27-12-1983 అవ్యక్త మురళి

27-12-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బికారిగా కాదు, సదా అధికారిగా అవ్వండి.

                     అమరనాధుడైన శివబాబా స్వదర్శన చక్రధారి పిల్లలతో మట్లాడుతున్నారు- 
                     ఈరోజు విశ్వరచయిత బాబా విశ్వ పరిక్రమణ చేస్తూ కలుసుకునే స్థానంలోకి పిల్లల యొక్క ఆత్మిక సభలోకి చేరుకున్నారు. విశ్వ పరిక్రమణలో ఏమి చూశారు? దాత యొక్క పిల్లలు - సర్వాత్మలూ బికారిగా అయ్యి బిక్షం అడుగుతున్నారు. కొంతమంది రాయల్ బికారీలు, కొంతమంది సాధారణ బికారీలు. అందరి నోటిలో లేదా మనస్సులో ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి అనే మాటని వినిపిస్తుంది. కొంతమంది ధనానికి బికారీలు, కొంతమంది సహయోగానికి బికారీలు, కొంతమంది సంబంధాలకు బికారీలు, కొంతమంది విశ్రాంతి లేదా నిద్రకు బికారీలు, కొంతమంది యుక్తికి బికారీలు, కొంతమంది దర్శనానికి బికారీలు, కొంతమంది మృత్యువుకు బికారీలు, కొంతమంది శిష్యులకి బికారీలు. ఇలా అనేక రకాలుగా బాబాతో, మహాన్ ఆత్మలతో, దేవాత్మలతో మరియు సాకార సంబంధీకులతో ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని బిక్షం అడుగుతున్నారు. ఈ బికారీల ప్రపంచాన్ని చూసి స్వరాజ్యాధికారుల సభలోకి చేరుకున్నారు. అధికారి మరియు ఆధీనం. బికారీ ఆత్మలలో ఎంత తేడా ఉంది. బికారీల నుండి దాత పిల్లలుగా అయిపోయారు. అధికారులైన వారు ఇది ఇవ్వండి, అది ఇవ్వండి అంటూ సంకల్పంలో కూడా అడుక్కోరు. బికారీల మాట - “ఇవ్వండి”. అధికారుల మాట ఇవన్నీ అధికారం - ఇలా అధికారి ఆత్మగా అయిపోయారా. దాత అయిన శివబాబా అడగకుండానే అవినాశి ప్రాప్తి యొక్క అధికారం స్వతహాగానే ఇచ్చేశారు. మీరందరూ ఒకే మాటలో అన్నారు - సర్వఖజానాల సంసారం నీదే అని. ఒకే సంకల్పం లేదా మాట అధికారిగా చేయటానికి నిమిత్తం అయ్యింది. నాది మరియు నీది, ఈ రెండు మాటలే చక్రంలో చిక్కింపచేస్తాయి మరియు ఈ రెండు మాటలే వినాశీ దు:ఖమయ చక్రాల నుండి విడిపించి సర్వప్రాప్తులకి అధికారిగా చేస్తాయి. అనేక చక్రాలను వదిలి ఒకే స్వదర్శన చక్రం తీసుకున్నారు అంటే స్వదర్శనచక్రధారిగా అయిపోయారు. ఎప్పుడైనా ఏ రకమైన తనువు, మనస్సు, ధనం, జనం, సంబంధ సంప్రదింపుల చక్రంలో చిక్కుకుపోతున్నారంటే స్వదర్శన చక్రాన్ని వదిలేస్తున్నారు. స్వదర్శనచక్రాన్ని సదా ఒకే వ్రేలుపై చూపిస్తారు. అయిదు వ్రేళ్ళు లేదా రెండు వ్రేళ్ళు చూపించరు. ఒకే వ్రేలు అంటే ఒకే సంకల్పం - "నేను బాబా వాడిని, బాబా నా వాడు" అని ఈ ఒకే సంకల్పం అనే ఒకే వ్రేలు పైనే స్వదర్శన చక్రం తిరుగుతుంది. ఒకటిని వదిలి అనేక సంకల్పాలలోకి వెళ్ళిపోతున్నారు. అనేక చక్రాలలో చిక్కుకునిపోతున్నారు. స్వదర్శన చక్రధారి అంటే స్వయం యొక్క దర్శనం చేసుకోవటం మరియు సదాకాలికంగా ప్రసన్నచిత్తంగా