30-07-1983 ఓంశాంతి అవ్యక్త బాప్ దాదా మధువనము
''ఎక్కడ సత్యమైన స్నేహము ఉంటుందో అక్కడ దుఃఖపు అల ఉండదు''
(మన్మోహిని దీదీగారు శరీరమును త్యాగము చేసినప్పుడు బాప్ దాదా మహావాక్యాలు)
ఈరోజు స్థిరమైన రాజ్య అధికారులు, నిశ్చలమైన-దృఢమైన స్థితిలో ఉండే విజయీ పిల్లలను చూస్తున్నారు. ఇప్పటి నుండి స్థిరంగా అయ్యే సంస్కారాల ఆధారముతో స్థిరమైన రాజ్య ప్రాలబ్ధమును పొందేందుకు ముందు పురుషార్థములో కల్పకల్పము స్థిరంగా అయ్యారు. డ్రామాలోని ప్రతి దృశ్యాన్నీ, డ్రామా చక్రములోని సంగమయుగపు టాప్ పాయింట్ పై స్థితులై దేనిని చూసినా స్వతహాగనే స్థిరంగా దృఢంగా ఉంటారు. టాప్ పాయింట్ (ఉన్నత స్థానము) నుండి కిందకు వచ్చినప్పుడే అలజడి కలుగుతుంది. శ్రేష్ఠులైన బ్రాహ్మణ ఆత్మలందరూ సదా ఎక్కడ ఉంటారు? చక్రములో సంగమయుగము ఉన్నత యుగము. చిత్రము లెక్కలో కూడా సంగమయుగ స్థానము ఉన్నతమైనది మరియు యుగాల లెక్కలో దీనిని చిన్న యుగము, పాయింట్ అనే అంటారు. మరి ఈ ఉన్నత పాయింట్ పై, ఉన్నత స్థానములో, ఉన్నత స్థితిలో, ఉన్నత జ్ఞానములో, ఉన్నతోన్నతమైన తండ్రి స్మృతిలో, ఉన్నతోన్నత సేవా స్మృతి స్వరూపులైనట్లయితే సదా సమర్ధులుగా ఉంటారు. సమర్ధమున్న చోట వ్యర్థము సదాకాలము కొరకు సమాప్తమైపోతుంది. బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరి పురుషార్థమే వ్యర్థమును సమాప్తము చేస్తుంది, దానిని వారు చేస్తున్నారు. వ్యర్థపు ఖాతా లేక వ్యర్థము యొక్క లెక్కలు సమాప్తమైపోయాయి కదా! లేక ఇప్పుడుకూడా ఏదైనా పాత వ్యర్థము యొక్క ఖాతా ఉందా? బ్రాహ్మణ జన్మ తీసుకున్నప్పుడే తనువు-మనసు-ధనము అన్నీ నీవే అని ప్రతిజ్ఞ చేసారు, కనుక వ్యర్థ సంకల్పాలు సమాప్తమైపోయాయి, ఎందుకంటే మనసును సమర్ధుడైన బాబాకు ఇచ్చారు.
మనసు నీదే అని అనేందుకు బదులుగా రెండు-మూడు రోజులలో నాదే అని మార్చేయలేదు కదా! మనసు ద్వారా సదా సమర్థముగా ఆలోచించాలి అన్నది ట్రస్టీలకు డైరెక్షన్. మరి వ్యర్థానికి మార్జిన్ ఉందా ? వ్యర్థము జరిగిందా? స్నేహమును చూపించాము అని మీరు అంటారు. పరివారపు స్నేహ సూత్రములో అయితే అందరూ బంధింపబడి ఉన్నారు, ఇదైతే చాలా మంచిది. ఒకవేళ స్నేహ ముత్యములను కురుపించినట్లయితే ఆ ముత్యములు అమూల్యమైనవిగా ఉండాలి. కానీ ఏమి, ఎందుకు అన్న ఆలోచనలతో అశ్రువులను కార్చినట్లయితే అది వ్యర్థపు ఖాతాలో జమ అయినట్లు. స్నేహ ముత్యాలైతే మీ స్నేహీ దీదీ మెడలోని మాలగా అయ్యి మెరుస్తూ ఉన్నాయి. ఇటువంటి సత్యమైన స్నేహము కల మాలలైతే దీదీ మెడలో చాలానే ఉన్నాయి. కానీ ఒక్క శాతమైనా కూడా అలజడి స్థితిలోకి వచ్చినా, కన్నీళ్ళను కార్చినా, అవి అక్కడ దీదీ వద్దకు చేరుకోవు, ఎందుకని? అక్కడ ఎల్లప్పుడు విజయీ, స్థిరమైన దృఢమైన ఆత్మగానే ఉంది మరియు ఇప్పుడు కూడా ఉంది, మరి అచలమైన ఆత్మ వద్దకు అలజడి కలిగిన వారి స్మృతి చేరుకోజాలదు. అవి ఇక్కడివిక్కడే ఉండిపోతాయి. ముత్యాలై మాలలో ప్రకాశించవు. ఎటువంటి స్థితి కలిగినవారో, ఎటువంటి పొజిషన్ కల ఆత్మనో అటువంటి పొజిషన్ లో స్థితులై ఉండే ఆత్మల స్మృతి ఆత్మకు చేరుకుంటుంది. స్నేహము ఉంది, ఇదైతే చాలా మంచి లక్షణము. స్నేహము ఉన్నట్లయితే స్నేహాన్ని అర్పణ చెయ్యండి కదా! ఎక్కడైతే సత్యమైన శ్రేష్ఠ స్నేహము ఉంటుందో అక్కడ దుఃఖపు అల ఉండదు, ఎందుకంటే దుఃఖధామమును దాటిపోయారు కదా!
మధురాతి మధురమైన ఫిర్యాదులు కూడా అన్నీ చేరుకున్నాయి. అందరి ఫిర్యాదు ఇదే - మా మధురమైన దీదీని ఎందుకు పిలిచారు? అందుకు బాప్ దాదా ఇలా చెప్పారు - ఎవరైతే అందరికీ చాలా మధురమైనవారనిపిస్తారో వారే బాబాకు మధురమనిపిస్తారు కదా. ఒకవేళ ఆవశ్యకత మాధుర్యముదే అయినప్పుడు ఇతరులెవరిని పిలవాలి! మధురాతి మధురమైనవారినే పిలుస్తారు కదా!
అడ్వాన్స్ పార్టీలోని విశేష ఆత్మలు ఇప్పటి వరకు గుప్తంగా ఎందుకు ఉన్నారు అని మీరు ఆలోచిస్తుంటారు మరియు పదే-పదే అడుగుతుంటారు. ప్రత్యక్షమవ్వాలని కోరుకుంటారు కదా. సమయప్రమాణంగా అడ్వాన్స్ పార్టీలోని కొందరు ఆత్మలు శ్రేష్ఠ ఆత్మలను ఆహ్వానము చేస్తున్నారు. అలా ఆది పరివర్తన యొక్క విశేష కార్యము కొరకు ఆదికాలములోని ఆదిరత్నాలైన ఆత్మలు కావాలి. తమ యోగబలమును ప్రయోగించగల విశేష యోగీ ఆత్మలు కావాలి, భాగ్యవిధాత అయిన బాబా యొక్క భాగస్వాములైన ఆత్మలు కావాలి. భాగ్యవిధాత అని బ్రహ్మాను కూడా అంటారు. ఎందుకు పిలిచారో అర్థమైందా? ఇక్కడ ఏమవుతుంది? ఎలా అవుతుంది? అని ఆలోచిస్తారు. బ్రహ్మాబాబా అవ్యక్తమయ్యారు, మరి అప్పుడు ఏమైంది, ఎలా అయింది అన్నది చూసారు కదా! దాదీని ఒంటరివారని భావిస్తారా? వారు అనుకోరు, మీరు అనుకుంటారు. అంతే కదా? ( దాదీవైపుకు చూస్తూ) మీది డివైన్యూనిటీ (దివ్యమైన ఐకమత్యము) కాదా, అవును కదా? మరి మీరు డివైన్యూనిటీకి భుజాలు కారా? డివైన్యూనిటీ కదా! ఈ గ్రూపును ఎందుకని తయారుచేసారు? సదా ఒకరికొకరు సహయోగులుగా అయ్యేందుకు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎవరికి కావాలంటే వారికి అందరూ సేవ కొరకు జీ హాజిర్. ఈ దాదీలకు పరస్పరములో చాలా ఆంతరంగిక ప్రీతి ఉంది, మీకు తెలియదు కనుక ఇప్పుడేమవుతుంది అని అనుకుంటారు. ఆదిరత్నాలైన మేమందరమూ ఒక్కటే అని ఒక్క దీదీ ఋజువు చేసి చూపించారు. చూపించారు కదా? బ్రహ్మాబాబా తరువాత సాకార రూపములో 9 రత్నాలకు చెందిన పూజ్య ఆత్మలు సేవా స్టేజ్ పై ప్రత్యక్షమయ్యారు, కనుక 9 రత్నాలు లేక అష్ట మాల సదా ఒకరికొకరు సహయోగులు. ఆ అష్ట మాలలో ఎవరున్నారు? ఎవరైతే తమకు తామే ముందుకు వచ్చి సేవా బాధ్యతను తీసుకుంటారో వారే అర్జునులు అనగా అష్టమాల. సేవా స్టేజ్ పై అష్టరత్నాలు, నవ రత్నాలు తమ పాత్రను పోషిస్తున్నాయి. కనుక అష్టరత్నాలు అంటే - పరస్పరములో సదాకాలమునకు స్నేహీలు మరియు సదా సహయోగులు, కనుక ఆది నుండి సదా సేవా సహయోగీ ఆత్మలు ఎల్లప్పుడూ సహయోగీ పాత్రను పోషిస్తూనే ఉంటాయి. అర్థమైందా! ఇంకా ఏం ప్రశ్నలున్నాయి? ఎందుకు చెప్పలేదు, ఈ ప్రశ్న ఉంది కదా? చెప్పినట్లయితే దీదీ యోగులుగా అవుతారు. డ్రామాకు విచిత్రమైన పాత్ర ఉంది, విచిత్రుని చిత్రము ముందే చిత్రించబడదు. అలజడికి చెందిన పరీక్ష అకస్మాత్తుగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ విశేష ఆత్మయొక్క పాత్ర, ఇప్పటివరకు ఏ ఆత్మలైతే వెళ్ళాయో వాళ్ళందరికంటే అతీతమైనది మరియు ప్రియమైనది. ప్రతి ఒక్క క్షేత్రములో ఈ శ్రేష్ఠ ఆత్మ యొక్క సాహచర్యమును, సహయోగపు అనుభూతిని చేస్తూనే ఉంటారు. బ్రహ్మాబాబా పాత్ర బ్రహ్మాబాబాది, వారిలాంటి పాత్ర వేరే ఏదీ ఉండజాలదు. కానీ ఈ ఆత్మ యొక్క విశేషత సేవలో ఉల్లాస-ఉత్సాహాలను ఇప్పించటములో, యోగి-సహయోగి మరియు ప్రయోగులుగా తయారుచెయ్యటంలో ఎల్లప్పుడు ఉంది, కనుక ఈ ఆత్మ యొక్క ఈ విశేష సంస్కారము సమయానుసారంగా మీ అందరికి కూడా సహయోగులై ఉండే అనుభూతిని చేయిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క ఆత్మకూ తన-తన విచిత్ర పాత్ర ఉంది. అచ్ఛా.
మధువనమునకు వచ్చారు, స్నేహ స్వరూపమును చూపించారు, అందుకొరకు వీరు కూడా విశ్వములో సేవా నిమిత్తంగా పాత్రను పోషించారు. మీరందరూ ఇలా రావటము అంటే విశ్వములో స్నేహపు అలను, స్నేహ సుగంధాన్ని, స్నేహ కిరణాలను వ్యాపింపచెయ్యటము, కనుక మంచిగా రండి. దీదీవైపు నుండి కూడా బాప్ దాదా అందరికీ స్నేహపు, సేవా స్వరూపపు అభినందనలను ఇస్తున్నారు. దీదీ కూడా చూస్తున్నారు, టి.వి.లో కూర్చున్నారు. మీరు కూడా వతనములోకి వెళ్ళి చూడండి కదా! ఇది కూడా సేవకు చెందిన ఒక ముద్ర.
నేటి ఈ సంగఠనలో కమల్ బచ్చీ (దీదీగారి లౌకిక వదిన)కూడా వచ్చింది. వారు కూడా గుర్తు చేస్తున్నారు మరియు ఎవరైతే స్నేహీ, శ్రేష్ఠ ఆత్మ కొరకు తమ సహయోగమును ఇచ్చారో ఆ అలసిపోని పిల్లలకు, వారు ఇక్కడ కూర్చుని ఉన్నా లేక లేకపోయినాగానీ పిల్లలందరూ శుభ భావన, శుభ కామనలు మరియు ఒకటే లగనముతో ఎవరైతే తమ స్నేహమును చూపించారో చాలా శ్రేష్ఠమైనదిగా ఉంది. ఇందుకొరకు విశేషంగా బాప్ దాదాతో దాదీ ఇలా అన్నారు - నావైపు నుండి ఇటువంటి స్నేహీ, సేవాధారీ పరివారమునకు ప్రియస్మృతులు మరియు థ్యాంక్స్ ఇవ్వండి. కనుక దీదీ పనిని ఈరోజు బాప్ దాదా చేస్తున్నారు. ఈరోజు బాప్ దాదా సందేశీగా అయ్యి సందేశమును ఇస్తున్నారు. ఏదైతే జరిగిందో అది చాలా రహస్యములతో నిండి ఉన్న డ్రామాగా అయ్యింది. మీ అందరికీ దీదీ అంటే చాలా ఇష్టము మరియు దీదీకి సేవ అంటే ఇష్టము, కనుక సేవ తన వైపుకు లాగింది. పరివర్తన అనే పరదాను తెరవటంలో ఏదైతే జరిగిందో అది చాలా చాలా బాగా జరిగింది. భగవతి(డాక్టర్) దోషమూ లేదు, భగవంతుని దోషమూ లేదు. ఇది డ్రామాలోని రహస్యము. ఇందుకు భగవతీ ఏమీ చెయ్యలేడు, భగవంతుడూ ఏమీ చెయ్యలేడు. కనుక వీరు ఇలా చేసారు, ఇలా ఆపరేషన్ చేసారు అని ఎప్పుడూ ఆలోచించవద్దు. వారి స్నేహము చివరి వరకు కూడా తల్లి స్నేహములానే ఉంది, కనుక వారు వారివైపు నుండి ఎటువంటి లోటూ చెయ్యలేదు. ఇది డ్రామాలోని ఆట. అర్థమైందా - కనుక ఎటువంటి ఆలోచనలనూ చెయ్యకూడదు.
ఈరోజైతే కేవలము ఆజ్ఞాకారిగా అయ్యి దీదీ వైపు నుండి సందేశీగా అయ్యి వచ్చాము. స్థిరమైన స్థితిలో ఉండేవారు, స్థిరమైన రాజ్య అధికారులు, నిశ్చయ బుద్ధి నిశ్చింతులు, విజయులు అయిన పిల్లలకు ఈరోజు త్రిమూర్తి ప్రియస్మృతులను ఇస్తున్నారు, మరియు నమస్తే చేస్తున్నారు. అచ్ఛా.
