18-01-1987 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
కర్మాతీత స్థితి యొక్క గుర్తులు.
బంధనముక్తులుగా తయారుచేసే, స్నేహ సాగరుడైన బాప్ దాదా గీతా పాఠశాలలకు నిమిత్తమైన సేవాధారి పిల్లల సన్ముఖంలో మాట్లాడుతున్నారు -
ఈ రోజు అవ్యక్త బాప్ దాదా తన యొక్క " అవ్యక్తస్థితి భవ” అనే వరదాని పిల్లలను మరియు అవ్యక్త ఫరిస్తాలను కలుసుకోవడానికి వచ్చారు. ఈ అవ్యక్త కలయిక మొత్తం కల్పంలో ఈ సంగమయుగంలోనే జరుగుతుంది. సత్యయుగంలో దేవతల కలయిక ఉంటుంది కానీ ఫరిస్తాల కలయిక, అవ్యక్త కలయిక ఈ సమయంలోనే ఉంటుంది. నిరాకారుడైన బాబా కూడా అవ్యక్తబ్రహ్మ ద్వారా కలుసుకుంటారు. నిరాకారునికి కూడా ఈ అవ్యక్త ఫరిస్తాల సభ చాలా ప్రియమనిపిస్తుంది. అందువలనే తన ధామాన్ని వదలి ఆకారి లేదా సాకారి ప్రపంచంలోకి కలుసుకోవడానికి వచ్చారు. ఫరిస్తా పిల్లల యొక్క స్నేహమనే ఆకర్షణతో బాబా కూడా రూపం, వేషం మార్చి పిల్లల ప్రపంచంలోకి రావల్సివస్తుంది. ఈ సంగమయుగం బాబా మరియు పిల్లల యొక్క అతి ప్రియమైన మరియు అతీతమైన ప్రపంచం. స్నేహమనేది అన్నిటికంటే ఎక్కువ ఆకర్షించే శక్తి. బంధనముక్తుడైన పరమాత్మని, శరీరం నుండి ముక్తుడైన బాబాని కూడా స్నేహం యొక్క బంధనలో బంధిస్తున్నారు, అశరీరీని కూడా అద్దె శరీరధారిగా చేస్తున్నారు. ఇదే పిల్లల స్నేహం యొక్క ప్రత్యక్షఋజువు.
ఈరోజు నలువైపుల ఉన్న పిల్లల స్నేహం యొక్క ధారలు స్నేహసాగరంలో ఇమిడిపోయే రోజు. పిల్లలు అంటారు - "మేము బాప్ దాదాని కలుసుకోవడానికి వచ్చాము అని”. పిల్లలు బాబాని కలుసుకోవడానికి వచ్చారా లేదా పిల్లలని కలుసుకోవడానికి బాబా వచ్చారా? లేదా
ఇద్దరూ మధువనంలో కలుసుకోవడానికి వచ్చారా? పిల్లలు స్నేహసాగరంలో లీనం అవ్వడానికి వచ్చారా లేక సాగరుడు గంగలో స్నానం చేయటానికి వచ్చారా? పిల్లలైతే ఒకే సాగరంలో స్నానం చేయటానికి వచ్చారు. కానీ బాబా వేల గంగలలో స్నానం చేయటానికి వస్తారు. అందువలన గంగలు మరియు సాగరుని యొక్క మేళా విచిత్రమైన మేళా. స్నేహసాగరంలో ఇమిడిపోయి సాగరుని సమానంగా అవుతున్నారు. ఈరోజు బాబా సమానంగా అయ్యే స్మృతిదినోత్సవం అంటే సమర్ధదినోత్సవం అని అంటారు. ఎందుకు? ఈ రోజు బ్రహ్మాబాబా బాబా సమానంగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయిన స్మృతిచిహ్నం యొక్క రోజు. బ్రహ్మ పిల్లవాని నుండి తండ్రి అంటే బ్రహ్మ పిల్లవాడు కూడా మరియు తండ్రి కూడా! ఈరోజు బ్రహ్మ పిల్లవాని రూపంలో సుపుత్రునిగా అయ్యే రుజువు ఇచ్చారు, స్నేహస్వరూపంగా, సమానంగా అయ్యే రుజువు ఇచ్చారు. అతి ప్రియం మరియు అతీతంగా అయ్యే రుజువు ఇచ్చారు, బాబా సమానంగా కర్మాతీతంగా అంటే కర్మ బంధనాలనుండి ముక్తిగా, అతీతంగా అయ్యే రుజువు ఇచ్చారు, కల్పమంతా కర్మలఖాతా నుండి ముక్తి అయ్యే రుజువు ఇచ్చారు. సేవా స్నేహం తప్ప ఇంకే బంధన లేదు. సేవలో కూడా సేవ యొక్క బంధనలో బంధిచబడే సేవాధారి కాదు. ఎందుకంటే సేవలో కూడా కొందరు బంధనయుక్తులుగా (బంధనలో బంధించబడి) అయ్యి సేవ చేస్తారు, కొందరు బంధన్ముక్తులుగా (బంధన నుండి ముక్తులుగా) అయ్యి సేవ చేస్తారు. బ్రహ్మాబాబా కూడా సేవాధారియే కానీ సేవలో హద్దు యొక్క రాయల్ కోరికలు సేవలో కూడా కర్మలఖాతా యొక్క బంధనలో బంధిస్తాయి. కానీ సత్యమైన సేవాధారులు ఈ కర్మల ఖాతా నుండి కూడా ముక్తులుగా ఉంటారు. దీనినే కర్మాతీత స్థితి అని అంటారు. దేహబంధన, దేహసంబంధాల బంధన ఇవి ఎలా అయితే బంధనాలో అదేవిధంగా సేవలో స్వార్థం అనేది కూడా బంధన, ఈ బంధన కూడా కర్మాతీతంగా అవ్వటంలో విఘ్నం వేస్తుంది. కర్మాతీతంగా అవ్వటం అంటే ఈ రాయల్ కర్మలఖాతా నుండి కూడా ముక్తి అవ్వాలి.
ఎక్కువమంది గీతాపాఠశాలలకు నిమిత్తమైన సేవాధారులు వచ్చారు కదా! సేవ అంటే ఇతరులని కూడా ముక్తులుగా చేయటం. ఇతరులని ముక్తులుగా చేస్తూ స్వయం బంధనలో బంధించబడటం లేదు కదా? నష్టోమోహులుగా అవ్వటానికి బదులు అంటే లౌకిక పిల్లలపై మోహాన్ని త్యాగం చేసి అలౌకిక విద్యార్థులపై మోహం పెట్టుకోవటం లేదు కదా? వీరు చాలా మంచివారు, చాలా మంచివారు అని. ఇలా మంచివారు,మంచివారు అని అనుకుంటూ వీళ్ళు నా వాళ్ళు అనే బంధనలో బంధించబడటం లేదు కదా? బంగారు సంకెళ్ళు ఇష్టమనిపించటం లేదు కదా? ఈరోజుని నాది,నాది అనే దాని నుండి