ఉండటం. ప్రసన్నచిత్తులు అంటే ఏ ప్రశ్న ఉండదు. సదా స్వదర్శనం ద్వారా ప్రసన్నచిత్తంగా అంటే సర్వప్రాప్తులకి అధికారిగా ఉంటారు. స్వప్నంలో కూడా బాబా ముందు బికారీ రూపం ఉండదు. ఈ పని చేయి లేదా చేయించు, ఈ అనుభవం చేయించు, ఈ విఘ్నం తొలగించు అని. మాస్టర్ దాతల సభలో ఏ అప్రాప్తి అయినా ఉంటుందా? అవినాశి స్వరాజ్యం. ఈ రాజ్యంలో సర్వఖజానాల భండారా నిండుగా ఉంటుంది. నిండు భండారంలో ఏదైనా తక్కువగా ఉంటుందా? స్వతహాగానే అడగకుండానే అవినాశి మరియు ఇచ్చేటటువంటి దాత. వారికి చెప్పవలసిన పని లేదు. మీరు సంకల్పంలో ఆలోచించగానే కోటిరెట్లు ఎక్కువ బాబా స్వతహాగానే ఇస్తారు. సంకల్పంలో కూడా ఈ బికారీ స్థితి ఉండకూడదు. అటువంటి వారిని అధికారి అంటారు. ఇటువంటి అధికారిగా అయ్యారా? అన్నీ పొందాము అనే పాట పాడుతున్నారు కదా! లేక ఇప్పుడు ఇది పొందాలి, పొందాలి అనే ఫిర్యాదులు ఈ పాట పాడుతున్నారా? ఎక్కడ స్మృతి ఉంటుందో అక్కడ ఫిర్యాదులు ఉండవు. ఎక్కుడ ఫిర్యాదులు ఉంటాయో అక్కడ స్మృతి ఉండదు. అర్ధమైందా! 
                     ఒకొక్కసారి రాజ్య అధికారి స్థితి అనే దుస్తులు తీసేసి అడుక్కునే బికారీ స్థితి అనే పాత దుస్తులు ధరిస్తున్నారా?సంస్కారాల రూపి పెట్టెలో దాచి ఉంచటం లేదు కదా? పెట్టెతో పాటూ స్థితి అనే దుస్తులను కూడా కాల్చేశారా లేక జేబు ఖర్చు కోసం దాచి ఉంచుకోవటం లేదు కదా! సంస్కారంలో కూడా అంశమాత్రంగా కూడా ఉండకూడదు. లేకపోతే రెండు రంగులు కలవారిగా అయిపోతారు. ఒక్కొక్కసారి బికారి, ఒక్కొక్కసారి అధికారి. అందువలన సదా ఒకే శ్రేష్ట రంగులో ఉండండి. పంజాబ్ వారు రంగు వేసుకోవటంలో తెలివైనవారు కదా. పచ్చిరంగు గలవారు కాదు కదా! రాజస్థాన్ వారు రాజ్యాధికారులు కదా! ఆధీనత సంస్కారం గలవారు కాదు. సదా రాజ్యాధికారులు. మూడవవారు ఇండోర్ అంటే సదా మాయ ప్రభావంతో అతీతంగా ఇండోర్. అంటే లోపల సదా బాబా యొక్క ఛత్రఛాయలో ఉండేవారు. వారు కూడా మాయాజీత్ గానే అయిపోయారు కదా. నాల్గవ గ్రూపు మహారాష్ట్ర అంటే మహాన్ ఆత్మ అన్నింటిలో మహాన్. సంకల్పం, మాట, కర్మ మూడింటిలో మహాన్. మహాన్ ఆత్మలు అంటే సంపన్న ఆత్మలు. నలువైపుల నాలుగు నదులూ కలిసినవి. కానీ అందరూ సర్వప్రాప్తి స్వరూపానికి అధికారులే కదా! నలుగురి మధ్యలో అయిదవ వారు డబల్ విదేశీయులు. అయిదు నదుల యొక్క కలయిక. ఎక్కడ? మధువనం యొక్క ఒడ్డున. నదులు మరియు సాగరం యొక్క కలయిక మంచిది.
              సదా స్వరాజ్యాధికారులకి, స్వదర్శన చక్రధారులకి, సదా ప్రసన్న చిత్రంగా ఉండేవారికి, సర్వఖజానాలతో నిండుగా ఉండే , మహాన్ ఆత్మలకు, బికారీ స్థితి స్వప్నంలో కూడా సమాప్తి చేసేవారికి, దాత యొక్క సంపన్న పిల్లలకు, అవినాశి బాప్ దాదా యొక్క అమరభవ యొక్క సదా సంపన్న స్వరూపాలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments