18-02-1986 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
"నిరంతర సేవాధారి మరియు నిరంతర యోగిగా అవ్వండి"
జ్ఞానసాగరుడైన తండ్రి ఈ రోజు తమ జ్ఞాన గంగలను చూస్తున్నారు. జ్ఞానసాగరుడి నుండి వెలువడిన జ్ఞాన గంగలు ఏ విధంగా మరియు ఎక్కడెక్కడి నుండి పావనంగా చేస్తూ, ఈ సమయంలో సాగరము మరియు గంగ యొక్క మిలనము జరుపుకుంటున్నాయో చూస్తున్నారు. ఇది గంగా సాగరముల మేళా, ఈ మేళాలోకి నలువైపుల నుండి గంగలు వచ్చి చేరుకున్నాయి. బాప్ దాదా కూడా జ్ఞానగంగలను చూసి హర్షిస్తున్నారు. "పతిత ప్రపంచాన్ని, పతిత ఆత్మలను పావనంగా చేయాల్సిందే" అన్న దృఢ నిశ్చయము మరియు నషా ప్రతి గంగకు ఉంది. ఈ నిశ్చయము మరియు నషాతో ప్రతి ఒక్కరూ సేవా క్షేత్రంలో ముందుకు వెళ్తున్నారు. పరివర్తనా కార్యము త్వరత్వరగా సంపన్నమవ్వాలన్న ఉత్సాహమే ప్రతి ఒక్కరి మనసులోనూ ఉంది. జ్ఞానగంగలందరూ జ్ఞానసాగరుడైన తండ్రి సమానంగా విశ్వకళ్యాణకారులు, వరదానులు మరియు మహాదాని దయాహృదయ ఆత్మలు, కావున ఆత్మల దుఃఖము మరియు అశాంతుల పిలుపును అనుభవం చేసి, ఆత్మల దుఃఖము మరియు అశాంతిని పరివర్తన చేసే సేవను తీవ్రగతితో చేయాలనే ఉత్సాహము పెరుగుతూ ఉంటుంది. దుఃఖిత ఆత్మల హృదయం నుండి వెలువడే పిలుపు విని దయ కలుగుతుంది కదా! అందరూ సుఖంగా అవ్వాలన్న స్నేహం ఉత్పన్నమవుతుంది. సుఖపు కిరణాలను, శాంతి కిరణాలను, శక్తి కిరణాలను విశ్వానికి ఇచ్చేందుకు నిమిత్తంగా అయ్యారు. ఆది నుండి ఇప్పటి వరకు జ్ఞానగంగల సేవ పరివర్తన చేసేందుకు ఎంతవరకు నిమిత్తంగా అయిందో ఈ రోజు చూస్తున్నారు. ఇప్పుడు కూడా తక్కువ సమయంలో అనేక ఆత్మల సేవను చేయాలి. 50 సంవత్సరాలలో దేశ-విదేశాలలో సేవ పునాదిని బాగా వేశారు. సేవా స్థానాలను నలువైపులా స్థాపన చేశారు. శబ్దాన్ని వ్యాపింపజేసే సాధనాలను రకరకాలుగా ఉపయోగించారు. ఇది కూడా బాగానే చేశారు. దేశ విదేశాలలో చెల్లాచెదురైన పిల్లల సంగఠన కూడా తయారయింది, ఇకపై కూడా తయారవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు విధిని కూడా తెలుసుకున్నారు. అనేక రకాల సాధనాలను కూడా పోగు చేసుకుంటూ ఉన్నారు, చేసుకున్నారు కూడా! స్వ స్థితి, స్వ ఉన్నతిపై కూడా