ముక్తులుగా అంటే కర్మాతీతంగా అయ్యే రోజుగా జరుపుకోండి. ఇదే స్నేహానికి రుజువు. కర్మాతీతంగా అవ్వాలనే లక్ష్యం అందరికీ మంచిగా ఉంది. ఇప్పుడు ఎంత వరకు కర్మబంధనాల నుండి అతీతంగా అయ్యాను? అనేది పరిశీలన చేసుకోండి. మొదటి విషయం - లౌకికం మరియు అలౌకికంలో, కర్మ మరియు సంబంధం రెండింటిలో స్వార్ధభావం నుండి ముక్తులుగా అవ్వాలి. రెండవ విషయం - వెనుకటి జన్మల కర్మలఖాతా లేదా వర్తమాన పురుషార్థం యొక్క బలహీనత కారణంగా ఏ రకమైన వ్యర్ధ స్వభావ, సంస్కారాలకు వశం అవ్వటం నుండి ముక్తిగా అయ్యానా? ఎప్పుడైనా ఏదైనా బలహీన స్వభావ, సంస్కారాలు లేదా వెనుకటి స్వభావ,సంస్కారాలు వశీభూతం చేస్తున్నాయి అంటే బంధనయుక్తులుగా ఉన్నట్లు అంటే బంధన ముక్తులుగా కాలేదు. చేయాలనుకోవటం లేదు కానీ స్వభావ, సంస్కారాలు చేయిస్తున్నాయి అని ఆలోచించకండి. ఇది కూడా బంధనముక్త స్థితికి గుర్తు కాదు, బంధనయుక్త స్థితికి గుర్తు. మరొక విషయం - ఏదైనా సేవ యొక్క, సంఘటన యొక్క ప్రకృతి యొక్క పరిస్థితి స్వస్థితిని అంటే శ్రేష్టస్థితిని అలజడి చేస్తుంది అంటే ఇది కూడా బంధనముక్త స్థితి కాదు. ఈ బంధన నుండి కూడా ముక్తి అవ్వాలి. మరొక విషయం - పాత ప్రపంచంలో, పాత అంతిమ శరీరం యొక్క ఏ రకమైన వ్యాధి మీ శ్రేష్టస్థితిని అలజడిలోకి తీసుకువచ్చినా కానీ దాని నుండి కూడా ముక్తి అవ్వాలి. ఒకటి వ్యాధి రావటం, మరొకటి వ్యాధి చలింపచేయటం. వ్యాధి రావటం అనేది జరుగుతుంది కానీ చలించటం అనేది బంధనయుక్త స్థితికి గుర్తు. స్వచింతన, జ్ఞానచింతన, శుభచింతకులుగా అయ్యే చింతనకు బదులు శరీర వ్యాధి యొక్క చింతన చేయటం నుండి కూడా ముక్తి అవ్వాలి. ఎందుకంటే ఎక్కువగా ప్రకృతి (శరీరం) యొక్క చింతన కూడా చింత రూపంలోకి మారిపోతుంది. దీని నుండి కూడా ముక్తి అవ్వటాన్నే కర్మాతీత స్థితి అంటారు. ఈ అన్ని బంధనాలను వదలడమే కర్మాతీత స్థితికి గుర్తు. బ్రహ్మాబాబా ఈ అన్ని బంధనాల నుండి ముక్తి అయ్యి కర్మాతీత స్థితిని పొందారు. కనుక ఈ రోజు బ్రహ్మాబాబా సమానంగా కర్మాతీతంగా అయ్యే రోజు. ఈ రోజు యొక్క గొప్పతనం అర్ధమైందా! మంచిది.
ఈరోజు విశేషంగా సేవాధారులు అంటే పుణ్యాత్మలుగా అయ్యేవారి సభ. గీతాపాఠశాల తెరవటం అంటే పుణ్యాత్మగా అవ్వటం. అన్నింటికంటే పెద్ద పుణ్యం - ప్రతి ఆత్మని సదాకాలికంగా అంటే అనేక జన్మలకు పాపాల నుండి ముక్తి చేయటం. ఇదే పుణ్యం. గీతాపాఠశాల అనే పేరు చాలా బావుంది. కనుక గీతాపాఠశాల వారు అంటే స్వయం గీతాపాఠాన్ని చదువుకునేవారు మరియు చదివించేవారు. గీతాజ్ఞానం యొక్క మొదటి పాఠం - అశరీరీ ఆత్మగా అవ్వండి మరియు అంతిమ పాఠం - నష్టోమోహ, స్మృతిస్వరూపంగా అవ్వండి. కనుక మొదటి పాఠం అనేది విధి మరియు అంతిమ పాఠం విధి ద్వారా సిద్ధిని పొందటం. గీతాపాఠశాల వారు ప్రతి సమయం ఈ పాఠం చదువుకుంటున్నారా లేదా కేవలం మురళియే వినిపిస్తున్నారా? ఎందుకంటే సత్యమైన గీతాపాఠశాల యొక్క విధి ఏమిటంటే - మొదట స్వయం చదువుకోవటం అంటే తయారవ్వటం మరియు ఇతరులకు నిమిత్తంగా అయ్యి చదివించటం. గీతాపాఠశాలల వారందరు ఈ విధితో సేవ చేస్తున్నారా? ఎందుకంటే మీరందరు ఈ విశ్వం ముందు పరమాత్మ చదువుకి ఉదాహరణ. ఉదాహరణకి గొప్పతనం ఉంటుంది. ఉదాహరణ అనేది అనేకాత్మలకు ఆవిధంగా తయారయ్యేటందుకు ప్రేరణ ఇస్తుంది. గీతాపాఠశాల వారిపై చాలా పెద్ద బాధ్యత ఉంది. ఒకవేళ కొద్దిగా అయినా ఉదాహరణగా అవ్వటంలో లోపం ఉంటే అనేకాత్మల భాగ్యం తయారుచేయడానికి బదులు భాగ్యం నుండి వంచితం చేయడానికి కూడా నిమిత్తం అవుతారు. ఎందుకంటే చూసేవారు మరియు వినేవారు సాకార రూపంలో నిమిత్తాత్మలైన మిమ్మల్నే చూస్తారు. బాబా అయితే గుప్తం కదా! మీ శ్రేష్టకర్మలను చూసి అనేకాత్మలు శ్రేష్టకర్మల భాగ్యరేఖను శ్రేష్టంగా తయారుచేసుకునే శ్రేష్టకర్మను సదా చేసి చూపించండి. 1. స్వయాన్ని ఉదాహరణగా భావించాలి మరియు 2. సదా మీ గుర్తుని స్మృతిలో ఉంచుకోవాలి. గీతాపాఠశాలకు గుర్తు ఏమిటో తెలుసా? కమలపుష్పం. బాప్ దాదా చెప్పారు కదా, కమలంగా అవ్వండి మరియు అమలు చేయండి అని. కమలంగా అయ్యే సాధనమే, అమలు చేయటం. ఒకవేళ అమలు చేయకపోతే కమలంగా కాలేరు. అందువలన సాంపిల్ (ఉదాహరణ) మరియు సింబల్ అంటే కమలపుష్పం యొక్క గుర్తు రెండింటిని సదా బుద్దిలో ఉంచుకోండి. సేవ ఎంతగా వృద్ధి అవుతున్నా కానీ సేవ చేస్తూ అతీతంగా అయ్యి ప్రియంగా అవ్వాలి. కేవలం ప్రియంగా అవ్వటం కాదు, అతీతంగా అయ్యి ప్రియంగా అవ్వాలి. ఎందుకంటే సేవపై ప్రేమ అనేది మంచిదే కానీ ప్రేమ తగుల్పాటుగా మారకూడదు. దీనినే అతీతంగా అయ్యి ప్రియంగా అవ్వటం అంటారు. సేవకు నిమిత్తంగా అయ్యారు, మంచిదే, పుణ్యాత్మ అనే బిరుదు అయితే లభించేసింది, అందువలనే విశేష ఆహ్వానం లభించింది ఎందుకంటే పుణ్య కర్మ చేసారు. ఇప్పుడిక ముందు సిద్ధి యొక్క పాఠం ఏదైతే చదివించారో ఆ సిద్ధి ద్వారా వృద్ధి పొందుతూ ఉండాలి. ఇక ముందు ఏమి చేయాలో అర్థమైందా?
అందరు ఒక విషయం యొక్క నిరీక్షణలో ఉన్నారు, అది ఏమిటి? (ఫలితం చెప్పాలి) ఫలితం మీరు చెప్తారా లేదా బాబా చెప్పాలా? బాప్ దాదా ఏమి చెప్పారు, ఫలితం తీసుకుంటాను అన్నారా లేదా ఇస్తాను అన్నారా? డ్రామా ప్లానానుసారంగా ఎవరు, ఎలా నడిచినా కానీ మంచిదనే అంటారు. అందరు లక్ష్యం అయితే బాగా పెట్టుకున్నారు, కర్మలో లక్షణాలను శక్తిననుసరించి చూపించారు. చాలా సమయం యొక్క వరదానాన్ని నెంబర్ వారీగా ధారణ కూడా చేసారు మరియు ఇప్పుడు కూడా ఏ వరదానాన్ని పొందారో ఆ వరదానమూర్తి అయ్యి బాబా సమానంగా వరదాతగా అవుతూ ఉండాలి. ఇప్పుడు బాప్ దాదా ఏమి కోరుకుంటున్నారు? వరదానం అయితే లభించింది, ఇప్పుడు ఈ సంవత్సరం చాలా సమయం బంధనముక్తులుగా అంటే బాబా సమానంగా కర్మాతీత స్థితి యొక్క విశేష అభ్యాసం చేస్తూ ప్రపంచానికి అతీతస్థితి మరియు ప్రియమైన స్థితి అనుభవం చేయించండి. అప్పుడప్పుడు అనుభవం చేయించే ఈ విధిని మార్చి చాలా సమయం యొక్క అనుభూతులను ప్రత్యక్ష స్వరూపంలో చూపించండి. చాలా సమయం ప్రాప్తి యొక్క వరదానానికి ప్రత్యక్షఫలంగా చాలా సమయం అచంచలమైన, స్థిరమైన, నిర్విఘ్న, నిర్భంధ, నిర్వికల్ప, నిర్వికర్మ, అంటే నిరాకారి, నిర్వికారి, నిరహంకారి స్థితిని విశ్వం ముందు ప్రత్యక్ష రూపంలో తీసుకురండి. దీనినే బాబా సమానంగా అవ్వటం అంటారు.
ఫలితంలో మొదట స్వయంతో ఎంత సంతుష్టంగా ఉన్నాను? అనేది చూసుకోండి. ఎందుకంటే 1.స్వయం యొక్క సంతుష్టత 2.బ్రాహ్మణ పరివారం యొక్క సంతుష్టత 3.బాబా యొక్క సంతుష్టత. మూడింటి ఫలితంలో ఇప్పుడింకా మార్కులు తీసుకోవాలి. కనుక సంతుష్టంగా అవ్వండి మరియు సంతుష్టం చేయండి. బాబా యొక్క సంతుష్టమణిగా అయ్యి సదా మెరుస్తూ ఉండండి. బాప్ దాదా పిల్లల గౌరవాన్ని కాపాడాలనుకుంటున్నారు, కనుక రికార్డ్ ని గుప్తంగా చెప్తున్నారు. తెలివైనవారు అందువలన బాబా సదా సంపన్నస్థితిని చూస్తున్నారు.
అందరూ సంతుష్టమణులే కదా? వృద్ధిని చూస్తూ సంతోషంగా ఉండండి. ఆబూ రోడ్ వరకు క్యూ ఉండాలి అని మీరందరు నిరీక్షణలో ఉన్నారు. ఇప్పుడైతే కేవలం హాల్ నిండింది అంతే, ఆ తర్వాత ఏం చేస్తారు? అప్పుడు నిద్రపోతారా లేదా అఖండయోగం చేస్తారా? ఇది కూడా జరగాలి కదా! అందువలనే కొద్దిలోనే రాజీ అయిపోండి. మూడు అడుగుల స్థలానికి బదులు ఒక అడుగు స్థలం దొరికినా రాజీ అయిపోండి. మొదట్లో ఇలా ఉండేది అని ఆలోచించకండి. పరివారం వృద్ధి అవుతున్నారు అనే ఆనందంలో ఉండండి. ఆకాశం మరియు భూమికి అయితే హద్దు అనేది లేదు కదా! పర్వతాలు కూడా చాలా ఉన్నాయి. ఇది కూడా ఉండాలి, ఇది కూడా లభించాలి అని పెద్ద విషయంగా చేసేస్తున్నారు. ఏమి చేయాలి? ఎలా చేయాలి? అని దాదీలు కూడా ఆలోచనలో పడిపోతున్నారు. పగలు ఎండలో నిద్రపోయి, రాత్రి మేల్కొనే రోజులు కూడా వస్తాయి. ప్రజలు అగ్ని వెలిగించుకుని వేడిగా అయ్యి కూర్చుంటారు మరియు మీరు యోగాగ్నిని వెలిగించి కూర్చుంటారు. ఇది ఇష్టమేనా లేదా మంచాలు కావాలా? కూర్చోవడానికి కుర్చీలు కావాలా? ఈ పర్వతాలనే కుర్చీలుగా చేసుకోవాలి. నడుముకి విశ్రాంతి కావాలి కదా, అంతే ఇంకేమీ లేదు. 5 వేల మంది వస్తే కుర్చీలు దిగవలసి వస్తుంది కదా! మరియు క్యూ వచ్చినప్పుడు మంచాలు కూడా వదలవలసి వస్తుంది. ఎవరెడిగా ఉండాలి. ఒకవేళ మంచాలు లభించినా అలాగే అనాలి, క్రింద పడుకోవలసి వచ్చినా అలాగే అనాలి. ఇలా ఆదిలో చాలా అభ్యాసం చేయించారు, 15 రోజుల వరకు మందుల దుకాణం మూసేసేవారు, ఉబ్బస వ్యాధితో ఉన్నవారికి కూడా సజ్జలతో చేసిన రొట్టెలు మరియు మజ్జిగ ఇచ్చేవారు కానీ రోగం రాలేదు, అందరు ఆరోగ్యంగా ఉన్నారు. ఇలా ఆదిలో అభ్యాసం చేసి చూపించారు మరలా అంతిమంలో కూడా జరుగుతుంది కదా! ఆలోచించండి, ఉబ్బసం వ్యాధితో ఉన్న వారికి మజ్జిగ ఇస్తే మొదటే భయపడిపోతారు, కానీ ఆశీర్వాదమనే మందు వెంట ఉన్న కారణంగా మనోరంజనంగా అయిపోతుంది. పరీక్షగా అనిపించదు, కష్టమనిపించదు, త్యాగం అనిపించదు, మనోరంజనంగా అనిపిస్తుంది. దీనికి అందరు తయారుగా ఉన్నారా లేదా ఏర్పాట్లు చేసేవారి దగ్గరికి టీచర్స్ జాబితా తయారుచేసి తీసుకువెళ్తారా? అందువలనే పిలవటం లేదు కదా! సమయం వచ్చినప్పుడు సాధనాలకు అతీతంగా సాధన యొక్క సిద్ది స్వరూపాన్ని అనుభవం చేసుకుంటారు. ఆత్మిక సేన కదా! సేన యొక్క పాత్రను కూడా అభినయించాలి. ఇప్పుడైతే స్నేహ పరివారం, మన ఇల్లు ఈ అనుభవం చేసుకుంటున్నారు. కానీ సమయానికి ఆత్మికసేనగా అయ్యి ఏ సమయం వచ్చినా దానిని స్నేహంతో దాటాలి. ఇది కూడా సైన్యం యొక్క విశేషత.
సర్వ స్నేహి ఆత్మలకు, సదా సమీపంగా ఉండే ఆత్మలకు, సదా బంధనముక్తులుగా, కర్మాతీత స్థితిని చాలా సమయం యొక్క అనుభవం చేసుకునే విశేషాత్మలకు, హృదయసింహాసనాధికారి, సంతుష్టమణులకు బాప్ దాదా యొక్క అవ్యక్త స్థితి భవ యొక్క వరదానంతో పాటు ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ మరియు గుడ్ నైట్.
Comments
Post a Comment