09-10-1987 అవ్యక్త మురళి

09-10-1987         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

‘‘అలౌకిక రాజ్య దర్బారు సమాచారము’’

ఈ రోజు బాప్ దాదా తమ స్వరాజ్య అధికారి పిల్లల రాజ్య దర్బారును చూస్తున్నారు. సంగమయుగములోని అద్వితీయమైన, అద్భుతమైన, శ్రేష్ఠమైన కీర్తి కల ఈ అలౌకిక దర్బారు మొత్తము కల్పములో అతీతమైనది మరియు అతి ప్రియమైనది. ఈ రాజ్య సభలోని ఆత్మిక ప్రకాశము, ఆత్మిక కమల ఆసనము, ఆత్మిక కిరీటము మరియు తిలకము, ముఖములోని మెరుపు, స్థితి యొక్క శ్రేష్ఠ స్మృతి యొక్క వాయుమండలములోని అలౌకిక సువాసన, అతి రమణీకంగా, అతి ఆకర్షితము చేసేవిగా ఉన్నాయి. ఇటువంటి సభను చూసి బాప్ దాదా ప్రతి ఒక్క రాజ్య అధికారీ ఆత్మను చూసి హర్షితులవుతున్నారు. ఇది ఎంత పెద్ద దర్బారు! బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారులు. ఎంతమంది బ్రాహ్మణ పిల్లలున్నారు! బ్రాహ్మణులందరి దర్బారులను ఒకచోట చేర్చినట్లయితే ఎంత పెద్ద రాజ్య దర్బారు అయిపోతుంది! ఇంత పెద్ద రాజ్య దర్బారు ఏ యుగములోనూ ఉండదు. ఉన్నతోన్నతుడైన బాబా యొక్క పిల్లలందరూ స్వరాజ్య అధికారులుగా అవుతారు, ఇదే సంగమయుగము యొక్క విశేషత. మామూలుగా లౌకిక పరివారములో ప్రతి తండ్రి తన పిల్లలను, నా కొడుకు రాజా బిడ్డ అని అంటారు లేదా నా పిల్లలు ప్రతి ఒక్కరూ ‘రాజు’గా అవ్వాలని కోరుకుంటారు. కానీ పిల్లలందరూ రాజుగా అవ్వలేరు. ఈ సామెతను పరమాత్మ తండ్రి నుండి కాపీ చేసారు. ఈ సమయములో బాప్ దాదా పిల్లలందరూ రాజయోగులుగా అనగా స్వయముపై రాజులుగా ఉన్నారు, నంబరువారుగా అయితే తప్పకుండా ఉన్నారు కానీ అందరూ రాజయోగులే, ప్రజాయోగులుగా ఎవ్వరూ లేరు. మరి బాప్ దాదా అనంతమైన రాజ్య సభను చూస్తున్నారు. అందరూ తమను తాము స్వరాజ్య అధికారులుగా భావిస్తున్నారు కదా? కొత్తగా వచ్చిన పిల్లలు రాజ్య అధికారులుగా ఉన్నారా లేక ఇప్పుడు తయారవ్వాలా? కొత్తవారు కనుక కలవడం నేర్చుకుంటున్నారు. అవ్యక్త తండ్రి యొక్క అవ్యక్త మాటలను అర్థం చేసుకునే అలవాటు కూడా అవుతూ ఉంటుంది. ఆత్మలమైన మేమందరమూ ఎంతటి భాగ్యవంతులము అని ఈ భాగ్యాన్ని ఇప్పటి కన్నా కూడా సమయం వచ్చినప్పుడు ఎక్కువగా తెలుసుకుంటారు.

