09-12-1985 అవ్యక్త మురళి

09-12-1985         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

పిల్లలనుండి యజమానిగా అవ్వండి.

అవ్యక్త బాప్ దాదా మాట్లాడుతున్నారు --

ఈరోజు బాప్ దాదా తన యొక్క శక్తి సేనని చూస్తున్నారు. ఈ ఆత్మిక శక్తిసేన మాయని, విశ్వాన్ని జయించారా? అని. మనస్సుని జయించడం అంటే మనస్సు యొక్క వ్యర్థ సంకల్పాలను, వికల్పాలను జయించడం. ఇలా వీటిని జయించిన పిల్లలే విశ్వ రాజ్యాధికారిగా అవుతారు. అందువలనే మనస్సుని జయించినవారే విశ్వాన్ని జయించగలరు అనే మహిమ ఉంది. ఎంత ఈ సమయంలో సంకల్పశక్తి అంటే మనస్సుని స్వ - అధికారంలో పెట్టుకుంటారో అంతగానే విశ్వరాజ్యాధికారి అవుతారు. ఇప్పుడు ఈ సమయంలో మీరు ఈశ్వరుని పిల్లలు మరియు ఇప్పుడు పిల్లలుగా ఉన్నవారే విశ్వానికి యజమాని అవుతారు. పిల్లలుగా కాకుండా యజమానిగా కాలేరు. హద్దు యొక్క యజమాని స్థితి యొక్క నషాని సమాప్తి చేసుకుని పిల్లలుగా అవ్వాలి. అప్పుడే పిల్లల నుండి యజమానిగా అవుతారు. అందువలన భక్తి మార్గంలో కూడా ఏ దేశం యొక్క యజమాని అయినా, వారి కుటుంబం యొక్క యజమాని అయినా కానీ బాబా ముందు అందరు " మేము నీ పిల్లలం” అంటూ ప్రార్థన చేస్తారు. నేను ఫలానా యజమానిని అని అనరు. బ్రాహ్మణ పిల్లలయిన మీరు కూడా బాబాకి పిల్లలుగా అవుతున్నారు. అందువలనే ఇప్పుడు కూడా నిశ్చింతాచక్రవర్తులుగా అవుతున్నారు. “ పిల్లల నుండి యజమానులం అనే ఈ స్మృతి సదా నిరహంకారి, నిరాకారి స్థితిని అనుభవం చేయిస్తుంది. బాబాకి పిల్లలుగా అవ్వటం అంటే హద్దు యొక్క జీవితం పరివర్తన అవ్వాలి. ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అయ్యారో బ్రాహ్మణ జీవితం యొక్క మొదటి పాఠం ఏమి చదువుకున్నారు? పిల్లలు బాబా అన్నారు మరియు బాబా పిల్లలు అన్నారు. ఈ ఒక్క మాట యొక్క పాఠం జ్ఞానస్వరూపంగా చేస్తుంది. పిల్లలు అనే ఈ ఒక్క మాట ద్వారా ఈ విశ్వం యొక్క జ్ఞానమే కాకుండా మూడు లోకాల యొక్క జ్ఞానం చదువుకున్నారు. ఈ ప్రపంచంలో ఎంత జ్ఞానం తెలిసిన వారైనా మూడు లోకాల యొక్క జ్ఞానం తెలుసుకోలేరు. ఒక్క మాట యొక్క పాఠం చదువుకున్న మీ ముందు ఎంత జ్ఞానసాగరులైనా తెలివితక్కువ వారే! ఈవిధంగా మాస్టర్ జ్ఞానస్వరూపంగా ఎంత సహజంగా అయ్యారు. బాబా మరియు పిల్లలు ఈ ఒక్క మాటలో అన్నీ నిండి ఉన్నాయి. ఎలాగైతే బీజంలో మొత్తం వృక్షం అంతా నిండి ఉంటుందో అలాగే పిల్లలుగా అవ్వటం అంటే సదాకాలికంగా మాయ నుండి రక్షించుకోవడం. మాయ నుంచి రక్షించుకోవాలి అంటే మేము పిల్లలం అని సదా ఈ స్మృతిలో ఉండండి. సదా ఇదే స్మృతి ఉంచుకోండి. పిల్లలుగా అయ్యాము అంటే రక్షింపబడ్డాము అని. ఈ పాఠం కష్టమా? సహజమే కదా! అయినప్పటికీ ఎందుకు మర్చిపోతున్నారు? కొంతమంది పిల్లలు మరిచిపోవాలి అని అనుకోవటం లేదు కానీ మరచిపోతున్నాము అని అంటున్నారు. ఎందుకు మర్చిపోతున్నారు? చాలా సమయం యొక్క సంస్కారం, పాత సంస్కారం అని అంటున్నారు కానీ ఎప్పుడైతే మరజీవ అయిపోయారో చనిపోయిన తరువాత ఏమి చేస్తారు? అగ్ని సంస్కారం చేస్తారు కదా! పాత వాటిని సంస్కారం చేసారు అప్పుడే క్రొత్త జన్మ తీసుకున్నారు. ఎప్పుడైతే దహనం చేసేసారో అప్పుడు పాత సంస్కారాలు ఎక్కడి నుండి వచ్చాయి? శరీరాన్ని దహనం చేస్తే నామ రూపాలు ఉండవు. ఒకవేళ ఎవరైనా ఫలానా వారు అని అంటే వారు ఉండేవారు ఇప్పుడు లేరు అని చెప్తారు. శరీరం దహనం చేసిన తర్వాత శరీరం సమాప్తి అయిపోతుంది. మరి బ్రాహ్మణ జీవితంలో ఏమి దహనం చేయాలి? శరీరం అయితే అదే. కానీ పాత సంస్కారాలని, పాత స్మృతులని, స్వభావ సంస్కారాలని దహనం చేస్తున్నారు. అప్పుడే మరజీవ అంటారు. ఎప్పుడైతే దహనం చేసేసారో అప్పుడు పాత సంస్కారాలు ఎక్కడ నుండి వస్తాయి? ఒకవేళ దహనం చేసిన మనుష్యులు మరలా మీ ఎదురుగా వస్తే ఏమంటారు? భూతం అంటారు కదా! అలాగే ఇక్కడ కూడా పాత సంస్కారాలను దహనం చేసిన తర్వాత మరలా మేల్కొంటే వాటిని ఏమంటారు? దీనిని కూడా మాయ యొక్క భూతం అని అంటారు. కదా! భూతాలను పారద్రోలుతారు కదా! వాటి గురించి వర్ణన కూడా చేయరు. మీరు పాత సంస్కారాలు అంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఒకవేళ మీకు పాత విషయాలు ఇష్టంగా అన్పిస్తే చాలా పురాతనమైన ఆది సంస్కారాలని జ్ఞాపకం చేసుకోండి. ఇవి మధ్య కాలం సంస్కారాలు. పురాతనమైనవి కావు. మీరు మధ్య వాటిని జ్ఞాపకం చేయటం అంటే అలజడి అవ్వటం. అందువలన ఎప్పుడు కూడా ఈ బలహీన విషయాలు ఆలోచించకండి. సదా ఇవే రెండు మాటలు జ్ఞాపకం ఉంచుకోండి - పిల్లల నుండి యజమానిగా అవ్వాలి అని. పిల్లలం అనే స్మృతి ద్వారానే యజమానులం అని స్మృతి స్వతహాగా వస్తుంది. పిల్లలుగా అవ్వటం రావటంలేదా?      

పిల్లలుగా అవ్వండి అంటే అన్ని బరువుల నుండి తేలికగా అవ్వండి. అప్పుడప్పుడు నాది, అప్పుడప్పుడు నీది - ఇదే కష్టంగా చేస్తుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నీ పని నువ్వే చేయాలి అంటున్నారు. మరియు సహజమైనది అయినప్పుడు నాది అంటున్నారు. “నాది” అనేది సమాప్తి అవ్వడం అంటే పిల్లలు నుండి యజమానిగా అవ్వటం. బాబా బీదవారిగా అవ్వండి అని చెప్తున్నారు. ఈ శరీర రూపి ఇల్లు కూడా మనది కాదు. ఇది అద్దెకు లభించింది. కేవలం ఈశ్వరీయ సేవకి బాబా అద్దెకు ఇచ్చారు, నిమిత్తంగా చేసారు. ఇది ఈశ్వరుని తాకట్టు వస్తువు. మీరు అన్నీ నీవేనంటూ బాబాకి ఇచ్చేసారు. ఈ ప్రతిజ్ఞ చేసారు కదా లేక మర్చిపోయారా? సగం నీది, సగం నాది అని ప్రతిజ్ఞ చేసారా? ఒకవేళ నీది అని చెప్పి నాదిగా భావించి కార్యంలో ఉపయోగిస్తే ఏమౌతుంది? దాని ద్వారా సుఖం లభిస్తుందా? సఫలత లభిస్తుందా? అందువలన తాకట్టుగా భావించి నీది అని భావించి నడిస్తే పిల్లల నుంచి యజమాని అయ్యి సంతోషంలో స్వతహాగానే ఉంటారు అర్థమైందా! ఈ ఒక్క పాఠం పక్కాగా ఉంచుకోండి. పాఠం పక్కాగా చేసుకున్నారా? లేక మీ మీ స్థానాలకి వెళ్ళి మర్చిపోతారా? మర్చిపోనివారిగా అవ్వండి!

సదా ఆత్మిక నషాలో ఉంటూ పిల్లలు నుండి యజమానిగా అయ్యే పిల్లలకు, సదా పిల్లవాని స్థితి అంటే నిశ్చింత చక్రవర్తి యొక్క స్మృతిలో ఉండే వారికి, సదా లభించిన తాకట్టు వస్తువుని నిమిత్తంగా అయ్యి సేవలో ఉపయోగించే పిల్లలకు, సదా క్రొత్త ఉత్సాహం, క్రొత్త ఉల్లాసంలో ఉండే పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments