04-05-1983 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
సదా ఏకమతం మరియు ఏకమార్గం ద్వారా ఏకరస స్థితి.
ఈరోజు బాప్దాదా వతనంలో పిల్లలందరిని గూర్చి మాట్లాడుతూ హర్షిస్తున్నారు. ఏ విషయమును గూర్చి మాట్లాడారు? పిల్లలందరూ ముక్తి, జీవన్ముక్తుల వారసత్వాన్ని ఒక్క క్షణంలో పొందవచ్చు అని విశ్వం ముందు ఛాలెంజ్ చేస్తారు. ఈ ఛాలెంజ్ చేస్తారు కదా! అనుభవంతో చూడండి, ఏ దివ్యబుద్ధి అయితే బ్రాహ్మణులందరికీ జన్మసిద్ధ అధికారంగా లభించిందో, బ్రాహ్మణులకు నామసంస్కారము జరగడంతోనే దివ్యబుద్ధి యొక్క ఈశ్వరీయ కానుక బాప్దాదా ద్వారా లభించింది. ఆ దివ్యబుద్ధి యొక్క ఆధారంపై ఆలోచించండి, జ్ఞానము కూడా ఒక్క క్షణంలోదే. రచయిత మరియు రచన. తండ్రి మరియు వారసత్వం మరియు యోగం కూడా ఒక్క క్షణందే. నేను బాబాకు చెంది ఉన్నాను, బాబా నావారు. దివ్య గుణధారులుగా అవ్వడం ఇది కూడా ఒక్క క్షణకాలపు విషయమే ఎందుకంటే జన్మనుబట్టి, కులమునుబట్టి అటువంటి ధారణ స్వతహాగా మరియు సహజంగా ప్రాప్తిస్తుంది. ఇది ఈశ్వరీయ కులమైనప్పుడు గుణాలు అనగా ధారణలు కూడా ఈశ్వరీయముగానే ఉంటాయి కదా! బ్రాహ్మణ జన్మ ఉన్నతోన్నతమైన జన్మ, కావున ధారణ కూడా ఉన్నతోన్నతముగానే ఉంటుంది కదా! ధారణ కూడా ఒక్క క్షణానికి సంబంధించినదే. బాబా ఎలాగో పిల్లలూ అలాగే మరియు సేవ కూడా ఒక్క క్షణకాలముదే. అనుభవజ్ఞులుగా అయి, ఖజానా యొక్క అధికారులుగా అయి బాబా పరిచయమును ఇవ్వాలి. ఏదైతే మీ వద్ద ఉందో దానిని ఇతరులకు ఇవ్వడం ఒక్క క్షణపు విషయము మరియు సహజమైన విషయము. కావున ఒక్క క్షణకాలపు విషయంలో ఇంతకాలము నడుస్తూ, రెండు నెలల బ్రాహ్మణులైనా లేక చాలాకాలం నుండి నడుస్తున్న బ్రాహ్మణులైనా ఎలా నడుస్తున్నారు అని బాప్దాదా గమనిస్తున్నారు. బ్రాహ్మణులు అనగా క్షణంలో వారసత్వానికి అధికారులు కావున ఒక్క క్షణకాలపు అధికారులు మళ్ళీ ఆధీనంగా ఎందుకు అయిపోతారు? ఎందుకు? తమ అధికారం యొక్క స్థితిరూపీ సీటుపై సెట్ అవ్వడం రాదా? విశ్రాంతిగా ఉన్న సీటును వదిలి అలజడితో ఉన్న విశ్రాంతి లేని స్థితిలోకి ఎందుకువస్తారు? సీటును ఎందుకు వదులుతారు? మరియు పదే పదే సెట్ అయ్యేందుకు ఎందుకు కష్టపడతారు? సీటు నుండి దిగగానే సర్వశక్తుల ప్రాప్తి పోతుంది. శ్రేష్ఠమైన సీటు అనగా శ్రేష్ఠ స్థితిలో సెట్ అవ్వడం ద్వారా అధికారపు అథారిటీ ఉంటుంది. ఎప్పుడైతే