09-05-1983 అవ్యక్త మురళి

09-05-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బ్రాహ్మణజీవితానికి శృంగారం - స్మృతి, వృత్తి మరియు దృష్టి యొక్క స్వచ్ఛత.

ఈ రోజు బాప్దాదా బ్రాహ్మణ పిల్లలందరి శ్రేష్ఠ కర్మల రేఖను చూస్తున్నారు. ఈ కర్మల రేఖ ద్వారానే వర్తమానం మరియు భవిష్య అదృష్ట రేఖ గీయబడుతోంది. బ్రాహ్మణులందరి కర్మల రేఖను కర్మల గాథను లేక కర్మల ఖాతాను చూస్తున్నారు. మీరు భాగ్యవిధాత అయిన తండ్రి, కర్మల గుహ్య గతి జ్ఞాత అయిన తండ్రి వారసత్వానికి అధికారులైన పిల్లలు. దానితో పాటు స్వయం విధాత అయిన బాప్దాదా పిల్లలందరికి ఎటువంటి సువర్ణావకాశం ఇచ్చారంటే మీరు విధాత పిల్లలైన కారణంగా ఎంత భాగ్యం తయారు చేసుకోవాలనుకుంటే, ఎంత ప్రాప్తి స్వరూపులుగా అవ్వాలనుకుంటే అంత అందరికి సంపూర్ణ అధికారముంది. అధికారం ఇవ్వడంలో నెంబరు లేదు. పూర్తి స్వేచ్ఛ(ఫ్రీడమ్) ఉంది. అనగా సంపూర్ణ స్వతంత్రత ఉంది. దానితో పాటు డ్రామనుసారంగా వరదానీ సమయం సహయోగం కూడా ఉంది. అది కూడా అందరికి సమానంగా ఉంది. అయినా ఇంతటి స్వర్ణిమ అవకాశం లభించినా అనంతమైన ప్రాప్తిని కూడా నంబరువారీగా హద్దులోకి తీసుకు వచ్చేస్తారు. తండ్రి కూడా అనంతమైనవారు, వారసత్వం కూడా అనంతమైనదే, అధికారము కూడా అనంతమే. కానీ తీసుకునేవారు నంబరువారీగా అయిపోతారు. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి సంక్షిప్తంగా రెండు కారణాలున్నాయి. ఒకటి బుద్ధిలో స్వచ్ఛత లేదు, స్పష్టత(క్లియర్) లేదు. రెండవది ప్రతి అడుగులో అప్రమత్తంగా లేరు అనగా జాగ్రత్తగా(కేర్ఫుల్గా) లేరు. ఈ రెండు కారణాల వలన నంబరువారీగా అయిపోతారు. ముఖ్యమైన విషయం - స్వచ్ఛత. దీనినే పవిత్రత లేక మొదటి వికారం పైన గెలుపు అని అంటారు. బ్రాహ్మణ జీవితాన్ని ధారణ చేసినప్పుడు మరి ఆ బ్రాహ్మణ జీవితానికి ముఖ్యమైన ఆధారమనండి, నవీనత అనండి, అలౌకికత అనండి, జీవిత శృ౦గారమనండి, అది పవిత్రతయే. బ్రాహ్మణ జీవితంలోని ఛాలెంజ్యే కామ వికారం పైన విజయం. అసంభవం నుండి సంభవాన్ని చేసి చూపించవలసింది ఇదే. శ్రేష్ఠ జ్ఞానం మరియు శ్రేష్ఠ జ్ఞానదాతకు గుర్తు ఇదే. ఎలాగైతే నామధారి బ్రాహ్మణులకు గుర్తుగా శిఖ(పిలక) మరియు జంధ్యం(యజ్ఞోపవీతం) ఉన్నాయో, అదే విధంగా సత్యమైన బ్రాహ్మణులకు గుర్తు - పవిత్రత మరియు మర్యాదలు జన్మకు లేక జీవితానికి గల గుర్తు. తండ్రినైతే సదా స్థిరంగా నిలిపి ఉంచుకోవలసి ఉంటుంది కదా! పవిత్రతకు ఆధారయుక్తమైన పాయింట్ - స్మృతిలో పవిత్రత. 'నేను కేవలం ఆత్మనే కాదు. నేను శుద్ధ పవిత్ర ఆత్మను.' ఆత్మ అనే శబ్ధాన్నైతే అందరూ అంటారు కాని బ్రాహ్మణ ఆత్మను, నేను సదా శుద్ధ పవిత్ర ఆత్మను, శ్రేష్ఠ ఆత్మను, పూజ్య ఆత్మను, విశేష ఆత్మను - ఈ స్మృతికి కూడా పవిత్రతయే ఆధారమూర్తి. అయితే మొదటి ఆధారాన్ని గట్టిగా చేసుకున్నారా? ఈ కర్తవ్యము(ఆక్యుపేషన్) సదా స్మృతిలో ఉంటుందా? ఎలాంటి వృత్తి (ఆక్యుపేషన్) ఉంటుందో, అలాంటి కర్మలు స్వతహాగానే జరుగుతాయి. మొదటి స్మృతి స్వచ్ఛంగా ఉండాలి. దాని తర్వాత వృత్తి(భావం) మరియు దృష్టి. ఎప్పుడైతే స్మృతిలో నేను పూజ్య ఆత్మను అనే పవిత్రత వచ్చేస్తుందో అనగా నేను పూజ్య ఆత్మను అని అనుకుంటే వారి విశేష గాయనం ఏది? సంపూర్ణ నిర్వికారులు, సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు ఇవే పూజ్య ఆత్మల క్వాలిఫికేషన్లు(యోగ్యతలు). వారు స్వతహాగానే స్వయాన్ని మరియు సర్వులను ఏ దృష్టితో చూస్తారు? అలౌకిక పరివారంలోని వారైనా లేక లౌకిక స్మృతిలో ఉండే ఆత్మలైనా అందరి పట్ల పరమ పూజ్యలు లేదా పూజ్యులుగా తయారు చేయాలి అనే దృష్టితో చూడాలి అనే దృష్టితో ఉండాలి. పూజ్య ఆత్మలు అనగా అలౌకిక పరివారానికి చెందిన ఆత్మల పట్ల, ఒకవేళ అపవిత్ర దృష్టి ఏదైనా వెళ్ళినట్లయితే ఈ స్మృతి యొక్క ఫౌండేషన్(పునాది) బలహీనంగా ఉన్నట్లు. అంతేకాక ఇది మహా-మహా-మహా పాపమవుతుంది. ఏ పూజ్య ఆత్మ పట్ల అయినా అపవిత్రత అనగా దైహిక దృష్టి అనగా ఈ దేహధారి చాలా మంచివాడు, ఈ టీచరు చాలా మంచిది అనే దైహిక దృష్టి వెళ్తుంది. అయితే మంచితనం అంటే ఏమిటి? మంచితనమంటే ఉన్నతమైన స్మృతి మరియు ఉన్నతమైన దృష్టి. ఒకవేళ ఉన్నతత్వం లేకపోతే మంచితనమేముంది? ఇది కూడా బంగారు జింక వంటి మాయా రూపం. ఇది సేవా కాదు, యోగమూ కాదు. స్వయాన్ని మరియు సర్వులను వియోగులుగా చేసేందుకు ఆధారమవుతుంది. ఈ విషయం పై పదే పదే అటెన్షన్ ఉంచండి.

తండ్రి ద్వారా నిమిత్తంగా అయిన టీచర్లు లేక సేవలో సహయోగులుగా అయిన ఆత్మలు అక్కయ్యలైనా, అన్నయ్యలైనా, సేవాధారీ ఆత్మల సేవ యొక్క ముఖ్య లక్షణాలు త్యాగం మరియు తపస్సు. ఈ లక్షణాల ఆధారం పైన సదా త్యాగీ మరియు తపస్వీ దృష్టితో చూడండి, దైహిక దృష్టితో కాదు. శ్రేష్ఠ పరివారం కావున సదా శ్రేష్ఠ దృష్టిని ఉంచండి. ఎందుకంటే ఈ మహాపాపం ఎప్పుడూ ప్రాప్తీ స్వరూపాన్ని అనుభవం చేయించలేదు. సదా ఏదో ఒక కర్మలో, సంకల్పంలో, సంబంధ-సంపర్కంలో డిఫెక్ట్(లోపం) లేక ఎఫెక్ట్ల(ప్రభావాల) ఎత్తు-పల్లాలలో నడుస్తూ ఉంటుంది. ఎప్పుడూ పరఫెక్ట్(దోషరహిత) స్థితిని అనుభవం చేసుకోలేరు. అందువలన పూజ్య ఆత్మలకు బదులుగా పాపాత్మలుగా అయితే అవ్వడం లేదు కదా! అన్నది గుర్తు ఉంచుకోండి. ఈ ఒక్క వికారం ద్వారానే ఇతర వికారాలు స్వతహాగానే ఉత్పన్నమవుతాయి. కోరిక పూర్తవ్వకపోతే మొదట క్రోధమనే సహచరుడు వస్తాడు. కావున ఈ విషయాన్ని తేలికగా భావించకండి. ఇందులో నిర్లక్ష్యంగా అవ్వకండి. బాహ్యంగా శుభ సంబంధముంది, సేవా సంబంధముంది అనే రాయల్ రూపంలో పాపాన్ని పెంచకండి. ఈ పాపానికి ఎవరు దోషులుగా అయినా ఇతరులను దోషులుగా చేసి స్వయం నిర్లక్ష్యంగా, సోమరిగా అవ్వకండి. 'నేను దోషిని' అని ఎప్పటి వరకైతే ఈ సావధానం ఉంచుకోరో, అప్పటి వరకు ఈ మహాపాపం నుండి ముక్తులవ్వజాలరు. ఏ విధంగానైనా మనసా సంకల్పాలలోనైనా, మాటలు లేక సంపర్క-సంబంధాలలోనైనా విశేషమైన ఆకర్షణ(లగావ్) ఉందంటే ఇది కూడా మోహం యొక్క శాతమే. ఎప్పుడైనా ఏదైనా సైగ(సూచన) లభిస్తే దానిని ఆ సైగతోనే సమాప్తం చేసెయ్యాలి. ఒకవేళ జిద్దుతో(మొండితనంతో) ఋజువు చేస్తే, అలా కాదు, ఇలా అని స్పష్టీకరణ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారంటే దీని ద్వారా మీ పాపాన్ని మీరే స్వష్టీకరణ చేసుకుంటున్నారని అర్థం చేసుకోండి. విషయాన్ని స్పష్టీకరణ చేయడం లేదు, పాపరేఖను ఇంకా పొడవుగా చేసుకుంటున్నారు. అందువలన మీరు ఉన్నదే విశ్వ పరివర్తన కార్యంలో అయినప్పుడు స్వ పరివర్తనను చేసుకోవడమే తెలివైన పని. ఒకవేళ ఏమీ లేకపోతే ఏమీ చేయకండి. అంటే స్వ పరివర్తన చేసుకొని ఆ విషయాన్ని నామ-రూపాలు లేకుండా సమాప్తి చేయండి. ఇది ఎందుకు? ఇలా ఎందుకు? ఇది ఇలా నడుస్తూనే(జరుగుతూనే) ఉంటుంది అని అనడం వాయుమండలమనే అగ్నిలో నూనె వేయడం వంటిది. అగ్నిని ప్రజ్వలితం చేయడం - విషయాన్ని పెంచడం. అందువలన బిందువు(ఫుల్స్టాప్) పెట్టేయాలి. ఉందా, లేదా అన్న వాదనలోకి వెళ్ళకండి. కానీ సంకల్పం, మాట మరియు సంపర్కంలో పరివర్తన తీసుకు రండి. ఇదే ఈ పాపం నుండి రక్షించుకునే విధి. అర్థమైందా! బ్రాహ్మణ పరివారంలో ఈ సంస్కారం నామ-రూపాలు కూడా ఉండరాదు. మంచిది - తర్వాత క్రోధ మహాభూతం అంటే ఏమిటో వినిపిస్తాను.

ఇవే విశేషంగా అటెన్షన్ ఇవ్వవలసిన విషయాలు. ఎవరైతే వచ్చారో వారు విశేషంగా శక్తిని నింపుకునేందుకు వచ్చారు. ఏ బలహీన సంస్కారమునైనా సదా కొరకు సమాప్తం చేసుకునేందుకు వచ్చారు. కావున బలహీన సంస్కారాల సమాప్తి సమారోహాన్ని జరుపుకొని వెళ్ళండి. ఈ సమారోహాన్ని జరుపుకుంటారు కదా! ఇది విశేషంగా పాతవారి గ్రూపు. మీరు ఎప్పుడైతే ఈ సమారోహాన్ని జరుపుకుంటారో అప్పుడు క్రొత్తవారు కూడా ఉమంగ-ఉత్సాహాలలోకి వస్తారు. ప్రతి సంవత్సరం ఈ సమారోహాన్ని జరుపుకోవలసి ఉంటుందని కాదు. ఒకసారి ఈ సమారోహం జరిగిన తర్వాత మళ్ళీ సంపన్న సమారోహాన్ని జరుపుకోవాలి. సదాకాలం కొరకు సమాప్తి సమారోహాన్ని జరుపుకుంటారు కదా! ఇందులో మాతలు కూడా వచ్చేస్తారు. అధర్ కుమారులు కూడా వచ్చేస్తారు. కేవలం పాండవులే జరుపుకుంటారని కాదు. కుమారీలు కూడా జరుపుకుంటారు. అధర్ కుమారీలు కూడా జరుపుకుంటారు. టీచర్లు కూడా జరుపుకుంటారు. అందరూ కలిసి ఈ సమారోహాన్ని జరుపుకోండి. సరేనా! కుమారీలంటే శక్తులు కదా! కనుక శక్తీరూప సమారోహాన్ని జరుపుకుంటారు కదా! మంచిది.