అలౌకిక రాజ్య దర్బారు యొక్క సమాచారాన్ని బాప్ దాదా వినిపిస్తున్నారు. విశేషంగా పిల్లలందరి కిరీటము మరియు ముఖములోని మెరుపు వైపుకు అనుకోకుండానే అటెన్షన్ వెళ్తూ ఉంది. కిరీటము బ్రాహ్మణ జీవితము యొక్క విశేషత - ‘పవిత్రత’ను సూచిస్తుంది. ముఖములోని మెరుపు ఆత్మిక స్థితిలో స్థితులై ఉండే ఆత్మికత యొక్క మెరుపు. మామూలుగా కూడా ఎవరినైనా చూసినప్పుడు అన్నింటికంటే ముందు వారి ముఖము వైపుకు దృష్టి వెళ్తుంది. ఈ ముఖమే వృత్తి మరియు స్థితి యొక్క దర్పణము. కావున బాప్ దాదా ఏమి చూస్తున్నారంటే - మెరుపైతే అందరిలోనూ ఉంది కానీ ఒకరేమో సదా ఆత్మికతా స్థితిలో స్థితులై ఉండేవారు, స్వతః మరియు సహజమైన స్థితి కలవారు మరియు మరొకరు సదా ఆత్మిక స్థితి అభ్యాసము ద్వారా స్థితులై ఉండేవారు. ఒకరేమో సహజ స్థితి కలవారు, మరొకరు ప్రయత్నము చేసి స్థితులైయ్యేవారు అనగా ఒకరేమో సహజయోగులు, మరొకరు పురుషార్థము ద్వారా యోగులు. ఈ రెండు రకాల వారి మెరుపులో తేడా ఉంది. వారిది సహజ సౌందర్యమైతే మరొకరిది పురుషార్థము ద్వారా ఏర్పడిన సౌందర్యము. ఏ విధంగానైతే ఈ రోజుల్లో మేకప్ చేసుకుని అందంగా తయారవుతారు కదా. నేచురల్ (స్వాభావిక) బ్యూటీ యొక్క మెరుపు సదా ఏకరసంగా ఉంటుంది, మరొక బ్యూటీ ఒక్కోసారి చాలా బాగుంటుంది, ఒక్కోసారి పర్సంటేజ్లో ఉంటుంది. ఒకే విధంగా, ఏకరసంగా ఉండదు. కనుక సదా సహజ యోగి, స్వతః యోగి స్థితి నంబర్ వన్ స్వరాజ్య అధికారిగా తయారుచేస్తుంది. బ్రాహణ జీవితము అనగా ఒక్క బాబాయే ప్రపంచము మరియు ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు అన్నది పిల్లలందరి ప్రతిజ్ఞ అయినప్పుడు, ప్రపంచమే బాబా అయినప్పుడు, ఇతురులెవ్వరూ లేనే లేనప్పుడు, స్వతః మరియు సహజ యోగి స్థితి సదా ఉంటుంది కదా, లేదా కష్టపడవలసి ఉంటుందా? ఒకవేళ ఇతరులెవరైనా ఉంటే అప్పుడు బుద్ది అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు అని కష్టపడవలసి వస్తుంది. కానీ ఒక్క బాబాయే సర్వస్వము అయినప్పుడు ఇక బుద్ధి ఎక్కడకు వెళ్తుంది? వెళ్ళనే వెళ్ళనప్పుడు ఇక అభ్యాసమేమి చేస్తారు? అభ్యాసములో కూడా తేడా ఉంటుంది. ఒకటేమో స్వతః అభ్యాసము, అది ఉండనే ఉంది మరియు మరొకటి శ్రమతో కూడిన అభ్యాసము. కనుక స్వరాజ్య అధికారి పిల్లలు సహజ అభ్యాసకులుగా అవ్వాలి - ఇదే సహజ యోగి, స్వతః యోగి యొక్క లక్షణము. వారి ముఖంలోని మెరుపు అలౌకికమైనదిగా ఉంటుంది, వారి ముఖం చూడటంతోనే వీరు శ్రేష్ఠ ప్రాప్తి స్వరూప సహజయోగులు అని ఇతర ఆత్మలు అనుభవము చేస్తారు. వీరు షావుకారు కులానికి చెందినవారు లేక ఉన్నత పదవి కల అధికారులు అని స్థూల ధనము లేక స్థూల పదవి యొక్క మెరుపు ఏవిధంగా ముఖం ద్వారా తెలిసిపోతుందో, అలా ఈ శ్రేష్ఠ ప్రాప్తి, శ్రేష్ఠ రాజ్య అధికారము అనగా శ్రేష్ఠ పదవి ప్రాప్తి యొక్క నషా లేక మెరుపు ముఖం ద్వారా కనిపిస్తుంది. వీరు ఏదో పొందారు, వీరు ప్రాప్తి స్వరూప ఆత్మలు అని దూరం నుండే అనుభవము చేస్తారు. అలా రాజ్య అధికారి పిల్లలందరి మెరుస్తున్న ముఖాలు కనిపించాలి. శ్రమ యొక్క గుర్తులు కనిపించకూడదు. ప్రాప్తి గుర్తులు కనిపించాలి. ఇప్పుడు కూడా చూడండి, కొందరి పిల్లల ముఖాలను చూసి వీరు ఏదో పొందారు అని అంటారు, మరి కొందరి పిల్లల ముఖాలను చూసి వీరి గమ్యము ఉన్నతమైనది కానీ త్యాగమును కూడా చాలా ఎక్కువగా చేసారని అంటారు. ముఖం నుండి త్యాగము కనిపిస్తుంది కానీ భాగ్యము కనిపించదు. లేదంటే చాలా బాగా కష్టపడుతున్నారు అనైనా అంటారు.

పిల్లలు ప్రతి ఒక్కరి ముఖం నుండి సహజయోగి యొక్క మెరుపు కనిపించాలి, శ్రేష్ఠ ప్రాప్తుల నషా యొక్క మెరుపు కనిపించాలి అని బాప్ దాదా ఇదే చూడాలనుకుంటారు ఎందుకంటే మీరు ప్రాప్తుల భాండాగారమైన తండ్రి యొక్క పిల్లలు. సంగమయుగ ప్రాప్తుల యొక్క వరదానీ సమయమునకు అధికారులు. నిరంతర యోగాన్ని ఎలా చెయ్యాలి మరియు నిరంతర అనుభవము చేసి భాండాగారము యొక్క అనుభూతిని ఎలా చెయ్యాలి అని ఇప్పటివరకు కూడా ఈ శ్రమలోనే సమయాన్ని పోగొట్టుకోకండి, ప్రాప్తి స్వరూప భాగ్యమును సహజంగా అనుభవం చెయ్యండి. సమాప్తి సమయము సమీపంగా వస్తూ ఉంది. ఇప్పటివరకు ఏదో ఒక విషయము కోసం శ్రమిస్తూ ఉన్నట్లయితే ప్రాప్తి సమయము సమాప్తమైపోతుంది. ఇక ప్రాప్తి స్వరూప అనుభవమును ఎప్పుడు చేస్తారు? ‘సర్వ ప్రాప్తి భవ’ అన్నది సంగమయుగమునకు, బ్రాహ్మణ ఆత్మలకు కల వరదానము. మీకు ‘సదా పురుషార్థీ భవ’ అన్న వరదానము లేదు, ‘ప్రాప్తి భవ’ అన్న వరదానమే ఉంది. ‘ప్రాప్తి భవ’ కల వరదానీ అత్మ ఎప్పుడూ కూడా నిర్లక్ష్యములోకి రాజాలరు, అందుకే వారికి కష్టపడవలసిన అవసరము ఉండదు. మరి ఎలా తయారవ్వాలి అన్నది అర్థమైందా?

