21-01-1987 అవ్యక్త మురళి

21-01-1987         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

స్వరాజ్యాధికారియే విశ్వరాజ్యాధికారి.  

రాజులకి రాజుగా తయారుచేసేటువంటి భాగ్యవిధాత భగవంతుడు స్వరాజ్యాధికారి అయ్యేటందుకు చాలా సమయం నుండి అభ్యాసం చేస్తున్న పిల్లలతో మాట్లాడుతున్నారు-
 
ఈరోజు భాగ్య విధాత తండ్రి తన యొక్క సర్వ శ్రేష్ట భాగ్యవంతులైన పిల్లలను చూస్తున్నారు. బాప్ దాదా ఎదురుగా ఇప్పుడు కేవలం ఈ సంఘటనే కాదు కానీ నలువైపుల ఉన్న భాగ్యవంతులైన పిల్లలందరూ ఎదురుగా ఉన్నారు. దేశంలో ఉన్నా, విదేశంలో ఏ మూల ఉన్నా కానీ అనంతమైన తండ్రి తన యొక్క అనంతమైన పిల్లలను చూస్తున్నారు. ఈ సాకార వతనంలో స్థానం యొక్క హద్దు వస్తుంది కానీ (బేహద్) అనంతమైన బాబా యొక్క దృష్టి యొక్క సృష్టి అనంతమైనది. బాబా యొక్క దృష్టిలో సర్వబ్రహ్మాణాత్మల సృష్టి నిండి ఉంది. కనుక ఆ దృష్టి యొక్క సృష్టిలో అందరు సన్ముఖంగా ఉన్నారు. భాగ్యవంతులైన పిల్లలను చూసి భాగ్యవిధాత భగవంతుడు సంతోషిస్తున్నారు. ఎలా అయితే పిల్లలు బాబాని చూసి సంతోషిస్తున్నారో అదేవిధంగా బాబా కూడా పిల్లలందరినీ చూసి సంతోషిస్తున్నారు. అనంతమైన తండ్రికి పిల్లలని చూసి ఆత్మిక సంతోషం మరియు గర్వంగా కూడా ఉంది - నా ఒక్కొక్క బిడ్డ ఈ విశ్వం ముందు విశేషాత్మల జాబితాలో ఉన్నారు అని. 16,000 మాలలో చివరి మణి అయినా కానీ బాబా దగ్గరికి రావటం ద్వారా, బాబా వారిగా అవ్వటం ద్వారా విశ్వం ముందు విశేషాత్మ. అందువలనే జ్ఞానం యొక్క విస్తారం తెలుసుకోలేక పోయినా లేదా వినిపించలేకపోయినా కానీ “బాబా” అనే మాట మనస్సుతో అంగీకరించి, మనస్సుతో ఇతరులకి చెప్పటం ద్వారా విశేషాత్మగా అయిపోయారు మరియు విశ్వం ముందు మహానాత్మ రూపంలో మహిమా యోగ్యంగా అయిపోయారు. ఇంత శ్రేష్టమైన మరియు సహజ భాగ్యం గురించి తెలుసుకుంటున్నారా? ఎందుకంటే “బాబా” అనే మాటే తాళంచెవి. దేనికి తాళంచెవి? సర్వ ఖజానాలకు మరియు శ్రేష్ట భాగ్యానికి తాళంచెవి. తాళంచెవి లభిస్తే కనుక భాగ్యం మరియు ఖజానా తప్పకుండా లభిస్తుంది. కనుక మాతలు మరియు పాండవులు అందరూ తాళంచెవిని పొందే అధికారి అయ్యారా? తాళంచెవి ఉపయోగించటం వస్తుందా లేదా అప్పుడప్పుడు ఉపయోగించటం రావటం లేదా? తాళంచెవి ఉపయోగించే విధి-మనస్సుతో తెలుసుకోవటం మరియు అంగీకరించటం. కేవలం నోటి ద్వారా అనటం ద్వారా తాళంచెవి ఉన్నా కానీ ఉపయోగించటం లేనట్లే. మనస్సుతో అనటం ద్వారా ఖజానాలు సదా హాజరవుతాయి. అనంతమైన ఖజానా కదా! అనంతమైన ఖజానా కనుకనే ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ అందరూ అధికారులే. తెరిచి ఉన్న ఖజానా మరియు నిండుగా ఉన్న ఖజానా. వెనుక వచ్చిన వారికి ఖజానా సమాప్తి అయిపోవటం అనేది ఉండదు. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారో అంటే బాబా వారిగా అయ్యారో మరియు భవిష్యత్తులో ఎంతమంది తయారయ్యేవారు ఉన్నారో వారికి అనేక రెట్లు ఎక్కువ ఖజానా ఉంది. అందువలనే బాప్ దాదా ప్రతి ఒక్క బిడ్డకు (గోల్డెన్ ఛాన్స్) స్వర్ణిమ అవకాశం ఇస్తున్నారు. ఎవరు ఎంత ఖజానా తీసుకోవాలంటే అంత విశాలహృదయంతో తీసుకోండి. దాత దగ్గర లోటు లేదు, తీసుకొనేవారి ధైర్యం మరియు పురుషార్థం పై ఆధారపడి ఉంటుంది. ఇంత మంది పిల్లలు కలిగిన తండ్రి మరియు ప్రతి ఒక్క బిడ్డ భాగ్యవంతులుగా ఉన్న తండ్రి మొత్తం కల్పంలో ఎవరు లేరు. అందువలనే చెప్పాను, ఆత్మిక తండ్రికి ఆత్మికనషా ఉంది అని. అందరికీ మధువనం రావాలి, బాబాని కలుసుకోవాలనే కోరిక పూర్తి అయ్యింది. భక్తి మార్గం యొక్క యాత్రల కంటే మధువనంలో విశ్రాంతిగా ఉండడానికి, కూర్చోవడానికి స్థలం దొరికింది కదా! మందిరాలలో అయితే నిలబడి, నిలబడి కేవలం దర్శనం మాత్రమే చేసుకుంటారు. ఇక్కడైతే విశ్రాంతిగా కూర్చున్నారు కదా! అక్కడైతే పరుగెత్తండి, పరుగెత్తండి లేదా నడవండి, నడవండి అంటారు మరియు ఇక్కడైతే విశ్రాంతిగా కూర్చోండి మరియు విశ్రాంతిగా స్మృతి యొక్క మజా జరుపుకోండి. సంగమయుగంలో సంతోషంగా జరుపుకోవడానికే వచ్చారు. కనుక ప్రతి సమయం నడుస్తూ, తిరుగుతూ, తింటూ,త్రాగుతూ సంతోషం యొక్క ఖజానాను జమ చేసుకున్నారా? ఎంత జమ చేసుకున్నారు? 21 జన్మలు విశ్రాంతిగా తినే విధంగా జమ చేసుకున్నారా? మధువనం అంటే విశేషంగా సర్వఖజానాలు జమ చేసుకునే స్థానం. ఎందుకంటే ఇక్కడ " ఒక బాబా తప్ప మరెవ్వరు లేరు" అనేది సాకార రూపంలో కూడా అనుభవం చేసుకుంటారు. అక్కడైతే బుద్ది ద్వారా అనుభవం చేసుకుంటారు కానీ ఇక్కడ ప్రత్యక్ష జీవితంలో కూడా బాబా మరియు బ్రాహ్మణ పరివారం తప్ప ఇక ఏదైనా కనిపిస్తుందా? ఒకే సంలగ్నత, ఒకే విషయాలు, ఒకే పరివారం మరియు ఏకరస స్థితి. ఇక ఏ రసన లేనే లేదు. చదువుకోవటం మరియు చదువు ద్వారా శక్తిశాలిగా అవ్వటం మధువనంలో ఇదే పని కదా! ఎన్ని క్లాస్లు చేస్తున్నారు? కనుక ఇక్కడ విశేషంగా జమ చేసుకునే సాధనం లభిస్తుంది. అందువలనే అందరు పరుగెత్తుకుంటూ వచ్చారు. బాప్ దాదా పిల్లలందరికీ విశేషంగా ఇదే స్మృతి ఇప్పిస్తున్నారు - సదా స్వరాజ్యాధికారి స్థితిలో ముందుకు వెళ్తూ ఉండండి. స్వరాజ్యాధికారి - ఇదే విశ్వరాజ్యధికారి అయ్యే గుర్తు. 

కొంతమంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేస్తూ బాబాని అడుగుతున్నారు. మేము భవిష్యత్తులో ఏమౌతాము, రాజు అవుతామా లేక ప్రజలు అవుతామా? అని. బాప్ దాదా పిల్లల ప్రశ్నకు జవాబు చెప్తున్నారు - స్వయాన్ని ఒక రోజు పరిశీలన చేసుకుంటే నేను రాజు అవుతానా, ప్రజలుగా అవుతానా, షావుకారుగా అవుతానా అనేది తెలిసిపోతుంది. మొదట అమృతవేళ ముఖ్యంగా మీ కార్యవ్యవహారాల ముగ్గురు అధికారులను, మీ సహయోగులను, మీ తోడుగా ఉండేవారిని పరిశీలన చేసుకోండి. అవి ఏమిటి? 1. మనస్సు అంటే సంకల్పశక్తి 2. బుద్ది అంటే నిర్ణయశక్తి 3. వెనుకటి సంస్కారాలు లేదా వర్తమాన శ్రేష్ట సంస్కారాలు. ఈ మూడు విశేషంగా కార్యవ్యవహారాలు చేస్తాయి. ఏవిధంగా అయితే ఈ రోజుల్లో రాజుకీ మహామంత్రి లేదా విశేషమంత్రి ఉంటారు వారి సహాయం ద్వారా రాజ్య కార్యవ్యవహారం జరుగుతుంది. సత్యయుగంలో మంత్రి ఉండరు. కానీ సమీప సంబంధీకులే తోడుగా ఉంటారు. మీ సహయోగులు అనుకోండి లేదా మంత్రి అనుకోండి ఏదైనా అనుకోండి కానీ ఈ 3 స్వ అధికారంతో నడుస్తున్నాయా? అనేది పరిశీలన చేసుకోండి. ఈ మూడింటిపై స్వరాజ్యం ఉందా లేదా వాటి అధికారంతో మీరు నడుస్తున్నారా? మనస్సు మిమ్మల్ని నడిపిస్తుందా లేదా మీరు మనస్సుని నడిపిస్తున్నారా? ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ సంకల్పం కావాలంటే ఆ సంకల్పం చేయగల్గుతున్నారా? బుద్ధిని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగిస్తున్నారా లేదా బుద్ది రాజు అయిన మిమ్మల్ని భ్రమింపచేస్తుందా? సంస్కారం మీ వశంలో ఉందా లేదా మీరు సంస్కారాల వశంలో ఉన్నారా? రాజ్యం అంటే అధికారం. రాజ్యాధికారి అంటే ఏ సమయంలో ఏ శక్తిని ఆజ్ఞాపిస్తే ఆ శక్తి విధిపూర్వకంగా పని చేయాలి. ఒక రోజు యొక్క దినచర్యలో పరిశీలన చేసుకుని చూడండి - ఈ మూడు మీరు చెప్పిన విధిపూర్వకంగా పని చేస్తున్నాయా లేదా మీరు ఒక విషయం చెప్తే అవి ఇంకొక విషయం చేస్తున్నాయా? ఎందుకంటే నిరంతరయోగి అంటే స్వరాజ్యాధికారి అయ్యేటందుకు విశేష సాధనాలే - మనస్సు, బుద్ది. మంత్రమే మన్మనాభవ. యోగాన్ని బుద్ధియోగం అని అంటారు. ఈ విశేష ఆధార స్థంభాలు మీ అధికారంలో లేవు, లేదా అప్పుడప్పుడు ఉంటున్నాయి లేదా అప్పుడప్పుడు ఉండటం లేదు, ఇప్పుడిప్పుడే ఉంటున్నాయి లేదా ఇప్పుడిప్పుడే ఉండటం లేదు లేదా మూడింటిలో ఒకటి అయినా తక్కువ అధికారంలో ఉంటే దాని ద్వారానే మేము రాజుగా అవుతామా లేక ప్రజలు అవుతామా? అని పరిశీలన చేసుకోండి. ఎక్కువ సమయం రాజ్యాధికారిగా అయ్యే సంస్కారమే ఎక్కువ సమయం భవిష్య