21-11-1984 అవ్యక్త మురళి

21-11-1984         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

స్వదర్శనధారియే దివ్యదర్శనీయమూర్తి.

అవ్యక్త బాప్ దాదా తన స్వదర్శనచక్రధారి పిల్లలతో మాట్లాడుతున్నారు --

ఈరోజు బాప్ దాదా తన విశ్వ ప్రసిద్ధ స్వదర్శనధారి, దివ్యదర్శనీయ సిద్ధిస్వరూప పిల్లలను చూస్తున్నారు. స్వదర్శనధారులే విశ్వ దివ్య దర్శనీయులుగా అవుతారు. స్వదర్శనధారులుగా అవ్వకపోతే దివ్యదర్శనీయమూర్తిగా కూడా అవ్వరు. ప్రతి అడుగులో, ప్రతి సంకల్పంలో స్వదర్శనం ద్వారానే దివ్యదర్శనం చేయించగలుగుతున్నారు. స్వదర్శనం లేకపోతే దివ్యదర్శనం కూడా ఉండదు. స్వదర్శన స్థితిలో స్థితులై ఉండేవారు నడుస్తూ, తిరుగుతూ స్వతహాగా తమ దివ్య సంకల్పం, దివ్యదృష్టి, దివ్యమాట, దివ్యకర్మ ద్వారా ఇతరాత్మలకు కూడా దివ్యమూర్తిగా అనుభవం అవుతారు. సాధారణత కనిపించదు, దివ్యత కనిపిస్తుంది. కనుక వర్తమాన సమయంలో బ్రాహ్మణాత్మలకు దివ్యత యొక్క అనుభవం చేయించాలి. దేవతగా భవిష్యత్తులో అవుతారు. ఇప్పుడు దివ్యతా స్వరూపంగా అవ్వాలి. దివ్యతా స్వరూపం నుండి దేవతా స్వరూపంగా అవుతారు. ఫరిస్తా అంటే దివ్యతా స్వరూపం. దివ్యతాశక్తి సాధారణతను సమాప్తి చేసేస్తుంది. ఎంతెంతగా దివ్యతాశక్తి ప్రతి కర్మలో తీసుకువస్తారో అంతగానే అందరి మనస్సు నుండి, నోటి నుండి స్వతహాగానే వీరు దివ్యదర్శనీయమూర్తి అనే మాట వస్తుంది. అనేకమంది భక్తులు దర్శనం యొక్క అభిలాషతో ఉన్నారు, అటువంటి దర్శనం యొక్క అభిలాషతో ఉన్న ఆత్మల ఎదురుగా స్వయం దివ్యదర్శనీయమూర్తిగా ప్రత్యక్షం అయినప్పుడే సర్వాత్మలు దర్శనం చేసుకుని ప్రసన్నం అవుతారు. మరియు ప్రసన్నత కారణంగా దివ్యదర్శనీయ మూర్తి ఆత్మలపై ప్రసన్నత యొక్క పుష్పాల వర్షం కురిపిస్తారు. ప్రతి ఆత్మ ద్వారా ఇదే ప్రసన్నత యొక్క మాట వస్తుంది - జన్మ జన్మల నుండి ఏదైతే దాహం ఉందో లేదా ఆశ ఉందో ముక్తి పొందాలి అని లేదా ఒక మెరుపుతో కూడిన దర్శనం జరగాలి అని, ఈరోజు ముక్తి లేదా మోక్షం యొక్క అనేక జన్మల సంకల్పం పూర్తి అయ్యింది అని. లేదా దర్శనానికి బదులు దర్శనీయమూర్తి లభించింది అని. మా ఇష్ట దేవత మాకు లభించింది అని. ఈ కొద్ది సమయం ప్రాప్తి యొక్క నషా మరియు సంతోషంలో జన్మజన్మల దు:ఖాన్ని, బాధని మర్చిపోతారు. కొద్ది సమయం యొక్క ఈ సమర్ధస్థితి ఆత్మలకు శక్తిననుసరించి భావనకు ఫల స్వరూపంగా కొన్ని పాపాల నుండి కూడా ముక్తి చేస్తుంది. అందువలనే ఆత్మలు స్వయం శక్తిననుసరించి తేలికస్థితిని అనుభవం చేసుకుంటారు. అందువలనే పాపాలను హరించే దేవా మరియు పాపాలను తొలగించే దేవీ, శక్తి, జగత్ మాత అనే మాటలు తప్పకుండా మాట్లాడతారు. ఏ దేవీ లేదా దేవత దగ్గరికి వెళ్తున్న ఈ భావన మరియు నిశ్చయం పెట్టుకుంటారు, వీరు మా పాపాలు నాశనం చేస్తారు అని మరియు ఇప్పుడు అంతిమంలో దేవతలతో పాటు గురువులు కూడా నేను మీ పాపాలు నాశనం చేస్తాను అని భక్తులు కూడా ఈ నమ్మకంతోనే వారిని గురువుగా చేసుకుంటున్నారు. కానీ ఈ విధానం మీ దివ్యదర్శనీయ ఆత్మల ద్వారా ప్రత్యక్షరూపంలో జరిగినకారణంగానే స్మృతిచిహ్నం నడుస్తూ వచ్చింది. అలాగే తొందరలో ఈ దివ్యదృశ్యం విశ్వం ముందుకు రానే వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోండి - మేము దివ్యదర్శనీయమూర్తిగా, దర్శనాయోగ్యంగా, సర్వ శృంగార సంపన్నంగా అయ్యామా? అని. బాబా సమానంగా పాపకటేశ్వర స్వరూపంలో స్థితులయ్యారా? పాపకటేశ్వరులుగా మరియు పాపహరిణిలుగా ఎప్పుడు అవుతారంటే ఎప్పుడైతే స్మృతి యొక్క జ్వాలారూపంగా అవుతారో అప్పుడు అవుతారు. ఇలా అయ్యారా! దర్శనం కొరకు పరదా తెరుస్తారు, పరదా తొలగిస్తారు మరియు దర్శనం అవుతుంది. ఎటువంటి సంపన్నదర్శనీయమూర్తిగా అవ్వాలంటే సమయం యొక్క పరదా తెరవగానే దివ్యదర్శనీయమూర్తులైన మీరు ప్రత్యక్షంగా ప్రత్యక్షం అవ్వాలి. లేదా దివ్యదర్శనీయమూర్తులు ఇప్పటి వరకు సంపన్నంగా అలంకరించుకుంటున్నారా? దర్శనం అనేది సదా సంపన్న స్వరూపంలో ఉంటుంది. ఇలా తయారయ్యారా లేదా తయారవ్వాలా! లేదా సమయం వచ్చినప్పుడు తయారైపోతాము అని ఆలోచిస్తున్నారా! ఎవరైతే సమయానికి తయారవుతారో వారు తమ తయారీలోనే ఉంటారా లేదా దర్శనీయమూర్తిగా ఉంటారా? వారు స్వయం గురించి ఉంటారు కానీ విశ్వం గురించి ఉండరు. వారు స్వకళ్యాణకారులుగా ఉంటారు మరియు వీరు విశ్వకళ్యాణకారులుగా ఉంటారు. అంతిమ బిరుదు విశ్వకళ్యాణకారులు అని అంతేకానీ కేవలం స్వకళ్యాణకారులు అని కాదు. స్వకళ్యాణకారి నుండి విశ్వకళ్యాణకారులు. డబల్ పనిచేసేవారే డబల్ కిరీటధారులుగా అవుతారు. కేవలం స్వకళ్యాణకారులే డబల్ కిరీటధారులుగా కాలేరు. రాజ్యంలోకి వస్తారు కానీ రాజ్యాధికారిగా అవ్వరు. సమయానుసారం ఇప్పుడు పురుషార్ధం యొక్క వేగం తీవ్రంగా ఉండాలి. ఇప్పుడు స్మృతి శక్తిని మరింతగా పెంచుకోండి. ఇప్పుడు సాధారణ స్వరూపంలో ఉంది. అందువలన ఎప్పుడైనా పరిస్థితులకు వశమై మోసపోతారు. శక్తిశాలి స్మృతి యొక్క బట్టీలో ఉంటే రక్షణగా ఉంటారు. సేవా జంజాటం నుండి కూడా అతీతం అయిపోండి. ఎప్పుడైతే సేవలో ఎందుకు, ఏమిటి, నీవు, నేను నాది, నీది వస్తుందో అప్పుడు సేవ కూడా జంజాటం అయిపోతుంది. ఈ జంజాటం నుండి కూడా అతీతం అయిపోండి. సేవ వెనుక పడి స్వమానాన్ని మర్చిపోకండి. ఏ సేవలో అయితే శక్తిశాలి స్మృతి ఉండదో ఆ సేవలో సఫలత తక్కువగా ఉంటుంది మరియు స్వయాన్ని మరియు ఇతరులను కూడా ఎక్కువగా అలజడి చేస్తుంది. పేరుకి సేవ చేయండి కాదు కానీ పనికి వచ్చే సేవ చేయండి. దీనినే శక్తి సంపన్న సేవ అని అంటారు. ఎటువంటి నాజుకు సమయం రానున్నది అంటే ఆ సమయంలో స్మృతిశక్తియే రక్షణా సాధనం అవుతుంది. ఎలా అయితే స్థూల రూపంలో వర్తమాన సమయంలో మిలట్రీ రక్షణా సాధనం కదా! అదేవిధంగా స్మృతిశక్తి నలువైపుల సర్వ శస్త్రధారులకు రక్షణా సాధనం. అందువలనే సదా స్వయాన్ని, సేవా స్థానాన్ని మరియు కుటుంబం యొక్క స్థానాన్ని మరియు సేవాకేంద్రాలకు వచ్చే విద్యార్థులందరినీ స్మృతిశక్తి స్వరూపం యొక్క వృత్తి మరియు వాయుమండలంలోకి తీసుకురండి. ఇప్పుడు సాధారణ స్మృతి యొక్క స్థితి రక్షణా సాధనంగా అవ్వదు. ఓటమి మరియు యుద్ధం. మాయ యొక్క ఏదోక రకమైన ఓటమి మరియు వ్యక్తి మరియు వాయుమండలం యొక్క యుద్దం సాధారణ స్మృతి ఉన్నవారిని మోసంలోకి తీసుకువచ్చేస్తుంది. అందువలనే బాప్ దాదా పిల్లలందరికీ సైగ చేస్తున్నారు - శక్తిశాలి స్మృతి యొక్క వాయుమండలాన్ని తయారుచేయండి. దీనిద్వారా స్వయం కూడా రక్షణగా, బ్రాహ్మణాత్మల యొక్క సహయోగం మరియు ఇతర అజ్ఞానీ ఆత్మలకు కూడా మీ యొక్క శాంతి మరియు శక్తి యొక్క సహయోగం లభిస్తుంది. అర్థమైందా! మంచిది.

ఇలా సర్వ స్వదర్శనధారులకు, విశ్వం యొక్క దివ్యదర్శన ధారులకు, దివ్యతామూర్తులకు, సర్వుల భావనను సంపన్నం చేసేవారికి, సర్వులకు మాస్టర్ పాపకటేశ్వరులుగా అయ్యి పాపాలను హరించేవారికి, శాంతి, శక్తి దేవలకు, శ్రేష్టాత్మలకు బాప్ దాదా యొక్క శక్తి సంపన్న ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments