29-12-1983 అవ్యక్త మురళి

29-12-1983         ఓంశాంతి         అవ్యక్త బాప్ దాదా         మధువనము

సంగమయుగము - సహజ ప్రాప్తి యుగము...

దయాహృదయులైన, విశాలహృదయులైన బాబా ఈరోజు పెద్ద మనసును ఉంచే మనోల్లాసము కల పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఏ విధముగా విశాలహృదయులో బేహద్ హృదయులో కనుకనే అందరి మనసులను తీసుకునే మనోభిరామునిగా ఉన్నారో, అలా పిల్లలుకూడా బేహద్ మనసు, విశాలహృదయము, దాతాతనపు మనసును ఉంచేవారు, సదా హృదయపు సంతోషముద్వారా ప్రపంచమును సంతోషపెట్తారు. అటువంటి అదృష్టవంతులైన ఆత్మలు మీరు! శ్రేష్ఠ ఆత్మలైన మీరే ప్రపంచమునకు ఆధారము. మీరందరూ మేల్కొన్న జ్యోతులైనట్లయితే ప్రపంచములోనివారు కూడా మేల్కొటాంరు. మీరు నిద్రపోతే ప్రపంచముకూడా నిద్రపోతుంది. మీ అందరిదీ ఎక్కే కళ ఉన్నట్లయితే సర్వాత్మల కల్యాణము జరుగుతుంది. అందరూ యధాశక్తి సమయ ప్రమాణంగా ముక్తి మరియు జీవన్ముక్తిని పొందుతారు. మీరు విశ్వముపై రాజ్యము చేస్తుంటే సర్వాత్మలు ముక్తిస్థితిలో ఉంటాయి. మూడు లోకాలలో మీ రాజ్య సమయములో దుఃఖము, అశాంతుల గుర్తులే ఉండవు. ఇలా సర్వాత్మలకు బాబాద్వారా సుఖ-శాంతుల అంచలిని ఇప్పిస్తారు, ఆ అంచలిద్వారా అందరికీ బహుకాలమునుంచి ఉన్న ముక్తియొక్క ఆశ పూర్తవుతుంది. ఇలా సర్వాత్మలకు, విశ్వమునకు యథాశక్తి ప్రాప్తిని కలిగించే సర్వ ప్రాప్తి స్వరూపులే కదా! ఎందుకంటే డైరెక్ట్ సర్వ ప్రాప్తుల దాత, సర్వ శక్తుల విధాత క్షణములో సర్వ అధికారాలను ఇచ్చే వరదాత, శ్రేష్ఠ భాగ్యవిధాత, అవినాశీ తండ్రి యొక్క పిల్లలుగా అయ్యారు. అటువంటి అధికారీ ఆత్మలకు సదా అధికారమును గుర్తు చేసుకుంటూ ఆత్మిక శ్రేష్ఠ నషా మరియు సదాకాలపు సంతోషము ఉంటుందా? బేహద్దు సంతోషము ఉంటుందా? బేహద్దు మనసు కలిగినవారు ఎటువంటి హద్దు ప్రాప్తివైపుకైనా ఆకర్షితులవటం లేదు కదా? సదా సహజ ప్రాప్తియొక్క అనుభవీమూర్తులుగా అయ్యారా లేక చాలా శ్రమ చేసిన తరువాత ఏదో కాస్త ఫలితాన్ని ప్రాప్తి చేసుకుటాంరా? వర్తమాన సమయపు సీజన్ - ప్రత్యక్ష ఫలమును తినేది. ఒక్క శక్తిశాలీ సంకల్పము లేక కర్మను చేసారు మరియు ఒక్క బీజముద్వారా పదమాగుణాలుగా ఫలాన్ని పొందారు. కనుక సీజన్ ఫలమును అనగా సహజ ఫలముయొక్క ప్రాప్తిని పొందారా? ఫలము అనుభవమవుతుందా లేక ఫలము వచ్చేదానికంటే ముందే మాయరూపీ పక్షి ఫలాన్ని అంతమైతే చెయ్యటం లేదుకదా? మరి ఇంత అటెన్షన్ ఉంటుందా లేక శ్రమపడ్తూ, యోగాన్ని చేస్తూ, చదువునుకూడా చదువుతూ, యథాశక్తి సేవను చేస్తున్నాకూడా ఎంత ప్రాప్తించవలసి ఉందో అంత ప్రాప్తించటం లేదా? ప్రాప్తించటం సదా ఉండాలి ఎందుకంటే ఒకటికి పదమాలరెట్లు అయినప్పుడు లెక్కలేనంత ఫలముయొక్క ప్రాప్తి ఉంటుంది కదా. అయినాకూడా సదా ఉండదు, ఎంత కావాలో అంత ఉండదు. అందుకు కారణము? సంకల్పము, కర్మరూపీ బీజము శక్తిశాలిగా లేదు. వాతావణరూపీ ధరణి శక్తిశాలిగా లేదు లేక ధరణి మరియు బీజము బాగున్నాయి, ఫలాలుకూడా వెలువడుతున్నాయి కానీ ''నేను చేసాను'', ఈ హద్దు సంకల్పంద్వారా అపరిపక్వముగా పండును తినేస్తారు లేక మాయకు చెందిన భిన్న-భిన్న సమస్యలు, వాతావరణము, సాంగత్యదోషము, పరమతము లేక మన్మతము, వ్యర్ధ సంకల్పరూపీ పక్షి ఫలాలను ఖాళీ చేసేస్తుంది, కనుక ఫలాలనుండి అనగా ప్రాప్తులనుండి, అనుభూతికి చెందిన ఖజానాలనుండి వంచితులైపోతారు. అటువంటి వంచిత ఆత్మల మాట ఇలా ఉంటుంది - ఎందుకో తెలియదు! అటువంటి వ్యర్థమైన శ్రమను చేసేవారైతే కారు కదా! సహజ యోగులు కదా? సహజ ప్రాప్తి సీజన్లో ఎందుకు కష్టపడతారు! వారసత్వము ఉంది, వరదానము ఉంది, సీజన్ ఉంది, పెద్ద మనసు కల దాత ఉన్నారు. విశాలహృదయులైన భాగ్య విధాత ఉన్నారు, అయినాకూడా శ్రమ ఎందుకు? సదా హృదయ సింహాసనాధికారీ పిల్లలకు కష్టము ఉండజాలదు. సంకల్పము చేసారు- సఫలత లభించింది. విధి అనే స్విచ్ను ఆన్ చేసారు మరియు సిద్ధి ప్రాప్తించింది. అటువంటి సిద్ధి స్వరూపులే కదా లేక శ్రమ చేసి చేసి అలసిపోతారా? శ్రమ పడేందుకు కారణము - సోమరితనము మరియు నిర్లక్ష్యము. స్మృతి స్వరూపము అనే కోట లోపల ఉంటారా లేక కోటలో ఉంటూకూడా ఏదో ఒక శక్తియొక్క బలహీనత అనే తలుపును లేక కిటికీని తెరుస్తారు కనుకనే మాయకు ఛాన్స్ ఇస్తారు. ఏ శక్తియొక్క లోటు ఉంది అనగా ఏ దారి తెరిచి ఉంది అన్నదానిని చెక్ చేసుకోండి. సంకల్పములోకూడా దృఢత లేనట్లయితే దారి కాస్త తెరిచి ఉందని భావించండి కనుకనే నడవటమైతే బాగనే నడుస్తున్నాము, అన్ని నియమాలు పాలన చేస్తున్నాము, శ్రీమతముపై నడుస్తున్నాము అని అంటారు కానీ నంబర్వన్ సంతోషము మరియు దృఢతతో కాదు. నియమాలపై నడవాల్సే వస్తుంది, బ్రాహ్మణ పరివారపు లోకనిందకు వశులై, ఏమాంరో, ఏమని భావిస్తారో.....ఇటువంటి తప్పనిసరి పరిస్థితులలో లేక భయముతో నియమాలనైతే పాలన చెయ్యటం లేదు కదా? దృఢతకు గుర్తు సఫలత. ఎక్కడ దృఢత ఉంటుందో అక్కడ సఫలత లేకపోవటము, ఇది జరగజాలదు. ఏదైతే సంకల్పములోకూడా లేదో అది ప్రాప్తించింది అనగా సంకల్పముకంటే ప్రాప్తి ఎక్కువగా ఉంది. కనుక వర్తమాన సమయము సహజ సర్వ ప్రాప్తుల యుగము కనుక సదా సహజయోగీ భవయొక్క అధికారులుగా మరియు వరదానులుగా అవ్వండి. అర్థమైందా! మాస్టర్ సర్వ శక్తివంతులుగా అయ్యికూడా కష్టపడినట్లయితే మాస్టర్లుగా అయ్యి ఏం చేసారు !శ్రమనుండి విడిపించేవారు, కష్టమును సహజము చేసే బాబా లభించారు, అయినాకూడా శ్రమపడటమా! భారాన్ని ఎత్తుకుంటారు కనుక కష్టపడతారు. భారాన్ని వదలండి, తేలికగా అయినట్లయితే ఫరిస్తాలుగా అయ్యి ఎగురుతూ ఉంటారు. అచ్ఛా!

ఇలా సదా దిల్ఖుష్లు(సంతోషహృదయులు), సదా సహజ ఫల ప్రాప్తి స్వరూపులు, సదా వరదాతద్వారా సఫలతను పొందే వరదానులు అయిన వారసులైన పిల్లలకు, మనోభిరాముడైన బాబాయొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

పార్టీలతో

పంజాబ్ జోన్ - అందరూ స్వదర్శన చక్రధారులేనా? స్వదర్శన చక్రము తిరుగుతూ ఉంటుందా? ఎక్కడైతే స్వదర్శన చక్రము ఉంటుందో అక్కడ సర్వ విఘ్నాలనుండి ముక్తులు ఎందుకంటే స్వదర్శన చక్రము మాయ విఘ్నాలను అంతము చేసేందుకే ఉంది. ఎక్కడైతే స్వదర్శన చక్రము ఉంటుందో అక్కడ మాయ ఉండదు. బాబా పిల్లలుగా అయ్యారు మరియు స్వయముయొక్క దర్శనము కలిగింది. బాబా పిల్లలుగా అవ్వటము అనగా స్వదర్శన చక్రధారులుగా అవ్వటము. అటువంటి స్వదర్శన చక్రధారులే విశ్వ కల్యాణకారులు ఎందుకంటే విఘ్న వినాశకులు. విఘ్న వినాశకుడు అని గణేశుని అంటారు. గణేశునికి ఎంతో పూజ జరుగుతుంది. ఎంతో ప్రేమగా పూజ చేస్తారు, ఎంత గా అలంకరిస్తారు, ఎంత ఖర్చు చేస్తారు, అటువంటి విఘ్న వినాశకులు, ఈ సంకల్పమే విఘ్నాలను సమాప్తము చేస్తుంది ఎందుకంటే సంకల్పమే స్వరూపంగా చేయిస్తుంది. విఘ్నము ఉంది, విఘ్నము ఉంది అని అనటం వలన విఘ్వ స్వరూపులుగా అవుతారు, బలహీన సంకల్పములతో బలహీన సృష్టి రచన జరుగుతుంది ఎందుకంటే ఒక్క సంకల్పము బలహీనమైనదిగా ఉన్నట్లయితే దాని వెనుక అనేక బలహీన సంకల్పాలు ఉత్పన్నమవుతాయి. ఏమి, ఎందుకు అనే ఒక్క సంకల్పము అనేక ఏమి, ఎందుకలలోకి తీసుకుపోతుంది. నేను మహావీర్ను, నేను శ్రేష్ఠ ఆత్మను అన్న సమర్థ సంకల్పము ఉత్పన్నమైనట్లయితే సృష్ఠికూడా శ్రేష్ఠమైనదవుతుంది. కనుక ఎటువంటి సంకల్పమో అటువంటి సృష్టి. ఇదంతా సంకల్పాలకు చెందిన ఆట. ఒకవేళ సంతోషముతోకూడిన సంకల్పాలు చేసినట్లయితే అదే సమయములో సంతోషమునకు చెందిన వాతావరణము అనుభవమవుతుంది. దుఃఖమునకు చెందిన సంకల్పాలను రచించినట్లయితే సంతోషమయ వాతావరణములోకూడా దుఃఖ వాతావరణము అనిపిస్తుంది. సంతోషపు అనుభవము ఉండదు. కనుక వాతావరణమును తయారుచెయ్యటము, సృష్టిని రచించటము మీ చేతులలో ఉంది. దృఢ సంకల్పాలను రచించినట్లయితే విఘ్నము ఛూ మంత్రమైపోతుంది. అవుతుందో, లేదో తెలియదు అని ఒకవేళ ఇలా అలోచించినట్లయితే మంత్రము పని చెయ్యదు. ఎవరైనా డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు డాక్టర్కూడా ముందుగా నీకు నాపై నమ్మకము ఉందా అనే అడుగుతాడు. ఎంత మంచి మందు అయినాగానీ ఒకవేళ నమ్మకము లేనట్లయితే ఆ మందు ప్రభావము ఉండజాలదు. అది వినాశీ విషయము, ఇక్కడ ఉన్నది అవినాశీ విషయము. కనుక సదా విఘ్న వినాశక ఆత్మలు, పూజ్య ఆత్మలు, మీకు ఇప్పుడుకూడా ఏ రూపంలో పూజ జరుగుతూ ఉంది? ఇది చివరిలోని వికారీ జన్మ అయిన కారణంగా ఈ రూపములో స్మృతిచిహ్నమును ఉంచరు కానీ ఏదో ఒక రూపంలో మీ స్మృతిచిహ్నము ఉంది. కనుక సదా స్వయమును మాస్టర్ శక్తివంతుడను, విఘ్న-వినాశకుడను, శివుని సంతానమైన గణేశుడిని అని భావించుకుని నడవండి. ''తెలియదు, తెలియదు'' అని మీకు మీరే ఆలోచన చేసుకుంటారు, కనుక ఈ బలహీన సంకల్పము కారణంగానే ఇరుక్కుపోతారు. కనుక సదా సంతోషములో ఊగుతూ సర్వ విఘ్నహర్తలుగా అవ్వండి. సర్వుల కష్టమును సహజము చేసేవారుగా అవ్వండి. ఇందుకొరకు కేవలము దృఢ సంకల్పము మరియు డబల్ లైట్కావాలి, ఇంతే. నాదంటూ ఏమీ లేదు, అంతా బాబాది. ఎప్పుడైతే భారాన్ని స్వయముపై వేసుకుంటారో అప్పుడు అన్నిరకాల విఘ్నాలు వస్తాయి. నాది కాదు అని అనుకున్నట్లయితే నిర్విఘ్నులు. నాది అనుకుంటే విఘ్నాల వల ఏర్పడుతుంది. కనుక వలను నాశనము చేసే విఘ్న వినాశకులు. బాబా పనికూడా ఇదే. బాబా కార్యము ఏదో అదే పిల్లల కార్యము. ఏ కార్యమునైనా సంతోషముతో చేసినట్లయితే ఆ సమయములో విఘ్నాలు రావు. కనుక సంతోషం-సంతోషంగా కార్యములో బిజీగా ఉండండి. బిజీగా ఉన్నట్లయితే మాయ రాదు. అచ్ఛా!

2. సదా సఫలత అన్న మెరుస్తున్న సితారలు, ఈ స్మృతి ఉంటుందా? ఇప్పుడుకూడా ఈ ఆకాశ సితారలను అందరూ ఎంత ప్రేమగా చూస్తారు! ఎందుకంటే అవి వెలుగును ఇస్తాయి, మెరుస్తాయి కనుక ప్రియమనిపిస్తాయి. మరి మెరుస్తున్న సితారలైన మీరుకూడా సఫలతకు చెందినవారు. సఫలతను అందరూ ఇష్టపడతారు, ఎవరైనా ప్రార్థించేటప్పుడుకూడా ఈ కార్యమును సఫలము చెయ్యమని ప్రార్థిస్తారు. సఫలతను అందరూ కోరుకుంటారు మరియు మీరు స్వయం సఫలతా సితారలుగా అయ్యారు. మీ జడచిత్రాలుకూడా సఫలతయొక్క వరదానమును ఇప్పటివరకూ ఇస్తున్నాయి, కనుక ఎంత మహానులుగా అయ్యారు! ఎంత ఉన్నతులు! ఈ నషా మరియు నిశ్చయములో ఉండండి. సఫలత వెనుక పరిగెత్తేవారు కారు, కానీ మాస్టర్ సర్వ శక్తివంతులు అనగా సఫలతా స్వరూపులు. సఫలత మీ వెను వెనుకనే స్వతహాగా వస్తుంది.

3. స్వయమును సదా బాబాతోటి ఉండేవారిగా, సదా సహయోగమును తీసుకునే ఆత్మలుగా భావిస్తున్నారా? సదా తోడును అనుభవము చేస్తున్నారా? ఎక్కడైతే సదా బాబా తోడు ఉంటుందో అక్కడ సహజంగా సర్వ ప్రాప్తులు ఉంటాయి. ఒకవేళ బాబా తోడు లేనట్లయితే సర్వ ప్రాప్తులుకూడా ఉండవు, ఎందుకంటే బాబా సర్వ ప్రాప్తుల దాత. ఎక్కడైతే దాత తోడుగా ఉంటారో అక్కడ ప్రాప్తులుకూడా తోడుగా ఉంటాయి. సదా బాబా తోడు అనగా సర్వ ప్రాప్తుల అధికారులు. సర్వ ప్రాప్తి స్వరూప ఆత్మలు అనగా నిండు ఆత్మలు, సదా అచలంగా ఉంటారు. నిండుగా లేనట్లయితే కదుల్తూ ఉంటారు. సంపన్నము అనగా అచలము. బాబా తోడును ఇస్తున్నప్పుడు తీసుకునేవారు తీసుకోవాలి కదా! దాత ఇస్తున్నప్పుడు పూర్తిగా తీసుకోవాలి, కొద్దిగా కాదు. భక్తులు కొద్దిగా తీసుకుని సంతోషపడిపోతారు, కానీ జ్ఞాని అనగా పూర్తిగా తీసుకునేవారు.

జర్మన్ గ్రూప్తో - సదా స్వయమును బాబాకు సమీప రత్నముగా భావిస్తున్నారా? ఎంత దూరంగా ఉంటారో, దేశము లెక్కలో దూరంగా ఉన్నాగానీ మనసుకైతే దగ్గరగా ఉన్నారు. అలా అనుభవమవుతుంది కదా? ఎవరైతే సదా స్మృతిలో ఉంటారో, స్మృతి సమీపమును అనుభవము చేయిస్తుంది. సహజ యోగులు కదా! బాబా అని అన్నప్పుడు ''బాబా'' అన్న మాటయే సహజయోగిగా తయారుచేస్తుంది. బాబా మాట ఇంద్రజాలపు మాట. ఇంద్రజాలపు వస్తువు కష్టము లేకుండానే ప్రాప్తి చేయిస్తుంది. మీకందరికీ ఏం కావాలంటే అది, సుఖము కావాలంటే, శాంతి కావాలంటే, శక్తి కావాలంటే, ఏది కావాలన్నా ''బాబా'' అని అన్నట్లయితే అన్నీ దొరుకుతాయి. అటువంటి అనుభవము ఉందా! బాప్దాదాకూడా విడిపోయి ఉన్న పిల్లలు ఎవరైతే మరల వచ్చి కలుసుకున్నారో, అటువంటి పిల్లలను చూసి సంతోషిస్తారు. ఎక్కువ సంతోషము ఎవరికుంటుంది? మీకా లేక బాబాకా? బాప్దాదా ఎల్లప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరి విశేషతను సిమిరణ చేస్తారు. ఎంత అదృష్టవంతులు! బాబా మమ్మల్ని గుర్తు చేస్తారు అని అనుభవము చేస్తున్నారా? అందరూ వారి-వారి విశేషతలలో విశేష ఆత్మలు. ఈ విశేషత అందరిలో ఉంది, వీరు దూరదేశములో ఉన్నా, ఇతర ధర్మములోకి వెళ్ళినాకూడా మరల బాబాను తెలుసుకున్నారు. కనుక ఈ విశేష సంస్కారముతో విశేష ఆత్మగా అయ్యారు. అచ్ఛా - ఓం శాంతి.

Comments