడ విఘ్నాలు వచ్చినా సమాప్తమై, సఫలత లభిస్తూ ఉంటుంది. మొత్తం మీద యూరోప్ యొక్క క్వాలిటీ గమనిస్తే చాలా బాగుంది. బ్రాహ్మణులు కూడా ఐ.పి.లే. మామూలుగా కూడా ఐ.పి.లే. కనుక యూరోప్ లో నిమిత్తంగా ఉన్న సేవాధారులను ఇంకా స్నేహభరితమైన శ్రేష్ఠ పాలన ద్వారా దృఢంగా చేసి విశేష సేవ చేసేందుకు మైదానంలోకి తీసుకొస్తూ ఉండండి. ఈ ధరణి ఫలమునిచ్చేటటువంటిది. అచ్ఛా, మరొక విశేషత ఏమిటంటే తండ్రికి చెందినవారిగా అవుతూనే ఇతరులను తండ్రికి చెందినవారిగా చేయడంలో నిమగ్నమవుతారు. బాగా ధైర్యము చేస్తారు. ధైర్యము కారణంగానే సేవాకేంద్రాలు వృద్ధిని పొందుతూ ఉండటమనే ఈ గిఫ్ట్ ఉంది. క్వాలిటీనీ పెంచండి, క్వాంటిటీని కూడా పెంచండి. రెండిటి బ్యాలెన్స్ ఉండాలి. క్వాలిటీ శోభ క్వాలిటీది. క్వాంటిటీ శోభ క్వాంటిటీది. రెండూ ఉండాలి. కేవలం క్వాలిటీ ఉండి, క్వాంటిటీ లేకపోయినా సేవ చేసేవారు అలసిపోతారు. అందువలన రెండూ కూడా తమ తమ విశేషతల ద్వారా పని చేస్తాయి. సేవకు రెండూ అవసరమే ఎందుకంటే 9 లక్షల మందిని తయారుచేయాలి కదా. 9 లక్షల్లో విదేశాల నుండి ఎంతమంది వచ్చారు? (5 వేలు) అచ్ఛా, ఒక కల్పము చక్రమైతే పూర్తి అయ్యింది. విదేశాలకు లాస్ట్ సో ఫాస్ట్ అనే వరదానముంది అనగా భారతదేశము కంటే ఫాస్ట్ గా వెళ్ళాలి. ఎందుకంటే భారతవాసులకు ధరణిని తయారుచేసేందుకు కష్టమవుతుంది. విదేశాలలో బంజరు భూమి లేదు. ఇక్కడ మొదట చెడును మంచిగా చేయాల్సి వస్తుంది. అక్కడ చెడు విననే లేదు. కనుక చెడు విషయాలను, అనవసరమైన విషయాలను విననే లేదు కనుక శుద్ధంగా ఉన్నారు. భారతీయులు ముందు పలకను శుభ్రం చేయవలసి వస్తుంది, ఆ తర్వాత వ్రాయవలసి ఉంటుంది. విదేశాలకు సమయ ప్రమాణంగా లాస్ట్ సో ఫాస్ట్ అనే వరదానముంది, మరి యూరోప్ వారు ఎన్ని లక్షల మందిని తయారుచేస్తారు? ఎలాగైతే ఈ మిలియన్ మినిట్ ప్రోగ్రాము తయారుచేశారో, అలా ప్రజలది కూడా తయారుచేయండి. ప్రజలైతే తయారవ్వగలరు కదా. మిలియన్ మినిట్లు చేయగలిగినప్పుడు మిలియన్ ప్రజలను తయారుచేయలేరా? మిలియన్ కంటే ఇంకా ఒక లక్ష తక్కువ, 9 లక్షలు అనే చెప్తారు కదా! యూరోప్ వారు ఏం చేయాలో అర్థమయిందా? చురుగ్గా తయారీలు చేయండి. అచ్ఛా - డబల్ విదేశీయులది డబల్ లక్. మామూలుగా అందరికీ రెండు మురళీలు వినేందుకు అవకాశం లభిస్తుంది. కానీ మీకు డబల్ లభించాయి. కాన్ఫరెన్సు కూడా చూశారు, గోల్డెన్ జూబ్లీ కూడా చూశారు. పెద్ద పెద్ద దాదీలను కూడా చూశారు. గంగ, యమున, గోదావరి, బ్రహ్మపుత్ర అందరినీ చూశారు. పెద్ద పెద్ద దాదీలందరినీ చూశారు కదా! ఒక్కొక్క దాది నుండి ఒక్కొక్క విశేషతను కానుకగా తీసుకువెళ్ళండి, అప్పుడు అందరి విశేషతలు పనికొస్తాయి. విశేషతలనే కానుకలతో జోలెను నింపుకుని వెళ్ళండి. ఇందుకు కస్టమ్స్ వాళ్ళు ఆపరు. అచ్ఛా !

సదా విశ్వకళ్యాణకారులుగా అయి విశ్వ సేవకు నిమిత్తమైన సత్యమైన సేవాధారీ శ్రేష్ఠ ఆత్మలు, సదా సఫలత అనే జన్మ సిద్ధ అధికారాన్ని ప్రాప్తి చేసుకునే విశేష ఆత్మలు, సదా స్వ స్వరూపం ద్వారా సర్వులకు స్వరూపాన్ని స్మృతినిప్పించే సమీప ఆత్మలు, సదా అనంతమైన నిష్కామ సేవాధారులుగా అయి ఎగిరే కళలో ఎగిరే డబల్ లైట్ పిల్లలకు బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే.

Comments