05-10-1987 అవ్యక్త మురళి

05-10-1987         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము   

‘‘బ్రాహ్మణ జీవితపు సుఖము - సంతుష్టత మరియు ప్రసన్నత’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా కల తమ అతి అల్లారు ముద్దు పిల్లలు, చాలాకాలం క్రితం విడిపోయి ఇప్పుడు కలిసిన పిల్లల్లో, విశేషంగా బ్రాహ్మణ జీవితములో విశేషతా సంపన్నమైన పిల్లలను చూస్తున్నారు. ఎవరైతే సదా సంతుష్టత ద్వారా స్వయము కూడా సదా సంతుష్టంగా ఉంటున్నారో మరియు తమ దృష్టి, వృత్తి మరియు కృతి ద్వారా ఇతరులకు కూడా సదా సంతుష్టతా అనుభూతిని చేయిస్తున్నారో, అటువంటి విశేష ఆత్మలను బ్రాహ్మణ కుల పిల్లల నుండి బాప్ దాదా ఈ రోజు అమృతవేళ ఎంచుతున్నారు. ఎవరైతే సదా సంకల్పాలలో, మాటలలో, సంగఠనలోని సంబంధ-సంపర్కాలలో, కర్మలలో సంతుష్టత యొక్క బంగారు పుష్పాలను బాప్ దాదా ద్వారా తమపై వర్షింపజేసుకునే అనుభవమును చేస్తారో మరియు సర్వుల కొరకు సంతుష్టత యొక్క బంగారు పుష్పాల వర్షాన్ని సదా కురిపిస్తూ ఉంటారో, అటువంటి సంతుష్టమణుల మాలను బాప్ దాదా ఈ రోజు త్రిప్పుతున్నారు. ఇటువంటి సంతుష్ట ఆత్మలు నలువైపులా కొందరు మాత్రమే కనిపించారు. పెద్ద మాల తయారవ్వలేదు, చిన్న మాల తయారైంది. బాప్ దాదా పదే-పదే సంతుష్టమణుల మాలను చూసి హర్షితులవుతున్నారు ఎందుకంటే ఇటువంటి సంతుష్టమణులే బాప్ దాదా మెడలోని హారంగా అవుతారు, రాజ్య అధికారులుగా అవుతారు మరియు భక్తుల స్మరణ మాలగా అవుతారు.

బాప్ దాదా మిగతా పిల్లలను కూడా చూస్తున్నారు, వీరు ఒక్కోసారి సంతుష్టత మరియు ఒక్కోసారి అసంతుష్టతకు చెందిన సంకల్పమాత్రపు నీడలోకి వస్తారు, మళ్ళీ బయటకు వచ్చేస్తారు, చిక్కుకుపోరు. మూడవ రకమైన పిల్లలు ఒక్కోసారి సంకల్పాల అసంతుష్టత, ఒక్కోసారి స్వయానికి స్వయముతో అసంతుష్టత, ఒక్కోసారి పరిస్థితుల ద్వారా అసంతుష్టత, ఒక్కోసారి స్వయములోని అలజడి ద్వారా అసంతుష్టత మరియు ఒక్కోసారి చిన్న-పెద్ద విషయాల వలన అసంతుష్టత - ఈ చక్రములోకే వెళ్తూ ఉంటారు మరియు బయటకు వస్తూ ఉంటారు, మళ్ళీ చిక్కుకుంటూ ఉంటారు. ఇటువంటి మాలను కూడా చూసారు. కావున మూడు మాలలు తయారయ్యాయి. అందరూ మణులే కానీ సంతుష్ట మణుల మెరుపు మరియు మిగతా రెండు రకాల మణుల మెరుపు ఎలా ఉంటుంది అన్నదైతే మీరు కూడా తెలుసుకోగలరు. బ్రహ్మాబాబా పదే-పదే మూడు మాలలను చూస్తూ హర్షితులుగా కూడా అవుతూ ఉన్నారు, దానితోపాటు రెండో నంబర్ మాలలోని మణులు మొదటి మాలలోకి రావాలి అని ప్రయత్నము చేస్తూ ఉన్నారు. ఆత్మిక సంభాషణ జరుగుతూ ఉంది ఎందుకంటే రెండో మాలలోని కొన్ని-కొన్ని మణులు చాలా కొంచెము అసంతుష్టత ఛాయామాత్రంగా ఉన్న కారణంగా మొదటి మాల నుండి వంచితులైపోయారు, వీరిని పరివర్తన చేసి ఎలాగైనా సరే మొదటి మాలలోకి తీసుకురావాలి. ప్రతి ఒక్కరిలోని గుణాలను, విశేషతలను, సేవను - అన్నింటినీ ఎదురుగా తీసుకువస్తూ వీరిని మొదటి మాలలోకి తీసుకురావాలి అని పదే-పదే ఇదే మాట అన్నారు. ఇటువంటి మణులు సుమారుగా 25-30 మంది ఉన్నారు, వీరి గురించి బ్రహ్మా బాబా యొక్క విశేష ఆత్మిక సంభాషణ జరుగుతూ ఉంది. మొదటి నంబర్ మాలలో ఈ మణులను కూడా చేర్చాలి అని బ్రహ్మా బాబా అన్నారు. కానీ స్వయమే నవ్వుతూ ఇలా అన్నారు - బాబా వీరిని తప్పకుండా మొదటి నంబర్ లోకి తీసుకువచ్చే చూపిస్తారు. మరి ఇటువంటి విశేష మణులు కూడా ఉన్నారు.

ఈ విధంగా ఆత్మిక సంభాషణ జరుగుతూ ఉండగా, అసంతుష్టతకు విశేష కారణము ఏమిటి అన్న విషయము వచ్చింది. సంగమయుగము యొక్క విశేష వరదానము సంతుష్టత, అయినా కూడా వరదాత నుండి వరదానము ప్రాప్తించిన వరదానీ ఆత్మలు రెండవ నంబర్ మాలలోకి ఎందుకు వస్తున్నారు? సంతుష్టతకు బీజము సర్వ ప్రాప్తులు. అసంతుష్టతకు బీజము స్థూల లేక సూక్ష్మ అప్రాప్తి. ‘బ్రాహ్మణుల ఖజానాలో లేక బ్రాహ్మణుల జీవితములో ఏ వస్తువు యొక్క అప్రాప్తి లేదు’ అన్నది బ్రాహ్మణుల గాయనమైనప్పుడు, ఇక అసంతుష్టత ఎందుకు? వరదాత వరదానాన్ని ఇవ్వటంలో తేడా చేసారా లేక తీసుకునేవారు తేడాను ఏర్పరచుకున్నారా, ఏమైంది? వరదాత, దాత యొక్క భాండాగారము నిండుగా ఉన్నప్పుడు, అది కూడా ఎంత నిండుగా ఉంటుందంటే శ్రేష్ఠ నిమిత్త ఆత్మలుగా అయిన మీరు, ఎవరైతే చాలాకాలము నుండి బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలుగా అయ్యారో, వారి 21 జన్మల వంశావళి మరియు వారి భక్తులు, భక్తుల వంశావళి కూడా ఆ ప్రాప్తుల ఆధారంతో నడుస్తుంటారు. ఇంత పెద్ద ప్రాప్తి, అయినా కూడా అసంతుష్టత ఎందుకు? ఒక్కరి ద్వారా, ఒకే విధంగా, ఒకే సమయంలో, ఒకే విధితో తరగని ఖజానా అందరికీ ప్రాప్తించింది. కానీ ప్రాప్తించిన ఖజనాను ప్రతి సమయమూ కార్యములో వినియోగించరు అనగా స్మృతిలో ఉంచుకోరు. నోటితో సంతోషపడతారు కానీ మనసులో సంతోషపడరు. బుద్ధి యొక్క సంతోషము ఉంది కానీ మనసు యొక్క సంతోషము లేదు. దీనికి కారణమేమిటంటే, ప్రాప్తుల ఖజానాను స్మృతి స్వరూపులై కార్యములో పెట్టరు. స్మృతి ఉంటుంది కానీ స్మృతి స్వరూపములోకి రారు. ప్రాప్తి అనంతమైనది కానీ దానిని ఒక్కోసారి హద్దు ప్రాప్తిలోకి పరివర్తన చేసేస్తారు. ఈ కారణం వలన హద్దు అనగా అల్పకాలికమైన ప్రాప్తి యొక్క కోరిక అనేది అనంతమైన ప్రాప్తి యొక్క ఫలస్వరూపముగా ఏదైతే సదా సంతుష్టత యొక్క అనుభూతి ఉంటుందో, దాని నుండి వంచితము చేసేస్తుంది. హద్దు ప్రాప్తి మనసుల్లో హద్దును వేసేస్తుంది కనుక అసంతుష్టత యొక్క అనుభూతి ఉంటుంది. సేవలో హద్దును వేస్తుంది. ఎందుకంటే హద్దు కోరికకు ఫలితంగా మనోవాంఛిత ఫలము ప్రాప్తించదు. హద్దు కోరికల ఫలము అల్పకాలికముగా ప్రాప్తిస్తుంది కనుక ఇప్పుడిప్పుడే సంతుష్టత, ఇప్పుడిప్పుడే అసంతుష్టత ఉంటుంది. హద్దు అనేది అనంతమైన నషాను అనుభవము చేయనివ్వదు కనుక మనసు యొక్క అనగా స్వ సంతుష్టత, సర్వుల సంతుష్టత అనుభవమవుతుందా అన్నదానిని విశేషంగా చెక్ చేసుకోండి.

సంతుష్టతకు గుర్తు ఏమిటంటే, వారు మనసుతో, హృదయంతో, సర్వులతో, బాబాతో, డ్రామాతో సంతుష్టంగా ఉంటారు, వారి మనసులో మరియు తనువులో సదా ప్రసన్నత యొక్క అల కనిపిస్తుంది. ఎటువంటి పరిస్థితి వచ్చినాకానీ, లెక్కాచారాన్ని సమాప్తము చేసే ఎటువంటి ఆత్మ ఎదుర్కొనేందుకు వస్తున్నా కూడా, శారీరిక కర్మ భోగము ఎదుర్కొనేందుకు వస్తున్నా కూడా, హద్దు కోరికల నుండి ముక్తి అయిన ఆత్మ సంతుష్టత కారణంగా సదా ప్రసన్నత యొక్క మెరుపులో మెరుస్తున్న సితారలా కనిపిస్తుంది. ప్రసన్నచిత్తులు ఎప్పుడూ కూడా ఏ విషయములోనూ ప్రశ్నచిత్తులుగా అవ్వరు. ప్రశ్న ఉంటే ప్రసన్నత ఉండదు. ప్రసన్నచిత్తుల గుర్తు - వారు సదా నిస్వార్థులుగా ఉంటారు మరియు సదా అందరినీ నిర్దోషులుగా భావిస్తారు. వారు ఇతరులపైనా దోషాన్ని మోపరు, నా భాగ్యాన్ని ఇలా తయారుచేసారు అని భాగ్య విధాతపైనా దోషం వేయరు, డ్రామాలో నా పాత్రయే ఇలా ఉందని డ్రామాపైనా దోషం వేయరు, వీరి స్వభావ సంస్కారాలు ఇటువంటివి అని వ్యక్తిపైనా దోషం వేయరు, ప్రకృతిలోని వాయుమండలము ఇలా ఉంది అని ప్రకృతిపైనా దోషం వేయరు, నా శరీరమే ఇలా ఉంది అని శారీరిక లెక్కాచారముపై కూడా దోషాన్ని మోపరు. ప్రసన్నచిత్తులు అనగా సదా నిస్వార్థ, నిర్దోష వృత్తి, దృష్టి కలవారు. కనుక సంగమయుగ యొక్క విశేషత సంతుష్టత మరియు సంతుష్టతకు గుర్తు ప్రసన్నత. ఇదే బ్రాహ్మణ జీవితము యొక్క విశేష ప్రాప్తి. సంతుష్టత లేదు, ప్రసన్నత లేదు అంటే బ్రాహ్మణులుగా అవ్వటంలోని లాభాన్ని తీసుకోలేదని అర్థం. బ్రాహ్మణ జీవితము యొక్క సుఖమే సంతుష్టత, ప్రసన్నత. బ్రాహ్మణ జీవితము తయారైంది కానీ దాని సుఖాన్ని తీసుకోనట్లయితే నామధారి (పేరుకు) బ్రాహ్మణులైనట్లా లేక ప్రాప్తి స్వరూప బ్రాహ్మణులైనట్లా? కనుక బాప్ దాదా బ్రాహ్మణ పిల్లలందరికీ ఈ స్మృతినే ఇప్పిస్తున్నారు - బ్రాహ్మణులుగా అయ్యారు, అహో భాగ్యము! కానీ బ్రాహ్మణ జీవిత వారసత్వము మరియు ప్రాపర్టీ సంతుష్టత. మరియు బ్రాహ్మణ జీవిత పర్సనాలిటీ ‘ప్రసన్నత’. ఈ అనుభవము నుండి ఎప్పుడూ వంచితులై ఉండకూడదు. మీరు అధికారులు. ఎప్పుడైతే దాత, వరదాత హృదయపూర్వకంగా ప్రాప్తుల ఖజానాను ఇస్తున్నారో, ఇచ్చేసారో, అప్పుడు మీ ప్రాపర్టీని మరియు పర్సనాలిటీని అనుభవములోకి తీసుకురండి, ఇతరులను కూడా అనుభవీలుగా చెయ్యండి. అర్థమైందా? నేను ఏ నంబర్ మాలలో ఉన్నాను అని ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాలి, మాలలో అయితే ఉన్నాను కానీ ఏ నంబర్ మాలలో ఉన్నాను. అచ్ఛా!

ఈ రోజు రాజస్థాన్ మరియు యు.పి. వారి గ్రూప్ లు ఉన్నాయి. రాజస్థాన్ అనగా రాజరికపు సంస్కారాలు కలవారు, ప్రతి సంకల్పములో, స్వరూపములో రాజ్య సంస్కారాలను ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చేవారు అనగా ప్రత్యక్షంగా చూపించేవారు. వీరినే రాజస్థాన్ నివాసులు అని అంటారు. మీరు అటువంటివారే కదా? అప్పుడప్పుడు ప్రజలుగా అయితే అయిపోవడం లేదు కదా? ఒకవేళ వశమైతే ప్రజా అని అంటారు, యజమానిగా ఉంటే రాజు. ఒక్కోసారి రాజుగా, ఒక్కోసారి ప్రజాగా ఉండటము కాదు, సదా రాజ్య సంస్కారాలు స్వతహాగానే స్మృతి స్వరూపములో ఉండాలి. ఇటువంటి రాజస్థాన్ నివాసీ పిల్లల మహత్వము కూడా ఉంది. రాజును సదా ఉన్నతమైన దృష్టితో చూస్తారు మరియు రాజుకు స్థానాన్ని కూడా ఉన్నతమైనది ఇస్తారు. రాజు సదా సింహాసనముపై కూర్చుంటారు, ప్రజలు సదా కింద ఉంటారు. మరి రాజస్థాన్ లోని రాజ్య సంస్కారాలు కల ఆత్మలు అనగా సదా ఉన్నతమైన స్థితి అనే స్థానములో ఉండేవారు. అలా తయారయ్యారా లేక తయారవుతున్నారా? అలా తయారయ్యారు మరియు సంపన్నంగా అవ్వాల్సిందే. రాజస్థాన్ మహిమ తక్కువేమీ కాదు. స్థాపన యొక్క హెడ్ క్వార్టర్ (ముఖ్యాలయం) రాజస్థాన్లో ఉంది కనుక ఉన్నతమైనవారిగా అయినట్లు కదా. పేరులో కూడా ఉన్నతమైనవారు, పనిలో కూడా ఉన్నతమైనవారు. ఇటువంటి రాజస్థాన్ పిల్లలు తమ ఇంటికి చేరుకున్నారు. అర్థమైందా?

యు.పి. భూమి విశేషంగా పావన భూమిగా గాయనము చెయ్యబడింది. పావనంగా చేసే భక్తి మార్గములోని గంగానది కూడా అక్కడ ఉంది. భక్తి పరంగా కృష్ణుని భూమి కూడా యు.పి.లోనే ఉంది. భూమికి చాలా మహిమ ఉంది. కృష్ణుని లీలలను మరియు అతని జన్మభూమిని చూడాలంటే కూడా యు.పి.కే వెళ్తారు. కనుక యు.పి. వారికి విశేషత ఉంది. వీరు సదా పావనంగా అయ్యే మరియు పావనంగా చేసే విశేషతా సంపన్నులు. ఏవిధంగా పతిత పావనుడు..... అని బాబా మహిమ ఉందో, అలా యు.పి వారి మహిమ కూడా బాబా సమానమైనది. వీరు పతిత-పావని ఆత్మలు. భాగ్య సితార మెరుస్తూ ఉంది. ఇటువంటి భాగ్యశాలి స్థానము మరియు స్థితి - ఈ రెండింటికి మహిమ ఉంది. సదా పావనము - ఇది స్థితి యొక్క మహిమ. మరి స్వయమును ఇటువంటి భాగ్యశాలిగా భావిస్తున్నారా? సదా మీ భాగ్యమును చూసుకుంటూ హర్షితులవుతూ, స్వయము కూడా సదా హర్షితంగా ఉండండి మరియు ఇతరులను కూడా హర్షితులుగా తయారుచేస్తూ వెళ్ళండి ఎందుకంటే హర్షితముఖులు స్వతహాగానే ఆకర్షణ మూర్తులుగా ఉంటారు. ఎలాగైతే స్థూల నది తనవైపుకు ఆకర్షిస్తుంది కదా, యాత్రికులు ఆకర్షితులై వెళ్తారు. ఎంతటి కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినాగానీ పావనంగా అవ్వాలన్న ఆకర్షణ వారిని లాగుతుంది. కనుక పావనంగా చేసే ఈ కార్యము యొక్క స్మృతి చిహ్నము యు.పి.లో ఉంది. ఈ విధంగా హర్షితంగా మరియు ఆకర్షణమూర్తులుగా అవ్వాలి. అర్థమైందా?

