ఉదాసీనత వచ్చేందుకు కారణము - చిన్న చిన్న ఆజ్ఞల ఉల్లంఘన.
ఈరోజు బేహద్ ఉన్నతోన్నత బాబా, ఉన్నతోన్నతంగా తయారుచేసే తండ్రి తన నలువైపుల ఉన్న పిల్లలలో విశేషంగా ఆజ్ఞాకారి పిల్లలను చూస్తున్నారు. అందరు తమని తాము ఆజ్ఞాకారి పిల్లలుగా భావిస్తున్నారు కానీ నెంబర్ వారీ. కొంతమంది సదా ఆజ్ఞాకారి మరియు కొంతమంది ఆజ్ఞాకారియే కానీ సదా కాదు. ఆజ్ఞాకారి అనే జాబితాలోకి అయితే పిల్లలందరు వచ్చేస్తారు కానీ తప్పకుండా తేడా ఉంటుంది. ఆజ్ఞ ఇచ్చే బాబా పిల్లలందరికీ ఒకే సమయంలో ఒకే ఆజ్ఞ ఇస్తున్నారు వేర్వేరుగా, రకరకాల ఆజ్ఞలను ఇవ్వటం లేదు అయినప్పటికీ నెంబర్ వారీ ఎందుకు అవుతున్నారు? ఎందుకంటే ఎవరైతే సదా ప్రతి సంకల్పం లేదా ప్రతి కర్మ చేస్తూ బాబా ఆజ్ఞ యొక్క సహజ స్మృతి స్వరూపంగా అవుతారో వారు స్వతహాగానే ప్రతి సంకల్పం, మాట మరియు కర్మలో ఆజ్ఞానుసారం నడుస్తారు మరియు ఎవరైతే స్మృతి స్వరూపంగా అవ్వరో వారికి మాటిమాటికి స్మృతి ఇప్పించవలసి వస్తుంది. అప్పుడప్పుడు స్మృతి కారణంగా ఆజ్ఞాకారి అయ్యి నడుస్తారు మరియు అప్పుడప్పుడు నడిచిన తర్వాత ఆజ్ఞని స్మృతి చేస్తారు. ఎందుకంటే ఆజ్ఞ యొక్క స్మృతిస్వరూపంగా లేరు. శ్రేష్ట కర్మకు ఏదైతే ప్రత్యక్షఫలం లభిస్తుందో ఆ ప్రత్యక్షఫలం యొక్క అనుభూతి లేని కారణంగా కర్మ జరిగిపోయిన తర్వాత ఈ ఫలితం ఎందుకు వచ్చింది అని స్మృతి వస్తుంది. కర్మ అయిపోయిన తర్వాత పరిశీలించుకుంటున్నారు లేదా అనుకుంటున్నారు - బాబా యొక్క ఆజ్ఞ ఏది ఎలా ఉందో అలా నడవని కారణంగా ప్రత్యక్షఫలం యొక్క అనుభవం అవ్వలేదు అని. అంటే ఆజ్ఞ యొక్క స్మృతిస్వరూపంగా లేరు. కర్మ యొక్క ఫలాన్ని చూసి స్మృతి వచ్చింది. మొదటి నెంబర్ - సహజంగా, స్వతహాగా స్మృతిస్వరూప ఆజ్ఞాకారి మరియు రెండవ నెంబర్ - అప్పుడప్పుడు స్మృతితో కర్మ చేసేవారు మరియు అప్పుడఈ రోజు అత్యంత గొప్పవారైన అనంతమైన తండ్రి, ఉన్నతాతి ఉన్నతంగా తయారుచేసే తండ్రి నలువైపులా ఉన్న తమ పిల్లల్లో విశేషంగా ఆజ్ఞాకారీ పిల్లలను చూస్తున్నారు. అందరూ తమను తాము ఆజ్ఞాకారీ పిల్లలుగా భావిస్తారు కానీ నంబరువారుగా ఉన్నారు. కొందరు సదా ఆజ్ఞాకారులుగా ఉన్నారు, మరికొందరు కేవలం ఆజ్ఞాకారులుగా ఉన్నారు కానీ సదా ఉండరు. ఆజ్ఞాకారుల లిస్టులోకైతే పిల్లలందరూ వస్తారు కానీ తప్పకుండా తేడా ఉంది. ఆజ్ఞాపించే తండ్రి పిల్లలందరికీ ఒకే సమయంలో ఒకే ఆజ్ఞను ఇస్తారు, వేర్వేరుగా రకరకాల ఆజ్ఞలను ఇవ్వరు. అయినా నంబరువారుగా ఎందుకుంటారు? ఎందుకంటే