భాగ్యవంతులైన పిల్లల శ్రేష్ఠ భాగ్యముల లిస్టు.
ఈ రోజు భాగ్య విధాత అయిన బాప్ దాదా తమ భాగ్యవంతులైన పిల్లలను చూస్తున్నారు. బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యము ప్రపంచంలోని సాధారణ ఆత్మలందరి కంటే అత్యంత శ్రేష్ఠమైనది ఎందుకంటే ప్రతి బ్రాహ్మణాత్మ కోట్లలో కొందరు మరియు ఆ కొందరిలో కూడా కొందరిగా ఉన్నారు. 550 కోట్లమంది ఆత్మలు ఎక్కడ మరియు మీ బ్రాహ్మణుల చిన్న ప్రపంచం ఎక్కడ! వారితో పోలిస్తే మీరు ఎంత కొద్దిమంది ఉన్నారు! అందుకే, అజ్ఞాని, అమాయక ఆత్మలతో పోలిస్తే బ్రాహ్మణులైన మీ అందరు శ్రేష్ఠ భాగ్యవంతులు. ప్రతి బ్రాహ్మణుని మస్తకంలో భాగ్యరేఖ చాలా స్పష్టంగా తిలకం వలె మెరుస్తూ ఉండడాన్ని బాప్ దాదా చూస్తున్నారు. హద్దు జ్యోతిష్కులు చేతి రేఖలను చూస్తారు కానీ ఈ దివ్యమైన ఈశ్వరీయ భాగ్యరేఖ ప్రతి ఒక్కరి మస్తకంలో కనిపిస్తుంది. ఎంత శ్రేష్ఠ భాగ్యమో, అంతగా భాగ్యవంతులైన పిల్లల మస్తకంలో సదా అలౌకిక లైట్ మెరుస్తూ ఉంటుంది. భాగ్యవంతులైన పిల్లల్లో ఇంకేమి గుర్తులు కనిపిస్తాయి? సదా వారి ముఖంపై ఈశ్వరీయ ఆత్మిక చిరునవ్వు అనుభవమవుతుంది. భాగ్యవంతుల నయనాలు అనగా వారి దివ్యదృష్టి ఎవరిలోనైనా సదా సంతోషపు అలను ఉత్పన్నం చేసేందుకు నిమిత్తంగా అవుతుంది. ఆ దృష్టి ఎవరికి లభించినా సరే, వారు ఆత్మికతను, ఆత్మిక తండ్రిని, పరమాత్మ స్మృతిని అనుభవం చేస్తారు. భాగ్యవంతులైన ఆత్మల సంపర్కంలో ప్రతి ఆత్మకు తేలికదనం అనగా లైట్ యొక్క అనుభూతి కలుగుతుంది. బ్రాహ్మణ ఆత్మలు చివరి వరకు నంబరువారుగా ఉంటారు కానీ ఈ గుర్తులు నంబరువారుగా భాగ్యవంతులైన పిల్లలందరిలోనూ ఉంటాయి. మున్ముందు ఇంకా ప్రత్యక్షం అవుతూ ఉంటాయి.
ఇప్పుడు ఇంకాస్త సమయం గడవనివ్వండి. కొద్ది సమయంలో అతి మరియు అంతము - ఈ రెండూ అనుభవమైతే నలువైపులా ఉన్న, పరిచయం లేని ఆత్మలు హద్దు వైరాగ్య వృత్తిలోకి వస్తారు మరియు భాగ్యవాన్ ఆత్మలైన మీరు అనంతమైన వైరాగ్య వృత్తి అనుభవంలో ఉంటారు. ఇప్పుడైతే ప్రపంచంలోని వారిలో కూడా వైరాగ్యం లేదు. ఒకవేళ కొద్దో-గొప్పో రిహార్సల్ జరిగినా కూడా, ‘ఇవి జరుగుతూనే ఉంటాయిలే’ అని నిర్లక్ష్యమనే నిద్రలో ఇంకా నిద్రపోతారు. కానీ ఎప్పుడైతే ‘అతి’ మరియు ‘అంతం’ యొక్క దృశ్యాలు ఎదురుగా వస్తాయో, అప్పుడు స్వతహాగానే హద్దు వైరాగ్య వృత్తి ఉత్పన్నమవుతుంది మరియు అతి టెన్షన్ ఉన్న కారణంగా అందరి అటెన్షన్ ఒక్క తండ్రి వైపుకు వెళ్తుంది. ఆ సమయంలో సర్వాత్మల హృదయం నుండి ‘అందరి రచయిత, అందరి తండ్రి ఒక్కరే’ అనే శబ్దం వెలువడుతుంది మరియు బుద్ధి అనేక వైపుల నుండి తొలగి ఒకే వైపుకు స్వతహాగా వెళ్తుంది. అలాంటి సమయంలో భాగ్యవాన్ ఆత్మలైన మీ అనంతమైన వైరాగ్య వృత్తితో కూడిన స్థితి స్వతహాగా మరియు నిరంతరం ఉంటుంది. ప్రతి ఒక్కరి మస్తకం ద్వారా భాగ్యరేఖలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు కూడా శ్రేష్ఠ భాగ్యవంతులైన పిల్లల బుద్ధిలో సదా ఏముంటుంది? ‘భగవంతుడు’ మరియు ‘భాగ్యము’.
అమృతవేళ నుండి మొదలుకుని మీ భాగ్యం యొక్క లిస్టును తీయండి. భాగ్యవంతులైన పిల్లలను అమృతవేళలో స్వయంగా తండ్రే మేల్కొల్పుతారు మరియు ఆహ్వానిస్తారు కూడా. ఎవరైతే అతి స్నేహీ పిల్లలున్నారో, వారి అనుభవమేమిటంటే - నిద్రపోదామని అనుకున్నా ఎవరో నిద్రపోనివ్వడం లేదు, ఎవరో లేపుతున్నారు, పిలుస్తున్నారు. ఈ విధంగా అనుభవం అవుతుంది కదా. అమృతవేళ నుండి మీ భాగ్యాన్ని చూసుకోండి. భక్తిలో దేవతలను భగవంతునిగా భావించి భక్తులు గంటలు మ్రోగిస్తూ మేల్కొల్పుతారు కానీ మిమ్మల్ని స్వయంగా భగవంతుడే మేల్కొల్పుతారు. ఇది ఎంతటి భాగ్యము! అమృతవేళ నుండి మొదలుకుని తండ్రి పిల్లలకు సేవాధారిగా అయి సేవ చేస్తారు. అంతేకాక, ‘రండి, బాబా సమాన స్థితిని అనుభవం చేయండి, నాతో పాటు కూర్చోండి’ అని ఆహ్వానిస్తారు. బాబా ఎక్కడ కూర్చున్నారు? ఉన్నతమైన స్థానంలో మరియు ఉన్నతమైన స్థితిలో. మరి తండ్రితో పాటు కూర్చుంటే స్థితి ఎలా ఉంటుంది! ఎందుకు శ్రమిస్తున్నారు? వారితో పాటు కూర్చుంటే సాంగత్యము యొక్క రంగు స్వతహాగానే పడుతుంది. స్థానం అనుసారంగా స్థితి స్వతహాగా తయారవుతుంది. ఉదాహరణకు, మధుబన్ కు వచ్చినప్పుడు స్థితి ఎలా తయారవుతుంది? యోగం జోడించాల్సి వస్తుందా లేక యోగం జోడించబడే ఉంటుందా? అందుకే ఇక్కడ ఎక్కువ సమయం ఉండాలనే కోరిక పెట్టుకుంటారు కదా. ఒకవేళ ఇప్పుడు అందరికీ ‘ఇంకా 15 రోజులు ఉండిపోండి’ అని చెప్తే సంతోషంలో డ్యాన్స్ చేస్తారు కదా. కావున ఎలాగైతే స్థానం యొక్క ప్రభావం స్థితిపై పడుతుందో, అలా అమృతవేళ పరంధామానికి లేక సూక్ష్మవతనానికి వెళ్లి బాబాతో పాటు కూర్చోండి. అమృతవేళ శక్తిశాలిగా ఉంటే రోజంతా స్వతహాగానే సహాయం లభిస్తుంది. కనుక మీ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోండి - ‘వాహ్ నా భాగ్యము!’, నా దినచర్యే భగవంతునితో ప్రారంభమవుతుంది.
ఇంకా మీ భాగ్యాన్ని చూడండి - తండ్రి స్వయంగా శిక్షకునిగా అయి ఎంతటి దూర దేశం నుండి మిమ్మల్ని చదివించడానికి వస్తారు! అందరూ భగవంతుని వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తారు కానీ స్వయంగా భగవంతుడే మీ వద్దకు శిక్షకునిగా అయి చదివించడానికి వస్తారు, ఎంతటి భాగ్యము! మరియు, ఎంత సమయం నుండి తన సేవా బాధ్యతను నిర్వర్తిస్తున్నారు! వారు ఎప్పుడైనా బద్దకిస్తారా? ఎప్పుడైనా ‘ఈ రోజు తలనొప్పిగా ఉంది, రాత్రి నిద్రపోలేదు’ అని సాకులు చెప్తారా. కావున ఎలాగైతే బాబా అలసటలేని సేవాధారిగా అయి సేవ చేస్తారో, అలా బాబా సమానమైన పిల్లలు కూడా అలసటలేని సేవాధారులు. మీ దినచర్యను చూసుకోండి, ఎంత గొప్ప భాగ్యము. బాబా సదా స్నేహీలైన, చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలకు చెప్తారు - ఏ సేవ చేస్తున్నా సరే, లౌకికం అయినా, అలౌకికం అయినా, పరివారంలోనైనా, సేవాకేంద్రంలోనైనా - ఏ పని చేసినా, ఏ డ్యూటీని నిర్వర్తించినా సదా ఇలా అనుభవం చేయండి - ‘చేయించేవారు చేయిస్తున్నారు, నిమిత్తంగా చేస్తున్న నా ద్వారా చేయిస్తున్నారు, నేను సేవ చేసేందుకు నిమిత్తమై ఉన్నాను, చేయించేవారు చేయిస్తున్నారు’. ఇక్కడ కూడా మీరు ఒంటరిగా లేరు, బాబా చేయించేవాని రూపంలో కర్మ చేసే సమయంలో కూడా మీతో పాటు ఉంటారు. మీరు కేవలం నిమిత్తులు. భగవంతుడు విశేషంగా చేయించేవారు. అసలు ఒంటరిగా ఎందుకు చేస్తారు? నేను ఒంటరిగా చేస్తున్నాను అనే భానము ఉన్నట్లయితే ఈ ‘నేను’ అనేది మాయ వచ్చేందుకు ద్వారం వంటిది. తర్వాత మాయ వచ్చేసిందని అంటారు. తలుపులు తెరుస్తే, మాయ అయితే కాచుకొని ఉంది మరియు మీరు మాయ రావటానికి ఇంత మంచి ఏర్పాటును చేస్తే, అది ఎందుకు రాదు?
చేయించేవారైన తండ్రి ప్రతి కర్మను చేయిస్తున్నారు అనే భాగ్యాన్ని కూడా సదా స్మృతిలో ఉంచుకోండి. అప్పుడు భారము ఉండదు. భారము యజమాని పైన ఉంటుంది, వారితో పాటు ఉండే సహచరులపై భారము ఉండదు. మీరు యజమానిగా అయితే భారము వచ్చేస్తుంది. నేను బాలకుడను మరియు బాబా యజమాని. యజమాని, బాలకుడినైన నా ద్వారా చేయిస్తున్నారు. పెద్దవారిగా అయితే పెద్ద దుఃఖాలు వచ్చేస్తాయి. బాలకునిగా అయి, యజమాని డైరెక్షన్ అనుసారంగా చెయ్యండి. ఇది ఎంత గొప్ప భాగ్యము! ప్రతి కర్మలోనూ బాబా బాధ్యత తీసుకొని మిమ్మల్ని తేలికగా చేసి ఎగిరేలా చేస్తున్నారు. ఏం జరుగుతుందంటే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ‘బాబా, ఇప్పుడేమి చెయ్యాలో మీకే తెలియాలి’ అని అంటారు. మరియు సమస్య తీరిపోయిన తర్వాత మళ్ళీ అందులోనే మునిగిపోతారు. కానీ అసలు సమస్య వచ్చేలా ఎందుకు చేసుకుంటారు? చేయించేవారైన తండ్రి డైరెక్షన్ అనుసారంగా ప్రతి కర్మను చేస్తూ వెళ్తే కర్మ కూడా శ్రేష్ఠంగా అవుతుంది మరియు శ్రేష్ఠ కర్మకు ఫలితంగా సదా సంతోషాన్ని, సదా తేలికదనాన్ని, ఫరిశ్తా జీవితాన్ని అనుభవం చేస్తూ ఉంటారు. ఫరిశ్తా కర్మ సంబంధంలోకి వస్తుంది కానీ కర్మ బంధనంలో బంధించబడదు. మరియు తండ్రితో సంబంధము ‘చేయించేవారి’ రూపంలో జోడించబడి ఉంది, అందుకే, నిమిత్త భావంలో ఎప్పుడూ ‘నేను’ అనే అభిమానం రాదు. సదా నిర్మానులుగా (నమ్రచిత్తులుగా) అయి నిర్మాణ కార్యాన్ని చేస్తారు. కనుక మీది ఎంతటి భాగ్యము!
ఇంకా, బ్రహ్మా-భోజనాన్ని ఎవరు తినిపిస్తారు? పేరే బ్రహ్మా-భోజనము. బ్రహ్మభోజనం కాదు, ఇది బ్రహ్మా-భోజనము. బ్రహ్మా సదా యజ్ఞ రక్షకులు. యజ్ఞ-వత్సలు లేక బ్రహ్మా-వత్సలు ప్రతి ఒక్కరికీ బ్రహ్మాబాబా ద్వారా బ్రహ్మా-భోజనము లభించాల్సిందే. మనుష్యులైతే మాట వరుసకు మాకు భగవంతుడు తినిపిస్తున్నారని అంటారు. వారికి భగవంతుడు ఎవరు అనేది తెలియదు కానీ భగవంతుడు తినిపిస్తున్నారని అంటారు. కానీ బ్రాహ్మణ పిల్లలకైతే బాబాయే తినిపిస్తారు. లౌకిక సంపాదనను చేసి, ధనాన్ని జమ చేసి, దానితో భోజన పదార్థాలను కొన్నా సరే, ముందు మీ సంపాదనను బాబా భండారీలో వేస్తారు. బాబా భండారీ (హుండీ), భోళానాథుని భండారా (వంటిల్లు)గా అయిపోతుంది. ఎప్పుడూ ఈ విధిని మర్చిపోకూడదు. లేదంటే, మేము స్వయం సంపాదిస్తాము, స్వయం తింటామని అనుకుంటారు. వాస్తవానికి మీరు ట్రస్టీలు (నిమిత్తమాత్రులు), ట్రస్టీలకు తమదంటూ ఏమీ ఉండదు. మేము మా సంపాదనతో తింటున్నామనే సంకల్పం కూడా వారికి రాలేదు. ట్రస్టీలుగా అయినప్పుడు అంతా బాబాకు సమర్పించేసారు. అన్నీ ‘నీవి’ అయిపోయాయి, ‘నావి’ కావు. ట్రస్టీ అనగా ‘నీది’ మరియు గృహస్థు అనగా ‘నాది’. మీరు ఎవరు? గృహస్థులైతే కాదు కదా? భగవంతుడు తినిపిస్తున్నారు, బ్రహ్మాభోజనం లభిస్తుంది - అనే నషా బ్రాహ్మణాత్మలకు స్వతహాగా ఉంటుంది మరియు బాబా ఇచ్చే గ్యారంటీ ఏమిటంటే - 21 జన్మలు బ్రాహ్మణాత్మలు ఎప్పుడూ ఆకలితో ఉండజాలరు, చాలా ప్రేమగా రొట్టె-పప్పు, కూర తినిపిస్తారు. ఈ జన్మలో కూడా ప్రేమతో కూడిన రొట్టె-పప్పును తింటారు, శ్రమతో కూడినవి కాదు. కనుక అమృతవేళ నుండి ఏయే భాగ్యాలు ప్రాప్తించాయి అన్న ఈ స్మృతిని సదా ఉంచుకోండి. మొత్తం దినచర్యను గురించి ఆలోచించండి.
