30-04-1983 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
పరమపూజ్యులుగా అయ్యేందుకు ఆధారము
అందరూ మేళా జరుపుకునేందుకు మహాన్ తీర్ధ స్థానానికి నలువైపుల నుండి చేరుకున్నారు. ఈ మహాతీర్ధపు మేళా యొక్క స్మృతిచిహ్నముగా ఇప్పటికీ తీర్ధ స్థానాలలో మేళాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో జరిగే ప్రతి శ్రేష్ఠ కార్యమును స్మృతిచిహ్న చిత్రాల రూపంలో, గీతాల రూపంలో ఇప్పటికీ చూస్తున్నారు, వింటున్నారు. చైతన్యమైన శ్రేష్ఠ ఆత్మలు తమ చిత్రాలను మరియు చరిత్రను చూస్తున్నారు, వింటున్నారు. ఇటువంటి సమయంలో బుద్ధిలో ఎటువంటి శ్రేష్ఠ సంకల్పము కలుగుతుంది? అది మేమే, ఇప్పుడు కూడా అది మేమే, మళ్ళీ కల్పకల్పము అదేవిధంగా ఉంటాము. ఈ 'మళ్ళీ' అన్న స్మృతి మరియు జ్ఞానము ఇంకే ఆత్మకు, మహాన్ ఆత్మకు, ధర్మ ఆత్మకు లేక ధర్మపితకు కూడా ఉండదు. కాని బ్రాహ్మణ ఆత్మలైన మీ అందరికీ ఎంతో స్పష్టమైన స్మృతి లేక స్పష్టమైన జ్ఞానము ఉంది. 5,000 సంవత్సరాలనాటి విషయం నిన్ని విషయంలా అనిపిస్తుంది. నిన్న అలా ఉన్నాము, ఈరోజు అలా ఉన్నాము, మళ్ళీ రేపు అలా ఉంటాము. కావున ఈ నేడు మరియు రేపు అన్న రెండు పదాలలో 5,000 సంవత్సరాల ఇతిహాసం ఇమిడి ఉంది. ఇంత సహజంగా మరియు స్పష్టంగా అనుభవం చేసుకుంటున్నారా? అలా ఎవరైనా ఉంటారా లేక మనమే అలా ఒకప్పుడు ఉన్నాము, ఇప్పుడూ మనమే అలా ఉన్నాము! జడచిత్రాలలో మీ చైతన్య శ్రేష్ఠ జీవితము సాక్షాత్కారమవుతుందా లేక ఇవి మహారధుల చిత్రాలా లేక మీ అందరి చిత్రాలా? భారతదేశంలో 33 కోట్ల దేవతలకు నమస్కారం చేస్తారు. కావున శ్రేష్ఠ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే మీ వంశము యొక్క వంశానికి, వారి యొక్క వంశానికి.... అందరికీ పూజ చేయకపోయినా గాయనమైతే తప్పకుండా చేస్తారు. కావున ఎవరైతే స్వయం పూర్వజులో వారి పేరు ఇంకెంత శ్రేష్ఠంగా ఉంటుందో ఆలోచించండి. అలాగే పూర్వజుల పూజ కూడా ఎంత శ్రేష్ఠంగా ఉంటుంది! 9 లక్షల ఆత్మల గాయనం కూడా ఉంది. వీరికన్నా ముందు 16 వేల మంది యొక్క గాయనము, దానికి ముందు 108 మంది యొక్క గాయనము, ఇంకా ముందు 8 మంది యొక్క గాయనము, వీరందరికన్నా ముందు జంట పూసలు ఉంటాయి. అందరూ నెంబర్వారీగా ఉన్నారు కదా! గాయనమైతే అందరికీ ఉంది. ఎందుకంటే ఎవరైతే భాగ్యవిధాత అయిన బాబాకు పిల్లలుగా అయ్యారో, ఈ భాగ్యము కారణంగా వారి గాయనము మరియు పూజ రెండూ జరుగుతాయి. కాని పూజలో రెండు రకాల పూజ జరుగుతుంది. ఒకటేమో ప్రేమ యొక్క విధిపూర్వకంగా జరిగే పూజ, మరొకటి నియమపూర్వకంగా జరిగే పూజ. రెండింటిలోను తేడా అయితే ఉంటుంది కదా! కావున నేను ఎటువంటి పూజ్య ఆత్మను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. కొందరు భక్తులు, దేవతలు అసంతుష్టులుగా అవకూడదన్న భయంతో పూజ చేస్తారు. మరికొందరు భక్తులు ప్రదర్శనామాత్రంగా కూడా పూజ చేస్తారు. మరికొందరు భక్తి యొక్క నియమాన్ని లేక బాధ్యతను నిర్వర్తించాలని భావిస్తారు. వారికి మనసులో ఉన్నా, లేకపోయినా దానిని నిర్వర్తిస్తారు. దానిని బాధ్యతగా భావిస్తారు. నాలుగు రకాలైన భక్తులుగా ఏదో ఒకవిధంగా అవుతారు. ఇక్కడ కూడా చూడండి దేవ ఆత్మలుగా అయ్యేవారు, బ్రహ్మాకుమారీ కుమారులుగా పిలిపించుకునేవారు భిన్న భిన్న రకాలుగా ఉంటారు కదా! నెంబర్వన్ పూజ్యులు సదా సహజ స్నేహంతో మరియు విధిపూర్వకంగా స్మృతి మరియు సేవ లేక యోగి ఆత్మ, దివ్యగుణ ధారణ చేసే ఆత్మగా అయి నడుస్తున్నారు. నాలుగు సబ్జెక్టులలో విధి మరియు సిద్ధిని ప్రాప్తించుకున్నారు. ఆ రెండవ నెంబర్లో ఉన్న పూజ్యులు విధిపూర్వకంగా కాక నియమంగా భావిస్తూ చేస్తారు. నాలుగు సబ్జెక్టులలోను పూర్తిగా ఉంటారు కాని విధి ద్వారా సిద్ధిని పొందే ప్రాప్తీస్వరూపులుగా అయి ఉండరు. కాని నియమంగా భావిస్తూ నడవవలసిందే, చేయవలసిందే అన్న లక్ష్యంతో ఎంతగా నియమానుసారంగా చేస్తారో అంతగా ప్రాప్తిని పొందుతూ ముందుకువెళుతూ ఉంటారు. ఆ హృదయపూర్వకమైన స్పేహము స్వతహాగా మరియు సహజంగా తయారుచేస్తుంది మరియు నియమపూర్వకంగా చేసేవారికి కాసేపు సహజంగా కాసేపు కష్టంగా అనిపిస్తుంది. కాసేపు కష్టపడవలసి వస్తుంది కాసేపు ప్రేమ యొక్క అనుభూతి కలుగుతుంది. నెంబర్ వన్లో ఉన్నవారు లవలీనులుగా ఉంటారు. రెండవ నెంబర్లో ఉన్నవారు లవ్ (ప్రేమ)లో ఉంటారు. ఇక మూడవ నెంబర్వారు మెజారిటీ సమయంలో నాలుగు సబ్జెక్టులలోను హృదయపూర్వకంగా కాక కేవలం ప్రదర్శనామాత్రంగా చేస్తారు. స్మృతి చేసేందుకు కూర్చున్నా ప్రసిద్ధులుగా అయ్యే భావంతో కూర్చుంటారు. ఈ విధంగా ప్రదర్శనామాత్రంగా సేవ కూడా ఎంతో చేస్తారు. సమయాన్నిబట్టి అటువంటి అల్పకాలికరూపాన్ని కూడా ధారణ చేస్తారు కాని మెదడు బాగా పనిచేస్తుంది. కాని హృదయము ఖాళీగా ఉంటుంది. ఇక నాలుగో నెంబర్వారు కేవలం భయంతో ఎవరైనా ఏదైనా అనేస్తారేమోనని చేస్తారు... వీరు చివరి నెంబర్వారు, వీరు ముందు ముందు నడవలేరు అని ఎవరైనా ఇటువంటి దృష్టితో చూడకూడదు అని చేస్తూ ఉంటారు. బ్రాహ్మణులుగా అయితే అయిపోయారు మరియు శూద్ర జీవితమును కూడా వదిలేసారు, కాని, రెండువైపులా కాకుండా అయిపోకూడదు కదా! శూద్ర జీవితము కూడా ఇష్టములేదు, అలాగే బ్రాహ్మణ జీవితంలో విధిపూర్వకంగా నడిచే ధైర్యము కూడా లేదు. కావున తప్పని పరిస్థితిలో నడిసముద్రంలోకి వచ్చేసారు. ఇటువంటి తప్పని పరిస్థితి లేక భయము కారణంగా నడుస్తూనే ఉంటారు. ఇలా అప్పుడప్పుడు తమ శ్రేష్ఠ జీవితమును అనుభవం కూడా చేసుకుంటారు కావున ఈ జీవితమును కూడా వదలలేరు. ఇటువంటివారిని నాలుగో నెంబర్లోని పూజ్య ఆత్మలు అని అనడం జరుగుతుంది. కావున వారి పూజ అప్పుడప్పుడు మరియు భయం కారణంగా తప్పని పరిస్థితిలో భక్తులుగా అయి నిర్వర్తిస్తారు, అదేవిధంగా కొనసాగుతూ ఉంటుంది మరియు ప్రదర్శనామాత్రంగా ఉండేవారి పూజ కూడా హృదయపూర్వకంగా కాక ప్రదర్శనామాత్రంగా జరుగుతూ ఉంటుంది. ఇదేవిధంగా నడుస్తూ ఉంటారు. కావున నాలుగురకాల పూజ్యులను చూసారు కదా! ఏ విధంగా ఇప్పుడు స్వయం అవుతారో అదేవిధంగా సత్య, త్రేతా యుగాల రాయల్ ఫామిలీ లేక పూజ అదేవిధంగా అవుతుంది. మరియు ద్వాపర, కలియుగాలలో కూడా అటువంటి భక్తమాలయే తయారవుతుంది. ఇప్పుడు నేను ఎవరిని అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి లేక ఈ నాలుగింలోను కాసేపు ఒకదానిలో కాసేపు మరొకదానిలో ఇలా తిరుగుతూ ఉన్నారా? అయినా భాగ్యవిధాత పిల్లలుగా అయ్యారు కావున పూజ్యులుగా తప్పకుండా అవుతారు. ప్రసిద్ధులైనవారు అనగా శ్రేష్ఠ పూజ్యులుగా 16,000 వరకు నెంబర్వారీగా అయిపోతారు, ఇక మిగిలిన 9 లక్షల మంది చివరి సమయంవరకు అనగా కలియుగపు చివరి సమయంవరకు ఎంతోకొంత పూజ్యులుగా అయిపోతారు. కావున గాయనమైతే అందరికీ జరుగుతుందని అర్థమైంది కదా! భాగ్యవిధాత అయిన తండ్రికి చెందినవారిగా అవ్వడం గాయనమునకు ఆధారమైతే, పూజకు ఆధారము నాలుగు సబ్జెకులలోను పవిత్రత, స్వచ్ఛత, సత్యత, శుద్ధత... ఇటువంటివారిని బాప్దాదా కూడా సదా స్నేహ పుష్పాలతో పూజిస్తారు అనగా వారిని శ్రేష్ఠంగా భావిస్తారు. పరివారం కూడా శ్రేష్ఠంగా భావిస్తుంది మరియు విశ్వం కూడా ఓహో, ఓహో అనే ఢంకా మోగిస్తూ వారిని మనస్పూర్తిగా పూజిస్తారు మరియు భక్తులు తమ ఇష్టులుగా భావిస్తూ తమ హృదయంలో ఇముడ్చుకుంటారు. మరి ఇటువంటి పూజ్యులుగా అయ్యారా? వీరు ఉన్నదే పరమపితగా, కేవలం తండ్రి కాదు, ఉన్నతోన్నతుడైన తండ్రి. కావున వీరు తయారుచేసేది కూడా ఉన్నతోన్నతముగానే కదా! పూజ్యులుగా అవ్వడం ఏమంత పెద్ద విషయం కాదు కాని పరమపూజ్యులుగా అవ్వాలి.
బాప్దాదా కూడా పిల్లలను చూసి హర్షితులవుతారు. ప్రేమలో శ్రమను అనుభవం చేసుకోకుండా వారు వచ్చేస్తారు. ఇప్పుడైతే మీరు రెస్ట్హౌస్లోకి వచ్చేసారు కదా! తనువు మరియు మనస్సు రెండింటికీ రెస్ట్ లభిస్తుంది కదా! రెస్ట్ తీసుకోవడం అనగా పడుకోవడం అని కాదు, బంగారంగా అయ్యే స్థితిలోకి వచ్చేసారు. పారసపురిలోకి వచ్చేసారు కదా! ఇక్కడ సాంగత్యమే పారస ఆత్మల సాంగత్యము. ఇక్కడ వాయుమండలమే స్వర్ణిమంగా తయారుచేసేస్తుంది. ఇక్కడి విషయాలే రాత్రింబవళ్ళు స్వర్ణిమంగా తయారుచేసేవిగా ఉంటాయి. అచ్ఛా!
ఇటువంటి సదా పరమపూజ్య ఆత్మలకు, సదా విధి ద్వారా శ్రేష్ఠ సిద్ధిని పొందేవారికి, సదా మహాన్గా అయి మహాన్ ఆత్మలుగా తయారుచేసేవారికి, స్వయమును సదా సహజమైన మరియు స్వతహ యోగులుగా, నిరంతర యోగులుగా, స్నేహసంపన్న యోగులుగా అనుభవం చేసుకునేవారికి, ఇటువంటి సర్వశ్రేష్ఠ ఆత్మలకు నలువైపులా ఉన్న ఆకారీ రూపధారీ సమీప ఆత్మలకు, ఇటువంటి సాకారీ, ఆకారీ ఆత్మలకు, సమ్ముఖంగా ఉపస్థితులై ఉన్న పిల్లలందరికీ బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
దీదీ-దాదీలతో:-
అందరూ పరమపూజ్యులే కదా! పూజ బాగా జరుగుతోంది కదా! బాప్దాదాలకు అనన్యులైన పిల్లలపై ఎంతో గర్వంగా ఉంటుంది. బాబాకు గర్వంగా ఉంటుంది మరియు పిల్లలలో రహస్యము ఉంది. ఎవరైతే రహస్యమును ఎరిగిన పిల్లలుగా ఉన్నారో వారిని చూసి తండ్రికి ఎప్పుడూ గర్వంగా ఉంటుంది. రహస్య యుక్తులు, యోగ యుక్తులు, గుణ యుక్తులు అన్నిం బ్యాలెన్స్ను ఉంచేవారు సదా బాబా యొక్క దీవెనల ఛాయలో ఉంటారు. దీవెనల వర్షము సదా కురుస్తూ ఉంటుంది. జన్మించడంతోనే ఈ దీవెనల వర్షము ప్రారంభమైంది మరియు అంతిమంవరకు ఇదే ఛత్రఛాయ లోపల స్వర్ణిమ పుష్పాల వర్షము కురుస్తూ ఉంటుంది. ఇదే ఛత్రఛాయలోపల నడిచారు, పాలింపబడ్డారు మరియు అంతిమంవరకు నడుస్తూ ఉంటారు. సదా దీవెనల యొక్క స్వర్ణిమ పుష్పాల వర్షమిది. ప్రతి అడుగులోను బాబా తోడుగా ఉన్నారు అనగా దీవెనలు తోడుగా ఉన్నాయి. ఇదే ఛాయలో మీరు సదా ఉన్నారు (దాదీతో). ప్రారంభం నుండి అలసట లేకుండా ఉన్నారు. అథక్ భవ అన్న వరదానము ఉంది కావున చేస్తూ కూడా చేయరు, ఇది చాలా బాగుంది. అయినా అవ్యక్తమయ్యే సమయంలో బాధ్యత యొక్క కిరీటమునైతే పెట్టుకున్నారు కదా! వీరికి (దీదీకి) సాకారునితోపాటు నేర్పించారు మరియు మీకు అవ్యక్తమయ్యే సమయంలో క్షణంలో నేర్పించారు. ఇరువురికీ తమ తమ రీతులలో నేర్పించారు. ఇది కూడా డ్రామాలోని పాత్రయే. అచ్ఛా!
వీడ్కోలు సమయంలో ఉదయం 6.30 గంటలకు
సంగమ యుగపు అన్ని ఘడియలు శుభోదయమే ఎందుకంటే పూర్తి సంగమ యుగమంతా అమృతవేళయే. చక్రము లెక్కలో చూస్తే సంగమ యుగము అమృతవేళయే అవుతుంది కదా! కావున సంగమ యుగపు అన్నివేళలు శుభోదయమే. కావున బాప్దాదా శుభోదయ సమయంలోనే వస్తారు అలాగే వెళ్ళేది కూడా శుభోదయ సమయంలోనే ఎందుకంటే తండ్రి వచ్చినప్పుడు రాత్రి అమృతవేళగా అయిపోయింది. కావున వారు వచ్చేది కూడా అమృతవేళలో మరియు ఎప్పుడైతే వెళతారో అప్పుడు పగలు వస్తుంది కాని ఉండేది అమృతవేళలోనే. పగలు వచ్చినప్పుడు వారు వెళ్ళిపోతారు మరియు మీరు ఉదయము అనగా సత్యయుగపు పగలు అనగా బ్రహ్మ పగలు, అందులో రాజ్యం చేస్తారు. బాబా అయితే అతీతంగా అయిపోతారు కదా! కావున పాత ప్రపంచపు లెక్కలో ఇది సదా గుడ్మార్నింగే. సదా శుభముగా ఉన్నారు మరియు సదా శుభముగా ఉంటారు. కావున శుభోదయము అని అనండి, శుభరాత్రి అని అనండి, శుభరోజు అని అనండి, అంతా శుభమే శుభము. కావున అందరికీ కలియుగపు లెక్కలో గుడ్మార్నింగ్ మరియు సంగమ యుగపు లెక్కలో గుడ్మార్నింగ్, కావున డబల్ గుడ్మార్నింగ్. అచ్ఛా!
Comments
Post a Comment