03-12-1984 అవ్యక్త మురళి

03-12-1984         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సర్వశక్తివంతుని, శిక్షకుని యొక్క శ్రేష్ట శిక్షణధారి అవ్వండి ..... 03-12-1984

అవ్యక్త బాప్ దాదా మాట్లాడుతున్నారు -

ఈరోజు సర్వశక్తివాన్ బాబా తన యొక్క నలువైపుల ఉన్న శక్తి సేనను చూస్తున్నారు. ఎవరెవరు సదా సర్వశక్తుల యొక్క శస్త్రధారి, మహావీర్, విజయీ విశేషాత్మలు అని. ఎవరెవరు సదా కాదు కానీ సమయానికి సమయం అనుసరించి శస్త్రధారి అవుతున్నారు అని. ఎవరెవరు సమయానికి శస్త్రధారి అయ్యే ప్రయత్నం చేస్తున్నారు? అందువల్లనే అప్పుడప్పుడు యుద్ధం చేస్తున్నారు. అప్పుడప్పుడు ఓడిపోతున్నారు. అప్పుడప్పుడు ఓటమి, అప్పుడప్పుడు యుద్ధం, ఈ చక్రంలో నడుస్తున్నారు. ఈ విధంగా మూడురకాల సేన యొక్క అధికారి పిల్లలను చూసారు. కానీ విజయీ శ్రేష్టాత్మలు సదా మొదటి నుండే ఎవరెడీగా ఉంటారు. సమయప్రకారం శాస్త్రధారి అవ్వటంలో సమయం శిక్షకునిగా అవుతుంది. సమయరూపీ శిక్షకుని ఆధారంగా నడిచేవారు, సర్వశక్తివాన్ శిక్షకుని యొక్క శిక్షణనుండి ఎవరెడీ అవ్వని కారణంగా అప్పుడప్పుడు సమయానికి మోసపోతున్నారు. మోసపోవటం ద్వారా స్మృతి యొక్క తెలివిలోకి వస్తారు. అందువలన సర్వశక్తివాన్ శిక్షకుని యొక్క శ్రేష్ట శిక్షణధారి అవ్వండి. సమయరూపీ శిక్షకుని శిక్షణధారిగా కాదు.

కొంతమంది పిల్లలు బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు లేక పరస్పరం కూడా ఆత్మిక సంభాషణ చేసుకుంటున్నారు. సాధారణ రూపంతో మాట్లాడుతున్నారు - సమయం వచ్చినప్పుడు అన్నీ మంచిగా అయిపోతాయి, సమయానికి చూపిస్తాము లేక సమయానికి చేస్తాము అని. కానీ విశ్వపరివర్తక పిల్లలకు సంపన్న శ్రేష్ట సమయం యొక్క ఆహ్వానం చేసే కార్యం లభించింది. మీరు స్వర్ణిమ ఉదయం తీసుకురావటానికి నిమిత్తం అయ్యారు. మీరు సమయరూపీ రచనకి మాష్టర్ రచయిత. సమయం అంటే యుగపరివర్తకులు. డబల్ కాలం పైన విజయీలు. ఒక కాలం అంటే సమయం. రెండవ కాలం అంటే మృత్యువుకి వశీభూతం కారు. అమరభవ యొక్క వరదానీ స్వరూపులు. అందువలన సమయం ప్రకారం చేసేవారు కాదు. కానీ బాబా ఆజ్ఞ ప్రకారం నడిచేవారు. సమయం అజ్ఞానీ ఆత్మలకు శిక్షకునిగా అవుతుంది. మనకి శిక్షకుడు సమర్ధుడైన బాబా. ఏదైనా సమయానికి ముందే తయారవుతుంది. ఆ సమయంలో కాదు. మీరు ఎవరెడీ సర్వశస్త్రశక్తిధారి సేన. కనుక సర్వశక్తుల యొక్క శస్త్రాలు ధారణ చేసానా అని పరిశీలించుకోండి. ఏ శక్తి అయినా అంటే ఒక శస్త్రం యొక్క లోపం ఉన్నా మాయ ఆ బలహీనత విధి ద్వారానే యుద్ధం చేస్తుంది. అందువలన దీనిలో సోమరిగా ఉండకూడదు మరియు అన్ని విషయాలు మంచిగా ఉన్నాయి. కొద్దిగా బలహీనంగా ఉన్నా కానీ ఆ ఒక బలహీనత మాయ యొక్క యుద్ధానికి మార్గంగా అవుతుంది. ఎలా అయితే బాబా "ఎక్కడయితే బాబా స్మృతి ఉంటుందో అక్కడ నేను తోడు ఉంటాను” అని ప్రతిజ్ఞ చేస్తున్నారో అలాగే 'ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడ వ్యాపించి ఉంటాను' అని మాయ ప్రతిజ్ఞ చేస్తుంది. అందువలన బలహీనత అంశమాత్రంగా కూడా మాయ యొక్క వంశాన్ని ఆహ్వానం చేస్తుంది. సర్వశక్తివాన్ పిల్లలు కనుక అన్నింటిలో సంపన్నం అవ్వాలి. బాబా పిల్లలకు ఏదైతే అధికారం ఇస్తున్నారో లేక శిక్షకుని రూపంలో ఈశ్వరీయ చదువు యొక్క ప్రాప్తి లేక డిగ్రీ ఇస్తున్నారో అది వర్ణనచేస్తున్నారా? సర్వగుణ సంపన్నం అంటున్నారా లేక సంపన్నం అంటున్నారా? సంపూర్ణ నిర్వికారులు, 16 కళా సంపన్నులు అంటున్నారు. 14 కళలు అనటం లేదు కదా! 100% సంపూర్ణ సుఖ, శాంతి వారసత్వం అంటున్నారు. కనుక అలాగే అవ్వాలా లేక ఒకటి సగం బలహీనత ఉన్నా పోతుంది అని భావిస్తున్నారా? కర్మల ఖాతా కూడా లోతైనది. బాబా అమాయకుడు కూడా కానీ కర్మలగతి యొక్క జ్ఞాత కూడా.

ఒకవేళ ఒక సగం బలహీనత ఉండిపోతే ప్రాప్తిలో కూడా సగం జన్మలు ఒక జన్మ వెనుక రావలసి ఉంటుంది. శ్రీకృష్ణునితో పాటూ విశ్వ మహారాజు మొదటి లక్ష్మినారాయణుల యొక్క ఉన్నత కుటుంబంలోకి లేక సమీప సంబంధంలోకి రారు. ఎలా అయితే సంవత్సరం ఒకటి - ఒకటితో ప్రారంభమవుతుందో, అలా క్రొత్త సంబంధం, క్రొత్త ప్రకృతి, నెంబర్ వన్ క్రొత్త ఆత్మలు. క్రొత్తది అంటే పై నుండి దిగిన క్రొతాత్మలు. క్రొత్త రాజ్యం , క్రొత్తదనం యొక్క సమయం యొక్క సుఖం, సతోప్రధాన మొదటి నెంబర్ యొక్క ప్రకృతి యొక్క సుఖం, మొదటి నెంబర్ ఆత్మలే పొందుతారు. మొదటి నెంబర్ అంటే సమయానికి విజయం పొందేవారు. కనుక ఖాతా పూర్తి అయిపోతుంది. బాబాతో వరదానం లేక వారసత్వం పొందటానికి ప్రతిజ్ఞ ఇదే చేసారు - వెంట ఉంటాను, వెంట వెళ్తాను, మరియు మరలా తిరిగి బ్రహ్మబాబా వెనుక రాజ్యంలోకి వస్తాను. వెనుక వస్తాం అని ప్రతిజ్ఞ చేయలేదు. సమానంగా అవ్వాలి. వెంట ఉండాలి. సంపన్నత, సమానత, సదా ఉంటే ప్రాప్తికి అధికారి అవుతారు. అందువలన సంపన్న మరియు సమానంగా అయ్యే సమయం సోమరితనంలో పోగొట్టుకుని అంతిమంలో తెలివిలోకి వస్తే ఏమి పొందుతారు? కనుక ఈరోజు సర్వశక్తులను, శస్త్రాలను పరిశీలిస్తున్నాను. ఫలితం వినిపించాను. మూడు రకాల పిల్లలను చూసాను. మీరు ఆలోచిస్తారు. ముందు ముందు సోమరితనం యొక్క నడవడిక కొద్దిగా ఉంటే పరవాలేదు, బాబా సహాయం చేస్తారు అని. కానీ అది సమయానికి మోసం చేయకూడదు. మరియు నాజూకుగా ఇలా ఆలోచించలేదు అని నిందించకండి. అందువలన నాజూకు సమయం రావటానికి గుర్తులు ఇది తీవ్రతతో సంపన్నంగా అవటానికి గుర్తులు. అర్థమైందా? అన్నివైపుల నుండి వచ్చిన శక్తిశాలి పిల్లలకు, సదా అలర్ట్ గా ఉండే వారికి, సదా సర్వశక్తుల యొక్క శస్త్రధారులకు, సర్వాత్మలను సంపూర్ణ సంపన్నం చేసి శక్తుల సహయోగం ఇచ్చేవారికి, శ్రేష్ట కాలం, శ్రేష్టయుగం తీసుకువచ్చేవారికి, యుగపరివర్తక మొదటి నెంబర్, మొదటి సంపన్న రాజ్య భాగ్యాధికారులకు, ఈ విధమైన సర్వశ్రేష్ట పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments