30-12-1985 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
"విశాల బుద్ధి కలవారి గుర్తులు"
ఈ రోజు సర్వుల స్నేహీ, సహయోగులు, సహజయోగులైన పిల్లలతో స్నేహ సాగరుడు, సర్వ ఖజానాల విధాత, వరదాత అయిన తండ్రి ఆత్మిక మిలనము జరుపుకునేందుకు వచ్చారు. ఈ ఆత్మిక స్నేహ మిలనము అనగా ఆత్మల మిలనము విచిత్రమైన మిలనము. మొత్తం కల్పంలో ఇటువంటి ఆత్మిక మేళ జరగలేదు. ఈ సంగమయుగానికి ఈ ఆత్మిక మిలనము యొక్క వరదానము లభించి ఉంది. ఈ వరదానీ సమయంలో వరదాత అయిన తండ్రి ద్వారా వరదానులైన పిల్లలు ఈ అవినాశి వరదానాన్ని ప్రాప్తించుకుంటారు. తండ్రిది కూడా విధాత మరియు వరదాత యొక్క అవినాశి పాత్ర ఈ సమయంలోనే నడుస్తుంది. ఇటువంటి సమయంలో వరదానాలకు అధికారి అయిన ఆత్మలు తమ సదాకాలికమైన అధికారాన్ని ప్రాప్తించుకుంటారు. ఇటువంటి ఆత్మిక మేళాను చూసి బాప్ దాదా కూడా హర్షిస్తారు. ఇటువంటి శ్రేష్ఠమైన ప్రాప్తులను పొందే ఎటువంటి అమాయకులైన, సాధారణ ఆత్మలు విశ్వము ముందు నిమిత్తమయ్యారో బాప్ దాదా చూస్తున్నారు. ఎందుకంటే అందరూ రాజవిద్య, సైన్సు విద్య, అల్పకాలిక రాజ్య అధికారము లేక ధర్మనేతల అధికారము కలవారినే ఈనాటి ప్రపంచములో విశేష ఆత్మలుగా అంగీకరిస్తారు. కాని బాప్ దాదా ఎటువంటి విశేషతను చూస్తారు? అన్నింటికంటే ముందు తమను తాము మరియు తండ్రిని తెలుసుకునే విశేషత ఏదైతే బ్రాహ్మణ పిల్లలైన మీలో ఉందో, అది ఇతర ఏ పేరు ప్రఖ్యాతలున్న ఆత్మలలోనూ లేదు, కావున అమాయకంగా, సాధారణంగా ఉంటున్నా వరదాత నుండి వరదానము తీసుకుని జన్మ జన్మల కొరకు విశేష పూజ్య ఆత్మలుగా తయారవుతారు. ఈనాటి పేరు ప్రఖ్యాతలున్న ఆత్మలెవరైతే ఉన్నారో, వారు కూడా పూజ్య ఆత్మల ముందు నమస్కరిస్తూ, వందనం చేస్తారు. ఇటువంటి విశేష ఆత్మలుగా అయ్యారు. ఇటువంటి ఆత్మిక నషాను అనుభవం చేస్తున్నారా? అవిశ్వాసపాత్రులైన ఆత్మలను విశ్వాసపాత్రులుగా చేయడమే తండ్రి విశేషత. బాప్ దాదా వతనంలో కూడా పిల్లలను చూసి చిరునవ్వు నవ్వుతున్నారు. ఈ సభ అంతా విశ్వరాజ్యాధికారీ ఆత్మలకు చెందినది అని ఏమీ తెలియని ఆత్మలకు చెప్పినట్లయితే వారు అంగీకరిస్తారా? ఆశ్చర్యపడ్తారు. కాని తండ్రికి హృదయపూర్వకమైన స్నేహము, హృదయపూర్వకమైన శ్రేష్ఠభావన ఉన్న ఆత్మలు ప్రియమైనవారని బాప్ దాదాకు తెలుసు. హృదయపూర్వకమైన స్నేహము, శ్రేష్ఠమైన ప్రాప్తి చేయించేందుకు మూల ఆధారము. హృదయపూర్వక స్నేహము దూరదూరాలలో వారిని మధువన నివాసులుగా