11-11-1985 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
దీపావళి అంటే సమీపత, సంపన్నత మరియు సంపూర్ణతకు స్మృతిచిహ్నం .....
సదా జాగృతి జ్యోతి అయిన శివబాబా మాట్లాడుతున్నారు -
ఈరోజు విశ్వం యొక్క జ్యోతులను వెలిగించేటటువంటి, వెలిగి ఉన్న దీపాల యొక్క యజమాని దీపమాలని చూస్తున్నారు. దీపావళి మీ అందరి యొక్క స్మృతిచిహ్నం. కనుక దీపాల యజమాని సత్యమైన దీపమాలను చూస్తున్నారు. ఈ దీపమాల విచిత్రమైన మాల. విచిత్రమైన యజమాని మరియు విచిత్రమైన మాల. ప్రపంచం వారు యజమాని గురించి తెలుసుకోవటం లేదు మరియు మాల గురించి కూడా తెలుసుకోవటం లేదు. యజమానిని తెలుసుకుంటే మాల గురించి కూడా తెలుస్తుంది. దీపావళి మీ అందరి యొక్క మూడు విశేషతలకు స్మృతిచిహ్నం
ఒకటి - సమీపత. సమీపతలో స్నేహం నిండి ఉంది. ఒకవేళ మాలలో స్నేహం మరియు సమీపత యొక్క ఆధారం లేకుండా మాల తయారవ్వదు. మణికి మణి మరియు దీపానికి దీపం ఎప్పుడైతే స్నేహంతో సమీపంగా వస్తాయో అప్పుడే మాల అంటారు, స్నేహం అంటే సమీపత. స్నేహానికి గుర్తు సమీపతయే కనుక ఒకటి సమీపత మరియు
రెండవది - సంపన్నత. దీపావళి సంపన్నతకు గుర్తు. కేవలం ఒక లక్ష్మియే ధనదేవి కాదు కానీ మీరందరు ధనంతో సంపన్నదేవీలు. ధనదేవి అయిన కారణంగా ధన్యదేవిగా కూడా మహిమ చేయబడుతున్నారు కనుక ధనదేవి - ధన్యదేవి - ఇదే సంపన్నతకి గుర్తు.
మూడవది - సంపూర్ణత - సంపూర్ణత అంటే సదా వెలిగి ఉండే దీపాలు. ఆరిపోయిన దీపాలను దీపమాల అని అనరు. వెలిగి ఉన్న దీపాలనే దీపమాల అని అంటారు. కనుక సదా ఏకరసంగా మరియు వెలిగి ఉన్న దీపాలకు గుర్తు - సంపూర్ణత. కనుక దీపావళి అంటే సమీపత, సంపన్నత మరియు సంపూర్ణత యొక్క విశేషతలకు స్మృతిచిహ్నం. అందువలనే దీపావళిని గొప్పరోజు అంటారు.
ఏదైనా పండుగ జరుపుకుంటే దానిని ఉన్నతమైనరోజు అంటారు. ఎందుకంటే విశ్వంలో ఉన్నతమైన ఆత్మల రోజు. విశ్వంలో అందరికంటే ఉన్నతమైనవారు ఎవరు? స్వయాన్ని ఉన్నతమైన వారిగా భావిస్తున్నారా? ఈ 3 విశేషతలు స్వయంలో అనుభవం చేసుకుంటున్నారా? మీ అందరి స్మృతిచిహ్నమే జరుపుకుంటున్నారు. స్మృతి స్వరూపంగా అయిన వారికే స్మృతిచిహ్నం తయారవుతుంది. ఈ విధంగా స్మృతి స్వరూపంగా అయ్యారా లేక ఇప్పుడిప్పుడే అవుతున్నాము అని అంటున్నారా? ఏమంటారు? మీరు మేల్కొన్నారు అంటే చీకటి సమాప్తి అయిపోయినట్లే కదా! మేల్కొన్నారు అంటే చీకటి సమాప్తి. మరి వెలుగుతూ ఉండే దీపాలా లేక టిమ్ టిమ్ అనేవారా? టిమ్ టిమ్ అనే దీపాలను ఎవరు ఇష్టపడరు. ఇప్పుడిప్పుడే ఆరిపోతాయి, ఇప్పుడిప్పుడే వెలుగుతాయి. లైట్ కూడా ఏకరసంగా వెలగకపోతే ఎవరు ఇష్టపడరు. దానిని బంద్ చేసేస్తారు కదా! వెలుగుతూ ఉండే దీపాలు మరియు టిమ్ టిమ్ అనే దీపాలు అందరు వేటిని ఇష్టపడతారు?
ఉన్నతమైన రోజుని శెలవు రోజుగా ఎందుకు జరుపుకుంటారు? ఏదైనా ఉన్నతమైనరోజు వస్తే శెలవు వస్తుంది. శెలవు యొక్క సంతోషం ఉంటుంది. ప్రతి నెల క్యాలెండర్ లో మొదట అందరూ ఏమి చూస్తారు? పండుగరోజులు ఎన్ని? శెలవులు ఎన్ని? అని. కనుక పండుగరోజు అంటే శెలవు రోజు. శ్రమ నుండి శెలవు తీసుకునే రోజు మరియు ప్రేమ యొక్క ఆనందంలో ఉండే రోజు. ఎప్పుడైతే బలహీనతలకు మరియు మాయకు శెలవు ఇచ్చేస్తారో అప్పుడు శ్రమ సమాప్తి అయ్యి ఆనందం యొక్క రోజులు ప్రారంభం అవుతాయి. పండుగ రోజు అంటే శెలవు యొక్క రోజు. అందువలన స్మృతిచిహ్నంలో కూడా ఆ రోజు కూడా శెలవు ఉంటుంది. శెలవు రోజు ఏమి చేస్తారు? ఆనందంలో ఉంటారు కదా! శెలవు రోజు విశ్రాంతి తీసుకుంటారు. మీకు విశ్రాంతి ఏమిటి? విశ్రాంతి తీసుకుంటున్నారా లేక రండి! రామ్ అంటున్నారా? విశాంత్రి కాదు, రండి, రామ్ అని బాబాని ఆహ్వానిస్తున్నారు కదా! ఇదే విశ్రాంతి తీసుకోవటం. దీపావళి రోజున ఇంకా ఏమి చేస్తారు? శుభాకాంక్షలు మరియు అభినందనలు చెప్పుకుంటారు కదా! ఏదైనా పండుగ రోజున ఒకరినొకరు కలుసుకున్నప్పుడు శుభాకాంక్షలు చెప్పుకుంటారు కదా! ఈ ఆచారం కూడా ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా ఎవరికైనా శుభాకాంక్షలు ఇస్తే ఏ విధంగా ఇస్తారు? ఒకరినొకరు హత్తుకుంటారు, చేయి, చేయి కలుపుకుంటారు, మిఠాయి తినిపిస్తారు, సంతోషంతో జరుపుకుంటారు. మీరు స్మృతి మరియు ప్రేమను ఇవ్వటం మరియు తీసుకోవటం చేస్తారు. ఇలా మీరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు కనుక సంగమయుగంలో అంటే పండుగ రోజులలో మీరందరు సదాకాలికంగా మాయకు వీడ్కోలు ఇచ్చే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. విజయీ అవుతున్నారు. అందువలనే విజయీ పిల్లలకు బాప్ దాదా సదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. ప్రియస్మృతులు ఇస్తున్నారు అంటే శుభాకాంక్షలు ఇస్తున్నారు. రోజు బాప్ దాదా పిల్లలకు ప్రియస్మృతులు చెప్తూ ఏమి మాట అంటారు? “మధురాతి మధురమైన” పిల్లలు అనే మాటతో నోటిని మధురంగా చేస్తారు. బాప్ దాదా రోజు మధురాతి మధురమైన పిల్లలు అనే మాటే అంటారు. ఇదే మధురతకు గుర్తు. నోటిని మధురంగా చేసుకుంటారు. ఈ విధమైన దీపావళి జరుపుకునేవారా లేక మీ దీపావళి జరుపుకునేటందుకు వెళ్తున్నారా? మీరు బాబాతో పాటు జరుపుకుంటున్నారు. అందువలనే విశ్వం మీ యొక్క స్మృతిచిహ్నం జరుపుకుంటుంది. దీపావళి యొక్క అర్థం ఏమిటి అనేది అర్ధమైందా! తయారవ్వటమే జరుపుకోవడం.
దీపావళి జరుపుకునేటందుకే వచ్చారు కదా! బాప్ దాదా కూడా దీపాల యొక్క మాలను చూసి సంతోషిస్తున్నారు. కలుసుకోవటమే జరుపుకోవడం. అందరు ఆనందాల ఇంటికి చేరుకున్నారు కదా! మధువనం అంటే ఆనందాల ఇల్లు. మనస్సులో ఆనందం ఉంటే ప్రతి కార్యంలో ఆనందం ఉంటుంది. ఏవిధమైన అయోమయం ఉండదు. ఎందుకు? ఏమిటి? ఇదే అయోమయం. ఓహో! ఆహా! ఇదే ఆనందం. ఎందుకు? ఏమిటి? అనేవి ఇప్పుడు లేవు కదా! దసరా జరుపుకొని వచ్చారు కదా! ఇప్పుడు దీపావళి జరుపుకోవడానికి వచ్చారు. దసరా అవ్వకుండా దీపావళి రాదు. దసరా సమాప్తి చేసుకుని దీపావళి జరుపుకోవడానికి వచ్చారు. విజయీ అయిపోయారు కదా!
ఇప్పుడు పిల్లల వృద్ధి అవుతుంది మరియు ఇంకా అవుతుంది కూడా. వృద్దిననుసరించి విధి కూడా తయారుచేయాల్సి ఉంటుంది. బ్రహ్మాబాబా అవ్యక్తం అయ్యి ఇప్పటికి 17 సం||లు అయ్యింది, 17సం||ల పాఠం పూర్తయ్యింది. ఇక ఏమి మిగిలింది? బాప్ దాదాకి పిల్లలపై స్నేహం ఉన్న కారణంగా అవ్యక్తం అయినప్పటికీ కూడా వ్యక్తంలో ఇంకొక రధంలో 17 సం||లు సవారీ చేసారు. 17 సం|| తక్కువేమీ కాదు. సమయానికి మరియు శరీరానికి లెక్క కూడా ఉంటుంది. పేరుకి అవ్యక్తం అంటున్నారు కానీ వ్యక్తంలో కలయిక కావాలనుకుంటున్నారు. ఎందుకు? అంటే సాకార కలయిక సహజంగా అనిపిస్తుందా? బాప్ దాదా క్రొత్త, క్రొత్త పిల్లలు నిందించకుండా వారి కోసం వస్తున్నారు. ఇప్పుడు 18వ తేదీ నుండి 18వ సం|| ప్రారంభం అవుతుంది. 18వ అధ్యాయం ఏమిటి? అందరు తయారుగా ఉన్నారు కదా! సేవ సమాప్తి చేసేసారా? ఇప్పుడు బాబా సమానంగా అవ్యక్తరూపధారిగా అయిపోండి. అవ్యక్తరూపం యొక్క సేవ చేసారా? ఇప్పుడు అవ్యక్తబాబా వ్యక్తంలోకి రావల్సి ఉంటుంది. అవ్యక్తరూపధారి అయ్యి, నష్టోమోహ స్మృతిర్లబ్ద అంటే స్మృతి స్వరూపంగా అవ్వాలి. ఇప్పుడు ఈ సేవ మిగిలి ఉంది. పాదయాత్ర యొక్క సేవ అయితే చేసారు కానీ ఇప్పుడు ఆత్మిక యాత్ర యొక్క అనుభవం చేయించాలి. ఇప్పుడు ఈ యాత్ర యొక్క అవసరం ఉంది. అందువలనే ఇప్పుడు బాప్ దాదా కూడా అవ్యక్త విధి ప్రమాణంగా పిల్లలని కలుసుకుంటారు. వృద్దిననుసరించి విధిని కూడా పరివర్తన చేయాల్సి ఉంటుంది. పిల్లల రూపంలో అధికారం - మురళి. మురళి ద్వారా కలుసుకోవటం మరియు అవ్యక్త దృష్టి ద్వారా కలుసుకోవటం ఈ రెండు కలయికలు వరదానం యొక్క అనుభూతిని చేయిస్తాయి. అందువలన అవ్యక్త స్థితిలో స్థితులై ఇప్పుడు దృష్టి ద్వారా వరదానాల యొక్క అనుభవం చేసుకోండి. లేకపోతే వినే కోరికతో దృష్టి యొక్క గొప్పతానాన్ని తక్కువగా అనుభవం చేసుకుంటారు.
రెండు మహిమలు - ఒకటి - దృష్టి ద్వారా అద్భుతం మరియు రెండు - మురళి యొక్క అద్భుతం. అందువలన ఇప్పుడు దృష్టి ద్వారా వరదానం పొందే అధికారిగా అవ్వండి. ఎంత స్వయం అవ్యక్త స్థితిలో స్థితులౌతారో అంత అవ్యక్త దృష్టి యొక్క భాషని గ్రహించగలరు. ఈ దృష్టి యొక్క వరదానం సదాకాలిక పరివర్తన యొక్క వరదానం. నోటితో ద్వారా లభించే వరదానం అయితే అప్పుడప్పుడు జ్ఞాపకం ఉంటుంది మరియు అప్పుడప్పుడు మర్చిపోతారు కానీ, అవ్యక్త రూపంగా అయ్యి అవ్యక్త దృష్టి ద్వారా లభించిన వరదానం సదా స్మృతి స్వరూపంగా మరియు సమర్థస్వరూపంగా తయారుచేస్తుంది. ఇప్పుడు దృష్టి ద్వారా దృష్టి యొక్క భాష తెలుసుకోండి. స్థాపనలో ఏమి జరిగింది? దృష్టి యొక్క భాష ద్వారా మరియు దృష్టి యొక్క అద్భుతం ద్వారా స్థాపన కార్యం ప్రారంభమయ్యింది. అర్థమైందా! 18వ అధ్యాయం యొక్క సేవ ఏమిటి? అనేది మరోసారి చెప్తాను.
పిల్లలు బాబా ఇంటికి శృంగారం. మధువనం యొక్క శృంగారం మధువనానికి చేరుకున్నారు. భలే జరుపుకోండి. పాడండి, నాట్యం చేయండి. కానీ అవ్యక్త రూపంలో మరియు అతీతంగా, ప్రియంగా చేసుకోండి. ప్రపంచం వారు జరుపుకునే దానిలో అతీత స్థితి ఉండదు. మీరు ఆడుకోండి, తినండి, నవ్వుకోండి, నాట్యం చేయండి కానీ అతీతంగా మరియు ప్రియంగా ఉండండి. బాప్ దాదా అన్ని సేవా కేంద్రాల యొక్క దేశ, విదేశాల పిల్లలను, తన యొక్క కంఠం యొక్క విజయీ మాలను, దీపమాలను చూసి సంతోషిస్తున్నారు మరియు ప్రతి ఒక్క విజయీ, వెలిగి ఉన్న దీపానికి సంగమయుగం మరియు క్రొత్త ప్రపంచం యొక్క అన్ని జన్మల యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. సదా సమీపంగా, సదా సంపన్నంగా మరియు సదా సంపూర్ణంగా ఇలా 3 విశేషతలతో నిండుగా ఉన్న పిల్లలకు త్రిమూర్తి సంబంధంతో సదాకాలిక శుభాకాంక్షలు, అభినందనలు, గ్రీటింగ్స్ సదా ఉన్నాయి మరియు సదా ఉంటాయి.
బాప్ దాదా కూడా ధనవంతులైన పిల్లలకు “ధన్యులు ధన్యులు” అని శుభాకాంక్షలు ఇస్తున్నారు. బాబా సదా మధురాతి మధురంగా తయారుచేసేవారు. బాబా మధురమైన మాటలతో, మధురమైన భావన ద్వారా అందరి మనస్సుని మరియు నోటిని మధురంగా చేసే సదా మధురభవ! అనే వరదానాన్ని ఇస్తున్నారు. బాప్ దాదా సదా వెలుగుతున్న జ్యోతులను చూస్తున్నారు. దూరంగా ఉన్నప్పటికీ చాలా మంది పిల్లల వెలుగుతున్న జ్యోతులు సమూహం రూపంలో ఇప్పుడు కూడా బాబా ఎదురుగా ఉన్నాయి. పిల్లలందరి శుభాకాంక్షల సంకల్పాలు, మాటలు, పత్రాలు మరియు కార్డులు బాబా ఎదురుగా ఉన్నాయి. దేశ, విదేశాల పిల్లలందరికీ దీపావళి శుభాకాంక్షలకు బదులుగా 100 రెట్లు శుభాకాంక్షలు ఇస్తున్నారు. పేరు చెప్పటం లేదు కానీ బాప్ దాదా ఎదురుగా పేరు ఉంది. ప్రతి ఒక్కరి పేరుల మాల కూడా బాప్ దాదా యొక్క కంఠహారంగా ఉంది. రకరకాలైన కార్డులన్నీ గోడలపై ఉన్నాయి కానీ మనస్సు యొక్క మాట మనోభిరాముడైన బాబా వరకు చేరుకుంది. దూరంగా ఉండి సమీపంగా ఉన్న పిల్లలకు మరియు సన్ముఖంగా వచ్చిన పిల్లలకు ఇద్దరకు స్నేహ సంపన్న మరియు సంపూర్ణతతో నిండిన ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment