11-05-1983 అవ్యక్త మురళి

11-05-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

'హే యువకులారా విశ్వపరివర్తనా కార్యంలో నిమిత్తులుగా అవ్వండి'

ఈరోజు బాప్దాదా హంస ఆసనధారులైన హోలీ హంసల సభను చూస్తున్నారు. ప్రతిఒక్క శ్రేష్ఠ ఆత్మ హోలీ హంసగా సదా ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న ఇదే లగనంతో మగనమై ఉన్న ఆత్మలుగా ఉన్నారు, ఇదే స్థితి హంస ఆసనము. ఇటువంటి హోలీ హంసలను చూసి బాప్దాదా కూడా హర్షితులవుతారు. ప్రతి హోలీ హంస జ్ఞానీ ఆత్మ, యోగీ ఆత్మ, విశ్వకళ్యాణకారి. ప్రతిఒక్కరి హృదయంలో హృదయాభిరాముడైన బాబా యొక్క స్మృతి ఇమిడి ఉంది. ప్రతిఒక్కరూ తమ వర్తమానము మరియు భవిష్యత్తును తెలుసుకోవడంలో ఎంతో లగనంతో నిమగ్నమై ఉన్నారు. ఇటువంటి శ్రేష్ఠ సంఘటన మొత్తం కల్పంలో సంగమయుగంలో తప్ప ఇంకెప్పుడూ చూడలేరు. ఒకే పరివారము, ఒకే లగనము, ఒకే లక్ష్యము ఇలా ఇంకెప్పుడైనా చూస్తారా? బాప్దాదాకు కూడా పిల్లలపై గౌరవం ఉంది. ఇంత పెద్ద పరివారము లేక సంఘటన మరియు ప్రతిఒక్కరూ శ్రేష్ఠమైన తండ్రికి పిల్లలైన కారణంగా బాబా యొక్క వారసత్వానికి అధికారులు. కావున ఇంత అధికారీ పిల్లలందరినీ చూసి బాబాకు కూడా సంతోషం కలుగుతుంది. ఈ పిల్లలు ఒక్కొక్కరూ కులదీపకులు, విశ్వపరివర్తనా కార్యానికి నిమిత్త ఆత్మలు. ప్రతిఒక్క ప్రకాశిస్తున్న సితార విశ్వానికి ప్రకాశమునిస్తుంది. ప్రతిఒక్కరి భాగ్యపు అవినాశీ రేఖ మస్తకంపై కనిపిస్తోంది. ఇటువంటి శ్రేష్ఠ సంఘటన విశ్వంలో ఒకే మతము, ఒకే రాజ్యము, ఒకే ధర్మస్థాపనను చేసే దృఢసంకల్పధారులుగా ఉన్నారు. బాప్దాదా యువ వర్గమును చూస్తున్నారు, వారు కుమారులైనా, కుమారీలైనాగానీ ప్రతిఒక్కరి మనస్సులో మేమందరము మా విశ్వమును లేక దేశమును లేక సుఖశాంతులకొరకు భ్రమిస్తున్న ఆత్మలకు అనగా మా సోదరీ సోదరులకు సుఖశాంతుల అధికారమును తప్పకుండా ఇప్పిస్తాము అన్న ఉల్లాస ఉత్సాహాలు ప్రతిఒక్కరిలోను ఉన్నాయి. మన విశ్వాన్ని మళ్ళీ సుఖశాంతిమయమైన ప్రపంచంగా తయారుచేస్తాము అన్న దృఢసంకల్పమే ఉంది కదా! ఇంత పెద్ద సంఘటన చేయలేనిదేముంటుంది? ఒకటేమో- శ్రేష్ఠ ఆత్మలు, పవిత్ర ఆత్మలు. కావున పవిత్రతా శక్తి ఉంది. రెండవది- మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉన్న కారణంగా సర్వశక్తులు తోడుగా ఉన్నాయి. సంఘటన యొక్క శక్తి ఉంది, దానితోపాటు త్రికాలదర్శులుగా ఉన్న కారణంగా అనేకసార్లు మనం విశ్వపరివర్తకులుగా ఉన్నాము. కావున కల్పకల్పపు విజయులుగా ఉన్న కారణంగా ఇప్పుడు కూడా విశ్వపరివర్తనా కార్యంలో విజయము నిశ్చితమై ఉంది. అవుతామా, అవ్వమా అన్న ప్రశ్నే లేదు, నిశ్చయబుద్ధీ విజయులము. సుఖమయమైన ప్రపంచము ఇప్పుడిక వచ్చేస్తుంది అన్నది అనుభవము చేసుకుంటారు కదా! విశ్వపు యజమానులకు విశ్వరాజ్యము నిశ్చితముగానే ప్రాప్తమై ఉంది. యువవర్గమువారు ఏంచేస్తారు? తమ దేశము లేక విశ్వపు రాజనేతలకు ఈ శుభవార్తను వినిపించండి. ఏ విషయమును గూర్చైతే మీరు స్వప్నాలు చూస్తున్నారో, ఇలా జరగాలి అన్న ఆ కోరికను మేము పూర్తిచేసి చూపిస్తాము అని అనాలి. దేశం నుండి కేవలం ధరలనే కాదు మేము డబల్ ధరలను అంతంచేసి చూపిస్తాము, ఎందుకంటే ధరలు పెరిగిపోవడానికి కారణం చరిత్ర ఖరీదైపోవడం. ఎప్పుడైతే సఛ్చరిత్ర యొక్క ఖరీదు, ఆ చరిత్ర యొక్క దు:ఖము, అశాంతి యొక్క పేదరికము అంతమైపోతుందో అప్పుడు స్వతహాగానే సర్వఆత్మలు ధనవంతులుగానే కాదు రాజ్య అధికారులుగా కూడా అయిపోతారు. ఈ శుభ ఆశలనే విశ్వంలోనే నిమిత్త ఆత్మలు పూర్ణంచేసి చూపించాలి. మా దేశమును శ్రేష్టంగా చేసి చూపిస్తాము, ఎంత సుసంపన్నంగా చేస్తామంటే ఎటువంటి అప్రాప్తి ఉండదు అలాగే అప్రాప్తి కారణంగా ఎటువంటి సమస్యలూ ఉండవు. ఇదే దృఢ సంకల్పమును అందరికీ వినిపించడమే కాదు పరివర్తన యొక్క శాంపిల్గా అయి చూపించండి. ఎందుకంటే అన్నివైపుల నుండి విశ్వాసమును కలిగించే నినాదాలను అందరూ ఎన్నో విన్నారు. ఎంతగా విన్నారంటే, అది విని, విశ్వాసమే పోయింది అని అనేవారు, ఎన్నో చూసి చూసి సత్యమును చూసి మోసంగా భావిస్తున్నారు కావున కేవలం చెప్పడమే కాదు- నోరు కూడా మాట్లాడకూడదు, మీ జీవితం యొక్క శ్రేష్ఠత మాట్లాడాలి. శ్రేష్ఠ ఆత్మలైన మీ ఒక్కొక్కరి పవిత్రత యొక్క ప్రకాశము నడవడిక ద్వారా కనిపించాలి. మీ అందరి శ్రేష్ఠ స్మృతి యొక్క సమర్ధత నిరుత్సాహ ఆత్మలలో ఆశ యొక్క సమర్ధతను ఉత్పన్నం చేయాలి. యువవర్గంవారు ఏంచేయాలో అర్ధమైందా?

ఈనాటి నేతలు యువవర్గంవారి వినాశకారీ కర్తవ్యాల కారణంగా భయపడతారు. కావున విశ్వకళ్యాణకారులైన మీరందరూ- ఈ దేశానికి చెందిన యువవర్గంవారంతా మన భారతదేశమును విశ్వం యొక్క సర్వశ్రేష్ఠ స్వర్గస్థానంగా తయారుచేస,టి భారతదేశమే ప్రాచీన అవినాశీ సర్వసంపన్న సర్వశ్రేష్ఠ దేశము అన్నది విశ్వానికి నిరూపించి చూపించండి. భారతదేము విశ్వముకొరకు ఆధ్యాత్మిక ప్రకాశమునిచ్చే ప్రకాశ స్తంభము, ఎందుకంటే ఈ శ్రేష్ఠ కర్తవ్యమును చేయించేవారు ఎవరు అన్నది గుర్తించినట్లయితే ఇక ఎటువంటి ప్రశ్న ఉత్పన్నమయ్యే మాటేలేదు. మీ జీవితంతో, కర్తవ్యంతో బాబా పరిచయమును చేయించండి. ఇంత ధైర్యము ఉంది కదా! కుమారీలు ఏం భావిస్తున్నారు? దుర్గా పూజ చేసేటప్పుడు తమను భాగ్యవంతులుగా భావిస్తారు. ఇక్కడ ఎంతమంది దుర్గలు ఉన్నారు! శివశక్తులు ఒక్కొక్కరూ అద్భుతమును చేసి చూపించేవారే కదా! ఏ శక్తులనైతే ఇంటింటిలోను పూజిస్తారో వారు మీరే కదా! కావున హే శివశక్తులారా మీ భక్తులకు ఫలమునైతే ఇవ్వండి. పాపంవారు ఫలాలను సమర్పిస్తూ సమర్పిస్తూ అలసిపోయారు. ఇన్ని ఫలాలనేవైతే నివేదించారో దానికి రిటర్న్గా భక్తి యొక్క ఫలమునైతే వారికి ఇవ్వాలి కదా! భక్తులకు దయ కలగడంలేదా. పాండవుల పూజ కూడా జరుగుతోంది. ఈరోజుల్లో మహావీరుడైన హనుమంతుడి పూజ ఎంతగానో జరుగుతుంది, అలాగే విఘ్నవినాశకుడైన వినాయకుడి పూజ కూడా జరుగుతుంది. అందరూ శక్తి లభించాలనే కోరికతోనే భక్తి చేస్తున్నారు. ఇటువంటి భక్త ఆత్మలకు సర్వశక్తుల ఫలమును ఇవ్వండి. సదాకాలికంగా విఘ్నాల నుండి అతీతంగా ఉండే సహజ మార్గమును తెలియజేయండి. అన్ని ఆర్తనాదాల నుండి విడిపించి ప్రాప్తీస్వరూపులుగా తయారుచేయండి. ఇటువంటి సేవను యువవర్గంవారు చేసి చూపించండి. అర్ధమైందా? అచ్ఛా!

సదా తమ శ్రేష్ఠ జీవితం ద్వారా అనేకుల జీవితమును తయారుచేసే, సర్వ భారతవాసీయుల శ్రేష్ఠ సుఖమయ ప్రపంచపు శుభకామనను పూర్ణంచేసే, ఇంటి ఇంటిలోను శ్రేష్ఠ చరిత్ర యొక్క దీపమును వెలిగించే, సదా అప్రాప్తి ఆత్మలకు ప్రాప్తిని కలిగించే ఇటువంటి దృఢ సంకల్పధారీ నిశ్చిత విజయీ శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

కుమారులపై బాప్దాదాకు సదా ఎన్నో ఆశలు ఉన్నాయి. కుమారులు విశ్వమును మార్చగలరు. కుమారులందరూ దృఢసంకల్పధారులుగా అయి ముందుకువెళుతూ ఉన్నట్లయితే ఎంతో అద్భుతమును చేయగలుగుతారు. మీరు అద్భుతమును చేసే కుమారులే కదా! చూడండి, బాప్దాదా వద్ద ఆోమాటిక్గా ఫొటో వెలువడుతుంది. మీరు దృఢసంకల్పముగల కుమారులే కదా! కుమారులలో శారీరక శక్తి కూడా ఎంతో ఉంది కావున డబల్ కార్యమును చేయగలుగుతారు. కావున స్థాపనా కార్యంలో చాలా మంచి సహయోగులుగా అవ్వగలరు. కుమారుల బుద్ధిలో నా బాబా, నా సేవ అన్నదే ఉంటుంది ఇంకే విషయము ఉండదు. ఎవరి బుద్ధిలోనైతే సదా బాబా మరియు సేవ ఉంటుందో వారు సహజంగానే మాయాజీతులుగా అయిపోతారు. కుమారులు కేవలం ఒక్క విషయమును అటెన్షన్లో ఉంచుకోవాలి. సదా స్వయమును బిజీగా ఉంచుకోండి, కాని ఖాళీగా ఉండకండి. శరీరము మరియు బుద్ధి రెండింటితోను బిజీగా ఉండండి. బిజీ మాన్ గా ఉండండి, బిజినెస్ మాన్ కాదు. ఏ విధంగా కర్మ యొక్క దినచర్యను సెట్ చేసుకుంటారో అలా బుద్ధి యొక్క దినచర్యను కూడా సెట్ చేసుకోండి. ఇప్పుడు ఇది ఆలోచించాలి, ఇది చేయాలి... బిజీగా ఉన్నవారిని మాయ ఏ రూపంలోను ఎదుర్కొనజాలదు. బుద్ధిని బిజీగా ఉంచుకునే సాధనమును సదా ధారణ చేయండి. ఏ విధంగా శరీరమును బిజీగా ఉంచుకునే సాధనాలు ఉన్నాయో అలా బుద్ధి ద్వారా సదా స్మృతిలో, నషాలో బిజీగా ఉండండి. ఇటువంటి దినచర్యను తయారుచేసుకోవడం వస్తుందా? సదాకాలికంగా దీన్ని ఒక నియమంగా తయారుచేసుకోండి. ఏ విధంగా ఇతర నియమాలు తయారయ్యాయో దీన్ని కూడా ఒక నియమంగా తయారుచేసుకోండి. ఇది చేయవలసిందే అన్న ఇదే దృఢ నిశ్చయంతో ఏ అద్భుతమును చేయాలనుకుంటే అది చేయవచ్చు. కుమారులు బాప్దాదాల కర్తవ్యమునకు సితారలు. సేవకు నిమిత్తులుగా కుమారులే అవుతారు కదా! పరుగును కూడా కుమారులే తీస్తారు. ఏయే సేవలైతే జరుగుతాయో అందులో కుమారులకు విశేషమైన పాత్ర ఉంటుంది. కావున విశేష పాత్రను తీసుకునే విశేష ఆత్మలము అన్న నషాను ఉంచండి, ఇదే సంతోషంలో ఉండండి. కావున కుమార్ గ్రూప్వారు ఏంచేసి చూపిస్తారో చూద్దాము. ఏదైనా చేసి చూపించండి. కేవలం చెప్పి కాదు. సేవ యొక్క ఉల్లాస ఉత్సాహాలు కలవారు, నిశ్చయబుద్ధి ఉంది, అచలంగా ఉన్నారు, చలించేవారిగా లేరు. ఇటువంటి అచల ఆత్మలు ఇతరులను కూడా అచలముగా చేసి చూపించండి.

మహాదానులుగా అయి దానంచేస్తూ ముందుకువెళ్ళండి. ఎప్పుడైతే స్వయం యొక్క భండారము నిండుగా ఉంటుందో అప్పుడు అనేకులకు దానమునివ్వాలి. సేవను సదా ముందుకు తీసుకువెళుతూ ఉండండి. ఈరోజు అవకాశము లభించింది కావున చేసేశాము లేక ఎప్పుడైతే అవకాశము లభిస్తుందో అప్పుడు చేస్తాము... ఇలా కాదు. ఎవరివద్దనైతే ఖజనా ఉంటుందో వారు ఎక్కడినుండైనా పేదలను వెతికి మరీ, దండోరా మ్రోగించి మరీ దానమును తప్పకుండా చేస్తారు. ఎందుకంటే దానమును చేయడం ద్వారా పుణ్యము లభిస్తుంది అని వారికి తెలుసు. ఆ దానము అయితే వినాశీ దానము, అది స్వార్ధముతో కూడుకున్నదై కూడా ఉండవచ్చు. మీరందరూ అవినాశీ ఖజానాల మహాదానులు, కావున సేవను పెంచండి, రేస్ చేయండి, మహాదానులుగా అవ్వండి. నిశ్చయంతో చేయండి. ధరణియే ఇలా ఉంది అని భావించకండి, ఇప్పుడు సమయం మారిపోయింది. ఇప్పుడు సమయంతోపాటు ధరణి కూడా మారిపోతోంది. ఇంతకుముందు ఉన్న ధరణి యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అది లేదు. సమయము వాయుమండలమును మారుస్తోంది, ఆత్మల కోరిక కూడా మారుతోంది, అందరూ దీని అవసరమును అనుభవం చేసుకుంటున్నారు. ఇప్పుడు సమయం ఉంది, సమయానుసారంగా ఇప్పుడు మహాదానులుగా అవ్వండి. వాచా కాకపోతే మనసా, మనసా కాకపోతే కర్మణా. కర్మ ద్వారా ఏ ఆత్మనైనా పరివర్త చేయడము ఇది కర్మణ. సంపర్కము ద్వారా కూడా ఏ ఆత్మనైనా పరివర్తన చేయవచ్చు. ఈ విధంగా సేవాధారులుగా అవ్వండి. రోజూ మనసా, వాచా, కర్మణా ఏం సేవ చేసారు, ఎంతమందికి సేవ చేసారు, ఏ ఉల్లాస ఉత్సాహాలతో సేవ చేసారు అన్న ఈరోజు యొక్క రిజల్ట్ను స్వయమే తీయండి. స్వయం మరియు సేవ రెండింటి యొక్క వేగంలో ముందుకువెళ్ళండి. ఇప్పుడు ఏదైనా నవీనతను తీసుకురండి. సెంటర్లు తెలిచాము, గీతా పాఠశాలలు తెరిచాము, మేళాలు చేసాము ఇవన్నీ పాత విషయాలైపోయాయి, ఏదైనా కొత్తది కనుగొనండి. స్వయములో మరియు సేవలో ఏదైనా నవీనతను తప్పకుండా తీసుకురావాలి, లేకపోతే కాసేపు అలిసిపోతారు, కాసేపు బోరైపోతారు. నవీనత ఉన్నట్లయితే సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉంటారు. అచ్చా!

మాతలతో - మాతలకొరకు విశేషంగా బాప్దాదా సహజమార్గపు కానుకను తీసుకువచ్చారు. సహజమార్గపు కానుక అందరికీ లభించింది. సహజప్రాప్తి ఏదైతే లభిస్తుందో అదే కానుక. కావున విశేషంగా బాప్దాదా సహజమార్గపు కానుకను తీసుకువచ్చారు అన్న ఇదే నషాలో ఉండాలి. అన్నింకన్నా సహజమైనది నా బాబా అని అనండి చాలు. 'నా బాబా' అని అనడం ద్వారా, అనుభవం చేసుకోవడం ద్వారా సర్వప్రాప్తులు లభిస్తాయి. బాబా విశేషంగా మాకొరకు వచ్చారు అన్న సంతోషం మాతలకు ఉండాలి. వచ్చిన మిగిలినవారందరూ పురుషులను ముందు ఉంచారు. ధర్మపితలు ధర్మస్థాపన చేసి వెళ్ళిపోయారు. మాతలను ఎవ్వరూ ప్రసిద్ధులుగా చేయలేదు మరియు బాబా 'మొదట మాతలు' అన్న విధానమును స్థాపన చేసారు, కావున మాతలు ఎంతో ప్రియమైనవారైపోయారు కదా! ఎంత ప్రేమగా బాబా వెదికిపట్టుకున్నారు మరియు తమవారిగా చేసుకున్నారు! మీరైతే ఎటువంటి చిరునామా లేకుండా వెదికారు, కావుననే వెదకలేకపోయారు. బాబా చూసి ఏ విధంగా మూలమూలల నుండి వెతికితీసారో చూడండి! అనేక వృక్షాల కొమ్మలు ఇప్పుడు ఒకే వృక్షానికి చెందినవిగా అయిపోయాయి. ఒకే చందన వృక్షంగా అయిపోయింది. 2-4 మాతలు కూడా ఒకేచోట కలిసి ఉండలేరు అని జనులు అంటారు మరియు ఇప్పుడు మాతలు మొత్తం విశ్వంలో ఐక్యతను స్థాపించేందుకు నిమిత్తులుగా అయిపోయారు. వారు కలిసి ఉండలేరు అని అన్నారు కాని మాతలే ఉండగలరు అని బాబా అన్నారు. ఇటువంటి మాతలకు విశేష పదవి ఉంటుంది. ఎంతో సంతోషంగా నాట్యం చేయండి, గానం చేయండి, ఓహో నా శ్రేష్ఠ భాగ్యము అని అనండి. ఎప్పుడూ దు:ఖపు అల రాకూడదు, అందరూ దు:ఖధామాన్ని వదిలేసారు కదా! ఇప్పుడు మనం సంగమయుగవాసులుగా ఉన్నాము. సదా సుఖధామము, శాంతిధామంవైపుకు ముందుకువెళుతూ ఉండాలి. మాతలను చూసి బాప్దాదాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఎటువంటి ఆశా లేనివారిని ఆశావాదులుగా చేసేసారు, విశ్వకళ్యాణకారులుగా చేసేసారు. ఇప్పుడు విశ్వం మీవైపు చూస్తోంది. మా కళ్యాణముచేసే మాతలు ఎక్కడ ఉన్నారు అని చూస్తోంది. కావున ఇప్పుడు జగన్మాతలుగా అయి జగత్ కళ్యాణము చేయండి. కేవలం లౌకిక పరివారపు బాధ్యతను నిర్వర్తించేవారిగాకాక విశ్వంలోని సర్వాత్మల సేవా బాధ్యతలను నిర్వర్తించేవారిగా అవ్వండి. నిమిత్తంగా ఎక్కడ ఉన్నాకాని స్మృతిలో విశ్వసేవ ఉండాలి. లక్ష్యం ఎలా ఉంటుందో లక్షణాలు అలా స్వతహాగా వచ్చేస్తాయి. బేహద్ లక్ష్యము ఉంటే లక్షణాలు కూడా బేహద్గానే ఉంటాయి లేకపోతే హద్దులోనే చిక్కుకొని ఉంటారు. నేను సదా బాబాకు చెంది ఉన్నాను, బేహద్లో ఉన్నాను అన్న ఇదే స్మృతిలో సర్వాత్మలపట్ల శుభసంకల్పము ద్వారా సేవచేస్తూ ఉండండి. రెండూ కలిసి ఉండాలి. మీ నోటితో ఎవరికి అర్థం చేయించినాకాని ఎప్పటి వరకైతే శుభభావన యొక్క శక్తిని ఆ ఆత్మకు ఇవ్వరో అప్పటి వరకు ఫలము వెలువడదు. మనసా, వాచా ఈ రెండు సేవలు కలిసి జరగాలి. కేవలం సందేశమునిచ్చేవరకు కాదు, లేకపోతే కేవలం హాహా అంటూ వెళ్ళిపోతారు. మనసా సేవ తోడుగా జరిగినట్లయితే బాణము తగులుతుంది. మాతలు సేవా మైదానంలోకి రావాలి. ఒక్కొక్క మాత ఒక్కొక్క సేవాకేంద్రాన్ని సంభాళించాలి. ఖాళీ లేకపోతే పరస్పరంలో 2-3 మంది కలిసి ఒక గ్రూపును తయారుచేయండి. బంధనాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు అని అనుకోవడంకాదు. సమాజ సేవలో ఉన్న మాతలకు కూడా పిల్లలు ఉంటారు కదా! వారు కూడా నేర్చుకుంటారు. కావున ఇప్పుడు మిమ్మల్ని మీరు భుజాలుగా తయారుచేసుకోండి మరియు సేవను పెంచండి. ఎవరో ఒకరిని వెలికితీసి వారికి స్థానమునిచ్చి ముందుకువెళుతూ ఉండండి. ఇప్పుడు శక్తులు మైదానంలోకి రండి. ఏ పాలననైతే తీసుకున్నారో దాని రిటర్న్ను ఇవ్వండి. ఎంతగా సేవను పెంచుతారో అంతగా స్వయమునకు కూడా దాని ఫలము లభిస్తుంది. వర్తమానం కూడా శక్తిశాలిగా ఉంటుంది మరియు భవిష్యత్తయితే తయారయ్యే తీరుతుంది. ఎంతగా సేవ చేస్తారో అంతగా నిర్విఘ్నంగా ఉంటారు మరియు సంతోషం కూడా ఉంటుంది. అచ్ఛా!

కుమారీలతో:- కుమారీలకు తమ శ్రేష్ఠ భాగ్యమును గూర్చి మంచిగా తెలుసు కదా! మీ శ్రేష్ఠ భాగ్యమునైతే ఎప్పుడూ మర్చిపోరు కదా! సదా మీ భాగ్యమును స్మృతిలో ఉంచుకుంటూ ముందువెళుతూ ఉండండి. సంగమ యుగంలో విశేష లిఫ్ట్రూపీ గిఫ్ట్ కుమారీలకు లభిస్తుంది. ఎందుకంటే కుమారీ జీవితము చింతల నుండి అతీతమైన జీవితము. ఇంటిని నడిపించే, ఉద్యోగపు భారమును తలపైకి ఎత్తుకునే చింతలేదు. కుమారీలు అనగా స్వతంత్రులు. స్వతంత్రత అందరికీ ప్రియమనిపిస్తుంది. అజ్ఞానంలో కూడా తాము స్వతంత్రంగా ఉండాలి అన్న లక్ష్యమే అందరికీ ఉంటుంది. కావున నేను స్వతంత్ర ఆత్మను అన్న ఈ స్వతంత్రత యొక్క వరదానము మీ అందరికీ లభించింది. స్వతంత్రత యొక్క వరదానం కలవారు మిగిలినవారందరికీ కూడా ఇదే వరదానమును ఇస్తారు కదా! ఎవరి చక్రములోను చిక్కుకునేవారు కారు కదా! ఎప్పుడైతే ఆ చక్రాల నుండి బయటపడి ఉంటారో, స్వతంత్రులుగా ఉంటారో అప్పుడే సేవ చేస్తారు కదా! నిమిత్తమాత్రంగా ఈ చదువు ఏదైతే మిగిలి ఉందో అది చదువుతూ కూడా సేవ యొక్క స్మృతి ఉండాలి. చదువుకునే సమయంలో కూడా బాబాకు చెందినవారిగా చేయగలిగే ఆత్మలు ఎవరు అన్న లక్ష్యమే మీలో ఉండాలి. చదువును చదువుకుంటూ కూడా ఏ ఆత్మలు యోగ్యమైనవారు అని పరిశీలిస్తూ ఉండాలి, అప్పుడు అక్కడ కూడా సేవ జరుగుతుంది. కుమారీలు భాషణ చేయడం తప్పకుండా నేర్చుకోవాలి. అందరూ చదువును చదువుతూ కూడా సిద్ధమవుతూ ఉండండి. చదువు పూర్తవ్వడంతోనే సేవలో నిమగ్నమైపోండి.

Comments