మధువన నివాసియులతో అవ్యక్త బాప్ దాదా యొక్క ఆత్మిక సంభాషణ.
ఈరోజు విశ్వరచయిత బాబా తన యొక్క మాస్టర్ రచయిత పిల్లలను చూస్తున్నారు. మాస్టర్ రచయితలు తమ యొక్క రచన స్మృతిలో ఎంతవరకు స్థితులై ఉంటున్నారు అని చూస్తున్నారు. రచయిత అయిన మీ అందరి మొదటి రచన ఈ దేహం. ఈ దేహరూపి రచన యొక్క రచయితగా ఎంతవరకు అయ్యారు? దేహరూపి రచన అప్పుడప్పుడు రచయిత అయిన మిమ్మల్ని ఆకర్షితం చేసుకుని రచన స్థితిని మరిపింపచేయటం లేదు కదా? యజమాని అయ్యి ఈ రచనని సేవలో ఉపయోగిస్తున్నారా? ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏది కావాలంటే అది యజమాని అయ్యి చేస్తున్నారా? మొట్టమొదట ఈ దేహం యొక్క యజమాని స్థితి యొక్క అభ్యాసమే ప్రకృతికి యజమానిగా, విశ్వానికి యజమానిగా చేస్తుంది. ఒకవేళ దేహం యొక్క యజమాని స్థితిలో సంపూర్ణ సఫలత పొందకపోతే విశ్వానికి యజమాని స్థితిలో కూడా సంపన్నంగా కాలేరు. వర్తమాన సమయం యొక్క ఈ జీవితమే భవిష్యత్తుకి అద్దం వంటిది. ఈ అద్దం ద్వారా స్వయం యొక్క భవిష్యత్తు స్పష్టంగా చూడవచ్చు. మొదట ఈ దేహం యొక్క సంబంధం మరియు సంస్కారానికి అధికారి అవ్వటం ఆధారంగానే యజమాని స్థితి సంస్కారం తయారౌతుంది. సంబంధంలో అతీతస్థితి మరియు ప్రియమైన స్థితి ఇదే యజమాని స్థితికి గుర్తు. సంస్కారాలలో నిర్మాణ స్థితి(గౌరవం కోరుకోకుండా ఉండటం) మరియు నిర్మాణం (సత్యయుగం యొక్క స్థాపన) ఈ రెండు విశేషతలు యజమాని స్థితికి గుర్తు. వెనువెంట సర్వ ఆత్మల సంపర్కంలోకి రావడం, స్నేహి అవ్వడం. మనస్పూర్వక స్నేహం యొక్క ఆశీర్వాదాలు మరియు శుభభావన సర్వుల మనస్సు నుండి ఈ ఆత్మకి వస్తాయి. తెలిసినా, తెలియకపోయినా, దూర సంబంధీకులైనా, సంపర్కంలో వారైనా కానీ వీరు నా వారు అని అనుభవం చేసుకుంటారు. స్నేహం ద్వారా “నాది” అనేది అనుభవం అవుతుంది. దూర సంబంధం అయినా కానీ స్నేహం సంపన్నతని అనుభవం చేయిస్తుంది. విశ్వ యజమాని లేక దేహం యొక్క యజమాని స్థితి యొక్క అభ్యాసీ ఆత్మల ద్వారా వారు ఎవరి సంపర్కంలోకి వచ్చినా ఆ విశేష ఆత్మ ద్వారా దాత స్థితి అనుభవం అవుతుంది, ఈ విశేషత వారిలో ఉంటుంది. వీరు తీసుకునేవారు అని ఎవరి సంకల్పంలో కూడా రాదు. ఆ ఆత్మ ద్వారా సుఖం యొక్క దాత స్థితి లేక శాంతి, ప్రేమ, ఆనందం, సంతోషం, సహయోగం, ధైర్యం, ఉత్సాహ, ఉల్లాసాలు ఏదో ఒక విశేషత యొక్క దాత స్థితి అనుభవం అవుతుంది. సదా విశాలబుద్ది మరియు విశాల హృదయం యొక్క అనుభవం అవుతుంది. దీనినే మీరు పెద్ద మనస్సు అని అంటారు కదా! ఇలా అనుభవం అవుతుంది. ఇప్పుడు ఈ గుర్తుల ద్వారా నేను ఏవిధంగా అవుతాను? అని స్వయాన్ని పరిశీలించుకోండి. అద్దం అందరి దగ్గర ఉంది. ఎంత స్వయాన్ని స్వయం తెలుసుకుంటారో అంత ఇతరులు తెలుసుకోలేరు కనుక స్వయాన్ని తెలుసుకోండి.
