01-10-1987 అవ్యక్త మురళి

01-10-1987         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము  

ఆధ్యాత్మిక సాధుసమ్మేళనం తర్వాత బాప్ దాదా యొక్క రాక ... 1-10-87 

సర్వసేవాధారి పిల్లలకు సేవ యొక్క శుభాకాంక్షలు ఇస్తూ స్నేహసాగరుడైన బాప్ దాదా మాట్లాడుతున్నారు...

ఈ రోజు స్నేహసాగరుడైన బాబా తన స్నేహి పిల్లలను కలుసుకోవడానికి వచ్చారు. బాబా మరియు పిల్లల యొక్క స్నేహం విశ్వాన్ని స్నేహసూత్రంలో బంధిస్తుంది. ఎప్పుడైతే స్నేహసాగరుని మరియు స్నేహ సంపన్న నదుల కలయిక జరుగుతుందో అప్పుడు స్నేహంతో నిండిన నది కూడా బాబా సమానంగా మాస్టర్ స్నేహసాగరంగా అయిపోతుంది. అందువలనే విశ్వంలో ఆత్మలు స్నేహం యొక్క అనుభూతి ఆధారంగా స్వతహాగానే సమీపంగా వస్తున్నారు. పవిత్ర ప్రేమ లేదా ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమ ద్వారా, ఎంత అజ్ఞానీ ఆత్మలైనా, చాలా సమయం నుండి పరివారం యొక్క ప్రేమ నుండి వంచితులై రాయిలా అయిపోయిన ఆత్మ అయిన కానీ అలాంటి ఆత్మలు కూడా కరిగిపోయి నీరు అయిపోతారు. ఇదే ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమ యొక్క అద్భుతం. ఈ ప్రేమ నుండి ఎంత స్వయాన్ని తొలగించుకుందామన్నా ఈశ్వరీయ ప్రేమ అనేది అయస్కాంతంలా ఆకర్షించి స్వతహాగా సమీపంగా తీసుకువస్తుంది. దీనినే ఈశ్వరీయ స్నేహం యొక్క ప్రత్యక్ష ఫలం అంటారు! స్వయాన్ని వేరే మార్గం వారిగా భావించినా కానీ ఈ ఈశ్వరీయస్నేహం అనేది సహయోగిగా చేసి పరస్పరం మనమందరం ఒకటే అని ముందుకు వెళ్ళే సూత్రంలో బంధిస్తుంది. ఇలా అనుభవం చేసుకున్నారు కదా! 

స్నేహమనేది మొదట సహయోగిగా చేస్తుంది. సహయోగి అవుతూ అవుతూ స్వతహాగానే సమయానికి సర్వులను సహజయోగిగా కూడా చేస్తుంది. సహయోగి అయినదానికి గుర్తు - ఈ రోజు సహయోగి అవుతారు మరియు రేపు సహజయోగిగా అయిపోతారు. ఈశ్వరీయ స్నేహమనేది పరివర్తనకు ఆధారం మరియు జీవిత పరివర్తనకు బీజస్వరూపం. ఏ ఆత్మలలో అయితే ఈశ్వరీయ స్నేహం యొక్క అనుభూతి అనే బీజం పడుతుందో సమయానికి ఆ బీజం సహయోగి అయ్యే వృక్షాన్ని స్వతహాగానే జన్మను ఇస్తుంది మరియు సమయ ప్రమాణంగా సహజయోగి అయ్యే ఫలం కనిపిస్తుంది. ఎందుకంటే పరివర్తన యొక్క బీజ ఫలం తప్పకుండా కనిపిస్తుంది. కొన్ని ఫలాలు తొందరగా వస్తాయి మరియు కొన్ని ఫలాలు సమయానికి వస్తాయి. నలువైపుల మాస్టర్ స్నేహసాగరులు, విశ్వసేవాధారి పిల్లలైన మీరు ఏ కార్యం చేస్తున్నారు? విశ్వంలో ఈశ్వరీయ పరివారం యొక్క స్నేహమనే బీజాన్ని నాటుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా - నాస్తికులైనా లేదా ఆస్తికులైనా, బాబాని తెలుసుకోలేకపోయినా అంగీకరించకపోయినా కానీ ఇది తప్పకుండా అనుభవం చేసుకుంటారు - శివవంశీ బ్రహ్మాకుమారీ, బ్రహ్మాకుమారుల ద్వారా లభించే ఈ ఈశ్వరీయ పరివారం యొక్క ప్రేమ ఇక ఎక్కడ లభించదు మరియు ఈ స్నేహం లేదా ప్రేమ సాధారణ ప్రేమ కాదు, ఇది అలౌకిక ప్రేమ లేక ఈశ్వరీయ స్నేహం అని కూడా అంగీకరిస్తారు. అంటే పరోక్షంగా నాస్తికుల నుండి ఆస్తికులుగా అయిపోయారు కదా! ఈ ఈశ్వరీయ ప్రేమ ఎక్కడినుండి వచ్చింది? కిరణాలు స్వతహాగానే సూర్యున్ని సిద్ది చేస్తాయి. ఈశ్వరీయ ప్రేమ, అలౌకిక స్నేహం, నిస్వార్ధ స్నేహం స్వతహాగానే దాత అయిన బాబాని ప్రత్యక్షం చేస్తుంది. పరోక్షంగా ఈశ్వరీయ స్నేహం యొక్క ప్రేమ ద్వారా స్నేహసాగరుడైన బాబాతో సంబంధం జోడించబడుతుంది కానీ తెలుసుకోవటం లేదు. ఎందుకంటే మొదట బీజం గుప్తంగా ఉంటుంది, వృక్షం స్పష్టంగా కనిపిస్తుంది. కనుక ఈ ఈశ్వరీయ స్నేహం యొక్క బీజం సర్వులను సహయోగి నుండి సహజయోగిగా చేస్తుంది. సమయ ప్రమాణంగా ప్రత్యక్ష రూపంలో ప్రత్యక్షం చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు. అందరూ ఈశ్వరీయ స్నేహమనే బీజం వేసే సేవ చేసారు. సహయోగిగా అయ్యే శుభాభావన మరియు శుభకామన యొక్క విశేషమైన రెండు ఆకులను కూడా ప్రత్యక్షంగా చూసారు. ఇప్పుడు ఈ కాండం వృద్ధిని పొందుతూ ప్రత్యక్షఫలాన్ని చూపిస్తుంది. 

బాప్ దాదా పిల్లలందరి రకరకాల సేవలను చూసి సంతోషిస్తున్నారు. ఉపన్యాసం చెప్పే పిల్లలైనా, స్థూల సేవ చేసే పిల్లలైనా సర్వుల సహయోగం యొక్క సేవ ద్వారా సఫలత యొక్క ఫలం లభిస్తుంది. కాపలా కాసేవారైనా, పాత్రలు సంభాళించేవారైనా కానీ ఏవిధంగా అయితే ఐదు వేళ్ళు సహాయం ద్వారా ఎంత శ్రేష్టకార్యమైనా, పెద్ద కార్యమైనా సహజం అయిపోతుంది అదేవిధంగా ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లల సహయోగం ద్వారా ఎలా ఆలోచిస్తారో అలా జరుగుతుంది, ఆలోచించిన దాని కంటే వేలరెట్లు ఎక్కువగా కార్యం సహజం అవుతుంది. అది ఎవరి అద్బుతం? అందరిదీ. ఏ కార్యంలో సహయోగి అయినా, శుభ్రంగా ఉంచటంలో అయినా, బల్లలు శుభ్రం చేసినా కానీ, సర్వుల సహయోగం ద్వారానే ఫలం వస్తుంది. సంఘటనా శక్తి చాలా గొప్పది. బాప్ దాదా చూస్తున్నారు కేవలం మధువనానికి వచ్చిన పిల్లలనే కాదు కానీ ఎవరైతే సాకారంలో లేరో, మరియు నలువైపుల ఉన్న బ్రాహ్మణ పిల్లల యొక్క దేశీయులైనా, విదేశీయులైనా  అందరి మనస్సు యొక్క శుభభావన, శుభకామన యొక్క సహయోగం ఉంది. సర్వాత్మల శుభభావన, శుభకామన యొక్క కోట ఆత్మలని పరివర్తన చేస్తుంది. నిమిత్తంగా శక్తులు ఉన్నా, పాండవులు ఉన్నా విశేష కార్యానికి నిమిత్త సేవాధారి నిమిత్తం అవుతారు కానీ వాయుమండలం యొక్క కోట అనేది సర్వుల సహయోగం ద్వారానే తయారవుతుంది. నిమిత్తంగా అయిన పిల్లలకు కూడా బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు కానీ పిల్లలందరికీ ఎక్కువగా శుభాకాంక్షలు ఇస్తున్నారు. బాబాకి పిల్లలు ఏమి శుభాకాంక్షలు ఇస్తారు! ఎందుకంటే బాబా అయితే అవ్యక్తం అయిపోయారు. వ్యక్తంలో పిల్లలను నిమిత్తంగా చేసారు. అందువలనే సదా బాప్ దాదా పిల్లల యొక్క పాటలు పాడతారు. మీరు బాబా పాటలు పాడండి, బాబా మీ పాటలు పాడతారు. 

ఏది చేసారో అది చాలా బాగా చేసారు! ఉపన్యాసం చేప్పేవారు, ఉపన్యాసం బాగా చెప్పారు, వేదికను అలంకరించినవారు బాగా అలంకరించారు, విశేషంగా యోగయుక్తంగా భోజనం తయారు చేసినవారు, పెట్టేవారు, కూరలు తరిగినవారు అందరూ ఉన్నారు. భోజనం తయారుచేసేటప్పుడు మొదట కూరగాయలు తరుగుతారు. కూరగాయలు తరగకపోతే భోజనం ఏమి తయారవుతుంది? అన్ని విభాగాల వారు అన్ని రకాలుగా సేవకి నిమిత్తం అయ్యారు. చెప్పాను కదా - శుభ్రం చేసేవారు శుభ్రం చేయకపోయినా ప్రభావం ఉండదు. ప్రతి ఒక్కరి ముఖం ఈశ్వరీయ స్నేహ సంపన్నంగా లేకపోతే సేవా సఫలత ఎలా వస్తుంది! అందరూ ఏ కార్యం అయితే చేసారో స్నేహంతో చేసారు. అందువలనే వారిలో కూడా స్నేహమనే బీజం పడింది. ఉత్సాహ, ఉల్లాసాలతో చేసారు. అందువలన వారికి కూడా ఉత్సాహ, ఉల్లాసాలు ఉన్నాయి. అనేకతలో ఉన్నప్పటికీ కూడా స్నేహ సూత్రంలో ఉన్న కారణంగా ఏకతగానే మాట్లాడుకుంటున్నారు. ఈ వాయుమండలం యొక్క చత్రఛాయకి విశేషత ఉంది. వాయుమండలం అనేది చత్రఛాయగా అవుతుంది. కనుక చత్రఛాయలో ఉంటే ఎటువంటి సంస్కారం కలిగిన ఆత్మ అయినా కానీ స్నేహ ప్రభావంలో ఇమిడిపోతుంది. అర్ధమైందా? అందరికీ పెద్ద భాద్యత ఉంది! అందరూ సేవ చేసారు. వారు ఏదైనా మాట్లాడదామనుకున్నా కానీ వాయుమండలం కారణంగా మాట్లాడలేరు, మనస్సులో ఏదైనా ఆలోచన ఉన్నా కానీ నోటి ద్వారా రాదు ఎందుకంటే ప్రత్యక్షంగా మీ అందరి జీవిత పరివర్తన చూసి వారిలో కూడా పరివర్తన యొక్క ప్రేరణ స్వతహాగా వస్తూ ఉంటుంది. ప్రత్యక్ష రుజువు చూసారు కదా! శాస్త్రాల రుజువు కంటే కూడా ఇది గొప్ప ప్రత్యక్ష రుజువు. ప్రత్యక్ష రుజువులో అన్ని రుజువులు ఉంటాయి. ఇదే సేవ యొక్క ఫలితం. ఇప్పుడు కూడా ఆ స్నేహం యొక్క సహయోగం యొక్క విశేషత ద్వారా మరింత సమీపంగా తీసుకువస్తూ ఉంటే మరింత సహయోగంలో ముందుకు వెళ్తూ ఉంటారు. 

ఎప్పుడైతే అన్ని శక్తుల యొక్క సహయోగం ఉంటుందో అప్పుడే ప్రత్యక్షతా ధ్వని ప్రతిధ్వనిస్తుంది మరియు అప్పుడే విశ్వం ముందు ప్రత్యక్షతా పరదా తెరుచుకుంటుంది. వర్తమాన సమయంలో సేవా ప్లాన్స్ ఏవైతే తయారు చేసారో అవి అందుకోసమే తయారు చేసారు కదా! అన్ని వర్గాల వారు అంటే అన్ని శక్తులవారు సంపర్కంలోకి, సహయోగంలోకి, స్నేహంలోకి రావాలి తర్వాత సంబంధంలోకి వచ్చి సహజయోగి అయిపోతారు. ఒకవేళ ఒక శక్తి అయినా సహయోగిగా కాకపోతే సర్వుల సహయోగకార్యం ఏవిధంగా సఫలం అవుతుంది? 

ఇప్పుడు విశేషమైన శక్తికి పునాది పడింది. ధర్మశక్తి అంటే అన్నిటికంటే గొప్ప శక్తి కదా! ఆ విశేషశక్తి ద్వారా పునాది ప్రారంభం అయ్యింది. స్నేహం యొక్క ప్రభావాన్ని అయితే చూశారు కదా! వీరు అందరినీ కలిపి ఎలా పిలుస్తున్నారు? అని ప్రజలు అంటున్నారు. వారు కూడా ఆలోచిస్తున్నారు కదా! కానీ ఈశ్వరీయ స్నేహం యొక్క సూత్రం ఒక్కటే అందువలనే అనేక ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా సహయోగి అయ్యే ఆలోచన ఒకటే ఉంటుంది. ఇలా ఇప్పుడు సర్వశక్తుల వారిని సహయోగిగా చేయండి. సహయోగిగా అవుతున్నారు కానీ ఇప్పుడు మరింత సమీపంగా మరియు సహయోగిగా తయారుచేయండి. ఎందుకంటే ఇప్పుడు స్వర్ణజయంతి పూర్తయిపోయింది. ఇప్పటి నుండి ప్రత్యక్షం సమయం మరింత దగ్గరకి వచ్చింది. వజ్రజయంతి అంటే ప్రత్యక్షతా నినాదాన్ని ప్రతిధ్వనింపచేయాలి. కనుక ఈ సంవత్సరం నుండి ప్రత్యక్షతా పరదా తెరుచుకోవటం ప్రారంభం అయ్యింది. ఒక వైపు విదేశం ద్వారా భారతదేశంలో ప్రత్యక్షత జరిగింది, రెండవవైపు నిమిత్త మహామండలేశ్వరుల ద్వారా శ్రేష్టకార్యం యొక్క సఫలత కూడా వచ్చింది. విదేశాల్లో ఐక్యరాజ్యసమితి వారు నిమిత్తం అయ్యారు, వారు కూడా విశేషంగా ప్రసిద్ధమైనవారు మరియు భారతదేశంలో కూడా ప్రసిద్ధమైన ధర్మశక్తి వారు నిమిత్తమయ్యారు. ధర్మశక్తి వారి ద్వారా ధర్మాత్మల యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. ఇదే ప్రత్యక్షతా పరదా తెరుచుకోవటం ప్రారంభమవ్వటం. ఇప్పుడు కొద్దిగా తెరుచుకోవటం ప్రారంభమయ్యింది. పూర్తిగా తెరుచుకోలేదు, ప్రారంభం అయ్యింది. విదేశీ పిల్లలు ఏ కార్యానికి నిమిత్తమయ్యారో అది విశేషకార్యం. ప్రత్యక్షత యొక్క విశేషకార్యానికి ఈ కార్యం కారణంగా నిమిత్తంగా అయ్యారు. కనుక బాప్ దాదా విదేశీ పిల్లలకు ఈ అంతిమ ప్రత్యక్షత యొక్క హీరోపాత్రలో నిమిత్తంగా అయిన విశేష సేవకి కూడా విశేష శుభాకాంక్షలు ఇస్తున్నారు. భారతదేశంలో అయితే అలజడి జరిగింది కదా! ధ్వని అయితే అందరి చెవుల వరకు చేరుకుంది. విదేశం యొక్క ప్రతిధ్వని యొక్క మాట అయితే భారతదేశపు కుంభకర్ణులని మేల్కొల్పడానికి నిమిత్తంగా అయితే అయ్యింది. కానీ ఇప్పుడు కేవలం మాట వెళ్ళింది ఇప్పుడు వారిని మేల్కొల్పాలి, లేపాలి. ఇప్పుడు కేవలం చెవుల వరకు చేరుకుంది. నిద్రపోయే వారి చెవులకి ఏమైనా మాటలు వెళ్తే కొద్దిగా చలిస్తారు కదా, అలజడి చేస్తారు కదా! కనుక అలజడి ప్రారంభమయ్యింది. ఆ అలజడులకు కొద్దిగా మేల్కొన్నారు. మరలా ఇది కూడా కొంచెమే అనుకుంటున్నారు కానీ ఎప్పుడైతే పెద్దగా ధ్వని చేస్తారో అప్పుడు పూర్తిగా మేల్కొంటారు. ఇప్పుడు మొదటి నుండి కొద్ది ధ్వనితోనే జరిగింది. ఎప్పుడైతే అన్ని శక్తుల వారు కలిసి ఒకే వేదికపై స్నేహ మిలనం చేసుకుంటారో అప్పుడే అద్భుతం జరుగుతుంది. సర్వశక్తుల ఆత్మల ద్వారా ఈశ్వరీయ కార్యం యొక్క ప్రత్యక్షత ప్రారంభం అవ్వాలి అప్పుడే ప్రత్యక్షత యొక్క పరదా పూర్తిగా తెరుచుకుంటుంది. అందువలన ఇప్పుడు ఏ ప్రోగామ్ తయారు చేస్తున్నారో దానిలో అన్ని శక్తుల ఆత్మల స్నేహ కలయిక జరగాలనే లక్ష్యం పెట్టుకోండి. అన్ని వర్గాల వారి స్నేహ మిలనం (కలయిక) అయితే జరుగుతుంది. సాధారణ సాధువులని పిలవటమనేది పెద్ద గొప్ప విషయం కాదు కానీ మహామండలేశ్వరులను పిలిచారు కదా! అదేవిధంగా అలాగే ఈ సంఘటనలో శంకరాచార్యులు వారు కూడా ఉంటే శోభగా ఉంటుంది కానీ ఇప్పుడు ఆయన భాగ్యం కూడా తెరుచుకుంటుంది. లోలోపల అయితే సహయోగిగానే ఉన్నారు. పిల్లలు శ్రమ కూడా చాలా బాగా చేసారు. కానీ లోక మర్యాదలను కూడా చూడాలి కదా! అన్ని శక్తుల వారు కలిసి శ్రేష్టశక్తి, ఈశ్వరీయ శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఒక్క పరమాత్మశక్తియే అనే రోజు కూడా వస్తుంది. అందువలన ఎక్కువ సమయం యొక్క ప్లాన్ తయారుచేసారు కదా! అందరినీ స్నేహసూత్రంలో బంధించి సమీపంగా తీసుకురావడానికే ఇంత సమయం లభించింది. ఈ స్నేహమనేది అయస్కాంతంగా అవుతుంది దాని ద్వారా అందరూ ఒకేసారి సంఘటనా రూపంలో బాబా యొక్క వేదిక పైకి వచ్చేస్తారు. ఈ విధమైన ప్లాన్ తయారుచేసారు కదా? మంచిది. 

సదా ఈశ్వరీయ స్నేహంలో లీనమై ఉండేవారికి, సదా ప్రతి సెకను సర్వులకు సహయోగి అయ్యేవారికి, సదా ప్రత్యక్షత యొక్క పరదా తొలగించి బాబాని విశ్వం ముందు ప్రత్యక్షం చేసేవారికి, సదా సర్వాత్మలకు ప్రత్యక్షప్రమాణంగా అయ్యి ఆకర్షితం చేసేవారికి, సదా బాబా యొక్క మరియు సర్వుల ప్రతి కార్యంలో సహయోగి అయ్యి ఒకని పేరునే ప్రఖ్యాతి చేసేవారికి, ఈవిధంగా విశ్వానికి ఇష్టమైన పిల్లలకు, విశ్వం యొక్క విశేష పిల్లలకు బాప్ దాదా యొక్క అతిస్నేహ సంపన్న ప్రియస్మృతులు!వెనువెంట దేశ, విదేశల యొక్క పిల్లలు స్నేహంతో బాబా ఎదురుగా చేరుకునే సమీప పిల్లలకు సేవ యొక్క శుభాకాంక్షలు వెనువెంట బాప్ దాదా యొక్క విశేష ప్రియస్కృతులు స్వీకరించండి.

Comments