07-11-1989 అవ్యక్త మురళి

 07-11-1989         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

మూడు సంబంధాల ద్వారా సహజమైన మరియు శ్రేష్టమైన పాలన.

ఈ రోజు విశ్వ స్నేహీ అయిన బాప్ దాదా విశేషంగా నలువైపులా ఉన్న తండ్రి-స్నేహీ పిల్లలను చూస్తున్నారు. బాబా స్నేహము మరియు పిల్లల స్నేహము, ఈ రెండూ ఒక దాని కంటే ఒకటి ఎక్కువగా ఉన్నాయి. స్నేహమనేది మనసుకు మరియు తనువుకు అలౌకిక రెక్కలను ఇచ్చి తండ్రికి సమీపంగా తీసుకొస్తుంది. స్నేహమనేది ఎలాంటి ఆత్మిక ఆకర్షణ అంటే, అది పిల్లలను తండ్రి వైపుకు ఆకర్షించి వారితో మిలనం జరుపుకునేందుకు నిమిత్తమవుతుంది. మిలన మేళా, అది మనసు ద్వారా జరిగినా లేక సాకార శరీరం ద్వారా జరిగినా - ఈ రెండు అనుభవాలు స్నేహ ఆకర్షణతోనే జరుగుతాయి. పరమాత్ముని ఆత్మిక స్నేహమే బ్రాహ్మణులైన మీకు దివ్య జన్మను ఇచ్చింది. ఈ రోజు బాప్ దాదా ఇప్పుడిప్పుడే ఆత్మిక స్నేహమనే సెర్చ్ లైట్ ద్వారా నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లల స్నేహమయ ముఖాలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న అనేక మంది పిల్లలు హృదయంతో పాడే స్నేహ గీతాలను, హృదయానికి మిత్రుడైన బాప్ దాదా వింటున్నారు. బాప్ దాదా స్నేహీ పిల్లలందరికీ, వారు సమీపంగా ఉన్నా లేక దూరంగా ఉంటూ హృదయానికి సమీపంగా ఉన్నా, వారందరి స్నేహానికి రిటర్న్ లో వరదానాలు ఇస్తున్నారు - ‘‘సదా అదృష్టవంతులుగా కండి! సదా ఆనందంగా ఉండండి, సదా సంతోషమనే ఔషధం ద్వారా ఆరోగ్యవంతులుగా కండి! సదా సంతోషం యొక్క ఖజానాతో సంపన్నంగా ఉండండి!’’

ఆత్మిక స్నేహము దివ్య జన్మను ఇచ్చింది, ఇప్పుడు వరదాత అయిన బాప్ దాదా ఇచ్చే వరదానాల ద్వారా దివ్య పాలన జరుగుతుంది. పాలన అనేది అందరికీ ఒక్కరి ద్వారా, ఒకే సమయంలో, ఒకే విధంగా లభిస్తుంది. కానీ లభించిన పాలన యొక్క ధారణ నంబరువారుగా తయారుచేస్తుంది. మామూలుగా కూడా, విశేషమైన మూడు సంబంధాల పాలన అత్యంత శ్రేష్ఠమైనది మరియు సహజమైనది. బాప్ దాదా ద్వారా వారసత్వం లభిస్తుంది, వారసత్వపు స్మృతి ద్వారా పాలన జరుగుతుంది - ఇందులో ఏ కష్టము లేదు. శిక్షకుని ద్వారా రెండు పదాల చదువు యొక్క పాలనలో కూడా ఏ కష్టము లేదు. సద్గురువు ద్వారా వరదానాల అనుభూతి యొక్క పాలనలో కూడా ఏ కష్టము లేదు. కానీ చాలా మంది పిల్లల్లో ధారణ బలహీనంగా ఉన్న కారణంగా సమయమనుసారంగా సహజమును కష్టంగా చేసుకోవడం అలవాటు అయిపోయింది. శ్రమ చేసే సంస్కారము, సహజంగా అనుభవం చేసే విషయంలో నిస్సహాయులుగా చేస్తుంది. ఆ నిస్సహాయత కారణంగా మరియు ధారణలో బలహీనత కారణంగా పరవశులవుతారు. ఇలాంటి పరవశులైన పిల్లల జీవన లీలను చూసి బాప్ దాదాకు ఇలాంటి పిల్లల పట్ల దయ కలుగుతుంది ఎందుకంటే బాబా యొక్క ఆత్మిక స్నేహానికి గుర్తు ఏమిటంటే - వారు ఏ బిడ్డలోనూ లోపాన్ని లేక బలహీనతను చూడలేరు. మన పరివారంలోని లోపం మన లోపమే అవుతుంది, అందుకే బాబాకు అయిష్టము కలగదు, దయ కలుగుతుంది. బాప్ దాదా అప్పుడప్పుడు ఆది నుండి ఇప్పటి వరకు గల పిల్లల జాతకాన్ని చూస్తారు. చాలా మంది పిల్లల జాతకంలో దయే దయ ఉంటుంది మరియు చాలా మంది పిల్లల జాతకం సుఖాన్నిచ్చేదిగా, విశ్రాంతినిచ్చేదిగా ఉంటుంది. మీరు ఆది నుండి ఇప్పటి వరకు గల మీ జాతకాన్ని చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరు చూసుకొని ‘మూడు సంబంధాల పాలన యొక్క ధారణ సహజంగా మరియు శ్రేష్ఠంగా ఉందా?’ అని తెలుసుకోగలరు. ఎందుకంటే సహజంగా నడుచుకోవడమనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి - వరదానాల ద్వారా సహజ జీవితము, రెండవది - నిర్లక్ష్యము, డోంట్ కేర్ (లెక్క చేయకుండా ఉండడము), దీనితో కూడా సహజంగా నడుచుకుంటారు. వరదానాల ద్వారా లేక ఆత్మిక పాలన ద్వారా సహజంగా నడుచుకునే ఆత్మలు జాగ్రత్తగా ఉంటారు, నిర్లక్ష్యంగా ఉండరు. అలాగని వారికి అటెన్షన్ యొక్క టెన్షన్ కూడా ఉండదు. ఇలా జాగ్రత్తగా ఉండే ఆత్మల యొక్క సమయం, సాధనాలు మరియు పరిస్థితుల అనుసారంగా, వారికి బ్రాహ్మణ పరివారంతో పాటు బాబా యొక్క విశేషమైన సహాయం కూడా సహయోగమిస్తుంది, అందుకే అన్నీ సహజంగా అనుభవమవుతాయి. కనుక చెక్ చేసుకోండి - ఈ విషయాలన్నీ నాకు సహయోగిగా ఉన్నాయా? ఈ అన్ని విషయాల సహయోగమే సహజయోగిగా చేస్తుంది. లేకుంటే అప్పుడప్పుడు చిన్న పరిస్థితి అయినా, సాధనాలు, సమయము, సహచరులు ఇవన్నీ చీమలాంటి విషయాలైనా సరే, ఆ చిన్న చీమ మహారథిని కూడా మూర్ఛితులుగా చేస్తుంది. మూర్ఛితులుగా చేయడం అంటే వరదానాల సహజ పాలన అనే శ్రేష్ఠ స్థితి నుండి కిందకు పడేస్తుంది. నిస్సహాయత మరియు శ్రమ - ఈ రెండు మూర్ఛితులైనదానికి గుర్తులు. కనుక ఈ విధి ద్వారా మీ జాతకాన్ని చెక్ చేసుకోండి. ఏం చేయాలో అర్థమయిందా? అచ్ఛా!

సదా మూడు సంబంధాల పాలనలో పాలించబడేవారు, సదా సంతుష్టమణులుగా అయి సంతుష్టంగా ఉండే మరియు సంతుష్టతా ప్రకాశాన్ని వ్యాపింపజేసేవారు, సదా ఫాస్ట్ పురుషార్థులుగా అయి స్వయానికి ఫస్ట్ జన్మలో ఫస్ట్ అధికారాన్ని ప్రాప్తి చేయించుకునేవారు, ఇలాంటి అదృష్టవంతులైన పిల్లలకు వరదాత తండ్రి యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో కలయిక - అందరూ దూర-దూరాల నుండి వచ్చారు. అందరికంటే దూరం నుండి బాప్ దాదా వస్తారు. మాకైతే కష్టమనిపిస్తుందని మీరంటారు. బాప్ దాదా విషయంలో కూడా - ఆ బేహద్ లో ఉండేవారు హద్దులోకి ప్రవేశించడమంటే, అది వారికి అతీతమైన విషయం కదా. అయినా కూడా అప్పు (శరీరాన్ని) తీసుకోవాల్సి ఉంటుంది. మీరు టికెట్ తీసుకుంటారు, బాబా అప్పు తీసుకుంటారు. అందరికీ వరదానాలు లభించాయా? 7-8 వైపుల నుండి వచ్చినా, ప్రతి జోను నుండి ఎవరో ఒకరు తప్పకుండా ఉన్నారు, అందుకే ఇక్కడ అన్ని జోన్లు హాజరై ఉన్నాయి. విదేశాల వారు కూడా ఉన్నారు. దేశం వారు కూడా ఉన్నారు. కనుక ఇది అంతర్జాతీయ గ్రూపు అయినట్లు కదా. అచ్ఛా!

తమిళనాడు గ్రూపు - అందరికంటే పెద్ద గ్రూపు తమిళనాడు. తమిళనాడు విశేషత ఏమిటి? స్నేహ వైబ్రేషన్లను క్యాచ్ చేస్తారు. బాబా పట్ల స్నేహము అవినాశీ లిఫ్ట్ గా అవుతుంది. మెట్లు ఇష్టమా లేక లిఫ్ట్ ఇష్టమా? మెట్లు అనగా శ్రమ, లిఫ్ట్ అనగా సహజము. కనుక స్నేహంలో ఎప్పుడూ నిర్లక్ష్యులుగా అవ్వకండి లేకుంటే లిఫ్ట్ జామ్ అయిపోతుంది (నిలిచిపోతుంది) ఎందుకంటే కరెంట్ పోతే లిఫ్ట్ పరిస్థితి ఏమవుతుంది? కరెంట్ పోతే, కనెక్షన్ కట్ అయితే, ఏదైతే సుఖానుభూతి కలగాలో, అది కలగదు. కావున స్నేహంలో నిర్లక్ష్యం ఉంటే, బాబా నుండి కరెంట్ లభించదు, అప్పుడిక లిఫ్ట్ పని చేయదు. అందరి స్నేహం బాగుంది, ఈ స్నేహంలో మంచి కర్మలు చేస్తూ ఉండండి. ఈ లిఫ్ట్ అనే గిఫ్టును మీతో పాటు తీసుకువెళ్ళండి.

మైసూర్ గ్రూపు - మైసూర్ విశేషత ఏమిటి? మైసూర్ నివాసులైన పిల్లలకు బాప్ దాదా ‘‘సంగమ యుగమనే మనోహరమైన సీజన్ యొక్క ఫలాన్ని’’ కానుకగా ఇస్తున్నారు. సంగమయుగ ఫలం ఏమిటి? సీజన్లో వచ్చే ఫలం మధురంగా ఉంటుంది. సీజన్ లేకుండా వచ్చే ఫలం, చూడడానికి ఎంత బాగున్నా తినడానికి బాగోదు. కనుక మైసూర్ నివాసులైన పిల్లలకు సంగమ యుగమనే సీజన్లోని ఫలం అనగా ‘ప్రత్యక్ష ఫలం’. ఇప్పుడిప్పుడే శ్రేష్ఠ కర్మ చేసారు మరియు ఇప్పుడిప్పుడే కర్మకు ప్రత్యక్ష ఫలం లభించింది, అందుకే మీరు సదా స్వయాన్ని ఈ నషా యొక్క స్మృతిలో ఉంచుకోవాలి - ‘మేము సంగమ యుగమనే సీజన్ యొక్క ప్రత్యక్ష ఫలాన్ని తినేవారము, ప్రాప్తి చేసుకునేవారము’. వృద్ధి బాగా చేస్తున్నారు. తమిళనాడులో కూడా వృద్ధి చాలా బాగా జరుగుతుంది.

ఈస్టర్న్ జోన్ గ్రూపు - ఈస్ట్ (తూర్పు) నుండి ఏం వెలువడుతుంది? సూర్యుడు ఉదయిస్తాడు కదా. కనుక ఈస్టర్న్ జోన్ వారికి బాప్ దాదా ఒక విశేషమైన పుష్పాన్ని ఇస్తున్నారు. అది మీ విశేషత ఆధారంగా ఇచ్చే పుష్పము - ‘‘సూర్యముఖి’’ (పొద్దు తిరుగుడు). ఈ పుష్పము సదా సూర్యుని సకాష్ తో వికసించి ఉంటుంది. దీని ముఖము సదా సూర్యుని వైపు ఉంటుంది కనుక దీనిని సూర్యముఖి అని అంటారు, అంతేకాక దాని రూపం చూస్తే, ఎలాగైతే సూర్యుని కిరణాలు ఉంటాయో, అలా నలువైపులా దాని రెక్కలు కిరణాల వలె సర్కిల్ లో ఉంటాయి. అలా, మీరు సదా జ్ఞాన సూర్యుడైన బాప్ దాదా సమ్ముఖంలో ఉండేవారు, ఎప్పుడూ జ్ఞాన సూర్యుడి నుండి దూరమయ్యేవారు కాదు. సదా సమీపంగా ఉండడం మరియు సదా సమ్ముఖంలో ఉండడం - ఇలా ఉండడాన్ని సూర్యముఖి పుష్పంలా ఉండడమని అంటారు. కనుక ఇలా సూర్యముఖి పుష్పంలా సదా జ్ఞాన సూర్యుని ప్రకాశంతో స్వయం ప్రకాశిస్తూ ఇతరులను కూడా ప్రకాశింపజేస్తారు - ఇది ఈస్టర్న్ జోన్ వారి విశేషత. వాస్తవానికి జ్ఞాన సూర్యుడు ఈస్టర్న్ జోన్ నుండే ప్రత్యక్షమయ్యారు. ప్రవేశించటం జరిగింది కదా! కనుక ఈస్టర్న్ జోన్ వారు అందరినీ తమ రాజ్యంలోకి, పగలులోకి తీసుకువెళ్ళేవారు, ప్రకాశంలోకి తీసుకువెళ్ళేవారు.

బనారస్ గ్రూపు - బనారస్ విశేషత ఏమిటి? వీరు ప్రతి ఒక్కరిలో ఆత్మిక రసాన్ని నింపేవారు. మీరు రసం లేకుండా లేరు, అలానే రసం లేకుండా ఉండేవారు కాదు. మీరు అందరిలో ఆత్మిక రసాన్ని నింపేవారు, అందరికీ పరమాత్మ స్నేహము, పరమాత్మ ప్రేమ రసాలను అనుభవం చేయించేవారు ఎందుకంటే ఎప్పుడైతే బాబా ప్రేమ అనే రసంతో నిండుగా అవుతారో, అప్పుడు ఇతర రసాలన్నీ నిస్సారంగా అనిపిస్తాయి. మీరు ఆత్మలలో పరమాత్మ-ప్రేమ రసాన్ని నింపేవారు ఎందుకంటే అక్కడ భక్తి రసము చాలా ఉంది. భక్తి రసము కలవారికి పరమాత్మ ప్రేమ రసాన్ని అనుభవం చేయించేవారు. అన్నింటికంటే ఎక్కువ రసము ఎందులో ఉంటుందో బనారస్ వారు వినిపించండి. రసగుల్లాలో ఉంటుంది. చూడండి, ముందు పేరే రసంతో మొదలవుతుంది. కావున మీరు సదా జ్ఞానమనే రసగుల్లాను తినేవారు మరియు తినిపించేవారు. సదా అమృతవేళలో ముందు మనసును, నోటిని రసగుల్లాతో మధురంగా చేసుకునేవారు, అంతేకాక ఇతరులను కూడా మనసు ద్వారా, నోటి ద్వారా మధురంగా చేసేవారు కనుక బనారస్ వారికి ‘రసగుల్లా’ మిఠాయిని ఇస్తున్నారు.

బొంబాయి గ్రూపు - బొంబాయి వారికి ముందు నుండే ‘నరదేసావర్’ అనే వరదానం లభించి ఉంది. ‘నరదేసావర్’ అనగా అందరినీ షావుకార్లుగా తయారుచేసేవారు. ‘నరదేసావర్’ అనగా సదా ధనంతో సంపన్నంగా ఉండేవారు. బొంబాయి వారి విశేషత ఏమిటంటే - ‘‘వారు పేదవారిని షావుకార్లుగా తయారుచేస్తారు.’’ బాబాకు ఏదైతే ‘పేదల పెన్నిధి’ అనే టైటిల్ ఉందో, అలా బొంబాయి వారికి కూడా బాప్ దాదా ‘‘పేదల పెన్నిధి అయిన తండ్రి పిల్లలు, పేదవారిని షావుకార్లుగా తయారుచేసేవారు’’ అనే టైటిల్ ఇస్తున్నారు. కావున మీరు సదా స్వయం కూడా ఖజానాలతో సంపన్నంగా ఉంటూ ఇతరులను కూడా సంపన్నంగా చేసేవారు. కనుక బొంబాయి వారి విశేషత ఏమిటంటే - వీరు పేదల పెన్నిధి అయిన తండ్రికి సహయోగీ సాథీలు. కనుక బొంబాయి వారికి టైటిల్ ఇస్తున్నారు. మిఠాయి కాదు, టైటిల్ ఇస్తున్నారు.

కులు, మనాలి గ్రూపు - కులు-మనాలి వారి విశేషత ఏమిటి? కులూలో ఏదైతే దేవతల మేళా జరుగుతుందో, అది ఇంకెక్కడా జరగదు. కులు-మనాలిని దేవతలు కలుసుకునే స్థానమని చెప్తూ ఉంటారు. దేవతలు అంటేనే ‘దివ్యగుణధారులు’. దివ్యగుణాల ధారణకు స్మృతిచిహ్నమే దేవతా రూపము. కనుక ఈ ధరణి దేవతల ప్రేమకు, మిలనానికి గుర్తు, అందుకే బాప్ దాదా ఇలాంటి ధరణిలో నివసించే పిల్లలకు విశేషంగా దివ్యగుణాల పుష్పగుచ్ఛాన్ని కానుకగా ఇస్తున్నారు. ఈ దివ్యగుణాల పుష్పగుచ్ఛం ద్వారా నలువైపులా ఆత్మ-పరమాత్మల మేళాను జరుపుకుంటూ ఉంటారు. వారు దేవతల మేళాలను జరుపుతారు, మీరు దివ్యగుణాల పుష్పగుచ్ఛం ద్వారా ఆత్మ-పరమాత్మల మేళాను జరుపుకుంటున్నారు. అయితే, ఇప్పుడింకా జోరు-జోరుగా అందరూ చూసే విధంగా మేళాను జరపండి. దేవతల మేళా అయితే దేవతలదే కానీ ఈ మేళా సర్వ శ్రేష్ఠమైన మేళా కావున దివ్యగుణాల సుగంధంతో కూడిన పుష్పగుచ్ఛాన్ని కానుకగా సదా మీతో పాటు పెట్టుకోండి.

మీటింగ్ కు వచ్చిన వారితో - మీటింగ్ వారు ఎందుకు వచ్చారు? సెట్టింగ్ చేసేందుకు వచ్చారు. ప్రోగ్రామ్ ను, స్పీకర్లను సెట్టింగ్ చేసేందుకు వచ్చారు. సీటింగ్ ను సెట్టింగ్ చేసేందుకు వచ్చారు. ఎలాగైతే ఉపన్యాసాన్ని సెట్ చేసారో లేక ప్రోగ్రామ్ ను సెట్ చేసారో, అలా ఉపన్యసించేవారు లేక చూడడానికి ఎవరైతే వస్తారో, వారికి ఇప్పటి నుండే ఎలాంటి శ్రేష్ఠమైన వైబ్రేషన్లు ఇవ్వాలంటే వారు ఉపన్యసించే స్థితిని కేవలం కొంత సమయానికే సెట్ చేసుకోవడం కాదు, కానీ సదా తమ శ్రేష్ఠ స్థితిపై సెట్ అవ్వాలి, అందుకే బాప్ దాదా మీటింగ్ వారికి అవినాశీ సెట్టింగ్ చేసే మెషిన్ ను కానుకగా ఇస్తున్నారు, దీని ద్వారా సెట్ చేస్తూ ఉండండి. ఇది మెషినరీ (యంత్రాల) యుగం కదా. ఏ పనైతే మనుష్యులు చేయడానికి ఎక్కువ సమయం పడుతుందో, ఆ పని మెషినరీ (యంత్రాల) ద్వారా సహజంగా మరియు త్వరగా అవుతుంది. కనుక ఇప్పుడు మీ సెట్టింగ్ మెషినరీని ఎలా ప్రయోగంలోకి తీసుకురావాలంటే, దాని ద్వారా చాలా త్వరత్వరగా సెట్టింగ్ అవుతూ ఉండాలి, ఎందుకంటే మీ మనోహరమైన ప్రపంచం లేక సుఖమయ ప్రపంచం యొక్క ప్లాను అనుసారంగా అందరి సీట్లను సెట్ చేయాలి కదా. ప్రజలను కూడా సెట్ చేయాలి, ప్రజల ప్రజలను కూడా సెట్ చేయాలి. రాజా-రాణులైతే సెట్ అవుతున్నారు కానీ ఇంకా రాయల్ పరివారం వారు ఉన్నారు, షావుకార్ల పరివారం వారు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, దాస దాసీలు ఉన్నారు, కనుక ఎంత సెట్టింగ్ చేయాలి! కావున ఇప్పుడు మీటింగ్ వారు సెట్టింగ్ మెషినరీని విశేషంగా వేగవంతం చేయండి. వేగవంతం చేయడం అనగా స్వయాన్ని తీవ్ర పురుషార్థిగా చేసుకోవడము. ఇదే దానికి స్విచ్. మెషిన్ కు స్విచ్ ఉంటుంది కదా. కనుక మెషినరీని వేగవంతం చేసేందుకు స్విచ్ తీవ్ర పురుషార్థిగా అవ్వడము అనగా వేగంగా సెట్టింగ్ చేసే మెషినరీని ఆన్ చేయడము. ఇది చాలా పెద్ద బాధ్యత. కనుక ఇప్పుడు మీ రాజధాని సెట్టింగ్ మెషినరీని వేగవంతం చేయండి.

డబల్ విదేశీ గ్రూపు - డబల్ విదేశీ పిల్లలు ఈ రోజుల్లో శాటిలైట్ ద్వారా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాబాను ప్రత్యక్షం చేసే తపనతో చాలా బాగా ముందుకు వెళ్తున్నారు కనుక బాప్ దాదా ‘సదా సెట్ డబల్ లైట్’ గా (సదా డబల్ లైట్ స్థితిలో స్థితులై ఉండడం) ఉండే కానుకను ఇస్తున్నారు. వారు శాటిలైట్ ప్రోగ్రామ్ ను చేయాలని ఆలోచిస్తున్నారు మరియు బాప్ దాదా ‘సదా సెట్ డబల్ లైట్’ అనే కానుకను ఇస్తున్నారు. సదా తమ డబల్ లైట్ స్థితిలో స్థితులై ఉండే డబల్ విదేశీ పిల్లలకు హృదయాభిరాముడైన బాప్ దాదా తమ హృదయపూర్వకమైన స్నేహాన్ని కానుకగా ఇస్తున్నారు.

అమెరికా నివాసులైన పిల్లలు విశేషంగా గుర్తు చేస్తున్నారు. చాలా మంచి ఉల్లాస-ఉత్సాహాలతో విశ్వ సేవ చేసే మంచి సాధనం తయారయింది. యు.ఎన్ (యునైటెడ్ నేషన్స్) కూడా సేవా సాథీగా అయింది కదా. భారత్ సేవకు పునాది, అందుకే భారత్ నుండి కూడా విశేషంగా సేవా యోగ్యుడైన సహచరుడు (జగదీష్ భాయిజీ) వెళ్ళారు. పునాది భారత్ మరియు ప్రత్యక్షతకు నిమిత్తము విదేశాలు. ప్రత్యక్షతా శబ్దం దూరం నుండి భారత్ కు నగారాగా (ఢంకాగా) అయి వస్తుంది. పిల్లల వైబ్రేషన్లు వస్తున్నాయి. లండన్ నివాసులు కూడా సాథీలే, ఆస్ట్రేలియా వారు కూడా విశేషమైన సేవా సాథీలే, ఆఫ్రికా వారు కూడా తక్కువేమీ కాదు. అన్ని దేశాల వారి సహయోగం బాగుంది. బాప్ దాదా దేశ-విదేశాలలో నిమిత్తంగా ఉన్న సేవాధారి పిల్లలు ప్రతి ఒక్కరికీ వారి-వారి విశేషతల ప్రమాణంగా విశేషమైన ప్రియస్మృతులను ఇస్తున్నారు. ఎవరి మహిమ వారిది. ఒక్కొక్కరి మహిమను వర్ణిస్తే ఎంత అవుతుంది! కానీ బాప్ దాదా హృదయంలో పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతల మహిమ ఇమిడి ఉంది.

మధుబన్ నివాసి సేవాధారులు కూడా ధైర్యంతో సేవలో సహయోగమిస్తారు. అందుకే, ఎలాగైతే తండ్రి కోసం - ‘హిమ్మతే బచ్చే, మదదే బాప్ (ధైర్యం పిల్లలది, సహాయం తండ్రిది)’ అనే మహిమ ఉందో, అదే విధంగా ఏ సేవ నడిచినా, సీజన్ నడిచినా మధుబన్ నివాసులు కూడా ధైర్యం యొక్క స్తంభాలుగా అవుతారు, అంతేకాక మధుబన్ నివాసుల ధైర్యంతో మీ అందరికీ ఉండేందుకు, తినేందుకు, నిదురించేందుకు, స్నానం చేసేందుకు సహాయం లభిస్తుంది కనుక బాప్ దాదా మధుబన్ నివాసి పిల్లల ధైర్యానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అచ్ఛా.

Comments