30-03-1983 అవ్యక్త మురళి

30-03-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

కన్యల గ్రూపులో ప్రాణ అవ్యక్త బాప్ దాదా మాట్లాడిన మధుర మహావాక్యాలు

                       ఈరోజు అనంతమైన డ్రామా యొక్క రచయిత అయిన బాబా అనంతమైన డ్రామా యొక్క అద్భుతమైన సంగమయుగం యొక్క దివ్య దృశ్యంలో మధువనం యొక్క విశేష దృశ్యాన్ని చూస్తున్నారు. మధువనం యొక్క వేదికపై ప్రతి ఘడియ ఎంతో మనస్సుకి ఇష్టమైన, ఎంతో రమణీయ పాత్ర నడుస్తుంది! దీనిని బాప్ దాదా దూరంగా కూర్చుని కూడా సమీపంగా చూస్తూ ఉంటారు. ఈ సమయంలో స్టేజ్ పై హీరో పాత్రధారులు ఎవరు? లౌకిక జీవితంలో కూడా పవిత్రంగా మరియు ఆత్మ కూడా పవిత్రంగా ఉండే డబల్ పావనాత్మలు, శ్రేష్టాత్మలు. ఇలా డబల్ పావనాత్మల హీరో పాత్ర మధువనం స్టేజ్ పై జరగటం చూసి బాప్ దాదా కూడా సంతోషిస్తున్నారు. ఏమేమి ప్లాన్స్ తయారుచేస్తున్నారు, ఏమేమి సంకల్పాలు చేస్తున్నారు, ఏ అలజడిలోకి వస్తున్నారు ఇలా ధైర్యం మరియు అలజడి రెండు ఆటలను చూస్తున్నారు. ధైర్యం మంచిగా పెట్టుకుంటున్నారు, చాలా ఉత్సాహ ఉల్లాసాలు ఉంటున్నాయి. కానీ వెనువెంట కొద్దిగా అవును - కాదు అనే సంకల్పాలు కూడా కలుస్తున్నాయి. ఇలా నవ్వు వచ్చే ఆట బాప్ దాదా చూస్తున్నారు. చూపిస్తాము, చేసి చూపిస్తాము అని కోరికైతే చాలా శ్రేష్టంగా ఉంది. కానీ మనస్సులో ఉత్సాహం యొక్క కోరిక మరియు సంకల్పం, ముఖంలో మెరుపు వలె కనిపించడం లేదు. శుద్ధసంకల్పాల యొక్క మెరుపు ముఖాలలో మెరుస్తూ కనిపిస్తుంది. దీనిలో శాతం తేడాగా ఉంది. ఇది ఎందుకు? దీనికి కారణం ఏమిటి? శుభసంకల్పమే కానీ సంకల్పంలో శక్తి కొద్దిగానే ఉంది. సంకల్పమనే బీజం ఉంది కానీ శక్తిశాలి బీజంగా ప్రత్యక్ష ఫలం అంటే ప్రత్యక్ష రూపంలో ఇప్పుడు వెలుగు చూపించాలి. ముఖంలో ఉత్సాహ ఉల్లాసాల యొక్క మెరుపు రావడానికి సాధనం- ప్రతి గుణం, ప్రతి శక్తి, ప్రతి జ్ఞానం యొక్క వాక్యాలతో సంపన్నంగా ఉండాలి. అనుభవం అనేది ఉన్నతోన్నతమైన అధికారం. అధికారం యొక్క మెరుపు ముఖంలో మరియు నడవడికలో స్వతహాగా వస్తుంది. బాప్ దాదా వర్తమాన సమయం యొక్క హీరో పాత్రధారులను చూసి నవ్వుకుంటున్నారు. సంతోషంలో నాట్యం చేస్తున్నారు కానీ కొంతమంది నాట్యం చేస్తూ ఉంటే మొత్తం వాయుమండలాన్ని కూడా నాట్యం చేయిస్తారు. వారి పాత్రలో మెరుపు కనిపిస్తుంది. దీనినే మీరు రాస్ (నృత్యం) చేస్తూ చేస్తూ అందరినీ రాస్ చేయించారు అంటారు. ఇలాంటి మెరుపు ఇప్పుడింకా కనిపించాలి. దీనికి ఆధారం కూడా చెప్పాను. వినేవారిగా, వినిపించేవారిగా అయితే అయిపోయారు. వెనువెంట అనుభవీ మూర్తిగా అయ్యే విశేష పాత్ర అభినయించండి. అనుభవం యొక్క అధికారం ఉన్నవారు ఎప్పుడు, ఏవిధమైన మాయ యొక్క రాయల్ రూపాలలో మోసపోరు. అనుభవం యొక్క అధికారం ఉన్న ఆత్మ సదా నిండుగా అనుభవం చేసుకుంటుంది. నిర్ణయశక్తి, సహనశక్తి ఇలా ఏ శక్తితో ఖాళీగా ఉండదు. ఎలా బీజం నిండుగా ఉంటుందో అదేవిధంగా జ్ఞానము, గుణాలు, శక్తులతో నిండుగా ఉంటుంది. మరియు పరిశీలన ఈ డబల్ లాక్ (రెండు తాళాలు) స్మృతి మరియు సేవ ఈ డబల్ లాక్ అందరి దగ్గర ఉంది కదా! సదా ఈ డబల్ లాక్ వేసి ఉంచండి. రెండు వైపుల తాళం వేయాలి. అర్థమైందా! ఒకవైపు వేయటం కాదు. దృష్టి మరియు వృత్తి ఇవి రెండూ ద్వారాలు. రెండింటికి డబల్ తాళం వేయాలి. గౌరవం అయితే స్థూలంగా, సూక్ష్మంగా చాలా లభించింది. డబల్ గౌరవం లభించింది కదా! దాదీ, దీదీలు మరియు నిమిత్తమైన అక్కయ్యలు ఎలా అయితే మనస్సుతో గౌరవం ఇచ్చారో అదేవిధంగా దానికి ఫలితంగా మేము ఇప్పటినుండి సదా విజయీగా ఉంటాము అని దాదీ, దీదీలందరికీ గౌరవం ఇచ్చి వెళ్ళాలి. కేవలం నోటితో చెప్పటం కాదు, మనస్సుతో అనాలి. ఏం చేస్తున్నారు అని ఒక నెల తర్వాత ఈ ఫోటోలో వారిని చూస్తాను. ఎవరి ముందు దాచినా కానీ బాబా ముందు మాత్రం దాచలేరు. మంచిది. 
                 సదా ధృఢసంకల్పం ద్వారా ఆలోచన మరియు కర్మ సమానంగా చేసుకునేవారికి, సదా దివ్యనేత్రం ద్వారా దివ్య ఆత్మిక స్వరూపాన్ని చూసేవారికి, ఎక్కడ చూసినా ఆక్కడ ఆత్మే కనిపించాలి. ఇలా అర్ధస్వరూప పురుషార్ధి ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. 

Comments