22-01-1986 అవ్యక్త మురళి

22-01-1986         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

"బాప్ దాదా ఆశ - సంపూర్ణంగా మరియు సంపన్నంగా అవ్వండి"

ఈ రోజు విశేషంగా దూరదేశవాసి, దూరదేశీ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఇంత దూరము నుండి కలుసుకునేందుకు వచ్చారు. ఇంత దూరము నుండి ఏ తపనతో వస్తారు? బాప్ దాదాకు పిల్లల తపన గురించి తెలుసు. ఒకవైపు మనసుతో మిలనం యొక్క తపన ఉంది. రెండవ వైపు తండ్రిని కలుసుకునేందుకు ధైర్యం కూడా ఉంచారు కనుక ఆ ధైర్యానికి ఫలితాన్ని విశేషమైన రూపంలో ఇచ్చేందుకు వచ్చారు. విశేషంగా కలుసుకునేందుకు వచ్చారు. డబల్ విదేశీ పిల్లలందరి స్నేహ సంకల్పాలు, మనసులో మిలనము చేయాలనే ఉల్లాసాన్ని అన్నివేళలా బాప్ దాదా చూస్తూ ఉంటారు మరియు వింటూ ఉంటారు. దూరంగా కూర్చుని ఉన్నా స్నేహము కారణంగా సమీపంగా ఉన్నారు. పిల్లలు పూర్తి రాత్రంతా మేల్కొని దృష్టి మరియు వైబ్రేషన్ల ద్వారా స్నేహాన్ని, శక్తిని ఎలా క్యాచ్ చేస్తారో బాప్ దాదా అన్నివేళలా చూస్తూ ఉంటారు. ఈ రోజు విశేషంగా మురళీని నడిపించేందుకు రాలేదు. మురళీలైతే చాలా విన్నారు - ఇప్పుడు బాప్ దాదా ఈ సంవత్సరం విశేషంగా ప్రత్యక్షతా స్వరూపాన్ని, బాప్ దాదా స్నేహానికి ఋజువునిచ్చే స్వరూపాన్ని, సంపూర్ణము మరియు సంపన్నంగా అయ్యే సమీపతా స్వరూపాన్ని, శ్రేష్ఠమైన సంకల్పాలు, శ్రేష్ఠమైన మాటలు, శ్రేష్ఠమైన కర్మలు, శ్రేష్ఠమైన సంబంధ-సంపర్కాలు కలిగిన శ్రేష్ఠమైన స్వరూపాన్ని చూడాలని కోరుకుంటున్నారు. ఏదైతే విన్నారో, వినడం మరియు స్వరూపంగా అవ్వడం - ఈ సమానతను చూడాలనుకుంటున్నారు. ప్రాక్టికల్ పరివర్తన యొక్క శ్రేష్ఠమైన సమారోహాన్ని చూడాలని అనుకుంటున్నారు. ఈ సంవత్సరంలో సిల్వర్, గోల్డన్ జుబ్లీలు జరుపుకున్నారు మరియు జరుపుకుంటారు కానీ బాప్ దాదా సత్యమైన, మచ్చలేని అమూల్యమైన వజ్రాల మాలను తయారుచేయాలని అనుకుంటున్నారు. ఒక్కొక్క అమూల్యమైన వజ్రము ఎలా ప్రకాశిస్తూ ఉండాలంటే దాని లైట్, మైట్ యొక్క మెరుపు కేవలం హద్దు వరకు కాదు, అనంతం వరకు వెళ్ళాలి. బాప్ దాదా, పిల్లల హద్దు సంకల్పాలు, హద్దు మాటలు, హద్దు సేవలు, హద్దు సంబంధాలు చాలాకాలం చూశారు కానీ ఇప్పుడు, అనంతమైన తండ్రి ఉన్నారు - అనంతమైన సేవల అవసరముంది. వాటి ముందు ఈ దీపాల వెలుగు ఏమనిపిస్తుంది? ఇప్పుడు లైట్ హౌస్, మైట్ హౌస్ గా అవ్వాలి. అనంతం వైపు దృష్టి ఉంచండి. మీ దృష్టి అనంతంగా అయినప్పుడే సృష్టి పరివర్తనవుతుంది. సృష్టి పరివర్తన అనే ఇంత గొప్ప కార్యాన్ని కొద్ది సమయంలో సంపన్నం చేయాలి. కనుక గతి, విధులు కూడా అనంతమైన వేగం కలవిగా ఉండాలి.

మీ వృత్తి ద్వారా దేశ, విదేశాల వాయుమండలంలో - అనంతమైన అధికారులు, విశ్వాధికారులు, అనంతమైన రాజ్యాధికారులు, అనంతమైన సత్యమైన సేవాధారులు, మా దేవాత్మలు వచ్చేశారు అన్న ఒక్క శబ్దము మారుమ్రోగాలి. ఇప్పుడు ఈ ఒక్క అనంతమైన శబ్దము దేశ విదేశాలలో మారుమ్రోగాలి. అప్పుడు సంపూర్ణత మరియు సమాప్తి సమీపంగా అనుభవమవుతాయి. అర్థమయిందా! అచ్ఛా.

నలువైపులా ఉన్న శ్రేష్ఠమైన భావన, శ్రేష్ఠమైన కామనలను పూర్తి చేసేవారికి, ఫరిశ్తాల నుండి దేవతలుగా అయ్యే ఆత్మలకు, సదా ఉన్నతమైన స్థితిలో స్థితులై ఉండే లైట్ హౌస్, మైట్ హౌస్ విశేషమైన ఆత్మలకు, బాప్ దాదా సూక్ష్మమైన సూచనలను అర్థం చేసుకునే విశాలబుద్ధి గల పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

దేశ - విదేశాలలోని పిల్లలందరికీ బాప్ దాదా సందేశము రూపంలో ప్రియస్మృతులను ఇచ్చారు

నలువైపులా ఉన్న స్నేహీ, సహయోగీ మరియు శక్తిశాలీ పిల్లల రకరకాల అలలతో కూడిన ఉత్తరాలు చూసి బాప్ దాదా స్నేహ సాగరంలో ఇమిడిపోయారు. అందరి రకరకాల అలలు వారి వారి ఉల్లాస-ఉత్సాహాల అనుసారం శ్రేష్ఠంగా ఉన్నాయి. బాప్ దాదా ఆ అలలను చూసి హర్షితమవుతారు. ఉల్లాసము కూడా చాలా బాగుంది, ప్లాన్లు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ప్రాక్టికల్ మార్కులు బాప్ దాదా నుండి తీసుకోవాలి, భవిష్య ఖాతాను జమ చేసుకోవాలి. ఈ సమయంలో బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరి ప్రాక్టికల్ కోర్సు మార్కులను నోట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం విశేషంగా ప్రాక్టికల్ కోర్సు మరియు ప్రాక్టికల్ ఫోర్సు యొక్క అదనపు మార్కులు తీసుకోవాలి కనుక సమయానుసారంగా ఏ సూచనలైతే లభించాయో ఆ సూచనలను ప్రతి ఒక్కరు నా కొరకే అని భావించి ప్రాక్టికల్ లోకి తీసుకొచ్చినట్లైతే మొదటి నంబరు తీసుకోగలరు. విదేశములోని పిల్లలైనా లేక దేశములోని పిల్లలైనా, ఎవరికైతే దూరంగా కూర్చుని ఉన్నా సమీప స్నేహము సదా అనుభవమవుతుందో మరియు సదా ఉల్లాసము ఉంటుందో, ఏదైనా చేసి చూపించాలి, ఇది చేయాలి, ఇలా చేయాలి... అనే ఈ ఉల్లాసము ఉంటే ఇప్పుడు అనంతమైన సేవకు ఋజువుగా అయి ఉల్లాసాన్ని ప్రాక్టికల్ లోకి తీసుకొచ్చేందుకు విశేషమైన ఛాన్స్ ఉంది. కనుక ఎగిరేకళలోకి వెళ్ళే రేస్ చేయండి. స్మృతిలో, సేవలో, దివ్య గుణమూర్తులుగా అవ్వడంలో, అలాగే జ్ఞానస్వరూపులుగా అయి జ్ఞాన చర్చను చేయడంలో, నాలుగు సబ్జెక్టులలో ఎగిరే కళ యొక్క రేసులో విశేషమైన నంబర్ తీసుకునేందుకు ఈ సంవత్సరం ఛాన్స్ ఉంది. ఈ విశేషమైన ఛాన్స్ తీసుకోండి. కొత్త అనుభవాన్ని చేయండి. నవీనతను ఇష్టపడతారు కదా. కనుక ఈ నవీనతను చేసి నంబరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ సంవత్సరంలో అదనంగా చేసే రేసుకు అదనపు మార్కులున్నాయి. అదనపు సమయం లభించింది. పురుషార్థమనుసారంగా ప్రారబ్దమైతే సదా ఉండనే ఉన్నది. కానీ ఈ సంవత్సరం విశేషంగా అదనపు మార్కులు లభించే సంవత్సరం కనుక చాలా బాగా ఎగిరే కళ యొక్క అనుభవీలుగా అయి ముందుకు వెళ్తూ ఇతరులను కూడా ముందుకు తీసుకువెళ్ళండి. బాబా పిల్లలందరి మెడలో బాహువుల మాలను వేస్తారు. హృదయాన్ని విశాలంగా చేసుకుంటే సాకారంలో వచ్చి చేరుకోవడం కూడా సహజమైపోతుంది. ఎక్కడైతే మనసుంటుందో అక్కడ ధనం రానే వస్తుంది. మనసు ధనాన్ని ఎక్కడో ఒకచోట నుండి తీసుకొస్తుంది కనుక మనసుంది కాని ధనం లేదు అని అంటే ఇది బాప్ దాదా ఒప్పుకోరు. మనసున్నవారికి ఏదో ఒక రకంగా టచింగ్ జరుగుతుంది మరియు వారు చేరుకుంటారు. కష్టపడి సంపాదించిన ధనం అయి ఉండాలి, కష్టపడి సంపాదించిన ధనం పదమాలరెట్ల లాభాన్నిస్తుంది. స్మృతి చేస్తూ చేస్తూ సంపాదిస్తారు కదా. కనుక స్మృతి ఖాతాలో జమ అవుతుంది మరియు చేరుకుంటారు కూడా. అచ్ఛా - అందరూ తమ తమ పేరు మరియు విశేషతలతో బాహువుల మాల సహితంగా ప్రియస్మృతులు స్వీకరించండి.

సిల్వర్ జూబ్లీలో వచ్చిన టీచర్ అక్కయ్యల కోసంఅవ్యక్త మహావాక్యాలు

అందరూ సిల్వర్ జూబ్లీని జరుపుకున్నారా! అవ్వాల్సిందేమో గోల్డెన్ యుగము వారిగా, సిల్వర్గా అయితే అవ్వవద్దు కదా! గోల్డెన్ యుగము వారిగా అయ్యేందుకు ఈ సంవత్సరం ఏం ప్లాన్ తయారుచేశారు? సేవా ప్లాన్లు అయితే తయారుచేస్తూనే ఉంటారు కానీ స్వ పరివర్తన మరియు అనంతమైన పరివర్తన కోసం ఏం ప్లాన్ తయారుచేశారు? ఇలా చేయాలి అని అందరూ తమ తమ స్థానాల కొరకు ప్లాన్ అయితే చేస్తారు. కాని ఆది సమయంలోని నిమిత్తులు కనుక మీరు అనంతమైన ప్లాన్ చేసేవారు. మేము మొత్తం విశ్వానికంతా కళ్యాణం చేయాలి అని బుద్ధిలో ఇమర్జ్ అవుతుందా. ఇలా ఇమర్జ్ అవుతుందా? లేదా ఇది ఎవరి కార్యమో వారికే తెలుసు అని భావిస్తున్నారా! ఎప్పుడైనా అనంతం కోసం ఆలోచన వస్తుందా లేక మీ స్థానాల గురించే ఆలోచన ఉంటుందా? పేరే విశ్వకళ్యాణకారి, ఫలానా స్థానానికి కళ్యాణకారి అని అయితే అనరు కదా. కానీ అనంతమైన సేవ కోసం ఏం సంకల్పం నడుస్తుంది? అనంతమైన యజమానులుగా అవ్వాలి కదా. రాష్ట్రానికి యజమానులుగా అయితే అవ్వవద్దు. ఎప్పుడైతే సేవాధారి నిమిత్త ఆత్మలలో ఈ అల ఉత్పన్నమవుతుందో అప్పుడు ఆ అల ఇతరులలో కూడా ఉత్పన్నమవుతుంది. ఒకవేళ మీలో ఈ అల లేకపోతే ఇతరులలో కూడా రాజాలదు. కనుక సదా స్వయాన్ని అనంతమైన అధికారిగా భావించి అనంతమైన ప్లాన్లు తయారుచేయండి. మొట్టమొదటి ముఖ్యమైన విషయము - ఏ రకమైన హద్దు బంధనాలలోనూ బంధింపబడి అయితే లేరు కదా! బంధనముక్తులే అనంతమైన సేవలో సఫలమవుతారు. ఇక్కడే ఇది ప్రత్యక్షమవుతూ ఉంది, ఇంకా అవుతూ ఉంటుంది. కనుక ఈ సంవత్సరంలో ఏ విశేషత చూపిస్తారు? దృఢ సంకల్పమైతే ప్రతి సంవత్సరం చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా ఇటువంటి ఛాన్స్ ఉన్నప్పుడు అందులో కూడా దృఢ సంకల్పము చేస్తారు, ఇతరులతో కూడా చేయిస్తారు. కనుక దృఢ సంకల్పము తీసుకోవడం కూడా మామూలైపోయింది. చెప్పేందుకు దృఢ సంకల్పమని అంటారు కాని అది కేవలం సంకల్పము. ఒకవేళ దృఢంగా ఉంటే రెండవసారి తీసుకునే అవసరం రాదు. దృఢ సంకల్పమనే ఈ మాట సాధారణమైపోయింది. ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు - ఆ, దృఢ సంకల్పము చేస్తామని ఊరికే మాటవరుసకు అంటారు కాని ఇప్పుడు ఆలోచించడం మరియు చేయడం సమానంగా ఉండేలా ఏదైనా కొత్త సాధనాన్ని వెలికి తీయండి. ప్లాన్, ప్రాక్టికల్ రెండూ కలిసి ఉండాలి. ప్లాన్లు అయితే చాలా ఉన్నాయి కాని ప్రాక్టికల్ లో సమస్యలు కూడా వస్తాయి, శ్రమ కూడా అనిపిస్తుంది, ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి, జరుగుతూనే ఉంటాయి. కాని లక్ష్యమున్నప్పుడు ప్రాక్టికల్ లో సదా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా నవీనత కనిపించే విధంగా ప్లాన్ తయారుచేయండి. లేకపోతే ప్రతి సంవత్సరం కలుస్తారు, కానీ అంతా ఎప్పటిలాగే ఉందని అంటారు. ఒకరినొకరు అలాగే చూసుకుంటారు. మనసుకు ఇష్టపడేలా ఉండదు. ఎంత కోరుకుంటారో అంత జరగదు. అది ఎలా జరుగుతుంది? ఇందుకోసం, ఎవరైతే తమకుతాముగా ముందుకు వస్తారో, వారే అర్జునులు (జో ఓటే సో అర్జున్). ఒక్కరు నిమిత్తంగా అయినా ఇతరులలో కూడా ఉల్లాస-ఉత్సాహాలైతే రానే వస్తాయి. కనుక ఇంతమంది కలిశారు, అలాంటి ఏదైనా ప్రాక్టికల్ ప్లాన్ తయారుచేయండి. థియరీ పరీక్షలు కూడా ఉంటాయి, ప్రాక్టికల్ పరీక్షలు కూడా ఉంటాయి. ఎవరైతే ఆది నుండి నిమిత్తంగా అయ్యారో వారి భాగ్యమైతే శ్రేష్ఠంగా ఉండనే ఉన్నది. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారు?

దీనికోసం విశేషమైన అటెన్షన్ - ప్రతి కర్మ చేసేందుకు ముందు, నేను స్వయాన్ని సంపన్నంగా చేసుకుని, శ్యాంపుల్ గా (ఉదాహరణగా) అవ్వాలి అన్న ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి. ఏమవుతుందంటే, సంగఠన వలన లాభము కూడా ఉంటుంది, నష్టము కూడా ఉంటుంది. సంగఠనలో ఒకరినొకరు చూసి నిర్లక్ష్యము కూడా వస్తుంది మరియు సంగఠనలో ఒకరినొకరు చూసి ఉల్లాస-ఉత్సాహాలు కూడా వస్తాయి, రెండూ జరుగుతాయి. కనుక సంగఠనను నిర్లక్ష్యంతో చూడవద్దు. ఇప్పుడు ఇదొక పద్ధతైపోయింది, వీరు కూడా చేస్తారు, వీరు కూడా చేస్తారు, మేము కూడా చేస్తే ఏమవుతుంది, ఇలా నడుస్తూనే ఉంటుంది. కనుక సంగఠనలో ఈ నిర్లక్ష్యము వలన నష్టము జరుగుతుంది. సంగఠనలో శ్రేష్ఠంగా అయ్యేందుకు సహయోగం తీసుకోవడం వేరే విషయం. ఒకవేళ నేను చేయాలి, నేను చేసి ఇతరులతో చేయించాలి అన్న ఈ లక్ష్యము ఉన్నట్లయితే, అప్పుడు మీరు చేయాలన్నా, ఇతరులతో చేయించాలన్నా ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయి. మరియు పదే-పదే ఈ లక్ష్యాన్ని ఇమర్జ్ చేయాలి. ఒకవేళ కేవలం లక్ష్యముంచుకున్నా కూడా అది మర్జ్ అయిపోతుంది, ప్రాక్టికల్ లో జరగదు. కనుక లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు ఇమర్జ్ చేయండి. లక్ష్యాన్ని, లక్షణాలను కూడా పదే-పదే కలిపుకుంటూ వెళ్ళండి. అప్పుడు శక్తిశాలిగా అవుతారు. లేకుంటే సాధారణమైపోతారు. ఇప్పుడు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు, మేము సింపుల్ మరియు శ్యాంపుల్ గా అవ్వాలని భావించండి. ఈ సేవా ప్రవృత్తి వృద్ధినైతే పొందుతూ ఉంటుంది కాని ఈ ప్రవృత్తి, ఉన్నతిలో విఘ్నరూపంగా అవ్వకూడదు. ఒకవేళ ఉన్నతిలో విఘ్నరూపంగా అయితే దానిని సేవ అని అనరు. అచ్ఛా - చాలా పెద్ద గుంపుగానే ఉన్నారు. ఇంత చిన్న ఆటంబాంబు కూడా అద్భుతం చేసి చూపిస్తున్నప్పుడు, ఇంతమంది ఆత్మిక బాంబులు ఏం చెయ్యలేరు! స్టేజి పైకి వచ్చేవారు మీరే కదా! గోల్డెన్ జూబ్లీ వారైతే బ్యాక్ బోన్ గా అయ్యారు, ప్రాక్టికల్ గా స్టేజి పైకి వచ్చేవారు మీరే. ఎలాగైతే గోల్డెన్ జూబ్లీకి నిమిత్తమైన ఆత్మల స్నేహ సంగఠన కనిపిస్తుంది మరియు ఆ స్నేహ సంగఠన, సేవలో వృద్ధి మరియు సేవలో సఫలత యొక్క ప్రత్యక్ష ఫలితాన్ని చూపించింది. అలా ఏదైనా చేసి చూపించండి. ఇలా కోట రూపంలో ఉండే సంగఠనను తయారుచేయండి. ఎలాగైతే గోల్డెన్ జూబ్లీకి నిమిత్తమైన దీదీలు, దాదీలు స్నేహము మరియు సంగఠన శక్తికి ప్రత్యక్ష ఫలాన్ని చూపించారో, అలా మీరు కూడా ప్రత్యక్ష ఫలాన్ని చూపించండి. కనుక ఒకరికొకరు సమీపంగా రావాలంటే సమానంగా అవ్వవలసి వస్తుంది. సంస్కారాలైతే రకరకాలుగా ఉన్నాయి, ఉంటాయి కూడా. ఇప్పుడు జగదంబను చూడండి, బ్రహ్మాను చూడండి - సంస్కారాలు భిన్నంగానే ఉండేవి. ఇప్పుడు ఎవరైతే నిమిత్తమైన దీదీలు, దాదీలు ఉన్నారో వారి సంస్కారాలు కూడా ఒకే విధంగా అయితే లేవు కానీ సంస్కారాలను కలుపుకోవడం - ఇది స్నేహానికి ఋజువు. సంస్కారాలు కలిస్తే సంగఠన జరుగుతుందని అనుకోకండి. సంస్కారాలను కలుపుకోవడం ద్వారా సంగఠన దృఢంగా అవుతుంది. అచ్ఛా - ఇది కూడా జరిగిపోతుంది. ఒకటేమో సేవ, కానీ నిమిత్తంగా అవ్వడము, నిమిత్త భావంతో నడుచుకోవడము, ఇదే విశేషత. ఈ హద్దునే తొలగిపోవాలి కదా? దీని కొరకు ఆలోచించారు కదా - అందరినీ మార్చాలి. ఒక సెంటరు వారు మరో సెంటరుకు వెళ్ళాల్సి ఉంటుంది. అందరూ సిద్ధముగా ఉన్నారా? ఆర్డర్ వెలువడుతుంది. మీరు రెడియే కదా. మారడంలో లాభము కూడా ఉంది. ఈ సంవత్సరం ఈ కొత్త విషయం చేద్దాము. నష్టోమోహులుగా అయితే అవ్వాల్సిందే. త్యాగీ, తపస్వీగా అయినప్పుడు ఇది ఏముంది? త్యాగమే భాగ్యము. మరి భాగ్యము ముందు ఈ త్యాగమేముంది! ఆఫర్ చేసేవారికి బహుమతి లభిస్తుంది. మరి అందరూ ధైర్యవంతులే కదా! మార్పు అంటే మార్పు. ఎవ్వరినైనా చేయవచ్చు. ధైర్యముంటే ఇదేమంత పెద్ద విషయము. సరే, అయితే ఈ సంవత్సరం ఈ నవీనత చేద్దాము. ఇష్టమే కదా! ఎవరైతే ఎవరెడీ పాఠాన్ని ఆది నుండి చదివారో వారిలో ఈ శక్తి కూడా లోలోపల నిండి ఉంటుంది. ఏ ఆజ్ఞనైనా పాలన చేసే శక్తి స్వతహాగానే లభిస్తుంది కనుక సదా ఆజ్ఞాకారిగా అయ్యేందుకు శక్తి లభించి ఉంది. అచ్ఛా - సదా శ్రేష్ఠమైన భాగ్యముంది, భాగ్యము కారణంగా సహయోగము ప్రాప్తి అవుతూనే ఉంటుంది. అర్థమయిందా!

2. సేవ, వర్తమానాన్ని మరియు భవిష్యత్తును, రెండిటినీ శ్రేష్ఠంగా చేస్తుంది. సేవా బలం తక్కువేమీ కాదు. స్మృతి మరియు సేవ రెండిటిలో బ్యాలన్స్ ఉంటే సేవ, ఉన్నతిని అనుభవం చేయిస్తుంది. స్మృతిలో ఉంటూ సేవ చేయడం సహజమైపోవాలి. బ్రాహ్మణ జీవితం యొక్క నేచర్ ఏమిటి? స్మృతిలో ఉండడం. బ్రాహ్మణ జన్మ తీసుకోవడం అనగా స్మృతి అనే బంధనమును కట్టుకోవడము. ఎలాగైతే ఆ బ్రాహ్మణలు ఏదో ఒక గుర్తును కట్టుకుంటూ ఉంటారో, అలా ఈ బ్రాహ్మణ జీవితానికి గుర్తు - స్మృతి. స్మృతిలో ఉండడం సహజమైపోవాలి కనుక స్మృతి వేరుగా చేసాను, సేవ వేరుగా చేసాను, ఇలా కాదు, రెండూ కలిసే ఉండాలి. స్మృతి వేరుగా, సేవ వేరుగా చేసేంత సమయం ఎక్కడుంది. కనుక స్మృతి మరియు సేవ సదా కలిసే ఉండాలి. దీని ద్వారానే అనుభవీలుగా కూడా అవుతారు, సఫలతను కూడా ప్రాప్తిస్తుంది. అచ్ఛా.

Comments