11-12-1985 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సత్యమైన సేవాధారి యొక్క గుర్తులు.
సదా దాత శివబాబా మాట్లాడుతున్నారు -
ఈరోజు స్నేహ సాగరుడైన బాప్ దాదా తన యొక్క స్నేహి పిల్లలను చూస్తున్నారు. ప్రతి ఒక్క బిడ్డలో మూడు విశేషతలు చూస్తున్నారు. ప్రతీ ఒక్క బిడ్డ మూడు విశేషలతలో ఎంతవరకు సంపన్నంగా అయ్యారు అని. ఆ మూడు విశేషతలు 1. స్నేహం 2. సహయోగం అంటే సహజ యోగం మరియు 3.శక్తి స్వరూపం అంటే నడుస్తూ, తిరుగుతూ చైతన్య లైట్ హౌస్ మరియు మైట్ హౌస్. ప్రతి సంకల్పం, మాట, కర్మ ద్వారా ఈ మూడు స్వరూపాలు ప్రత్యక్ష స్వరూపంలో అందరికి అనుభవం అవ్వాలి. కేవలం స్వయానికే కాదు. ఇతరులకి కూడా ఈ మూడు విశేషతలు అనుభవం అవ్వాలి. ఏవిధంగా అయితే బాబా స్నేహ సాగరుడో అదేవిధంగా మాస్టర్ సాగరుని ముందు జ్ఞాని లేక అజ్ఞాని ఆత్మలు వచ్చినప్పుడు స్నేహాన్ని అనుభవం చేసుకోవాలి. స్నేహం యొక్క మాస్టర్ సాగరుని యొక్క అలలు స్నేహం యొక్క అనుభూతిని చేయిస్తాయి. ఎలా అయితే, లౌకిక ప్రకృతి యొక్క సముద్రం ఒడ్డుకి ఎవరు వెళ్ళినా కానీ శీతలత, శాంతి యొక్క అనుభవాన్ని స్వతహాగానే చేయిస్తుంది. అదేవిధంగా మాస్టర్ స్నేహసాగరుని ద్వారా ఆత్మిక స్నేహం యొక్క అనుభూతి అవ్వాలి. సత్యమైన స్నేహం యొక్క ప్రాప్తి స్థానానికి చేరుకున్నాము అని అనుభవం చేసుకోవాలి. ఆత్మిక స్నేహం యొక్క అనుభూతి, ఆత్మిక సువాసన వాయమండలంలో అనుభవం అవ్వాలి. బాబాకి స్నేహి ఆయ్యాము అని అందరు చెప్తారు, బాబాకి కూడా తెలుసు అందరికీ బాబాపై స్నేహం ఉంది అని. కానీ ఇప్పుడు స్నేహం యొక్క సువాసనని విశ్వంలో వ్యాపింపచేయాలి. ప్రతి ఆత్మకి ఈ సువాసన యొక్క అనుభవం చేయించాలి. ప్రతి ఒక్క ఆత్మ వీరు శ్రేష్ట ఆత్మ అని వర్ణన చేయాలి. కేవలం బాబాకి స్నేహిగా అవ్వటం కాదు, సర్వులకు సదా స్నేహిగా అవ్వాలి. ఈ రెండు అనుభూతులు సర్వులకి మరియు సదా ఎప్పుడైతే అవుతాయో అప్పుడే మిమ్మల్ని మాస్టర్ స్నేహసాగరులు అని అంటారు. ఈ రోజుల్లో ప్రపంచంలో ఆత్మలు సత్యమైన ఆత్మిక స్నేహం యొక్క ఆకలితో ఉన్నారు. స్వార్థం యొక్క స్నేహం చూసి చూసి ఆ స్నేహం ద్వారా మనస్సు అతీతం అయిపోయింది. అందువలన ఆత్మిక స్నేహం యొక్క కొన్ని ఘడియలు అనుభూతి అయినా అది జీవితానికి తోడుగా భావిస్తున్నారు. బాప్ దాదా చూస్తున్నారు - స్నేహం యొక్క విశేషతలో ఇతర ఆత్మల పట్ల, కర్మలో మరియు సేవలో ఎంతవరకు సఫలత పొందారు? అని. కేవలం మీ మనస్సులో మీరే సంతోష పడటం లేదు కదా! నేను చాలా స్నేహిని అని. ఒకవేళ స్నేహం లేకపోతే బాబా వారిగా ఎలా అవుతాము అని అంటారు. బ్రాహ్మణ జీవితంలో ఏవిధంగా ముందుకి వెళ్తాము అంటారు. ఇలా మీ మనస్సుతో మీరు సంతుష్టంగా ఉన్నారు. ఇది బాప్ దాదాకి కూడా తెలుసు మరియు మీ వరకు సంతుష్టంగా ఉండటం ఇది మంచిదే! కానీ పిల్లలైన మీరందరూ బాబాతో పాటు సేవాధారులు. సేవ కొరకే ఈ తనువు, మనస్సు, ధనం సేవ కొరకే, మీ అందరిని బాబా నిమిత్తంగా చేసి ఇచ్చారు. సేవాధారి యొక్క కర్తవ్యం ఏమిటి? ప్రతి విశేషతను సేవలో ఉపయోగించడం. ఒకవేళ మీ విశేషతను సేవలో ఉపయోగించకపోతే ఆ విశేషత వృద్ధి అవ్వదు. కొంతమంది పిల్లలు మేము బాబావారిగా అయ్యాము, రోజూ వస్తున్నాము కూడా, పురుషార్థంలో కూడా నడుస్తున్నాము, నియమాలు పాలన చేస్తున్నాము కానీ పురుషార్థంలో ఏదైతే వృద్ధి పొందాలనుకుంటున్నామో అది అనుభవం అవ్వటం లేదు అని. నడుస్తున్నారు కానీ ముందుకి వెళ్ళటం లేదు. దీనికి కారణం ఏమిటి? విశేషతలను సేవలో ఉపయోగించడంలేదు. కేవలం జ్ఞానం చెప్పటం, 7 రోజుల కోర్సు చెప్పటం ఇదే సేవ కాదు. వినిపించడం అనేది ద్వాపరయుగం నుంచి పరంపరగా వస్తూ ఉంది కానీ ఈ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత వినిపించడం అంటే ఏదోకటి ఇవ్వటం, భక్తిమార్గంలో వినిపించటం అంటే ఏదోకటి తీసుకుంటారు కానీ ఇక్కడ వినిపించటం అంటే ఏదోకటి ఇవ్వటం. దాత యొక్క పిల్లలు, సాగరుని యొక్క పిల్లలు కనుక ఎవరైనా సంపర్కంలోకి వచ్చినా ఏదో ఒకటి తీసుకుని వెళ్తున్నాము అని అనుభవం చేసుకోవాలి. కేవలం విని వెళ్ళిపోకూడదు. జ్ఞానంతో అయినా, స్నేహం యొక్క ధనంతో అయినా లేదా స్మృతి బలం యొక్క ధనంతో అయినా, శక్తుల యొక్క ధనంతో అయినా, సహయోగం యొక్క ధనంతో అయినా చేయి అంటే బుద్ధి నింపుకుని వెళ్ళాలి. దీనినే సత్యమైన సేవ అంటారు. సెకను యొక్క దృష్టి లేక రెండు మాటల ద్వారా, మీ శక్తిశాలి సంకల్ప తరంగాల ద్వారా, సంపర్కం ద్వారా దాత అయ్యి ఇవ్వాలి. అటువంటి వారే సత్యమైన సేవాధారులు. ఈ విధంగా దాత అయ్యి ఇచ్చేవారు ప్రతి సమయం వృద్ధిని మరియు ఉన్నతిని పొందుతున్నట్లు అనుభవం చేసుకుంటారు. లేకపోతే వెనకకి వెళ్ళటం లేదు కానీ ఎంత ముందుకి వెళ్ళాలనుకుంటున్నామో అంత ముందెకి వెళ్ళటంలేదు అని. అందువలన దాతగా అవ్వండి. అనుభవం