ఎవరైతే సదా ప్రతి సంకల్పం మరియు ప్రతి కర్మ చేస్తూ సహజంగానే తండ్రి ఇచ్చిన ఆజ్ఞ యొక్క స్మృతి స్వరూపంగా అవుతారో, వారు స్వతహాగానే ప్రతి సంకల్పం, మాట మరియు కర్మలో ఆజ్ఞానుసారంగా నడుస్తారు. ఎవరైతే స్మృతి స్వరూపులుగా అవ్వరో, వారికి పదే-పదే స్మృతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు, స్మృతి ఉన్న కారణంగా ఆజ్ఞాకారులుగా నడుచుకుంటారు, అప్పుడప్పుడు, నడిచిన తర్వాత ఆజ్ఞను గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే ఆజ్ఞ యొక్క స్మృతి స్వరూపులుగా లేరు. శ్రేష్ఠ కర్మకు ఏదైతే ప్రత్యక్ష ఫలం లభిస్తుందో, ఆ ప్రత్యక్ష ఫలం అనుభవం అవ్వని కారణంగా, కర్మ చేసిన తర్వాత, ఈ రిజల్టు ఎందుకు వచ్చింది అని గుర్తుకొస్తుంది. కర్మ చేసిన తర్వాత చెక్ చేసుకున్నప్పుడు ‘బాబా ఇచ్చిన ఆజ్ఞానుసారంగా నడుచుకోలేదు కావున ఏ ప్రత్యక్ష ఫలమైతే అనుభవమవ్వాలో అది అవ్వలేదు’ అని అర్థం చేసుకుంటారు. దీనినే - ఆజ్ఞ యొక్క స్మృతి స్వరూపులుగా లేరు కానీ కర్మ ఫలం చూసిన తర్వాత స్మృతి రావడమని అంటారు. కావున మొదటి నంబరు వారు - సహజంగా, స్వతహాగా, స్మృతిస్వరూపులు, ఆజ్ఞాకారులు. రెండవ నంబరు వారు - అప్పుడప్పుడు స్మృతితో కర్మ చేస్తారు, అప్పుడప్పుడు కర్మ చేసిన తర్వాత స్మృతిలోకి వస్తారు. ఇక మూడవ నంబరు వారి విషయాన్ని వదిలేయండి. రెండు మాలలు ఉన్నాయి. మొదటిది చిన్న మాల, రెండవది పెద్ద మాల. మూడవ వారి మాల లేనే లేదు. అందుకే ఇరువురి గురించే మాట్లాడుతున్నాము.
‘నంబరువన్ ఆజ్ఞాకారులు’ సదా అమృతవేళ నుండి రాత్రి వరకు, మొత్తం రోజంతటి దినచర్యలోని ప్రతి కర్మను ఆజ్ఞానుసారంగా నడుచుకోవడం కారణంగా ఏ కర్మలోనూ శ్రమను అనుభవం చేయరు. వారు ఆజ్ఞాకారులుగా అయినందుకు విశేష ఫలంగా తండ్రి ఆశీర్వాదాలను అనుభవం చేస్తారు. ఎందుకంటే ఆజ్ఞాకారీ పిల్లలకు ప్రతి అడుగులోనూ బాప్ దాదాల హృదయపూర్వక ఆశీర్వాదాలు తోడుగా ఉన్నాయి కనుక ఈ హృదయపూర్వక ఆశీర్వాదాల కారణంగా ప్రతి కర్మ ఫలదాయకంగా ఉంటుంది. ఎందుకంటే కర్మ అనేది బీజం మరియు బీజం నుండి ఏదైతే ప్రాప్తిస్తుందో అది ఫలం. నంబరువన్ ఆజ్ఞాకారీ ఆత్మల ప్రతి కర్మ రూపీ బీజం శక్తిశాలిగా ఉన్న కారణంగా ప్రతి కర్మకు ఫలముగా సంతుష్టత మరియు సఫలత ప్రాప్తిస్తాయి. వారికి స్వయం పట్ల కూడా సంతుష్టత ఉంటుంది, కర్మ ఫలం పట్ల కూడా సంతుష్టత ఉంటుంది మరియు ఇతర ఆత్మల సంబంధ-సంపర్కంలో కూడా సంతుష్టత ఉంటుంది. నంబరు వన్ ఆజ్ఞాకారీ ఆత్మలలో ఈ మూడు