రాజ్యాధికారిగా చేస్తుంది. ఒకవేళ అప్పుడప్పుడు అధికారిగా, అప్పుడప్పుడు వశీభూతం అయిపోతుంటే అర్దకల్పం అంటే పూర్తి రాజ్యాభాగ్యం యొక్క అధికారాన్ని పొందలేరు. సగం సమయం తర్వాత త్రేతాయుగీ రాజుగా అవుతారు, పూర్తి సమయం రాజ్యాధికారి అంటే రాజ్యం చేసే ఉన్నత కుటుంబీకుల సంబంధలో ఉండలేరు. మాటిమాటికి వశీభూతం అయ్యే సంస్కారం ఉంటే అధికారిగా ఉండరు కానీ రాజ్యాధికారుల రాజ్యంలో ఉంటారు. వారు ఎవరు అయ్యారు? వారు ప్రజలే అవుతారు. కనుక రాజుగా ఎవరౌతారు మరియు ప్రజలుగా ఎవరౌతారు అనేది అర్ధమైందా? మీ దర్పణంలోనే మీ అదృష్టమనే చిత్రాన్ని చూసుకోండి. ఈ జ్ఞానం అనేది దర్పణం (అద్దం). అందరి దగ్గర దర్పణం ఉంది కదా! కనుక మీ ముఖాన్ని చూసుకుంటున్నారు కదా! ఇప్పుడు ఎక్కువ సమయం అధికారిగా అయ్యే అభ్యాసం చేయండి. అంతిమంలో అయిపోతాము అని అనుకోకండి. ఒకవేళ అంతిమంలో తయారైతే అంతిమంలో ఒక జన్మే కొద్దిగా రాజ్యం చేస్తారు. ఇది కూడా స్మృతి ఉంచుకోవాలి - ఒకవేళ చాలా సమయం యొక్క అభ్యాసం ఇప్పటి నుంచి లేదు, లేదా ఆది నుండి అభ్యాసిగా అవ్వలేదు, ఆది నుంచి ఇప్పటివరకు ఈ విశేషకార్యకర్తలు మిమ్మల్ని వాటి అధికారంలో నడిపించుకుంటున్నాయి లేక అలజడి చేస్తున్నాయి అంటే మోసం చేస్తున్నాయి, లేదా దు:ఖం యొక్క అలని అనుభవం చేయిస్తున్నాయి అంటే అంతిమంలో కూడా మోసం చేసేస్తాయి.మోసం చేయటం అంటే దు:ఖం యొక్క అల అనుభవం అవుతుంది. అంతిమంలో కూడా పశ్చాత్తాపమనే దు:ఖం యొక్క అల వస్తుంది. అందువలనే బాప్ దాదా పిల్లలందరికి మరలా స్మృతి ఇప్పిస్తున్నారు - రాజుగా అవ్వండి మరియు మీ యొక్క విశేష సహయోగి కర్మచారులను లేదా కార్యవ్యవహారాల సహయోగులను మీ అధికారంతో నడిపించండి. అర్థమైందా! బాప్ దాదా ఇదే చూస్తున్నారు - ఎవరెవరు ఎంత న్వరాజ్యాధికారి అయ్యారు? అందరు ఏవిధంగా అవ్వాలనుకుంటున్నారు? రాజా అవ్వాలనుకుంటున్నారా? ఇప్పుడు స్వరాజ్యాధికారి అయ్యారా లేదా తయారవుతున్నాము, తయారైపోతాము అంటున్నారా? తయారైపోతాము అని ఇలా మనం చెప్తే బాబా కూడా రాజ్యభాగ్యం ఇవ్వటానికి కూడా చూస్తాను అంటారు. చెప్పాను కదా, చాలా సమయం యొక్క సంస్కారం ఇప్పటినుంచి కావాలి. చాలా సమయం యొక్క అభ్యాసం లేదు, కొద్ది సమయమే ఉంది కానీ ఇంత సమయం అభ్యాసిగా కాకుండా మరలా చివర్లో తయారైపోతాము అని అనుకున్నాము అని అంతిమ సమయంలో నిందించకండి. అందువలనే చెప్పాను - ఎప్పుడో కాదు, ఇప్పుడే అనాలి. ఎప్పుడో తయారవుతాము అనకూడదు, ఇప్పుడే జరగాలి మరియు తయారవ్వాలి అంతే. మీ పై మీరు రాజ్యం చేయండి, మీ సహయోగులపై రాజ్యం చేయటం ప్రారంభించకండి.

