02-09-1985 అవ్యక్త మురళి

 02-09-1985         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

దాదీజీకి విదేశీ యాత్రకు శెలవు ఇస్తూ అవ్యక్త బాప్ దాదా మాట్లాడిన మహావాక్యాలు.

ఈరోజు తన సహాయకారి పిల్లలకు స్నేహానికి బదులు ఇచ్చేటందుకు వచ్చారు. మధువనం వారికి అలసిపోని సేవకు విశేషఫలం ఇచ్చేటందుకు కేవలం కలుసుకునేటందుకు వచ్చారు. ఇది స్నేహం యొక్క ప్రత్యక్ష ప్రమాణ రూపం. బ్రాహ్మణ పరివారానికి విశేషమైన పునాదియే - ఈ విశేషమైన స్నేహం. వర్తమాన సమయంలో స్నేహమనేది సేవాకార్యంలో సహజ సఫలతకు సాధనం. యోగీ జీవితానికి పునాది - నిశ్చయం కానీ పరివారానికి పునాది - స్నేహం. స్నేహమే ఎవరి మనస్సుకి అయినా సమీపంగా తీసుకువెళ్తుంది. వర్తమాన సమయంలో స్మృతి మరియు సేవ యొక్క సమానతతో పాటు స్నేహం మరియు సేవ యొక్క సమానతయే సఫలతకు సాధనం. దేశం యొక్క సేవ అయినా, విదేశం యొక్క సేవ అయినా రెండింటి సఫలతకు సాధనం ఆత్మిక స్నేహం. జ్ఞానం మరియు యోగం అనే మాటలైతే చాలా మంది నుండి విన్నారు. కానీ దృష్టి ద్వారా, శ్రేష్ట సంకల్పం ద్వారా ఆత్మలకు స్నేహం యొక్క అనుభూతి అవ్వటం, ఇది విశేషత మరియు నవీనత మరియు ఈరోజు విశ్వానికి స్నేహమే అవసరం. ఎంత అభిమానంతో ఉన్న ఆత్మనైనా స్నేహం సమీపంగా తీసుకువస్తుంది. స్నేహం యొక్క బికారీలుగా, శాంతి యొక్క బికారీలుగా ఉన్నారు కానీ శాంతి యొక్క అనుభవం కూడా స్నేహం యొక్క దృష్టి ద్వారానే చేసుకోగలరు. స్నేహం శాంతిని స్వతహాగా అనుభవం చేయిస్తుంది. ఎందుకంటే స్నేహంలో లీనమవ్వటం ద్వారా కొద్ది సమయానికి స్వతహాగా అశరీరీగా అవుతున్నారు. అశరీరీగా అయిన కారణంగా శాంతి యొక్క అనుభవం సహజంగా అవుతుంది. బాబా కూడా స్నేహానికి బదులు ఇస్తున్నారు. రధం నడిచినా, నడవకపోయినా బాబాకి స్నేహానికి ఋజువు ఇవ్వవలసిందే. పిల్లలలో అటు ఇదే స్నేహం యొక్క ప్రత్యక్ష ఋజువు చూడాలనుకుంటున్నారు. కొంతమంది (గుల్జార్ దాదీ, జగదీష్ భాయ్,నిర్వైర్ భాయ్)విదేశీ సేవ చేసి తిరిగి వచ్చారు, కొంతమంది (దాదీజీ మరియు మోహిని అక్కయ్య) వెళ్తున్నారు. ఇది కూడా ఆ ఆత్మ యొక్క స్నేహ ఫలం వారికి లభిస్తుంది. డ్రామానుసారం ఆలోచిస్తున్నారు కానీ వేరేది జరుగుతుంది. అయినప్పటికీ ఫలం లభిస్తుంది. అందువలనే ప్రోగ్రామ్ తయారయ్యింది. అందరు తమ,తమ మంచి పాత్రను అభినయించి వచ్చారు. తయారైపోయిన డ్రామా నిర్ణమైపోయి ఉంది కనుక సహజంగా బదులు లభిస్తుంది. విదేశం వారు కూడా మంచి సంలగ్నతతో ముందుకు వెళ్తున్నారు. ధైర్యం మరియు ఉల్లాసం వారిలో మంచిగా ఉంది. అందరి మనస్సుతో ధన్యవాదాలు చెప్పే సంకల్పం బాప్ దాదా దగ్గరికి చేరుతుంది. ఎందుకంటే వారు కూడా అర్థం చేసుకుంటున్నారు. భారతదేశంలో కూడా చాలా అవసరం ఉంది కానీ భారతదేశం యొక్క స్నేహమే మాకు సహయోగం ఇస్తుంది అని. భారతదేశంలో సేవ చేసే సహయోగి పరివారానికి మనస్సుతో ధన్యవాదాలు చెప్తున్నారు. దేశంతో ఎంత దూరంగా ఉన్నా మనస్సుతో పాలనకు పాత్రులుగా అవ్వటంలో సమీపంగా ఉన్నారు. అందువలనే బాప్ దాదా నలువైపుల ఉన్న పిల్లలకు ప్రియస్మృతులు మరియు ధన్యవాదాలు ఇస్తున్నారు.

Comments