రకాల సంతుష్టత స్వతహాగా మరియు సదా అనుభవమవుతాయి. చాలా సార్లు చాలా మంది పిల్లలు తమ కర్మల విషయంలో, నేను చాలా బాగా విధిపూర్వకంగా కర్మ చేశానని స్వయంతో సంతుష్టమవుతారు కానీ అక్కడ సఫలత రూపీ ఫలం ఎంతగా ఉండాలని స్వయం అనుకుంటారో అంతగా కనిపించదు. కొన్ని సార్లు స్వయంతో కూడా సంతుష్టంగా ఉంటారు, ఫలంతో కూడా సంతుష్టంగా ఉంటారు కానీ సంబంధ-సంపర్కాలలో సంతుష్టత ఉండదు. ఇలాంటి వారిని నంబరు వన్ ఆజ్ఞాకారులని అనరు. నంబరు వన్ ఆజ్ఞాకారులు మూడు విషయాలలోనూ సంతుష్టతను అనుభవం చేస్తారు.
వర్తమాన సమయమనుసారంగా, చాలా మంది శ్రేష్ఠమైన ఆజ్ఞాకారీ పిల్లలతో అప్పుడప్పుడు కొంతమంది ఆత్మలు తమను తాము అసంతుష్టంగా అనుభవం చేస్తున్నారు. ఫలానావారితో అందరూ సంతుష్టంగా ఉంటారు అన్నట్లు ఎవరూ ఉండరు కదా అని మీరు ఆలోచిస్తారు. ఎవరో ఒకరు అసంతుష్టం అవుతారు కానీ దానికి చాలా కారణాలు ఉంటాయి. స్వయం యొక్క కారణాలు తెలియని కారణంగా అపార్థం చేసుకుంటారు. రెండవ విషయము - తమ బుద్ధి అనుసారంగా పెద్దవారి పట్ల కామనలు, కోరికలు ఎక్కువగా పెట్టుకుంటారు మరియు ఆ కోరికలు పూర్తి అవ్వనప్పుడు అసంతుష్టమవుతారు. మూడవ విషయము - చాలా మంది ఆత్మల పాత స్వభావ-సంస్కారాలు మరియు లెక్కాచారాల కారణంగా కూడా సంతుష్టమవ్వాల్సిన వారు సంతుష్టమవ్వరు. కావున నంబరువన్ ఆజ్ఞాకారి ఆత్మల ద్వారా లేక శ్రేష్ఠ ఆత్మల ద్వారా సంతుష్టత లభించకపోవడానికి వేరే కారణాలేమీ ఉండవు, కానీ వారు స్వయం యొక్క కారణాల వల్ల స్వయం అసంతుష్టంగా ఉండిపోతారు. అందుకే ప్రతి ఒక్కరితో ఎవరో ఒకరు అసంతుష్టంగా ఉండడం కనిపిస్తుంది. కానీ అందులో కూడా మెజారిటీ దాదాపు 95 శాతం సంతుష్టంగా ఉంటారు, కేవలం 5 శాతం మాత్రమే అసంతుష్టంగా కనిపిస్తారు. కనుక నంబరువన్ ఆజ్ఞాకారీ పిల్లలు మెజారిటీ మూడు రూపాలలోనూ సంతుష్టతను అనుభవం చేస్తారు. వారి కర్మలు సదా ఆజ్ఞానుసారంగా మరియు శ్రేష్ఠంగా ఉన్న కారణంగా, ప్రతి కర్మ చేసిన తర్వాత సంతుష్టంగా ఉన్నందుకు, ‘నేను కరెక్టుగా చేశానా, లేదా?’ అని ఆ కర్మ మాటిమాటికి వారి బుద్ధిని, మనసును విచలితం చేయదు. రెండవ నంబరు వారికి కర్మ చేసిన తర్వాత, చాలా సార్లు మనసులో ‘కరెక్టుగా చేశానో లేదో తెలియదు’ అనే సంకల్పం నడుస్తుంది. దీనినే మీరు మీ భాషలో ‘కరెక్టుగా చేయలేదని మనసు తింటుంది’ అని అంటారు. నంబరువన్ ఆజ్ఞాకారీ ఆత్మకు ఎప్పుడూ మనసు తినదు, వారు ఆజ్ఞానుసారంగా నడుచుకుంటున్న కారణంగా సదా తేలికగా ఉంటారు ఎందుకంటే కర్మ బంధనం యొక్క భారం ఉండదు. ఇదివరకు కూడా వినిపించాము - ఒకటి, కర్మ సంబంధంలోకి రావడం, రెండు, కర్మ బంధనానికి వశమై కర్మ చేయడం. నంబరువన్ ఆత్మ కర్మ సంబంధంలోకి వస్తారు కనుక సదా తేలికగా ఉంటారు. నంబరువన్ ఆత్మ ప్రతి కర్మకు బాప్ దాదా నుండి విశేషమైన ఆశీర్వాదాలు ప్రాప్తించిన కారణంగా, ప్రతి కర్మ చేస్తున్నప్పుడు ఆ ఆశీర్వాదాల ఫల స్వరూపంగా సదా ఆంతరిక విల్ పవర్ ను అనుభవం చేస్తారు, సదా అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తారు, సదా స్వయాన్ని నిండుగా అనగా సంపన్నంగా అనుభవం చేస్తారు.
అప్పుడప్పుడు చాలా మంది పిల్లలు బాబా ఎదురుగా తమ హృదయం యొక్క స్థితిని వినిపిస్తూ ఏమంటారు - ‘‘ఎందుకో తెలియదు, ఈ రోజు నేను చాలా ఖాళీ ఖాళీగా ఉన్నట్లు ఫీల్ అవుతున్నాను, ఏమీ జరగలేదు కూడా, కానీ సంపన్నత మరియు సుఖం యొక్క అనుభూతి కలగడం లేదు’’. చాలా సార్లు, ఆ సమయంలో ఏదో తప్పుడు పనో లేదా చిన్న పొరపాటో జరిగి ఉండదు కానీ నడుస్తూ-నడుస్తూ అమాయకత్వంతో లేక నిర్లక్ష్యంతో సమయ ప్రతి సమయం ఆజ్ఞానుసారంగా పని చేయరు. గతంలో ఆజ్ఞలను ఉల్లంఘించిన భారం ఏ సమయంలోనైనా తన వైపుకు లాగుతుంది. ఎలాగైతే గత జన్మల కఠిన సంస్కారాలు, స్వభావాలు వద్దనుకున్నా కూడా అప్పుడప్పుడు తమ వైపుకు లాగుతాయో, అలా సమయ ప్రతి సమయం ఆజ్ఞలను ఉల్లంఘించిన భారం అప్పుడప్పుడు తన వైపుకు లాగుతుంది. అది గతం యొక్క లెక్కాచారం, ఇది వర్తమాన జీవితం యొక్క లెక్కాచారం, ఎందుకంటే ఏ లెక్కాచారమైనా, అది ఈ జన్మది అయినా లేక గత జన్మది అయినా, లగనము (ప్రేమ) అనే అగ్ని స్వరూప స్థితి లేకుండా భస్మమవ్వదు. సదా అగ్ని స్వరూప స్థితి అనగా శక్తిశాలి స్మృతి యొక్క స్థితి, బీజరూప స్థితి, లైట్ హౌస్ మైట్ హౌస్ స్థితి సదా ఉండని కారణంగా లెక్కాచారాన్ని భస్మం చేసుకోలేరు, అందుకే అలా మిగిలిపోయిన లెక్కాచారం తన వైపుకు లాగుతుంది. ఆ సమయంలో ఎటువంటి పొరపాటు చేయరు కానీ ఏమయిందో తెలియదు అని అనుకుంటారు. అప్పుడప్పుడు, మనసు స్మృతిలో లేదా సేవలో నిమగ్నమవ్వదు, అప్పుడప్పుడు ఉదాసీనత యొక్క అల ఉంటుంది. ఒకటేమో - జ్ఞానం ద్వారా శాంతి యొక్క అనుభూతి, రెండవది - ఎలాంటి సంతోషము, ఆనందము లేనటువంటి నిశ్శబ్ద శాంతి. ఇది ఎటువంటి మాధుర్యం లేని శాంతిలా ఉంటుంది. ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళాలి, కూర్చోవాలి అని అనిపిస్తుంది. ఇవన్నీ ఏదో ఒక ఆజ్ఞను ఉల్లంఘించిన దానికి గుర్తులు. కర్మ యొక్క భారం లాగుతుంది.
ఆజ్ఞను ఉల్లంఘించడం అంటే, ఒకటి - పాప కర్మ చేయడం లేదా ఏదైనా పెద్ద పొరపాటు చేయడం, రెండవది - చిన్న చిన్న ఆజ్ఞల ఉల్లంఘన కూడా జరుగుతుంది. ఉదాహరణకు, అమృతవేళ విధిపూర్వకంగా శక్తిశాలి స్మృతిలో ఉండండి అని బాబా ఆజ్ఞను ఇచ్చారు. మరి అమృతవేళ ఒకవేళ ఈ ఆజ్ఞానుసారంగా నడుచుకోకపోతే వారిని ఏమంటారు? ఆజ్ఞాకారీ అని అంటారా లేక ఆజ్ఞ ఉల్లంఘన అని అంటారా? ప్రతి కర్మను కర్మయోగులుగా అయి చేయండి, నిమిత్త భావంతో చేయండి, నిర్మానులుగా (నమ్రతతో) చేయండి - ఇవన్నీ ఆజ్ఞలు. చెప్పాలంటే చాలా పెద్ద లిస్టు ఉంది కానీ ఉదాహరణకు కొన్ని వినిపిస్తున్నాము. దృష్టి, వృత్తి అన్నింటికీ ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలన్నింటిలోనూ ఏ ఆజ్ఞనైనా విధిపూర్వకంగా పాటించకపోతే, దానిని చిన్న చిన్న ఆజ్ఞల ఉల్లంఘన అని అంటారు. ఒకవేళ ఈ ఖాతా జమ అవుతూ ఉంటే అది తప్పకుండా దానివైపుకు లాగుతుంది కదా, అందుకే ఎంత జమ అవ్వాలో అంత అవ్వడం లేదని అంటారు. ఎప్పుడైనా, బాగా నడుస్తున్నారా అని అడిగితే అందరూ అవును అనే అంటారు. మరి ఎంత జమ అవ్వాలో అంత అయ్యిందా అని అడిగితే ఆలోచిస్తారు. ఎన్ని సూచనలు లభిస్తున్నాయి, జ్ఞానవంతులుగా ఉన్నారు, అయినా కానీ ఎంత జమ అవ్వాలో అంత అవ్వడం లేదు, దీనికి కారణమేమిటి? వెనుకటి భారం మరియు వర్తమాన భారం డబల్ లైట్ గా అవ్వనివ్వవు. ఒక్కోసారి డబల్ లైట్ గా అవుతారు, ఒక్కో సారి భారం కిందికి తీసుకొస్తుంది. అతీంద్రియ సుఖాన్ని మరియు సంతోషంతో సంపన్నమైన శాంతి స్థితిని సదా అనుభవం చేయరు. బాప్ దాదాకు ఆజ్ఞాకారులుగా అయినందుకు లభించే విశేషమైన ఆశీర్వాదాల లిఫ్ట్ యొక్క ప్రాప్తి అనుభవమవ్వదు. అందుకే ఒక్కోసారి సహజమనిపిస్తుంది, ఒక్కోసారి శ్రమ అనిపిస్తుంది. నంబరువన్ ఆజ్ఞాకారుల విశేషతలను స్పష్టంగా విన్నారు. మరి రెండవ నంబరు వారు ఎవరు? ఎవరిలోనైతే ఈ విశేషతలు లోపించాయో, వారు రెండవ నంబరు వారు. వారు రెండవ నంబరు మాలలోకి వస్తారు. మొదటి నంబరు మాలలోకి రావాలి కదా? కష్టమేమీ కాదు. ప్రతి అడుగు కోసం స్పష్టమైన ఆజ్ఞ ఉంది, దాని అనుసారంగా నడుచుకోవడం సులభమా లేక కష్టమా? ఆజ్ఞలే తండ్రి అడుగులు. మరి అడుగులపై అడుగులు వేయడం సులభమే కదా. వాస్తవానికి మీరందరూ సత్యమైన సీతలు, ప్రేయసులు కనుక ప్రేయసులు అడుగుపై అడుగు వేస్తారు కదా? ఇది విధి కదా. మరి కష్టమేముంది! పిల్లల సంబంధంలో చూసినా, తండ్రి అడుగుజాడలలో నడిచేవారే పిల్లలు. వారు తండ్రి ఎలా చెప్తే అలా చేస్తారు. తండ్రి చెప్పడం మరియు పిల్లలు చేయడం - ఇటువంటి వారినే నంబరువన్ ఆజ్ఞాకారులని అంటారు. కనుక చెక్ చేసుకోండి మరియు ఛేంజ్ చేసుకోండి. అచ్ఛా.
నలువైపులా ఉన్న సర్వ ఆజ్ఞాకారీ శ్రేష్ఠ ఆత్మలకు, సదా బాబా ద్వారా ప్రాప్తించిన ఆశీర్వాదాలను అనుభూతి చేసే విశేష ఆత్మలకు, సదా ప్రతి కర్మలో సంతుష్టతను, సఫలతను అనుభవం చేసే మహాన్ ఆత్మలకు, సదా అడుగుపై అడుగు వేసే ఆజ్ఞాకారీ పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
పార్టీలతో అవ్యక్త బాప్ దాదా మధుర మిలనము
1. సదా స్వయాన్ని ఆత్మిక యాత్రికులుగా భావిస్తున్నారా? యాత్ర చేసేటప్పుడు ఏమి గుర్తుంటుంది? ఎక్కడికైతే వెళ్ళాలో, అదే గుర్తుంటుంది కదా. ఒకవేళ వేరే విషయమేదైనా గుర్తుకొస్తే దానిని మర్చిపోయే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా దేవీ వద్దకు యాత్ర చేస్తే ‘జై మాత, జై మాత’ అని అంటూ వెళ్తారు. ఒకవేళ ఇంకెవరైనా గుర్తుకొస్తే మంచిది కాదని భావిస్తారు. పరస్పరంలో కూడా ఒకరికొకరు ‘జై మాత’ అని గుర్తు చేసుకోండి, ఇంటిని లేక పిల్లలను గుర్తు చేసుకోకండి, మాతను గుర్తు చేసుకోండి అని స్మృతినిప్పించుకుంటారు. మరి ఆత్మిక యాత్రికులకు సదా ఏమి గుర్తుంటుంది? మీ ఇల్లు అయిన పరంధామం గుర్తుంటుంది కదా? అక్కడికే వెళ్ళాలి. మరి మీ ఇల్లు మరియు మీ రాజ్యమైన స్వర్గము - రెండూ గుర్తుంటాయా లేక వేరే విషయాలు కూడా గుర్తుంటాయా? పాత ప్రపంచం గుర్తుకు రాదు కదా? ఇక్కడే ఉన్నాము కనుక గుర్తుకొస్తుంది అని కాదు. ఇక్కడ ఉంటున్నా సరే అతీతంగా ఉండండి ఎందుకంటే ఎంతగా అతీతంగా ఉంటారో, అంత ప్రేమగా బాబాను గుర్తు చేయగలరు. కనుక పాత ప్రపంచంలో ఉంటూ అందులో చిక్కుకోవడం లేదు కదా అని చెక్ చేసుకోండి. కమల పుష్పం బురదలో ఉంటుంది కానీ బురద అంటుకోకుండా అతీతంగా ఉంటుంది. కనుక సేవ కోసం ఉండాలి కానీ మోహం కారణంగా కాదు. మరి మాతలకు మోహం లేదు కదా? ఒకవేళ మనవలకు ఏమైనా జరిగితే, మోహం కలుగుతుందా? ఒకవేళ వారు కొద్దిగా ఏడిస్తే మీ మనసు కూడా కొద్దిగా ఏడుస్తుందా? ఎందుకంటే మోహం ఉన్నచోట ఇతరుల దుఃఖం కూడా మన దుఃఖంలా అనిపిస్తుంది. ఒకవేళ వాళ్ళకు జ్వరం వస్తే మీ మనసుకు కూడా జ్వరం రావడం అనేది జరగడం లేదు కాదు. మోహం లాగుతుంది కదా. పరీక్షలైతే వస్తాయి కదా. ఒకసారి ఒక మనవడు అనారోగ్యం పాలవుతాడు, ఇంకొకసారి ఇంకొక మనవడు అనారోగ్యం పాలవుతాడు. ఒక్కోసారి ధనం సమస్య వస్తుంది, ఒక్కోసారి అనారోగ్యం సమస్య వస్తుంది. ఇదంతా జరగాల్సిందే. కానీ సదా అతీతంగా ఉండాలి, మోహంలోకి రాకూడదు - ఇటువంటి నిర్మోహులుగా అయ్యారా? మాతలకు సంబంధాల పట్ల మోహముంటుంది, పాండవులకు ధనం పట్ల మోహముంటుంది. ధనం సంపాదించడంలో పడి స్మృతిని కూడా మర్చిపోతారు. శరీర నిర్వహణార్థం ధనం సంపాదించడం వేరే విషయం కానీ చదువు గుర్తురాకుండా, స్మృతిని అభ్యాసం చేయకుండా అలాగే అందులో మునిగిపోతే, దానిని మోహమని అంటారు. కనుక మోహమైతే లేదు కదా! ఎంతగా నష్టోమోహులుగా ఉంటారో, అంతగా స్మృతి స్వరూపులుగా ఉంటారు.
కుమారులతో - మీరు అద్భుతం చేసే కుమారులు కదా? ఏ అద్భుతాన్ని చూపిస్తారు? తండ్రిని ప్రత్యక్షం చేయాలనే ఉల్లాసమైతే ఎలాగూ సదా ఉంటుంది కానీ దానికి విధి ఏమిటి? ఈ రోజుల్లో అందరి దృష్టి యువత వైపు ఉంది. ఆత్మిక యువత తమ మనసా శక్తితో, మాటలతో, నడవడికతో ఎలాంటి శాంతి శక్తిని అనుభవం చేయించాలంటే ‘వీరు శాంతి శక్తితో విప్లవం చేసేవారని’ అందరూ భావించాలి. ఉదాహరణకు లౌకిక యువత యొక్క నడవడిక మరియు ముఖంలో ఆవేశం కనిపిస్తుంది కదా. వారిని చూస్తూనే వీరు యువత అన్నది తెలిసిపోతుంది. అదే విధంగా మీ ముఖం మరియు నడవడిక ద్వారా శాంతి అనుభవమవ్వాలి - దీనిని అద్భుతం చేయడమని అంటారు. ప్రతి ఒక్కరి వృత్తి నుండి వైబ్రేషన్లు రావాలి. ఎలాగైతే వారి నడవడిక మరియు ముఖం ద్వారా - వీరు హింసక వృత్తి కలవారు అన్న వైబ్రేషన్ వస్తుందో, అలా మీ వైబ్రేషన్ల ద్వారా శాంతి కిరణాలు అనుభవమవ్వాలి. ఇలాంటి అద్భుతం చేసి చూపించండి. ఎవరైనా విప్లవాత్మక కార్యం చేస్తే అందరి అటెన్షన్ వెళ్తుంది కదా. అలా మీ వైపుకు అందరి అటెన్షన్ వచ్చేలా విశాలమైన సేవ చేయండి ఎందుకంటే జ్ఞానం వినిపించినప్పుడు మంచిగానే అనిపిస్తుంది కానీ పరివర్తనను, అనుభవాన్ని చూసి అనుభవజ్ఞులుగా అవుతారు. ఏదైనా ఇలాంటి భిన్నమైన కార్యం చేసి చూపించండి. వాణి ద్వారా అయితే మాతలు కూడా సేవ చేస్తారు, నిమిత్త అక్కయ్యలు కూడా సేవ చేస్తారు కానీ మీరు గవర్నమెంట్ వారి అటెన్షన్ కూడా ఇటువైపు వచ్చే విధంగా నవీనతను చేసి చూపించండి. ఎలాగైతే సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు వస్తుంది కావున స్వతహాగానే అటెన్షన్ వెళ్తుంది కదా, అలా మీ వైపు అటెన్షన్ వెళ్ళాలి. అర్థమయిందా?
Comments
Post a Comment