అటెన్షన్ ఇస్తున్నారు మరియు కలిగిస్తున్నారు. ఇప్పుడు ఇంకేమి మిగిలి ఉంది? ఆదిలో ఆది రత్నాలందరూ ఉల్లాస-ఉత్సాహాలతో తనువు-మనసు-ధనము, సమయం-సంబంధం, రాత్రింబవళ్లు తండ్రికి అర్పించారు అనగా తండ్రి ముందు సమర్పణ చేశారు, ఆ సమర్పణ యొక్క ఉల్లాస-ఉత్సాహాలకు ఫలస్వరూపంగా సేవలో శక్తిశాలి స్థితిని ప్రత్యక్ష రూపంలో చూశారు. సేవ ప్రారంభించినప్పుడు, సేవ ఆరంభంలో మరియు స్థాపన ఆరంభంలో, రెండు సమయాలలో ఈ విశేషతను చూశారు. ఆదిలో బ్రహ్మాబాబాను నడుస్తూ-తిరుగుతూ ఉన్నా సాధారణ రూపంలో చూసారా లేక శ్రీకృష్ణుని రూపంలో చూసారా? సాధారణ రూపంలో చూసినా కూడా అలా కనిపించేవారు కాదు, ఈ అనుభవం ఉంది కదా! వీరు దాదా అని భావించేవారా? నడుస్తూ-తిరుగుతూ కృష్ణునిగానే అనుభవం చేసేవారు. ఇలా చేసారు కదా? ఆదిలో బ్రహ్మాబాబాలో ఈ విశేషతను చూశారు, అనుభవం చేసారు, అంతేకాక సేవ యొక్క ఆదిలో మీరు ఎప్పుడు ఎక్కడకు వెళ్ళినా, అందరూ దేవీలగానే అనుభవం చేసారు. దేవీలు వచ్చారు అన్న ఈ మాటలను వినేవారు, వీరు అలౌకిక వ్యక్తులు అనే అందరి నోటి నుండి వెలువడేది. ఇలానే అనుభవం చేసుకున్నారు కదా? దేవీలు అనే భావన అందరినీ ఆకర్షించి సేవలో వృద్ధికి నిమిత్తంగా అయింది. కావున ఆదిలో కూడా అతీతంగా ఉండే విశేషత ఉంది. సేవ ఆదిలో కూడా అతీతమైన, దేవీ స్వరూపము యొక్క విశేషత ఉంది. ఇప్పుడు అంతిమంలో కూడా అదే ప్రకాశము మరియు మెరుపును ప్రత్యక్ష రూపంలో అనుభవం చేసుకుంటారు, అప్పుడే ప్రత్యక్షత ఢంకా మ్రోగుతుంది. ఇప్పుడు మిగిలి ఉన్న కొద్ది సమయం నిరంతర యోగులుగా, నిరంతర సేవాధారులుగా, నిరంతర సాక్షాత్కార స్వరూపులుగా, నిరంతర యోగులుగా, నిరంతరము సాక్షాత్తు తండ్రి - ఈ విధి ద్వారా సిద్ధిని పొందుతారు. గోల్డెన్ జూబ్లీని జరుపుకున్నారు అనగా గోల్డెన్ ప్రపంచపు సాక్షాత్కార స్వరూపం వరకు చేరుకున్నారు. ఎలాగైతే గోల్డెన్ జూబ్లీ జరుపుకునే దృశ్యంలో సాక్షాత్తు దేవీలుగా అనుభవం చేసారు, కూర్చున్నవారు మరియు చూసేవారు కూడా అలాగే అనుభవం చేశారు. ఇప్పుడు నడుస్తూ-తిరుగుతూ ఇదే అనుభవాన్ని సేవలో చేయిస్తూ ఉండండి. ఇదే గోల్డెన్ జూబ్లీని జరుపుకోవడం. అందరూ గోల్డెన్ జూబ్లీని జరుపుకున్నారా లేక చూశారా? ఏమంటారు? ఇది మీ అందరి గోల్డెన్ జూబ్లీ కదా! లేక కొందరిది సిల్వర్ జూబ్లీ, మరికొందరిది రాగి జూబ్లీ జరిగిందా? అందరిదీ గోల్డెన్ జూబ్లీయే జరిగింది. గోల్డెన్ జూబ్లీని జరుపుకోవడమనగా నిరంతరం గోల్డెన్ స్థితి కలవారిగా అవ్వడం. ఇప్పుడు నడుస్తూ-తిరుగుతూ నేను ఫరిస్తాను, ఫరిస్తా నుండి దేవతను అని అనుభవం చేస్తూ ముందుకు వెళ్ళండి. మీ ఈ సమర్థ స్మృతి ద్వారా ఇతరులకు కూడా మీ ఫరిస్తా రూపము లేదా దేవీ దేవతా రూపమే కనిపిస్తుంది. గోల్డెన్ జూబ్లీని జరుపుకున్నారు అనగా ఇప్పుడు సమయాన్ని, సంకల్పాలను సేవలో అర్పణ చెయ్యండి. ఇప్పుడు ఈ సమర్పణా సమారోహాన్ని జరపండి. స్వయం యొక్క చిన్న-చిన్న విషయాల వెనుక, తనువు వెనుక, మనసు వెనుక, సాధనాల వెనుక, సంబంధాలను నిర్వర్తించడం వెనుక సమయాన్ని మరియు సంకల్పాలను వెచ్చించకండి. సేవలో వెచ్చించడం అనగా స్వ ఉన్నతి యొక్క కానుక స్వతహాగానే ప్రాప్తించడం. ఇప్పుడు స్వయం కోసం సమయాన్ని వెచ్చంచడాన్ని పరివర్తన చేయండి. శ్వాస అనగా, ఎలాగైతే భక్తులు శ్వాస-శ్వాసలోనూ నామాన్ని జపించేందుకు ప్రయత్నిస్తారో, అలా శ్వాస-శ్వాసలోనూ సేవ చేయాలనే తపన ఉండాలి. సేవలో నిమగ్నమై ఉండాలి. విధాతలుగా అవ్వండి, వరదాతలుగా అవ్వండి. నిరంతర మహాదానులుగా అవ్వండి. 4 గంటలు లేక 6 గంటల కోసం సేవాధారిగా కాదు, ఇప్పుడు మీరు విశ్వకళ్యాణకారి స్థితిలో ఉన్నారు. ప్రతి ఘడియను విశ్వకళ్యాణము కోసం సమర్పితం చేయండి. విశ్వకళ్యాణములో స్వ కళ్యాణము స్వతహాగానే ఇమిడి ఉంది. ఎప్పుడైతే సంకల్పమూ మరియు సెకెండు సేవలో బిజీగా ఉంటాయో, ఖాళీ ఉండదో, అప్పుడు మాయకు కూడా మీ వద్దకు వచ్చేందుకు ఖాళీ ఉండదు. సమస్యలు సమాధాన రూపంలోకి పరివర్తన అయిపోతాయి. సమాధాన స్వరూప శ్రేష్ఠ ఆత్మల వద్దకు వచ్చేందుకు సమస్య ధైర్యం చేయదు. ఎలాగైతే మొట్టమొదట సేవలో దేవీ రూపము, శక్తిరూపము కారణంగా ఎదురుగా వచ్చిన పతిత దృష్టి కలవారు కూడా పరివర్తన అయి పావనంగా అవ్వాలనే జిజ్ఞాసువులుగా అయిపోయేవారో మీరు చూశారు. ఎలాగైతే పతితులు పరివర్తన అయి మీ ముందుకు వచ్చేవారో, అలా సమస్య మీ ముందుకు వస్తూ సమాధాన రూపంలోకి పరివర్తనైపోవాలి. ఇప్పుడు మీ సంస్కారాలను పరివర్తన చేసుకోవడంలో సమయాన్ని వెచ్చించకండి. విశ్వకళ్యాణము చేయాలనే శ్రేష్ఠ భావనతో, శ్రేష్ఠ కామన యొక్క సంస్కారాలను ఇమర్జ్ చేయండి. ఈ శ్రేష్ఠ సంస్కారాల పరివర్తనలో సమయాన్ని పోగొట్టుకోకండి. ఈ శ్రేష్ఠ సంస్కారాల ముందు హద్దు సంస్కారాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. ఇప్పుడు యుద్ధములో సమయాన్ని పోగొట్టుకోకండి. విజయీతనపు సంస్కారాలను ఇమర్జ్ చేసుకోండి. విజయీ సంస్కారాల ముందు శత్రువు స్వతహాగానే భస్మమైపోతాడు, కావున తనువు-మనసు-ధనమును నిరంతరం సేవలో సమర్పితం చేయమని అన్నారు. మనసు ద్వారా చేయండి, లేక వాచా ద్వారా చేయండి, లేక కర్మణా ద్వారా చేయండి కాని సేవ తప్ప ఇంకే సమస్యలలోకి వెళ్ళకండి. దానమునివ్వండి, వరదానమునివ్వండి, అప్పుడు స్వయానికి పట్టిన గ్రహణం స్వతహాగానే సమాప్తమైపోతుంది. అవినాశీ లంగరును వేయండి ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది కానీ సేవ అయితే ఆత్మలకు, వాయుమండలానికి, ప్రకృతికి, భూత ప్రేతాత్మలకు, అందరికీ చేయాలి. ఆ భ్రమిస్తున్న ఆత్మలకు కూడా ఆశ్రయాన్నివ్వాలి. ముక్తిధామానికైతే పంపిస్తారు కదా! వారికి ఇంటినైతే ఇస్తారు కదా! ఇప్పుడిక ఎంత సేవ చేయాలి. ఆత్మల సంఖ్య ఎంతగా ఉంది! ప్రతి ఆత్మకు ముక్తి జీవన్ముక్తిని ఇవ్వాల్సిందే. సర్వస్వాన్ని సేవలో పెట్టండి, శ్రేష్ఠమైన ఫలాన్ని బాగా తినండి. శ్రమ యొక్క ఫలాన్ని తినకండి. శ్రమ నుండి విముక్తులుగా చేసేది, సేవా ఫలం.
బాప్ దాదా రిజల్టులో ఏం చూశారంటే - ఎవరైతే ఎక్కువగా పురుషార్థములో స్వయం పట్ల, సంస్కారాల పరివర్తన పట్ల సమయాన్నిస్తారో, 50 సంవత్సరాలు గడిచినా, ఒక నెల గడిచినా కాని ఆది నుండి ఇప్పటి వరకు పరివర్తన చేసుకునే సంస్కారం మూల రూపంలో అదే ఉంటుంది, ఒక్కటే ఉంటుంది. అంతేకాక అదే మూల సంస్కారం భిన్న-భిన్న రూపాలలో సమస్యగా అయి వస్తుంది. ఉదాహరణకు కొందరి బుద్ధిలో అభిమానమనే సంస్కారం ఉంది, కొందరికి ద్వేషించే సంస్కారం ఉంది, లేక కొందరికి దుఃఖితులుగా అయ్యే సంస్కారం ఉంది. 50 సంవత్సరాలు పట్టినా, ఒక సంవత్సరం పట్టినా, అదే సంస్కారం ఆది నుండి ఇప్పటివరకు భిన్న-భిన్న సమయాలలో ఇమర్జ్ అవుతూ ఉంటుంది. ఈ కారణంగా సమయ ప్రతి సమయం ఆ మూల సంస్కారం ఏదైతే భిన్న-భిన్న రూపాలలో సమస్యగా అయి వస్తూ ఉంటుందో, దానిపై సమయాన్నీ ఎంతగానో వెచ్చించారు, శక్తిని కూడా ఎంతగానో వెచ్చించారు. ఇప్పుడు దాత, విధాత, వరదాతల శక్తిశాలి సంస్కారాలను ఇమర్జ్ చేసుకోండి. అప్పుడు ఈ మహా సంస్కారం బలహీన సంస్కారాన్ని స్వతహాగానే సమాప్తం చేసేస్తుంది. ఇప్పుడిక సంస్కారాన్ని సమాప్తం చేయడంలో సమయాన్ని వెచ్చించకండి. కానీ సేవ యొక్క ఫలం ద్వారా, ఆ ఫలం యొక్క శక్తి ద్వారా స్వతహాగానే సమాప్తమైపోతాయి. మంచి స్థితిలో ఎప్పుడైతే సేవలో బిజీగా ఉంటారో అప్పుడు సేవ చేసిన సంతోషంతో ఆ సమయం వరకు ఉన్న సమస్యలు స్వతహాగానే అణిగిపోతాయి అన్న అనుభవం కూడా ఉంది కదా, ఎందుకంటే సమస్యల గురించి ఆలోచించేందుకు ఖాళీయే ఉండదు. ప్రతి క్షణము, ప్రతి సంకల్పములో సేవలో బిజీగా ఉన్నట్లయితే సమస్యల లంగరు ఎత్తి వేయబడుతుంది, పక్కకు వెళ్ళిపోతుంది. మీరు ఇతరులకు దారిని చూపించేందుకు, తండ్రి ఖజానాలను ఇచ్చేందుకు నిమిత్త ఆధారంగా అయినట్లయితే బలహీనతలు స్వతహాగానే పక్కకు తప్పుకుంటాయి. అర్థమయిందా - ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడిక అనంతంగా ఆలోచించండి, అనంతమైన కార్యము గురించి ఆలోచించండి. దృష్టి ద్వారానైనా ఇవ్వండి, వృత్తి ద్వారానైనా ఇవ్వండి, వాణి ద్వారానైనా ఇవ్వండి, సాంగత్యము ద్వారానైనా ఇవ్వండి, వైబ్రేషన్ల ద్వారానైనా ఇవ్వండి కాని ఇవ్వాల్సిందే. అలాగే భక్తిలో కూడా ఒక నియమం ఉంది, ఏ వస్తువైనా లోటు ఉన్నట్లయితే అది దానం చేయమని చెప్తారు. దానం చేయడం ద్వారా ఇవ్వడమనేది, తీసుకోవడంగా అయిపోతుంది. గోల్డెన్ జూబ్లీ ఏమిటో అర్థమయిందా. కేవలం జరుపుకున్నాము అని ఇంతమాత్రమే భావించకండి. సేవలో 50 సంవత్సరాలు పూర్తయ్యాయి, ఇప్పుడిక కొత్త మలుపును తీసుకోండి. చిన్నవారైనా, పెద్దవారైనా, ఒకరోజు వారైనా లేక 50 సంవత్సరాల వారైనా అందరూ సమాధాన స్వరూపులుగా అవ్వండి. ఏం చేయాలో అర్థమయిందా. మామూలుగా కూడా 50 సంవత్సరాల తర్వాత జీవితమైతే పరివర్తన అవుతుంది. గోల్డెన్ జూబ్లీ అనగా పరివర్తన జూబ్లీ, సంపన్నంగా అయ్యే జూబ్లీ. అచ్ఛా.
సదా విశ్వకళ్యాణకారులు, సమర్థులుగా ఉండేవారు, సదా వరదాని, మహాదాని స్థితిలో స్థితులై ఉండేవారు, సదా స్వయం యొక్క సమస్యలను ఇతరుల పట్ల సమాధాన స్వరూపులుగా అయి సహజంగా సమాప్తం చేసేవారు, ప్రతి సమయము, ప్రతి సంకల్పాన్ని సేవలో సమర్పణ చేసేవారు - ఇటువంటి రియల్ గోల్డ్ విశేష ఆత్మలకు, తండ్రి సమానమైన శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
గోల్డెన్జూబ్లీయొక్క ఆదిరత్నాలతో బాప్ దాదా మిలనము
ఆది నుండి తోడుగా ఉండే మరియు సహచరులుగా ఉండే, రెండింటిలోనూ విశేషమైన పాత్ర ఉంది అన్న ఈ విశేషమైన సంతోషం సదా ఉంటుంది. తోడుగా ఉన్నాము మరియు ఎంతవరకు జీవించాలో అంతవరకు స్థితిలో కూడా తండ్రి సమానంగా సహచరులుగా అయి ఉండాలి. కావున తోడుగా ఉండడం మరియు సహచరులుగా అవ్వడము అనే విశేష వరదానము ఆది నుండి అంతిమం వరకు లభించింది. స్నేహం ద్వారా జన్మ లభించింది, జ్ఞానమైతే ఇంతకుముందు లేదు కదా. స్నేహంతోనే జన్మించారు, ఏ స్నేహంతో అయితే జన్మించారో, ఈ స్నేహాన్ని అందరికీ ఇచ్చేందుకు విశేషంగా నిమిత్తులుగా ఉన్నారు. మీ ఎదురుగా ఎవరు వచ్చినా, మీ అందరి నుండి విశేషంగా తండ్రి స్నేహాన్ని అనుభవం చేయాలి. మీ ద్వారా తండ్రి చిత్రము, మీ నడవడిక ద్వారా తండ్రి చరిత్ర కనిపించాలి. తండ్రి చరిత్ర ఏమిటని ఎవరైనా అడిగితే మీ నడవడిక తండ్రి చరిత్రను చూపించాలి ఎందుకంటే మీరు స్వయం తండ్రి చరిత్రను చూసి, తోడు-తోడుగా చరిత్రలో నడుచుకునే ఆత్మలు. ఏదైతే చరిత్ర అయిందో, అది ఒక్క తండ్రి చరిత్ర కాదు. అది గోపీవల్లభుడు మరియు గోపికల చరిత్రనే. పిల్లలతోపాటే తండ్రి ప్రతి కర్మను చేశారు, ఒక్కరే చేయలేదు. సదా పిల్లలను ముందుంచారు. ముందుంచడం అన్నది చరిత్ర అయింది. ఇటువంటి చరిత్ర విశేష ఆత్మలైన మీ ద్వారా కనిపించాలి. 'నేను ముందు ఉండాలి' అన్న సంకల్పాన్ని తండ్రి ఎప్పుడూ చేయలేదు. ఇందులో కూడా సదా త్యాగిగా ఉన్నారు, అంతేకాక ఇదే త్యాగ ఫలంతో అందరినీ ముందుంచారు, అందుకే వారికి ముందు ఫలం లభించింది. ప్రతి విషయములోను నంబర్ వన్ గా బ్రహ్మా తండ్రియే అయ్యారు. ఎందుకు అయ్యారు? ముందు పెట్టడమే ముందు ఉండడమనే త్యాగ భావం ద్వారా అయ్యారు. సంబంధాల త్యాగం, వైభవాల త్యాగం పెద్ద విషయమేమీ కాదు. కాని ప్రతి కార్యములో, సంకల్పంలో కూడా ఇతరులను ముందుంచాలి అన్న భావన ఉండాలి. ఈ త్యాగం శ్రేష్ఠ త్యాగంగా అయింది. దీనిని స్వ అభిమానాన్ని తొలగించి వేయడం, 'నేను' అన్న దానిని తొలగించడమని అంటారు. కావున డైరెక్ట్ గా పాలన తీసుకునేవారిలో విశేష శక్తులున్నాయి. డైరెక్ట్ పాలన యొక్క శక్తులు తక్కువేమీ లేవు. అదే పాలనను ఇతరుల పాలనలో ప్రత్యక్షం చేస్తూ వెళ్ళండి. మీరైతే విశేషమైనవారే. అనేక విషయాలలో విశేషంగా ఉన్నారు. ఆది నుండి తండ్రితో పాటు పాత్రను అభినయించడమనేది తక్కువ విశేషత ఏమీ కాదు. విశేషతలైతే ఎన్నో ఉన్నాయి, కాని ఇప్పుడు విశేష ఆత్మలైన మీరు దానం కూడా విశేషంగా చేయాలి. జ్ఞాన దానమైతే అందరూ చేస్తారు, కాని మీరు మీ విశేషతలను దానం చేయాలి. తండ్రి విశేషతలే మీ విశేషతలు. కావున ఆ విశేషతలను దానం చేయండి. ఎవరైతే విశేషతల మహాదానులుగా ఉన్నారో వారు సదా కోసం మహాన్ గా ఉంటారు. పూజ్య స్వరూపంలో కానీ, పూజారుల స్వరూపంలో కానీ, మొత్తం కల్పమంతా మహాన్ గా ఉంటారు. బ్రహ్మాబాబాను చూశారు కదా, అంతిమంలో కూడా కలియుగ ప్రపంచ లెక్కల్లో కూడా మహాన్ గా ఉన్నారు కదా. కావున ఆది నుండి అంతిమం వరకు ఇటువంటి మహాదానులు మహాన్ గా ఉంటారు. అచ్ఛా - మిమ్మల్ని చూసి అందరూ సంతోషించారు, అంటే సంతోషాన్ని పంచారు కదా! చాలా బాగా జరుపుకున్నారు, అందరినీ సంతోషపెట్టారు, మీరు కూడా సంతోషించారు. బాప్ దాదా విశేష ఆత్మల విశేష కార్యాన్ని చూసి హర్షిస్తారు. స్నేహపు మాల తయారై ఉంది కదా! పురుషార్థపు మాల, సంపూర్ణంగా అయ్యే మాల అయితే సమయ ప్రతి సమయం ప్రత్యక్షమవుతుంది.
ఎవరు ఎంతగా సంపూర్ణ ఫరిస్తాగా అనుభవం అవుతారో వారు అంతగా మాలలో మణిగా కూర్చబడతారు అని భావించండి. వారు సమయ ప్రతి సమయం ప్రత్యక్షమవుతూ ఉంటారు. కాని స్నేహపు మాల అయితే పక్కాగా ఉంది కదా! స్నేహపు మాలలోని ముత్యాలు సదా అమరంగా, అవినాశిగా ఉంటాయి. స్నేహంలో అయితే అందరూ పాస్ మార్కులు తీసుకునేవారే. ఇకపోతే సమాధాన స్వరూపపు మాల తయారవ్వాలి. సంపూర్ణులు అనగా సమాధాన స్వరూపులు. ఉదాహరణకు బ్రహ్మా తండ్రిని చూశారు కదా, వారి ముందుకు సమస్యను తీసుకువెళ్ళేవారు కూడా సమస్యను మర్చిపోయేవారు. ఏం తీసుకుని వచ్చారు, ఏం తీసుకుని వెళ్ళారు! ఇది అనుభవం చేసారు కదా! సమస్యకు సంబంధించిన విషయాలను మాట్లాడే ధైర్యము ఉండేది కాదు, ఎందుకంటే సంపూర్ణ స్థితి ముందు సమస్యను బాల్యపు ఆటగా అనుభవం చేసేవారు, అందుకే సమాప్తమైపోయేది. దీనినే సమాధాన స్వరూపము అంటారు. ఒక్కొక్కరూ సమాధాన స్వరూపులుగా అయితే సమస్యలు ఎక్కడకు వెళ్తాయి? అర్ధకల్పము కోసం వీడ్కోల సమారోహం అయిపోతుంది. ఇప్పుడైతే విశ్వ సమస్యలకు సమాధానమే పరివర్తన. మరి గోల్డెన్ జూబ్లీని జరుపుకున్నారా. మోల్డ్ అయ్యేటటువంటి జూబ్లీని జరుపుకున్నారా. ఎవరైతే మోల్డ్ అవుతారో వారు ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి రాగలరు. మోల్డ్ అవ్వడం అనగా సర్వులకు ప్రియమైనవారిగా అవ్వడం. అందరి దృష్టి అయితే నిమిత్తంగా అయ్యేవారిపై ఉంటుంది. అచ్ఛా.
Comments
Post a Comment