ఎవరికైతే స్వయంపై రాజ్యం ఉంటుందో, వారికి ఇప్పుడు కూడా స్నేహంతో లౌకిక లేదా అలౌకిక సహయోగులందరు అలాగే అని అంటూ హాజరైపోతారు, చిత్తం ప్రభూ! చిత్తం! అని అంటూ సహయోగిగా మరియు స్నేహిగా ఉంటారు. ఆజ్ఞాపించవలసిన అవసరం ఉండదు కానీ స్వయమే స్నేహి మరియు సహయోగి అయ్యి “అలాగే” (హాజీ) అనే పాఠాన్ని ప్రత్యక్షంలో చూపిస్తారు. ఎలా అయితే ప్రజలు రాజుకి సహయోగిగా, స్నేహిగా ఉంటారో అదే విధంగా మీ యొక్క సర్వకర్మేంద్రియాలు, విశేషశక్తులు సదా మీకు స్నేహిగా, సహయోగిగా ఉంటాయి మరియు దీని ప్రభావం మీ సేవా సహయోగులపై మరియు లౌకిక సంబంధీకులపై పడుతుంది. దైవీపరివారంలో అధికారి అయ్యి ఆజ్ఞాపించి నడిపించలేరు.స్వయం మీ కర్మేంద్రియాలను ఆజ్ఞలో ఉంచుకుంటే స్వతహాగానే మీరు ఆజ్ఞాపించే ముందే సహయోగులన్నీ మీ కార్యంలో సహయోగి అవుతాయి, అవే సహయోగి అయిపోతాయి. మీరు ఆజ్ఞాపించక్కర్లేదు, తమ సహయోగం తీసుకోమని అవే కోరతాయి. ఎందుకంటే మీరు స్వరాజ్యాధికారులు. ఎలా అయితే రాజుల ముందు కానుకలు అర్పణ చేస్తారో అలాగే స్వరాజ్యాధికారులైన మీ ముందు సహయోగం అనే కానుకలు స్వయమే అర్పణ చేస్తాయి. ఎందుకంటే రాజు అంటే దాత. దాత అంటే చెప్పవలసిన అవసరం ఉండదు మరియు అడగవలసిన అవసరం ఉండదు. ఇలా స్వరాజ్యధికారి అవ్వండి. ఈ మేళా కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. “ఓహో డ్రామా” అంటున్నారు కదా! ప్రపంచంలో వారు అప్పుడప్పుడు " అయ్యో డ్రామా” అప్పుడప్పుడు " ఓహో డ్రామా” అంటారు మరియు మీరు సదా ఏమంటున్నారు? ఓహోడ్రామా! ఓహో! ఏదైనా ప్రాప్తి లభిస్తుంటే ఆ ప్రాప్తి ముందు ఏది కష్టమనిపించదు. అదే విధంగా ఇంత మంది శ్రేష్టపరివారాన్ని కలుసుకునే ప్రాప్తి లభించింది. కనుక దీనిలో కష్టం కూడా కష్టం అనిపించదు. కష్టమనిపిస్తుందా? భోజనానికి నిల్చోవలసి వస్తుంది, భోజనం చేసేటప్పుడు కూడా ప్రభు యొక్క గుణాలని వర్ణన చేయండి మరియు క్యూ (వరస) లో నిల్చున్నప్పుడు కూడా ప్రభువు యొక్క గుణాలని వర్ణన చేయండి. ఇదే పని చేయాలి కదా! ఇప్పుడు ఇది రిహార్సల్ జరుగుతుంది ఇప్పుడైతే ఏమీ లేదు. ఇక ముందు ఇంకా వృద్ధి అవుతుంది కదా! ఆ విధంగా మిమ్మల్ని మీరు మలుచుకునే అలవాటు చేసుకోండి. ఏవిధమైన సమమయో ఆవిధంగా మిమ్మల్ని మీరు నడిపించుకోవాలి. క్రింద పడుకునే అలవాటు కూడా అయిపోయింది కదా! మంచం ఉంటేనే కానీ నిద్ర రాదు అనే విధంగా లేరు కదా? టెంట్లో ఉండే అలవాటు అయ్యింది కదా! బావుందా? చలిగా అనిపించటం లేదు కదా? వస్తుందా? ఇప్పుడు మొత్తం ఆబూ అంతా టెంట్ వేసేయమంటారా? టెంట్ లో పడుకోవటం బావుందనిపించిందా లేక గది కావాలా? మొట్టమొదట పాకిస్థాన్లో ఉన్నప్పుడు మహారథీలను కూడా పట్టాపైనే పడుకోపెట్టేవారు, జ్ఞాపకం ఉందా? ప్రసిద్ధ మహారథీగా ఉన్నవారిని కూడా హాల్ లో మూడు అడుగుల స్థలం ఇచ్చి పట్టాపై పడుకోమనేవారు. బ్రాహ్మణ పరివారం యొక్క వృద్ధి కూడా ఎక్కడి నుండి ప్రారంభమైంది? టెంట్ తోనే ప్రారంభమయ్యింది కదా! మొట్టమొదట్లో వచ్చిన వారు కూడా టెంట్ లోనే ఉన్నారు. టెంట్లో ఉండి మహాత్ములు (సెయింట్) అయిపోయారు. సాకారపాత్ర ఉన్నప్పుడు కూడా టెంట్ లోనే ఉన్నారు, మీరు కూడా అనుభవం చేసుకుంటారు కదా! ఈ పద్దతితో అందరూ సంతోషంగా ఉన్నారా? మంచిది, మరో పదివేల మందికి సరిపడా టెంట్ వేయించే ఏర్పాట్లు చేస్తారు. స్నానాల గదుల ఏర్పాట్లు గురించి అందరు ఆలోచిస్తున్నారు, అవి కూడా ఏర్పాటు అయిపోతాయి. హాల్ తయారైన తర్వాత అందరూ ఏమన్నారో గుర్తు ఉందా? ఇన్ని స్నానాల గదులను ఏం చేసుకుంటాం? అన్నారు. కానీ అవి కూడా ఇప్పుడు తక్కువ అయిపోయాయి కదా! ఎంత తయారుచేసినా కానీ తక్కువ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆఖరుకి బేహద్ లోకి వెళ్ళిపోవాలి. మంచిది. 