సీటును వదిలివేస్తారో అప్పుడు అథారిటీ ఎక్కడినుండి వస్తుంది? సీటు నుండి దిగి తమ శక్తులకు ఆర్డర్ చేస్తారు, కావుననే అవి ఆర్డర్ను అంగీకరించవు. ఆ తరువాత నేను ఉన్నది మాస్టర్ సర్వశక్తివంతునిగానే కాని శక్తులు పనిచేయడం లేదే అని ఆలోచిస్తారు. దాసుల ఆర్డర్ను దాసులు పాటిస్తారా లేక యజమానుల ఆర్డర్ను దాసులు పాటిస్తారా? అప్పుడిక ముఖము ఎలా అయిపోతుంది? ఏ విధంగా బలహీన శరీరము కలవారి ముఖము పాలిపోతుందో, ఎందుకంటే వారిలో రక్తము యొక్క శక్తి ఉండదు. అలా బలహీన ఆత్మ ఉదాసీనంగా అయిపోతుంది. జ్ఞానము కూడా వింటారు, సేవ కూడా చేస్తారు కాని ఉదాస రూపంలో చేస్తారు. సంతోషపు శక్తి, సర్వప్రాప్తుల శక్తి అంతమైపోతుంది. దాసులు సదా ఉదాసీనంగానే ఉంటారు. దాస ఆత్మలలో నవ్వు ప్టుటించే ఇంకే విషయాలు ఉంటాయి? కన్ఫ్యూజ్ అయిపోయాము, తికమకపడిపోయాము అని చిన్న, చిన్న విషయాలలో అంటూ ఉంటారు. కించూపు తగ్గిపోయినప్పుడు ఒకదానికి బదులుగా రెండు, రెండుగా, ముడు, ముడుగా కనిపిస్తాయి, అప్పుడు ఇది నిజమా, అది నిజమా అంటూ తికమకపడిపోతారు. అలాగే బలహీన ఆత్మలు ఒక్క మార్గానికి బదులుగా వేరే మార్గాలను కూడా చూస్తారు. ఒక్క శ్రీమతంతోపాటు ఇతర మతాలు కూడా కనిపిస్తాయి అప్పుడు ఇది చేయాలా లేక అది చేయాలా, ఇది యధార్థమా లేక అది యధార్థమా అని ఆలోచిస్తారు. ఒకే మార్గము ఉన్నప్పుడు, ఒకే శ్రేష్ఠ మతము ఉన్నప్పుడు ఇది చేయాలా లేక మరింకేదైనా చేయాలా అన్న ప్రశ్నే లేదు. మీరు కన్ఫ్యూజ్ ఎందుకు అవ్వరు? స్వయమే రెండింటినీ తయారుచేసుకొని ద్వంద్వములోకి వస్తారు కావున ఈ విచిత్రమైన నడవడికను చూసి బాప్దాదా నవ్వుకుంటున్నారు. మీరు సీటుపై స్థితులైతే ఏకరసంగా ఉంటారు అని బాప్దాదా అంటారు. కాని చంచలమైన పిల్లల సమానంగా పదే పదే చుట్టూ తిరిగే అభ్యాసంతో మాయ యొక్క వలయం వచ్చేసింది అని అంటారు. కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఎటువంటి ఆధారమూ లేదు. వ్యర్ధమైన మరియు బలహీనమైన సంకల్పాలను ఆధారంగా తీసుకుంటారు. ఎప్పుడైతే వ్యర్ధమైన మరియు బలహీనమైనవాటిని ఆధారంగా తీసుకుంటారో అప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది? చిక్కుకుపోతారు లేక వేళ్ళాడతారు, క్రింద పడిపోతారు. బాబా, నేను మీవాడిని, మీరు శక్తిని ఇవ్వండి అని ఆర్తనాదాలు చేస్తారు. మీరు సీటుపై సెట్ అయి ఉన్నట్లయితే జ్ఞానసూర్యుని శక్తుల కిరణాలు మీ సీటు యొక్క ఛత్రఛాయగా, స్వతహాగా మరియు సదా ప్రాప్తమవుతాయి. సీటు నుండి క్రిందకు దిగి వ్యర్ధమైన లేక బలహీనమైన సంకల్పాల గోడలను నిలబెడతారు. వ్యర్ధ సంకల్పము ఒక్కటే రాదు. ఒక్క క్షణంలో ఒకదాని నుండి అనేక సంకల్పాలు ఉత్పన్నమైపోతాయి మరియు దానితోనే అనేక ఇటుకల గోడలుగా అయిపోతాయి. కావున జ్ఞానసూర్యుని శక్తుల కిరణాలు చేరుకోజాలవు మరియు సహాయం లభించడం లేదు, శక్తి లభించడం లేదు, సంతోషము కలగడం లేదు లేక స్మృతి నిలవడం లేదు అని అంటూ ఉంటారు. అసలు అది ఎలా రాగలదు? కావున బాప్దాదా పాత పిల్లలు మరియు కొత్త పిల్లలు ఎవరెవరైతే ఇటువంటి ఆటను ఆడతారో వారి ఆటను చూసి నవ్వుకున్నారు. ఒక్క క్షణంలో అయిపోవలసిన విషయాన్ని ఇంత కష్టంగా ఎందుకు చేసేసారు? ఒకే దారిని, ఒకే మతమును వదిలి మన్మతమును, పరమతమును ఎందుకు మిక్స్ చేస్తారు? తమ బలహీనతలతో తయారుచేసుకున్న మార్గాలను, ఇలా అయితే జరుగుతూనే ఉంటుంది, ఇలా అయితే నడుస్తూనే ఉంటుంది అన్న ఈ మార్గాలను స్వయమే తయారుచేసుకొని స్వయమే దారితప్పిపోయే ఆటలలోకి వచ్చేస్తారు, గమ్యస్థానం నుండి దూరమైపోతారు. ఇలా ఎందుకు చేస్తారు? లేక అలా అయిపోతోంది, చేయడం లేదు కాని అయిపోతోంది అని ఆలోచిస్తున్నారా? అలా ఎందుకు జరుగుతుంది? జబ్బు ఎందుకు వస్తుంది? నిర్లక్ష్యము లేక బలహీనతతో వస్తుంది లేక రోగం వచ్చేస్తుంది అని అంటారా? బలహీనంగాను అవ్వకండి అలాగే మర్యాదల పత్యము నుండి, మర్యాదల రేఖ నుండి బైటకు రాకండి. ఇప్పటివరకు ఇదే ఆటను ఆడుతున్నారా? విశ్వకళ్యాణపు కాంటాక్టు తీసుకున్న ఇంత పెద్ద వృత్తి కలవారు ఇలా చిన్నపిల్లల ఆటను ఆడుతూ ఉండడం అనేది ఎప్పటివరకు? విశ్వం మీకోసం ఎదురుచూస్తోంది, శాంతిదూతలు రావాలని కోరుకుంటుంది. మా దేవతలు, మాపై శాంతి యొక్క ఆశీర్వాదాలు లేక కృపను చూపించేందుకు రావాలని కోరుకుటోంంది. జోరుజోరుగా ఆర్తనాదాలు చేస్తూ గంటలు మ్రోగిస్తున్నారు. అప్పుడప్పుడు తాళాలు మ్రోగిస్తూ ఉంటారు, ఢంకాలు కూడా మ్రోగిస్తూ ఉంటారు. మీరు రండీ, రండీ అని పిలుస్తూ ఉంటారు. ఇటువంటి దేవ ఆత్మలు తమ బాల్యపు ఆటలో ఉన్నట్లయితే మరి వారి పిలుపును ఎలా వింటారు? కావున వారి పిలుపును వినండి మరియు ఉపకారము చేయండి. ఏమి చేయాలో అర్థమైందా? అచ్ఛా! బాబా కూడా సమయాన్ని గూర్చి ఆలోచిస్తారు, మీరు ఆలోచించరు.
ఇటువంటి సదా శ్రేష్ఠ వివేకవంతులకు, సదా ఒకే మతముపై, ఒకే మార్గముపై నడిచేవారికి, ఏకరస స్థితిలో స్థితులై ఉండేవారికి, సదా ఒక్క క్షణపు అధికారమును స్మృతిలో ఉంచుకొని సమర్ధ ఆత్మగా ఉండేవారికి, వ్యర్ధ సంకల్పాల ఆటను సమాప్తంచేసి విశ్వకళ్యాణము చేసే శ్రేష్ఠ సేవాధారులకు ఇటువంటి మహాన్ ఆత్మలకు, దేవ ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
కుమారీలతో:- కుమారీలందరూ స్వయమును శివశక్తులుగా భావిస్తున్నారా? శక్తులు సదా ఎక్కడ ఉంటారు? శివునితో ఉంటారు కదా! ఎవరు ఎవరితో ఉంటారో వారి సాంగత్యపు రంగు వారిపై తప్పకుండా పడుతుంది కదా! కావున బాబా గుణాలేవైతే ఉన్నాయో, బాబా కర్తవ్యాలేవైతే ఉన్నాయో అవే మీ గుణాలు మరియు కర్తవ్యాలు కదా! బాబా కర్తవ్యము సేవ కావున మీరందరూ సేవాధారులే కదా! సేవ చేస్తున్నారా లేక చేయాలా? సదా బాబా సమానంగా అవ్వాలి అన్న లక్ష్యమును ఉంచండి. ఇవి బాబా వంటి కర్మలా, బాబా వంటి సంకల్పాలా, బాబా వంటి మాటలా అని ప్రతి విషయంలోను పరిశీలించుకోండి. అలా ఉన్నట్లయితే చేయండి లేకపోతే పరివర్తన చేసేయండి ఎందుకంటే సాధారణ కర్మలను అరకల్పము చేసారు ఇప్పుడైతే బాబా సమానంగా అవ్వాలి. అందరూ బాబా సమానమైన విశ్వసేవాధారులే కదా! హద్దులోనివారు కాదు. ధైర్యము బాగుంది, ధైర్యము మరియు ఉత్సాహంతో ముందుకువెళుతున్నారు. ఉల్లాస, ఉత్సాహాలే సదా ముందుకు తీసుకువెళుతూ ఉంటాయి.
సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉండేవారు ప్రతి విషయంలోను నెంబర్ వన్గా ఉంటారు. స్మృతిలోను నెంబర్ వన్గా, జ్ఞానము, ధారణ, సేవ అన్నింలోను నెంబర్వన్గా ఉంటారు. మీరు అలా ఉన్నారా? నెంబర్వన్ ఉల్సాస ఉత్సాహాలు కలవారు ఇళ్ళల్లో ఎలా ఉండగలరు? నిర్బంధనులుగా ఉంటారు కదా! అందరూ ఎవరు? పంజరంలోని పకక్షులా లేక స్వతంత్ర పకక్షులా? చదువు యొక్క పంజరం ఉందా, మాతా పితల పంజరం ఉందా? ఇలా పంజరంలో ఉండేవారిని నెంబర్వన్ అని ఎలా అనగలము? ఇప్పుడు ఇక నిర్బంధనులుగా అయిపోండి. శక్తిశాలీ ఆత్మల ముందు ఎవ్వరూ ఏమీ చేయలేరు. తీవ్రముగా ప్రజ్వరిల్లుతున్న అగ్ని ముందుకు ఎవ్వరూ రారు, దూరం నుండే పారిపోతారు. మీరు కూడా యోగాగ్నిని ఎలా ప్రజ్వలితం చెయ్యాలంటే బంధనాన్ని కలిగించేవారెవ్వరూ మీముందుకు రాలేకపోవాలి. ఏదైనా జంతువును తరిమేయాలంటే అగ్నిని ఉపయోగిస్తారు, ఆ అగ్ని ముందుకు ఏ జంతువు రాజాలదు. అలా లగనము అనే అగ్నిని తీవ్రతరం చేయండి. ఇప్పటివరకు బంధనము ఉన్నట్లయితే లగనము ఉందికాని అగ్నిగా ఇంకా తయారవ్వలేదు. లగనము ఉంది కాబట్టే ఇక్కడివరకు చేరుకున్నారు. కాని ఆ లగనము అగ్నిలా అయిపోవాలి, అప్పుడు నిర్బంధనులుగా అయిపోతారు. లగనము ఫుల్ఫోర్స్లో ఉండాలి. శక్తులు మైదానంలోకి రండి. ఇంత పెద్ద గ్రూపు ఏదైతే వచ్చిందో వారు మరి తప్పకుండా అద్భుతము చేస్తారు కదా! ఇంతమంది హ్యాండ్స్ వెలువడినట్లయితే అద్భుతము జరుగుతుంది. అచ్ఛా!
Comments
Post a Comment