04-12-1985 అవ్యక్త మురళి

04-12-1985         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము 

సంకల్ప భాష - సర్వ శ్రేష్ట భాష.

సర్వ సమర్దుడు, సర్వశక్తివంతుడైన శివబాబా మాట్లాడుతున్నారు -

ఈరోజు బాప్ దాదా ఎదురుగా రెండు రూపాలలో రెండు రకాలైన సభ ఉంది. రెండు సభలుస్నేహి పిల్లల యొక్క సభలే. 1. సాకారి రూపధారి పిల్లల యొక్క సభ 2. ఆకారీ స్నేహ స్వరూపధారి పిల్లల యొక్క సభ. స్నేహ సాగరుడైనటువంటి బాబాని కలుసుకోవడానికి నలువైపుల ఉన్న ఆకారీ రూపధారి పిల్లలు తమ యొక్క స్నేహాన్ని బాప్ దాదా ముందు ప్రత్యక్షం చేస్తున్నారు. బాప్ దాదా పిల్లందరి యొక్క స్నేహం యొక్క సంకల్పం, మనస్సు యొక్క రకరకాల ఉత్సాహ ఉల్లాసాల యొక్క సంకల్పం, మనస్సు యొక్క భిన్న భిన్న భావనతో పాటు స్నేహ సంబంధం యొక్క అధికారంతో తమ మనస్సు యొక్క పరిస్థితి, తమ యొక్క రకరకాల కుటుంబం యొక్క పరిస్థితుల యొక్క స్థితి, సేవా సమాచారాల యొక్క పరిస్థితి, నయనాల భాష ద్వారా, శ్రేష్ట స్నేహం యొక్క సంకల్పాల యొక్క భాష ద్వారా బాబా ముందు స్పష్టం చేస్తున్నారు. బాప్ దాదా పిల్లలందరి యొక్క ఆత్మిక సంభాషణ మూడు రూపాల ద్వారా వింటున్నారు. 1. నయనాల యొక్క భాషలో మాట్లాడుతున్నారు. 2. భావన యొక్క భాషలో, 3. సంకల్పాల యొక్క భాషలో మాట్లాడుతున్నారు. నోటి భాష అయితే సాధారణ భాషే, కానీ ఈ మూడు రకాల భాష ఆత్మిక యోగీ జీవితం యొక్క భాష. ఇది ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక పిల్లలే తెలుసుకుంటారు మరియు అనుభవం చేసుకుంటారు. ఎంతెంత అంతర్ముఖీ, మధురమైన శాంతి స్వరూపంలో స్థితులౌతారో అంత మూడు భాషల ద్వారా సర్వ ఆత్మలకి కూడా అనుభవం చేయించగలరు. ఈ అలౌకిక భాషలు ఎంత శక్తిశాలి! నోటి యొక్క భాష విని, ఇతరులకి వినిపించి అలసిపోయారు. నోటి యొక్క భాషలో ఏ విషయాన్నైనా స్పష్టం చేయటంలో సమయం కూడా పడుతుంది. కానీ నయనాల యొక్క భాష సైగ ఇచ్చేటటువంటి భాష, మనస్సు యొక్క భావన యొక్క భాష. ముఖం ద్వారా భావం రూపంలో ప్రకటితం అవుతుంది. ముఖం యొక్క భావం మనస్సు యొక్క భావాన్ని ఋజువు చేస్తుంది. ఏవిధంగా అయితే ఎవరైనా ఎదురుగా వెళ్తున్నప్పుడు వారు స్నేహంతో వెళ్తున్నా లేక శతృత్వంతో వెళ్తున్నా, లేక స్వార్థంతో వెళ్తున్నా వారి మనస్సు యొక్క భావం ముఖం ద్వారా కనిపిస్తుంది. ఎవరు ఏ భావనతో వచ్చారు అనేది వారి ముఖ కవళికలు చెప్తాయి. కనుక భావన యొక్క భాష ముఖం యొక్క భావన ద్వారా తెలుసుకోగలుగుతారు మరియు చెప్పగలరు కూడా! అదేవిధంగా సంకల్పం యొక్క భాష - ఇది కూడా చాలా శ్రేష్ట భాష! ఎందుకంటే సంకల్పశక్తి అన్నింటికంటే శ్రేష్టశక్తి, ముఖ్యశక్తి మరియు అన్నింటికంటే తీవ్రగతి యొక్క భాష! ఈ సంకల్పం యొక్క భాష. ఎవరు ఎంత దూరంగా ఉన్నా కానీ, ఏ సాధనాలు లేకపోయినా కానీ, సంకల్పం యొక్క భాష ద్వారా ఎవరికైనా సందేశాన్ని ఇవ్వవచ్చు. అంతిమంలో ఈ సంకల్పం యొక్క భాషే ఉపయోగపడుతుంది. విజ్ఞాన సాధనాలు ఫెయిల్ అయినప్పుడు, ఈ శాంతి సాధనమే పని చేస్తుంది. కానీ ఎవరి సంబంధమైనా జోడించడానికి లైన్ స్పష్టంగా ఉండాలి. ఎంతెంత ఒక్క బాబా మరియు బాబా ద్వారా లభించిన జ్ఞానంలో లేక ఆ జ్ఞానం ద్వారా సేవలో సదా నిమగ్నం అయ్యే అభ్యాసిగా ఉంటారో అంత శ్రేష్ట సంకల్పాల కారణంగా లైన్ స్పష్టంగా ఉంటుంది. వ్యర్థ సంకల్పాలే అలజడులు. ఎంత వ్యర్థం సమాప్తి అయిపోతుందో, సమర్థ సంకల్పాలు నడుస్తాయో, అంత సంకల్పాల యొక్క శ్రేష్ట భాష స్పష్టంగా అనుభవం చేసుకుంటారు. నోటి యొక్క భాష ద్వారా అనుభవం చేసుకుంటున్నారు. కానీ సంకల్పం యొక్క భాష ఒక్క సెకనులో నోటి యొక్క భాష కంటే ఎక్కువ అనుభవం చేయిస్తుంది. మూడు నిమిషాల ఉపన్యాసం యొక్క సారం సెకనులో సంకల్పాల యొక్క భాష ద్వారా అనుభవం చేయించగలరు. సెకండులో జీవన్ముక్తి యొక్క మహిమ ఏదైతే ఉందో అది అనుభవం చేసుకోగలరు.

