19-03-1988 అవ్యక్త మురళి

19-03-1988         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

‘స్మృతి’ లో రమణీకతను తీసుకువచ్చేందుకు యుక్తులు

ఈ రోజు విధాత, వరదాత అయిన బాప్ దాదా తమ మాస్టర్ విధాత, వరదాత పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరు విధాతగా కూడా అయ్యారు మరియు వరదాతగా కూడా అయ్యారు. ఇంకా, పిల్లల పదవి ఎంత మహోన్నతమైనది మరియు ఈ సంగమయుగ బ్రాహ్మణ జీవితానికి ఎంత మహత్వముంది అనేది కూడా బాప్ దాదా చూస్తున్నారు. బ్రాహ్మణాత్మలైన మీరు విధాత మరియు వరదాతలుగా అవ్వడంతో పాటు విధి-విధాతలుగా కూడా అయ్యారు. మీరు ఆచరించే ప్రతి విధి సత్యయుగంలో ఎలా పరివర్తన అవుతుంది అనేది ఇంతకుముందు వినిపించాము. ఈ సమయంలోని ప్రతి కర్మ యొక్క విధి (పద్ధతి) భవిష్యత్తులో ఎలాగూ నడుస్తుంది, అంతేకాక ద్వాపరం తర్వాత కూడా భక్తి మార్గంలో ఈ సమయంలోని శ్రేష్ఠ కర్మల విధి భక్తి మార్గపు విధిగా అవుతుంది. కనుక ఈ సమయంలోని విధి పూజ్య రూపంలో కూడా జీవితాన్ని జీవించే శ్రేష్ఠ నియమం రూపంలో నడుస్తుంది మరియు పూజారి మార్గం అనగా భక్తి మార్గంలో కూడా మీ ప్రతి విధి నీతి మరియు రీతిగా నడుస్తూ ఉంటుంది. కనుక మీరు విధాతలు, వరదాతలు మరియు విధి-విధాతలుగా కూడా అయ్యారు.

మీ మూల సిద్ధాంతాలు సిద్ధిని ప్రాప్తి చేసుకునే సాధనాలుగా అవుతాయి. ఉదాహరణకు ‘తండ్రి ఒక్కరే. ధర్మాత్మలు, మహానాత్మలు అనేకమంది ఉన్నారు కాని పరమ ఆత్మ ఒక్కరే’ అనేది మూల సిద్ధాంతము. ఈ మూల సిద్ధాంతం ద్వారానే శ్రేష్ఠ ఆత్మలైన మీకు ఆ ఒక్క తండ్రి ద్వారా ప్రాప్తించిన వారసత్వం అర్ధకల్పం వరకు సిద్ధి రూపంలో ప్రాప్తిస్తుంది. పారబ్ధం లభించడం అనగా సిద్ధి స్వరూపులుగా అవ్వడం ఎందుకంటే తండ్రి అయితే ఒక్కరే, మిగతావారు మహానాత్మలు లేక ధర్మాత్మలు, వారు తండ్రులు కాదు, వారు భాయి-భాయీ (సోదరులు). వారసత్వమనేది తండ్రి ద్వారా లభిస్తుంది, సోదరుల ద్వారా లభించదు. కనుక ఈ మూల సిద్ధాంతం ద్వారా మీకు అర్ధకల్పం సిద్ధి ప్రాప్తిస్తుంది. అంతేకాక, భక్తి మార్గంలో కూడా ‘గాడ్ ఈజ్ వన్’ (భగవంతుడు ఒక్కరే) అనే సిద్ధాంతమే సిద్ధిని ప్రాప్తించుకునేందుకు ఆధారమవుతుంది. భక్తికి ఆది ఆధారం కూడా ఒక్క బాబా యొక్క శివలింగ రూపం ద్వారా ప్రారంభమవుతుంది. దీనినే ‘అవ్యభిచారి భక్తి’ అని అంటారు. కనుక భక్తి మార్గంలో కూడా ‘తండ్రి ఒక్కరే’ అనే ఈ ఒక్క సిద్ధాంతం ద్వారానే సిద్ధి ప్రాప్తిస్తుంది. ఈ విధంగా మీ మూల సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, వాటిలో ఒక్కొక్క సిద్ధాంతం ద్వారా సిద్ధి ప్రాప్తిస్తూ ఉంటుంది. ఉదాహరణకు, ఈ జీవితం యొక్క మూల సిద్ధాంతము ‘పవిత్రత’. ఈ పవిత్రత యొక్క సిద్ధాంతం ద్వారా ఆత్మలైన మీకు భవిష్యత్తులో సిద్ధి స్వరూప రూపంలో ‘ప్రకాశ కిరీటము’ సదా ప్రాప్తించి ఉంటుంది, దీని స్మృతిచిహ్న రూపంగా డబల్ కిరీటాన్ని చూపిస్తారు. భక్తిలో కూడా యథార్థంగా మరియు హృదయపూర్వకంగా భక్తి చేసినప్పుడు, పవిత్రతా సిద్ధాంతాన్నే మూల ఆధారంగా భావిస్తారు, అంతేకాక, పవిత్రత లేకుండా భక్తికి సిద్ధి ప్రాప్తించదని భావిస్తారు. ఎంత సమయమైతే భక్తి చేస్తారో, కేవలం అంత సమయం కోసమే, అనగా అల్పకాలం కోసమే పవిత్రతను పాటించినా, పవిత్రతయే సిద్ధికి సాధనము - అనే ఈ సిద్ధాంతాన్ని తప్పకుండా పాటిస్తారు. ఇదే విధంగా ‘ప్రతి ఒక్క సిద్ధాంతము సిద్ధికి ఎలా సాధనం అవుతుంది?’ అని ప్రతి ఒక్క జ్ఞాన సిద్ధాంతము మరియు ధారణల మూల సిద్ధాంతముల గురించి మీ బుద్ధితో ఆలోచించండి. బాప్ దాదా దీని గురించి మననం చేసే పని ఇస్తున్నారు. ఎలాగైతే ఉదాహరణలు వినిపించామో, అదే విధంగా ఆలోచించండి.

మీరు విధి-విధాతలుగా కూడా అవుతారు, సిద్ధి దాతలుగా కూడా అవుతారు. అందుకే, ఈ రోజు వరకు ఏ భక్తులకు ఏయే సిద్ధులు కావాలో, వారు భిన్న-భిన్న దేవతల ద్వారా భిన్న-భిన్న సిద్ధులను ప్రాప్తి చేసుకునేందుకు ఆ దేవతలనే పూజిస్తారు. కనుక సిద్ధి-దాత అయిన బాబా ద్వారా మీరు కూడా సిద్ధి-దాతలుగా అవుతారు - స్వయాన్ని ఇలా భావిస్తున్నారు కదా. ఎవరికైతే స్వయం సర్వ సిద్ధులు ప్రాప్తించాయో, వారే ఇతరులకు కూడా సిద్ధులు ప్రాప్తి చేయించేందుకు నిమిత్తం అవ్వగలరు. సిద్ధి అనేది చెడ్డది కాదు ఎందుకంటే మీది రిద్ధి-సిద్ధి (క్షుద్ర విద్య) కాదు. రిద్ధి-సిద్ధి అనేది అల్పకాలానికి ప్రభావశాలిగా ఉంటుంది. కానీ మీది యథార్థమైన విధి ద్వారా కలిగే సిద్ధి. ఈశ్వరీయ విధి ద్వారా ఏ సిద్ధి అయితే ప్రాప్తిస్తుందో, అది ఈశ్వరీయ సిద్ధి. ఎలాగైతే ఈశ్వరుడు అవినాశీనో, అలా ఈశ్వరీయ విధి మరియు సిద్ధి కూడా అవినాశీ అయినవి. రిద్ధి-సిద్ధిని చూపించేవారు స్వయం కూడా అల్పజ్ఞ ఆత్మలు, వారి సిద్ధి కూడా అల్పకాలానిదే. కానీ మీ సిద్ధి, సిద్ధాంతాల విధి ద్వారా కలిగే సిద్ధి కనుక అర్ధకల్పం స్వయం సిద్ధి స్వరూపులుగా అవుతారు, అంతేకాక, మిగతా అర్ధకల్పం మీ సిద్ధాంతాల ద్వారా భక్తాత్మలు యథా శక్తి, తథా ఫలాన్ని లేక సిద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే భక్తి యొక్క శక్తి కూడా సమయమనుసారంగా తగ్గిపోతూ వస్తుంది. సతోప్రధాన భక్తి యొక్క శక్తి, (ద్వాపరంలోని) భక్తాత్మలకు నేటి భక్తుల కంటే ఎక్కువ సిద్ధిని అనుభవం చేయిస్తుంది. ఈ సమయంలోని భక్తి తమోప్రధాన భక్తిగా ఉన్న కారణంగా యథార్థమైన సిద్ధాంతాలూ లేవు, సిద్ధి కూడా లేదు.

మరి మేము ఎవరిమి అని ఇంత నషా ఉంటుందా? సదా ఈ శ్రేష్ఠ స్వమానం యొక్క స్థితి అనే సీటుపై సెట్ అయి ఉంటారా? ఇది ఎంత ఉన్నతమైన సీటు! ఈ స్థితి అనే సీటుపై సెట్ అయి ఉన్నప్పుడు (స్థిరంగా ఉన్నప్పుడు) పదే-పదే అప్సెట్ అవ్వరు (అస్థిరం అవ్వరు). ఇది మీ పొజిషన్ కదా. విధి-విధాత, సిద్ధి-దాత అనే పొజిషన్ ఎంత పెద్దది! కనుక ఎప్పుడైతే ఈ పొజిషన్లో స్థితులవుతారో, అప్పుడు మాయ అపోజిషన్ చేయదు. సదా సురక్షితంగా ఉంటారు. అప్సెట్ అయ్యేందుకు కారణమేమిటంటే, మీరు మీ శ్రేష్ఠ స్థితి అనే సీటు నుండి సాధారణ స్థితిలోకి వచ్చేస్తారు. అప్పుడు స్మృతి చేయడం లేక సేవ చేయడం అనేది ఒక సాధారణ దినచర్య వలె అయిపోతుంది. కనుక స్మృతిలో కూర్చున్నప్పుడు కూడా, ఏదో ఒక శ్రేష్ఠ స్వమానమనే సీటుపై కూర్చోండి. కేవలం మంచంపై నుండి లేచి వెళ్ళి యోగం చేసే స్థానంలో కూర్చుండిపోవడం కాదు, అది యోగం చేసే గదిలో కావచ్చు లేక బాబా గదిలో కావచ్చు, అలా వెళ్ళి కూర్చుండిపోవడం లేక రోజంతా కూర్చుండిపోవడం కాదు. ఎలాగైతే శరీరానికి ఒక యోగ్యమైన స్థానాన్ని ఇస్తారో, అలా ముందు బుద్ధికి స్థితి అనే స్థానమివ్వండి. ముందు బుద్ధికి సరైన స్థానాన్ని ఇచ్చానా అని చెక్ చేసుకోండి. అప్పుడు ఈ సీటుతో ఈశ్వరీయ నషా స్వతహాగానే కలుగుతుంది. ఈ రోజుల్లో కూడా ‘కుర్చీ యొక్క నషా’ అని అంటారు కదా! మీకైతే శ్రేష్ఠ స్థితి అనే ఆసనముంది. ఒకసారి ‘మాస్టర్ బీజరూప స్థితి’ అనే ఆసనంపై లేక సీటుపై సెట్ అవ్వండి, ఒకసారి ‘అవ్యక్త ఫరిశ్తా’ అనే సీటుపై సెట్ అవ్వండి, ఒకసారి ‘విశ్వ-కళ్యాణకారి స్థితి’ అనే సీటుపై సెట్ అవ్వండి - ఇలా ప్రతి రోజు రకరకాల స్థితులు యొక్క ఆసనంపై లేక సీటుపై సెట్ అయి కూర్చోండి.

ఒకవేళ ఎవరికైనా సీటు సెట్ అవ్వకపోతే కదుల్తూ ఉంటారు కదా - ఒకసారి ఇలా కదుల్తారు, ఒకసారి అలా కదుల్తారు! అలా ఈ బుద్ధి కూడా సీటుపై సెట్ అవ్వనప్పుడే అలజడిలోకి వస్తుంది. మనము ఇలాంటి-ఇలాంటి వారిమని అందరికీ తెలుసు. ఒకవేళ ఇప్పుడు, మీరు ఎవరు అని అడిగితే ఒక పెద్ద లిస్టు తయారవుతుంది. కానీ ఏదైతే తెలుసుకున్నారో, అది స్వయం నేనే అని ప్రతి సమయం అంగీకరించండి. కేవలం తెలుసుకోవడం కాదు, స్వయాన్ని అలా స్వీకరించండి ఎందుకంటే తెలుసుకోవడం ద్వారా ‘అవును, ఇది నేనే’ అనే సంతోషముంటుంది కానీ స్వీకరించడం ద్వారా శక్తి వస్తుంది మరియు అలా స్వీకరించి నడుచుకోవడం వలన నషా ఉంటుంది. ఎలాగైతే ఏ పదవిలో ఉన్నవారైనా వారి సీటులో సెట్ అయి ఉన్నప్పుడు సంతోషముంటుంది కానీ శక్తి ఉండదు. కనుక మీరు నేను ఫలానా అని తెలుసుకున్నారు కానీ ఈ విషయాన్ని స్వీకరించి నడుచుకోండి మరియు ‘నేను సీటుపై సెట్ అయి ఉన్నానా లేక సాధారణ స్థితిలో కిందికి వచ్చేసానా?’ అని పదే-పదే స్వయాన్ని ప్రశ్నించుకోండి, చెక్ చేసుకోండి. ఎవరైతే ఇతరులకు సిద్ధిని ఇచ్చేవారిగా ఉంటారో, వారు స్వయం ప్రతి సంకల్పంలో మరియు ప్రతి కర్మలో తప్పకుండా సిద్ధి స్వరూపులుగా ఉంటారు, దాతలుగా ఉంటారు. సిద్ధి-దాతలుగా ఉన్నవారు ఎప్పుడూ ‘ఎంత పురుషార్థం చేస్తున్నానో లేక ఎంత శ్రమ చేస్తున్నానో, అంత సిద్ధి కనిపించడం లేదు లేక స్మృతి చేసే అభ్యాసాన్ని ఎంతగా చేస్తున్నానో, అంత సిద్ధి అనుభవమవ్వడం లేదు’ అని ఆలోచించరు. ఇలా ఆలోచిస్తూ ఉంటే సీటుపై సెట్ అయ్యే విధి యథార్థంగా లేదు అని ఋజువవుతుంది.

ఇది రమణీకమైన జ్ఞానము. రమణీకమైన అనుభవం స్వతహాగానే బద్ధకాన్ని తరిమేస్తుంది. చాలామంది ‘మామూలుగా అయితే మాకు నిద్ర రాదు కానీ యోగం చేసేటప్పుడు తప్పకుండా నిద్ర వస్తుంది’ అని అంటారు కదా. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది అలసట విషయం కాదు కానీ రమణీకమైన పద్ధతితో లేక సహజ రూపంతో బుద్ధిని సీటుపై సెట్ చేయరు. కేవలం ఒకే రూపంలో కాకుండా వెరైటీ రూపాలలో బుద్ధిని సెట్ చేయండి. ఒకే వస్తువును రకరకాల రూపాలలోకి పరివర్తన చేసి ఉపయోగిస్తే మనసుకు సంతోషం కలుగుతుంది. ఎంత బాగున్న వస్తువునైనా, ఒకవేళ ఒకే వస్తువును పదే-పదే తింటూ ఉంటే, చూస్తూ ఉంటే ఏమవుతుంది? అదే విధంగా బీజరూపంగా అవ్వండి కానీ ఒకసారి లైట్ హౌస్ రూపంలో, ఒకసారి మైట్ హౌస్ రూపంలో, ఒకసారి కల్పవృక్షం పైన బీజం రూపంలో, ఒకసారి సృష్టి చక్రం టాప్ లో నిలబడి అందరికీ శక్తినివ్వండి. రకరకాల టైటిల్స్ ఏవైతే లభిస్తాయో వాటి నుండి రోజు వేరే-వేరేవి అనుభవం చేయండి. ఒకసారి కంటి రత్నంగా అయి తండ్రి నయనాలలో ఇమిడి ఉన్నాను - ఈ స్వరూపాన్ని అనుభవం చేయండి, ఒకసారి మస్తకమణిగా, ఒకసారి సింహాసనాధికారిగా అయి... రకరకాల స్వరూపాలను అనుభవం చేయండి. వెరైటీవి అనుభవం చేస్తే రమణీకత వస్తుంది. బాప్ దాదా ప్రతిరోజు మురళిలో రకరకాల టైటిల్స్ ఇస్తారు, ఎందుకిస్తారు? ఆ సీటుపై సెట్ అవ్వండి మరియు కేవలం మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. కానీ చెక్ చేసుకోవడాన్ని మర్చిపోతున్నారని ఇంతకుముందు కూడా వినిపించాము. 6 గంటలు, 8 గంటలు గడిచిపోతాయి, తర్వాత ఆలోచిస్తారు, అందుకే అప్పుడు సగం రోజు గడిచిపోయిందని ఉదాసీనులైపోతారు. అభ్యాసం సహజమైపోవాలి, అప్పుడే విధి-విధాతలుగా లేక సిద్ధి-దాతలుగా అయి విశ్వాత్మల కళ్యాణం చేయగలరు. అర్థమయిందా. అచ్ఛా.

ఈ రోజు మధుబన్ వారి రోజు. డబల్ విదేశీయులు తమ సమయంలో మధుబన్ వాసులకు అవకాశాన్ని ఇస్తున్నారు ఎందుకంటే మధుబన్ వాసులను చూసి సంతోషిస్తారు. మధుబన్ వారు ‘మహిమ చేయకండి, మహిమను చాలా విన్నాము’ అని అంటారు. మహిమను వింటూనే మహానులుగా అయిపోతున్నారు ఎందుకంటే ఈ మహిమయే ఒక డాలుగా అవుతుంది. ఎలాగైతే యుద్ధంలో డాలు సురక్షా సాధనంగా ఉంటుందో, అలా ఈ మహిమ కూడా ‘మేము ఎంత మహానులము’ అనే స్మృతిని ఇప్పిస్తుంది. మధుబన్ అంటే కేవలం మధుబన్ మాత్రమే కాదు, మధుబన్ అంటే విశ్వం యొక్క స్టేజి. మధుబన్ లో ఉండడమంటే విశ్వమనే స్టేజిపై ఉండడము. మరి ఎవరైతే స్టేజిపై ఉంటారో, వారు ఎంత అటెన్షన్ తో ఉంటారు! సాధారణ రీతిలో ఎవరైనా వేరే ఏదైనా స్థానంలో ఉంటే, అంత అటెన్షన్ ఉండదు కానీ స్టేజి పైకి వచ్చినప్పుడు ప్రతి సమయం, ప్రతి కర్మ పట్ల అంతే అటెన్షన్ ఉంటుంది. కనుక మధుబన్ విశ్వం యొక్క స్టేజి వంటిది. నలువైపులా ఉన్నవారి దృష్టి మధుబన్ పట్లనే ఉంది. మామూలుగా కూడా అందరి అటెన్షన్ స్టేజి వైపుకు వెళ్తుంది కదా! కనుక మధుబన్ నివాసులు సదా విశ్వమనే స్టేజిపై స్థితులై ఉన్నారు.

ఇంకా, మధుబన్ ఒక విచిత్రమైన గుమ్మటం వంటిది. గుమ్మటంలో శబ్దం చేస్తే అది మళ్ళీ మన వరకే చేరుకుంటుంది. కానీ మధుబన్ ఎలాంటి విచిత్రమైన గుమ్మటం అంటే మధుబన్ లో ఏ కొద్ది శబ్దమైనా అది విశ్వం వరకు చేరుకుంటుంది. ఇలాంటి పాతకాలం నాటి చాలా స్థానాలు ఈ రోజుల్లో కూడా గుర్తులుగా ఉన్నాయి. ఒకవేళ ఒక గోడను మనం చేతితో తాకినా లేక శబ్దం చేసినా ఆ శబ్దం 10 గోడల నుండి ఎలా వస్తుందంటే, ప్రతి గోడను ఎవరో కదిలిస్తున్నట్లు లేక శబ్దం చేస్తున్నట్లు వినిపిస్తుంది. కనుక మధుబన్ ఎలాంటి విచిత్రమైన గుమ్మటం అంటే మధుబన్ లోని శబ్దం కేవలం మధుబన్ వరకే ఉండదు, అది నలువైపులా వ్యాపిస్తుంది. ఆ శబ్దం మధుబన్ లో ఉండేవారికి కూడా తెలియకుండా వ్యాపిస్తుంది. ఇది విచిత్రమైన గుమ్మటం కదా, అందుకే ఆ శబ్దం బయటకు చేరుకుంటుంది. అందుకే, ఇక్కడ చూసాము లేక ఇక్కడ మాట్లాడాము.... అని భావించకండి. ఆ శబ్దం విశ్వమంతటా గాలి వలె తీవ్రమైన వేగంతో చేరుకుంటుంది ఎందుకంటే అందరి దృష్టిలో, బుద్ధిలో సదా మధుబన్ మరియు మధుబన్ యొక్క బాప్ దాదాయే ఉంటారు. మరి మధుబన్ యొక్క బాబా అందరి దృష్టిలో ఉన్నప్పుడు, మధుబన్ కూడా అందరి దృష్టిలోకి వస్తుంది కదా. మధుబన్ బాబా ఉన్నప్పుడు మధుబన్ కూడా వస్తుంది కదా మరియు మధుబన్ లో కేవలం బాబా మాత్రమే లేరు, పిల్లలు కూడా ఉన్నారు. కనుక మధుబన్ వాసులు స్వతహాగానే అందరి దృష్టిలోకి వచ్చేస్తారు. బ్రాహ్మణులెవరినైనా అడగండి, వారు ఎంత దూరంలో ఉన్నా సరే వారికి ఏం గుర్తుంటుంది? ‘మధుబన్’ మరియు ‘మధుబన్ బాబా’. కనుక మధుబన్ వాసులకు ఇంతటి మహత్వముంది! అర్థమయిందా? అచ్ఛా!

నలువైపులా ఉన్న సేవ చేయాలనే ఉల్లాస-ఉత్సాహాలలో ఉండేవారందరికీ, సదా ఒక్క బాబా స్నేహంలో ఇమిడి ఉండేవారు, సదా ప్రతి కర్మలో శ్రేష్ఠ విధి ద్వారా సిద్ధిని అనుభవం చేసేవారు, సదా స్వయాన్ని విశ్వ కళ్యాణకారిగా అనుభవం చేస్తూ ప్రతి సంకల్పం ద్వారా, మాట ద్వారా శ్రేష్ఠ కళ్యాణ భావన మరియు శ్రేష్ఠ కామనల ద్వారా సేవలో బిజీగా ఉండేవారు - ఇలాంటి బాబా సమానమైన సదా అలసట లేని సేవాధారి పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వ్యక్తిగత మిలనము:-

1. స్వయాన్ని కర్మయోగీ శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? కర్మయోగీ ఆత్మలు సదా కర్మల ప్రత్యక్ష ఫలాన్ని స్వతహాగానే అనుభవం చేస్తారు. ప్రత్యక్ష ఫలం - ‘సంతోషము’ మరియు ‘శక్తి’. కనుక కర్మయోగీ ఆత్మలు అంటే ప్రత్యక్ష ఫలమైన ‘సంతోషము’ మరియు ‘శక్తి’ని అనుభవం చేసేవారు. బాబా సదా పిల్లలకు ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేయిస్తారు. ఇప్పుడిప్పుడే కర్మ చేస్తారు, కర్మ చేస్తూనే సంతోషమును మరియు శక్తిని అనుభవం చేస్తారు! నేను ఇలాంటి కర్మయోగీ ఆత్మను - అనే స్మృతితో ముందుకు వెళ్తూ ఉండండి.

2. అనంతమైన సేవ చేయడం ద్వారా అనంతమైన సంతోషం స్వతహాగానే అనుభవం అవుతుంది కదా! అనంతమైన తండ్రి అనంతమైన అధికారిగా తయారుచేస్తారు. అనంతమైన సేవకు ఫలితంగా అనంతమైన రాజ్య భాగ్యం స్వతహాగానే ప్రాప్తిస్తుంది. అనంతమైన స్థితిలో స్థితులై సేవ చేసినప్పుడు ఏ ఆత్మలకైతే నిమిత్తం అవుతారో, వారి ఆశీర్వాదాలు స్వతహాగానే ఆత్మకు ‘శక్తి’ని మరియు ‘సంతోషాన్ని’ అనుభూతి చేయిస్తాయి. ఒకే స్థానంలో కూర్చుని ఉన్నా అనంతమైన సేవకు ఫలం లభిస్తుంది - ఈ అనంతమైన నషాతో అనంతమైన ఖాతాను జమ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి.

Comments