మూడవ గ్రూప్ డబల్ విదేశీయులది ఉంది. డబల్ విదేశీయులు అనగా సదా విదేశీ బాబాను ఆకర్షించేవారు, ఎందుకంటే సమానులు కదా! బాబా కూడా విదేశీయుడు, మీరు కూడా విదేశీయులు. తమ సమానమైనవారు ప్రియమనిపిస్తారు. తల్లిదండ్రుల కంటే కూడా ఫ్రెండ్స్ ఎక్కువ ప్రియమనిపిస్తారు. కనుక డబల్ విదశీయులు బాబా సమానంగా సదా ఈ దేహము మరియు దేహపు ఆకర్షణ నుండి దూరమైన విదేశీయులు, అశరీరులు, అవ్యక్తులు. కనుక బాబా తమ సమానులైన అశరీరి, అవ్యక్త స్థితి కల పిల్లలను చూసి హర్షితులవుతారు. రేస్ ను కూడా బాగా చేస్తున్నారు. సేవలో రకరకాల సాధనాలతో మరియు రకరకాల విధులతో ముందుకు వెళ్ళే రేస్ ను బాగా చేస్తున్నారు. విధిని కూడా అలవరచుకుంటారు మరియు వృద్ధిని కూడా చేస్తారు కనుక బాప్ దాదా నలువైపులా కల డబల్ విదేశీ పిల్లలకు సేవ యొక్క అభినందనలను కూడా ఇస్తారు మరియు స్వ వృద్ధి యొక్క స్మృతిని కూడా కలిగిస్తారు. స్వ ఉన్నతిలో సదా ఎగిరే కళ ద్వారా ఎగురుతూ ఉండండి. స్వ ఉన్నతి మరియు సేవ ఉన్నతి యొక్క బ్యాలెన్స్ ద్వారా సదా బాబా యొక్క ఆశీర్వాదాలకు అధికారులు ఉన్నారు మరియు సదా అలా ఉంటారు. అచ్ఛా!

నాల్గవ గ్రూప్ మధువన నివాసులది. వారైతే సదా ఉన్నారు. ఎవరైతే మనసులో ఉంటారో వారు పొయ్యి దగ్గర ఉంటారు, ఎవరైతే పొయ్యి దగ్గర ఉంటారో వారు మనసులో ఉంటారు. అన్నింటికంటే ఎక్కువగా విధి పూర్వకమైన బ్రహ్మా భోజనము కూడా మధువనములో ఉంటుంది. అందరికంటే అతి ప్రియమైనవారు కూడా మధువన నివాసులే. అన్ని ఫంక్షన్లు కూడా మధువనములో జరుగుతాయి. అందరికంటే ఎక్కువగా, డైరెక్ట్ మురళీలను కూడా మధువనము వారే వింటారు. కనుక మధువన నివాసులు సదా శ్రేష్ఠ భాగ్యానికి అధికారీ ఆత్మలు. సేవను కూడా మనస్ఫూర్తిగా చేస్తారు కనుక మధువన నివాసులకు బాప్ దాదాల నుండి మరియు బ్రాహ్మణులందరి మనసుల నుండి హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. అచ్ఛా.

నలువైపులా కల బాప్ దాదా యొక్క విశేష సంతుష్టమణులందరికీ బాప్ దాదాల విశేషమైన ప్రియస్మృతులు. అలాగే భాగ్యశాలి బ్రాహ్మణ జీవితాన్ని ప్రాప్తి చేసుకున్న వారందరూ, కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కూడా కొద్దిమంది అయిన చాలాకాలం క్రితం విడిపోయి ఇప్పుడు కలిసిన పిల్లలు, బాప్ దాదా యొక్క శుభ సంకల్పాన్ని సంపన్నము చేసే ఆత్మలు, సంగమయుగంలో బ్రాహ్మణ జీవితపు ప్రాపర్టీ యొక్క సంపూర్ణ అధికారమును ప్రాప్తి చేసుకునే ఆత్మలు, విధాత మరియు వరదాత అయిన బాప్ దాదాల నుండి చాలా చాలా ప్రియస్మృతులను స్వీకరించండి.

‘‘జానకి దాదీజీ మరియు చంద్రమణి దాదీజీ సేవ కొరకు వెళ్ళేందుకై బాప్ దాదా నుండి సెలవు తీసుకుంటున్నారు’’

వెళ్తున్నారా లేక ఇమిడిపోతున్నారా? వెళ్ళినా లేక వచ్చినా కానీ సదా ఇమిడి ఉన్నారు. బాప్ దాదా అనన్యులైన పిల్లలను ఎప్పుడూ వేరుగా చూడనే చూడరు. ఆకారములోనైనా లేక సాకారములోనైనా సదా తోడుగా ఉంటారు ఎందుకంటే ప్రతి సమయము తోడుగా ఉంటాము, తోడుగా వస్తాము అని కేవలము మహావీరులైన పిల్లలు మాత్రమే ఈ ప్రమాణమును నిలబెట్టుకుంటారు. చాలా కొద్దిమంది ఈ ప్రమాణమును నిలబెట్టుకుంటారు కనుక, ఇటువంటి మహావీరులైన పిల్లలు, అనన్యులైన పిల్లలు ఎక్కడకు వెళ్ళినాకానీ బాబాను తోడుగా తీసుకొని వెళ్తారు మరియు బాబా సదా వతనములో కూడా తోడుగా పెట్టుకుంటారు. ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటారు కనుక వెళ్తున్నారా, వస్తున్నారా - ఏమంటారు? కనుకనే వెళ్తున్నారా లేక ఇమిడిపోతున్నారా అని అన్నాము. ఇలానే తోడుగా ఉంటూ-ఉంటూ సమానులుగా అయ్యి ఇమిడిపోతారు. ఇంట్లో కొద్ది సమయము కొరకు విశ్రాంతి తీసుకుంటారు, తోడు ఉంటారు. తర్వాత మీరు రాజ్యము చేయండి, బాబా పైనుండి చూస్తారు. కానీ తోడును కొద్ది సమయానికి అనుభవము చెయ్యాలి. అచ్ఛా.

(బాబా, ఈ రోజు మీరు అద్భుతమైన మాలను తయారుచేసారు) మీరు కూడా మాలను తయారుచేస్తారు కదా. ఇప్పుడైతే మాల చిన్నదిగా ఉంది. ఇప్పుడు పెద్దది తయారవ్వనున్నది. ప్రస్తుతం ఎవరైతే అప్పుడప్పుడూ కాస్త స్పృహ లేనివారిగా అయిపోతారో, వారిని కొద్ది సమయములో ప్రకృతి లేక సమయము యొక్క శబ్దము స్పృహలోకి తీసుకువస్తుంది. అప్పుడిక మాల పెద్దదిగా అయిపోతుంది. అచ్ఛా! ఎక్కడకు వెళ్ళినాగానీ బాబా యొక్క వరదానీలుగా అయితే ఉండనే ఉన్నారు. మీ ప్రతి అడుగు నుండి బాబా యొక్క వరదానము అందరికీ లభిస్తూ ఉంటుంది. మీరు చూసినా కూడా బాబా యొక్క వరదానాలను మీ దృష్టి నుండి తీసుకుంటారు, మాట్లాడినా కూడా మాటల నుండి వరదానాలను తీసుకుంటారు, కర్మల నుండి కూడా వరదానాలనే తీసుకుంటారు. నడుస్తూ-తిరుగుతూ వరదానాల వర్షాన్ని కురిపించేందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఆత్మలెవరైతే వస్తున్నారో, వారికి వరదానము మరియు మహాదానము యొక్క అవసరముంది. మీరు వెళ్ళటము అనగా హృదయపూర్వకంగా వారికి బాబా నుండి వరదానాలు ప్రాప్తించటము. అచ్ఛా!

Comments