డివైన్యూనిటీ వారందరూ ఇక్కడకు రావాలి - (దాదీలందరినీ బాప్ దాదా స్టేజ్ పైకి పిల్చారు మరియు మాల రూపంలో వారిని కూర్చుండబ్టెటారు) మాల అయితే తయారైంది కదా. (దాదీతో) ఇప్పుడు వీరు (జానకిదాది) మరియు వీరు (చంద్రమణి దాది) మీ విశేష సహయోగులు. ఈ రథానికైతే (గుల్జార్ దాది) డబల్ పాత్ర ఉంది. బాప్ దాదా పాత్ర మరియు ఈ పాత్ర - డబల్ పాత్ర. మీకు అందరూ సహయోగులే. వీరిని (నిర్మల శాంతా దాదీని) వాతావరణము కాస్త మంచిగా ఉన్నప్పుడు పిలవాలి. అందరూ ఎగిరే పకక్షులే కదా? ఎటువంటి సేవా బంధనము లేదు. స్వతంత్ర పకక్షులు కనుక చప్పట్లు మ్రోగటంతోనే ఎగిరిపోతారు. అటువంటివారే కదా! స్వతంత్ర పకక్షులు, ఎటువంటి విశేష స్థానము మరియు విశేష సేవ బంధనమైతే లేదు. విశ్వ సేవా బంధనము, బేహద్ సేవా బంధనము, కనుక స్వతంత్రులు. ఎప్పుడు, ఎక్కడ అవసరముంటే అక్కడ మొదట నేను. ప్రతి ఒక్క ఆత్మకూ తన-తన పాత్ర ఉంది. డివైన్యూనిటీవారు పాలన చేసేవారు మరియు మనోహర్ పార్టీ వారు సేవాక్షేత్రములో ముందు-ముందుకు వెళ్ళేవారు. మరి ఇప్పుడు సేవతోపాటుగా పాలన యొక్క విశేష ఆవశ్యకత ఉంది. పాలన లెక్కలో దీదీని అనేక ఆత్మలు ఏవిధంగా తల్లి స్వరూపములో చూస్తూ ఉన్నారో, మామూలుగా అయితే తల్లి-తండ్రి ఒక్కరే, కానీ సాకారములో నిమిత్తముగా అయ్యి పాత్రను పోషించిన కారణంగా పాలనను ఇచ్చే విశేష పాత్రను పోషించింది. అలాగే ఆదిరత్నాలెవరైతే ఉన్నారో వారు పాలనను ఇచ్చే, బాబా పాలనను తీసుకునే అధికారీ ఆత్మలుగా తయారుచేసే పాలనను ఇవ్వాలి. బాబా పాలననే తీసుకోవాలి కానీ బాబా పాలనను తీసుకునేందుకు కూడా పాత్రులుగా అయితే తయారుచెయ్యవలసి ఉంటుంది కదా. కనుక ఆ పాత్రులను తయారుచేసే సేవను ఈ ఆత్మ(దీదీ) చాలా మంచిగా, నంబర్ వన్ గా చేసింది. మరి మీరందరు కూడా నంబర్వన్ కదా! సెకండ్ మాలలో అయితే లేరు కదా. మొదటి మాలలోనే ఉన్నారు కదా! మరి మొదటి మాలలోని వారందరూ నంబర్వన్లు. అచ్ఛా - పాండవులను కూడా పిలవండి.
ముఖ్యమైన సోదరులందరూ బాప్ దాదా ఎదురుగా స్టేజ్ పైకి వచ్చారు - పాండవులు కూడా ఆదిరత్నాలే కదా. పాండవులు కూడా మాలలో ఉన్నారు, కేవలము శక్తులే మాలలో ఉన్నారని కాదు, పాండవులు కూడా ఉన్నారు. మిమ్మల్ని ఏ మాలలో చూసుకుంటారు? అదైతే ప్రతి ఒక్కరికీ తమకు తాము తెలుసు మరియు బాబాకు కూడా తెలుసు కానీ పాండవులు కూడా ఈ విశేష స్మృతి మాలలో ఉన్నారు. ఎవరు? మేము ఉన్నాము అని ఎవరు భావిస్తున్నారు? పాండవులు లేకుండా ఏ కార్యము కూడా జరగజాలదు. శక్తులకు ఎంత శక్తి ఉందో అలాగే పాండవులకు కూడా విశాల శక్తి ఉంది కనుకనే చతుర్భుజ రూపాన్ని చూపించారు. కంబైండ్. ఇరువురూ కంబైండ్ రూపముతో ఈ సేవా కార్యములో సఫలతను పొందుతారు. వీరే (దాదీలు) అష్టదేవీలు లేక వీరే నవరత్నాలు అని అనుకోవద్దు. పాండవులలో కూడా ఉన్నారు. అర్థమైందా - ఇంత బాధ్యతా కిరీటమును ఎల్లప్పుడూ పెట్టుకుని ఉండాలి. కిరీటము ఎప్పుడూ పెట్టుకుని ఉన్నారు కదా! అందరూ ఒకరికొకరు సహయోగులుగా అవ్వాలి. మీరందరూ బాబా భుజాలేనా లేక సాకారములో నిమిత్తముగా అయిన దాదీకి సహయోగీ ఆత్మలా!
''మేమందరమూ ఎల్లప్పుడూ ఒక్కటే'' - ఈ నినాదమే ఎప్పుడూ సఫలతకు సాధనము. సంస్కారాలను కలుపుకునే రాస్ చేసేవారు, ఎల్లప్పుడూ ప్రతి జన్మలో శ్రేష్ఠ ఆత్మల సంగఠనలో రాస్ చేస్తూ ఉంటారు. ఇక్కడి రాస్ కలుపుకోవటము అనగా సదాకాలము ఎటువంటి పాత్రను పోషిస్తారు! సదా శ్రేష్ఠ ఆత్మల ఫ్రెండ్స్ గా అవుతారు, సంబంధీకులుగా అవుతారు. చాలా దగ్గరి సంబంధీకులు కానీ సంబంధీకులు మరియు మిత్రులు, ఈ రెండు స్వరూపాల సహచరులు. మిత్రులకు మిత్రులు కూడా, సంబంధీకులకు సంబంధీకులు కూడా. కనుక నిమిత్తులు. దీదీతో జరిగిన ఆత్మిక సంభాషణ ఇదే. కనుక పాండవులు మరియు శక్తులందరూ ఒక్క బాబా శ్రీమతమనే పుష్పగుచ్ఛములోని పూలగుత్తిలా అవ్వాలి. మీకందరికీ దీదీపై విశేష స్నేహము ఉంది కదా. అచ్ఛా.
ఈరోజైతే ఇలా మిలనము చేసేందుకు వచ్చాము కనుక ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాము (దాదీగారు బాప్ దాదా ఎదురుగా భోగ్ పెట్టారు, అప్పుడు బాబా ఇలా మాట్లాడారు)- ఈరోజు అఫిషియల్ గా కలిసేందుకు వచ్చాము కనుక దేనినీ స్వీకరించము. మొదట పిల్లలు స్వీకరిస్తారు తరువాత బాబా. తరువాత అయితే ఎప్పుడూ కలుస్తూనే ఉంటాము, తింటూనే ఉంటాము, తినిపిస్తూనే ఉంటారు కానీ ఈరోజైతే దీదీ సందేశీగా అయ్యి వచ్చాము, సందేశీ సందేశాన్ని ఇచ్చి వెళ్ళిపోతుంది. దాదీతో చేతులు కలిపి రండి అని దీదీ అన్నారు.
(బాప్ దాదా దాదీగారితో చేతిని కలిపారు మరియు వతనములోకి ఎగిరిపోయారు)
Comments
Post a Comment