24-04-1984 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
వర్తమాన బ్రాహ్మణ జన్మ- వజ్రసమానమైనది.
శ్రేష్ట స్వమానంలో స్థితులు చేసేటువంటి, రాజ్యభాగ్యాధికారి పిల్లలతో బాప్ దాదా మాట్లాడుతున్నారు-
ఈ రోజు బాప్ దాదా తన యొక్క సర్వశ్రేష్ట పిల్లలను చూస్తున్నారు. విశ్వం యొక్క తమోగుణి అపవిత్ర ఆత్మల తేడాతో చూస్తే ఎంత శ్రేష్టాత్మలు! ప్రపంచంలో సర్వాత్మలు పిలిచేవారు, భ్రమించేవారు, అప్రాప్తి ఆత్మలు. ఎంతగా వినాశి సర్వప్రాప్తులు ఉన్నప్పటికీ కూడా ఏదోక అప్రాప్తి తప్పకుండా ఉంటుంది. బ్రాహ్మణ పిల్లలైన మీకు, సర్వప్రాప్తుల దాత అయిన పిల్లలకు అప్రాప్తి వస్తువనేది ఏదీ ఉండదు. అల్పకాలిక సుఖ సాధనాలు, అల్పకాలిక వైభవాలు, అల్పకాలిక రాజ్యాధికారిగా లేనప్పటికీ కూడా గుడ్డిగవ్వ నుండి చక్రవర్తిగా ఉంటున్నారు. నిశ్చింత చక్రవర్తులు, మాయాజీత్, ప్రకృతిజీత్ స్వరాజ్యధికారులు. సదా ఈశ్వరీయ పాలనలో పాలింపబడే సంతోషం యొక్క ఊయలలో, అతీంద్రియ సుఖం యొక్క ఊయలలో ఊగేవారు, వినాశి ధనవంతులకు బదులు అవినాశి ధనవంతులుగా ఉన్నారు. రత్నజడిత కిరీటం లేదు కానీ పరమాత్మ బాబా యొక్క శిరోకిరీటాలు. రత్నజడిత శృంగారం లేదు, కానీ జ్ఞానరత్నాలతో, గుణాలరూపి రత్నాలతో, శృంగారంతో సదా శృంగారించబడి ఉన్నారు. ఎంత వినాశి సర్వశ్రేష్ట వజ్రాలైనా, ఎంత విలువైనవి అయినా కానీ ఒక్కొక్క జ్ఞానరత్నం, గుణరత్నం ముందు వాటి విలువ ఏముంటుంది? ఈ రత్నాల ముందు అవి రాయితో సమానం. ఎందుకంటే వినాశి. మీరు స్వయం బాబా యొక్క కంఠహారంగా అయ్యారు. ప్రభు కంఠహారం ముందు 9 లక్షల మాల అనండి లేదా 9 కోట్ల మాల అనండి దాని ముందు ఎంత విలువైన మాల అయినా కానీ ఏమీ కాదు. 36 రకాల భోజనం కూడా బ్రహ్మాభోజనం ముందు తక్కువే. ఎందుకంటే స్వయంగా బాప్ దాదాకి నైవేద్యం పెట్టి ఈ భోజనాన్ని పరమాత్మ ప్రసాదంగా తయారుచేసుకుంటున్నారు. ప్రసాదానికి ఈ అంతిమ జన్మలో కూడా భక్తాత్మలు ఎంతటి ఇవిలువ ఇస్తారు? మీరు సాధారణ భోజనం తినటం లేదు, ప్రభు ప్రసాదాన్ని తింటున్నారు. ఒక్కొక్క గింజ కోటానుకోట్ల కంటే శ్రేష్టమైనది. ఇటువంటి సర్వ శ్రేష్టాత్మలు. ఈవిధమైన ఆత్మిక శ్రేష్ట నషా ఉంటుందా? నడుస్తూ, నడుస్తూ మీ శ్రేష్టతను మర్చిపోవటం లేదు కదా? స్వయాన్ని సాధారణంగా భావించటం లేదు కదా? కేవలం వినేవారు లేదా వినిపించేవారిగా అయితే లేరు కదా! స్వమానం కలిగిన వారిగా అయ్యారా? వినేవారు, వినిపించేవారైతే చాలా మంది ఉన్నారు. స్వమానంలో ఉండేవారు కోట్లలో కొద్దిమందే ఉన్నారు. మీరెవరు? అనేకమందిలో ఉన్నారా లేదా కోట్లలో కొద్దిమంది వారిలో ఉన్నారా! ప్రాప్తి సమయంలో సోమరిగా అయ్యేవారిని బాప్ దాదా ఏ తెలివిగల పిల్లలు అని అంటారు? పొందిన భాగ్యాన్ని, లభించిన భాగ్యాన్ని అనుభవం చేసుకోలేదు అంటే ఇప్పుడు మహాన్ భాగ్యవంతులుగా కాకపోతే ఇంకెప్పుడు అవుతారు? ఈ శ్రేష్ట ప్రాప్తి యొక్క సంగమయుగంలో ప్రతి అడుగులో ఇదే సూక్తి సదా స్మృతి ఉంచుకోండి - ఇప్పుడు లేకున్నా, మరెప్పుడు లేదు. అర్థమైందా! మంచిది.
తమ యొక్క శ్రేష్ఠ స్వమానంలో స్థితులై ఉండేవారికి, సర్వప్రాప్తుల యొక్క బండారా, సదా సంగమయుగీ శ్రేష్ట స్వరాజ్యం మరియు మహాన్ భాగ్యం యొక్క అధికారి ఆత్మలకు, సదా ఆత్మికనషా మరియు సంతోష స్వరూపంగా ఉండే ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
Comments
Post a Comment