చేస్తుంది. హృదయపూర్వకమైన స్నేహమే హృదయాభిరాముడైన తండ్రికి ఇష్టము, కాబట్టి ఎవరైనా, ఎలా ఉన్నా, మీరు పరమాత్మకు ఇష్టమైనవారు కావున మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారు. ప్రపంచంలోనివారు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. తండ్రి వచ్చే సమయంలో ఇలా జరుగుతుంది, అలా జరుగుతుందని. కాని మీ అందరి నోటి నుండి, హృదయము నుండి ఏం వెలువడ్తుంది? “పొందేసాము”. మీరు సంపన్నంగా అయ్యారు కానీ ఆ వివేకవంతులు ఇప్పటి వరకు పరిశీలించడంలోనే సమయాన్ని సమాప్తం చేసుకుంటున్నారు, అందుకే తండ్రిని భోళానాథుడని అనడం జరిగింది. వారిని గుర్తించే విశేషత మిమ్మల్ని విశేష ఆత్మగా చేసింది. గుర్తించారు, పొందేసారు. ఇప్పుడు ఇక ఏం చేయాలి? సర్వాత్మలపై దయ కలుగుతుందా? ఆత్మలన్నీ ఒకే అనంతమైన పరివారానికి చెందినవి. మన పరివారానికి చెందిన ఏ ఆత్మా కూడా వరదానం నుండి వంచితులు అవ్వకూడదు. ఇటువంటి ఉల్లాస-ఉత్సాహము హృదయంలో ఉంటుందా? లేక మీ ప్రవృత్తులలోనే బిజీగా అయిపోయారా? అనంతమైన స్టేజ్ పై (స్థితిలో) స్థితులై, అనంతమైన ఆత్మలకు సేవ చేయాలన్న శ్రేష్ఠ సంకల్పమే సఫలతకు సహజమైన సాధనము.
ఇప్పుడు సేవ యొక్క గోల్డెన్ జూబ్లీని జరుపుకుంటున్నారు కదా! దాని కొరకు విశాలమైన కార్యక్రమాన్ని తయారుచేశారు కదా! ఎంత విశాలమైన కార్యక్రమాన్ని తయారుచేశారో అంత విశాల హృదయము, విశాల ఉల్లాసము మరియు విశాల రూపముతో ఏర్పాట్లను చేశారా? లేక ఇదే ఆలోచిస్తున్నారా - భాషణ చేసేందుకు లభిస్తే చేసేస్తాము. ఆహ్వాన పత్రాలు పంచే సేవ లభిస్తే పంచుతాము. ఈ ఏర్పాట్లనే చేశారా? వీటినే విశాలమైన ఏర్పాట్లని అనడం జరుగుతుందా? ఏ డ్యూటీ లభించిందో దానిని పూర్తి చేయడాన్నే విశాలమైన ఉల్లాసమని అనడం జరగదు. డ్యూటీని నిర్వర్తించడం ఆజ్ఞాకారులగా అయ్యేందుకు గుర్తే, కాని అనంతమైన విశాలమైన బుద్ధి, విశాలమైన ఉల్లాస ఉత్సాహమని కేవలం దీనిని అనడం జరగదు. అన్నీ వేళలలో తమకు లభించిన డ్యూటీలో, సేవలో నవీనతను తీసుకురావడమే విశాలతకు గుర్తు. భోజనము తినిపించే డ్యూటీ లేక ప్రసంగించే డ్యూటీ లభించినా కాని అన్ని సేవలలో అన్ని వేళలా నవీనతను నింపడం - దీనినే విశాలత అని అంటారు. ఏదైతే గత సంవత్సరము చేసారో దానిలో తప్పకుండా ఏదో ఒక ఆత్మికతను తప్పకుండా కలపాలి. మరి ఇటువంటి ఉల్లాస ఉత్సాహం హృదయంలో కలుగుతుందా? లేక ఎలా నడుస్తుందో అలాగే జరుగుతుందని భావిస్తున్నారా? అన్నివేళలా విధి మరియు వృద్ధి మారుతూ ఉంటాయి. ఎలాగైతే సమయం సమీపంగా వస్తుందో అలా ప్రతి ఆత్మకు తండ్రి మరియు పరివారం యొక్క సమీపతను విశేషంగా అనుభవం చేయించండి. ఏ నవీనతను తీసుకురావాలో మననం చేయండి. ఇప్పుడు కాన్ఫరెన్సు ద్వారా విశాల కార్యమును చేస్తున్నారు కదా! అందరూ చేస్తున్నారా లేక ఎవరైతే పెద్దవారు ఉన్నారో వారు మాత్రమే చేస్తున్నారా? ఇది అందరి కార్యము కదా? నేను నవీనత కొరకు సేవలో ముందుకు వెళ్ళాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. నిమిత్తంగా కొద్దిమందినే తయారుచేయాల్సి వచ్చినా – ఉదాహరణకు, కొద్దిమంది మాత్రమే ఉపన్యసిస్తారు, సభలోని వారందరూ ఉపన్యసించరు కదా! ప్రతి ఒక్కరికీ తమ-తమ డ్యూటీలను పంచడం ద్వారానే కార్యము సంపన్నమవుతుంది. కానీ అందరూ నిమిత్తంగా అవ్వాలి. ఏ విషయంలో? నలువైపులా ఎక్కడ ఉన్నా, ఏ డ్యూటీకి నిమిత్తంగా ఉన్నా, ఏ సమయంలో అయితే ఏదైనా విశాల కార్యం ఎక్కడైనా జరుగుతుందో, ఆ సమయంలో దూరంగా కూర్చొని కూడా ఆ కార్యము జరిగినంత వరకు సదా ప్రతి ఒక్కరి మనసులో విశ్వకళ్యాణము జరగాలనే శ్రేష్ఠ భావన మరియు శ్రేష్ఠ కామన తప్పకుండా ఉండాలి. ఎలాగైతే ఈనాటి వి.ఐ.పి.లు వారు స్వయం చేరుకోలేకపోతే తమ శుభ కామనలను పంపుతారు కదా! మరి మీరు వారికంటే తక్కువైనవారా? విశేష ఆత్మలైన మీ అందరి యొక్క శుభభావన, శుభకామన ఆ కార్యాన్ని తప్పకుండా సఫలం చేస్తుంది.
ఈ విశేషమైన రోజున విశేషంగా కంకణం కట్టుకోవాలి మరియు ఎటువంటి హద్దు యొక్క విషయాలలో సంకల్ప శక్తిని, సమయ శక్తిని వ్యర్థంగా పోగొట్టుకోకూడదు. ప్రతి సంకల్పముతో, అన్నివేళలా విశాల సేవకు నిమిత్తంగా అయ్యి మనసా శక్తి ద్వారా కూడా సహయోగులుగా అవ్వాలి. కాన్ఫరెన్సు అయితే ఆబూలో జరుగుతోంది కదా, మేమైతే ఫలానా దేశంలో కూర్చున్నామని భావించకూడదు. మీరందరూ విశాల కార్యంలో సహయోగులుగా ఉన్నారు. వాతావరణాన్ని, వాయుమండలాన్ని తయారుచేయండి. వైజ్ఞానిక శక్తి ద్వారా ఒక దేశము నుండి మరొక దేశము వరకు రాకెట్ను పంపగలిగినప్పుడు సైలెన్స్ శక్తి ద్వారా మీరు శుభభావన, కళ్యాణభావన ద్వారా ఇక్కడ ఆబూలో మనసు ద్వారా సహయోగులుగా అవ్వలేరా? కొందరు సాకారంలో వాణి ద్వారా, కర్మ ద్వారా నిమిత్తంగా అవుతారు. కొందరు మనసా సేవ ద్వారా నిమిత్తంగా అవుతారు. కాని ఎన్ని రోజులైతే ప్రోగ్రాం కొనసాగుతుందో, అది 5 రోజులు లేక 6 రోజులు జరిగినా, అంత సమయమూ ప్రతి బ్రాహ్మణ ఆత్మకు - ఆత్మనైన నేను నిమిత్తంగా అయ్యి సఫలతను తీసుకురావాలి అన్న సేవా కంకణం కట్టబడి ఉండాలి. ప్రతి ఒక్కరూ స్వయాన్ని బాధ్యత కలవారిగా భావించాలి. అలాగని అందరము బాధ్యత కలవారిమి కనుక ఉపన్యసించేందుకు అవకాశము లభించాలి లేక విశేషమైన డ్యూటీ ఏదైనా లభించినప్పుడే మేము బాధ్యులము అని భావించకండి, దీనిని బాధ్యత అని అనరు. ఎక్కడ ఉన్నా, ఏ డ్యూటీ లభించినా, దూరంగా కూర్చునేదైనా లేక స్టేజ్ పైకి వచ్చేదైనా - నేనైతే సహయోగిగా అవ్వాల్సిందే. దీనినే మొత్తం విశ్వంలో సేవ చేసేందుకు ఆత్మికత అనే అలను వ్యాపింపజేయడం అని అంటారు. సంతోషము, ఉల్లాస ఉత్సాహాల అల వ్యాపించాలి. మీరు ఇటువంటి సహయోగులే కదా? ఈ కాన్ఫరెన్సులో నవీనతను చూపిస్తారు కదా? ఇది గోల్డెన్ జూబ్లీ, కావున నలువైపులా గోల్డెన్ ఏజ్ (స్వర్ణిమ యుగము) రానున్నది అన్న ఈ సంతోషపు అల వ్యాపించాలి. భయపడుతున్న ఆత్మలలో, నిరాశావాదులైన ఆత్మలలో శ్రేష్ఠ భవిష్యత్తు యొక్క ఆశను ఉత్పన్నం చేయండి. భయపడుతున్న ఆత్మలలో సంతోషపు అల ఉత్పన్నమవ్వాలి. ఇది గోల్డెన్ జూబ్లీ యొక్క గోల్డెన్ సేవ, ఇదే లక్ష్యాన్ని పెట్టుకోండి. స్వయం కూడా ప్రతి కార్యంలో మోల్డ్ అయ్యే (మలచుకునే) రియల్ గోల్డ్ గా అయ్యి గోల్డెన్ జూబ్లీని జరుపుకోవాలి. అర్థమయ్యిందా. ఇప్పటి వరకు ఏదైతే చేయలేదో అది చేసి చూపించాలి. ఎటువంటి ఆత్మలను నిమిత్తంగా చేయాలంటే, ఒక్క ఆత్మ అనేక ఆత్మల సేవకు నిమిత్తంగా తయారవ్వాలి. ఆలోచిస్తూనే ఉంటారు, కాని చేస్తాము, చేస్తాము అని అంటూ సమయం గడిచిపోతుంది, ఇక చివర్లో ఎవరు లభిస్తే వారినే తీసుకొస్తారు. సంఖ్య అయితే పెరిగిపోతుంది, కానీ అనేకమంది కొరకు నిమిత్తంగా అయ్యే ఆత్మలు రావాలని విశాల సేవా కార్యక్రమాలు జరుపుతారు. నలువైపులా సేవ కొనసాగుతూ ఉంటుంది కదా! తమ-తమ స్థానాలలో కూడా ఇటువంటి ఆత్మల గురించి కార్యాన్ని నడిపిస్తూ ఉంటారు, కావున ఇప్పటి నుండే గోల్డెన్ జూబ్లీకి, స్వసేవ మరియు స్వయంతో పాటు ఇతర విశేష ఆత్మల యొక్క సేవ అలను వ్యాపింపజేయండి. ఏం చేయాలో అర్థమయ్యిందా!
ప్రేమతో శ్రమ చేయండి. స్నేహము ఎటువంటి వస్తువంటే స్నేహానికి వశమై, 'కాదు' అన్నవారు కూడా 'అవును' అని అంటారు. సమయం లేకపోయినా సమయాన్ని తీస్తారు. ఇదైతే ఆత్మిక స్నేహము. కావున ధరణిని తయారుచేయండి. ఈ ధరణియే ఇలా ఉంది, ఈ మనుష్యులే ఇలా ఉన్నారని భావించకండి. మీరు ఎలా ఉండేవారు? మారిపోయారు కదా! శుభభావనకు సదా శ్రేష్ఠ ఫలము ఉంటుంది. అచ్ఛా.
