31-12-1982 అవ్యక్త మురళి

31-12-1982         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

బాప్ దాదా యొక్క అలౌకిక స్నేహితులందరికీ శుభాకాంక్షలు.

ఈరోజు సర్వ బ్రాహ్మణ ఆత్మల మనస్సు యొక్క గీతమును, హృదయం యొక్క గీతమును ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించేందుకు అద్భుతరీతితో ఆత్మిక గులాబి పుష్పాల పూదోటలో లేక అల్లా తమ పూదోటలోకి కలుసుకునేందుకు వచ్చారు. ప్రియులు అనండి లేక మిత్రులు అనండి వీరు తోటలలో కలుసుకుంటూ ఉంటారు. కాని ఇటువంటి పూదోట మొత్తం కల్పంలో ఎప్పుడూ లభించజాలదు. నేడు నలువైపులా ఉన్న పిల్లలు మేము కూడా మా హృదయ ప్రియునితో ఈ నూతన సంవత్సర దినమును జరుపుకోవాలి అన్న ఒక్క లగనంలో ఉన్నారు. బాప్దాదా ఈరోజు కేవలం సాకార స్వరూపంలో సమ్ముఖంగా కూర్చున్న ఆత్మిక మిత్రులను మాత్రమే కలవడం లేదు. కాని, సాకార సభలో ఆకారీ రూపధారులైన పిల్లల యొక్క లేక హృదయప్రియులైన స్నేహీ ఆత్మల యొక్క చాలా పెద్ద సభను చూస్తున్నారు. ఇంతమంది ఆత్మిక మిత్రులు, సత్యమైన మిత్రులు ఇంకెవరికైనా ఉంటారా? ఇటువంటి మిత్రులు మరియు ఇంతమంది మిత్రులు ఎవ్వరికీ లభించలేదు మరియు లభించరు కూడా అని బాప్దాదాకు కూడా ఆత్మిక నషా ఉంది. అందరి హృదయపూర్వకమైన గీతము దూరం నుండి లేక సమీపం నుండి వినిపిస్తోంది. అది ఏ గీతము? ఓ బాబా. 'బాబా, బాబా' అన్న గీతము ఒకే స్వరములో మరియు ఒకే రహస్యముతో నలువైపుల నుండి వినిపిస్తోంది. పిల్లలు అనండి లేక మిత్రులు అనండి అందరిదీ ఒకే మాట. 'మీరే మావారు' మరియు మిత్రుడైన భగవంతుడు కూడా ఒక్కొక్కరితోను మీరు నావారు అనే అంటారు. 'ఓహో నా మిత్రులు'. ఆ గీతమును పాడండి (అక్కయ్యలు సాకార బాబాకు ఇష్టమైన- మీరే నావారు... అన్న గీతమును పాడారు). ఈ సుఖమయమైన గీతమును కొద్ది సమయమే గానం చేయగలరు కాని మనస్సు యొక్క గీతము అవినాశిగా మ్రోగుతూ ఉంటుంది. ఈనాటి నూతన సంవత్సరంనాడు అనేకమంది పిల్లల చాలా మంచి సంకల్పాలు, స్నేహపు మాటలు బాప్దాదా వద్దకు ముందే వచ్చే చేరుకున్నాయి. ఈనాటి ఈరోజును సంతోషాల రోజుగా జరుపుకుంటారు కదా! పరస్పరం అభినందనలు తెలుపుకుంటారు. బాప్దాదా కూడా తమ హృదయప్రియులైన అలౌకిక ఆత్మిక మిత్రులకు అభినందనలు తెలుపుతున్నారు.

సదా విధి ద్వారా వృద్ధిని పొందుతూ ఉంటారు. సదా సర్వఖజానాలతో సంపన్నంగా ఉంటారు. సదా ఫరిశ్తాలుగా అయి సర్వ దైహిక సంబంధాల నుండి అతీతంగా ఎగురుతూ ఉంటారు. సదా నయనాలలో, హృదయంలో బాబాను ఇముడ్చుకుంటూ ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న లగనములోనే మగనమై ఉంటారు. సదా మీ ముందుకువచ్చిన పరీక్షలను, సమస్యలను, వ్యర్థ సంకల్పాలను నీటిపైన రేఖలవలే దాటివేసి పాస్ విత్ హానర్గా అవుతారు. ఇటువంటి శ్రేష్ఠ శుభ కామనలతో అభినందనలు తెలుపుతున్నారు. ఒక్కొక్క అమూల్య రత్నము యొక్క విశేషతల గీతమును గానం చేస్తున్నారు. ఈరోజున నాట్యం చేస్తారు, గానం చేస్తారు. కేవలం ఈరోజు మాత్రమే కాకుండా సదా నాట్యం చేస్తూ ఉండండి మరియు గానం చేస్తూ ఉండండి. సదా ప్రతి ఒక్కరికీ ఒక అలౌకిక కానుకను ఇస్తూ ఉండండి. ఏ విధంగా ఎవరైనా గొప్ప వ్యక్తులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేక వారివద్దకు ఎవరైనా వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళరు. మీరందరు కూడా చాలా పెద్దవారు కదా! ఎప్పుడూ ఏ బ్రాహ్మణ ఆత్మతో లేక ఇంకెవరితోనైనా కలిసినప్పుడు ఏమీ ఇవ్వకుండా ఎలా కలుసుకుంటారు? ప్రతి ఒక్కరికీ శుభభావన మరియు శుభకామనరూపీ కానుకను సదా ఇస్తూ ఉండండి. విశేషతను ఇవ్వండి మరియు విశేషతను తీసుకోండి, గుణాలను ఇవ్వండి మరియు గుణాలను తీసుకోండి. ఇటువంటి ఈశ్వరీయ కానుకను అందరికీ ఇస్తూ ఉండండి. ఎవరు ఎటువంటి భావన లేక కామనతో వచ్చినా కాని మీరు శుభభావనరూపీ కానుకను ఇవ్వండి. శుభభావన మరియు శ్రేష్ఠకామనరూపీ కానుక యొక్క స్టాక్ సదా నిండుగా ఉండాలి. ఎప్పటి వరకు శుభభావనతో చూస్తాము, ఏదైనా హద్దు ఉండాలి కదా అన్న ఆలోచన సంకల్పమాత్రంగా కూడా ఉత్పన్నమవ్వకూడదు. ఈ సంకల్పం కూడా ఈ స్వర్ణిమ కానుక యొక్క స్టాకు జమ అవ్వలేదు అని నిరూపిస్తుంది.

దాత, విధాత మరియు వరదాత పిల్లలు, భాగ్యరేఖను దిద్దుకునే బ్రహ్మ పిల్లలైన బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలు కావున సదా బండారము నిండుగా ఉండాలి. ఈ సంవత్సరం ఎవరినీ ఖాళీగా ఉంచకండి. ఖాళీ చేతులతో వెళ్ళకండి, ఖాళీ చేతులతో రాకండి, అందరికీ ఇవ్వండి మరియు అందరినుండి తీసుకోండి కూడా, ఇది కానుకలను పంచుకునే సంవత్సరము. కేవలం ఒక్కరోజు కాదు, మొత్తం సంవత్సరమంతా ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణము, ప్రతి సంకల్పము ఏదైతే గతిస్తుందో దానిద్వారా ఇంకా ఆత్మిక నవీనతను తీసుకువచ్చేదిగా ఉండాలి. క్రొత్తరోజు, క్రొత్తరాత్రి అనైతే అందరూ అంటారు కాని శ్రేష్ఠ ఆత్మల క్రొత్త క్షణము, క్రొత్త సంకల్పము ఉండాలి, అప్పుడే రానున్న క్రొత్త ప్రపంచం యొక్క క్రొత్త ప్రకాశము విశ్వంలోని ఆత్మలకు స్వప్నము రూపంలో లేక సాక్షాత్కారము రూపంలో కనిపిస్తుంది. ఇప్పటి వరకు విశ్వంలోని ఆత్మలు వినాశనం తర్వాత ఏమి జరుగుతుంది అనేది తెలుసుకునే కోరిక కలిగి ఉన్నారు. కాని ఈ సంవత్సరం ఆధార స్వరూప ఆత్మల యొక్క ప్రతి క్షణము మరియు ప్రతి సంకల్పము చాలా క్రొత్తగాను, ఉన్నతోన్నతముగాను, చాలా మంచిగాను ఉండాలి, అప్పుడు నలువైపుల నుండి క్రొత్త ప్రపంచం యొక్క ప్రకాశమును చూసే శబ్దము వ్యాపిస్తుంది మరియు ఏమి జరుగుతుంది అని అడిగేందుకు బదులుగా ఇలా అవుతుంది అని అనాలి. ఇటువంటి అద్భుతమైన ప్రపంచము త్వరగా రావాలి, త్వరగా ఏర్పాట్లు చేయాలి అన్నదానిలో నిమగ్నమైపోతారు. ఏ విధంగా స్థాపన యొక్క ఆదిలో స్వప్నాలు మరియు సాక్షాత్కారాల లీల విశేషంగా ఉందో అలాగే అంతిమంలో కూడా ఈ విచిత్ర లీల ప్రత్యక్షం చేసేందుకు నిమిత్తంగా అవుతుంది. నలువైపుల నుండి 'ఇదే, ఇదే' అన్న శబ్దము మారుమ్రోగుతుంది మరియు ఈ శబ్దము అనేకుల భాగ్యమును శ్రేష్ఠముగా చేసేందుకు నిమిత్తమవుతుంది. ఒక్కరి నుండి అనేక దీపాలు వెలుగుతాయి.

కావున ఈ సంవత్సరం ఏం చేయాలి? సత్యమైన దీపావళిని జరుపుకునే ఏర్పాట్లను చేయాలి. పాత విషయాలు, పాత సంస్కారాల దసరాను జరపండి ఎందుకంటే దసరా తర్వాతే దీపావళి జరుగుతుంది. కావున ఈరోజు హృదయప్రియులైన ఆత్మలతో మనసులోని విషయాలను మాట్లాడుతున్నారు. మనసులోని విషయాలను ఎవరితో మాట్లాడతారు? మిత్రులతో మాట్లాడుతారు కదా! అచ్ఛా- అభినందనలైతే లభించాయి, అభినందనలతోపాటు క్రొత్త సంవత్సరపు కానుకను కూడా సదా తోడుగా ఉంచుకోవాలి. ఎన్ని కానుకలు కావాలి? ఒక్కటి. ఆ ఒక్కదానిలో ఎన్నో ఇమిడి ఉన్నాయి మరియు అనేకంలో ఒక్కి ఉంది. అన్నింకన్నా మంచి కానుక బాప్దాదా పిల్లలందరికీ ఒక డైమండ్ తాళంచెవిని ఇచ్చారు. దానితో ఏ ఖజానా కావాలంటే ఆ ఖజానా హాజరైపోతుంది. ఆ డైమండ్ తాళంచెవి ఏమి? ఒకే పదము. 'బాబా'. దీనికన్నా మంచి తాళంచెవి ఏదైనా లభిస్తుందా? సత్యయుగంలో కూడా ఇటువంటి తాళంచెవి లభించదు. అందరివద్ద ఈ డైమండ్ కీ జాగ్రత్తగా ఉంది కదా! అది దొంగిలింపబడలేదు కదా! ఈ తాళంచెవిని పోగొట్టుకుంటే అన్ని ఖజానాలను పోగొట్టుకుంటారు. కావున తాళంచెవిని సదా తోడుగా ఉంచుకోండి. కీచైన్ ఉందా లేక కేవలం తాళంచెవి మాత్రమే ఉందా? సదా సర్వసంబంధాలతో స్మృతి స్వరూపులుగా ఉంటూ ఉండడమే కీచైను. కావున మీకు కీచైను కానుకగా లభించింది కదా! అన్నింకన్నా గొప్ప గిఫ్టు ఈ తాళంచెవి. దానితోపాటు ఈ సంవత్సరంకొరకు విశేషంగా ప్రతిజ్ఞరూపీ కంకణమును కూడా ఇస్తున్నారు. ఆ ప్రతిజ్ఞరూపీ కంకణము ఏమి? ప్రతిక్షణము, ప్రతి సంకల్పము, ప్రతి ఆత్మ యొక్క సంపర్కంలో సదా క్రొత్తగాను అనగా ఉన్నతోన్నతంగా ఉండాలి అని విన్పించడం జరిగింది కదా! క్రింది విషయాలను చూడనూ కూడదు అలాగే క్రింది విషయాలను ధారణ కూడా చేయకూడదు. సదా ఉన్నతంగా ఉండాలి. ఉన్నతమైన తండ్రి, ఉన్నతమైన పిల్లలు, ఉన్నతమైన స్థితి మరియు ఉన్నతోన్నతముగా సర్వుల యొక్క సేవ జరగాలి, ఇదే ప్రతిజ్ఞ యొక్క కంకణము.

