31-12-1983 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
''శ్రీమతమురూపీ చెయ్యి సదా చేతిలో ఉన్నట్లయితే మొత్తము యుగము చేతిలో చెయ్యి వేసుకుని నడుస్తూ ఉంటారు''
ఈరోజు సాగరతీరములో అనగా మధువన తీరములో మధుర మిలనము జరిపేందుకు ప్రియుడు తన ఆత్మిక ప్రియురాళ్ళతో కలిసేందుకు వచ్చారు. ఎంత దూరదూరాలనుండి మిలనము చేసుకునేందుకు వచ్చారు, ఎందుకు? ఇటువంటి అద్భుతమైన ప్రియుడు మొత్తము కల్పములో మరెప్పుడూ లభించజాలడు. ప్రియుడు ఒక్కడు, కానీ ప్రియురాళ్ళు ఎంత మంది? ప్రియురాళ్ళు అనేకమంది, ప్రియుడు ఒక్కడు. ఈరోజు విశేషంగా ప్రియురాళ్ళ గానసభలోకి వచ్చారు. ఈ సభలో ఉత్సవము జరుపుకోవటము ఉంటుంది కానీ వినిపించటము ఉండదు కనుక ఈరోజు వినిపించేందుకు రాలేదు, కలుసుకునేందుకు మరియు జరుపుకునేందుకు వచ్చారు. విశేషంగా డబల్ విదేశీ పిల్లలు ఈరోజు ఉత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చారు. నూతన సంవత్సరాన్ని జరుపుకునే సంకల్పాన్ని తీసుకునివచ్చారు. బాప్దాదాకూడా నూతన సంవత్సరములో స్నేహము మరియు సహయోగ సంపన్నమైన అభినందనలను ఇస్తున్నారు. సంగమయుగము నూతన యుగము. భవిష్య సత్యయుగము ఈ వర్తమానములోని నూతన యుగపు నూతన జీవితపు ప్రాలబ్ధము. బ్రాహ్మణుల కొరకు నవయుగము, శ్రేష్ఠ యుగము ఇప్పుడే ఉంది. ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అయ్యారో అప్పుడే నూతన యుగము, నూతన ప్రపంచము, నూతన దినము, నూతన రాత్రి ప్రారంభమయ్యాయి. ఈ నూతన యుగపు నూతన జీవితములోని ప్రతి క్షణము పదమాలతో సమానమైనది, వజ్రతుల్యమైనది. సత్యయుగములో ఈ గీతమును గానం చేయరు, ఇది ఇప్పటి విషయము. ప్రారంభమునుండికూడా బాప్దాదా ఏ గీతముద్వారా పిల్లలను మేల్కొలిపారు? మేల్కోండి ప్రియురాళ్ళలారా, మేల్కోండి.... ఎందుకు మేల్కోవాలి? నవయుగము వచ్చింది. ఇది చిన్నప్పటి గీతము కదా! ఇప్పుడైతే క్రొత్త-క్రొత్త పాటలను తయారుచేసారు. మొది పాటగా బాప్దాదా దీనినే వినిపించారు కదా! మరి నవయుగము ఎప్పుడు ఉంది? ఇప్పుడు. పాతదానిముందు కొత్తదిగా అనిపిస్తుంది కదా! పాత జీవితము మారిపోయింది. క్రొత్త జీవితములోకి వచ్చారు కదా! స్పృహ లేనివారుగా ఉండేవారు. నేను ఎవరిని అన్న స్పృహ ఉండేదా? లేదు కదా! కనుక స్పృహ లేనివారుగా ఉన్నట్లు కదా! స్పృహ లేని స్థితినుండి ఇప్పుడు స్పృహలోకి వచ్చారు. క్రొత్త జీవితాన్ని అనుభవము చేసారు కదా! కళ్ళు తెరవటంతోనే కొత్త సంబంధాలు, కొత్త ప్రపంచాన్ని చూసారు కదా. కనుక నూతన యుగమునకు చెందిన నూతన యుగములో నూతన సంవత్సరానికి అభినందనలు.
లౌకిక ప్రపంచములో కూడా హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. మామూలుగా ఎప్పటికీ హ్యాపీగా ఉండరు కానీ అనానికైతే హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. ఇప్పుడు మీరందరూ అసలైన రూపముతో హ్యాపీ న్యూ ఇయర్ అనిమాత్రమే కాకుండా హ్యాపీ న్యూ యుగ్ అని అంటారు. మొత్తము యుగమంతా సంతోషాల యుగము. హ్యాపీ న్యూ ఇయర్ అని అనేటప్పుడు అభినందించే సమయములో ఏం చేస్తారు? మొదటైతే ఫారన్వాళ్ళ పద్ధతి - చేతిలో చేతిని తప్పకుండా కలుపుతారు. బాప్దాదా చేతిలో చేతిని ఎలా కలుపుతారు? స్థూల చేతినైతే ఒక్క క్షణం కొరకు కలుపుతారు, కానీ బాప్దాదా మొత్తము యుగమంతా కలుపుతారు అనగా ఒక్కటే శ్రేష్ఠ మతమురూపీ చేతిని ఇస్తారు, చేతిలో చెయ్యి వేసి అంతిమంలోకూడా తోడుగా తీసుకుపోతారు. శ్రీమతరూపీ చెయ్యి మీ అందరితోటి ఉంది కనుక మొత్తము యుగమంతా చేతిలో చేతిని వేసి నడుస్తారు. చేతిలో చెయ్యి వేసి నడవటము, ఇది స్నేహమునకుకూడా గుర్తు మరియు సహయోగమునకు కూడా గుర్తు. ఎప్పుడైనా ఎవరైనా నడుస్తూ-నడుస్తూ అలసిపోయినట్లయితే రెండవవారు వారి చేతిని పట్టుకుని తీసుకుపోతారు. ఆత్మిక ప్రియుడు ప్రియురాళ్ళ చేతిని ఎప్పుడూ వదిలిపెట్టడు. చెయ్యి మరియు తోడు ఎల్లప్పుడూ ఉంటాయి అన్నది అంతిమము వరకు ఉన్న ప్రతిన. ప్రియురాళ్ళందరూ చేతినైతే బాగా గ్టిగా పట్టుకున్నారు కదా? లూజ్గా అయితే పట్టుకోలేదు కదా! వదిలేవారు కారు కదా! ఎవరైతే పట్టుకుంటూ, వదిలిపెట్తూ ఉంటారో వారు చేతులెత్తండి. ఒక్కోసారి వదలటం, ఒక్కోసారి పట్టుకోవటము, ఇలా చేసేవారు ఎవరైనా ఉన్నారా? వీరి విశేషత ఇదే, దాచిపెట్టేవారు కారు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారు. అందువలనకూడా సగం విఘ్నాలు మంచిగా వినిపించటం వలన సమాప్తమైపోతాయి. కానీ కచ్చా వ్యాపారము ఎంత వరకు? పాత సంవత్సరములో పాత పద్ధతులు, వ్యవహారాలు సమాప్తము చేసుకోవాలి కదా! లేక కొత్త సంవత్సరములోకూడా ఇదే పద్ధతులు, వ్యవహారాలు నడుస్తాయా? ఇప్పటివరకు ఏదైతే జరిగిపోయిందో దానికి ఫుల్స్టాప్ అనే బిందువును పెట్టండి, సదా హాథ్ మరియు సాథ్ (చెయ్యి మరియు తోడు)గా ఉండే స్మృతియొక్క బిందువును ఇప్పటినుండి పెట్టండి. చాలా పెద్ద విశేషమైన రోజున మరియు సంతోషాల రోజున విశేషంగా సౌభాగ్యము, భాగ్యము మరియు అభినందనల బిందువును అనగా తిలకమును పెట్తారు. మీరుకూడా విశేష స్మృతియొక్క భట్టి రోజున స్మృతి బిందువును పెట్తారు కదా! ఎందుకు పెట్తారు! భట్టీరోజున ప్రత్యేకంగా బిందువును ఎందుకు పెట్తారు? మొత్తము ఈరోజంతా సహజయోగి మరియు శ్రేష్ఠయోగి స్వరూపములో ఉంటాము అన్న దృఢ సంకల్పమునకు గుర్తుగా బిందువును పెట్తారు. కనుక ఈరోజుకు కూడా కాస్త ఏదైనా అపరిపక్వంగా ఉంటే దృఢ సంకల్పముద్వారా ఫుల్స్టాప్యొక్క బిందువును పెట్టండి, ఇంకొకి సమర్థ స్వరూపపు బిందువు పెట్టండి. బిందువును పెట్టుకోవడము వస్తుందా? పాండవులకు బిందువును పెట్టుకోవటము వస్తుందా? అచ్ఛా, శక్తులకు బిందువును పెట్టుకోవడం వస్తుందా? అవినాశీ బిందువు. ఈరోజు ఉదయంకూడా అందరూ ఏమని ప్రతిజ్ఞ చేసారు? ఉత్సవమును జరుపుకోవాలి కదా? (పెండ్లి ఉత్సవాన్ని జరుపుకోవాలి) ఇప్పుడు పెండ్లి చేసుకోలేదా? పిల్లాపాపలను పెంచలేదా? పెండ్లి అయితే అయిపోయింది, పెండ్లిరోజును జరుపుకునేందుకు వచ్చారు. ఎవరికి పెండ్లి కాలేదో వారు చేతులెత్తండి. ఎన్ని కొంటెపనులు చేసినాగానీ ప్రియుడు వదిలిపెట్టేవాడు కాడు ఎందుకంటే వదిలిపెట్టి ఎక్కడకు పోతారు అన్నది తెలుసు. ఈరోజుల్లో విదేశాలలో ఇది అలవాటుగా ఉంది కదా, వదిలిపెట్టి హిప్పీలుగా అవుతారు, హిప్పీలుగా అవ్వాలా! ఎవర్ హ్యాపీ(సదా సంతోషము)గా అవ్వాలా లేక హిప్పీగా అవ్వాలా? వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, అసలు చూడలేము. మీరందరూ రాజ్య అధికారులు. అప్పుడప్పుడు తుంటరివారుగా అవుతారు అన్నది బాప్దాదాకు తెలుసు. కానీ తోడు తీసుకునిపోతాను అని బాప్దాదా ఏదైతే ప్రమాణము చేసారో దానిని బాప్దాదా వదిలిపెట్టజాలరు కనుక తోడుగా నడిచేదే ఉంది. అచ్ఛా!
కొత్త సంవత్సరములో ఏ నవీనతను చేస్తారు? ఏదైనా కొత్తదాన్నైతే చేస్తారు కదా! ఏదైనా ప్లాన్ను తయారుచేసారా? నిమిత్త టీచర్లు ఏదైనా కొత్త ప్లాన్ను తయారుచేసారా? గీతా భగవానుడినైతే దేశములో ప్రత్యక్షము చేస్తారు. విదేశములో ఏం చేస్తారు? ఏ విషయాలైతే మిగిలిపోయి ఉన్నాయో వాటిని ప్రాక్టికల్లోకి తీసుకురావాలి, ఇదైతే చాలా మంచి విషయము. సమయప్రమాణంగా అన్ని విషయాలు ప్రాక్టికల్ అవుతూ ఉన్నాయి. ఈ విషయంద్వారా అయితే భారతదేశములో నగారాను మ్రోగించనే మ్రోగిస్తారు. ధర్మనేతలను మేల్కొలుపుతారు, సందడి చేస్తారు. ఎవరైతే కాస్త లేచి చాలా మంచిగా చెప్పి మరల నిద్రపోతారో, వారికొరకు ఎవరైనా నిద్రనుండి లేవకపోతే వారిపై చల్లచల్లని నీటిని జల్లుతారు. కనుక భారతవాసులపైకూడా విశేషంగా చల్లి నీటిని చల్లటంద్వారా మేల్కొటాంరు. అచ్ఛా - మరి ఈ సంవత్సరములో ఏ నవీనతను చేస్తారు?
లౌకిక ప్రపంచములో ఎక్కడైతే అలజడి ఉంటుందో, ఆ అలజడి స్థానములో సదా సంతోషమునకు చెందిన అచలస్థితి అనే పతాకాన్ని ఎగరవేయాలి. గవర్నమెంట్ అలజడిలో ఉంటే, గుప్తమైన ప్రభు రత్నాలు సదా సంపన్నము, సదా అచలమునకు చెందిన విశేష జెండాను ఎగురవేయాలి. ఈ దేశములో గుప్తవేషధారులైన ఈ విచిత్ర ఆత్మలు ఎవరు, వీరు దేశములో అతీతంగా మరియు ప్రియమైనవారిగా ఉన్నారు అని గవర్నమెంట్వారికికూడా అటెన్షన్ రావాలి. ఎవరైతే స్వయమును ధనలోటు ఉన్నవారిగా భావిస్తారో వారిని అవినాశీ ధనముతో సంపన్నము చేసి మేము అందరికంటే నిండుగా ఉన్నాము, మేము సదా పదమాపదంపతులము అని అనుభవము చేయించండి. ధన పేదరికము వలన కలిగిన దుఃఖమును వారు మర్చిపోవాలి, అటువంటి అలను వ్యాపింపచెయ్యండి. ఎవరు వచ్చినాగానీ వారు తరగనంతి ఖజానాలతో నిండుగా అయిపోయాము, వేరే ధనము కూడా ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇంకా, ఈ ధనముద్వారా ఆ స్థూల ధనముకూడా స్వతహాగనే సమీపంగా వస్తుంది. దుఃఖము ఇవ్వదు. అచ్ఛా! విదేశములో కొత్త సంవత్సరములో ఏ నవీనతను చేస్తారు? సెంటర్లనైతే తెరుస్తూ పోతున్నారు మరియు తెరుస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సంవత్సరములో విదేశములోకూడా విశేష క్వాలిటీ కలిగిన సేవ విశేష రూపముతో జరగాలి. మీ అందరిలో విశేష క్వాలిటీ అయితే ఉంది, కానీ క్వాలిటీ కలిగిన మీరందరూ ఇంకా విశేష క్వాలిటీ కలిగిన ఆత్మలను, ఎవరైతే స్థాపనా కార్యములో సహయోగులుగా అయ్యారో, అలా విదేశములో నలువైపులనుండి ఒక గ్రూప్ను తయారుచెయ్యండి, ఆ గ్రూప్వారందరూ కలిసి భారతవాసుల సేవార్థం విశేషంగా నిమిత్తులవ్వాలి. ప్రసిద్ధమైన శబ్దమును వ్యాపింపచేసే గ్రూప్ వేరు, కానీ ఇది సంబంధము కలవారిది, వారు సంపర్కమువారు. ఈ గ్రూప్ క్వాలిటీ కలిగినవారి గ్రూప్గా ఉండాలి, వారు సమీప సంబంధములోనివారై ఉండాలి. విశేష జీవితపు పరివర్తన ఉన్న అనుభవము కలవారుగా ఉండాలి, వీరి అనుభవాలద్వారా ఇంకా విశేష క్వాలిటీ కల ఆత్మలు, వారసుల క్వాలిటీవారు వెలువడుతూ ఉండాలి. వారు సేవకు నిమిత్తమైన గ్రూప్ మరియు ఇది వారసత్వ క్వాలిటీ కల సేవాధారీ గ్రూప్. ప్రసిద్ధులుగా కూడా ఉండాలి మరియు వారసులుగా కూడా ఉండాలి. ఇటువంటి గ్రూప్ విదేశములో తయారవ్వటంద్వారా దేశములో సేవకొరకు చ్టుటిరా”వాలి. మీ అనుభవ శక్తిద్వారా రాజనేతలు, ధర్మనేతలు, అన్నిరకాలైన ఆత్మలలో అనుభవము చెయ్యాలన్న కోరికను ఉత్పన్నము చెయ్యగలగాలి. కనుక ఇలా తిరిగే వారసత్వ సేవాధారీ క్వాలిటీ కల గ్రూప్ను తయారుచెయ్యండి. అర్థమైందా!
విదేశములో నలువైపుల శబ్దమును వ్యాపింపచేసే సాధనాలు సహజంగా ఉన్నాయి, కనుక విదేశములో శబ్దము వ్యాపిస్తూకూడా ఉంది మరియు వ్యాపిస్తూ ఉంటుంది. కానీ భారతదేశములో శబ్దమును వ్యాపింపచేసే సాధనాలు అంత సహజంగా లేవు. భారతవాసులను మేల్కొలిపేందుకు పర్సనల్ సేవ కావాలి. అదికూడా చాలా సింపుల్గా అనుభవముయొక్క మాటలతో సేవ జరగాలి. భారతవాసులు విశేష పరివర్తనయొక్క అనుభవముద్వారా పరివర్తన అవుతారు. అటువంటి విశేష అనుభవీలు, ఎవరి అనుభవములో అటువంటి శక్తిశాలీ పరివర్తనకు చెందిన విషయాలు ఉంటాయో - అటువంటి వారి కధలను విని భారతవాసులు ఎక్కువగా ఆకర్షితులవుతారు. భారతదేశములో కథలు, గాథలను వినే పద్ధతి ఉంది. విదేశమువారు ఏం చెయ్యాలో అర్థమైందా? ఇంతమంది టీచర్లు వచ్చారు కనుక అటువంటి గ్రూప్ను తయారుచేసి తీసుకురావాలి. అచ్ఛా!
కొత్త సంవత్సరమునకు విశేష కానుకగా బాప్దాదా వరదానాల మాలను ఇస్తున్నారు. సెరిమనీ(వేడుక)ని జరుపుకున్నప్పుడు వరమాలను వేస్తారు. బాప్దాదా ప్రియురాళ్ళందరికీ వరదానాల మాలను కానుకగా ఇస్తున్నారు. సంతుష్టతద్వారా సదా సంతోషంగా ఉండండి మరియు సంతుష్టం చెయ్యండి. ప్రతి సంకల్పములో విశేషత ఉండాలి, ప్రతి మాటలో మరియు కర్మలో విశేషత ఉండాలి. ఇటువంటి విశేషతా సంపన్నంగా సదా ఉండండి. సదా సరళ స్వభావము, ఒక్కరినుండి సర్వ ప్రాప్తులు, ఇలా ఒక్కరిద్వారా సదా ఏకరసంగా ఉండే సహజ అభ్యాసీలుగా ఉండండి. సదా సంతోషంగా ఉండండి, సంతోషాల ఖజానాను పంచండి. సంతోషపు అలను అందరిలో వ్యాపింపచెయ్యండి. ఇలా సదా సంతోషముతో కూడిన మందహాసము ముఖముపై మెరుస్తూ ఉండాలి. ఇలా హర్షితముఖులుగా ఉండండి. సదా స్మృతిలో ఉండండి, వృద్ధిని పొందండి. ఇటువంటి వరదానాల మాల సదా తోడుగా ఉండాలి. అర్థమైందా. ఇదే కొత్త సంవత్సరపు కానుక. అచ్ఛా!
ఇలా సదాకాలపు వరదానులు, సదా హాథ్ మరియు సాథ్యొక్క అమర శ్రేష్ఠ ఆత్మలు, ప్రతి సంకల్పములో నవీనత అనే విశేషతను జీవితములో తీసుకువచ్చేవారైన ఇటువంటి విశేష ఆత్మలకు, నవయుగముయొక్క, నూతన సంవత్సరముయొక్క అమర ప్రియస్మృతులు. ఎగిరే కళయొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
వ్యక్తిగత మిలనము
స్వయమును సదా పుణ్య ఆత్మగా భావిస్తున్నారా? అన్నింటికంటే అతి పెద్ద పుణ్యము బాబా సందేశమును ఇచ్చి బాబా సమానంగా తయారుచెయ్యటము. మీరు ఇటువంటి శ్రేష్ఠ కర్మను చేసే పుణ్యాత్మలు, ఎందుకంటే ఇప్పటి పుణ్యాత్మయే సదాకాలముకొరకు పూజ్యంగా అవుతుంది. పుణ్య ఆత్మయే పూజ్య ఆత్మగా అవుతుంది. అల్పకాలపు పుణ్యముకూడా ఫలప్రాప్తిని చేయిస్తుంది, అది అల్పకాలికమైనది, ఇది అవినాశీ పుణ్యము ఎందుకంటే అవినాశీ బాబాకు చెందినవారిగా తయారుచేస్తారు. ఇందుకు ఫలముకూడా అవినాశిగా లభిస్తుంది. జన్మజన్మలకొరకు పూజ్య ఆత్మగా అవుతారు. కనుక సదా పుణ్య ఆత్మగా భావిస్తూ ప్రతి కర్మను పుణ్యమైన కర్మగా చేస్తూ ఉండండి. పాపపు ఖాతా సమాప్తము. వెనుకి పాప ఖాతాకూడా అంతము, ఎందుకంటే పుణ్యము చేస్తూ-చేస్తూ పుణ్యము వైపు ఉన్నతమైపోతుంది, పాపము కింద అణగిపోతుంది. పుణ్యము చేస్తూ ఉన్నట్లయితే పుణ్యముయొక్క బ్యాలెన్స్ పెరుగుతుంది మరియు పాపము కింద ఉండిపోతుంది అనగా అంతమైపోతుంది. కేవలము ఇలా పరిశీలించుకోండి - ప్రతి సంకల్పము పుణ్య సంకల్పముగా ఉందా, ప్రతి పలుకు పుణ్యమైనదిగా ఉందా! వ్యర్థ మాటలుకూడా ఉండకూడదు. వ్యర్థము వలన పాపము పోదు మరియు పుణ్య ఫలముకూడా లభించదు కనుక ప్రతి కర్మ, ప్రతి మాట, ప్రతి సంకల్పము పుణ్యమైనదిగా ఉండాలి. ఇటువంటి శ్రేష్ఠ, పుణ్య కర్మను సదాకాలము చేసే పుణ్య ఆత్మలు. దీనినే సదా గుర్తుంచుకోండి. సంగమయుగ బ్రాహ్మణుల పనే ఏంటి? పుణ్యము చెయ్యటము. ఎంత గా పుణ్య కార్యమును చేస్తారో అంతగా సంతోషము కూడా ఉంటుంది. నడుస్తూ-తిరుగుతూకూడా ఎవరికైనా సందేశము ఇచ్చినట్లయితే ఆ సంతోషము ఎంత సమయము ఉంటుంది! కనుక పుణ్య కర్మ సదా సంతోషపు ఖజానాను పెంచుతుంది మరియు పాప కర్మ సంతోషాన్ని పోగొడుతుంది. ఒకవేళ ఎప్పుడైనా సంతోషము మాయమైపోయిందంటే, ఏదో పెద్ద పాపము చెయ్యటమునైతే వదిలేయండి కానీ చిన్న అంశమాత్రపు పాపమునైతే తప్పకుండా చేసి ఉంటారని అర్థం చేసుకోండి. దేహ-అభిమానములోకి రావటము, ఇదికూడా పాపమే కదా! ఎందుకంటే బాబా స్మృతి లేదంటే పాపమే ఉంటుంది కదా, కనుక సదా పుణ్య ఆత్మా భవ. అచ్ఛా!
రాత్రి 12 గంటల తరువాత పిల్లలందరికీ అభినందనలు...
నలువైపుల కల స్నేహీలు, అల్లారు ముద్దు పిల్లలు, సదా సేవాధారులైన పిల్లలకు సదా నూతన ఉల్లాసము, నూతన ఉత్సాహముతో నిండిన జీవితమునకు, నూతన సంవత్సరమునకు అభినందనలు. సంగమయుగము నవయుగము, ఇందులోని ప్రతి క్షణము కొత్తదిగా ఉండాలి, ప్రతి సంకల్పము అతి కొత్తదిగా ఉంటూ ఉల్లాస-ఉత్సాహాలను ప్రాప్తింపజేస్తుంది. అటువంటి యుగములో నూతన సంవత్సర శుభాకాంక్షలనైతే బాప్దాదా సదా ఇస్తూనే ఉంటారు, అయినాకూడా విశేషమైన రోజున - ఎల్లప్పుడు స్వయంకూడా నూతన సేవలో స్వయంకొరకు ప్లాన్స్ను తయారుచేస్తూ ప్రాక్తికల్లోకి తీసుకువస్తూ ఉండండి మరియు ఇతరులకుకూడా మీ నూతన జీవితముద్వారా ప్రేరణను ఇస్తూ ఉండండి అని విశేష స్మృతులను ఇస్తున్నారు. లండన్ నివాసులు లేక ఎవరైతే విదేశములో ఉన్నారో వారందరి ప్రియస్మృతులను మరియు హ్యాపీ న్యూ ఇయర్ కార్డ్లను కూడా పొందాము. చాలా-చాలా ఉత్తరాలుకూడా చేరాయి, చిన్నా-పెద్ద కానుకలనుకూడా పొందాము. బాప్దాదా అటువంటి కొత్తయుగములో శ్రేష్ఠ కర్మను చేసేవారు మరియు కొత్త యుగమును రచించేవారైన పిల్లలకు విశేష వరదానాల సహితంగా నూతన సంవత్సర అభినందనలను ఇస్తున్నారు. అందరూ చాలా మంచి ప్రేమతో మరియు శ్రమతో సేవ చేస్తున్నారు మరియు ఎల్లప్పుడూ సేవలో బిజీగా ఉండి ఇతరులకుకూడా సేవద్వారా బాబా వారసత్వమునకు అధికారులుగా తయారుచేస్తారు. అచ్ఛా! దేశ-విదేశములలోని పిల్లలందరికీ మరల పదే-పదే అభినందనలతో కూడిన ప్రియస్మృతులు.
Comments
Post a Comment