27-04-1983 అవ్యక్త మురళి

27-04-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

దృష్టి మరియు వృత్తిని పరివర్తన చేసుకునే యుక్తులు

కుమారుల భట్టీలో ప్రాణ అవ్యక్త బాప్ దాదా మాట్లాడిన మహావాక్యాలు -- 

  ఈరోజు బాప్దాదా సర్వ పురుషార్థుల సంగటనను చూస్తున్నారు. ఈ పురుషార్థపు శబ్దంలోనే మొత్తం జ్ఞానమంతా ఇమిడి ఉంది. పురుషార్థము అనగా పురుష ప్లస్ రథి, ఎవరి రథి? ఎవరీ పురుషుడు? ఈ ప్రకృతికి యజమాని అనగా రథమునకు సారథి. ఈ ఒక్క పదము యొక్క అర్థ స్వరూపంలో స్థితులైనట్లయితే ఏమౌతుంది? సర్వ బలహీనతల నుండి సహజంగానే దూరమైపోతారు. పురుషుడు ప్రకృతికి అధికారియే కాని ఆధీనము కాదు. రధి అనగా రథమును నడిపించేవాడే కాని రథమునకు ఆధీనమై నడిచేవాడు కాదు. అధికారి సదా సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క సర్వశక్తుల అధికారి అనగా వారసత్వమునకు అధికారి లేక హక్కుదారుడు. సర్వశక్తులు తండ్రి యొక్క ఆస్తి మరియు ఆ ఆస్తికి పిల్లలు ప్రతిఒక్కరూ అధికారులే. ఈ సర్వశక్తుల రాజ్యభాగ్యమును బాప్దాదా సర్వులకు జన్మసిద్ధ అధికారం రూపంలో ఇస్తారు. జన్మించడంతోనే సర్వశక్తుల యొక్క ఈ స్వరాజ్యమును, అధికారీ స్వరూపం యొక్క స్మృతి తిలకమును మరియు బాబా స్నేహంలో ఇమిడిపోయి ఉన్న స్వరూపంలో హృదయ సింహాసనమును జన్మించడంతోనే అందరికీ ఇచ్చారు. జన్మించడంతోనే విశ్వకళ్యాణ సేవ యొక్క కిరీటమును పిల్లలు ప్రతిఒక్కరికీ ఇచ్చారు. కావున జన్మ అధికారము యొక్క ఆసనము, తిలకము, కిరీటము మరియు రాజ్యము అందరికీ ప్రాప్తించింది కదా! ఈవిధంగా నాలుగు ప్రాప్తుల యొక్క ప్రాప్తీస్వరూపమైన ఆత్మలు బలహీనులుగా అవ్వగలరా? ఈ నాలుగు ప్రాప్తులను మీరు సంభాళించలేరా? ఒక్కోసారి తిలకము చెరిగిపోతుంది మరోసారి సింహాసనమును దిగిపోతారు, మరోసారి కిరీనికి బదులుగా భారమును పైకెత్తుకుటాంరు. వ్యర్ధమైన విలువలేని విషయాల తట్టను తమపైకి ఎత్తుకుటాంరు. పేరు స్వరాజ్యము అని ఉంది కాని స్వయమే రాజుగా అవ్వడానికి బదులుగా ఆధీనులైన ప్రజలుగా అయిపోతారు. ఇటువంటి ఆటను మీరు ఎందుకు ఆడుతున్నారు? ఇటువంటి ఆటనే ఆడుతున్నట్లయితే సదాకాలిక రాజ్యభాగ్యపు అధికారపు సంస్కారమును ఎప్పుడు అవినాశిగా చేసుకుటాంరు? ఇదే ఆటలో నడుస్తూ ఉన్నట్లయితే ప్రాప్తి ఏమి లభిస్తుంది? ఎవరైతే తమ ఆది సంస్కారాలను అవినాశిగా చేసుకోలేరో వారు ఆదికాలపు రాజ్య అధికారులుగా ఎలా అవుతారు? చాలాకాలం యోధులుగా ఉండే సంస్కారమే ఉంటే అనగా యుద్ధం చేస్తూ చేస్తూ సమయాన్ని గడిపితే, నేడు విజయము రేపు ఓటమి అన్నట్లుగా ఉంటే ఇప్పుడిప్పుడే విజయము, ఇప్పుడిప్పుడే ఓటమి ఉంటే, సదాకాలిక విజయత్వపు సంస్కారాలు లేకపోతే వారిని క్షత్రియులు అని అంటారా లేక బ్రాహ్మణులు అని అంటారా? బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. క్షత్రియులు మళ్ళీ వెళ్ళి క్షత్రియులుగానే అవుతారు. చూడండి, దేవతల చిహ్నానికి, క్షత్రియుల చిహ్నానికి తేడా ఉంది కదా! స్మృతిచిహ్న చిత్రాలను వాటిని సమానంగా చూపించారు. వారికి మురళిని చూపించారు. మురళి ఉన్నవారు అనగా మాస్టర్ మురళీధరులుగా అయి వికారాలరూపీ సర్పాలను విషమయంగా చేసేందుకు బదులుగా విషమును సమాప్తంచేసి శయ్యగా చేసేసారు. విషము ఉన్న సర్పము ఎక్కడ మరియు శేషశయ్య ఎక్కడ? ఇంతి పరివర్తనను దేనిద్వారా చేసారు? మురళి ద్వారా. ఇటువంటి పరివర్తనను చేసేవారినే విజయీ బ్రాహ్మణులు అని అంటారు కావున నేను ఎవరిని అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

అందరూ తమ తమ బలహీనతలను సత్యతతో స్పష్టం చేసారు. ఆ సత్యత యొక్క మార్కులైతే లభించేస్తాయి. కాని ఇప్పటివరకు తమ సంస్కారాలను పరివర్తనచేసే శక్తి రాలేదు, మరి విశ్వపరివర్తకులుగా ఎప్పుడు అవుతారు అని బాప్దాదా గమనిస్తున్నారు. ఇప్పుడు ఇక దృష్టి పరివర్తన, వృత్తి పరివర్తన... వీటిని ఎప్పుడు అవినాశిగా చేస్తారు? మీరు ఒక ద్రష్ట అనగా దృష్టి ద్వారా చూసే ద్రష్టలు. మరి దృష్టిని ఎందుకు విచలితం చేసుకుటాంరు? మీరు దివ్యనేత్రం ద్వారా చూస్తున్నారా లేక ఈ చర్మచకక్షువుల ద్వారా చూస్తున్నారా? దివ్యనేత్రం ద్వారా సదా స్వతహాగానే దివ్యస్వరూపమే కనిపిస్తుంది. చర్మచకక్షువులు చర్మమునే చూస్తాయి. చర్మమును చూడడం, చర్మమును గురించి ఆలోచించడం ఇది ఎవరి పని? ఫరిస్తాల పనా? బ్రాహ్మణుల పనా? స్వరాజ్య అధికారుల పనా? మరి మీరు బ్రాహ్మణులా లేక మరెవరైనానా? మీ పేరు చెప్పాలా?

ఎల్లప్పుడు ప్రతిఒక్క నారీ శరీరధారీ ఆత్మను శక్తిస్వరూపంగా, జగన్మాత రూపంలో, దేవీరూపంలో చూడడం- ఇదే దివ్యనేత్రం ద్వారా చూడడం. కుమారీ, మాత, సహోదరి, సేవాధారి, నిమిత్త శిక్షకులు... కాని ఎవరు? శక్తిస్వరూపులు. సోదరీ సోదరుల సంబంధంలో కూడా అప్పుడప్పుడు వృత్తి మరియు దృష్టి చంచలమైపోతుంది. కావున సదా శక్తిస్వరూపంగా, శివశక్తులుగా చూడండి. శక్తుల ముందుకు ఎవరైనా అసురీ వృత్తితో వస్తే వారి పరిస్థితి ఏమౌతుంది? అదైతే తెలుసు కదా! వారు మన టీచర్ కాదు, శివశక్తి. ఈశ్వరీయ సహోదరి అన్నదానికన్నా పైన శివశక్తీరూపంలో చూడండి. మాతలు లేక అక్కయ్యలు కూడా సదా తమ శివశక్తీ స్వరూపంలో స్థితులై ఉండాలి. వీరు మా విశేష సహోదరులు, విశేష విద్యార్థులు అని భావించకూడదు. వారు శివశక్తి స్వరూపులు మరియు మీరు మహావీరులు. లంకను తగులబెట్టేవారు... మొదట స్వయములోపల ఉన్న రావణ వంశమును తగులబ్టెటాలి. మహావీరుల విశేషతను ఎలా చూపిస్తారు? వారు సదా హృదయంలో ఎవరిని చూపిస్తారు? ఒక్క రాముడు తప్ప మరెవ్వరూ లేరు. చిత్రమును చూసారు కదా! కావున ప్రతి సహోదరులు మహావీరులే, ప్రతి సహోదరీ శక్తిస్వరూపమే. మహావీరులు కూడా రామునికి చెందినవారే, శక్తులు కూడా శివునికి చెందినవారే. ఏ దేహధారిని చూసినా సదా మస్తకంవైపుకు ఆత్మను చూడండి ఆత్మతో మాట్లాడాలా లేక శరీరంతో మాట్లాడాలా? కార్యవ్యవహారంలో ఆత్మ కార్యం చేస్తుందా లేక శరీరం చేస్తుందా? సదా ప్రతిక్షణము శరీరంలో ఆత్మను చూడండి! మీ దృష్టియే మస్తకమణివైపుకు వెళ్ళాలి. అప్పుడు ఏమౌతుంది? ఆత్మ ఆత్మను చూస్తూ స్వతహాగానే ఆత్మాభిమానిగా అయిపోతుంది. ఇదైతే మొదటిపాఠమే కదా! మొదటి పాఠమునే పక్కా చేయకపోతే, మొదటి పాఠమునే పక్కా చేసుకోకపోతే రెండవ విషయమైన రాజ్యాధికారము ఎలా లభించగలదు. కేవలం ఒక్క విషయంలో సదా అప్రమత్తంగా ఉండండి. ఏమి చేసినా అది శ్రేష్ఠ కర్మగా ఉండాలి లేక శ్రేష్ఠంగా అవ్వాలి కావున ప్రతి విషయంలోను దృఢ సంకల్పధారులుగా అవ్వండి. ఏమి సహించవలసి వచ్చినా, దేనిని ఎదుర్కోవలసివచ్చినా కాని శ్రేష్ఠ కర్మలు, శ్రేష్ఠ పరివర్తన చేసితీరవలసిందే. ఈ విషయంలో పురుషార్థము అన్న పదమును నిర్లక్ష్యంగా ఉపయోగించకండి. మేము పురుషార్థులము, నడుస్తూనే ఉన్నాము, చేస్తున్నాము కదా, చేయనైతే చేయాలి... ఇదంతా నిర్లక్షపు భాష. అదే సమయంలో పురుషార్థము అన్న పదమును నిర్లక్ష్యంగా ఉపయోగించకండి. మేము పురుషార్థులము, నడుస్తూనే ఉన్నాము, చేస్తున్నాము కదా, చేయనైతే చేయాలి... ఇదంతా నిర్లక్షపు భాష. అదే ఘడియలో పురుషార్థము అన్న పదము యొక్క అర్థ స్వరూపంలో స్థితులైపోండి. నేను పురుషుడిని, ప్రకృతి నన్ను మోసగించజాలదు. ఈ అన్నిరకాల బలహీనతలు నిర్లక్ష్యానికి చిహ్నాలు. మహావీరులు పర్వతాన్ని కూడా క్షణంలో అరచేతిపై పెట్టుకొని ఎగురగలరు అనగా పర్వతాన్ని కూడా నీటి సమానంగా తేలికగా చేసేస్తారు. ఇక చిన్న చిన్న పరిస్థితులు ఏమంత పెద్ద విషయాలు! అలా ఇటువంటి మహావీరుడ్ని చీమలను చూసి భయపడేవారు అని అనవచ్చా! ఏం చేయాలి, అయిపోతుంది... ఇవి మహావీరుని మాటలా? వివేకవంతులు ఏం చేయాలి, దొంగలొస్తున్నారు... అని ఎప్పుడూ అనలేరు. తెలివైనవారు పదే పదే మోసపోరు. నిర్లక్ష్యంగా ఉన్నవారు పదే పదే మోసపోతారు. సేఫ్టీ సాధనాలు ఉంటూ కూడా వాటిని కర్మలో వినియోగించకపోతే వాటిని ఏమంటారు? ఇది జరగకూడదు అని నాకు తెలుసు కాని జరుగుతోంది అని అంటే దీన్ని ఎటువంటి వివేకము అని అంటారు.

దృఢసంకల్పం చేసేవారిగా అవ్వండి. పరివర్తన చేసి తీరాల్సిందే. రేపు కూడా కాదు ఈరోజు. ఈరోజు కూడా కాదు ఇప్పుడే. అటువంటివారినే మహావీరులు, రాముని ఆజ్ఞాకారులు అని అంటారు. ఈరోజు కలుసుకునే రోజు. అయినా పిల్లలు కష్టపడ్డారు కాబ్టి శ్రమకు ఫలంగా బదులు ఇవ్వవలసి వచ్చింది. కాని, ఈ బలహీనతలను తోడుగా తీసుకువెళ్ళాలా? ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోకూడదు కదా! బలవంతంగా వచ్చేసినా రానివ్వకూడదు. శత్రువును ఎక్కడైనా రానిస్తారా? అటెన్షన్, చెకింగ్, ఇది డబల్ లాక్. స్మృతి మరియు సేవ రెండవ డబల్ లాక్. ఇవి అందరివద్దా ఉన్నాయి కదా! కావున సదా ఈ డబల్ లాక్ వేయబడి ఉండాలి. రెండువైపులా లాక్ వేయండి, అర్థమైందా? ఒకవైపు వేయడం కాదు. స్థూలంగా మరియు సూక్ష్మంగా ఎంతో పాలన ఇవ్వడం జరిగింది. డబల్ పాలన ఇవ్వడం జరిగింది కదా! ఏ విధంగా దీదీ, దాదీ లేక నిమిత్తమై ఉన్న ఆత్మలు హృదయపూర్వకంగా పాలన చేసారో దానికి ప్రతిఫలంగా అందరూ దీదీ దాదీలకు కూడా ప్రతిఫలాన్ని ఇచ్చి వెళ్ళండి... మేము ఇప్పటినుండి సదాకాలికంగా విజయులుగా ఉంటాము అని కేవలం నోటిద్వారా కాదు మనస్సుతో చెప్పండి. ఆ తరువాత ఒక నెల తరువాత ఈ ఫొటోలో ఉన్నవారిని, వీరు ఏం చేస్తున్నారు అని గమనిద్దాం. మీరు ఎవరినుండి దాచినా కాని బాబా నుండి అయితే దాచలేరు. అచ్ఛా!

సదా దృఢ సంకల్పం ద్వారా ఆలోచించడమును మరియు చేయడమును సమానం చేసేవారికి, సదా దివ్యనేత్రం ద్వారా ఆత్మిక రూపమును చూసేవారిక,టి ఎక్కడ చూసినా ఆత్మయే ఆత్మగా చూసే ఇటువంటి అర్థ స్వరూపులైన పురుషార్థీ ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

Comments