దానితోపాటు సర్వ గుణాల అలంకరణల బాక్సు. వెరౖటీ సెట్ యొక్క అలంకరణ సామాగ్రి. ఏ సమయంలో ఏ సింగారం కావాలనుకుంటే ఆ సమయంలో అదే సెట్ను ధారణ చేసి సదా అలంకరింపబడి ఉండండి. ఒకసారి సహనశీలత అనే సెట్ను ధరించండి కాని పూర్తి సెట్ను ధరించండి. కేవలం సెట్లో ఒక్కి ధరించడం కాదు, చెవుల ద్వారా కూడా సహనశీలత ఉండాలి, చేతుల ద్వారా కూడా సహనశీలత, సింగారము ఉండాలి. ఈ విధంగా సమయాన్నిబట్టి భిన్న, భిన్న అలంకరణలను చేసుకుంటూ విశ్వం ముందు ఫరిశ్తా రూపంలోను, దేవ రూపంలోను ప్రత్యక్షం అవ్వండి. ఈ త్రిమూర్తి కానుకను సదా మీ తోడుగా ఉంచుకోండి.

స్నేహమును నిర్వర్తించడమైతే వస్తుంది కదా! డబల్ విదేశీయులు మిత్రులుగా అయితే మంచిగా అవుతారు కాని అవినాశీ ఫ్రెండ్షిప్ను ఉంచాలి. డబల్ విదేశీయులు వదలడంలోను చురుకైనవారు అలాగే ఏర్పరచుకోవడంలోను చురుకైనవారు. ఇప్పుడిప్పుడే ఉన్నారు మళ్ళీ ఇప్పుడిప్పుడే లేరు అన్నట్లయితే చేయరు కదా! బాప్దాదా డబల్ విదేశీ పిల్లలను చూసి హర్షితులవుతారు. ఏ విధంగా నలువైపులా సూచన లభించడంతోనే పాత పరిచయాన్ని ఏర్పరచుకున్నారు! బాబా పిల్లలను వెతికారు మరియు పిల్లలు తండ్రిని గుర్తించారు. ఈ విశేషతను చూసి బాప్దాదా కూడా అభినందనలను తెలుపుతున్నారు కావున సదా మాయాజీతులుగా ఉండండి. అచ్ఛా!

ఇటువంటి చాలాకాలం తర్వాత కలిసిన పిల్లలకు, అవినాశీ ప్రీతి యొక్క రీతిని నిర్వర్తించే అవినాశీ మిత్రులకు, సదా పూలతోటలో చేతిలో చేయివేసి సహచరులుగా అయి షైరు చేసే, సదా ఈశ్వరీయ స్వర్ణిమ కానుకను కార్యంలోకి తీసుకువచ్చే సదా సంపన్నులు, సదా మాస్టర్ దాతలు, సదా సర్వుల మాస్టర్ భాగ్యవిధాతలు అయిన ఇటువంటి స్నేహులు, సహయోగులు మరియు నలువైపులా ఉన్న పిల్లలకు, సాకారీ, ఆకారీ రూపధారులైన పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.

విదేశీ టీచర్లతో:-

నిమిత్తులైన శిక్షకులను చూసి బాప్దాదా అతి హర్షితులవుతున్నారు. ఎంతో లగనముతో, స్నేహంతో తమ, తమ స్థానాలలో ఉంటూ అందరూ సదా శక్తిస్వరూప స్థితిలో స్థితులై సర్వశక్తులను అనుభవం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు సాధారణ నారి లేక కుమారి రూపం కాదు సర్వశ్రేష్ఠ సేవాధారీ ఆత్మలు మీరు. బాప్దాదాల షోకేస్లోని షోపీస్లు మీరు. మీ అందరినీ చూసి సర్వఆత్మలు బాబాను గుర్తిస్తాయి. ప్రతి ఒక్క నిమిత్త శిక్షకుని పైన విశ్వపరివర్తన యొక్క బాధ్యత ఉంది. మీరు బేహద్ సేవాధారులు అని స్వయమును భావిస్తున్నారా? ఒక్క స్థానానికి కళ్యాణకారులుగా అయితే భావించడం లేదు కదా! ఒక్క స్థానంలో కూర్చొని ఉన్నాకాని నిజానికి మీరు లైట్ హౌస్లే కదా! నలువైపులా ప్రకాశమును ఇచ్చేవారిగా ఉన్నారు, కావున చిన్న బల్బుగా అయి ఒకే స్థానంలో ప్రకాశమును ఇస్తున్నారా లేక లైట్ హౌస్గా అయి విశ్వమునకు ప్రకాశమును ఇస్తున్నారా? మీరు ప్రకాశముగా ఉన్నారా, సర్చిలైట్ గా ఉన్నారా లేక లైట్ హౌస్గా ఉన్నారా? చాలా మంచి ధైర్యమును ఉంచారు, చాలా బాగా చేస్తున్నారు, ఇంకా ముందు ముందు కూడా బాగా చేస్తూ ఉండండి. టీచర్లయితే సదా మాయాజీతులుగా ఉన్నారు కదా! టీచర్లవద్దకు మాయ వచ్చిందంటే విద్యార్థుల పరిస్థితి ఏమౌతుంది? మీ వద్దకు మాయ ఒక్కసారి వచ్చిందంటే వారివద్దకు పదిసార్లు వస్తుంది. కావున టీచర్లవద్దకు మాయ నమస్కారం చేసేందుకు రావాలే కాని ఇంకొక రకంగా కాదు.

నిమిత్త శిక్షకుని స్వరూపము - సదా హర్షితము. సదా మాస్టర్ సర్వశక్తివంతుడను అన్న సీటుపై సదా సెట్ అయి ఉండండి. టీచర్లు ఉండే స్థానమే చాలా ఉన్నతమైనది. మీరు సెంటర్లలో ఉండడం లేదు, ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు. ఉన్నత స్థితి అనగా హృదయ సింహాసనం పైకి మాయ రాజాలదు. పైకీ క్రిందికీ అయితే మాయ వస్తుంది. పాండవులు కూడా బాప్దాదాల సహయోగి కుడిభుజాలు కదా! గద్దెను సంభాళించేవారిని రైట్హ్యాండ్స్ అనే అంటారు కదా! పాండవులందరూ విజయులే కదా! ఇప్పటివరకు మాయతో ఎంతోకాలం ఆటలు ఆడుకున్నారు ఇప్పుడిక వీడ్కోలు పలకండి. ఈరోజు నుండి సదాకాలికంగా వీడ్కోలు యొక్క అభినందనలు జరుపుకోవాలి. చాలా మంచి అవకాశం లభించింది మరియు ఆ అవకాశాన్ని ఇంకా తీసుకుంటున్నారు కూడా. అచ్ఛా!

పార్టీలతో అవ్యక్త బాప్దాదాల మిలనము:-

బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యమును చూసి హర్షిస్తారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ భాగ్యమును తీసుకుంటున్నారు. సంగమ యుగంలో ప్రతి ఆత్మ యొక్క భాగ్యము వారి వారిది మరియు ప్రతి ఒక్కరికీ శ్రేష్ఠ భాగ్యము ఎందుకుంది? ఎందుకంటే ఎప్పుడైతే శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన బాబాకు పిల్లలుగా అయ్యారో అప్పుడిక శ్రేష్ఠ భాగ్యము ఉన్నట్లే కదా! వీరికన్నా ఉన్నతమైన తండ్రి లేరు అలాగే దీనికన్నా శ్రేష్ఠమైన భాగ్యమూ లేదు. ఉన్నతోన్నతుడైన తండ్రి, ఇదే గుర్తుంటుంది కదా! స్వయంగా భాగ్యవిధాతయే నా తండ్రి. దీనికన్నా ఉన్నతమైన నషా ఇంకేం ఉండగలదు? నా తండ్రి ఇంజనీర్, డాక్టర్, జడ్జి లేక ప్రైమ్ మినిస్టర్ అని లౌకికంలో పిల్లలకు నషా ఉంటుంది. కాని మా తండ్రి భాగ్యవిధాత, ఉన్నతోన్నతుడైన భగవంతుడు అన్న నషా మీకు ఉంది. ఇదే నషా సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు మర్చిపోతారా! భాగ్యాన్ని మర్చిపోతే ఏమౌతుంది? మళ్ళీ భాగ్యాన్ని పొందేందుకు ప్రయత్నించవలసి ఉంటుంది. వ్యవహారంలో కూడా శ్రమ, భక్తిలో, ధర్మం యొక్క క్షేత్రంలో అన్నింలోను ఎంతో శ్రమే పడ్డారు మరియు ఇప్పుడు అందరూ శ్రమ నుండి విముక్తులైపోయారు. ఇప్పుడు వ్యవహారం కూడా పరమార్థం యొక్క ఆధారంపై సహజమైపోతుంది. నిమిత్తమాత్రంగా చేస్తున్నారు. నిమిత్తమాత్రంగా చేసేవారికి సదా సహజంగా అనుభవమవుతుంది. ఇది వ్యవహారంలా కాకుండా ఒక ఆటలా ఉంటుంది. ఇవి మాయ తుఫానులు కావు, ఇవి డ్రామా అనుసారంగా ముందుకువెళ్ళేందుకు కానుకలు. కావున శ్రమ నుండి విముక్తులైపోతారు కదా! కావున కానుక అనగా సౌగాద్ను తీసుకోవడంలో శ్రమ కలుగదు కదా! కావున ఈ విధంగా శ్రమ నుండి స్వయమును రక్షించుకునేవారిని, సదా భాగ్యవిధాతతోపాటు మాస్టర్ భాగ్యవిధాతలుగా అయి ఉండేవారిని శ్రేష్ఠ ఆత్మలు అని అంటారు.

సాన్ ఎంటానియో:- అందరూ స్వయమును విశేష ఆత్మలుగా భావిస్తున్నారు కదా! మీరు ఏ స్థానమునకు చేరుకున్నారు? ఇటువంటి భాగ్యము విశ్వంలో ఎంతమంది ఆత్మలకు సమ్ముఖంగా మిలనము జరుపుకునే విధంగా లభిస్తుంది. ఇంతకన్నా గొప్ప భాగ్యము ఇంకేం కావాలి! సదా మీ యొక్క ఈ భాగ్యమును స్మృతిలో ఉంచుకున్నట్లయితే మీ భాగ్యపు ప్రాప్తి యొక్క సంతోషమును చూసి ఇంకా సమీపంగా వస్తారు మరియు తమ భాగ్యమును తయారుచేసుకుంటారు. సదా సంతోషంగా ఉండండి. బాబాకు పిల్లలుగా అయ్యారు కావున వారసత్వంలో ఏం లభించింది? సంతోషం లభించింది కదా! కావున ఈ వారసత్వమును సదా తోడుగా ఉంచుకోండి, వదిలివేసి వెళ్ళకండి. సంతోషపు ఖజానాలకు యజమానులుగా అయిపోయారు. కావున సదా సంతోషంలో ఎగురుతూ ఉండండి. ఇందులో ప్రయత్నం చేసే విషయమేదీ లేదు. మీరు ప్రయత్నం చేసినట్లయితే ఏడుస్తూ ఉంటారు. పిల్లలుగా అవ్వడంలో కూడా ప్రయత్నం చేయవలసి ఉంటుందా? కావున ప్రయత్నం చేసేది లేదు, ఏడ్చేది లేదు. ట్రై చేస్తాము అన్న ఈ పదమును ఇక్కడ వదిలి వెళ్ళండి. బాబా మరియు వారసత్వము సదా తోడుగా ఉండాలి, కంబైండ్గా ఉండాలి. కావున ఎక్కడైతే బాబా ఉంటారో అక్కడ సర్వ ఖజానాలు స్వతహాగానే ఉంటాయి. బాబా మాకు తోడుగా ఉన్నారు, వారసత్వం మా జన్మసిద్ధ అధికారము అన్న ఈ ఒక్క విషయమును సదా గుర్తుంచుకోండి.

నూతన సంవత్సర శుభాకాంక్షలు (రాత్రి 12 గంటలకు):-

నూతన సంవత్సర సందర్భంగా పిల్లలందరికీ మొత్తం సంవత్సరమంతికొరకు అభఙనందనలు. ఇటువంటి అమూల్య రత్నాలెవరైతే బాబాను గుర్తించారో మరియు బాబాను ప్రత్యక్షంచేసే బాధ్యతా కిరీటమును ధారణ చేశారో ఇటువంటి సదా సేవాధారులు, అనన్యులైన కిరీటధారులు, సింహాసనాధికారులైన పిల్లలు తమ, తమ పేరు పేరునా అభినందనలు స్వీకరించగలరు.

లండన్ వాసులైన నిమిత్త సంతానమైన జానకి మరియు తోడు తోడుగా ఆదిరత్నాలైన, సంతానమైన రజని మరియు మురళి మరియు అందరికన్నా అతిస్నేహి, చిన్నగా ఉన్నా బాబా సమానంగా ఉండే సంతానమగు జయంతిని మరియు తోడుగా ఏ పిల్లలైతే సేవలో ఉపస్థితులై ఉన్నారో, భృజరాణి మంచిగా ప్రఖ్యాతం చేస్తోంది, అలా ఎవరెవరైతే సేవ చేస్తున్నారో ఆ సేవలలో ఆత్మికత నిండి ఉంది ఇలా పిల్లలందరూ తమ తమ పేరు పేరునా అభినందనలను స్వీకరించగలరు.

క్రొత్త సంవత్సరము, క్రొత్త ఉత్సాహము, ఉల్లాసము. ఈ సంవత్సరంలో సదా రోజూ ఉత్సవంగా భావిస్తూ ఉత్సాహమును కలిగిస్తూ ఉండండి, ఇదే సేవలో సదా తత్పరులై ఉండండి. అచ్ఛా- పిల్లలందరికీ బాప్దాదాల హృదయపూర్వకమైన మరియు ప్రేమపూరితమైన ప్రియస్మృతులు.

Comments