అంతర్ముఖి ఆత్మల యొక్క భాషయే అలౌకిక భాష. ఇప్పుడు సమయానుసారంగా ఈ మూడు భాషల ద్వారా సహజ సఫలత పొందగలరు. శ్రమ కూడా తక్కువ. సమయం కూడా తక్కువ. కానీ సఫలత సహజంగా వస్తుంది. అందువలన ఇప్పుడు ఆ ఆత్మికభాష యొక్క అభ్యాసిగా అవ్వండి! ఈరోజు బాప్ దాదా కూడా పిల్లల యొక్క ఈ మూడు రకాలైన భాషని వింటున్నారు మరియు పిల్లలందరికి బదులు ఇస్తున్నారు. అందరి యొక్క అతి స్నేహం యొక్క స్వరూపం బాప్ దాదా చూసి స్నేహాన్ని స్నేహసాగరంలో ఇముడ్చుకుంటున్నారు. అందరి స్మృతులకి సదాకాలికంగా స్మృతిచిహ్నంగా అయ్యే శ్రేష్ట వరదానం ఇస్తున్నారు. అందరి మనస్సు యొక్క భిన్నభిన్న భావాలను తెలుసుకుని పిల్లలందరికీ అన్ని భావాలకు బదులుగా “సదా నిర్విఘ్న భవ!" "సర్వ శక్తి సంపన్న భవ!” యొక్క శుభ భావన ఈ రూపంలో ఇస్తున్నారు. బాబా యొక్క శుభభావన పిల్లలందరి యొక్క శుభ కామనలు, పరిస్థితి ప్రమాణంగా సహయోగం యొక్క భావన లేక శుభకామన. ఈ అన్నీ శుభకోరికలు బాప్ దాదా యొక్క శ్రేష్ట భావన ద్వారా సంపన్నం అవుతాయి. నడుస్తూ నడుస్తూ అప్పుడప్పుడు కొద్దిమంది పిల్లలు పాత కర్మల ఖాతాతోనే కోరిక పెట్టుకుంటున్నారు. అందరు నాట్యం చేస్తూ పాడుతూ ముందుకి వెళ్తున్నారు. ఈ రోజుల్లో (సంపర్కంలోకి వచ్చిన ఆత్మలు మంచి సహాయకారి అవుతున్నారు, స్వయమే అన్ని పద్ధతులు తయారుచేస్తున్నారు) ఇలాగే ఉండాలి. అప్పుడే మీరు వానప్రస్త స్థితిలోకి వెళ్తారు. వాణీకి అతీతమైన స్థితికి వెళ్ళాలి. ఎప్పుడైతే ఇతరులు బాధ్యత తీసుకుంటారో అప్పుడు మీరు వానప్రస్థీగా అయ్యి అందరినీ వానప్రస్థ స్థితిలోకి తీసుకువెళ్తారు. ఇప్పుడు మీరు వేదిక తయారుచేసుకోవాల్సి వస్తుంది. ముందుముందు తయారైన వేదిక లభిస్తుంది. ఇదే సేవ యొక్క సఫలత. తయారుచేసేవారు వేరేవారు ఉంటారు మీరు కేవలం ఆశీర్వాదాలు ఇచ్చి రండి!