మీ ఇంటికి వచ్చారు, ఈ విషయంలో తండ్రికి కూడా ఎంతో సంతోషంగా ఉంది కాని సమయమైతే హద్దులోనిదే కదా! సంఖ్య ఎంత ఉంటుందో దాని బట్టి పంచడం జరుగుతుంది కదా! నాలుగు వస్తువులు ఉన్నప్పుడు, తీసుకునేవారు 8 మంది ఉంటే ఏం చేస్తారు? అదే విధంగా చేస్తారు కదా. బాప్ దాదా కూడా విధి అనుసారంగా నడవవలసి ఉంటుంది. ఇంతమంది ఎందుకు వచ్చారని బాప్ దాదా అనలేరు. తప్పకుండా రండి. స్వాగతం, కాని సమయానుసారంగా విధిని తయారుచేయవలసి ఉంటుంది. అవ్యక్త వతనంలో అయితే సమయానికి లిమిట్ లేదు.
మహారాష్ట్ర వారు కూడా అద్భుతం చేసి చూపిస్తారు. ఎవరైనా మహాన్ ఆత్మను నిమిత్తంగా చేసి చూపించినప్పుడు మహారాష్ట్ర అని అనడం జరుగుతుంది. ఢిల్లీ అయితే నిమిత్తంగా ఉండనే ఉంది. ఇప్పటకి ఎన్నో కాన్ఫరెన్సులు చేశాము, ఇప్పుడు ఇక ఎన్ని జరిగితే అన్ని అని భావించడం కాదు. ప్రతి సంవత్సరము ముందుకు వెళ్ళాలి. ఇప్పుడింకా నిమిత్తంగా తయారుచేయదగిన ఆత్మలు ఎందరో ఉన్నారు. ఢిల్లీవారు కూడా విశేషంగా నిమిత్తంగా అవ్వాలి. రాజస్థాన్ వారు ఏం చేస్తారు? రాజస్థాన్ వారు సదా ప్రతి కార్యంలో నంబర్ వన్ గా అవ్వాలి, ఎందుకంటే రాజస్థాన్లో నంబర్ వన్ హెడ్క్వార్టర్ ఉంది. క్వాలిటీలో కాని లేక క్వాంటిటీలో కాని రెండింటిలోనూ నంబర్ వన్ గా అవ్వాలి. డబల్ విదేశీయులు కూడా నవీనతను చూపిస్తారు కదా! ప్రతి దేశంలోనూ ఈ సంతోషకరమైన వార్త యొక్క అల వ్యాపించినట్లయితే అందరూ ఎంతో హృదయపూర్వకంగా మీకు ఆశీర్వాదాలను ఇస్తారు. మనుష్యులు ఎంతో భయంతో ఉన్నారు కదా! ఇటువంటి ఆత్మలను ఆత్మిక సంతోషముతో నిండిన అలలోకి తీసుకురండి, వీరు ఫరిస్తాలుగా అయి శుభ సందేశాన్ని ఇచ్చేందుకు నిమిత్తంగా అయిన ఆత్మలని వారు భావించాలి. అర్థమయిందా? ఇప్పుడు ఏ జోన్ వారు నవీనతను తీసుకొస్తారో చూద్దాము. తర్వాత బాప్ దాదా రిజల్టును వినిపిస్తారు. నవీనతను కూడా తీసుకురావాలి. నవీనతకు కూడా నంబరు లభిస్తుంది. అచ్ఛా.
సర్వ స్వరాజ్య, విశ్వరాజ్య అధికారీ ఆత్మలకు, సదా అనంతమైన సేవలో, అనంతమైన వృత్తిలో ఉండే శ్రేష్ఠ ఆత్మలకు, సదా విశాల హృదయము, సదా విశాల బుద్ధి, విశాలమైన ఉల్లాస ఉత్సాహాలతో ఉండే విశేష ఆత్మలకు, సదా స్వయాన్ని ప్రతి సేవకు నిమిత్తంగా ఉన్నామని తెలుసుకొని నిర్మాణం చేసే, సదా శ్రేష్ఠమైన మరియు బాబా సమానంగా సేవలో సఫలతను పొందేవారు, ఇటువంటి ఆత్మికమైన ఆత్మలకు ఆత్మిక తండ్రి ప్రియస్మృతులు మరియు నమస్తే.
కుమారీలతో:- సదా కూమారీ జీవితము నిర్దోష జీవితంగా మహిమ చేయబడింది. కుమారీ జీవితం సదా శ్రేష్ఠంగా మహిమ చేయబడుతుంది మరియు పూజింపబడుతుంది కూడా. స్వయాన్ని ఇటువంటి శ్రేష్ఠమైన మరియు పూజ్య ఆత్మగా భావిస్తున్నారా? కుమారీలందరూ విశేషంగా ఏదో ఒక అద్భుతము చేసి చూపించేవారు కదా! లేక కేవలం చదువును చదువుకునేవారా? విశ్వ సేవాధారులుగా అవుతారా లేక హద్దులోని సేవాధారులుగా అవుతారా, గుజరాత్ కు సేవ చేయాలి లేక మధ్యప్రదేశ్ కు సేవ చేయాలి లేక ఫలానా స్థానంలో సేవ చేయాలి.... ఇలా అయితే లేరు కదా! ఎవర్ రెడీ ఆత్మలు ఇతరులను కూడా ఎవర్ రెడీగా చేస్తారు. కావున కుమారీలైన మీరు ఏది కావాలనుకుంటే అది చేయగలరు. ఈనాటి ప్రభుత్వము ఏదైతే చెప్తుందో, అది చేయలేకపోతుంది. ఇటువంటి రాజ్యంలో ఉంటూ సేవ చేయాలంటే ఇంత శక్తిశాలి సేవ ఉంటేనే సఫలత ఉంటుంది! ఈ జ్ఞాన చదువులో నంబరు తీసుకున్నారా? నంబర్ వన్ గా అవ్వాల్సిందే అన్న లక్ష్యం పెట్టుకోండి. తక్కువగా మాట్లాడండి, కాని మీరు ఎవరు ముందుకు వెళ్ళినా వారు మీ జీవితము నుండి పాఠమును నేర్చుకోవాలి - సదా ఈ విశేషతను చూపించండి. నోటి ద్వారా పాఠమును నేర్పించేవారు ఎందరో ఉన్నారు, వినేవారు కూడా ఎందరో ఉన్నారు కాని జీవితము ద్వారా పాఠము నేర్చుకోవాలి, ఇది విశేషత. మీ జీవితమే వారికి శిక్షకునిగా అవ్వాలి. నోటి ద్వారా టీచరుగా కాదు, నోటి ద్వారా చెప్పవలసి వస్తుంది కాని, నోటి ద్వారా చెప్పిన తర్వాత కూడా జీవితంలో ఉండకపోతే వారు అంగీకరించరు. వినిపించేవారైతే చాలామంది ఉన్నారని వారంటారు కావున మీ జీవితము ద్వారా ఎవరినైనా బాబాకు చెందినవారిగా చేయాలన్న లక్ష్యమును పెట్టుకోండి. ఈ రోజుల్లో వినే అభిరుచిని కూడా ఉంచడం లేదు, చూడాలనుకుంటున్నారు. రేడియో వినే వస్తువు, టి.వి. చూసే వస్తువు, ఏది ఇష్టపడతారు? (టి.వి.) వినడం కంటే చూడడం ఇష్టపడతారు. అయితే మీ జీవితంలో కూడా చూడాలనుకుంటున్నారు, ఎలా నడుచుకుంటున్నారు, ఎలా లేస్తున్నారు, ఎటువంటి ఆత్మిక దృష్టి ఉంచుతున్నారు. ఇటువంటి లక్ష్యమును ఉంచండి. అర్థమయిందా? సంగమయుగములో కుమారీల మహత్వము ఏమిటో మీకు తెలుసు కదా! సంగమ యుగములో కుమారీలు అందరికంటే గొప్పవారు. కావున స్వయాన్ని మహాన్ గా భావించి సేవలో సహయోగులుగా అయ్యారా లేక అవ్వాలా? లక్ష్యమేమిటి? డబల్ పాత్రను అభినయించే లక్ష్యముందా? తలమీద గంప ఎత్తుకుంటారా? అచ్ఛా.
Comments
Post a Comment