చేయించండి. ఇలా సహయోగి లేక సహజయోగిగా స్వయం కూడా అవ్వాలి మరియు ఇతరులను కూడా సహయోగం యొక్క ఉత్సాహ, ఉల్లాసాల అల సహయోగిగా చేస్తుంది. మీ సహయోగం యొక్క విశేషత ద్వారా సర్వ ఆత్మలకి వీరు మా సహయోగి అని అనుభవం అవుతుంది. ఏ బలహీన స్థితిలో ఉన్నా లేక పరిస్థితి యొక్క సమయంలో సహయోగం ద్వారా ముందుకి తీసుకువెళ్ళాలి. సహయోగం యొక్క విశేషత ద్వారా అందరికి మీ ఆత్మపట్ల విశేషమైన అనుభవం అవుతుంది. దీనినే విశేషతను సేవలోకి ఉపయోగించటం అంటారు. మీరు బాబాకి సహయోగియే కానీ బాబా విశ్వ సహయోగి పిల్లల పట్ల కూడా ప్రతి ఆత్మ నుండి వీరు కూడా బాబా సమానంగా సర్వులకి సహయోగి అవ్వాలి అనే అనుభవం యొక్క మాట రావాలి. వ్యక్తిగతంగా ఒకరికి, ఇద్దరికి సహయోగిగా కాదు. అది స్వార్థం యొక్క సహయోగం అవుతుంది. హద్దు యొక్క సహయోగం అవుతుంది. సత్యమైన సహయోగిగా, అనంతమైన సహయోగిగా అవ్వాలి. మీ అందరి బిరుదు ఏమిటి? విశ్వకళ్యాణకారులా లేక కేవలం సేవాకేంద్రం యొక్క కళ్యాణకారులా? దేశం యొక్క కళ్యాణకారులా? లేక కేవలం క్లాస్ కి వచ్చే విద్యార్థుల యొక్క కళ్యాణకారులా? ఈవిధమైన బిరుదు లేదు కదా! విశ్వకళ్యాణకారులు, విశ్వయజమానిగా అయ్యేవారా లేక కేవలం మీ మహల్ కి యజమానిగా అయ్యేవారా? ఎవరైతే కేవలం సేవాకేంద్రం యొక్క హద్దులో ఉంటారో వారు కేవలం మహల్ కి యజమానిగా అవుతారు. కానీ మీరు బేహద్ బాబా ద్వారా బేహద్ వారసత్వం తీసుకుంటున్నారు. హద్దు యొక్క వారసత్వంగా కాదు. కనుక సర్వులపట్ల సహయోగం యొక్క విశేషతను కార్యంలోకి తీసుకురావాలి. అటువంటి వారినే సహయోగి ఆత్మ అంటారు. ఈ విధి ద్వారా శక్తిశాలి ఆత్మ సర్వశక్తులను కేవలం స్వయం పట్లే కాకుండా సర్వులపట్ల సేవలో ఉపయోగిస్తుంది. కొందరిలో సహన శక్తి ఉండదు. మీ దగ్గర ఉంది. ఆ శక్తి ఇతరులకి ఇవ్వాలి. ఇదే శక్తిని సేవలో ఉపయోగించటం. కేవలం నేను సహనశీలతతో ఉంటున్నాను అని ఆలోచించకండి. కానీ మీ సహనశీలత గుణం యొక్క లైట్, మైట్ ఇతరుల వరకు చేరాలి. లైట్ హౌస్ యొక్క ప్రకాశం కేవలం స్వయానికే ఉండదు. ఇతరులకి వెలుగు ఇచ్చేదిగా, మార్గం చెప్పేదిగా ఉంటుంది. ఈ విధంగా శక్తి రూపంగా అంటే లైట్ హౌస్, మైట్ హౌస్ గా అయ్యి ఇతరులకి దాని లాభాన్ని అనుభవం చేయించాలి. వారు నిర్భలత యొక్క అంధకారం నుంచి శక్తి యొక్క వెలుగులోకి వచ్చినట్లు అనుభవం చేసుకోవాలి. ఈ ఆత్మ యొక్క శక్తి ద్వారా నన్ను కూడా శక్తివంతంగా చేయటంలో సహయోగి అయ్యింది అని అనుభవం చేసుకోవాలి. వారు నిమిత్తంగా అయ్యి బాబాతో సంబంధం జోడింపచేస్తారు. సహయోగం ఇచ్చి తమతో తగుల్కొనేటట్లు చేయరు. బాబా ఇచ్చిన బహుమతిని ఇస్తున్నాను అనే ఈ స్మృతి మరియు శక్తి ద్వారా విశేషతలని సేవలో ఉపయోగిస్తారు. ఇదే సత్యమైన సేవాధారికి గుర్తు. ప్రతి కర్మలో వారి ద్వారా బాబా కనిపిస్తారు. వారి ప్రతి మాట ప్రతి ఒక్కరికి బాబా స్మృతి ఇప్పిస్తుంది. ప్రతి విశేషత ద్వారా దాత వైపు సైగ చేయిస్తుంది. సదా బాబాయే కనిపిస్తారు. వారు మిమ్మల్ని చూడకుండా బాబాని చూస్తారు. నా సహయోగి అనుకోవటం - ఇదే సత్యమైన సేవాధారికి గుర్తు కాదు. సంకల్పమాత్రంగా కూడా నా విశేషత కారణంగా వీరు నాకు చాలా సహయోగి అయ్యారు అని అనుకోకూడదు. సహయోగికి సహయోగం ఇవ్వటం నా పని అని అనుకోవాలి. ఒకవేళ బాబాని చూడకుండా మిమ్మల్ని చూస్తే అది సేవ కాదు. ఇది ద్వాపరయుగం గురువుల వలె బాబాకి విముఖంగా చేసినట్లు. బాబాని మరిచిపోతే అది సేవ కాదు. ఇది పడేయటం, పైకి ఎక్కించటం కాదు. ఇది పుణ్యం కాదు, పాపం. ఎందుకంటే బాబా లేకపోతే పాపం తప్పకుండా ఉంటుంది. కనుక సత్యమైన సేవాధారి సత్యం వైపే సంబంధం జోడిస్తారు.
బాప్ దాదాకి అప్పుడప్పుడు పిల్లల యొక్క లక్ష్యం, లక్షణాలు చూసి నవ్వు వస్తుంది. బాబా దగ్గరికి చేర్చాలి, కానీ తమ దగ్గరకి చేర్చుకుంటున్నారు. ధర్మపితలు గురించి చెప్తారు కదా - వారు పై నుండి క్రిందకు తీసుకువచ్చేస్తారు అని. పైకి తీసుకువెళ్ళరు. ఈ విధమైన ధర్మపితలుగా అవ్వకండి. పిల్లలు అక్కడక్కడ స్పష్టమార్గంలో వెళ్ళడానికి బదులు సందుల్లో చిక్కుకుపోతున్నారు. మార్గం మారిపోతున్నారు. అందువలన నడుస్తున్నారు కానీ గమ్యానికి చేరుకోవడం లేదు. సత్యమైన సేవాధారి అని ఎవరిని అంటారో? అర్థమైందా! ఈ మూడు శక్తులను లేక విశేషతలను బేహద్ దృష్టి ద్వారా బేహద్ వృత్తి ద్వారా సేవలో ఉపయోగించండి. మంచిది.
సదా దాత యొక్క పిల్లలు దాతగా అయ్యి ప్రతి ఆత్మను నిండుగా చేసేవారికి, ప్రతి ఖజానాను సేవలో ఉపయోగించి ప్రతి సమయం వృద్ధి పొందేవారికి, సదా బాబా ద్వారా లభించిన విశేషతలను ప్రభు ప్రసాదంగా భావించి ఇతరులకు కూడా ప్రభు ప్రసాదం ఇచ్చేవారికి, సదా ఒకనివైపే సైగ ఇచ్చి ఏకరసంగా చేసేవారికి, ఇలా సదా మరియు సత్యమైన సేవాధారి పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment