20-01-1986 అవ్యక్త మురళి

20-01-1986         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

“పురుషార్థం మరియు పరివర్తన కోసం గోల్డెన్ ఛాన్స్ సంవత్సరం”

ఈ రోజు సమర్థుడైన తండ్రి తన సమర్థమైన పిల్లలను చూస్తున్నారు. ఈ సమర్థమైన ఆత్మలు అన్నిటికంటే అత్యంత గొప్ప సమర్థమైన కార్యం, విశ్వాన్ని నూతన శ్రేష్ఠమైన విశ్వంగా తయారుచేయాలనే దృఢసంకల్పం చేశారు. ప్రతి ఆత్మను శాంతిగా మరియు సుఖవంతంగా చేసే సమర్థమైన కర్తవ్యాన్ని చేయాలనే సంకల్పం చేశారు మరియు ఇదే శ్రేష్ఠమైన సంకల్పాన్ని తీసుకుని దృఢమైన నిశ్చయబుద్ధి కలవారిగా అయి కర్తవ్యాన్ని ప్రత్యక్ష రూపంలోకి తీసుకొస్తున్నారు. ఈ శ్రేష్ఠమైన కార్యం జరగాల్సిందే అని సమర్థవంతులైన పిల్లలందరికీ ఒకే శ్రేష్ఠమైన సంకల్పముంది. దీనికంటే ఎక్కువగా ఈ కార్యం జరిగే ఉంది అన్నది నిశ్చితం. కేవలం కర్మ మరియు ఫలం, పురుషార్థం మరియు ప్రారబ్ధం, నిమిత్తం మరియు నిర్మాణం, ఈ కర్మ సిద్ధాంతం అనుసారంగా నిమిత్తులుగా అయి కార్యం చేస్తున్నారు. విధి నిశ్చితమై ఉంది. కేవలం మీ శ్రేష్ఠ భావన ద్వారా, భావన యొక్క ఫలాన్ని అవినాశీగా ప్రాప్తి చేసుకునేందుకు నిమిత్తమై ఉన్నారు. ప్రపంచంలోని అజ్ఞానులైన ఆత్మలు - శాంతి కలుగుతుందా, ఏమి అవుతుంది, ఎలా అవుతుంది! ఏ ఆశ కనిపించడం లేదు. నిజంగానే అవుతుందా అని ఆలోచిస్తున్నారు, కాని మీరు - అవ్వడమేమిటి, జరిగే ఉంది అని అంటారు ఎందుకంటే కొత్త విషయమేమీ కాదు. అనేకసార్లు జరిగింది, అలాగే ఇప్పుడు కూడా జరిగే ఉంది. నిశ్చయబుద్ధి కలవారికి నిశ్చితమైన విధి గురించి తెలుసు. ఇంతటి అచంచలమైన నిశ్చయం ఎందుకుంది? ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణం ఎదుట ఇతర ఏ ప్రమాణం అవసరమే లేదు అని స్వ పరివర్తన అనే ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలుసుకున్నారు. దీనితోపాటు పరమాత్మ కార్యం సదా సఫలం అవ్వనే అవుతుంది. ఇది ఆత్మలు, మహాన్ ఆత్మలు లేక ధర్మాత్మల కార్యం కాదు. పరమాత్మ కార్యం సఫలం అవ్వనే అవుతుంది, ఇటువంటి నిశ్చయబుద్ధి కలవారు, నిశ్చితమైన భవిష్యత్తును తెలుసుకున్న నిశ్చింత ఆత్మలు. వినాశనమవుతుందని మనుష్యులు అంటారు లేక భయపడతారు, మీరు నూతన స్థాపన జరుగుతుందని నిశ్చింతగా ఉన్నారు. అసంభవానికి, సంభవానికి మధ్యన ఎంత వ్యత్యాసముంది. మీ ఎదురుగా సదా స్వర్ణిమ ప్రపంచం, స్వర్ణిమ సూర్యోదయం జరిగే ఉంది, అలాగే వారి ఎదురుగా వినాశనం యొక్క కారుమబ్బులు ఉన్నాయి. సమయం సమీపిస్తున్న కారణంగా ఇప్పుడు మీరందరూ సదా సంతోషమనే గజ్జెలను ధరించి, నేడు పాత ప్రపంచముంది, రేపు స్వర్ణిమ ప్రపంచముంటుంది అని నాట్యం చేస్తూ ఉంటారు. నేడు మరియు రేపు, ఇంత సమీపానికి చేరుకున్నారు.

ఇప్పుడు ఈ సంవత్సరం “సంపూర్ణత మరియు సమానత” ల సమీపతను అనుభవం చేయాలి. సంపూర్ణత, ఫరిశ్తాలైన మీ అందరినీ విజయమాల తీసుకొని ఆహ్వానిస్తూ ఉంది. విజయమాలకు అధికారులగా అయితే అవ్వాలి కదా. సంపూర్ణ తండ్రి మరియు సంపూర్ణ స్థితి, ఈ రెండూ పిల్లలైన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి - “రండి, శ్రేష్ఠమైన ఆత్మలూ రండి, సమానమైన పిల్లలూ రండి, సమర్థమైన పిల్లలూ రండి, సమానంగా అయి మీ స్వీట్ హోమ్ లో విశ్రాంతి తీసుకునేవారిగా అవ్వండి”. ఎలాగైతే బాప్ దాదా విధాత, వరదాతగా ఉన్నారో అలాగే మీరు కూడా ఈ సంవత్సరం విశేషంగా బ్రాహ్మణ ఆత్మల పట్ల లేక సర్వ ఆత్మల పట్ల విధాతగా అవ్వండి, వరదాతగా అవ్వండి. రేపు దేవతలుగా అవుతారు, ఇప్పుడు అంతిమ ఫరిశ్తా స్వరూపులుగా అవ్వండి. ఫరిశ్తా ఏం చేస్తుంది? వరదాతగా అయి వరదానాలను ఇస్తుంది. దేవతలు సదా ఇస్తారు, తీసుకోరు. వారిని లేవత (తీసుకునేవారు) అని అనరు. కనుక వరదాత మరియు విధాత, ఫరిశ్తా నుండి దేవత... ఇప్పుడీ మహామంత్రం - మేము ఫరిశ్తా నుండి దేవతలుగా అవుతాము - ఈ మంత్రాన్ని విశేషంగా స్మృతిస్వరూపంగా చేసుకోండి. మన్మనాభవగా అయితే అవ్వనే అయ్యారు, ఇది ఆది మంత్రం. ఇప్పుడీ సమర్థమైన మంత్రాన్ని అనుభవంలోకి తీసుకురండి. “ఇది జరగాలి, ఇది లభించాలి” అనే ఈ రెండు మాటలు తీసుకునేవారిగా తయారుచేస్తాయి, తీసుకునే సంస్కారాలు దేవతగా అయ్యేందుకు సమయం పట్టేలా చేస్తాయి, కావున ఈ సంస్కారాలను సమాప్తం చేయండి. మొదటి జన్మలో బ్రహ్మా ఇంటి నుండి దేవతగా అయి కొత్త జీవితం, కొత్త యుగంలో నంబర్ వన్ లోకి రండి. శకము కూడా 1-1-1 ఉండాలి. ప్రకృతి కూడా సతోప్రధానంగా, నంబర్ వన్ గా ఉండాలి. రాజ్యం కూడా నంబర్ వన్ గా ఉండాలి. మీ గోల్డెన్ స్థితి కూడా నంబర్ వన్ గా ఉండాలి. ఒక్క రోజు తేడా ఉన్నా 1-1-1 మారిపోతుంది. ఇప్పటి నుండే ఫరిశ్తా నుండి దేవతగా అయ్యేందుకు బహుకాలపు సంస్కారాన్ని ప్రాక్టికల్ కర్మలలో ఎమర్జ్ చేయండి ఎందుకంటే ఏదైతే బహుకాలమని గాయనముందో, ఆ బహుకాలపు సరిహద్దు ఇప్పుడు సమాప్తమవుతుంది. ఆ తేదీని లెక్కపెట్టకండి.

వినాశనాన్ని అంతిమ సమయమని అంటారు, ఆ సమయంలో బహుకాలపు అవకాశమైతే సమాప్తమైపోయి ఉంటుంది, పైగా కొంత సమయం యొక్క అవకాశం కూడా సమాప్తమైపోతుంది కావున బాప్ దాదా బహుకాలం సమాప్తమవుతుందని సూచననిస్తున్నారు. ఆ తర్వాత బహుకాలమని లెక్కపెట్టే అవకాశం సమాప్తమై కొంత సమయపు పురుషార్థం, కొంత సమయపు ప్రారబ్ధం అని ఇదే అనడం జరుగుతుంది. కర్మల ఖాతాలో ఇప్పుడు బహుకాలం సమాప్తమై కొంతకాలం లేక అల్పకాలం ప్రారంభమవుతూ ఉంది కావున ఈ సంవత్సరం పరివర్తన కాలం యొక్క సంవత్సరం. బహుకాలం నుండి కొంతకాలంలోకి పరివర్తన అవ్వనున్నది, కావున ఈ సంవత్సరం చేసే పురుషార్థంలో బహుకాలం యొక్క లెక్క ఎంత జమ చేసుకోవాలనుకుంటారో అంత చేసుకోండి. తర్వాత మేము నిర్లక్ష్యంతో నడిచామని ఫిర్యాదులు చేయకండి. ఈ రోజు కాకపోతే రేపు తప్పకుండా పరివర్తనవుతారు కావున కర్మల గతి తెలిసినవారిగా అవ్వండి. నాలెడ్జ్ఫుల్ గా అయి తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళండి. రెండు వేలు (2000 సంవత్సరం) అనే లెక్కని పెట్టుకుంటూ ఉండకండి. పురుషార్థం లెక్క వేరు మరియు సృష్టి పరివర్తన లెక్క వేరు. ఇంకా 15 సంవత్సరాలుంది, 18 సంవత్సరాలుంది అని ఇలా ఆలోచించకండి. 99 లో అవుతుంది... అని ఇలా ఆలోచిస్తూ ఉండిపోకండి. లెక్కను అర్థం చేసుకోండి. తమ పురుషార్థం మరియు ప్రారబ్ధపు లెక్కను తెలుసుకొని ఆ వేగంతో ముందుకు వెళ్ళండి. లేదంటే బహుకాలపు పాత సంస్కారాలు ఒకవేళ ఉండిపోయినట్లయితే ఈ బహుకాలపు లెక్క ధర్మరాజపురి ఖాతాలో జమ అయిపోతుంది. కొందరికి బహుకాలపు వ్యర్థం, అయథార్థ కర్మ-వికర్మల ఖాతా ఇప్పటికీ ఉంది, బాప్ దాదాకు తెలుసు కాని బయటకు చెప్పరు. కొద్దిగా పరదా వేసి ఉంచుతారు. కాని వ్యర్థం మరియు అయథార్థం అనే ఈ ఖాతా ఇప్పటికీ చాలా ఉంది కనుక ఈ సంవత్సరం ఎక్స్ ట్రా గోల్డెన్ ఛాన్స్ సంవత్సరం - ఎలాగైతే పురుషోత్తమ యుగం ఉన్నదో అలాగే ఇది పురుషార్థం మరియు పరివర్తనకు గోల్డెన్ ఛాన్స్ సంవత్సరం కావున విశేషంగా ధైర్యం మరియు సహయోగం లభించే ఈ విశేషమైన వరదానీ సంవత్సరాన్ని సాధారణ రీతిలో గడిచిన 50 సంవత్సరాల వలె పోగొట్టుకోకండి. ఇప్పటివరకు తండ్రి స్నేహసాగరునిగా అయి సర్వ సంబంధాల స్నేహంలో, నిర్లక్ష్యాన్ని, సాధారణమైన పురుషార్థాన్ని చూస్తూ-వింటున్నా కూడా వినకుండా, చూడకుండా పిల్లలకు స్నేహంతో అదనపు సహయోగం ద్వారా, అదనపు మార్కులిచ్చి ముందుకు తీసుకువెళ్తున్నారు. లిఫ్ట్ ఇస్తున్నారు. కాని ఇప్పుడు సమయం పరివర్తనవుతూ ఉంది కావున ఇప్పుడు కర్మల గతిని బాగా అర్థం చేసుకొని సమయం యొక్క లాభాన్ని తీసుకోండి. 18వ అధ్యాయం ప్రారంభమైపోయిందని వినిపించాను కదా. 18వ అధ్యాయం విశేషత - ఇప్పుడు స్మృతి స్వరూపులుగా అవ్వండి. ఇప్పుడే స్మృతి, ఇప్పుడే విస్మృతి కాదు. స్మృతి స్వరూపం అనగా బహుకాలపు స్మృతి స్వతహాగా మరియు సహజంగా ఉండాలి. ఇప్పుడు యుద్ధం చేసే సంస్కారం, శ్రమ పడే సంస్కారం, మనసును తికమకపెట్టుకునే సంస్కారం, వీటిని సమాప్తం చేయండి. లేకపోతే ఇవే బహుకాలపు సంస్కారాలుగా అయి అంతమతి సో భవిష్య గతిని ప్రాప్తి చేయించేందుకు నిమిత్తంగా అవుతాయి. ఇప్పుడు బహుకాలపు పురుషార్థపు సమయం సమాప్తమవుతూ ఉంది, అంతేకాక బహుకాలపు బలహీనతకు చెందిన లెక్క ప్రారంభమవుతూ ఉందని వినిపించాను కదా. అర్థమయిందా! కావున ఇది విశేషంగా పరివర్తన అయ్యే సమయం. ఇప్పుడు బాబా వరదాతగా ఉన్నారు, తర్వాత లెక్కలను తీసుకునేవారిగా అవుతారు. ఇప్పుడు కేవలం స్నేహపు లెక్కయే ఉంది. కావున ఏం చేయాలి! స్మృతి స్వరూపులుగా అవ్వాలి. స్మృతి స్వరూపం స్వతహాగానే నష్టోమోహులుగా చెయ్యనే చేస్తుంది. ఇప్పుడైతే మోహము యొక్క లిస్టు చాలా పెద్దదిగా అయిపోయింది. ఒకటేమో స్వయం యొక్క ప్రవృత్తి, ఇంకొకటి దైవీ పరివారపు ప్రవృత్తి, సేవా ప్రవృత్తి, హద్దు ప్రాప్తుల ప్రవృత్తి - వీటన్నింటి నుండి నష్టోమోహులుగా అనగా అతీతంగా అయి ప్రియంగా అవ్వండి. మైపన్ (నేను) అనగా మోహం, దీని నుండి నష్టోమోహులుగా అయినప్పుడే బహుకాలపు పురుషార్థం ద్వారా బహుకాలపు ప్రారబ్ధాన్ని ప్రాప్తి చేసుకునేందుకు అధికారులుగా అవుతారు. బహుకాలం అనగా ఆది నుండి అంతిమం వరకు ఉండే ప్రారబ్ధపు ఫలితం. వాస్తవానికి ప్రవృత్తి నుండి నివృత్తిగా అయ్యే ఒక్కొక్క రహస్యం కూడా మీకు బాగా తెలుసు, అంతేకాక ఆ విషయంపై బాగా ఉపన్యసించగలరు కూడా. కాని నివృత్తులుగా అవ్వడం అనగా నష్టోమోహులుగా అవ్వడం. అర్థమయిందా! పాయింట్లు అయితే మీ వద్ద బాప్ దాదా వద్దకంటే ఎక్కువగా ఉన్నాయి కావున పాయింట్లు ఏమి వినిపించాలి, పాయింట్లు అయితే ఉన్నాయి, ఇప్పుడు పాయింటుగా అవ్వండి. అచ్ఛా.

సదా శ్రేష్ఠ కర్మల ప్రాప్తి యొక్క గతి తెలిసినవారు, సదా బహుకాలపు తీవ్ర పురుషార్థం, శ్రేష్ఠమైన పురుషార్థపు శ్రేష్ఠ సంస్కారం కలవారు, సదా స్వర్ణిమ యుగ ఆదిరత్నాలు, సంగమయుగంలో కూడా ఆదిరత్నాలు, స్వర్ణిమ యుగంలో కూడా ఆదిరత్నాలు, ఇటువంటి ఆదిదేవుని సమానమైన పిల్లలకు, ఆది తండ్రి, అనాది తండ్రికి సదా ఆదిగా తయారవ్వాలనే శ్రేష్ఠమైన వరదానంతో కూడిన ప్రియస్మృతులు మరియు వీటితోపాటు సేవాధారి తండ్రి యొక్క నమస్తే.

దాదీలతో:- ఇంటి గేటును ఎవరు తెరుస్తారు? గోల్డెన్ జూబ్లీ వారు లేక సిల్వర్ జూబ్లీ వారు, బ్రహ్మాబాబాతో పాటు గేటునైతే తెరుస్తారు కదా. లేక వెనుక వస్తారా? తోడుగా వెళ్తే ప్రేయసిగా అయి వెళ్తారు, వెనుక వెళ్తే పెళ్ళి ఊరేగింపులో ఒకరిగా అయి వెళ్తారు. సంబంధీకులను కూడా ఊరేగింపు అనే అంటారు. సమీపంగా అయితే ఉన్నారు కానీ పెళ్ళి ఊరేగింపు వచ్చిందనే అంటారు. కనుక గేటు ఎవరు తెరుస్తారు? గోల్డెన్ జూబ్లీ వారా లేక సిల్వర్ జూబ్లీ వారా? ఎవరైతే ఇంటి గేటును తెరుస్తారో వారే స్వర్గం గేటును కూడా తెరుస్తారు. ఇప్పుడు వతనంలోకి వచ్చేందుకు ఎవ్వరినీ వద్దనరు. సాకారంలో అయితే సమయం మరియు పరిస్థితుల బంధనాలున్నాయి. వతనంలోకి వచ్చేందుకు ఏ బంధనమూ లేదు. ఎవ్వరూ ఆపరు, టర్న్ ఏర్పాటు చేసే అవసరం కూడా లేదు. అభ్యాసం ద్వారా ఇక్కడ శరీరంలో ఉంటూనే ఒక్క సెకండులో అంతా తిరిగి వచ్చామని అనుభవమవుతుంది. అంతః వాహక శరీరం ద్వారా తిరుగుతారనే గాయనమేదైతే ఉందో, లోపల ఉన్న ఆత్మ వాహనంగా అయిపోతుంది. ఎలా అనుభవం చేస్తారంటే - బటన్ నొక్కారు, విమానం ఎగిరింది, షికారు చేసి వచ్చారు, అంతేకాక ఇతరులు కూడా వీరు ఇక్కడ ఉంటున్నా ఇక్కడ లేరు అని అనుభవం చేస్తారు. ఎలాగైతే సాకారంలో చూశారు కదా – మాట్లాడుతూ-మాట్లాడుతూ కూడా సెకండులో ఇక్కడ ఉంటారు, మళ్ళీ ఇప్పుడే ఉండరు. ఇప్పుడిప్పుడే ఉంటారు, ఇప్పుడిప్పుడే ఉండరు. ఇది అనుభవం చేశారు కదా. ఇలా అనుభవం చేశారు కదా. ఇందులో కేవలం స్థూలమైన విస్తారాన్ని సర్దుకునే అవసరముంది. ఎలాగైతే సాకారంలో చూశారు, ఇంత విస్తారం ఉన్నా అంతిమ స్థితి ఎలా ఉంది? విస్తారాన్ని సర్దుకుని, ఉపరామంగా ఉండే స్థితి ఉండేది. ఇప్పుడిప్పుడే స్థూలమైన డైరెక్షన్ ఇస్తున్నారు, ఇప్పుడిప్పుడే అశరీరి స్థితిని అనుభవం చేయిస్తున్నారు. కావున ఈ సర్దుకునే శక్తి యొక్క ప్రత్యక్షతను చూశారు. మీరు కూడా, బాబా ఇక్కడ ఉన్నారా లేరా, వింటున్నారా లేక వినడం లేదా అని అనేవారు. కాని ఆ తీవ్రమైన స్థితి ఎలా ఉంటుందంటే ఏ కార్యాన్ని మిస్ చేయరు. మీరు ఏదైనా విషయాన్ని వినిపిస్తూ ఉంటే ఆ విషయాన్ని మిస్ చేయరు. కాని వేగం ఎంత తీవ్రంగా ఉంటుందంటే రెండు కార్యాలనూ ఒక్క నిమిషంలో చేయగలరు. సారాన్ని కూడా క్యాచ్ చేస్తారు, మరియు తిరిగి వచ్చేస్తారు కూడా. ఎవరైనా మాట్లాడుతుంటే నేను వినడం లేదు అనే విధంగా కూడా అశరీరిగా అయిపోరు. వేగం తీవ్రంగా అవుతుంది. బుద్ధి ఎంత విశాలంగా అవుతుందంటే ఒకే సమయంలో రెండు కార్యాలనూ చేస్తారు. సర్దుకునే శక్తిని ఉపయోగించినప్పుడే ఇలా జరుగుతుంది. ఇప్పుడైతే ప్రవృత్తి విస్తారమైపోయింది. అందులో ఉంటూ ఈ అభ్యాసం చేస్తే అది మీ ఫరిశ్తా స్థితిని సాక్షాత్కారం చేయిస్తుంది! ఇప్పుడు ఒక్కొక్క చిన్న-చిన్న విషయం వెనుక ఏదైతే శ్రమ చేయాల్సి వస్తుందో, అది పైకి వెళ్ళడం ద్వారా స్వతహాగానే ఈ చిన్న విషయాలు వ్యక్త భావానికి చెందినవిగా అనుభవం చేస్తారు. ఉన్నతంగా వెళ్ళినప్పుడు నీచ స్థితి దానికదే వదిలిపోతుంది. శ్రమ నుండి రక్షింపబడతారు. సమయం కూడా మిగులుతుంది, సేవ కూడా వేగంగా జరుగుతుంది, లేకపోతే ఎంత సమయం ఇవ్వాల్సి వస్తుంది. అచ్ఛా.

సిల్వర్ జూబ్లీలో వచ్చిన సోదర-సోదరీల కోసం అవ్యక్త బాప్ దాదా మధురమైన సందేశం - రజత జయంతి శుభ సందర్భంగా ఆత్మిక పిల్లల కోసం స్నేహంతో కూడిన సుందరమైన పుష్పాలు

పూర్తి విశ్వమంతటిలోనూ ఉన్నతాతి ఉన్నతమైన మహాయుగానికి చెందిన మహోన్నతమైన పాత్రధారులకు, యుగ పరివర్తకులైన పిల్లలకు, శ్రేష్ఠ సుందరమైన జీవితానికి అభినందనలు. సేవలో వృద్ధికి నిమిత్తంగా అయ్యే విశేషమైన భాగ్యానికి అభినందనలు. ఆది సమయం నుండి పరమాత్మ స్నేహీ మరియు సహయోగీగా అయినందుకు, శ్యాంపుల్ గా అయినందుకు అభినందనలు. సమయం తీసుకొచ్చిన సమస్యలు అనే తుఫాన్లను బహుమతిగా భావించి సదా విఘ్నవినాశకులుగా అయినందుకు అభినందనలు.

బాప్ దాదా సదా ఇటువంటి తమ అనుభవాల ఖజానాల ద్వారా సంపన్నమైన సేవకు పునాది అయిన పిల్లలను చూసి హర్షిస్తున్నారు, అంతేకాక పిల్లల సాహసంతో కూడిన గుణాల మాలను స్మరణ చేస్తారు. ఇటువంటి లక్కీ మరియు లవ్లీ సమయంలో విశేషంగా సుందరమైన వరదానాలను ఇస్తున్నారు - సదా ఒక్కటిగా అయి, ఒక్కరిని ప్రత్యక్షం చేసే కార్యంలో సఫలంగా కండి, ఆత్మిక జీవితంలో అమరంగా కండి, ప్రత్యక్ష ఫలం మరియు అమర ఫలం తినే పదమాపదమ్ భాగ్యవాన్ గా కండి.

Comments