సఫలతకు అయస్కాంతం - కలుసుకోవడం మరియు మల్చుకోవడం.
అందరి స్నేహం స్నేహ సాగరునిలో ఇమిడిపోయింది. ఇలాగే సదా స్నేహంలో లీనమై ఉంటూ ఇతరులకు కూడా స్నేహాన్ని అనుభవం చేయిస్తూ వెళ్ళండి. బాప్ దాదా పిల్లలందరి ఆలోచనలు సమానంగా కలిసిన సమ్మేళనాన్ని చూసి హర్షిస్తున్నారు. ఎగురుతూ వచ్చేవారికి సదా ఎగిరే కళ యొక్క వరదానాలు స్వతహాగా ప్రాప్తిస్తూ ఉంటాయి. బాప్ దాదా ఇక్కడికి వచ్చిన పిల్లలందరి ఉల్లాస-ఉత్సాహాలను చూసి పిల్లలందరిపై స్నేహ పుష్పాల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఏ మిలనంలోనైతే సంకల్పాలు సమానంగా ఉంటాయో, ఆ తర్వాత సంస్కారాలు బాబా సమానంగా ఉంటాయో - ఈ మిలనమే తండ్రితో మిలనము. ఇదే తండ్రి సమానంగా అవ్వడము. సంకల్పాల మిలనము, సంస్కారాల మిలనము - ఈ మిలనమే నిర్మానంగా అయి నిమిత్తంగా అవ్వడము. సమీపంగా వస్తున్నారు, తప్పకుండా వచ్చేస్తారు. సేవలో సఫలత యొక్క గుర్తులు చూసి హర్షిస్తున్నారు. స్నేహీలుగా అయి స్నేహ అలలను విశ్వంలో వ్యాపింపజేసేందుకే స్నేహ మిలనంలోకి వచ్చారు. కానీ ప్రతి విషయంలోనూ చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ (దానం ఇంటి నుండే మొదలవుతుంది). మొట్టమొదటగా మీకు అన్నింటికంటే ప్రియమైన ఇల్లు - ‘స్వయము’. కనుక మొదట స్వయంతో మొదలుపెట్టాలి, ఆ తర్వాత బ్రాహ్మణ పరివారంతో, ఆ తర్వాత విశ్వంతో. ప్రతి సంకల్పంలోనూ స్నేహం ఉండాలి - సత్యమైన నిస్వార్థ స్నేహం, హృదయపూర్వకమైన స్నేహం, ప్రతి సంకల్పంలోనూ సహానుభూతి, ప్రతి సంకల్పంలోనూ దయాహృదయం ఉండాలి, దాతృత్వ భావన సహజ స్వభావంగా అవ్వాలి - ఇదే స్నేహ మిలనం, సంకల్పాల మిలనం, ఆలోచనల మిలనం, సంస్కారాల మిలనం. సర్వుల సహయోగం యొక్క కార్యానికి ముందు, సదా సర్వ శ్రేష్ఠ బ్రాహ్మణాత్మల సహయోగము విశ్వాన్ని సహజంగానే మరియు స్వతహాగానే సహయోగిగా చేస్తుంది, అందుకే సఫలత సమీపంగా వస్తుంది. కలవడం మరియు మల్చుకోవడం అనగా పరివర్తన అవ్వడం - ఇదే సఫలతకు అయస్కాంతము. ఈ అయస్కాంతానికి సర్వాత్మలు తప్పకుండా చాలా సహజంగా ఆకర్షించబడి వస్తారు.
మీటింగుకు వచ్చిన పిల్లలకు కూడా బాప్ దాదా స్నేహపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పుడు సమీపంగా ఉన్నారు మరియు సదా సమీపంగానే ఉంటారు. కేవలం బాబాకు మాత్రమే కాదు, కానీ పరస్పరంలో కూడా సమీపత యొక్క దృశ్యాన్ని బాప్ దాదాకు చూపించారు. ఈ దృశ్యాన్ని విశ్వానికి చూపించేకన్నా ముందు బాప్ దాదా చూసారు. రాబోయే వారు, పిల్లలైన మీ అందరి యాక్షన్లు (కర్మలు) చూసి - ఏ కర్మలు చేయాలి, ఏం జరగాలి అనేది సహజంగా అర్థం చేసుకుంటారు. మీ యాక్షన్లే (కర్మలే) వారి కోసం యాక్షన్ ప్లాను (కర్మల-ప్రణాళిక). అచ్ఛా.