సదా స్వయం పట్ల శుభ చింతకులకు, సదా స్వ పరివర్తన కార్యంలో ''మొదట నేను'' అన్న పాఠంలో నంబరు వన్గా వచ్చేవారికి, సదా సంకల్పాలు, మాటలు మరియు సంకల్పంలో సర్వుల పట్ల అనంతమైన స్మృతి స్వరూపులకు, సదా స్వచ్ఛత మరియు సావధానంగా(అపమ్రత్తంగా) ఉండేవారికి, ఇటువంటి పవిత పూజ్య ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

కుమారులతో అవ్యక్త బాప్దాదాల మధుర వాక్యాలు :-

సదా తమను ప్రతి అడుగులో సాక్షి మరియు సదా తండ్రికి సాథీగా అనుభవం చేస్తున్నారా? ఎవరైతే సదా సాక్షీగా ఉంటారో, వారు సదా కర్మలను చేస్తూ, ప్రతి అడుగు వేస్తూ కర్మ బంధనాల నుండి అతీతంగా, తండ్రికి ప్రియంగా ఉండే సాక్షీ స్థితిని అనుభవం చేస్తున్నారా? ఏ కర్మేంద్రియమూ తన బంధనంలో బంధించరాదు. వారినే సాక్షి అని అంటారు. ఇలాంటి సాక్షీగా ఉన్నారా? ఏ విధమైన కర్మ తన బంధనంలో బంధించినట్లయితే, వారిని సాక్షి అని అనరు, చిక్కుకునేవారు అని అంటారు. అతీతమైన వారని అనరు. ఎప్పుడూ కళ్ళు కూడా మోసగించరాదు. శారీరిక సంబంధంలోకి రావడం అనగా కళ్ళతో మోసగించబడడం. కావున ఏ కర్మేంద్రియమూ మోసగించరాదు. సాక్షిగా ఉండాలి, సదా తండ్రికి సాథీగా ఉండాలి. ప్రతి విషయంలో తండ్రి గుర్తు రావాలి. ఏదైనా విషయం వచ్చినట్లయితే ముందు తండ్రి గుర్తు వస్తారా? లేక నిమిత్తంగా ఉన్న ఆత్మ గుర్తుకు వస్తుందా? సదా ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు, ఆత్మలు సహయోగులు కానీ తోడుగా(సాథీగా) ఉండేవారు కాదు. సాథీ అయితే తండ్రి ఒక్కరే. సహయోగులను తమ సాథీలుగా భావించడం తప్పు. కావున వారు సదా సేవకు సాథీలు కానీ సేవలో సాథీ తండ్రియే. వారు నిమిత్తంగా ఉండి సహయోగమిస్తారు. ఇలా సదా స్మృతి స్వరూపులుగా ఉన్నారా! ఏ దేహధారినైనా తోడుగా చేసుకున్నట్లయితే ఎగిరేకళ అనుభవమవ్వజాలదు. అందువలన ప్రతి విషయంలో బాబా, బాబాయే గుర్తుండాలి. కుమారులు డబల్ లైట్గా ఉన్నారు. సంస్కార - స్వభావాల బరువు కూడా లేదు. వ్యర్థ సంకల్పాల బరువు కూడా లేదు. దీనినే తేలికగా ఉండడమని అంటారు. ఎంత తేలికగా ఉంటారో, అంత సహజంగా ఎగిరే కళను అనుభవం చేస్తారు. ఒకవేళ కొద్దిగా అయినా శ్రమ చేయవలసి వస్తే తప్పకుండా ఏదో భారముంది అని అర్థము. కావున బాబా, బాబా ఆధారాన్ని తీసుకొని ఎగురుతూ ఉండండి. ఇదే అవినాశీ ఆధారము.

ఇది ఆత్మిక యూత్ గ్రూప్(యువ వర్గం). శాంతికారి, కళ్యాణకారి గ్రూపు. సదా విశ్వంలో శాంతి స్థాపనా కార్యంలో నిమిత్తంగా ఉన్నారు. వారు అశాంతి వ్యాపింపజేసేవారు, కాని మీరు శాంతిని వ్యాపింపజేసేవారు. అలాగ తమను భావిస్తున్నారా? యూత్ గ్రూపు పై రాజకీయవేత్తలకు కూడా ఆశలున్నాయి. అంతేకాక బాప్దాదాకు కూడా ఆశలున్నాయి. ఆశలు పూర్తి చేసేవారే కదా! పిల్లలు సదా తండ్రి ఆశలను పూర్తి చేసేవారిగా ఉంటారు. కావున సఫలతా సితారలుగా అయ్యి ప్రభుత్వం వరకు మేము విజయ రత్నాలమనే శబ్ధాన్ని మారుమ్రోగించండి. ఏ గ్రూపువారు ఎక్కడ ఈ జెండాను మొదట ఎగరవేస్తారో ఇప్పుడు చూద్దాము. ఎప్పుడూ మీ శక్తులను దుర్వినియోగం చేసుకోకండి. సదా మీ పైన చాలా గొప్ప బాధ్యత ఉందని గుర్తుంచుకోండి. ఒకరు బలహీనంగా అయినట్లయితే ఒకరివెనుక మరొకరికి కూడా సంబంధముంటుంది. మేము బాధ్యత కలిగినవారము అన్న స్మృతి సదా ఉండాలి. ఏ కర్మను మీరు చేస్తారో మిమ్మల్ని చూసి అందరూ చేస్తారు. కావున మీరు సాధారణ కర్మలు చేయరు. మీరు శ్రేష్ఠ కర్మలను చేసేవారు. సదా అచంచలంగా ఉండేవారు. మంచిది.

వీడ్కోలు సమయంలో - పిల్లలందరికీ గుడ్మార్నింగ్

నలువైపులా ఉన్న సర్వ శ్రేష్ఠ ఆత్మలకు మరియు విశేష ఆత్మలకు బాప్దాదా మధువనం వరదానీ భూమిలో సన్ముఖంగా చూస్తూ ప్రియస్మృతులను ఇస్తున్నారు. అందరికీ గుడ్మార్నింగ్ చెప్తున్నారు. గుడ్మార్నింగ్ అనగా రోజంతా ఇలాగే శుభంగా మరియు శ్రేష్ఠ౦గా ఉండాలి. రోజంతా ప్రియస్మృతుల పాలనలో ఉండాలి. ఈ ప్రియస్మృతులే శ్రేష్ఠమైన పాలన. సదా ఇదే పాలనలో ఉండండి, ఇదే ఈశ్వరీయ స్మృతి మరియు ప్రేమను ఆత్మలందరికీ ఇస్తూ వారిని కూడా శ్రేష్ఠ౦గా పాలన చేయండి. ప్రియస్మృతులు పాలన చేసే ఊయల వంటివి. ఏ ఊయలలో పాలన జరుగుతుందో మరియు గుడ్మార్నింగ్ శక్తిశాలీ అమృతమనండి లేక ఔషధమనండి లేక శ్రేష్ఠ భోజనమనండి ఏమన్నా ఆ విధంగా శక్తిశాలిగా తయారుచేసే గుడ్మార్నింగ్ మరియు ప్రియస్మృతుల ఊయల సదా ఇదే ఊయలలో ఉండండి. అంతేకాక ఇదే శక్తిలో సదా ఉండాలి. ఇలా సదా ఇదే స్వరూపంలో ఉండే సర్వ పిల్లలకు గుడ్మార్నింగ్. అచ్ఛా (మంచిది).

Comments