నలువైపుల నుండి పిల్లలు వచ్చారు. బేహద్ హాల్ అంతా అలంకరించబడింది. క్రింద కూడా కూర్చున్నారు. (రకరకాలైన స్థానాలలో కూర్చుని మురళి వింటున్నారు) ఇలా వృద్ధి అవ్వటం కూడా అదృష్టానికి గుర్తు. వృద్ది అయితే అయ్యింది. కానీ విధిపూర్వకంగా నడవాలి. మధువనానికి వచ్చాము, బాబాని కూడా చూసేసాము, మధువనం కూడా చూసేసాము ఇప్పుడు ఎలా కావాలంటే అలా నడిచేయవచ్చు అనుకోకండి. ఇలా చేయకూడదు. కొంతమంది పిల్లలు ఎలా ఉంటున్నారంటే మధువనం రానంత వరకు పక్కాగా ఉంటున్నారు ఎప్పుడైతే మధువనం చూసేసారో ఇక తర్వాత సోమరిగా అయిపోతున్నారు. ఇలా సోమరిగా అవ్వకూడదు. బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులగానే ఉండాలి. ఇది బ్రాహ్మణ జీవితం. కనుక జీవితం ఎంత వరకు ఉంటుందో అంత వరకు పక్కాగా ఉండాలి. ఇలా జీవితంగా తయారుచేసుకున్నారు కదా! జీవితంగా తయారు చేసుకున్నారా లేదా కొద్ది సమయం కొరకు బ్రాహ్మణులుగా అయ్యారా? సదా మీ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతలు వెంట ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ విశేషతల ద్వారా వర్తమానం మరియు భవిష్యత్తు కూడా శ్రేష్టంగా అవుతుంది. మంచిది. ఇక ఏమి మిగిలింది? టోలీ (ప్రసాదం) (వరదానం లభించలేదు) వరదాతకే పిల్లలుగా అయిపోయారు. వరదాత పిల్లలకి ప్రతి అడుగులో వరదాత ద్వారా వరదానాలు స్వతహాగానే లభిస్తూ ఉంటాయి. వరదానమే మీ యొక్క పాలన. వరదానాల యొక్క పాలన ద్వారానే పాలింపబడుతున్నారు. లేకపోతే ఏమిటి, ఆలోచించండి, ఇంత శ్రేష్ఠ ప్రాప్తి లభిస్తుంది, దీని కోసం ఏమి శ్రమ చేస్తున్నారు! శ్రమ లేకుండా లభించే దానినే వరదానం అంటారు. ఎంత శ్రమ చేస్తున్నారు మరియు ఎంత శ్రేష్ఠ ప్రాప్తిని పొందుతున్నారు! జన్మజన్మలకు ప్రాప్తికి అధికారి అయిపోయారు. ప్రతి అడుగులో వరదాత యొక్క వరదానం లభిస్తుంది మరియు సదా లభిస్తూనే ఉంటుంది. దృష్టి ద్వారా, మాట ద్వారా, సంబంధం ద్వారా వరదానమే వరదానం లభిస్తుంది. 

స్వరాజ్యాధికారులకు, ఎక్కువ సమయం యొక్క ప్రాప్తిని పొందే అభ్యాసి ఆత్మలకు, మొత్తం విశ్వంలో విశేషాత్మలకు, వరదాత యొక్క వరదానాల ద్వారా పాలింపపడే శ్రేష్టాత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments