22-01-1988 అవ్యక్త మురళి

 22-01-1988         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

ధైర్యం యొక్క మొదటి అడుగు - సమర్పణత (బ్రహ్మాబాబా జీవిత కథ)”

ఈ రోజు స్నేహసాగరుడైన బాప్ దాదా తమ స్నేహీ పిల్లలను చూసి హర్షిస్తున్నారు. స్నేహీ ఆత్మలందరికీ, మేమందరము బాబా సమానంగా అవ్వాలి, వారి స్నేహంలో ఇమిడిపోవాలి అని - ఒకే తపన ఉంది మరియు శ్రేష్ఠ సంకల్పము ఉంది. స్నేహంలో ఇమిడిపోవడం అనగా బాబా సమానంగా అవ్వడము. అందరి హృదయాలలో - మేము, బాప్ దాదా ద్వారా ప్రాప్తించిన స్నేహానికి, శక్తిశాలి పాలనకు మరియు తరగని అవినాశీ ఖజానాలకు తప్పకుండా రిటర్న్ ఇవ్వాలి, అనే దృఢ సంకల్పముంది. రిటర్న్ లో ఏమిస్తారు? హృదయంలోని స్నేహం తప్ప మీ వద్ద ఇంకేమి ఉంది? మీ వద్ద ఉన్నదంతా బాబా ఇచ్చిందే, దానినేమి ఇస్తారు. బాబా సమానంగా అవ్వడమే రిటర్న్ ఇవ్వడము. ఇది అందరూ చేయగలరు.

ఈ మధ్యన అందరి హృదయాలలో విశేషంగా బ్రహ్మాబాబా స్మృతి ఎక్కువగా ఇమర్జ్ అయి ఉండడాన్ని బాప్ దాదా చూసారు. దేహపు స్మృతి కాదు, వారి చరిత్ర యొక్క విశేషతల స్మృతి ఉంది. ఎందుకంటే అలౌకిక బ్రాహ్మణ జీవితమనగా జ్ఞాన స్వరూప జీవితము. జ్ఞాన స్వరూపులుగా ఉన్న కారణంగా దేహపు స్మృతి కూడా దుఃఖపు అలను తీసుకురాదు. అజ్ఞానీ జీవితంలో ఎవరినైనా గుర్తు చేసుకున్నప్పుడు, వారి దేహము ఎదురుగా వస్తుంది మరియు దేహపు సంబంధం ఉన్న కారణంగా దుఃఖము అనుభవమవుతుంది. కానీ బ్రాహ్మణ పిల్లలైన మీకు తండ్రి స్మృతి కలగగానే, మేము కూడా ‘‘బాబా సమానంగా’’ అవ్వాల్సిందే అనే సమర్థత వస్తుంది. అలౌకిక తండ్రి స్మృతి, సమర్థతను అనగా శక్తిని ఇస్తుంది. కొంతమంది పిల్లలు తమ హృదయంలోని స్నేహాన్ని నయనాల నుండి వచ్చే ముత్యాల ద్వారా వ్యక్తపరుస్తున్నారు. అది దుఃఖపు కన్నీరు కాదు, వియోగం యొక్క కన్నీరు కాదు, అవి స్నేహపు ముత్యాలు. హృదయపూర్వక మిలనము యొక్క స్నేహము. మీరు వియోగులు కాదు, మీరు రాజయోగులు ఎందుకంటే హృదయపూర్వక సత్యమైన స్నేహము - నేను ముందు త్వరత్వరగా బాబాకు రిటర్న్ ఇవ్వాలి - అనే శక్తిని ఇప్పిస్తుంది. రిటర్న్ ఇవ్వడం అనగా సమానంగా అవ్వడము. ఈ విధి ద్వారానే తమ స్నేహీ అయిన బాప్ దాదాతో పాటు స్వీట్ హోమ్ కు రిటర్న్ అవుతారు అనగా వారితో పాటు తిరిగి వెళ్తారు. రిటర్న్ చేయాలి కూడా మరియు బాబాతో పాటు రిటర్న్ వెళ్ళాలి కూడా. అందుకే, మీ స్నేహము మరియు స్మృతి ప్రపంచానికి అతీతంగా మరియు బాబాకు ప్రియంగా చేస్తుంది.

బాప్ దాదా పిల్లల్లో సమర్థంగా అవ్వాలనే సంకల్పాన్ని, సమానంగా అవ్వాలనే ఉల్లాసాన్ని చూస్తున్నారు. బ్రహ్మాబాబా యొక్క విశేషతలను చూస్తున్నారు. ఒకవేళ బ్రహ్మాబాబా విశేషతలను వర్ణిస్తే ఎన్ని ఉంటాయి? ప్రతి అడుగులోనూ విశేషతలు ఉండేవి. వారి సంకల్పాలలో కూడా ప్రతి సమయం, అందరినీ విశేషంగా తయారుచేయాలనే ఉల్లాస-ఉత్సాహాలు ఉండేవి. వారి వృత్తి ద్వారా ప్రతి ఆత్మను ఉల్లాస-ఉత్సాహాల్లోకి తీసుకొచ్చే విశేషతను సదా ప్రత్యక్ష రూపంలో చూసారు. మాటలతో ధైర్యాన్ని అందించేవారు, నిరాశలో ఉన్నవారిని ఆశావాదులుగా చేసేవారు, నిర్బల ఆత్మలను ఎగిరే కళ యొక్క విధితో ఎగిరేలా చేసేవారు, సేవకు యోగ్యులుగా చేసేవారు, వారి ప్రతి మాట అమూల్యంగా, మధురంగా, యుక్తియుక్తంగా ఉండేది. అలాగే కర్మల్లో, ప్రతి కర్మలోనూ పిల్లలకు సహచరునిగా ఉంటూ వారిని కర్మయోగులుగా తయారుచేసారు. కేవలం సాక్షీగా ఉంటూ చూడడం కాదు, కానీ స్థూల కర్మకు గల మహత్వాన్ని అనుభవం చేయించేందుకు కర్మలో కూడా సహచరునిగా అయ్యారు. ‘నేను ఎటువంటి కర్మను చేస్తానో, నన్ను చూసి పిల్లలు స్వతహాగానే చేస్తారు’ - ఈ పాఠాన్ని సదా కర్మలు చేస్తూ చదివించారు. సంబంధ-సంపర్కంలో, చిన్న పిల్లలతో పిల్లల సమానంగా అయి సంతోషపరిచారు. వానప్రస్థులను కూడా వానప్రస్థ రూపంతో అనుభవీగా అయి సంబంధ-సంపర్కం ద్వారా సదా ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకొచ్చారు. పిల్లలతో పిల్లల రూపము, యువతతో యువకుని రూపము, వృద్ధులతో వృద్ధుని రూపంలో ఉంటూ వారిని సదా ముందుకు తీసుకువెళ్ళారు, సదా సంబంధ-సంపర్కం ద్వారా ప్రతి ఒక్కరికీ ‘బాబా నా వారు’ అనే అనుభవం చేయించారు. చిన్న బాలుడు కూడా ‘బాబా నన్ను ఎంతగా ప్రేమిస్తారో, అంతగా ఎవ్వరినీ ప్రేమించరు’ అని అంటాడు. కనుక ప్రతి ఒక్కరికీ ఎంత ప్రేమను ఇచ్చారంటే, ఇక ప్రతి ఒక్కరు ‘బాబా నా వారు’ అని భావించేవారు. ఇది సంబంధ-సంపర్కంలోని విశేషత. ఇతరులను చూసినప్పుడు, ప్రతి ఆత్మలోని విశేషతలను మరియు గుణాలను చూసారు. ఆలోచించే విషయంలో కూడా చూడండి - ఫలానా వారు చివరి నంబరు పూస అని తెలిసినా కానీ, అలాంటి ఆత్మ పట్ల కూడా వీరు సదా ముందుకు వెళ్ళాలి అనే భావనతో ప్రతి ఆత్మ పట్ల శుభ చింతకులుగా ఉండేవారు. ఈ విశేషతలను పిల్లలందరూ అనుభవం చేసారు. ఈ విషయాలన్నింటిలోనూ సమానంగా అవ్వడం అనగా ఫాలో ఫాదర్ చేయడము (తండ్రిని అనుసరించడము). ఈ విధంగా ఫాలో చేయడం కష్టమా? దీనినే స్నేహమని, దీనినే రిటర్న్ ఇవ్వడమని అంటారు. కనుక పిల్లలు ప్రతి ఒక్కరు ఇప్పటివరకు ఎంత రిటర్న్ ఇచ్చారు అనేది బాప్ దాదా చూస్తున్నారు. లక్ష్యమైతే అందరికీ ఉంది కానీ ప్రత్యక్ష జీవితంలో నంబరు ఉంటుంది. అందరూ నంబరు వన్ అవ్వాలని అనుకుంటారు. రెండు-మూడు నంబరు వారిగా అవ్వడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఈ లక్ష్యము శక్తిశాలిగా ఉంది మరియు బాగుంది కానీ లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా ఉండాలి - ఇదే సమానంగా అవ్వడము. దీని కోసం బ్రహ్మాబాబా, ధైర్యంతో ఏ మొదటి అడుగును వేశారు? ఈ అడుగు ద్వారానే ఆది నుండి పదమాపదమ భాగ్యశాలిగా అనుభవం చేసారు. ధైర్యం యొక్క మొదటి అడుగు - అన్ని విషయాలలో సమర్పణత. అంతా సమర్పణ చేసారు. ఏమవుతుంది, ఎలా అవుతుంది అనేది ఏమాత్రం ఆలోచించలేదు. ఒక్క సెకండులో బాబా తమ శ్రేష్ఠ మతము అనుసారంగా సూచన ఇచ్చారు - బాబా సూచన మరియు బ్రహ్మా కర్మ లేక అడుగు. దీనినే ధైర్యం యొక్క మొదటి అడుగు అని అంటారు. తనువును కూడా సమర్పించారు, మనసును కూడా సదా మన్మనాభవ విధి ద్వారా సిద్ధి స్వరూపంగా చేసుకున్నారు, అందుకే మనసు అనగా ప్రతి సంకల్పము సిద్ధించింది అనగా సఫలతా స్వరూపులుగా అయ్యారు. ధనాన్ని కూడా భవిష్యత్తు గురించి ఏ చింత లేకుండా, నిశ్చింతగా అయి ధనాన్ని సమర్పించారు, ఎందుకంటే ఇది ఇవ్వడం కాదు, పదమాల రెట్లు తీసుకోవడం అనే నిశ్చయముంది. అలాగే సంబంధాలను కూడా సమర్పించారు అనగా లౌకిక సంబంధాలను అలౌకికంలోకి పరివర్తన చేసారు. వాటిని వదిలేయలేదు, కళ్యాణం చేసారు, పరివర్తన చేసారు. మైపన్ (నేను, నాది) తో కూడిన బుద్ధిని, అభిమానంతో కూడిన బుద్ధిని సమర్పించారు. అందుకే, సదా తనువు, మనసు, బుద్ధి ద్వారా నిర్మలంగా, శీతలంగా, సుఖమునిచ్చేవారిగా అయ్యారు. లౌకిక పరివారం నుండి మరియు ప్రపంచంలోని ఎవరో తెలియని ఆత్మల నుండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా, సంకల్పంలో లేక స్వప్నంలో కూడా ఎప్పుడూ సంశయం యొక్క సూక్ష్మ స్వరూపం అనగా ‘సంకల్ప మాత్రంగా’ కూడా అలజడిలోకి రాలేదు.

బ్రహ్మాబాబా విషయంలో విశేషంగా ఏ అద్భుతమైన విషయం ఉండేదంటే - మీ అందరి ఎదురుగా సాకార రూపంలో బ్రహ్మాబాబా ఉదాహరణగా ఉండేవారు కానీ బ్రహ్మాబాబా ఎదురుగా సాకార ఉదాహరణగా ఎవ్వరూ లేరు. కేవలం స్థిరమైన నిశ్చయము మరియు బాబా శ్రీమతమే ఆధారంగా ఉండేవి. మీకైతే చాలా సులభము! ఎవరెంత వెనుక వచ్చారో, వారికి అంత సులభము! ఎందుకంటే అనేకమంది ఆత్మల పరివర్తన చెందిన శ్రేష్ఠ జీవితాలు మీ ముందు ఉదాహరణగా ఉన్నాయి. ఇది చేయాలి, ఇలా తయారవ్వాలి అనేది స్పష్టంగా ఉంది. అందుకే మీకు ‘ఎందుకు, ఏమిటి’ అనే ప్రశ్నలు వచ్చేందుకు అవకాశం లేదు. మీరు అంతా చూస్తున్నారు. కానీ బ్రహ్మా ఎదురుగా ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. ఏమి చేయాలి, మున్ముందు ఏమి జరగబోతుంది, రైట్ చేస్తున్నానా లేక రాంగ్ చేస్తున్నానా - ఇలాంటి సంకల్పాలు రావడం సంభవమే కాని వారు సంభవాన్ని అసంభవం చేసారు. ఒకే బలము, ఒకే నమ్మకము - ఈ ఆధారం ద్వారానే నిశ్చయబుద్ధి నంబరువన్ విజయీగా అయ్యారు. ఇటువంటి సమర్పణత కారణంగా బుద్ధి సదా తేలికగా ఉండేది, బుద్ధి పైన బరువు ఉండేది కాదు. మనసు నిశ్చింతగా ఉండేది. ముఖముపై సదా చింత లేని చక్రవర్తి చిహ్నాలను స్పష్టంగా చూసారు. 350 మంది పిల్లలు ఉన్నారు, భోజనం తయారుచేసేందుకు పిండి లేదు, మరియు సమయానికి పిల్లలకు భోజనం తినిపించాలి! ఆలోచించండి, ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా నిశ్చింతగా ఉండగలరా? ఒంటి గంటకు బెల్ కొట్టాలి, 11 గంటల వరకు పిండి లేదు, అలాంటప్పుడు ఎవరు నిశ్చింతగా ఉండగలరు? అలాంటి పరిస్థితిలో కూడా హర్షితంగా, అచంచలంగా ఉన్నారు. ఇది బాబా బాధ్యత, నాది కాదు. నేను బాబాకు చెందినవాడిని కనుక పిల్లలు కూడా బాబాకు చెందినవారు, నేను నిమిత్తము - ఇలాంటి నిశ్చయంతో నిశ్చింతగా ఎవరు ఉండగలరు? మనసు-బుద్ధి ద్వారా సమర్పితమైన ఆత్మ ఉండగలదు. ఏమవుతుందో తెలియదు, అందరూ ఆకలితో ఉండిపోరు కదా, ఇదైతే జరగదు కదా, అదైతే జరగదు కదా - అని తన బుద్ధిని నడిపించి ఇలాంటి వ్యర్థ సంకల్పాలకు మరియు సంశయానికి అవకాశమున్నా కానీ, బాబా రక్షకుడు, కళ్యాణకారి అనే సమర్థ సంకల్పాలే నడిచాయి. ఇదే సమర్పణతకు ఉన్న విశేషత. ఎలాగైతే బ్రహ్మాబాబా సమర్పణ అయ్యేందుకు ‘ధైర్యము’ అనే మొదటి అడుగును వేసారో, అలా ఫాలో ఫాదర్ చేయండి. నిశ్చయముంటే విజయం తప్పకుండా లభిస్తుంది. సమయానికి పిండి కూడా వచ్చింది, గంట కూడా మోగింది, అంతేకాక పాస్ కూడా అయ్యారు. దీనినే ప్రశ్నార్థకం అనగా వంకర మార్గాన్ని తీసుకోకుండా కళ్యాణమనే బిందువు పెట్టడమని అంటారు. ఫుల్ స్టాప్. ఈ విధి ద్వారానే సహజం కూడా అవుతుంది మరియు సిద్ధి కూడా ప్రాప్తిస్తుంది. ఇది బ్రహ్మా యొక్క అద్భుతము. ఈ రోజు మొదటి అడుగు గురించి వినిపించాను. చింత అనే బరువు నుండి కూడా నిశ్చింతగా అవ్వండి. దీనినే స్నేహానికి రిటర్న్ ఇవ్వడమని అంటారు. అచ్ఛా.

సదా ప్రతి అడుగులో తండ్రిని ఫాలో చేసేవారు, ప్రతి అడుగులో స్నేహానికి రిటర్న్ ఇచ్చేవారు, సదా నిశ్చయబుద్ధి కలవారిగా అయి నిశ్చింతగా, చింత లేని చక్రవర్తులుగా ఉండేవారు, మనసు, వాణి, కర్మ, సంబంధాలలో బాబా సమానంగా అయ్యేవారు, సదా శుభ చింతకులు, సదా ప్రతి ఒక్కరిలో విశేషతలను చూసేవారు, ప్రతి ఆత్మను సదా ముందుకు తీసుకువెళ్ళేవారు - ఇలాంటి బాబా సమానమైన పిల్లలకు స్నేహీ తండ్రి యొక్క స్నేహ సంపన్న ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో కలయిక - 1. స్వయాన్ని ఉన్నతోన్నతమైన తండ్రి యొక్క ఉన్నతోన్నతమైన బ్రాహ్మణాత్మలుగా భావిస్తున్నారా? బ్రాహ్మణులు అందరికన్నా ఉన్నతమైనవారని మహిమ చేయబడ్డారు. ఉన్నతమైనవారు అన్నదానికి గుర్తుగా బ్రాహ్మణులకు సదా పిలకను చూపిస్తారు. ప్రపంచంలోని వారు నామధారి బ్రాహ్మణులకు గుర్తుగా పిలకను చూపించారు. మీరు పిలకను పెట్టుకునేవారు కాదు కానీ పిలక స్థితిలో (ఉన్నత స్థితిలో) ఉండేవారు. వారు స్థూలమైన గుర్తును చూపించారు. వాస్తవానికి ఉన్నతమైన స్థితిలో ఉండేవారని అర్థము. బ్రాహ్మణులనే పురుషోత్తములని అంటారు. పురుషోత్తములు అనగా పురుషులలో ఉత్తములు, సాధారణ మనుష్యాత్మల కంటే ఉత్తములు. ఇలాంటి పురుషోత్తములే కదా. ఆత్మను కూడా పురుష్ అని అంటారు. శ్రేష్ఠ ఆత్మలుగా అయ్యేవారు అనగా పురుషులలో ఉత్తమ పురుషులుగా అయ్యేవారు. దేవతలను కూడా పురుషోత్తములని అంటారు ఎందుకంటే వారు దేవ-ఆత్మలు. మీరు దేవ-ఆత్మల కంటే ఉన్నతమైన బ్రాహ్మణులు - ఈ నషా సదా ఉండాలి. వేరే నషాలను తగ్గించమని అంటారు కానీ ఆత్మిక నషాను పెంచుకుంటూ వెళ్ళండని బాబా అంటారు ఎందుకంటే ఈ నషా నష్టం కలిగించేది కాదు, వేరే నషాలన్నీ నష్టం కలిగిస్తాయి. ఇది పైకి ఎక్కించేది, అవి కింద పడేసేవి. ఒకవేళ ఆత్మిక నషా దిగిపోతే పాత ప్రపంచం యొక్క స్మృతి కలుగుతుంది. నషా ఎక్కి ఉంటే కొత్త ప్రపంచం యొక్క స్మృతి కలుగుతుంది. ఈ బ్రాహ్మణ ప్రపంచం కూడా కొత్త ప్రపంచమే. సత్యయుగం కన్నా ఈ బ్రాహ్మణ ప్రపంచం అత్యంత శ్రేష్ఠమైనది. కనుక సదా ఈ స్మృతితో ముందుకు వెళ్తూ ఉండండి.

2. సదా స్వయాన్ని విశ్వ రచయిత అయిన తండ్రికి శ్రేష్ఠ రచనగా అనుభవం చేస్తున్నారా? బ్రాహ్మణ జీవితమంటే విశ్వ రచయిత యొక్క శ్రేష్ఠ రచన. ప్రతి ఒక్కరూ డైరెక్ట్ తండ్రి యొక్క రచన - ఈ నషా ఉందా? ప్రపంచంలోని వారైతే తెలియనితనంతో, మమ్మల్ని భగవంతుడు పుట్టించారని అంటారు. ఇంతకుముందు మీరు కూడా తెలియనితనంతో అనేవారు కానీ ఇప్పుడు, మేము శివవంశీ బ్రహ్మాకుమార-కుమారీలము అని తెలుసుకున్నారు. కనుక ఇప్పుడు జ్ఞానం ఆధారంగా, తెలివితో ‘మాకు భగవంతుడే జన్మనిచ్చారు, మేము ముఖవంశావళి’ అని అంటారు. డైరెక్ట్ గా తండ్రి బ్రహ్మా ద్వారా రచన రచించారు. కనుక మీరు బాప్ దాదాల లేక మాత-పితల రచన. మేము డైరెక్ట్ భగవంతుని రచన - అని ఇప్పుడు అనుభవంతో చెప్పగలరు. మరి భగవంతుని రచన ఎంత శ్రేష్ఠంగా ఉంటుంది! ఎటువంటి రచయితనో, అటువంటి రచన ఉంటుంది కదా. ఈ నషా మరియు ఖుషీ (సంతోషం) సదా ఉంటుందా? స్వయాన్ని సాధారణమైనవారిగా భావించడం లేదు కదా? ఈ రహస్యం బుద్ధిలోకి వచ్చినప్పుడు ఆత్మిక నషా మరియు ఖుషీ సదా ముఖంపై మరియు నడవడికలో స్వతహాగా ఉంటాయి. ఎవరికైనా మీ ముఖాన్ని చూస్తూనే, నిజంగా వీరు శ్రేష్ఠ రచయిత యొక్క రచన అని అనుభవమవ్వాలి. ఎవరైనా రాజుకు రాజకుమార్తె ఉంటే, ఆమె నడవడిక ద్వారా ఆమె రాయల్ కుటుంబానికి చెందినవారిని తెలిసిపోతుంది. ఫలానావారు షావుకారు కుటుంబానికి చెందినవారు, ఫలానావారు సాధారణ కుటుంబానికి చెందినవారని తెలుస్తుంది. అలా మీ నడవడిక మరియు ముఖము ద్వారా, వీరు ఉన్నతమైన రచన, ఉన్నతమైన తండ్రి పిల్లలని అనుభవమవ్వాలి.

కుమారీలతో - కన్యలు 100 మంది బ్రాహ్మణుల కంటే ఉత్తమమని మహిమ చేయబడ్డారు. ఈ మహిమ ఎందుకుంది? ఎందుకంటే స్వయం ఎంత శ్రేష్ఠంగా ఉంటారో, ఇతరులను కూడా అంత శ్రేష్ఠంగా తయారుచేయగలరు. కనుక శ్రేష్ఠమైన ఆత్మలమనే సంతోషం ఉంటుందా? కుమారీలు సేవాధారులుగా అయి సేవలో ముందుకు వెళ్తూ ఉండండి ఎందుకంటే ఈ సంగమయుగము కొంత సమయానికి మాత్రమే ఉండే యుగము. ఇందులో ఎవరెంత చేసుకోవాలనుకుంటే అంత చేసుకోవచ్చు. మరి శ్రేష్ఠ లక్ష్యము మరియు శ్రేష్ఠ లక్షణాలు కలిగిన వారే కదా? ఎక్కడైతే లక్ష్యము మరియు లక్షణాలు శ్రేష్ఠంగా ఉంటాయో, అక్కడ ప్రాప్తి కూడా సదా శ్రేష్ఠంగా అనుభవమవుతుంది. ఈ ఈశ్వరీయ జీవితానికి ఫలితంగా ‘సంతోషం మరియు శక్తి’ - ఈ రెండింటినీ సదా అనుభవం చేస్తున్నారా? ప్రపంచంలో సంతోషం కోసం ఖర్చు చేస్తారు కానీ అది ప్రాప్తించదు. ఒకవేళ ప్రాప్తించినా, అది అల్పకాలానికి ఉంటుంది, అంతేకాక ఆ సంతోషంతో పాటు దుఃఖం కూడా ఉంటుంది. కానీ మీ జీవితం సదా సంతోషమయ జీవితంగా అయింది. ప్రపంచంలోనివారు సంతోషం కోసం తపిస్తున్నారు మరియు మీకు సంతోషమనేది ప్రత్యక్ష ఫలం రూపంలో లభిస్తుంది. సంతోషమే మీ జీవితం యొక్క విశేషత. సంతోషం లేకపోతే జీవితమే లేదు. సదా మీ ఉన్నతిని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు కదా? కుమారీలు సమయానికి రక్షించబడ్డారని బాప్ దాదాకు సంతోషం కలుగుతుంది, లేదంటే ఉల్టా మెట్లు ఎక్కి మళ్ళీ దిగాల్సి వచ్చేది. ఎక్కాలి, దిగాలి అంటే శ్రమ కదా. చూడండి, ప్రవృత్తిలో ఉండేవారైనా సరే, బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలనే పిలిపించుకోవాల్సి ఉంటుంది, బ్రహ్మా అధర్ కుమార్ అని అనరు కదా. ఎంతైనా వారు కూడా కుమార్-కుమారీలుగా అయ్యారు కదా. వారైతే మెట్లు దిగారు, మీకు దిగవలసిన అవసరం ఉండదు, మీరు చాలా భాగ్యశాలి, సమయానికి బాబా లభించారు. కుమారీయే పూజించబడుతుంది. కుమారీ, గృహస్థిగా అయినప్పుడు మేక వలె అందరి ముందు తల వంచుతూ ఉంటుంది. కనుక రక్షించబడ్డారు కదా. కావున సదా స్వయాన్ని ఇలాంటి భాగ్యశాలిగా భావిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. అచ్ఛా.

మాతలతో - అందరూ శక్తిశాలి మాతలే కదా? బలహీనులైతే కాదు కదా? బాప్ దాదా మాతల నుండి ఏమి కోరుకుంటారు? ఒక్కొక్క మాత ‘జగన్మాత’గా అయి విశ్వ కళ్యాణం చేయాలి. కానీ మాతలు చతురతతో పని చేస్తారు. లౌకిక పని ఉన్నప్పుడు ఎవరో ఒకరిని నిమిత్తంగా పెట్టి వెళ్ళిపోతారు కానీ ఈశ్వరీయ కార్యం ఉన్నప్పుడు - పిల్లలున్నారు, ఎవరు సంభాళిస్తారు అని అంటారు. పాండవులకైతే బాప్ దాదా చెప్తున్నారు - మీరు సంభాళించాలి ఎందుకంటే మీరు రచయితలు. పాండవులు శక్తులను ఫ్రీ చేయాలి. డ్రామానుసారంగా వర్తమాన సమయంలో మాతలకు ఛాన్స్ లభించింది కనుక మాతలను ముందుంచాలి. ఇప్పుడింకా చాలా సేవ చేయాల్సి ఉంది. పూర్తి విశ్వాన్ని పరివర్తన చేయాలన్నప్పుడు సేవను ఎలా పూర్తి చేస్తారు? తీవ్ర గతి కావాలి కదా? కనుక పాండవులు శక్తులను ఫ్రీ చేస్తే సేవాకేంద్రాలు తెరవబడతాయి మరియు శబ్దము మారుమోగుతుంది. అచ్ఛా..

Comments