అందరూ ప్లాన్లు బాగా తయారుచేసారు. ఎలాగైతే ఈ కార్యం ప్రారంభమవుతూనే బాప్ దాదా విశేషంగా వర్గీకరణ సేవ చేసేందుకు సూచన ఇచ్చారో, అదే సూచనను ఇప్పుడు కూడా ఇస్తున్నారు. ఈ మహాన్ కార్యంలో ఏ వర్గము మిగిలిపోకూడదు అనే లక్ష్యం పెట్టుకోండి. సమయ ప్రమాణంగా ఎక్కువ చేయలేకపోయినా కనీసం శ్యాంపుల్ తప్పకుండా తయారవ్వాలనే ప్రయత్నం లేక లక్ష్యాన్ని తప్పకుండా పెట్టుకోండి. ఇక ముందు ఇదే కార్యాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. కనుక సమయ ప్రమాణంగా చేస్తూ ఉండండి. కానీ సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేందుకు సర్వుల సహయోగం కావాలి. కానీ ఇంత పెద్ద ప్రపంచంలోని ఆత్మలందరినీ ఒకే సమయంలో సంపర్కంలోకి తీసుకురాలేరు. అందుకే ‘మేము సర్వాత్మలను సర్వ వర్గాల ఆధారంగా సహయోగులుగా చేసాము’ అని మీరు నషాతో చెప్పవచ్చు. ఈ లక్ష్యము సర్వుల కారణాలను పూర్తి చేస్తుంది. మీరేం చేస్తున్నారో మాకు తెలియనే తెలియదు అనే ఫిర్యాదు ఏ వర్గం వారికి ఉండిపోకూడదు. బీజం వేయండి. ఇక తర్వాత వృద్ధి అనేది సమయం లభించినదాని బట్టి, ఎలా చేయగలరో అలా చేయండి. ఎలా చేయాలి? ఎంత చేయాలి? అని అనుకుంటూ భారీగా అవ్వకండి. ఎంత జరగాలని ఉంటే, అంత తప్పకుండా జరుగుతుంది. ఎంతైతే చేసారో, అంత సఫలతకు సమీపంగా వచ్చారు. శ్యాంపుల్ ను అయితే తయారుచేయగలరు కదా?
భారత ప్రభుత్వాన్ని సమీపంగా తీసుకురావాలనే శ్రేష్ఠ సంకల్పం చేసారు కదా, ఇప్పుడు ఆ సమయం సర్వుల బుద్ధిని సమీపంగా తీసుకొస్తుంది. కనుక బ్రాహ్మణ ఆత్మలందరూ ఈ విశేషమైన కార్యార్థం ప్రారంభం నుండి చివరి వరకు విశేషంగా ‘సఫలత లభించే తీరుతుంది’ అనే శుద్ధ సంకల్పం ద్వారా మరియు బాబా సమానమైన వైబ్రేషన్లను తయారుచేయడం ద్వారా, విజయం నిశ్చితము అనే దృఢత్వంతో ముందుకు సాగండి. కానీ ఎప్పుడైనా ఏదైనా పెద్ద కార్యం చేయాల్సి ఉన్నప్పుడు, ఎలాగైతే స్థూలంగా కూడా ఏదైనా బరువును ఎత్తేటప్పుడు ఏం చేస్తారు? అందరూ కలిసి తమ వేలును అందిస్తారు మరియు అందరి ధైర్యం-ఉత్సాహాలను పెంచే మాటలు మాట్లాడుతారు. చూసారు కదా! అలాగే నిమిత్తంగా ఎవరు ఉన్నా సరే, సదా ఈ విశేషమైన కార్యం కోసం సర్వుల స్నేహం, సర్వుల సహయోగం, సర్వుల శక్తితో కూడిన ఉల్లాస-ఉత్సాహాల వైబ్రేషన్లు కుంభకర్ణులను నిద్ర నుండి మేల్కొల్పుతాయి. ఈ విశేషమైన కార్యం కోసం ఈ అటెన్షన్ తప్పనిసరి. విశేషంగా స్వ, సర్వ బ్రాహ్మణాత్మలు మరియు విశ్వాత్మలు, ఇలా అందరి సహయోగం తీసుకోవడమే సఫలతకు సాధనము. ఒకవేళ ఇందులో కొద్దిగా తేడా వచ్చినా సరే, సఫలతలో తేడాను తీసుకొచ్చేందుకు నిమిత్తులవుతారు, అందుకే బాప్ దాదా పిల్లలందరి ధైర్యంతో కూడిన మాటలను విని అదే సమయంలో హర్షిస్తున్నారు, అంతేకాక, ప్రత్యేకంగా సంగఠన యొక్క స్నేహం కారణంగా స్నేహానికి రిటర్న్ ఇచ్చేందుకు వచ్చారు. చాలా బాగున్నారు మరియు అనేక సార్లు చాలా బాగా అయ్యారు మరియు అయ్యే ఉన్నారు. అందుకే, డబల్ విదేశీ పిల్లలు దూరంగా ఉంటున్నా ఎవర్రెడీగా అయి ఎగురుతున్నందుకు బాప్ దాదా విశేషంగా పిల్లలను తమ హృదయంలోని హారంగా చేసుకొని హృదయంలో ఇముడ్చుకుంటారు. అచ్ఛా.
కుమారీలు కన్నయ్యకు (బాబాకు) చెందినవారిగా ఉండనే ఉన్నారు. కేవలం ఒక పదం గుర్తుంచుకోండి - అన్నింటిలోనూ ఏక్ (ఒకటి), ఏక్ మత్, ఏక్ రస్, ఏక్ బాబా. భారత్ పిల్లలకు కూడా బాప్ దాదా హృదయపూర్వకంగా శుభాకాంక్షలను తెలుపుతున్నారు. ఎలాంటి లక్ష్యం పెట్టుకున్నారో, అలాంటి లక్షణాలను ప్రాక్టికల్ లోకి తీసుకొచ్చారు. అర్థమయిందా? ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు - అందరికి చెప్తున్నారు! నిమిత్తంగా ఉన్నవారికి (దాదీజీకి) ఆలోచన ఉంటుంది కదా. ఇదే సహానుభూతికి గుర్తు. అచ్ఛా.
మీటింగ్ కు వచ్చిన సోదరీ-సోదరులను బాప్ దాదా స్టేజ్ పైకి పిలిచారు
అందరు బుద్ధిని బాగా నడిపించారు. బాప్ దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరికి సేవ పట్ల ఉన్న స్నేహం గురించి తెలుసు. సేవలో ముందుకు వెళ్ళడంతో నలువైపులా ఎంతవరకు సఫలత ఉంది - దీని గురించి కేవలం కాస్త ఆలోచించండి మరియు గమనించండి. ఇకపోతే, సేవ పట్ల తపన బాగుంది. రాత్రి-పగలును ఒకటిగా చేసి సేవ కోసం పరుగుపెడతారు. బాప్ దాదా శ్రమను కూడా ప్రేమ రూపంలో చూస్తారు. మీరు శ్రమించలేదు, ప్రేమను చూపించారు. అచ్ఛా! మంచి ఉల్లాస-ఉత్సాహాలు గల సాథీలు (సహచరులు) లభించారు. కార్యము విశాలమైనది మరియు హృదయం కూడా విశాలమైనది. కనుక ఎక్కడైతే విశాలత ఉంటుందో, అక్కడ సఫలత తప్పకుండా ఉంటుంది. పిల్లలందరికీ సేవ పట్ల ఉన్న తపనను చూసి బాప్ దాదా ప్రతి రోజు సంతోషంతో పాటలను పాడుతారు. చాలా సార్లు ఒక పాటను వినిపించారు - ‘వాహ్ పిల్లలూ వాహ్!’ అచ్ఛా! రావడంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయి! రహస్యాలను అర్థం చేసుకునేవారే కదా! ఆ రహస్యాలకు తెలుసు, ఆ బాబాకు తెలుసు. (దాదీజీ బాప్ దాదాకు భోగ్ స్వీకరింపజేయాలని అనుకున్నారు). ఈ రోజు దృష్టి ద్వారానే స్వీకరిస్తాము. అచ్ఛా!
అందరి బుద్ధి చాలా బాగా నడుస్తుంది. అంతేకాక, ఒకరికొకరు సమీపంగా కూడా వస్తున్నారు కదా! అందుకే సఫలత అతి సమీపంగా ఉంది. మీ సమీపత సఫలతను సమీపంగా తీసుకొస్తుంది. అలసిపోలేదు కదా? చాలా పని చేయాల్సి వచ్చిందా? కానీ సగం పని బాబాయే చేస్తారు. అందరిలో మంచి ఉల్లాసం ఉంది. దృఢత కూడా ఉంది కదా! సమీపత ఎంత సమీపంగా ఉంది? అయస్కాంతం పెడితే సమీపత అందరి మెడలో మాల వేస్తుంది, ఇలా అనుభవమవుతుందా? అచ్ఛా! అందరు చాలా-చాలా బాగున్నారు.
Comments
Post a Comment