రాజ్య సభలో రాజ్య అధికారులుగా అయ్యేందుకు కావలసిన విశేషత ఏమిటి, ఇది స్పష్టమైంది కదా? రాజ్య అధికారులే కదా, లేదా రాజ్య అధికారులమా, కాదా అని ఇప్పుడు ఆలోచిస్తున్నారా? విధాత పిల్లలుగా, వరదాత పిల్లలుగా అయిపోయారు, మరి రాజు అనగా విధాత, ఇచ్చేవారు. అప్రాప్తి అన్నదే లేనప్పుడు ఇక ఏమి తీసుకుంటారు? మరి అర్థమైందా, కొత్త-కొత్త పిల్లలు ఈ అనుభవములో ఉండాలి. యుద్ధములోనే సమయాన్ని పోగొట్టుకోకూడదు. ఒకవేళ యుద్ధములోనే సమయాన్ని పోగొట్టుకున్నట్లయితే అంత-మతి కూడా యుద్ధములోనే ఉంటుంది. కావున ఎలా తయారవ్వవలసి ఉంటుంది? చంద్రవంశములోకి వెళ్తారా లేక సూర్యవంశములోకి వెళ్తారా? యుద్ధము చేసేవారైతే చంద్రవంశములోకి వెళ్తారు. నడుస్తున్నాము, చేస్తున్నాము, అయిపోతుందిలే, చేరుకుంటాములే - ఇప్పటికీ కూడా ఇటువంటి లక్ష్యమును పెట్టుకోకండి. ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు. ఒకవేళ అవ్వాలనుకున్నా ఇప్పుడే, పొందాలనుకున్నా ఇప్పుడే - ఇటువంటి ఉల్లాస-ఉత్సాహాలు కలవారే సరైన సమయానికి తమ సంపూర్ణ లక్ష్యమును పొందగలరు. త్రేతాయుగములోని సీత, రాములుగా అయ్యేందుకైతే ఎవ్వరూ తయారుగా లేరు. సత్యయుగ సూర్యవంశములోకి రావాలంటే, సూర్యవంశము అనగా సదా మాస్టర్ విధాత మరియు వరదాత, తీసుకునే కోరిక కలవారు కారు. సహాయము లభించాలి, ఇదైపోయిందంటే చాలా బాగుంటుంది, పురుషార్థములో మంచి నంబర్ తీసుకుంటాములే - ఇలా అనుకోకూడదు. సహాయము లభిస్తూ ఉంది, అన్నీ జరుగుతున్నాయి - ఇటువంటివారిని స్వరాజ్య అధికారి పిల్లలు అని అంటారు. ముందుకు వెళ్ళాలా లేక వెనుక వచ్చారు కావున వెనుకనే ఉండిపోవాలా? ముందుకు వెళ్ళేందుకు సహజ మార్గము - సహజ యోగి, స్వతః యోగిగా అవ్వండి. ఇది చాలా సహజము. ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేనే లేనప్పుడు ఇక ఎక్కడకు వెళ్తారు? ప్రాప్తులే ప్రాప్తులు, ఇక ఏం కష్టమనిపిస్తుంది? కనుక ప్రాప్తి సమయపు లాభాన్ని పొందండి. సర్వ ప్రాప్తి స్వరూపులుగా అవ్వండి. అర్థమైందా? బాప్ దాదా అయితే ఇదే కోరుకుంటారు - ప్రతి ఒక్క బిడ్డ, లాస్ట్ లో వచ్చేవారైనా సరే, స్థాపన యొక్క ఆదిలో వచ్చినవారైనా సరే, పిల్లలు ప్రతి ఒక్కరూ నంబర్ వన్ గా అవ్వాలి. రాజుగా అవ్వాలి, ప్రజలుగా కాదు. అచ్ఛా!

మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ నుండి గ్రూప్ వచ్చింది. చూడండి. మహా అన్న పదము ఎంత బాగా ఉంది. మహారాష్ట్ర స్థానము కూడా మహా అన్న పదానికి చెందినది మరియు అవ్వాల్సింది కూడా మహాన్ గా. మహానులుగా అయితే అయిపోయారు కదా, ఎందుకంటే బాబాకు చెందినవారిగా అయ్యారు అంటే మహానులుగా అయినట్లు. మీరు మహాన్ ఆత్మలు. బ్రాహ్మణులు అనగా మహానులు. ప్రతి కర్మ మహాన్ (గొప్పది), ప్రతి మాట మహాన్, ప్రతి సంకల్పము మహాన్ గా ఉంటుంది. అలౌకికులుగా అయ్యారు కదా. కనుక మేము మహానులము అని మహారాష్ట్ర వారు ఎల్లప్పుడూ స్మృతి స్వరూపులుగా అవ్వండి. బ్రాహ్మణులు అనగా మహాన్ పిలక కదా!

మధ్య ప్రదేశ్ - సదా ‘మధ్యాజీ భవ’ అన్న నషాలో ఉండేవారు. ‘మన్మనాభవ’ తోపాటు ‘మధ్యాజీ భవ’ అన్న వరదానము కూడా ఉంది. మీ స్వర్గ స్వరూపము - ‘మధ్యాజీ భవ’ అని అంటారు కనుక తమ శ్రేష్ఠ ప్రాప్తి యొక్క నషాలో ఉండేవారు అనగా ‘మధ్యాజీ భవ’ అన్న మంత్రము యొక్క స్వరూపములో స్థితులై ఉండేవారు. వారు కూడా మహానులైపోయారు. ‘మధ్యాజీ భవ’గా ఉన్నట్లయితే ‘మన్మనాభవ’గా కూడా తప్పకుండా ఉంటారు. కనుక మధ్య ప్రదేశ్ అనగా మహామంత్రము యొక్క స్వరూపులుగా అయ్యేవారు. కనుక ఇరువురూ తమ-తమ విశేషతల ద్వారా మహానులు. మీరు ఎవరో అర్థమైందా?

ఎప్పటినుండైతే మొదటి పాఠమును ప్రారంభించారో, అది కూడా నేను ఎవరు అన్నదానినే చేసారు కదా? బాబా కూడా అదే విషయమును గుర్తు తెప్పిస్తారు. దీనిపైనే మననము చెయ్యాలి. ‘నేను ఎవరు’ అన్న మాట ఒక్కటే కానీ దానికి జవాబులు ఎన్ని ఉన్నాయి? ‘నేను ఎవరు’ అన్న లిస్ట్ తయారుచెయ్యండి. అచ్ఛా!

నలువైపులా కల సర్వ ప్రాప్తి స్వరూపులు, శ్రేష్ఠ ఆత్మలు, సర్వ అలౌకిక రాజ్య సభ అధికారీ మహాన్ ఆత్మలు, సదా ఆత్మికతా మెరుపును ధారణ చేసే విశేష ఆత్మలు, సదా స్వతః యోగులు, సహజ యోగులు, ఉన్నతోన్నతమైన ఆత్మలు, ఉన్నతోన్నతమైన బాప్ దాదా యొక్క స్నేహ సంపన్న ప్రియస్మృతులను స్వీకరించండి.

అవ్యక్త బాప్ దాదాతో డబల్ విదేశీ సోదరీ సోదరుల కలయిక

డబల్ విదేశీయులు అనగా సదా తమ స్వ-స్వరూపము, స్వ దేశము, స్వ రాజ్యముల స్మృతిలో ఉండేవారు. డబల్ విదేశీయులు విశేషంగా ఏ సేవను చెయ్యాలి? ఇప్పుడు సైలెన్స్ శక్తి యొక్క అనుభవమును విశేషంగా ఆత్మలకు చేయించండి. ఇది కూడా విశేషమైన సేవ. సైన్స్ శక్తి ప్రసిద్ధమైనది కదా. సైన్స్ అంటే ఏమిటి అన్నది పిల్లలు ప్రతి ఒక్కరికీ తెలుసు. అలా సైలెన్స్ శక్తి, సైన్స్ శక్తి కంటే కూడా గొప్పది. ఆ రోజు కూడా రానున్నది. సైలెన్స్ శక్తి యొక్క ప్రత్యక్షత అనగా బాబా ప్రత్యక్షత. ఏ విధంగా సైన్స్ ప్రత్యక్ష ప్రూఫ్ ను చూపిస్తుందో, అలా సైలెన్స్ శక్తి యొక్క ప్రాక్టికల్ ప్రూఫ్ - మీ అందరి జీవితము. ఇంతమంది ప్రాక్టికల్ ప్రూఫ్ గా కనిపించినట్లయితే, వద్దన్నాసరే మీరు అందరి దృష్టిలోకి సహజంగా వచ్చేస్తారు. ఏ విధంగానైతే ఈ పీస్ కార్యమును చేసారు కదా (గత సంవత్సరము), దీనిని స్టేజ్ పై ప్రాక్టికల్ గా చూపించారు. అలాగే నడుస్తూ-తిరుగుతూ ఉన్న పీస్ మోడల్ గా కనిపించినట్లయితే సైన్స్ వారి దృష్టి కూడా సైలెన్స్ వారి పైకి తప్పకుండా వెళ్తుంది. అర్థమైందా? సైన్స్ ఆవిష్కరణలు విదేశాలలో ఎక్కువగా అవుతాయి. కనుక సైలెన్స్ శక్తి యొక్క శబ్దము కూడా అక్కడి నుండి సహజంగా వ్యాపిస్తుంది. సేవ యొక్క లక్ష్యమైతే ఉంది, అందరికీ ఉల్లాస-ఉత్సాహాలు కూడా ఉన్నాయి. సేవ లేకుండా ఉండలేరు. ఏ విధంగా భోజనం లేకుండా ఉండలేరో, అలా సేవ లేకుండా కూడా ఉండలేరు కనుక బాప్ దాదా సంతోషిస్తున్నారు. అచ్ఛా!

పార్టీలతో అవ్యక్త బాప్ దాదా కలయిక

స్వదర్శన చక్రధారీ శ్రేష్ఠ ఆత్మలుగా అయ్యారు, ఇలా అనుభవము చేస్తున్నారా? స్వయము యొక్క దర్శనము అయ్యింది కదా? తమను తాము తెలుసుకోవటము అనగా స్వ దర్శనము కలగటము మరియు చక్రము జ్ఞానమును తెలుసుకోవటము అనగా స్వదర్శన చక్రధారులుగా అవ్వటము. స్వదర్శన చక్రధారులుగా అయినప్పుడు ఇతర చక్రాలన్నీ సమాప్తమైపోతాయి. దేహభానపు చక్రము, సంబంధాల చక్రము, సమస్యల చక్రము - మాయ చక్రాలు ఎన్ని ఉన్నాయి! కానీ చక్రధారులుగా అవ్వటంతో ఈ చక్రాలన్నీ సమాప్తమైపోతాయి, అన్ని చక్రాల నుండి బయటపడతారు. లేదంటే వలలో చిక్కుకుపోతారు. ఇంతకుముందు చిక్కుకుని ఉండేవారు, ఇప్పుడు బయటపడ్డారు. 63 జన్మలైతే అనేక చక్రాలలో చిక్కుకుంటూ ఉన్నారు మరియు ఈ సమయములో ఈ చక్రాల నుండి బయటకు వచ్చారు, కనుక మళ్ళీ చిక్కుకోకూడదు. అనుభవించి చూసారు కదా? అనేక చక్రాలలో చిక్కుకోవటంతో అన్నింటినీ పోగొట్టుకున్నారు మరియు స్వదర్శన చక్రధారులుగా అవ్వటంతో బాబా లభించారు, కావున అన్నీ లభించాయి. కనుక సదా స్వదర్శన చక్రధారులుగా అయ్యి, మాయాజీతులుగా అయ్యి ఉన్నతి చెందుతూ వెళ్ళండి, దీని వలన సదా తేలికగా ఉంటారు, ఏ విధమైన భారము అనుభవమవ్వదు. భారమే కిందకు తీసుకువస్తుంది. తేలికగా ఉంటే పైకి ఎగురుతూ ఉంటారు. మరి మీరు ఎగిరే వారే కదా? బలహీనులైతే కారు కదా? ఒకవేళ ఒక రెక్క బలహీనంగా ఉన్నా కానీ అది కిందకు తీసుకువచ్చేస్తుంది, ఎగరనివ్వదు. కావున రెండు రెక్కలూ దృఢంగా ఉన్నట్లయితే స్వతహాగానే ఎగురుతూ ఉంటారు. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి అనగా ఎగిరే కళలోకి వెళ్ళాలి. అచ్ఛా!

రాజయోగి, శ్రేష్ఠ యోగి ఆత్మలు కదా? సాధారణ జీవితము నుండి సహజ యోగులు, రాజయోగులుగా అయ్యారు. ఇటువంటి శ్రేష్ఠ యోగి ఆత్మలు సదా అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగుతారు. హఠయోగులు యోగము ద్వారా శరీరమును పైకి లేపుతారు మరియు ఎగిరే అభ్యాసమును చేస్తారు. వాస్తవానికి రాజయోగులైన మీరు ఉన్నత స్థితిని అనుభవము చేస్తారు. దీనిని కాపీ చేసి వారు శరీరాన్ని పైకి లేపుతారు. కానీ మీరు ఎక్కడ ఉన్నా కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటారు, అందుకే యోగి ఉన్నతంగా ఉంటారని అంటారు. మనసు స్థితి యొక్క స్థానము ఉన్నతమైనది ఎందుకంటే డబల్ లైట్ గా అయిపోయారు. మామూలుగా కూడా ఫరిస్తాల గురించి చెప్తూ ఫరిస్తాల పాదాలు నేలపై ఆనవు అని అంటారు. ఫరిస్తా అనగా బుద్ధిరూపీ పాదము నేలపై ఉండదు, దేహభానములో ఉండదు. దేహభానము నుండి సదా ఉన్నతముగా ఉంటారు - ఇటువంటి ఫరిస్తాలుగా అనగా రాజయోగులుగా అయ్యారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచము పట్ల ఎటువంటి మోహము లేదు. సేవ చెయ్యటము వేరే విషయము కానీ మోహము ఉండకూడదు. యోగిగా అవ్వటము అనగా బాబా మరియు నేను, మూడవవారు ఎవ్వరూ లేరు. మేము రాజయోగులము, సదా ఫరిస్తాలము అన్న ఈ స్మృతిలోనే సదా ఉండండి. ఈ స్మృతితో సదా ముందుకు వెళ్తూ ఉంటారు. రాజయోగి సదా అనంతమైన యజమాని, హద్దు యజమాని కాదు. హద్దు నుండి బయటకు వచ్చేసారు. అనంతమైన అధికారము లభించింది. ఈ సంతోషములోనే ఉండండి. ఏ విధంగా తండ్రి అనంతమైనవారో, ఆ విధంగా అనంతమైన సంతోషములో ఉండండి, నషాలో ఉండండి. అచ్ఛా!

వీడ్కోలు సమయంలో

అమృతవేళ యొక్క వరదానీ పిల్లలందరూ వరదాత బాబా నుండి స్వర్ణిమ ప్రియస్మృతులను స్వీకరించండి, అలాగే స్వర్ణిమ ప్రపంచాన్ని తయారుచేసే సేవ యొక్క ప్లానును సదా మననము చేసేవారు మరియు సదా సేవలో ప్రేమగా మనసుతో ప్రాణం పెట్టి, తనువు-మనసు-ధనములతో సహయోగం చేసే ఆత్మలకు, అందరికీ బాప్ దాదా గుడ్ మార్నింగ్, డైమండ్ మార్నింగ్ చెప్తున్నారు మరియు సదా డైమండ్ గా అయ్యి ఈ డైమండ్ యుగపు విశేషతను, వరదానము మరియు వారసత్వముగా తీసుకుని స్వయము కూడా స్వర్ణిమ స్థితిలో స్థితులై ఉంటారు మరియు ఇతరులకు కూడా అలాగే అనుభవము చేయిస్తూ ఉంటారు. కనుక నలువైపులా కల డబల్ హీరో పిల్లలకు డైమండ్ మార్నింగ్. అచ్ఛా!

Comments