ఈరోజు కలుసుకోవడానికి వచ్చారు. అయినప్పటికి అందరు వచ్చారు. కనుక బాప్ దాదా కూడా పిల్లలందరికి స్నేహంతో పాటు గౌరవం కూడా ఇస్తున్నారు. అందువలనే ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. మధువనం వారు తమ అధికారాన్ని వదిలి పెట్టడంలేదు. సమీపంగా కూర్చున్నారు. అన్ని విషయాలలో నిశ్చింత అయ్యి కూర్చున్నారా? బయట ఉండేవారికి శ్రమ చేయవలసి ఉంటుంది. సంపాదించడం మరియు తినడం, ఇది తక్కువ శ్రమ కాదు. మధువనంలో సంపాదించాలనే చింతే లేదు కదా! కుటుంబం వారు సహించవలసి వస్తుంది మరియు ఎదుర్కోవల్సి కూడా వస్తుంది ఇది బాప్ దాదాకి కూడా తెలుసు. హంసలు మరియు కొంగల మధ్య ఉంటూ వారు ఉన్నతి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ, మీరు కొన్ని విషయాలలో స్వతహాగానే అతీతంగా అయిపోయారు. విశ్రాంతితో ఉంటున్నారు, విశ్రాంతితో తింటున్నారు మరియు విశ్రాంతితో చేస్తున్నారు. బయట ఆఫీసుకి వెళ్ళేవారు, రోజంతటిలో విశ్రాంతిగా ఉంటారా? ఇక్కడ శరీరానికి కూడా విశ్రాంతి, బుద్ధికి కూడా విశ్రాంతి లభిస్తుంది. కనుక మధువనం నివాసీల స్థితి అందరికంటే మొదట నెంబర్ అయ్యింది కదా! ఎందుకంటే ఒకే పని. చదువుకుంటున్నా బాబా చదువు చదువుకుంటున్నారు, సేవ కూడా యజ్ఞ సేవ చేస్తున్నారు. ఇది అనంతమైన తండ్రి యొక్క అనంతమైన ఇల్లు. ఒకే విషయం. రెండవది ఏమి లేదు. నా సేవాకేంద్రం అనేది కూడా ఉండకూడదు. మధువన నివాసీలకు కొన్ని విషయాలలో సహజ పురుషార్థం మరియు సహజ ప్రాప్తి ఉంది. మధువనం వారు గోల్డెన్ జూబ్లీ ప్రోగ్రామ్ తయారుచేసారు కదా! కేవలం ఉత్సవం కాదు. దీనికి కరపత్రాలు ముద్రించారు ఇది విశ్వసేవ. స్వయం స్థితికి ఏమి తయారుచేసుకున్నారు? స్వయం వేదికపై ఏ పాత్ర అభినయిస్తారు? ఆ వేదికపైకి అయితే ఉపన్యాసకులను తయారుచేసుకునే ప్రోగ్రామ్ తయారుచేసుకున్నారు కానీ స్వయం యొక్క స్థితికి ఏమి ప్రోగ్రామ్ తయారుచేసుకున్నారు? ఇంటి నుంచే ఉద్దరణ ప్రారంభించేవారు అంటే మధువనం నివాసీలే కదా! ఏదైనా ఉత్సవం జరిగితే ఏమి చేస్తారు? (దీపం వెలిగిస్తారు). గోల్డెన్ జూబ్లీ యొక్క దీపం ఎవరు వెలిగిస్తారు? ప్రతి విషయం ఎవరు ప్రారంభిస్తారు? మధువనం నివాసీయులలో ధైర్యం, ఉల్లాసం, వాయుమండలం అన్నీ సహయోగిగా ఉన్నాయి. ఎక్కడ అన్ని సహయోగిగా ఉంటాయో అక్కడ అన్నీ సహజం అవుతాయి. కేవలం ఒక విషయం చేయాలి అది ఏమిటి?
బాప్ దాదా పిల్లలందరిపై ఇదే శ్రేష్ట ఆశ పెట్టుకుంటారు - ప్రతి ఒక్కరు బాబా సమానంగా అవ్వాలి అని. సంతుష్టంగా ఉండటం మరియు సంతుష్టంగా చేయటం ఇదే విశేషత. మొదటి ముఖ్య విషయం - స్వయంతో అంటే మీ పురుషార్థంతో, మీ స్వభావ, సంస్కారాలతో బాబాని ఎదురుగా పెట్టుకుని సంతుష్టంగా ఉన్నానా? అని పరిశీలించుకోండి. నేను సంతుష్టంగా ఉన్నాను అని అనుకోవటం కాదు. శక్తిననుసరించి చేసుకోవటం ఇది వేరే విషయం. కానీ స్వయం సంతుష్టంగా ఉండటం మరియు ఇతరులని సంతుష్టం చేయటం ఇదే సంతుష్టత యొక్క మహానత. వీరు యదార్ధ రూపంలో సంతుష్ట ఆత్మ అని ఇతరులు కూడా అనుభవం చేసుకోవాలి. సంతుష్టతలో అన్నీ వచ్చేస్తాయి. అలజడి అవ్వకూడదు మరియు అలజడి చేయకూడదు ఇదే సంతుష్టత. అలజడి చేసేవారు చాలా మంది ఉంటారు కానీ స్వయం అలజడి కాకూడదు. అగ్ని యొక్క సెగ నుండి స్వయాన్ని స్వయం రక్షణగా ఉంచుకోవాలి. ఇతరులను చూడకూడదు. నేను ఏమి చేయాలి అని స్వయాన్ని చూసుకోవాలి. నేను నిమిత్తంగా అయ్యి ఇతరులకు శుభభావన, శుభకామన యొక్క సహయోగం ఇవ్వాలి. ఇదే విశేష ధారణ. దీనిలో అన్నీ వచ్చేస్తాయి. వీరి యొక్క గోల్డెన్ జూబ్లీ కూడా చేస్తారు కదా! నిమిత్తంగా మధువనం నివాసీయులది కానీ అందరిది. మోహజీత్ యొక్క కథ విన్నారు కదా! అలా సంతుష్టత యొక్క కథ తయారుచేయండి. ఎవరి దగ్గరికి ఎవరు వెళ్ళినా, ఎవరు ఎంత లోతుగా పరీక్షించినా అందరి నోటి నుండి, అందరి మనస్సు నుండి సంతుష్టత యొక్క విశేషత అనుభవం అవ్వాలి. వీరు ఇంతే అని అనకూడదు. నేను ఎలా అయినా తయారై ఇతరులను కూడా తయారుచేయాలి అనే సంకల్పం ఉండాలి. ఈ చిన్న విషయం వేదికపై చూపించండి. మంచిది!
Comments
Post a Comment