02-05-1983 అవ్యక్త మురళి

02-05-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

మాయను దోషిగా చేసేందుకు బదులుగా మాస్టర్ రచయితలుగా, శక్తిశాలులుగా అవ్వండి'

ఈరోజు బాప్దాదా మొత్తం సంగఠనలో, జ్ఞాన యోగ స్వరూపంగా అయి మాస్టర్ రచయిత యొక్క స్థితిలో సదా స్థితులై ఉండే ఆత్మలను విశేషంగా చూస్తున్నారు. అందరూ స్వయమును జ్ఞానీ మరియు యోగీ ఆత్మలుగా పిలిపించుకుంటారు కాని బాబా సమానమైన జ్ఞానీ ఆత్మలు, బాబా సమానమైన యోగీ ఆత్మలుగా ఉండడంలో నెంబర్వారీగా ఉన్నారు. బాప్ సమాన్ అనగా మాస్టర్ రచయిత యొక్క పొజిషన్లో సదా స్థితులై ఉండేవారు. ఈ మాస్టర్ రచయిత యొక్క సహజ ఆసనంపై స్థితులై ఉండే శక్తిశాలీ ఆత్మ ముందు మొత్తం రచన అంతా దాసీ రూపంలో సేవలో సహయోగిగా అయిపోతుంది. మాస్టర్ రచయితలు క్షణంలో తమ శుద్ధ సంకల్పాలరూపీ ఆర్డర్తో ఎటువంటి వాయుమండలమును తయారుచేసుకోవాలనుకుంటే అటువంటి వాయుమండలమును తయారుచేసుకోవచ్చు. ఎటువంటి వైబ్రేషన్లను వ్యాపింపజేయాలనుకుంటే అటువంటి వైబ్రేషన్లను వ్యాపింపజేయవచ్చు. ఏ శక్తిని ఆహ్వానించినా ఆ శక్తి సహయోగిగా అయిపోతుంది. ఏ ఆత్మకు ఏ అప్రాప్తి ఉందో తెలుసుకొని సర్వప్రాప్తుల యొక్క మాస్టర్దాతలుగా అయి ఆ ఆత్మలకు ఇవ్వవచ్చు. ఇటువంటి శక్తిశాలీ మాస్టర్ రచయితలు సదా సహజ ఆసనధారులుగా ఎంతవరకు అయ్యారు అన్నది చూస్తున్నారు. బాబా ఏం గమనించారు? నెంబర్వారీగా అయితే అందరూ ఉన్నారు. కాని మాస్టర్ రచయితలుగా పిలువబడేవారు కొందరు తమ రచన మరియు సంకల్ప శక్తి యొక్క ఒక్క వ్యర్ధ సంకల్పంతో కూడా వ్యాకులపడిపోతారు, భయపడిపోతారు. స్మృతి యొక్క ప్రెజర్ తగ్గిపోతుంది కావున ఉల్లాస ఉత్సాహాల నాడి మెల్లగా కొట్టుకుంటుంది. నిరుత్సాహపు చెమటలు వెలువడుతూ ఉంటాయి, ఇలా జరుగుతుంది కదా! ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నదానిలో వ్యాకులపడుతూ ఉంటారు. పొరపాటు ఒక్క క్షణంలో జరుగుతుంది. తమ మాస్టర్ రచయిత అన్న పొజిషన్ నుండి కిందకు వచ్చేస్తారు. ఎక్కడైతే పొజిషన్ సమాప్తమైపోతుందో లేక విస్మృతి వస్తుందో అదే క్షణంలో మాయ యొక్క సైన్యము అపొజిషన్ చేసేందుకు చేరుకుంటుంది. మాయను ఎవరు ఆహ్వానిస్తారు? స్వయం క్రిందకు వచ్చేస్తారు, పొజిషన్ యొక్క సీటును వదిలివేస్తారు అప్పుడు ఖాళీస్థానమును మాయ తనదిగా చేసేసుకుంటుంది. కావున నేను దోషిని కాను, నన్ను ఆహ్వానిస్తారు కాబట్టి నేను వస్తాను అని మాయ అంటుంది. అర్థమైందా? అచ్ఛా! ఈరోజు కలుసుకునే రోజు, ఇంకా ఏమేమి చేస్తారో ఇంకెప్పుడైనా వినిపిద్దాము.

సర్వ మాస్టర్ రచయితలు, సహజ ఆసనధారులు, సదా బాలకుల నుండి యజమానులుగా అయ్యే స్మృతి స్వరూపులకు, సదా బాబా సమానమైన జ్ఞాన యుక్తులకు, ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

కుమారీలతో:- కుమారీలు తమ నిర్ణయాన్ని తీసుకున్నారా? ఎందుకంటే కుమారీ జీవితమే నిర్ణయాల సమయము. నిర్ణయం తీసుకునే సమయంలో బాబా వద్దకు చేరుకున్నారు, మీరు ఎంత భాగ్యవంతులు? మీ జీవితం కొద్దిగా ముందుకు వెళ్ళిపోయినా పంజరంలోని మైనాలుగా అయిపోయి ఉండేవారు. మరి మీరు ఎలా అవ్వాలి? పంజరంలోని మైనాలుగానా లేక స్వతంత్ర పకక్షులుగానా? కుమారీలైతే స్వతంత్ర పకక్షులు. కుమారీలు ఉద్యోగం చేయవలసిన అవసరం కూడా ఏముంది! బ్యాంకు బ్యాలెన్స్ను తయారుచేసుకోవాలా? లౌకిక తండ్రి వద్ద ఉన్నా రెండు రొట్టెలు దొరుకుతాయి, అలౌకిక తండ్రి వద్ద ఉన్నా ఎటువంటి లోటూ లేదు, మరి ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? సెంటర్లో ఉండాలంటే భయమేస్తోందా? మమకారము ఉంది అని అన్నా దు:ఖపు అల రాగలదు. లౌకికంలో కూడా కుమారీలు ఇంటిలో ఉండరు. బాబా యొక్క సింహాసనానికి అధికారులము అన్న ఇదే స్మృతిలో ఉండండి, సత్యయుగ రాజ్య సింహాసనము కూడా ఈ ఆసనము ముందు విలువలేనిదే! సదా కిరీటము మరియు సింహాసనానికి అధికారులము అన్న ఇదే స్మృతిలో ఉండండి. ఎవరికైనా కూర్చునేందుకు చాలా మంచి ఆసనం దొరికినట్లయితే దాన్ని వారు వదులుతారా? శ్రేష్ఠముగానే అవ్వాలి, అవును అంటే అవును. మరణించేదుంటే ఒక్క వ్రేటుతో మరణించాలి. ఇలా మరణించడమే మధురమైనది. లక్ష్యము పక్కాగా ఉన్నట్లయితే ఎవరూ చలింపజేయలేరు. లక్ష్యము కచ్ఛాగా ఉన్నట్లయితే ఎన్నో సాకులు, ఎన్నో విషయాలు వస్తాయి, అవి అవరోధాన్ని కలిగిస్తాయి. కావున సదా దృఢ సంకల్పాన్ని ఉంచండి.

అదర్ కుమారుల గ్రూపుతో:- అన్నిరకాల శ్రమల నుండి బాబా విడిపించేసారు కదా! భక్తి యొక్క శ్రమ నుండి విముక్తులయ్యారు మరియు గృహస్థ జీవితపు శ్రమ నుండి కూడా విముక్తులయ్యారు. గృహస్థ జీవితంలో ట్రస్టీలుగా అయిపోయారు కావున శ్రమ సమాప్తమైపోయింది కదా! భక్తి యొక్క ఫలము లభించింది. కావున భక్తి యొక్క భ్రమించడము అనగా శ్రమ సమాప్తమైపోయింది. మేము భక్తిఫలాన్ని తినేవారము అని భావిస్తున్నారా? జ్ఞానమును భక్తి యొక్క ఫలము అని అంటారు, కాని మీకు భక్తి యొక్క ఫలముగా స్వయంగా జ్ఞానదాతయే లభించారు. కావున భక్తి యొక్క ఫలము కూడా లభించింది మరియు గృహస్థపు దు:ఖము, అశాంతి యొక్క జంఝాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమాప్తమైపోయాయి, రెండింటి నుండి ముక్తులైపోయారు. జీవన బంధన నుండి జీవన్ముక్త ఆత్మలుగా అయిపోయారు. ఎవరైనా బంధనాల నుండి ముక్తులైపోతే సంతోషంలో నాట్యంచేస్తూ ఉంటారు అలాగే బంధనముక్త ఆత్మలైన మీరు కూడా సదా సంతోషంలో నాట్యంచేస్తూ ఉండండి. కేవలం గీతాలను గానం చేయండి మరియు సంతోషంలో నాట్యం చేయండి. ఇదైతే సహజమైన పనే కదా! మేము జీవన్ముక్త ఆత్మలము, అన్ని బంధనాలు సమాప్తమైపోయాయి, శ్రమ నుండి విముక్తులైపోయాము, ప్రేమలోకి వచ్చేసాము... అన్నది సదా గుర్తుంచుకోండి. కావున సదా తేలికగా ఎగురుతూ ఉండండి. పూజారుల నుండి పూజ్యులుగా, దు:ఖితుల నుండి సుఖవంతులుగా, ముళ్ళ నుండి పుష్పాలుగా అయిపోయారు, ఎంత తేడా ఏర్పడింది! ఇప్పుడు పాత కలియుగ ప్రపంచపు సంస్కారాలు ఏవీ ఉండకూడదు. పాత ప్రపంచపు పాత సంస్కారమేదైనా ఉన్నట్లయితే అది తనవైపుకు ఆకర్షించుకుంటుంది. కావున సదా కొత్త జీవితము, కొత్త సంస్కారము. ఇది శ్రేష్ఠ జీవితము, కావున శ్రేష్ఠ సంస్కారాలు కావాలి. స్వకళ్యాణము మరియు విశ్వకళ్యాణము చేయడమే శ్రేష్ఠ సంస్కారము. ఇటువంటి సంస్కారాలను నింపుకున్నారా? స్వకళ్యాణము మరియు విశ్వకళ్యాణము తప్ప ఇంకే సంస్కారాలైనా ఉన్నట్లయితే అవి ఈ జీవితంలో విఘ్నాలను కలిగిస్తాయి. కావున పాత సంస్కారాలన్నీ సమాప్తమైపోవాలి. సదా నేను ఆత్మిక గులాబి పుష్పమును అని స్మృతిలో ఉండాలి. ఆత్మిక గులాబి పుష్పాలు అనగా సదా ఆత్మిక సుగంధమును వ్యాపింపజేసేవారు. ఏ విధంగా గులాబీపువ్వు తన సుగంధాన్ని వ్యాపింపజేస్తుందో, దాని రంగు, రూపము కూడా మంచిగా ఉంటుందో, అందరినీ తనవైపుకు ఆకర్షితం కూడా చేస్తుందో అలాగే మీరు కూడా బాబా పూదోటలోని ఆత్మిక గులాబీలు. గులాబీలను సదా పూజలో అర్పణ చేయడం జరుగుతుంది. అలాగే ఆత్మిక గులాబీలు కూడా బాబా ముందు అర్పణ అవుతారు, ఈ యజ్ఞ సేవాధారులుగా అవ్వడము కూడా అర్పణ అవ్వడమే. అర్పణ అవ్వడము అనగా ఒక్క స్థానంలో ఉండడమని కాదు. ఎక్కడ ఉన్నాకాని శ్రీమతంపై ఉండాలి, తమది అనేది కొద్దిగా కూడా కలువకూడదు. ఈ విధంగా స్వయమును భాగ్యవంతులుగా, సుగంధమయమైన ఆత్మిక గులాబీలుగా భావిస్తున్నారు కదా! మేము అల్లా పూదోటలోని ఆత్మిక గులాబీలము అన్న స్మృతిలోనే సదా ఉండండి. ఇదే నషాలో సదా ఉండాలి. నషాలో ఉండండి మరియు బాబా గుణాల గీతాలను గానం చేస్తూ ఉండండి. ఈ ఈశ్వరీయ నషాలో ఏం మాట్లాడినా దానిద్వారా భాగ్యము తయారవుతుంది. సదా స్వయమును విజయీ పాండవులుగా భావిస్తూ నడుస్తూ ఉండండి. పాండవులు కల్పకల్పము విజయమును పొందారు అన్నది ఎంతో ప్రసిద్ధము. ఐదుగురే ఉన్నా కూడా విజయులుగా ఉన్నారు. విజయానికి కారణం- బాబా తోడుగా ఉన్నారు. ఏ విధంగా బాబా సదా విజయులుగా ఉన్నారో అలా బాబాకు చెందినవారిగా అయ్యేవారు సదా విజయులుగా ఉంటారు. మేము సదా విజయీ రత్నాలము అన్నదే సదా స్మృతిలో ఉండాలి, అప్పుడు ఈ విషయం కూడా ఎంతో నషాను మరియు సంతోషాన్ని కలిగిస్తుంది. పాండవుల కథను విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇది మా కథ అని అనిపిస్తుంది. నిమిత్తముగా ఒక్క అర్జునుని గూర్చి చెప్పడం జరుగుతుంది. ప్రపంచం లెక్కలో ఐదుగురు ఉన్నారు, కాని సదా విజయులు. ఇదే స్మృతి సదా తాజాగా ఉండాలి. ఎంత స్పష్టమైన స్మృతిగా ఉండాలంటే అది నిన్న విషయములా అనిపించాలి. అందరూ ఇంటిలో కూర్చొనే భాగ్యమును తీసుకున్నారు కదా! ఇంటిలో కూర్చొనే ఎటువంటి శ్రేష్ఠాతి శ్రేష్టమైన భాగ్యం లభించిందంటే అది అంతిమంవరకు గాయనం చేయబడుతుంది. బాబా ఇంటికి వచ్చారు, మీ ఇంటికి వచ్చారు, వేడుక జరుపుకున్నారు, తిన్నారు, ఆడుకున్నారు. ఎప్పుడైతే బాగా అలిసిపోతారో అప్పుడు విశ్రాంతిలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా వ్యాపారం చేసి, ఉద్యోగంచేసి అలిసిపోయి వస్తారు మరియు ఇక్కడికి రావడంతోనే కమలంలా అయిపోతారు. బాబా తప్ప ఇంకెవ్వరూ కనిపించరు, విశ్రాంతి లభిస్తుంది. ఒక్క బాబాతో కలుసుకోవడం, వారి మాటలు వినడం, వారిని స్మృతి చేయడం ఈ పని మాత్రమే ఉంటుంది. కావున అలసట తగ్గి రిఫ్రెష్ అయిపోయారు కదా! ఎవరైనా ఇక్కడకు రెండు గంటలకోసం వచ్చినా రిఫ్రెష్ అయిపోతారు. ఎందుకంటే ఈ స్థానము ఉన్నదే రిఫ్రెష్ అయ్యేందుకు, ఇక్కడకు రావడమే రిఫెష్ అవ్వడము. అచ్ఛా!

వీడ్కోలు సమయంలో –

పిల్లలు ఒక్కొక్కరు ఒకరికన్నా ఒకరు ప్రియమైనవారు. అందరిలోను వారివారి విశేషతలు ఉన్నాయి. చివరి నెంబర్లోనివారైనా కాని వారు బాబాకు పిల్లలే. పిల్లలు ఎలా ఉన్నా కాని త్యాగము మరియు భాగ్యమునైతే పొందారు కదా! అందరూ స్వయమును బాబాకు ప్రియమైనవారిగా భావించండి. నెంబర్వారీగా ఉన్నాకాని ప్రియస్మృతులైతే అందరికీ లభిస్తాయి. బాప్దాదా అందరికీ ఎంతో ప్రేమతో ప్రియస్మృతులను అందిస్తారు. ప్రేమ అయితే అందరికీ ఒకేవిధంగా ఉంటుంది. అందరూ చాలాకాలం తరువాత కలిసిన స్నేహులు, బాబాకు భుజాలు, కావున తమ భుజాలు తప్పకుండా ప్రియంగా అనిపిస్తారు కదా! తమ భుజాలు ఎక్కడైనా అప్రియంగా ఉంటారా? చివరి నెంబర్వారు కూడా క్లోటాదిమందిలో ఏ ఒక్కరిగానో ఉంటారు కదా! కావున క్లోటాదిమందికన్నా ప్రియమైనవారిగా అయిపోయారు కదా! అచ్ఛా- ఓం శాంతి.

Comments