జోలపాటను పాడుతూ మిమ్మల్ని నిద్రపుచ్చేది కూడా బాబాయే. బాబా ఒడిలో నిద్రపోయినట్లయితే అలసట, అనారోగ్యము అన్నింటినీ మర్చిపోతారు మరియు మీరు విశ్రాంతిని పొందుతారు. కేవలం ‘ఆ రామ్’ (రండి రామా) అని ఆహ్వానించినట్లయితే, ఆరామ్ (విశ్రాంతి) వచ్చేస్తుంది. ఒంటరిగా నిద్రపోతే వేరే-వేరే సంకల్పాలు నడుస్తాయి. బాబాతో పాటు ‘స్మృతి అనే ఒడిలో’ నిద్రపోండి. ‘మీఠే బచ్చే’, ‘ప్యారే బచ్చే’ (మధురమైన పిల్లలూ, ప్రియమైన పిల్లలూ) అనే జోలపాటను వింటూ-వింటూ నిద్రపోండి. అప్పుడు ఎంతటి అలౌకిక అనుభవం కలుగుతుందో చూడండి! కనుక అమృతవేళ నుండి మొదలుకుని రాత్రి వరకు అన్నీ భగవంతుడే చేయిస్తున్నారు. నడిపించేవారు నడిపిస్తున్నారు, చేయించేవారు చేయిస్తున్నారు - సదా ఈ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోండి, ఇమర్జ్ చేసుకోండి. ఏదైనా హద్దు నషా కూడా తాగనంతవరకు ఎక్కదు. కేవలం అలా బాటిల్ లో ఉంచితే నషా ఎక్కుతుందా? అలా ఈ నషా కూడా బుద్ధిలో ఇమిడి ఉంది కానీ దీనిని ఉపయోగించండి. స్మృతిలోకి తీసుకురావడం అనగా త్రాగడం, ఇమర్జ్ చేయడము. దీనినే స్మృతి స్వరూపులుగా అవ్వడమని అంటారు. బుద్ధిలో ఇముడ్చుకొని ఉంచుకోండి అని చెప్పలేదు, స్మృతి స్వరూపులుగా అవ్వమని చెప్పారు. మీరు ఎంతటి భాగ్యవంతులు! ప్రతిరోజు మీ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని సమర్థంగా అవ్వండి మరియు ఎగురుతూ వెళ్ళండి. ఏమి చేయాలో అర్థమయిందా? డబల్ విదేశీయులు హద్దు నషా విషయంలోనైతే అనుభవజ్ఞులు, ఇప్పుడు ఈ అనంతమైన నషాను స్మృతిలో ఉంచుకుంటే సదా భాగ్యం యొక్క శ్రేష్ఠమైన రేఖ మస్తకంలో మెరుస్తూ ఉంటుంది, స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కొందరిది మర్జ్ అయ్యి కనిపిస్తుంది, కొందరిది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ సదా స్మృతిలో ఉంటే మస్తకంపై మెరుస్తూ ఉంటుంది, ఇతరులకు కూడా అనుభవం చేయిస్తూ ఉంటారు. అచ్ఛా.
సదా భగవంతుడు మరియు భాగ్యము - ఇలాంటి స్మృతి స్వరూప సమర్థ ఆత్మలకు, సదా ప్రతి కర్మలో చేసేవారిగా అయి కర్మలు చేసే శ్రేష్ఠ ఆత్మలకు, సదా అమృతవేళలో బాబాతో పాటు ఉన్నతమైన స్థానము, ఉన్నతమైన స్థితిలో స్థితులై ఉండే భాగ్యవంతులైన పిల్లలకు, సదా తమ మస్తకం ద్వారా శ్రేష్ఠ భాగ్య రేఖలను ఇతరులకు అనుభవం చేయించే విశేషమైన బ్రాహ్మణులకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
వీడ్కోలు సమయంలో జానకి దాదీ గారు సేవ కోసం బొంబాయికు మరియు కురుక్షేత్రానికి వెళ్ళేందుకు సెలవు తీసుకుంటున్నారు -
మహారథుల పాదాలలో సేవా చక్రాలైతే ఉండనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే, అక్కడ సేవ తప్ప ఇంకేమీ జరగదు. ఏ కారణంతో వెళ్ళినా, అందులో సేవయే ఇమిడి ఉంటుంది. ప్రతి అడుగులో సేవ తప్ప ఇంకేమీ ఉండనే ఉండదు. ఒకవేళ నడుస్తూ ఉన్నా, నడుస్తూ ఉండడంలో కూడా సేవ ఉంటుంది. ఒకవేళ భోజనం చేస్తున్నా, ఆ సమయంలో ఎవరినైనా పిలిచి తినిపిస్తారు, స్నేహంతో స్వీకరిస్తారు - కనుక ఇది కూడా సేవయే అయింది కదా. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ సేవయే సేవ. మీరు ఇలాంటి సేవాధారులు. సేవా ఛాన్స్ లభించడం కూడా భాగ్యానికి గుర్తు. పెద్ద చక్రవర్తిగా అవ్వాలంటే సేవా చక్రము కూడా పెద్దదిగా ఉండాలి. అచ్ఛా..
Comments
Post a Comment