అందరికి సేవ చేయటం నేర్పించారు కదా! ఏదైతే నేర్పించారో అది ఎందుకొరకు నేర్పించారు? చేయడానికి నేర్పించారు కదా! ఇప్పుడు ఎక్కువ తలబరువు చేసుకోవలసిన అవసరం లేదు. ఏవిధంగా అయితే స్వర్గంలో అన్నీ తయారుచేసినవి లభిస్తాయి. మనం కేవలం నడవమని చెపితే నడుస్తారు. కూర్చోమని చెబితే కూర్చుంటారు. అదేవిధంగా ఇప్పుడు కూడా అన్నీ తయారైనవి లభిస్తాయి. ఇక్కడే సేవ యొక్క వేదికపై పునాది పడుతుంది. సత్యయుగంలో ఏమైనా శ్రమ చేయవలసి ఉంటుందా? శ్రమ యొక్క సఫలతకు ఫలితం ఇప్పటి నుండే ప్రత్యక్షరూపంలో అనుభవం చేసుకుంటారు. అప్పుడే ఆ సంస్కారం ప్రత్యక్షంలోకి వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా తల బరువు చేసుకునే సేవా స్వరూపాన్ని మార్చుకోవాలి. ఎక్కడైతే తల బరువు అయిపోతుందో అక్కడ స్వభావాల యొక్క బరువు కూడా ఎక్కువ అయిపోతుంది. అప్పుడు సహజంగా సఫలత లభించదు. దాదీకి తోడుగా అయ్యారు, ఇది కూడా మంచిది. ఇది కూడా డ్రామాలో పాత్ర. అలాగే ఒకరికొకరి సంకల్పం ఎగిరింపచేస్తుంది. సంకల్పం చేరగానే ప్రత్యక్షంలోకి తీసుకురండి. ఒకరు చెప్పగానే ఇంకొకరు అంగీకరించడం ఈ విధంగా శ్రేష్ట కర్మ చేయడానికి నిమిత్తంగా అవ్వండి. ఎందుకు? ఏమిటి? అనటం లేదు కదా! అలాగే అంటున్నారు కదా! ఈ విధంగా అందరు తేలికగా అయిపోతే ఎలా ఉంటుంది. అందరూ ఎగిరే పక్షి అయిపోతారు. ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ ఉంటారు. ఏవిధంగా అయితే పక్షి ఒక్కొక్కసారి ఒక కొమ్మపైన, ఇంకొకసారి ఇంకొక కొమ్మపైన కూర్చుంటుంది. ఇలా ఎగిరే పక్షిగా అయిపోతారు. ఏ కొమ్మపైన కూర్చుంటే అదే మీకు ఇల్లు. ఈ విధమైన సంస్కారం నింపుకోవాలి. ఈ విధంగా అందరు నేర్చుకున్నారు కదా! ఎప్పుడైనా ఆజ్ఞ రాగానే ఎందుకు? ఏమిటి? అనరు కదా! సేవాస్థానం అని అంటున్నారు కదా మరి సేవాస్థానం అంటే అర్థం ఏమిటి? ఎప్పుడు ఏ సేవాకేంద్రాన్ని ఇల్లు అని అనరు కదా! కుటుంబంలో ఉండేవారికైనా బ్రాహ్మణులుగా అయిన తర్వాత ఆ ఇల్లు కూడా సేవాస్థానం. సేవాస్థానం అంటే సేవ కొరకు ఉన్న స్థానం. ఎక్కడ సేవ ఉన్నా అక్కడికి వెళ్ళాలి. ఇల్లు అనుకుంటే వదలడం కష్టమౌతుంది. సేవా స్థానమైతే ఎక్కడ సేవ ఉన్నా అది సేవాస్థానం. ఈవిధంగా అందరూ ఎవరెడిగా అవ్వండి. మంచిది.

Comments